మనోశక్తి - Mind Power - 75

Image may contain: 1 person
🌹. మనోశక్తి  - Mind Power  - 75 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 72 :-- పునర్జన్మ vs స్త్రీపురుషులు 🌻

Ans :--
గతజన్మల చైతన్య పరిణామం జాగృదావస్థ లో మనకు ఎరుకలో ఉండదు.కానీ అనుభూతులు అంతర్ ప్రపంచంలో నిక్షిప్తం అయి ఉంటాయి.

2) ఆత్మ ఇప్పుడు పురుష జన్మ తీసుకుని ఉందనుకోండి, ఆ ఆత్మ విచక్షణ కోల్పోయి స్త్రీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందనుకోండి, అచేతనా స్థితిలో మనలో దాగి ఉన్న స్త్రీ జన్మ తాలూకూ చైతన్య శక్తి మనల్ని నియంత్రించడం జరుగుతుంది. అచేతనా స్థితిలో పురుషుడు స్త్రీ మూర్తిత్వ చైతన్యశక్తి వైపు గుంజబడతాడు. మరో వైపు చేతనావస్థలో పురుష జన్మ తాలూకూ చైతన్యశక్తి సంఘర్షణ వైపు గుంజబడుతుంది. ఈ సంఘర్షణ ద్వారా వచ్చే ఆలోచనలతో భౌతిక సంఘటనలు ఏర్పడతాయి.

3) చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మకు ప్రారంభదశలో లింగవిభజన తో కూడిన జన్మలు అవసరమవుతాయి. జన్మ పరిసమాప్తి పొందే దశలో లింగ విచక్షణ మటుమాయమవుతుంది. రాగద్వేషాలకు భూభౌతిక వాసనలకు వ్యామోహాలకు అతీతమైన స్థితిలో వుంటారు.

4) ఆఖరి జన్మలో స్త్రీ అయిన పురుషుడు గా జన్మించినా రెండు ఒక్కటే.ఆఖరి జన్మల్లో స్త్రే పురుష చైతన్య శక్తి ధర్మాలు రెండు కలిసిపోతాయి.

5) ఆఖరి జన్మల్లో ఉంటే సకల ప్రాణికోట్ల పట్ల ప్రేమ అనురక్తి ఉంటుంది. సకల జీవజాతులు పట్ల రాగద్వేషాలు మటుమాయమవుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 17 / The Siva-Gita - 17

Image may contain: 2 people
🌹. శివగీత  - 17  / The Siva-Gita - 17  🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 1 🌻

అగస్త్య ఉవాచ:
న గృహ్ణాతివచ : పధ్యం - కామ క్రో ద్రూది పీడితః,
హితం న రోచతే తస్య - ముమూర్షో రివ భేషజమ్. 1

మధ్యే సముద్రం యానీతా - సీతా దైత్యేన మాయినా,
ఆయాస్యతి నారా శ్రేష్ఠ! - సాకధం తవ సన్నిధిమ్. 2

అగస్త్యుడు పలుకుచున్నాడు:

కామ క్రోధా ద్యరి షడ్వర్గంబుల కదీనుడైన వాడు నీతి  వచనములకు బెడ చెవిని పెట్టును. మరణమును కోరుకున్న మనిషి మంచి మందును పుచ్చుకొనుట సమ్మతించడు.

 అట్లే ఓ రామా! నీ ధర్మపత్ని యగు సీత మాయావి యైన  రావణుని చేత అపహరింప బడి సాగర మధ్యన ఉంచ బడినది. అటువంటి నీ భార్య నీ చెంత కెట్లు రాగలదు?

భద్యన్తే దేవతా స్సర్వా - ద్వారి మర్కట యూధవత్,
కించ చామర ధరిణ్యో - యశ్శం భువర దర్పితః 3

భుంక్తే త్రిలోకీ మఖిలాం- యశ్శం భువర దర్పితః,
నిష్కంటకం తస్య జయః - కధం తన భవిష్యతి? 4

ఎవని భవన ప్రాంగణమున వానరుల గుంపు వలె దేవతలు బంధింప బడినారో, ఆ దేవతల యొక్క భార్యలు వింజా  మరములను చేత బూని గాలి వేయుచున్నారో మరియు నెవడైతే మహేశ్వర వరమును బొంది గర్వముతో స్వర్గ మర్త్య పాతాళ లోకములను నిరాటంక ముగా బరిపాలించు చున్నాడో,  అటువంటి రావణాసురుని పరాభవింప చేయుట నీ తరమా?

ఇంద్ర జిన్నా మమ పుత్రోయ - స్తస్యా స్తీశ వరోద్దతః,
తస్యాగ్రే సంగరే దేవా - బహువారం పలాయతాః 5

కుంభ కర్ణా హ్వయో భ్రాతా - యస్యాస్తి సుర సూదనః,
అన్యోది వ్యాస్త్ర సంయుక్త - శ్చిరం జీవీ విభీషణః 6

మరియు (పోగా ) నాతనికి ఇంద్రజిత్తు డనే కుమారుడున్నాడు.  అతడు పరమశివుని వరము చేత మహా బలశాలియై యింతవరకు దాను పరాభావమన నెట్టిదో ఎరుగడు.

అటువంటి యోధుని ఎదుట నిలిచి యుద్దము చేయుటకు శక్తి లేక యుద్ద భూమి నుండి అనేక సార్లు దేవతలు పలాయనము జిత్తగించిరి. 
అది యట్లుండగా సుపర్వ గర్వము నణచి వేసిన కుంభకర్ణుండు  అతనికి తోబుట్టువు. 

మరియు దివ్యాస్త్రములతో సంసిద్దుడై యుండిన చిరంజీవి యగు విభీషణుడు కూడా అతనికి అనుంగ సోదరుడే.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 The Siva-Gita - 17 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga  - 1 🌻

1. 2. Moreover, he has a son named Indrajit. Due to the boons and blessings of Paramashiva he didn't taste  defeat till date. 

3. 4. Unable to stand in front of him many a times Gods fled away. On top of that,  Kumbhakarna another mighty demon is Ravana's brother. 

5. 6. Also, the immortal Vibheeshana having many divine weapons is also his brother. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 9 / Sri Gajanan Maharaj Life History - 9

Image may contain: 1 person, standing
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 9  /  Sri Gajanan Maharaj Life History - 9 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 5 🌻

సాయంత్రం, ఇఛ్ఛారాం స్నానంచేసి ప్రగాఢభక్తితో శ్రీగజానన్ను పూజించాడు. తను ఉదయంనుండి ఉపవాసం ఉండిఉండడం, మరియు తనుఇవ్వబోయే ఆహారం శ్రీగజానన్ స్వీకరించి తిన్న తరువాత తను ఆహారం తీసుకుంటానని శ్రీమహారాజుతో అంటూ కనీసం నలుగురు వ్యక్తులు తినగలిగే అన్నం, కూరలు, పూరీలూ, అనేకరకాలయిన మిఠాయిలు, నెయ్యి, పండ్లు ఇంకాఅనేక పదార్ధాలు ఒక విస్తరలోపెట్టి శ్రీగజానన్ ముందుఉంచుతాడు. 

ఆ విస్తర చూసిన శ్రీమహారాజు తనలోతాను ఈవిధంగా అనుకున్నారు. ఓకక్కుర్తి గణప్యా, ఎప్పుడూ తిండితిండి అనేదికదా ఇక ఆలోచించకుండా ఈవిస్తరలో పదార్ధాలుతిని నీ కక్కుర్తితనం ఎంతో వీళ్ళని చూడనీ. ఇలాఅనుకుంటూ ఆపదార్ధాలు తినడం ప్రారంభించి ఒక్క ఉప్పుతునక కూడా ఆవిస్తరలో మిగల్చలేదు. 

ఈ విధంగా బలవంతంగా తినడంవల్ల ఫలితం ఏమవుతుందో చూపించడానికి, శ్రీగజానన్ తనుతిన్న పదార్ధాలన్నీ వాంతి చేస్తారు.

శ్రీరామదాసుస్వామి కూడా ఒకసారి ఇదేవిధంగా చేస్తారు. 

ఒకసారి క్షీరాన్నం తినాలని బాగాకోరిక కలిగి, అడిగి కడుపునిండా తింటారు. అతిగా తినడంవల్ల ఫలితంగా వాంతిఅవుతుంది. అటువంటి కోరికను జయించడంకోసం ఆవాంతిచేసిన పదార్ధాలను శ్రీరామదాసు తిరిగి తినడం ప్రారంభించారు.

ఇదేవిధంగా శ్రీగజానన్ ఎటువంటి పదార్ధాలు, ఎంతఅయినా జీర్ణించుకోగల శక్తి సామర్ధ్యం ఉన్నవారు అయినా, ఈవిధంగా బలవంతంచేసి తినిపించేవారికి పాఠం చెప్పేందుకు ఇలాచేసారు. ఆతరువాత భక్తులు ఆస్థలం పూర్తిగా శుభ్రంగాకడిగి, తీగజానన్ కు కూడా స్నానంచేయించి, ఒక ఎత్తయిన ఆసనంమీద కూర్చుండపెడతారు. 

చాలా మంది వచ్చి శ్రీగజాననకు నమస్కరించారు. వాళ్ళు భక్తిగీతాలు కూడా పాడడం ప్రారంభించారు. శ్రీగజానన్ అవివింటూ, చాలా ఆనందపడుతూ, ఆతన్మయత్వంలో వాళ్ళభజనస్వరంలో గణ గణ గణాతబోతే అని పాడడం ప్రారంభించారు. 

