కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 18

Image may contain: 1 person, standing and shoes
🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 18 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 6 🌻

ఈ రకంగా వస్తు సముదాయ భ్రాంతి ఎందువల్ల ఏర్పడింది అంటే ఆ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. ఈ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. నా సుఖమునకు ఈ వస్తువు చాలా అవసరం అనేటటువంటి పరుగులాట బాగా బలంగా వుంది.

ఇంకేమున్నదీ అంటే ఆ వస్తు సముదాయాన్ని పొందటానికై ధన సముపార్జన, ధన సేకరణ, ధనమును దాచుకొనుట, ధనమును దోచుకొనుట. ఈ రకంగా క్రమాంతరమున గుణధర్మంలో పతనం చెందుతూ వస్తాడు.

ఎంతగా ధనము దాచుకోవాలని ప్రయత్నిస్తావో, అంతగా ధనమును దోచుకొనాలనేటటువంటి ప్రయత్నం కూడా దాని వెనకనే నీడవలె బలపడిపోతూ వుంటుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే!

“శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం”. అసలు ఈ శరీరమే ఒక వస్త్రము. ఇది ధర్మమార్గంలో నడవడం కోసం, జీవనాన్ని నడపడం కోసం, ధర్మమునకు లక్ష్యమైనటువంటి పరము ఏదైతే వుందో ఆ మోక్ష మార్గంలో ప్రవేశించడంకోసం ఈ శరీరమనేటటువంటి పనిముట్టుని వాడుకోవాలి.
ఐహికమైనటువంటి అంశాలయందు ఎవరికైతే విరమణ వుంటుందో ఎవరికైతే ఉపరతి వుంటుందో ఎవరికైతే తితీక్ష వుంటుందో ఎవరికైతే ఉదాసీనత వుంటుందో వారు మాత్రమే శ్రేయోమార్గమైనటువంటి ఆత్మజ్ఞాన విచారణలో పరమును సాధించేటటువంటి పద్ధతిగా తీవ్ర మోక్షాపేక్షతో తీవ్ర వైరాగ్యంతో అధికారిత్వాన్ని సాధిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి జీవన విధానం. జ్ఞానమార్గంలో ప్రవేశించాలి అంటే తప్పక ప్రతిఒక్కరూ కూడా తీవ్ర వైరాగ్యనిష్ఠని కలిగివుండాలి.

జ్ఞానమార్గంతో నాకు పనిలేదండి, నాకు కర్మమార్గంతోనే పని అన్నావనుకో ఇహపరములు రెండింటినీ ఒక్కసారే సాధించాలనేటటువంటి భ్రమ భ్రాంతిలో పడతావు.

దేనికి ఎప్పుడు అవకాశం వస్తుందో, దేనికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో, దేనిని ఎప్పుడు తగ్గించుకోవాలో, దేనిని ఎప్పుడు ఆశ్రయించాలో - సరియైన జ్ఞానం ఆ కర్మ మార్గంలో వుండదు. ప్రతిచోటా రెండు రెండు మార్గాలని కర్మమార్గం చూపిస్తుంది.

వాటిలో ప్రతిఒక్కరూ తప్పక ఆ ప్రేయోమార్గంలోనే పడిపోతాడు. ఎట్లా అయితే మిడత దీపాన్ని చూసి, శలభము దీపాన్ని చూసి ఆహారమని భ్రమశి, భ్రమశి ఏమి చేస్తుంది? దగ్గరికి వెళ్ళి ఆ మంటమీద పడుతుంది. పడగానే దాని రెక్కలు కాలిపోతాయి. కాలిపోగానే అక్కడే విరిగి పడిపోతుంది. తన జీవితాన్ని ముగిస్తుంది.

మానవుడు కూడా ఇటువంటి విషయసక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, అట్టి విషయములే సుఖమునిస్తాయనే భ్రాంతికి గురవుతూ అట్టి శలభము వలే మిడతవంటి జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు.

Twelve Stanzas from the Book of Dzyan - 7

Image may contain: 1 person, night
🌹 Twelve Stanzas from the Book of Dzyan  - 7 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴 

🌻 STANZA II -  The Knowledge of the Heart - 2 🌻

15. The Sun was shining. Keeping a close watch on human Hearts, he tried to nourish them with Fires in a bid to reinforce the power of Life. Life herself was the gift of the Light, for without him, she could not be conceived. Would this world even exist if there were no Sun? 
He gave the Light, and it was in the rays of Light that Life had spread her Immortal Wings. Yes, Life was immortal, for she was the forever companion of the Light, who did not know death. Life and the Light were One.

16. The Heart, woven out of Light, belonged to Life. The most delicate particles of condensed Matter were used in its formation. The Heart’s secret was that it could not live without Love. 
Only Love’s energizing currents could wind the hidden mainspring therein — the spring that allowed the Wheel of Life to rotate. The Heart without Love was dying away, losing its life-force, even turning to stone.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 78

Image may contain: 1 person, standing
🌹. మనోశక్తి  - Mind Power  - 78 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 75:-- మానవుడు vs జంతుజాతి 🌻
Ans :--
1) భూమిని ఒక చెట్టుతో పోలిస్తే మానవజాతిని వేర్లుగానూ, ఇతర జీవజాతుల్ని చెట్టులోని ఇతర భాగాలతో పోల్చవచ్చు.

2) చెట్టులోని ఏ భాగానికి హాని జరిగినా ఆ బాధ చెట్టంతా భరించాల్సి ఉంటుంది. చెట్టులోని ఒక వేరుని నరికి వేసిన చెట్టుకి నష్టం వాటిల్లుతుంది.

3) భూమి మీద మానవుడు నేటి సమాజంలో అగ్రభాగాన వున్నాడు, అలాగని అతడికి భూమి మీద ఏ జీవజాతిని చంపే అధికారం లేదు.
మానవుడు ఏ జీవాత్మ ను చంపినా భూమి యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ ని అందుకోలేడు.

4) జీవహింసకు పాల్పడేవాడు దేవుని మార్గంలోకి ప్రవేశించలేడు, మనం ఒక జీవాత్మను చంపితే మనల్ని మనమే దెబ్బతీసుకున్నట్టు అవుతుంది.

5) జీవహింస వల్లే మతవిద్వేషాలు యుద్ధాలు పేరిట మానవజాతి ఒకరిని ఒకరు చంపుకుంటుంది. అంటే చెట్ల వేర్లు తెగిపోతున్నాయి. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుడిదే. 
ఎప్పుడైతే మానవుడు జీవహింస మానివేస్తాడో అప్పుడే పురోగతి ని సాధిస్తాడు.
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 13 / Sri Gajanan Maharaj Life History - 13

Image may contain: 1 person
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 13  /  Sri Gajanan Maharaj Life History - 13 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 3వ అధ్యాయము - 3 🌻

సచ్చిదానందుడిని జ్ఞానేశ్వర్ పునర్జీవిని చేసారు. అదేవిధంగా జానరావోను శ్రీగజానన్ చెయ్యగలరని వారినమ్మకం. అందువల్ల, శ్రీగజానన్ నివసించే బనకటలాల్ ఇంటికి జానరావ్ బంధువు ఒకరు వెళ్ళి, జానరావ్ వృత్తాంతం బనకటలాలకు వర్నించి, శ్రీగజానన్ పాదతీర్ధం జానరావుకు ఇచ్చేందుకు ఇవ్వ వలసిందిగా వేడుకుంటారు. 

తన తండ్రి అయిన భవానీరాం అనుమతితో ఒక గ్లాసునీళ్ళు శ్రీమహారాజు కాలికి తగిలించి, ఇది తీర్ధంగా జానరావుకు ఇస్తున్నామని దానికి శ్రీగజానన్ సమ్మతించగా బనకటలాల్ ఆతీర్ధం జానరావు కొరకుఇస్తాడు. అది త్రాగుతూనే జానరావుకు తెలివివస్తుంది. 

ఆతరువాత క్రమేణా జబ్బునుండి కోలుకున్నాడు. ఔషదాలన్నీ ఆపివేసి జానరావుకు శ్రీమహారాజు పాదతీర్ధం రోజూఔషదంగా ఇచ్చారు. జానరావు ఒక వారంరోజులకు పూర్తిగా కోలుకున్నాకా, భవానిరాం ఇంటికి వెళ్ళి శ్రీగజానన్ మహారాజు దర్శనం చేసుకున్నాడు. 

శ్రీమహారాజు పాదతీర్ధం అమృతంలా పనిచేసింది ఎందుకంటే ఈకలియుగంలో, ఈ యోగులే భగవంతులు. ఈవిధంగా జరగడంతో, శ్రీగజానన్ షేగాంలో ఉన్నంతవరకు ఎవరూ చనిపోరాదని ఎవరయినా అనవచ్చు. కానీ ఈతర్కంసరికాదు. యోగులు ప్రకృతిని వ్యతిరేకించరు, మరియు మృత్యువును ఆపరు.

అసహజము లేదా ఆకస్మిక మృత్యువును వీరు తప్పించగలరు. శ్రీజ్ఞానేశ్వర్, శ్రీసచ్చిదానందుని మృత్యువును నవాషాలో నిరోధించారు. తరువాత శ్రీసచ్చిదానందుడు అళందిలో మరణించవలసివచ్చింది. 

యోగులకు ఈవిధమయిన ఆకస్మిక మరియు అసహజ మృత్యువును పసికట్టడం కష్టంకాదు. మృత్యువులు మూడువిధాలుగా ఉన్నాయి: 

1. ఆధ్యాత్మిక కారణంవల్ల - సహజ లేదా ప్రారబ్ధంవల్ల 

2. ఆదిభౌతిక కారణంవల్ల - జీవన సరళి వలన . 

3. ఆదిదైవిక కారణంవల్ల - ఆకస్మిక లేదా అసహజ కారణంవల్ల. 