ఈ విధమయిన ఈయన గణ గణ గణాతబోతే అనేపాట వలన భక్తులు ఈయనను గజానన్ అనిపిలవడం ప్రారంభించారు. స్వయానా బ్రహ్మ అవడంచేత ఆయనకు ఏవిధమయిన పేరు అవసరంలేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 9 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 5  🌻

At Sunset time, Ichharam took a bath and with great devotion offered Puja to Shri Gajanan. He told Shri Gajanan Maharaj that he had a fast since morning and would take food only if Shri Gajanan accepted and ate food offered by him. 

Saying so, Ichharam brought a thali full of rice, many varieties of Sweets, curry, puris, ghee, fruits and many other things, sufficient to feed at least four persons and put it before Shri Gajanan. 

Looking at that thali Shri Gajanan Maharaj said to Himself, You, greedy Ganpya, always want to eat and eat. Now eat all this food without hesitation and let all these people see Your greediness. Saying so, He started eating everything that was served to Him and did not leave even a grain of salt in the thali. 

Then to show the result of forceful eating, Shri Gajanan vomited everything that He ate. Shri Ramdas Swami once did the same thing. It so happened that he felt a craze to eat Sweet Kheer. He asked for it and ate it to His full. 

Overeating resulted in vomiting. Shri Ramdas started eating that what he vomited just to win over his desire. Similarly Shri Gajanan, though quite strong to digest anything, vomited only to teach a lesson to those who pressurize Him to eat. 

Thereafter the devotees cleaned the place, gave a bath to Shri Gajanan and made Him sit on a raised seat. Many people came to pay respect to Gajanan. They started singing devotional songs. 

Shri Gajanan Maharaj was very happy to listen to them and then He began chanting to Himself Gan Ganat Bote in the same tune in which the Bhajan was sung. It continued this way for the whole night. 

Because of His above utterance of Gan Gan Ganat Bote, people started calling him Gajanan. In fact He Himself being Brahma needs no name.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Twelve Stanzas from the Book of Dzyan - 4

🌹 Twelve Stanzas from the Book of Dzyan - 4 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴

🌻 STANZA I - The Genesis of Divine Love - 4 🌻

9. Evil had appeared in the world for the first time. The Sun was unable to discern what was going on beneath the thick crowns of giant trees. These effectively concealed evil, which had managed to steal in surreptitiously. 

The All-Seeing Eye of the Sun partially lost its power, for he could not illuminate the hidden back side of the Earth.

10. The condensation of Matter came to the end of its tether. Billions of years had passed, and human souls were still similar to stones... How could they have become so callous and impenetrable? It was a difficult question to answer! 

They had become acquainted with evil, who was already rotating his black wheel of time in full swing, standing just beyond the border of the Light. 

While, on the reverse side, the darkness was trying to obscure the whole of the Light so as to transform him into gloom. But for that she needed some assistance from earthlings.
🌹🌹🌹🌹🌹

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 15

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 15 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 3 🌻

శుభము కల్గించుచు మోక్షమును కలుగజేయునది శ్రేయోమార్గమనబడును. లౌకిక సుఖములను కలిగించు స్త్రీ ధనాదులను అనుభవింపజేయునది ప్రేయోమార్గము. 

విషయాదుల ననుభవించు సుఖముగానున్నట్లు తోచి చివరకు దుఃఖమును కలుగజేయునది ప్రేయోమార్గము. మొదట కష్టముగ నున్నట్లుండి చివరకు శాశ్వత సుఖమును కలుగజేయునది శ్రేయోమార్గము. 

కనుక శ్రేయోమార్గము ననుసరించువారికి శాశ్వత సుఖము లభించును. ప్రేయోమార్గము ననుసరించువారు శాశ్వత సుఖమునకు దూరులై దుఃఖముల పాలగుదురు. కావున విజ్ఞులగువారు శ్రేయోమార్గమునే అనుసరించెదరు.  
  
    ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలనే మరల పునరుద్ఘాటించారు. ఈ శ్రేయోమార్గములో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమధి అనే అష్టాంగ విధి ఇమిడ్చి వుంటుంది. 

నాయనా! నువ్వు రోజులొ నాలుగు సంధ్యలలో తప్పక ఉపాసనా మార్గమును, తప్పక జపాన్ని, తప్పక తపస్సుని, తప్పక ధ్యానాన్ని, తప్పక నువ్వు ఆచరించాలి అనే నియమము విధి ఏర్పాటుచేయబడింది. 

అదే ప్రేయోమార్గమనుకోండి హాయిగా ఎనిమిదింటిదాకా పడుకోవచ్చు అన్నారనుకోండి ఏమైందప్పుడు? ఈ రెండింటిలో దేనికి మనస్సు మొగ్గు చూపుతుంది? 

తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి, ఐదుగంటలకల్లా సిద్ధమయ్యి, షోడశోపచారపూజ పూర్తిచేసుకుని సూర్యోదయాత్ పూర్వమే కర్మసాక్షి అయినటువంటి సూర్యుని ఆశ్రయించి, సాక్షిత్వ భావాన్ని అందుకోవడానికి ఆ సంధ్యాసమయాన్ని, ఆ ప్రదోషకాలాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో, వారికి మహేశ్వరుని గణములందరూ కూడా సహాయము చేస్తారు. ఏకాదశరుద్రులు సహాయం చేస్తారు. ద్వాదశ ఆదిత్యులు సహాయంచేస్తారు. మరి అశ్వనీదేవతలు సహాయం చేస్తారు. 

ఇంతమంది ఇంద్రియాధిష్ఠాన దేవతలందరూ కూడా ఆయా సంధ్యా సమయములందు ఎవరైతే పూజిస్తూ వుంటారో, దైవీభావనతో జీవిస్తూ వుంటారో, తపస్సుయందు నిమగ్నమై వుంటారో, ఆంతరిక సాధనలయందు నిమగ్నమై వుంటారో, అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధులై వుంటారో, అధికారిత్వాన్ని కలిగి వుంటారో, ఆ రకమైన వారందరినీ గమనిస్తూ వారియందు సద్భుద్ధిని ప్రేరేపించి, చిత్తశుద్ధిని కలిగించి స్వీయ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందించడానికి కావలసినటువంటి నైర్మాలిన్యాన్ని, నిర్మలత్వాన్ని నీకు అందిస్తారు. ఆ సంధ్యాకాలంలో అంత విశేషమున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

31-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 444 / Bhagavad-Gita - 444🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 232 / Sripada Srivallabha Charithamrutham - 232🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 112🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 134🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 48 / Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 51 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 19 🌹
8) 🌹. శివగీత - 17 / The Shiva-Gita - 17🌹
9) 🌹. సౌందర్య లహరి - 59 / Soundarya Lahari - 59🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 358 / Bhagavad-Gita - 358🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 185🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 61 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 57🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 72 🌹
15) 🌹 Seeds Of Consciousness - 135 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 75 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 21🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 4 🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 15🌹
19) 🌹. సాయి తత్వం - మానవత్వం - 59 / Sai Philosophy is Humanity - 59 🌹
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 444 / Bhagavad-Gita - 444 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 54 🌴*

54. భక్యా త్వనన్యయా శక్య అహమేవంవిధో(ర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప ||

🌷. తాత్పర్యం : 
ఓ ప్రియమైన అర్జునా! కేవలము అనన్యభక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడినరీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహనా రహస్యములందు ప్రవేశింపగలుగుదువు.

🌷. భాష్యము : 
అనన్యభక్తియుతసేవా విధానముననే శ్రీకృష్ణభగవానుడు అవగతము కాగలడు. మానసికకల్పనాపద్దతుల ద్వారా భగవద్గీతను అవగతము చేసికొన యత్నించు అప్రమాణిక వ్యాఖ్యాతలు తాము కేవలము కాలమును వృథాపరచుచున్నామని అవగతము చేసికొనునట్లుగా ఈ విషయమును శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున స్పష్టముగా తెలియజేసినాడు. 

కృష్ణుడుగాని లేదా కృష్ణుడు ఏ విధముగా తల్లిదండ్రుల ఎదుట చతుర్భుజరూపమున ప్రకటమై, పిదప ద్విభుజరూపమునకు మారెనను విషయమును గాని ఎవ్వరును ఎరుగలేరు. వేదాధ్యయనముచే గాని, తత్త్వవిచారములచే గని ఈ విషయములను తెలియుట రహస్యములందు ప్రవేశింపజాలరనియు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. 

అయినను వేదవాజ్మయమునందు పరమప్రవీణులైనవారు మాత్రము అట్టి వాజ్మయము ద్వారా అతనిని గూర్చి తెలిసికొనగలరు. భక్తియుతసేవ నొనర్చుటకు ప్రామాణిక శాస్త్రములందు పెక్కు నియమనిబంధనలు గలవు. 

శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొన గోరినచో మనుజుడు ప్రామాణిక గ్రంథములందు వర్ణింపబడిన విధియుక్త నియమములను తప్పక అనుసరించవలెను. ఆ నియమానుసారముగా అతడు తపస్సును కావించవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 444 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 54 🌴*

54. bhaktyā tv ananyayā śakya
aham evaṁ-vidho ’rjuna
jñātuṁ draṣṭuṁ ca tattvena
praveṣṭuṁ ca paran-tapa

🌷 Translation : 
My dear Arjuna, only by undivided devotional service can I be understood as I am, standing before you, and can thus be seen directly. Only in this way can you enter into the mysteries of My understanding.

🌹 Purport :
Kṛṣṇa can be understood only by the process of undivided devotional service. 

He explicitly explains this in this verse so that unauthorized commentators, who try to understand Bhagavad-gītā by the speculative process, will know that they are simply wasting their time. 