ఈమూడింటిలో మొదటిది చాలా శక్తివంతమైనది మరియు ఎవరూ ఆపసక్యంకానిది. 

రెండవది ఆదిభౌతిక మృత్యువు చెడు అలవాట్లు, క్రమశిక్షణలేని జీవన సరళి వల్ల శరీరంలో అనేకరోగాలు వల్ల వచ్చేది. మంచివైద్యుని సహాయంతో దీనిని ఆపవచ్చు. 

మూడవది ఆదిదైవిక మృత్యువు. యోగుల ప్రార్ధన మరియు ఆశీర్వచనాలవల్ల ఆపవచ్చు. ఇందులో మరల రెండువిధాలుగా చెయ్యవచ్చు. 1. భౌతిక - జీవనసరళి 2. దైవిక - భగవంతుని అప్రియతవలన ఆధ్యాత్మిక మృత్యువును ఎవరూ నిరోధించలేరు.

అర్జునుడు కుమారుడు అయిన అభిమన్యుడు స్వయానా శ్రీకృష్ణుని ఎదుట చనిపోయాడు. జానారావు మృత్యువు అసహజమయినది కనుక శ్రీగజానన్ మహారాజు నిరోధించారు. భగవంతుని మీద ధృడవిశ్వాసంతో ఆయనకు మొక్కుకుంటేకొన్ని మృత్యువులను తప్పించవచ్చు. 

ఈవిశ్వాస బలమే అసహజ మృత్యువును ఆపుతుంది. ఇదేమృత్యువు, జీవితంలో ఆరు అవలక్షణాలను జయించిన యోగుల పాదతీర్ధం వలన కూడా ఆపవచ్చు. నిజమయిన యోగికి పూర్తిగా అర్పించుకోవాలేతప్ప, అందరూ కపటి సన్యాసుల నుండి దూరంగా ఉండాలి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 13 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - part 3 🌻

Shri Dnyaneshwar brought Sachhidananda back to life, and the same can be done by Shri Gajanan for Janrao. So one of the relatives went to the house of Bankatlal, where Shri Gajanan was staying, and narrating the whole story of Janrao requested him to give Pada Tirtha of Shri Gajanan which they would give to Janrao Deshmukh. 

Shri Bankatlal with the permission of his father Bhavaniram, took a glass of water touched it to the feet of Shri Gajanan Maharaj and told Him that the Tirtha was being given to Janrao Deshmukh. Shri Gajanan Maharaj gave His consent. 

Thereafter the Tirtha was given to Janrao Deshmukh who immediately regained consciousness and thereafter slowly recovered from the illness. All the medicines were stopped and Janrao was kept on a daily dose of the Tirtha from the feet of Shri Gajanan Maharaj . 

He gained his normal health within a week and went to Shri Bhavaniram’s house for the Darshan of Shri Gajanan Maharaj. Look, the water from the feet of Shri Gajanan Maharaj had the effect of life saving nectar. 

This is so because the saints are the God incarnates in Kalyuga. With such a happening one may say that nobody should die in Shegaon as long as Shri Gajanan Maharaj is there. 

This statement, however, is not logical. Saints do not prevent death, nor do they behave against the laws of the nature. But they can avoid death if it is unnatural or accidental. Shri Dnyaneshwar avoided the death of Shri Sachhidananda at Newasha, but the same Sachhidananda later on had to die at Alandi. 

That means, the saints can check unnatural or accidental death and it is not at all difficult for them.

There are three types of deaths namely, Adhyatmic (subjective) meaning natural or destined, Adhibhoutic (Phenomenal) meaning by material effects and Adhidaivic (God sent) meaning accidental or un-natural. 

Of these three, the first, Adhyatmic, is most powerful and nobody can avoid it. The second i.e. Adhibhoutic is the result of bad eating and living habits and an undisciplined lifestyle which gives rise to various diseases in the body. 

This type of death, however, can be averted with the help of a competent doctor. The third i.e. Adhidaivic can be prevented by prayers and blessings of Saints. This category is further divided into two types: Bhoutic, caused by material effects, and Daivic, caused by the displeasure of God. Adhyatmic i.e. the natural death cannot be prevented by anybody.

Remember that Abhimanyu, the son of Arjuna, died in the presence of Shri Krishna Himself. Janrao’s death was of an unnatural type and so could be prevented by Shri Gajanan Maharaj. 

Some deaths can be averted by vows of offerings to God. But they should be taken with full faith in the Almighty. In fact it is the strength of the faith involved that works to prevent the unnatural type of death. 