No one can understand Kṛṣṇa or how He came from parents in a four-handed form and at once changed Himself into a two-handed form. These things are very difficult to understand by study of the Vedas or by philosophical speculation. 

Therefore it is clearly stated here that no one can see Him or enter into understanding of these matters. Those who, however, are very experienced students of Vedic literature can learn about Him from the Vedic literature in so many ways. 

There are so many rules and regulations, and if one at all wants to understand Kṛṣṇa, he must follow the regulative principles described in the authoritative literature. One can perform penance in accordance with those principles. 

For example, to undergo serious penances one may observe fasting on Janmāṣṭamī, the day on which Kṛṣṇa appeared, and on the two days of Ekādaśī (the eleventh day after the new moon and the eleventh day after the full moon). 

As far as charity is concerned, it is plain that charity should be given to the devotees of Kṛṣṇa who are engaged in His devotional service to spread the Kṛṣṇa philosophy, or Kṛṣṇa consciousness, throughout the world.

 Kṛṣṇa consciousness is a benediction to humanity. Lord Caitanya was appreciated by Rūpa Gosvāmī as the most munificent man of charity because love of Kṛṣṇa, which is very difficult to achieve, was distributed freely by Him. 

So if one gives some amount of his money to persons involved in distributing Kṛṣṇa consciousness, that charity, given to spread Kṛṣṇa consciousness, is the greatest charity in the world.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 232 / Sripada Srivallabha Charithamrutham - 232 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 44
🌻. పంచకోశ యాత్ర 🌻

"కాశీలో పంచక్రోశయాత్ర చేస్తే మంచిది, అని చెప్తారు కదా, దీని అంతరార్థం ఏదైనా ఉందా?” అని నేను ప్రశ్నించాను. "నాయనా! పంచక్రోశ యాత్ర అన్నది భౌతికయాత్ర మాత్రమే కాని ఆధ్యాత్మపరంగా విశ్లేషిస్తే సాధకుడి చైతన్యం అన్న మయ కోశాన్నుండి ఆనందమయకోశం చేరగలిగే యాత్ర అని చెప్పవచ్చు. 

అన్నమయకోశంలో తన భౌతికమైన ఉనికిని ఆనందిస్తూ శక్తిలేమివల్ల శరీరవ్యాపారంలో ఆటంకం కలగకుండా, దానివల్ల సాధనాపథంలో ఎటువంటి ఆటంలు ఎదురవకుండా చూసుకుంటూ ప్రాణాయామ పద్ధతుల ద్వారా ప్రాణమయకోశపు స్థితిని ఆస్వాదిస్తూ, మనోమయ కోశంలో చెలరేగే భావసంచనాలపై నియంత్రణని సాధిస్తూ, విఙ్ఞానమయకోశం వరకు వచ్చినట్లయితే ఏది మంచి? ఏది చెడు? అనే వివేకం కలుగుతుంది. 

కాని ఇక్కడ సాధకుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించగలగాలి. ఎందుకంటె ఈ కోశం "నేను, నాది" అనే అహంకార భావాలకు నిలయం. దీనిపై కూడా విజయం సాధించగల్గి చివరగా ఆనందమయ కోశాన్ని చేరగలిగితే దివ్యానంద స్థితిని పొందగలుగుతాడు. 
ఈ పంచక్రోశయాత్ర చేయగలిగే శక్తి, ఈ దివ్యానంద స్థితి శ్రీపాదుల అనుగ్రహంవల్లనే సుసాధ్యం అవుతుంది.

 🌻. జలయఙ్ఞం 🌻

గంగామాత కోరికపై శ్రీపాదులు తమ సూక్ష్మ శరీరంతో ప్రతి రోజు కాశీలోని గంగలో స్నానం చేస్తారు. 

పాపభూయిష్ఠులైన మానవులు స్నానం చేయడంవల్ల గంగ, కృష్ణ మొద లైన పవిత్ర నదులు కలుషితం అవుతాయి. మహా పురుషులు పుణ్య పురుషులూ, చైతన్యస్వరూపులు కనుక ఆయానదులందు వారు స్నానం చేసినపుడు తిరిగి అవి పుణ్యవంతాలు అవుతుంటాయి. 

జీవరాశుల శరీరంలో రస స్వరూపంలో ఉన్న జలతత్వాన్ని శుద్ధి చేయడమే శ్రీపాదుల జలయఙ్ఞ స్వరూపం," అని వివరించి నా సందేహాన్ని దూరం చేసారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 232 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 24
*🌻 Siva in the form of ‘Pancha Bhutas’ - 2 🌻*

I asked Sri Dharma Gupta, ‘Sir! Previously I heard that Sripada Srivallabha is the combined form of Sri Padmavathi Venkateswara Swami. You are saying that He is the form of Shiva and Shakti. You also said that it gives great merit if one does Siva worship at Shanipradosha. 

 I am confused, please explain to me. Sri Dharma Gupta said laughing, ‘Sir! Sripada Srivallabha’s divine tatwam cannot be understood by even the seven rishis. Even then, I will explain as far as I know.  

Sri Venkateswara Prabhu has been there even from Krutha Yugam. He gave boon to Dasaradha. Because he has said that he would be born as Sri Ramachandra, He can be worshipped as Srirama, the son of Kausalya. 

For sometime, Sri Venkateswara Swami was worshipped as Shakti i.e. Bala Tripura Sundari. After that, He was worshipped as Siva Swarupa. Some people worshipped Him as Subrahmanya. After that, because of Bhagavan Ramanuja, He is being worshipped as Maha Vishnu by Sri Vaishnavas. 

The thing that is thought of as ‘Maha Sunyam’ by Bouddhas is also Venkateswara. He is indeed Datta Prabhu. This Swami is the pivot in the illusive drama of this creation. He responds to any type of call by anybody and protects them. 

 He is being referred to as Sripada Srivallabha in this world now. Sripada’s left half has Shakti and the right half Siva. So He is the combined form of Siva Shakti. He has Padmavathi amma in His heart.  

The heart is the place for compassion. It is the place of ‘Anahatha Chakram’. From there, the power reaches the upper ‘chakras’ and lower ‘chakras’. So He is Sri Padmavathi Venkateswara in another divine chaitanya body.  

He is also the combined form of Vani Hiranyagarbha ; Vani Devi i.e. Saraswathi Devi, who is in the forms of Para, Pashyanthi, Madhyama and Vaikhari, is on His tougue. Vani maatha’s divine ‘maanasam’ and Hiranyagarbha’s divine maanasam remain in a state of ‘advaitha’ (oneness). 

The real Chidambara secret is that he wears the three types of Chaitanya forms at a time. There is not even a touch between His one body and another body.  

Having worn the chaintanya bodies of Vani-Hiranyagarbha, Siva Parvathi and Padmavathi Venkateswara at a time, He also wore another chaitanya body called Sripada Srivallabha which transcends all those chaitanya bodies.  

This is His yoga maya. His Vaishnava Maya. This is His Chidambara secret. It is proper if you call Him dwaitha (dualism), vishishta adwaitha (qualified non-dualism) or advaitha (non-dualism).  

The reason is that there is no limit for His Yoga Maya, Vaishnava Maya. He took the avathar of Jaganmohini and cleverly distributed ‘amrit’ only among devathas (Gods).  

In the form of Mohini, he lured Parama Siva Himself without the need of Manmadha and gave birth to Dharma Shasta. He says that He only is Mohini and also Dharma Shasta. 

 Which is impossible for such Datta Prabhu? Atma said that It will create Itself with Its maya. He created Himself as Dharma Shasta through Mohini form. Oh! What a clever method?’ Saying this he surprised me.

End of Chapter 24 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 112 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. నరకము 🌻*

మనము చేయు పనిని అనుసరించి మనము అనుభవించు ఫలితముండును. అయినచో మంచి పనులు చెడ్డపనులు అను విభాగము ఎట్లు ఏర్పడునుచున్నది? 

తనకు గాని ఇతరులకు గాని దుఃఖానుభవము కలిగించు పనులు చెడ్డవి అని, సుఖము కలిగించు పనులు మంచివి అని నిర్ణయించుకొనవలెను.

ఇది ఎట్లు తెలియును? తెలియుటకే దుష్కర్మలకు దుఃఖము ఫలితముగా ప్రకృతి నిర్ణయించుచున్నది. 

కలిగిన దుఃఖము వలన జీవుడు ఆ పని మాని మంచి పని చేయుటకై యత్నించుటయే జీవితమున దుఃఖానుభవమునకు ప్రయోజనము. 

ఇట్లు అధర్మ బుద్ధి నుండి ధర్మ బుద్ధికి జీవుడు మరలుటకే దుఃఖము సృష్టింపబడినది. దానినే నరకమందురు.
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 134 🌹*
*🌴 Crises and Development - 2 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Crises of the Solar Angel - 2 🌻*

The first initiation gave birth to the I AM consciousness. The second fertilization of humanity prepares us to overcome the human limitations and to bring forth the consciousness of THAT I AM. 

From the viewpoint of the Hierarchy, there is an urgency to inform people and thereby allow them to orient themselves towards spiritual love and life, so that these qualities can emerge.

Today’s blossoming of the human mind indicates that the Solar Angel makes his presence palpable within humanity. 

The Solar Angel also goes through an initiation and has decided for a new, faster rhythm. We call this the influence of the Aquarian age, and we too should adapt to the new rhythm. 

Whether we like it or not, we are being transformed. It is a crisis in which personalities must give way - or be broken. We can ascend to a higher level and be reborn in spirit.

But there are also groups of old souls on the planet who have missed earlier opportunities for development. They are now continuing here and are causing more problems than being cooperative. Such a situation must not arise again. 

Also many aspirants lose themselves too much in unessential things. We should not play with spiritual concepts, but put them into practice and focus increasingly on the soul. This is of great urgency.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 48 / Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 89

408. శివప్రియా - 
శివునికి ఇష్టమైనది.

409. శివపరా - 
శివుని పరమావధిగా కలిగినది.

410. శిష్టేష్టా - 
శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.

411. శిష్టపూజితా -
 శిష్టజనుల చేత పూజింపబడునది.

412. అప్రమేయా - 
ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.

413. స్వప్రకాశా -
 తనంతట తానే ప్రకాశించునది.

414. మనోవాచామగోచరా - 
మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.

🌻. శ్లోకం 90

415. చిచ్ఛక్తిః - 
చైతన్య శక్తి.

416. చేతనారూపా - 
చలించు తెలివి యొక్క రూపము.

417. జడశక్తిః - 
ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.

418. జడాత్మికా - 
జడశక్తి యొక్క స్వరూపము.

419. గాయత్రీ - 
గానము చేసిన వారిని రక్షించునది.

420. వ్యాహృతిః - 
ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.

421. సంధ్యా - 
చక్కగా ధ్యానము చేయబడునది.

422. ద్విజబృంద నిషేవితా -
 ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 48 🌻*

408 ) Shivangari -   
She who makes good to happen

409 ) Shiva priya -  
 She who is dear to Lord Shiva

410 ) Shivapara -   
She who does not have any other interest except Lord Shiva

411 ) Shishteshta -  
 She who likes people with good habits

412 ) Shishta poojitha -   
She who is being worshipped by good people

413 ) Aprameya -   
She who cannot be measured

414 ) Swaprakasha -   
She who has her own luster

415 ) Mano vachama gochara -   
She who is beyond the mind and the word

416 ) Chitsakthi -   
She who is the strength of holy knowledge

417 ) Chethana roopa -   
She who is the personification of the power behind action

418 ) Jada shakthi -   
She who is the strength of the immobile

419 ) Jadathmikha -   
She who is the world of immobile

420 ) Gayathri -   
She who is Gayathri

421 ) Vyahruthi -   
She who is the grammar originating from letters

422 ) Sandhya -  
 She who is the union of souls and the God

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 51 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 29

*🌻 29. అన్యోన్యాశ్రయత్వ మిత్యన్యే 🌻*

    మోక్ష ప్రాప్తికి ఉన్నటువంటి అన్ని మార్గాలు ఒకదానికొకటి పరస్పర ఆశ్రయంగా ఉన్నాయి.

   శ్రీ రామకృష్ణ పరమహంస జ్ఞానమార్గంలో అనుసరించే యుక్తిని పురుషుడు గాను, భక్తి మార్గంలో అనుసరించే భగవత్ప్రీతిని స్త్రీగాను పోల్చారు. ఇట్టి సాదృశ్యంలో పురుషుడు కోటలోనికి మాత్రమే ప్రవేశించగలిగితే, స్త్రీ అంతఃపురంలోకి కూడా ప్రవేశించగలదు. అందువలన భక్తి మార్గం శ్రేష్ఠమని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు.

     భక్తి పూరితంగాని జ్ఞానం ఎండిన చెట్టు మొదలు వంటిది. జ్ఞానంతో కూడనట్టి భక్తి గుడ్డి ఎద్దు చేలో మేసినట్లుగా ఉంటుంది. కనుక భక్తి జ్ఞానాలు రెండూ అన్యోన్యాశ్రయాలు. యోగబలం లేనిదే భక్తుడు భక్తిలో పరవశించ జాలడు. 

యోగబలం లేనిదే జ్ఞానంలో అపరోక్ష అనుభూతి ఉండదు. కనుక అన్ని మార్గాలూ కలసి అన్యోన్యయాశ్రయాలు. అయితే ఏది సులువైతే దానిని ముందుగా స్వీకరించి మిగిలిన వాటిని సహాయంగా చేసుకోవాలి. నిజానికి సాధనలు వేరు వేరు కాదు. 

అన్నిటినీ కలిపే ఆచరించాలి. ఏ మార్గమూ మరొక మార్గానికి వ్యతిరేకం కాదు. అన్నీ సమన్వయంగా జరుగుతాయి. సాధకులు ఇతర మార్గాలను వ్యతిరేకించరాదు. భేదమని తలంచరాదు. 

ఏది ఎప్పుడు వీలుకుదిరితే అప్పుడది మంచిదైతే సరి, చేస్తూ పోవాలి. లక్ష్యం మాత్రం మరచిపోకూడదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 Guru Geeta - 19 🌹 
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj

*🌷 God determines Guru for each person, and the disciple has no right to find fault that his Guru 🌷* 
  
Indra realized the truth and meditated upon his Guru Brihaspati as per the instruction given by Lord Dattatreya. By the grace of Lord Dattatreya, Brihaspati appeared before Indra. 

Indra was under the false impression that Brihaspati had concealed himself somewhere. 

As a matter of fact Guru is all-pervasive. He does not go anywhere. That is the secret of the Guru principle. In truth Lord Datta and Brihaspati are one and the same. 

Lord Datta, who knows this secret, summoned Brihaspati, and he at once came and stood before Indra. 

Had Indra alone begged for Brihaspati to come, he would not have come. Because Lord Datta intervened and helped Indra, Brihaspati came. 

Because of his repentance, his intense penance, and the exhaustion of the effects of his past bad karma, Brihaspati cleansed Indra of his sins and restored to him his past glory. 

By the command and grace of Datta, and by the prayers of Indra whose eyes were now opened to his own past mistakes, Brihaspati gave Indra back his power and grandeur. 

When one as great and powerful as Devendra could have suffered a fate such as this, it requires no mention how vulnerable the frail and weak-minded humans and other gods are. 

During the incarnation of Lord Dattatreya as Sri Narasimha Saraswati, a similar incident occurred. 

A spiritual aspirant, displeased at the short temper of his Guru, left him and approached Sri Nrsimha Saraswati. Many people mistakenly criticize that he, who cannot control his own temper is not eligible to be Guru. 

Sri Narasimha Saraswati gave the seeker some good counsel and explained that each individual gets the Guru that he deserves, and sent him back to his previous Guru. 

God determines Guru for each person, he said, and the disciple has no right to find fault that his Guru has either a short temper or that he is frivolous. 

The story of Trisanku is a good example. Under no circumstance should Guru be changed. Similarly, one cannot have two or three gurus, one for the morning, one for the evening, and for the holidays. 

Gurus are not restaurants that one can visit a different one each week and as per wish order a different item from the menu each time, such as masala dosa, etc. 

One should have only one Guru. You cannot have one Guru for explaining scriptures, one Guru for singing songs, one Guru for performing rituals, and so on. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 17 / The Siva-Gita - 17 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
*🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 1 🌻* 

అగస్త్య ఉవాచ:
న గృహ్ణాతివచ : పధ్యం - కామ క్రో ద్రూది పీడితః,
హితం న రోచతే తస్య - ముమూర్షో రివ భేషజమ్. 1

మధ్యే సముద్రం యానీతా - సీతా దైత్యేన మాయినా,
ఆయాస్యతి నారా శ్రేష్ఠ! - సాకధం తవ సన్నిధిమ్. 2

అగస్త్యుడు పలుకుచున్నాడు:

కామ క్రోధా ద్యరి షడ్వర్గంబుల కదీనుడైన వాడు నీతి వచనములకు బెడ చెవిని పెట్టును. మరణమును కోరుకున్న మనిషి మంచి మందును పుచ్చుకొనుట సమ్మతించడు.

 అట్లే ఓ రామా! నీ ధర్మపత్ని యగు సీత మాయావి యైన రావణుని చేత అపహరింప బడి సాగర మధ్యన ఉంచ బడినది. అటువంటి నీ భార్య నీ చెంత కెట్లు రాగలదు?

భద్యన్తే దేవతా స్సర్వా - ద్వారి మర్కట యూధవత్,
కించ చామర ధరిణ్యో - యశ్శం భువర దర్పితః 3

భుంక్తే త్రిలోకీ మఖిలాం- యశ్శం భువర దర్పితః,
నిష్కంటకం తస్య జయః - కధం తన భవిష్యతి? 4

ఎవని భవన ప్రాంగణమున వానరుల గుంపు వలె దేవతలు బంధింప బడినారో, ఆ దేవతల యొక్క భార్యలు వింజా మరములను చేత బూని గాలి వేయుచున్నారో మరియు నెవడైతే మహేశ్వర వరమును బొంది గర్వముతో స్వర్గ మర్త్య పాతాళ లోకములను నిరాటంక ముగా బరిపాలించు చున్నాడో, అటువంటి రావణాసురుని పరాభవింప చేయుట నీ తరమా?

ఇంద్ర జిన్నా మమ పుత్రోయ - స్తస్యా స్తీశ వరోద్దతః,
తస్యాగ్రే సంగరే దేవా - బహువారం పలాయతాః 5

కుంభ కర్ణా హ్వయో భ్రాతా - యస్యాస్తి సుర సూదనః,
అన్యోది వ్యాస్త్ర సంయుక్త - శ్చిరం జీవీ విభీషణః 6

మరియు (పోగా ) నాతనికి ఇంద్రజిత్తు డనే కుమారుడున్నాడు. అతడు పరమశివుని వరము చేత మహా బలశాలియై యింతవరకు దాను పరాభావమన నెట్టిదో ఎరుగడు.