This sort of death can also be avoided by the Pada Tirtha of a saint who is pious and free from the six hostile forces of life. One should surrender to a real saint and keep away from the hypocrites.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 21 / The Siva-Gita - 21

Image may contain: 1 person
🌹. శివగీత  - 21  / The Siva-Gita - 21 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 5 🌻

అగస్త్య ఉవాచ:-
శుక్ల పక్షే చతుర్దశ్యా - మష్టమ్యా వా విశేషతః,
ఏకా దశ్యాం సోమవారే - ఆర్ద్రాయాం వా సమర భేత్ 20

అగస్త్యుడు నుడుపు చున్నాడు: -
శుక్ల పక్షము చతుర్దశి యందు గాని ,లేదా అష్టమి యందును గాని,
 అధవా ఏకాదశి యందు గాని లేదా ఆర్ద్రా నక్షత్ర యుక్త సోమవారమందు గాని యీ పాశుపత వ్రతమును ప్రారంబించ వలెను.

యం వామ మాహుర్యం రుద్రం -శాశ్వతం పరమేశ్వరమ్,
పరాత్పరం పరం బాహుం - పరాత్పర తరం శివమ్ 21

బ్రహ్మాణాం జనకం విష్ణో ర్వహ్నే - ర్వాయో స్సదాశివమ్,
ద్యాత్వాగ్ని నావ సధ్యాగ్నిం - విశోద్యచ పృధ క్ప్రుధక్. 22

పంచ భూతాని సం యమ్య - దగ్ద్వా గుణ విధి క్రమాత్,
మాత్రాః పంచ చత స్రశ్చ - త్రిమాత్రా ద్విస్తతః పరమ్ 23

ఏక మాత్ర మమాత్రం చ - ద్వాదశాం తవ్య వస్తితమ్,
స్థిత్యాం స్థాప్యా మృతో భూత్వా - వ్రతం పాశుపతం చరేత్. 24

ఏ దేవుడి ని రుద్రుని గాను, పరమేశ్వరుని గాను, పరాత్పరు ని గాను, శివుని గాను, విష్ణ్వగ్ని వాయువులకు - 

జన్మ నొసంగిన వానిన గాను ఏ పెద్దలు అంగీకరించుచున్నారో అటువంటి భగవంతుని మొట్ట మొదట  ధ్యానించి వహ్నిని బూజించి పంచ భూతంబు లను నియమించి 
పంచ చతుస్త్రి ద్వైక (ఐదు- నాలుగు - మూడు - రెండు -ఒకటి ) మాత్రల చేత నైన గాని, ఆ మాత్రగ నైనా గాని,  ద్వాద శ్వాంత స్థితుండై యమృతం డై యీ పాశుపత  వ్రతము ననుష్టించవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 21 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga - 5 🌻

The Lord whom scriptures call as Rudra, Parameshwara (greatest lord), Paratpara (higher than the highest), Shiva (auspicious), the father of Vishnu, Agni, Vayu kind of gods; that bhagawan Sadashiva has to be meditated upon. 

Then one should worship the fire, and subdue the five elements. 

One should follow this Pashupata penance by following the mantras of any of the type called 'Pancha chatushtridwaika' (five­four­three­two­one).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

4-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 448 / Bhagavad-Gita - 448🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 236 / Sripada Srivallabha Charithamrutham - 236🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 116🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 138🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 52 / Sri Lalita Sahasranamavali - Meaning - 52 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 55 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 23 🌹
8) 🌹. శివగీత - 20 / The Shiva-Gita - 21🌹
9) 🌹. సౌందర్య లహరి - 62 / Soundarya Lahari - 63🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 362 / Bhagavad-Gita - 362🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 188🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 64 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 60🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 75 🌹
15) 🌹 Seeds Of Consciousness - 138 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 78 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 24🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 7 🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 18🌹
19) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 3 🌹
20) 🌹 Seeds Of Consciousness - 140🌹
21)  🌹. Balance Your Thoughts and Actions 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 448 / Bhagavad-Gita - 448 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -03, 04 🌴*

03. యే త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచిన్త్యం చ కూటస్థమచలం ద్రువమ్ ||

04. సన్నియమ్యేన్ద్రియగ్రామాం సర్వత్ర సమబుద్ధయ: |
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతా: ||

🌷. తాత్పర్యం : 
ఇంద్రియాతీతమును,సర్వవ్యాపకమును, అచింత్యమును, మార్పురహితమును, స్థిరమును, అచలమును అగు అవ్యక్త తత్త్వమును (పరతత్త్వపు నిరాకార భావనను) సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వల యెడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైనవారు సైతము అంత్యమున నన్ను పొందుదురు.