అటువంటి యోధుని ఎదుట నిలిచి యుద్దము చేయుటకు శక్తి లేక యుద్ద భూమి నుండి అనేక సార్లు దేవతలు పలాయనము జిత్తగించిరి. 
అది యట్లుండగా సుపర్వ గర్వము నణచి వేసిన కుంభకర్ణుండు అతనికి తోబుట్టువు. 

మరియు దివ్యాస్త్రములతో సంసిద్దుడై యుండిన చిరంజీవి యగు విభీషణుడు కూడా అతనికి అనుంగ సోదరుడే.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 17 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
*🌻 Viraja Deeksha Lakshana Yoga - 1 🌻*

1. 2. Moreover, he has a son named Indrajit. Due to the boons and blessings of Paramashiva he didn't taste defeat till date. 

3. 4. Unable to stand in front of him many a times Gods fled away. On top of that, Kumbhakarna another mighty demon is Ravana's brother. 

5. 6. Also, the immortal Vibheeshana having many divine weapons is also his brother. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 9 / Sri Gajanan Maharaj Life History - 9 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 2వ అధ్యాయము - 5 🌻*

సాయంత్రం, ఇఛ్ఛారాం స్నానంచేసి ప్రగాఢభక్తితో శ్రీగజానన్ను పూజించాడు. తను ఉదయంనుండి ఉపవాసం ఉండిఉండడం, మరియు తనుఇవ్వబోయే ఆహారం శ్రీగజానన్ స్వీకరించి తిన్న తరువాత తను ఆహారం తీసుకుంటానని శ్రీమహారాజుతో అంటూ కనీసం నలుగురు వ్యక్తులు తినగలిగే అన్నం, కూరలు, పూరీలూ, అనేకరకాలయిన మిఠాయిలు, నెయ్యి, పండ్లు ఇంకాఅనేక పదార్ధాలు ఒక విస్తరలోపెట్టి శ్రీగజానన్ ముందుఉంచుతాడు. 

ఆ విస్తర చూసిన శ్రీమహారాజు తనలోతాను ఈవిధంగా అనుకున్నారు. ఓకక్కుర్తి గణప్యా, ఎప్పుడూ తిండితిండి అనేదికదా ఇక ఆలోచించకుండా ఈవిస్తరలో పదార్ధాలుతిని నీ కక్కుర్తితనం ఎంతో వీళ్ళని చూడనీ. ఇలాఅనుకుంటూ ఆపదార్ధాలు తినడం ప్రారంభించి ఒక్క ఉప్పుతునక కూడా ఆవిస్తరలో మిగల్చలేదు. 

ఈ విధంగా బలవంతంగా తినడంవల్ల ఫలితం ఏమవుతుందో చూపించడానికి, శ్రీగజానన్ తనుతిన్న పదార్ధాలన్నీ వాంతి చేస్తారు.

శ్రీరామదాసుస్వామి కూడా ఒకసారి ఇదేవిధంగా చేస్తారు. 

ఒకసారి క్షీరాన్నం తినాలని బాగాకోరిక కలిగి, అడిగి కడుపునిండా తింటారు. అతిగా తినడంవల్ల ఫలితంగా వాంతిఅవుతుంది. అటువంటి కోరికను జయించడంకోసం ఆవాంతిచేసిన పదార్ధాలను శ్రీరామదాసు తిరిగి తినడం ప్రారంభించారు.

ఇదేవిధంగా శ్రీగజానన్ ఎటువంటి పదార్ధాలు, ఎంతఅయినా జీర్ణించుకోగల శక్తి సామర్ధ్యం ఉన్నవారు అయినా, ఈవిధంగా బలవంతంచేసి తినిపించేవారికి పాఠం చెప్పేందుకు ఇలాచేసారు. ఆతరువాత భక్తులు ఆస్థలం పూర్తిగా శుభ్రంగాకడిగి, తీగజానన్ కు కూడా స్నానంచేయించి, ఒక ఎత్తయిన ఆసనంమీద కూర్చుండపెడతారు. 

చాలా మంది వచ్చి శ్రీగజాననకు నమస్కరించారు. వాళ్ళు భక్తిగీతాలు కూడా పాడడం ప్రారంభించారు. శ్రీగజానన్ అవివింటూ, చాలా ఆనందపడుతూ, ఆతన్మయత్వంలో వాళ్ళభజనస్వరంలో గణ గణ గణాతబోతే అని పాడడం ప్రారంభించారు. 

ఈ విధమయిన ఈయన గణ గణ గణాతబోతే అనేపాట వలన భక్తులు ఈయనను గజానన్ అనిపిలవడం ప్రారంభించారు. స్వయానా బ్రహ్మ అవడంచేత ఆయనకు ఏవిధమయిన పేరు అవసరంలేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 9 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 2 - part 5 🌻*

At Sunset time, Ichharam took a bath and with great devotion offered Puja to Shri Gajanan. He told Shri Gajanan Maharaj that he had a fast since morning and would take food only if Shri Gajanan accepted and ate food offered by him. 

Saying so, Ichharam brought a thali full of rice, many varieties of Sweets, curry, puris, ghee, fruits and many other things, sufficient to feed at least four persons and put it before Shri Gajanan. 

Looking at that thali Shri Gajanan Maharaj said to Himself, You, greedy Ganpya, always want to eat and eat. Now eat all this food without hesitation and let all these people see Your greediness. Saying so, He started eating everything that was served to Him and did not leave even a grain of salt in the thali. 

Then to show the result of forceful eating, Shri Gajanan vomited everything that He ate. Shri Ramdas Swami once did the same thing. It so happened that he felt a craze to eat Sweet Kheer. He asked for it and ate it to His full. 

Overeating resulted in vomiting. Shri Ramdas started eating that what he vomited just to win over his desire. Similarly Shri Gajanan, though quite strong to digest anything, vomited only to teach a lesson to those who pressurize Him to eat. 

Thereafter the devotees cleaned the place, gave a bath to Shri Gajanan and made Him sit on a raised seat. Many people came to pay respect to Gajanan. They started singing devotional songs. 

Shri Gajanan Maharaj was very happy to listen to them and then He began chanting to Himself Gan Ganat Bote in the same tune in which the Bhajan was sung. It continued this way for the whole night. 

Because of His above utterance of Gan Gan Ganat Bote, people started calling him Gajanan. In fact He Himself being Brahma needs no name.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 59 / Soundarya Lahari - 59 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

59 వ శ్లోకము

*🌴. ప్రకృతి వశ్యమునకు, అందరిని ఆకర్షించుటకు 🌴*

శ్లో:59. స్పురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథ రథంl 
యమారుహ్య ద్రుహ్యత్యవనిరథ మర్కేందు చరణం మహా వీరో మారః ప్రమథపతయే సజ్జితవతే.ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా! అద్దము వలె ప్రకాశించు చున్న నీ చెక్కిళ్ళ యందు ప్రకాశించు చున్న నీ చెవి కమ్ముల జంటను కలిగిన నీ ముఖము మన్మధుడు ఎక్కిన నాలుగు చక్రములు గల రధముగా కనపడుచున్నది. ఈ రధమునెక్కిన మన్మధుడు సూర్యచంద్రులు చక్రములుగా కలిగి భూమి అను రధమునెక్కిన ప్రమధ పతి ని ఎదిరించుచున్నాడు కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 25,000 సార్లు ప్రతి రోజు 3 రోజులు జపం చేస్తూ, పొంగలి, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సర్వ రోగముల నుండి విముక్తి, ప్రజా గౌరవం కలుగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 59 🌹* 
📚. Prasad Bharadwaj 

SLOKA - 59 🌹

*🌴 Attracting Everyone 🌴*

59. Sphurad-ganddabhoga -prathiphalitha-thatanka yugalam Chatus-chakram manye thava mukham idam manmatha-ratham; Yam-aruhya druhyaty avani-ratham arkendhu-charanam Mahaviro marah pramatha-pathaye sajjitavate. 
 
🌻 Translation : 
I feel that thine face, with the pair of ear studs, reflected in thine two mirror like cheeks is the four wheeled chariot, of the god of love perhaps he thought he can win lord Shiva, who was riding in the chariot of earth, with sun and moon as wheels, because he was riding in this chariot.

Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 25000 times a day for 3 days, offering honey and pongal as nivedhyam, it is believed that they will be able to attract everyone.

🌻 BENEFICIAL RESULTS: 
Gaining mastery over all and fascination of Nature. 
 
🌻 Literal results: 
Extremely magnetic to the nature.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 358 / Bhagavad-Gita - 358 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 06 🌴

06. మహర్షయ: సప్త పూర్వే చతుర్వా మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమా: ప్రజా: ||

🌷. తాత్పర్యం :
సప్తమహాఋషులు, వారికి పూర్వము సనకసనందనాదులు మరియు మనువురు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధలోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి.

🌷. భాష్యము : 
ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు విశ్వజనము యొక్క వంశక్రమానుగత సారాంశమును వివరించుచున్నాడు. 

తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడని తెలియబడు భగవానుని శక్తి నుండి ఉద్భవించెను. ఆ బ్రహ్మదేవుని నుండి తొలుత సనక, సనందన, సనాతన, సనత్కుమారులును, మనువులును, ఆ తరువాత సప్తఋషులును ఉద్భవించిరి. 

ఈ ఇరువదియైదుమంది ఋషులు విశ్వమునందలి జీవులందరికి ప్రజాపతులుగా ప్రసిద్ధినొందిరి. అసంఖ్యాకములుగా నున్నటువంటి విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు. ఆ లోకములన్నియును వివధజనులతో నిండియున్నవి. వారందరును ఆ ఇరువదియైదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి. 