🌷. భాష్యము : 
దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా పూజింపక అదే గమ్యమును పరోక్షమార్గమున సాధింప యత్నించువారు సైతము అంత్యమున ఆ పరమగమ్యమైన శ్రీకృష్ణుని చేరగలరు. “బహుజన్మల పిదప జ్ఞానియైనవాడు వాసుదేవుడే సర్వస్వమని తెలిసి నన్ను శరణువేడుచున్నాడు.” అనగా బహుజన్మల పిదప సంపూర్ణజ్ఞానము ప్రాప్తించనంతనే మనుజుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చును. ఈ శ్లోకమునందు తెలుపబడిన విధానము ద్వారా మనుజుడు దేవదేవుని చేరగోరినచో ఇంద్రియనిగ్రహము కలిగి, సర్వులకు సేవను గూర్చుచు, సర్వజీవుల హితకార్యములందు నియుక్తుడు కావలసియుండును. అనగా ప్రతియొక్కరు శ్రీకృష్ణుని దరిచేరవలసియున్నదనియు, లేని యెడల పూర్ణానుభావమునకు ఆస్కారమే లేదనియు గ్రహింపవచ్చును. అట్టి భగవానునికి శరణాగతిని పొందుటకు పూర్వము మనుజుడు తీవ్రతపస్సును నొనరించవలసియుండును.
జీవహృదయస్థుడైన పరమాత్మను గాంచుటకై దర్శనము, శ్రవణము, ఆస్వాదనము, కర్మముల వంటి ఇంద్రియపరకర్మల నుండి మనుజుడు విరమింపవలెను. ఆ సమయముననే పరమాత్ముడు సర్వత్రా కలడనెడు అవగాహనకు అతడు రాగలడు. ఈ సత్యదర్శనము పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్యతొడుగును గాక ఆత్మను వీక్షించుచుండుటచే మానవునికి, జంతువునకు నడుమ భేదమును గాంచడు. కాని ఇట్టి నిరాకారానుభవ విధానము సామాన్యునకు అత్యంత కఠినమైనది.

*🌹 Bhagavad-Gita as It is - 448 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 03, 04 🌴*

03. ye tv akṣaram anirdeśyam
avyaktaṁ paryupāsate
sarvatra-gam acintyaṁ ca
kūṭa-stham acalaṁ dhruvam

04. sanniyamyendriya-grāmaṁ
sarvatra sama-buddhayaḥ
te prāpnuvanti mām eva
sarva-bhūta-hite ratāḥ

🌷 Translation : 
But those who fully worship the unmanifested, that which lies beyond the perception of the senses, the all-pervading, inconceivable, unchanging, fixed and immovable – the impersonal conception of the Absolute Truth – by controlling the various senses and being equally disposed to everyone, such persons, engaged in the welfare of all, at last achieve Me.

🌹 Purport :
Those who do not directly worship the Supreme Godhead, Kṛṣṇa, but who attempt to achieve the same goal by an indirect process, also ultimately achieve the same goal, Śrī Kṛṣṇa. “After many births the man of wisdom seeks refuge in Me, knowing that Vāsudeva is all.” When a person comes to full knowledge after many births, he surrenders unto Lord Kṛṣṇa. 

If one approaches the Godhead by the method mentioned in this verse, he has to control the senses, render service to everyone and engage in the welfare of all beings. 

It is inferred that one has to approach Lord Kṛṣṇa, otherwise there is no perfect realization. Often there is much penance involved before one fully surrenders unto Him.

In order to perceive the Supersoul within the individual soul, one has to cease the sensual activities of seeing, hearing, tasting, working, etc. Then one comes to understand that the Supreme Soul is present everywhere. 

Realizing this, one envies no living entity – he sees no difference between man and animal because he sees soul only, not the outer covering. But for the common man, this method of impersonal realization is very difficult.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 236 / Sripada Srivallabha Charithamrutham - 236 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 45
*🌻. అశ్వాల వ్యోమ యానం 🌻*

మేము ఇచ్చిన శ్రీపాదులవారి పాదుకలను భాస్కర పండితులు పూజామందిరంలో పెట్టారు. వాటిపైన వేసిన అక్షతలు వృద్ధి పొందసాగాయి. 

మేమిద్దరం అది చూసి ఆశ్చర్య పడుతుంటే ఆ రోజు ఉత్తరాఫల్గునీ నక్ష్తత్రమని, శ్రీనివాసుల కళ్యాణం ఆ నక్షత్రంలోనే జరిగిందని, తాము సాక్షాత్తు పద్మావతీ సమేత వేంకటేశ్వరులని తెలపడానికే శ్రీపాదులు ఈ లీల చేసారని చెప్పి భాస్కర పండితులు మాకు కొన్ని మంత్రాక్షతలు ఇచ్చారు. 

మేము మా ప్రయాణం సాగించాము. కొంతదూరం ఎడ్లబండిపై వెళ్ళాం, వాళ్ళకి కొన్ని మంత్రాక్షతలు ఇచ్చాము. తరువాత కొండవీడు వెళ్తున్న గుఱ్ఱపు బండిలో ఎక్కి. వాళ్ళకి కూడా కొన్ని మంత్రాక్షతలు ఇచ్చాము. ఆ బండి ఆసామి వైశ్య ప్రముఖులు అయిన ధనగుప్తులు. కొండవీడులో జరుగ బోతున్న కుమారుని వివాహానికి వాళ్ళు వెళ్లుతున్నారు. వారు మాతో ఇలా చెప్పారు,

*🌻.. ధనగుప్తుల అనుభవాలు 🌻*

"నేనొకసారి వ్యాపారపు పనిమీద పీఠికాపురానికి వెళ్ళాను. అక్కడ శ్రీపాదులను కలిసాను, వారు నాతో," నీ కుమారుని వివాహ సందర్భంలో మీకు నా ఆశీసులతో అక్షతలు ఇస్తాను. 

ఎవరిద్వారా అక్షతలు మీకు లభిస్తాయో ఆ బ్రాహ్మ ణునికి 11 వరహాలు దక్షిణగా ఇవ్వండి, అతనితో ఉన్న వైశ్య ప్రముఖుని కుమారునికి మీ కుమార్తెను ఇచ్చి వివాహం చేయండి, వారికి 100వరహాలు ఇచ్చి కొండవీడులో నిశ్చయ తాంబూలాలు తీసుకోండి," అని చెప్పారని తెలియజేసారు. ధనగుప్తులవారి కుటుంబాన్ని కూడా కొండవీడు వివాహా నికి ఆహ్వానించారు. అక్కడే ధర్మగుప్తుల కుమారునికి ధన గుప్తుల కుమార్తెతో నిశ్చయ తాంబూలాలు జరిగాయి. 

నాకు 11, ధర్మగుప్తులకి 100 వరహాలు ఇచ్చారు. వజ్రాలకు సంబంధించిన వ్యాపారం కోసం ధర్మగుప్తులు అక్కడే ఉండి పోయారు, నన్ను గుఱ్ఱపు బండిలో విజయవాటిక పంపి వాళ్ళ బంధువుల ఇంట్లో బస ఏర్పాటు చేసారు. కృష్ణా నదిలో స్నానం చేసి దుర్గాదేవి దర్శనానికి వెళ్ళాను. అక్కడ శ్రీపాదుల దర్శనానికై తహతహలాడుతున్న ఒక వృద్ధ సన్యాసి కలిసారు. 

ఈ మారు నేను, ఆ వృద్ధ సన్యాసి పీఠికాపుర ప్రయాణం మొదలుపెట్టాం. దారిలో రాణ్మహేంద్రవరంలో గోదావరిలో స్నానం చేసి మార్కండేశ్వరుని, కోటిలింగేశ్వరుని దర్శిం చాము. 

కొద్దిరోజుల ప్రయాణం తరువాత పీఠికాపురం చేరుకొన్నాము. సత్యఋషీశ్వరులైన బాపనార్యుల ఇంట్లో బస చేసి, ఆ నాల్గు కుటుంబాలవారినుండి, ఇతరుల నుండి శ్రీచరణుల లీలలు ఎన్నో విన్నాం. వారి లీలల్ని వర్ణించ డానికి వేయి నాల్కలున్న ఆదిశేషువుకే సాధ్యం కానపుడు నాబోటి వారెంత? కొన్ని కొన్ని లీలలను మాత్రమే గ్రంథస్థం చేస్తున్నాను.  

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 236 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 25
*🌻 Description of Rudrakshas - 2 🌻*

Sripada has incorporated into his ‘chaitanyam’ the tatwa (philosophy) of Ganeswara who is the lord of all ‘Pravrithi’ and ‘Nivruthi’ ganas.  

So he is the divine form of 33 crores of Gods combined. Moreover without  His will, not even one atom or sub atom will be able to move. He is the ‘kaarana’ roopam (cause) and the source of all movements.  

He is the cause of all causes. If He is thought of as Siva form, He will appear as Vishnu. He will appear as Siva, if thought of as Vishnu. If we reduce our tendencies of argument, and surrender to Him, He will show His real form.”  

Thus he told me different types of Shiva worship, things related to rudrakshas and many other things, and said that he would also come with me to Kurungadda to have darshan of Sripada with an intention to fulfil his life. We both came to Kurungadda and had darshan of Sripada Srivallabha Guru Sarvabhouma.  

He opened His eyes from yoga nidra and said, ‘Oh! What discussions! What discussions! There is a person called Sripada! He is Siva Swaroopa! Am I Sripada or Sripada had come as  ‘I’. Who am I really? Sir! Dharma Gupta! Please explain a little.’   

Dharma Gupta told Sripada ‘Swami! When I started for Sri Mahaguru’s darshan from Peethikapuram, my brother-in-law Venkatappaiah Shresti told me.’ ‘Don’t fall into ‘ajnana’ by arguing with Sripada. Merely surrender to Him and receive His grace.’ So, I will only keep quiet to all your questions.  

When Vedas also kept quiet unable to explain your philosophy, who am I to attempt? What is my knowledge?’ Sripada was pleased. He told me and  Dharma Gupta to pay obeisance to His feet. 

Immediately after touching His feet, we lost consciousness and stayed in dhyana for a long time. It was becoming evening ‘sandhya’. Sripada  told us to start from Kurungadda and  go to the other side of Krishna.  

We did that. Myself and Dharma Gupta spent time in the night with narrations of Sripada’s divine leelas. It can not be said that His leelas will be like this or that.  

We lay down to sleep. We heard a sweet voice from somewhere. Some yogis were chanting the name ‘Sripada Srivallabha Digambara’.