శ్రీకృష్ణుని కరుణచే విశ్వమును సృష్టించు జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వేయి దేవతాసంవత్సరములు తపమాచరించియుండెను. తదుపరి బ్రహ్మ నుండి సనక, సనందన, సనాత్కుమారులును, ఆపై రుద్రుడును మరియు సప్తఋషులును ఉదయించిరి. 

ఈ విధముగా బ్రహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరు భగవానుని శక్తి నుండి ఉద్భవించినట్టివారు. కనుకనే బ్రహ్మదేవుడు పితామహునిగను మరియు అతనికి తండ్రియైన శ్రీకృష్ణుడు ప్రపితామహునిగను తెలియబడినారు. ఈ విషయము భగవద్గీత (11.39) యందలి ఏకాదశాధ్యాయమున తెలుపబడినది. 

ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు విశ్వజనము యొక్క వంశక్రమానుగత సారాంశమును వివరించుచున్నాడు. తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడని తెలియబడు భగవానుని శక్తి నుండి ఉద్భవించెను. 

ఆ బ్రహ్మదేవుని నుండి తొలుత సనక, సనందన, సనాతన, సనత్కుమారులును, మనువులును, ఆ తరువాత సప్తఋషులును ఉద్భవించిరి. ఈ ఇరువదియైదుమంది ఋషులు విశ్వమునందలి జీవులందరికి ప్రజాపతులుగా ప్రసిద్ధినొందిరి. అసంఖ్యాకములుగా నున్నటువంటి విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు. 

ఆ లోకములన్నియును వివధజనులతో నిండియున్నవి. వారందరును ఆ ఇరువదియైదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి. శ్రీకృష్ణుని కరుణచే విశ్వమును సృష్టించు జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వేయి దేవతాసంవత్సరములు తపమాచరించియుండెను.

 తదుపరి బ్రహ్మ నుండి సనక, సనందన, సనాత్కుమారులును, ఆపై రుద్రుడును మరియు సప్తఋషులును ఉదయించిరి. ఈ విధముగా బ్రహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరు భగవానుని శక్తి నుండి ఉద్భవించినట్టివారు.

 కనుకనే బ్రహ్మదేవుడు పితామహునిగను మరియు అతనికి తండ్రియైన శ్రీకృష్ణుడు ప్రపితామహునిగను తెలియబడినారు. ఈ విషయము భగవద్గీత (11.39) యందలి ఏకాదశాధ్యాయమున తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 358 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 06 🌴

06. maharṣayaḥ sapta pūrve
catvāro manavas tathā
mad-bhāvā mānasā jātā
yeṣāṁ loka imāḥ prajāḥ

🌷 Translation : 
The seven great sages and before them the four other great sages and the Manus [progenitors of mankind] come from Me, born from My mind, and all the living beings populating the various planets descend from them.

🌹 Purport :
The Lord is giving a genealogical synopsis of the universal population. Brahmā is the original creature born out of the energy of the Supreme Lord, who is known as Hiraṇyagarbha. 

And from Brahmā all the seven great sages, and before them four other great sages, named Sanaka, Sananda, Sanātana and Sanat-kumāra, and the fourteen Manus, are manifested. 

All these twenty-five great sages are known as the patriarchs of the living entities all over the universe. There are innumerable universes and innumerable planets within each universe, and each planet is full of population of different varieties. 

All of them are born of these twenty-five patriarchs. Brahmā underwent penance for one thousand years of the demigods before he realized by the grace of Kṛṣṇa how to create. 

Then from Brahmā came Sanaka, Sananda, Sanātana and Sanat-kumāra, then Rudra, and then the seven sages, and in this way all the brāhmaṇas and kṣatriyas are born out of the energy of the Supreme Personality of Godhead. Brahmā is known as Pitāmaha, the grandfather, and Kṛṣṇa is known as Prapitāmaha, the father of the grandfather. That is stated in the Eleventh Chapter of the Bhagavad-gītā (11.39).
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 186 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
41. అధ్యాయము - 16

*🌻. సృష్టి వర్ణనము - 3 🌻*

ఏవం కర్మానురూపేణ ప్రాణినా మంబికాపతేః | ఆజ్ఞయా బాహవో జాతా అసంఖ్యాతా ద్విజర్షభాః || 25

కల్పభేదన దక్షస్య షష్టిః కన్యాః ప్రకీర్తితాః | తాసాం దశ చ ధర్మాయ శశినే సప్తవింశతిమ్‌ || 26

విధినా దత్తవాన్దక్షః కశ్యపాయ త్రయోదశ | చతస్రః పరరూపాయ దదౌ తార్‌ క్ష్యాయ నారద || 27

భృగ్వంగిరః కృశాశ్వేభ్యో ద్వే ద్వే కన్యే చ దత్తవాన్‌ | తాభ్యస్తేభ్యస్తు సంజాతా బహ్వీ సృష్టిశ్చరాచరా || 28

ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! పార్వతీపతి యొక్క ఆదేశముచే ప్రాణుల కర్మలకనుగుణముగా లెక్కలేనన్ని జీవులు పుట్టినారు (25). 

మరియొక కల్పములో దక్షునకు అరవై కన్యలు కలిగిరని చెప్పబడెను. వారిలో పది మందిని ధర్మునకు, ఇరవై ఏడు మందిని చంద్రునకు (26), 

కశ్యపునకు పదముగ్గురిని ఇచ్చి దక్షుడు యథావిధిగా వివాహమును చేసెను. ఓ నారదా!దక్షుడు నల్గురు కన్యలను గొప్ప రూపముగల తార్‌ క్ష్యునకు ఇచ్చి వివాహము చేసెను (27). 

భృగువు, అంగిరస్సు, కృశాశ్వులకు ఇద్దరిద్దరు కన్యలనిచ్చెను. ఈ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమగు సృష్టి విస్తారముగా కలిగెను (28).

త్రయోదశమితాస్తసై#్మ కశ్యపాయ మహాత్మనే | దత్తా దక్షేణ యాః కన్యా విధివన్ము నిసత్తమ || 29

తాసాం ప్రసూతిభిర్వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్‌ | స్థావరం జంగమం చైవ శూన్యం నైవ తు కించన || 30

దేవాశ్చ ఋషయశ్చైవ దైత్యాశైవ ప్రజజ్ఞిరే | వృక్షాశ్చ పక్షిణశ్చైవ సర్వే పర్వతవీరుధః || 31

దక్షకన్యా ప్రసూతైశ్చ వ్యాప్తమేవం చరాచరమ్‌ | పాతాల తల మారభ్య సత్యలోకావధి ధ్రువమ్‌ || 32

ఓ మహర్షీ! దక్షుడు మహాత్ముడగు కశ్యపునకు ఏ పద ముగ్గురు కన్యలనిచ్చి యథావిధిగా వివాహము చేసెనో , వారి సంతానముచే స్థావర జంగమాత్మకమగు ముల్లోకములు నిండి, శూన్యస్థలము లేకుండెను (30). 

దేవతలు, ఋషులు, దైత్యులు, వృక్షములు, పక్షులు, పర్వతములు, లతలు మొదలైనవి సృష్టింపబడెను (31). 

పాతాలము నుండి సత్యలోకము వరకు గల చరాచర జగత్తు అంతయూ దక్షకన్యల సంతానముచే నిశ్చితముగా నిండెను (32).

బ్రహ్మాండం సకలం వ్యాప్తం శూన్యం నైవ కదాచన | ఏవం సృష్టిః కృతా సమ్యగ్ర్బహ్మణా శంభుశాసనాత్‌ || 33

సతీ నామ త్రిశూలాగ్రే సదా రుద్రేణ రక్షితా | తపోర్థం నిర్మితా పూర్వం శంభునా సర్వ విష్ణునా || 34

సైవ దక్షాత్సముద్భూతా లోకకార్యార్థమేవ చ | లీలాం చకార బహుశో భక్తోద్ధరణ హేతవే || 35

వామాంగో యస్య వైకుంఠో దక్షిణాంగోsహమేవ చ | రుద్రో హృదయజో యస్య త్రివిధస్తు శివస్స్మృతః || 36

బ్రహ్మాండ మంతయూ వ్యాపింపబడి శూన్యస్థానము లేకుండెను. ఈ తీరున, శంభుని యాజ్ఞచే బ్రహ్మ చక్కగా సృష్టిని చేసెను (33). 

పూర్వము సర్వవ్యాపకుడగు శంభునిచే తపస్సు చేయుట కొరకు నిర్మింపబడిన సతీదేవిని రుద్రుడు సర్వకాలములయందు త్రిశూలపు కొనయందుంచి రక్షించెను (34). 

ఆమెయే లోకకార్యములను సిద్దింపజేయుట కొరకు దక్షుని కుమార్తెగా జన్మించి, భక్తులనుద్ధరించగోరి అనేక లీలలను ప్రదర్శించెను (35). 

శివుని వామభాగము విష్ణువు. కుడి భాగము నేను. హృదయము నుండి రుద్రుడు జన్మించెను. ఈ తీరున శివుడు మూడు రూపములలో నున్నాడని మహర్షులు చెప్పిరి (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 61 🌹*
Chapter 17
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

🌻 The Phases 🌻

God takes human form as the Avatar in order to reveal to mankind the way of Truth, and therefore whatever he does is for the benefit of the world. 

The Old Life, the New Life, the Fiery Free Life and the Seclusions are the phases essential to awaken the world toward the way of Truth. 

These phases were lived by the Avatar himself for the sake of his divine work, and his work was, is and will always be to reveal to mankind the way to Truth. 

Though the Avatar always reveals the way clear to mankind during his manifestation, the manifestation is another phase of his work; it is the result of his work.

Every time the Avatar comes there is another state of circumstances in accordance with which he has work, and therefore according to the different circumstances, he has to structure his work in various phases during the particular Avataric advent. 

It is in the period of his manifestation that all these phases of his work become clear and evident, and these phases reveal the ways to the path of Truth.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 57 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 25
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. వాసుదేవ మంత్ర లక్షణము - 4 🌻*

ధీరహం మనః శబ్దశ్చ స్పర్శరూపరసాస్తతః. 29

గన్ధో బుద్ధిర్వ్యాపకం తు కరే దేహే న్యసేత్క్రమాత్‌ | న్యసేదఙ్ఘ్ర చ తలయోః కే లలాటే ముఖే హృది.

నాభౌ గుహ్యేచ పాదౌ చ అష్టవ్యూహః పుమాన్‌ స్మృతః |

ధీ, అహంకారము, మనస్సు, శబ్ధము, స్పర్శ - రూప - రసములు - గంధము, వ్యాపకమైన బుద్ధి వీటిని క్రమముగా కరమునందను, దేహమునందును విన్యసించవలెను. 

పాదములు, తలములు, శిరస్సు, లలాటము, సుఖము, హృదయము, నాభి, గుహ్యప్రదేశము, పాదము వీటిపై విన్యసించవలెను. జీవుడు అష్టవ్యూహుడని చెప్పబడినాడు.

జీవో బుద్ధిహఙ్కారో మనః శబ్దో గుణోనిలః 31

రూపం రసో నవాత్మాయం జీవ అఙ్గష్ఠకద్వయే | తర్జన్యాదిక్రమాచ్ఛేషం యావద్వాతుప్రదేశినీమ్‌ . 32

దేహే శిరోలలాటస్యహృన్నాభీగుహ్యజానుషు | పాదయోశ్చ దశాత్మాయ మిన్ద్రో వ్యాపీ సమాస్థితః 33

అఙ్గుష్ఠద్వయకే వహ్ని స్తర్జన్యాదౌ పరేషు చ | శిరోలలాటవక్త్రెషు హృన్నాభీగుహ్యజానుషు. 34

పాదయోరేకాదశాత్మా మనః శ్రోత్రం త్వగేవ చ | చక్షుర్జిహ్వా తథా ఘ్రాణం వాక్పాణ్యఙ్ఘ్రిశ్చ పాయు చ. 35

ఉపస్థం మానపో వ్యాపి శ్రోత్రమఙ్గష్ఠకద్వయే | తర్జన్యాదిక్రమాదష్టావతిరిక్తం తలద్వయే. 36

ఉత్తమాఙ్గలలాటాస్య హృన్నాభావథ గుహ్యకే| ఊరుయుగ్మే తథా జఙ్ఘా గుల్ఫాపాదేషు చ క్రమాత్‌. 37

జీవుడు, బుద్ధి, అహంకారము, మనస్సు, శబ్ధము, గుణము, వాయువు, రూపము, రసము అని జీవుడు నావాత్మకుడు. 

అంగష్ఠద్వయము నందు జీవుని, మిగిలిన వాటిని తర్జనిమొదలు వామప్రదేశిని వరకును విన్యసించవలెను. దహముపై, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాళ్ళు, పాదములు వీటిపై విన్యసించ వలెను. దశాత్మకు డగు ఈ జీవుడు వ్యాపకుడుగా చెప్పబడుచున్నాడు. 

అంగష్ఠద్వయమునందును, తర్జన్యాదులయందును, శిరోలలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, జాను, పాదములందును విన్యసించవలెను. 

మనః శ్రోత్ర, చక్షుర్‌, జిహ్వా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాద, పాయు, ఉపస్థరూపమున ఏకాదశాత్మరుడగు ఈ జీవుని శ్రోత్రమునందను, అంగుష్ఠ ద్వయము నందును, తర్జని మొదలు ఎనిమిదింటియందును, మిగిలిన తలద్వయమునందును విన్యసించవలెను. మనస్సు వ్యాపకము. 

అట్లే దేహముపై క్రమముగా శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, ఊరుద్వయ, జంఘా, (పిక్కలు) గుల్ఫ (చీలమండలు), పాదములపై విన్యసించవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 72 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

49. బుద్ధుడిని ఒకసారి ఎవరో అడిగారు. భవంతుడు ఉన్నాడా! ఉంటే ఆయనలో మీకు నమ్మకం ఉందా అని. అందుకు ఆయన, తనకేమీ తెలియదని జవాబు చెప్పడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడనే వాడు ఉన్నాడా లేదా అని విచారణ చేయలేదు. అసలు బుద్ధావతారంలోని రహస్యం ఇదే. 

50. ఆద్యంతములు – అంటే, బంధనహేతువయిన జన్మము, ముక్తి యొక్క లక్షణము – చెప్పాడేగాని, ఈ మధ్యన ఉండేటటువంటి ఈశ్వరుడిని ఆయన ప్రతిపాదనలోకి తీసుకోలేదు.(ఈశ్వరుడు వైదికికర్మకాండను ప్రతిపాదించే పూర్వమీమాంస లోనూ లేడు. అయితే వాళ్ళ అర్థం వేరు.)
బుద్ధుడు ఈశ్వరుడిని ప్రతిపాదించవలసివస్తే, ఆ ఈశ్వరుడు బ్రహ్మ వస్తువేఅవుతాడు మళ్ళీ. 

51. ఆ ఈశ్వరుడా? బ్రహ్మవస్తువా? వాటి విషయం కాక, మోక్షాంతం ఎట్లా అనేదే బుద్ధుడు మాట్లాడు. ముక్తి ఏది? అంటే, ఆధ్యాత్మికవస్తువు ఏదయితే ఉందో దానిని చేరుకోవటం ముక్తి. ఇది అంత్యవస్తువు. చిట్టచివరిస్థితి ఇది. 

52. సృష్టిలో బంధనహేతువు, అల్పత్వం అయిన ఇంద్రియలక్షణములు, మధ్యన ఉండేటటువంటి వేదవేదాంగములు, కర్మలు, అవి ఆరాధించే దేవతలూ, దేవతలకు మూలపురుషుడయినటు వంటి శ్రీహరి, త్రిమూర్తులు వీటన్నిటినీ బుద్ధుడు విమర్శించలేదు. 

53. అందుకనే భవంతుడి విషయం అడిగితే, మౌనం వహించాడు. పైగా తనకు తెలిసినదంతా కేవలం బంధనమే అను చెప్పాడు. అవిద్యా మూలకమైన మనుష్య జన్మ విషయం తనకు బాగా తెలుసునన్నాడు. అంటే ముక్తివిషమ్యం తనకు బాగా తెలుసునని ఆయన ఉద్దేశ్యం.

54. కాబట్టే మధ్యనఉండేటటువంటి ఈశ్వరుడిని ఆయన ప్రతిపాదించలేదు. వేదాలు, యజ్ఞాలు మొదలయిన వాటిని గురించి బుద్ధుడు విమర్శ చేయలేదు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆయన వేదములు తనకు ప్రమాణం కాదనే అన్నాడు. 

55. అంటే, మీ ప్రమాణబుద్ధిలో వేదములు ఏది చెపుతున్నాయని మీ ఉద్దేశ్యం, అని బుద్ధుడు బ్రహ్మణుల నడిగితే; వేదములన్నీ కర్మల కోసమే పుట్టాయి, వేదములు యజ్ఞం తప్ప మరొకటి చెప్పటమే లేదు అని వారి సమాధానం. మరొక విషయం ఏమిటంటే, “వేదములయొక్క ఉపయోగం యజ్ఞమే, యజ్ఞంచేయకపోతే వేదాన్ని వాడుకున్నట్లేకాదు. 

56. కాబట్టె వేదమే యజ్ఞం, యజ్ఞమే వేదం. రెండూ పరస్పర సంబంధం కలిగి ఉన్న వస్తువులు. వేదం యజ్ఞం కోసమే పుట్టింది. యజ్ఞం చేయమనే చెప్తోంది” అనికూడా ఆ బ్రహ్మణుల అభిప్రాయం. వేదము యొక్క పరమార్ధం ఇంకొకటి కాదా! అంటే, లేదనే వారి సమాధానం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 136 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 IT IS THE MIND THAT IMAGINES THAT IT DOES NOT KNOW AND THEN COMES TO KNOW..... 🌻*

All talk of ‘gnana’ (knowledge) is a sign of ignorance. It is the mind that imagines that it does not know and then comes to know. 

Reality knows nothing of these contortions. Even the idea of God as the Creator is false. Do I owe my being to another being? Because ‘I am’ all ‘is’.

My teacher told me to hold on to the sense ‘I am’ tenaciously and not to swerve from it even for a moment. I did my best to follow his advice and in a comparatively short time I realized within myself the truth of his teaching. All I did was to remember his
teaching, his face, his words constantly. 

This brought an end to the mind, in the stillness of the mind I saw myself as I am – unbound.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 75 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 Q 72 :-- పునర్జన్మ vs స్త్రీపురుషులు 🌻*

Ans :--
గతజన్మల చైతన్య పరిణామం జాగృదావస్థ లో మనకు ఎరుకలో ఉండదు.కానీ అనుభూతులు అంతర్ ప్రపంచంలో నిక్షిప్తం అయి ఉంటాయి.