 End of Chapter 25

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 116 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 1 🌻*

లోకము అంటే చూపు అని అర్థము. మనము జగత్తును ఎలా చూస్తే, ఆ లోకంలో మనం ఉంటాము. ఉదాహరణకు లోకమంతా చెడిపోయినట్లు మనం చూస్తే, మనము చెడిపోవడం జరుగుతుంది. లోకంలో మంచిని చూస్తుంటే మనం మంచి వారమే అవుతాం. 

ఇంతకూ లోకంలో వ్యక్తుల స్వభావం అనేది వారిని గూర్చి మన అభిప్రాయం మాత్రమే సన్నివేశాలను, వ్యక్తులను గూర్చి నచ్చినవారు, నచ్చనివారు అంటూ మనకు రెండురకాల ముద్రలు ఏర్పడతాయి. ఈ ముద్రలతో కూడిన స్థితినే సంసార స-ముద్రమంటారు‌ రాగద్వేషాత్మకములయిన ముద్రలు మనకు సుఖదుఃఖాలను ఇస్తుటాయి‌. మన ప్రజ్ఞ వీని ఆటుపోటులకు లోనై శాంతిని కోల్పోతుంది. 

పాడయిన ఈ లోకమును ఉద్ధరించాలనే అభిప్రాయాలు మొలకెత్తుతాయి‌. మనకు మనమే లోకోద్ధరణ అనే బరువును నెత్తిన వేసికొంటాం‌‌. మనం ఇతరులకు ఏది మంచి అనుకుంటామో దాన్ని వారిపై రుద్దుతాం. అయితే ఇతరులు వారి వారి పరణామదశలు, స్వభావాలను బట్టి స్పందిస్తుంటారు. 

ఈ విధానములో ఒక స్థితిలో ఘర్షణ తప్పదు. కావున లోకోద్ధరణ కార్యక్రమ నిర్వహణలో ఘర్షణలు పెంచడం, మనం అశాంతికి గురి అయి, అశాంతినే లోకానికి పంచడం జరుగుతుంది. ఇతరులను ఉద్ధరించే గురువులము అనుకోవడం అహంకారమవడం వల్ల, ఇట్టివారు చేపట్టే చర్యలకు వైఫల్యం, అలజడియే ఫలితము. వీనిలో ఇరుక్కుని పోయేవాడు ఇతరులకు ఎట్టి తోడ్పాటును ఈయగలడు?.
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 138 🌹*
*🌴 Crises and Development - 6 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Neutralizing Crises 🌻*

If we want to be workers of good will, we need to know what is going on on the planet. We are mostly busy with our own little lives and do not care much about what is happening on the planet. 

But the possibilities of the internet or other media can be used for the work of good will as well as for other purposes.

Individual crises, as well as planetary crises, can be neutralized with the help of OM. In the ashrams OM is uttered with a lot of intent to purify the planet, neutralize crises and restore peace. 

In its magical work, the Hierarchy uses the sound OM to embody ideas in thought forms. These embodied forms are sent out to connect with the minds of the disciples and to reach areas where they are needed. 

This way, many crises were neutralized and the effect of provocations that could have caused serious incidents was averted. An average mind cannot see the incidents that have been avoided, but the Master sees them.

Group work is much more appreciated by the Masters of Wisdom than the work of an individual because the effect is greater. 

Our group prayers have helped to resolve many crises on the planet, for joint prayers do not remain without the corresponding positive impact on the globe. 

When we are together and we intonate the OM seven times, it rises up and spreads everywhere to bring the needed harmony. This subtle work requires humility and no self-promotion.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 52 / Sri Lalita Sahasranamavali - Meaning - 52 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 97

467. వజ్రేశ్వరీ - 
వజ్రేశ్వరీ నామంగల ఒక అతిరహస్యశక్తి.

468. వామదేవీ - 
అందముగా నున్న దేవత.

469. వయోవస్థావివర్జితా - 
వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం గాని లేనిది.

470. సిద్ధేశ్వరీ - 
సిద్ధులకు అధికారిణి.

471. సిద్ధవిద్యా - 
సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి.

472. సిద్ధమాతా - 
సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది.

473. యశస్వినీ - 
యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.

🌻. శ్లోకం 98

474. విశుద్ధి చక్రనిలయా - 
విశుద్ధి చక్రములో వసించునది.

475. ఆరక్తవర్ణా - 
రక్తవర్ణములో నుండునది.

476. త్రిలోచనా - 
మూడు లోచనములు కలది.

477. ఖట్వంగాది ప్రహరణా -
 ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.