2) ఆత్మ ఇప్పుడు పురుష జన్మ తీసుకుని ఉందనుకోండి, ఆ ఆత్మ విచక్షణ కోల్పోయి స్త్రీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందనుకోండి, అచేతనా స్థితిలో మనలో దాగి ఉన్న స్త్రీ జన్మ తాలూకూ చైతన్య శక్తి మనల్ని నియంత్రించడం జరుగుతుంది. అచేతనా స్థితిలో పురుషుడు స్త్రీ మూర్తిత్వ చైతన్యశక్తి వైపు గుంజబడతాడు. మరో వైపు చేతనావస్థలో పురుష జన్మ తాలూకూ చైతన్యశక్తి సంఘర్షణ వైపు గుంజబడుతుంది. ఈ సంఘర్షణ ద్వారా వచ్చే ఆలోచనలతో భౌతిక సంఘటనలు ఏర్పడతాయి.

3) చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మకు ప్రారంభదశలో లింగవిభజన తో కూడిన జన్మలు అవసరమవుతాయి. జన్మ పరిసమాప్తి పొందే దశలో లింగ విచక్షణ మటుమాయమవుతుంది. రాగద్వేషాలకు భూభౌతిక వాసనలకు వ్యామోహాలకు అతీతమైన స్థితిలో వుంటారు.

4) ఆఖరి జన్మలో స్త్రీ అయిన పురుషుడు గా జన్మించినా రెండు ఒక్కటే.ఆఖరి జన్మల్లో స్త్రే పురుష చైతన్య శక్తి ధర్మాలు రెండు కలిసిపోతాయి.

5) ఆఖరి జన్మల్లో ఉంటే సకల ప్రాణికోట్ల పట్ల ప్రేమ అనురక్తి ఉంటుంది. సకల జీవజాతులు పట్ల రాగద్వేషాలు మటుమాయమవుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 21 🌹*
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 9 🌻*

తూరుపు నుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది.

ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే. అణుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి.

ఇలా వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు. ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవడం మొదలై, జ్ఞానజ్యోతి ప్రజ్వరిల్లడం ప్రారంభం అయింది.

అచ్చమ్మ గారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది. ఆయనకు ఒక శిష్యగణం తయారైంది. తన శిష్యులకు, భక్తులకు జ్ఞాన బోధ చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టారు బ్రహ్మంగారు.

*🌻. అచ్చమ్మ కుమారుడికి దృష్టిని ప్రసాదించడం 🌻*

అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు. అతడి పేరు బ్రహ్మానందరెడ్డి. అతనికి అంధత్వం ఉండేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా అతనికి ఇక చూపు రాదనీ తేల్చి చెప్పారు వారు. అచ్చమ్మ బ్రహ్మంగారికి తన కుమారుడి విషయం చెప్పింది.

అతనికి పూర్వజన్మ ఖర్మం వల్ల చూపు పోయిందని ఆయన చెప్పారు. దృష్టి తెప్పించమని అచ్చమ్మ అడగగా, తగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటివరకూ ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు.

ఒకసారి అన్నాజయ్య అనే దైవభక్తిపరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు. ఆయనకు తన కాలజ్ఞానం వినిపించాలని నిర్ణయించుకున్నారు.

ఇది పూర్తయిన తర్వాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచారు. ”తల్లీ, నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టి కోల్పోవడానికి కారకుడయ్యాడు కాబట్టే, ఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదించగలను” అన్నాడు.

తర్వాత బ్రహ్మానందరెడ్డిని పిలిచి అతని నేత్రాలను స్పృశించారు. బ్రహ్మానందరెడ్డికి అప్పటినుంచి కళ్ళు మళ్ళీ కనబడటం ప్రారంభమైంది.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 4 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*

*🌻 STANZA I - The Genesis of Divine Love - 4 🌻*

9. Evil had appeared in the world for the first time. The Sun was unable to discern what was going on beneath the thick crowns of giant trees. These effectively concealed evil, which had managed to steal in surreptitiously. 

The All-Seeing Eye of the Sun partially lost its power, for he could not illuminate the hidden back side of the Earth.

10. The condensation of Matter came to the end of its tether. Billions of years had passed, and human souls were still similar to stones... How could they have become so callous and impenetrable? It was a difficult question to answer! 

They had become acquainted with evil, who was already rotating his black wheel of time in full swing, standing just beyond the border of the Light. 

While, on the reverse side, the darkness was trying to obscure the whole of the Light so as to transform him into gloom. But for that she needed some assistance from earthlings.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 15 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 3 🌻*

శుభము కల్గించుచు మోక్షమును కలుగజేయునది శ్రేయోమార్గమనబడును. లౌకిక సుఖములను కలిగించు స్త్రీ ధనాదులను అనుభవింపజేయునది ప్రేయోమార్గము. 

విషయాదుల ననుభవించు సుఖముగానున్నట్లు తోచి చివరకు దుఃఖమును కలుగజేయునది ప్రేయోమార్గము. మొదట కష్టముగ నున్నట్లుండి చివరకు శాశ్వత సుఖమును కలుగజేయునది శ్రేయోమార్గము. 

కనుక శ్రేయోమార్గము ననుసరించువారికి శాశ్వత సుఖము లభించును. ప్రేయోమార్గము ననుసరించువారు శాశ్వత సుఖమునకు దూరులై దుఃఖముల పాలగుదురు. కావున విజ్ఞులగువారు శ్రేయోమార్గమునే అనుసరించెదరు.  
  
    ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలనే మరల పునరుద్ఘాటించారు. ఈ శ్రేయోమార్గములో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమధి అనే అష్టాంగ విధి ఇమిడ్చి వుంటుంది. 

నాయనా! నువ్వు రోజులొ నాలుగు సంధ్యలలో తప్పక ఉపాసనా మార్గమును, తప్పక జపాన్ని, తప్పక తపస్సుని, తప్పక ధ్యానాన్ని, తప్పక నువ్వు ఆచరించాలి అనే నియమము విధి ఏర్పాటుచేయబడింది. 

అదే ప్రేయోమార్గమనుకోండి హాయిగా ఎనిమిదింటిదాకా పడుకోవచ్చు అన్నారనుకోండి ఏమైందప్పుడు? ఈ రెండింటిలో దేనికి మనస్సు మొగ్గు చూపుతుంది? 

తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి, ఐదుగంటలకల్లా సిద్ధమయ్యి, షోడశోపచారపూజ పూర్తిచేసుకుని సూర్యోదయాత్ పూర్వమే కర్మసాక్షి అయినటువంటి సూర్యుని ఆశ్రయించి, సాక్షిత్వ భావాన్ని అందుకోవడానికి ఆ సంధ్యాసమయాన్ని, ఆ ప్రదోషకాలాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో, వారికి మహేశ్వరుని గణములందరూ కూడా సహాయము చేస్తారు. ఏకాదశరుద్రులు సహాయం చేస్తారు. ద్వాదశ ఆదిత్యులు సహాయంచేస్తారు. మరి అశ్వనీదేవతలు సహాయం చేస్తారు. 

ఇంతమంది ఇంద్రియాధిష్ఠాన దేవతలందరూ కూడా ఆయా సంధ్యా సమయములందు ఎవరైతే పూజిస్తూ వుంటారో, దైవీభావనతో జీవిస్తూ వుంటారో, తపస్సుయందు నిమగ్నమై వుంటారో, ఆంతరిక సాధనలయందు నిమగ్నమై వుంటారో, అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధులై వుంటారో, అధికారిత్వాన్ని కలిగి వుంటారో, ఆ రకమైన వారందరినీ గమనిస్తూ వారియందు సద్భుద్ధిని ప్రేరేపించి, చిత్తశుద్ధిని కలిగించి స్వీయ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందించడానికి కావలసినటువంటి నైర్మాలిన్యాన్ని, నిర్మలత్వాన్ని నీకు అందిస్తారు. ఆ సంధ్యాకాలంలో అంత విశేషమున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాయి తత్వం - మానవత్వం - 59 / Sai Philosophy is Humanity - 59 🌹*
🌴. అధ్యాయము - 8 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. బాయి జాబాయ యొక్క ఎవలేని సేవ 🌻*

1. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని, సమీపముననున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్కచేయక క్రోసులకొద్ది దూరమునడచి, ఆత్మధ్యానములో నిశ్చలముగ యెక్కడో కూర్చునియున్న బాబాను వెదకి పట్టుకొని, భోజనము పెట్టుచుండెను.

2. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, వారి యెదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి, కొసరికొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను.

3. ఆమె భక్తివిశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు.

4. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలును యెంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను.

5. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి.

6. అప్పటినుంచి పొలములో తిరిగి బాబాను వెతకిపట్టుకొను శ్రమ బాయజాబాయికి తప్పినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sai Philosophy is Humanity - 59 🌹*
Chapter 8
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

🌻 Bayajabai's Brilliant Service 🌻

Tatya Kote's mother, Bayajabai, used to go to the woods every noon with a basket on her head containing bread and vegetables. 

She roamed in the jungles koos (about 3 miles) after koss, trampling over bushes and shrubs in search of the mad Fakir, and after hunting Him out, fell at His feet. 

The Fakir sat calm and motionless in meditation, while she placed a leaf before Him, spread the eatables, bread, vegetables etc. thereon and fed Him forcibly. Wonderful was her faith and service.

 Every day she roamed at noon in the jungles and forced Baba to the partake of lunch. Her service, Upasana or Penance, by whatever name we call it, was never forgotten by Baba till his Maha Samadhi. 

Remembering fully what service she rendered, Baba benefited her son magnificently. Both the son and the mother had great faith in the Fakir, Who was their God. 

Baba often said to them that "Fakir (Mendicacy) was the real Lordship as it was everlasting, and the so called Lordship (riches) was transient". 

After some years, Baba left off going into the woods, began to live in the village and take His food in the Masjid. 

From that time Bayajabai's troubles of roaming in the jungles ended.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