478. వదనైక సమన్వితా - 
ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 52 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 52 🌻*

467 ) Sukshma roopini -   
She who has a micro stature

468 ) Vajreshwari -   
She who is Vajreswari (lord of diamonds) who  occupies jalandhara peetha

469 ) Vamadevi -   
She who is the consort of Vama deva

470 ) Vayovastha vivarjitha -   
She who does not change with age

471 ) Sidheswari -   
She who is the goddess of Siddhas (saints with super natural powers)

472 ) Sidha vidya -   
She who is personification of pancha dasa manthra which is called siddha vidya

473 ) Sidha matha -   
She who is the mother of Siddhas

474 ) Yasawini -   
She who is famous

475 ) Vishudhichakra Nilaya -   
She who is in sixteen petalled lotus

476 ) Aarakthavarni -   
She who is slightly red

477 ) Trilochana -   
She who has three eyes

478 ) Khadwangadhi prakarana -   
She who has arms like the sword

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 55 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 31

🌻 31. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్‌ - 3 🌻

మరచితి నా మందిరంబు - పాట
            ప|| మరచితి నా మందిరంబు
            మరచిపోయితీ - మందిరంబు ||మ||
            సచ్చిదానంద పరహ్మ్రమనెడి మందిరంబు ||మ||
1 పసితనమునె పుడమికినొక
            పనిమీదను పయనమైతి
            యవ్వన ప్రకృతి సుందరి
            నవ్వుల సిరిమోము జూచి
            మమతల తీయని మాటల
            మాయా మోహిని వశమై
            ఇల, అనుభవముల సుందరి
            చెలియాండ్రతో ఆటలాడి ||మ||
2 ఆటల ఆనందములో
            ఆలస్యంబాయె మెహెర్‌ !
      ఆనందపు నాదు పవలు
            అస్తమించి చీకటిపడె
            నల్లని దుఃఖపు రాతిరి
            నలుకెలంకులను గ్రమ్మెను
            చంచల మనసున దుఃఖిత
            చపలుడనై తిరుగుచు నే ||మ||
3 ఎంతదూర మున్నదో
            ఎరుగను నా ప్రేమయిల్లు
            ఇంటిమీద కలిగె దీక్ష
            కంటిమీద కునుకు బోయె
            జనన, మరణ, జన్మలనెడి
            తనువు మజిలి పవలురేలు
            గడచిపోవుచుండెనో
            కడయెరుగని దిగులుతోడ ||మ||
4 దివ్యప్రేమ, జ్ఞాన, శక్తి
            దీప్తులనిడు మందిరంబు
            చేర, పరుగులిడుచుండగ
            కరుణతో పరదేశియొకడు
            భయపడకిలు జేర్చెదనని
            బాసజేసెనో బాబా !
            మజిలీలిక ఎన్ని జరుగు ?
            మందిరమిక ఎంతదవ్వు ?
            అనురాగీ భాస్కరుడు
            వినయంబున వేడుకుండె
            ఎన్నాళ్ళకు ఇలుజేరెద
            ఎరిగింపుమో మెహెరు బాబా ! ||మ||

రచన : శ్రీ బాలగోపాల భాస్కరరాజు

                                  (మెహెర్‌ బాబా భక్తుడు)

            3) ఆకలి వేసినవాడికి అన్నం పెట్టినప్పుడు ఆకలి బాధ తీరుతున్నది. కాని మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ అన్నం తింటే మళ్ళీ ఆకలి బాధ తీరుతుంది. ఇలా అనేక మారులు ఆకలి బాధ తీరినప్పుడు తృప్తి కలుగుతూనే ఉంటుంది. ఇట్టి తృప్తి ఒక్కటే కాదా ! 

మధ్యలో ఆకలి వేసినప్పుడు మరుగున పడి, ఆకలి తీరగానే తిరిగి అదే తృప్తి కలిగి హాయినిస్తున్నది. ఈ సంతృప్తి సిద్ధ వస్తువు. అలాగే ఆత్మానందుడు జీవ భావం కలిగినందువలన బాధలు పడుతూ, ఆ జీవ భావం పోగానే ఆత్మానందుడవుతున్నాడు. 

కాని ఆత్మానందమే సహజం, శాశ్వతం. అది జీవ భావంలో మరపులో ఉంది. మరుపు పోగానే, ఉన్నదే ఉన్నది గాని, కొత్తగా ఏమీ రాలేదు. మరుపు అనే అజ్ఞానం తొలగిపోవడమే జ్ఞానం. 

ఈ జ్ఞానం కోసం స్వరూపాను సంధానం చేయాలి. జ్ఞానం అంటే స్వస్వరూపంగా ఉండి పోవడమే. స్వస్వరూపం ఆది అంతం లేనిది, కనుక అది ప్రాప్తించేది కాదు. అది స్వతస్సిద్ధం. అదే పరాభక్తి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 23 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌷 More than what you had ever imagined will be your Reward when you follow Guru 🌷*
 
Compared to other spiritual practices, the method of following Guru offers a great advantage. 

The other pursuits grant only what you wish for, nothing else, and nothing more. In addition to satisfying your worldly desires, without your awareness your intellect will soar towards higher realms, and more than what you had ever imagined will be your reward when you follow Guru. 

The worship of other deities bestows only the boons that you ask for, whereas Guru, while he gives you what you desire, also grants you liberation. 

That is why, Kartaveeryarjuna, who approached Guru initially with a desire for kingdom, step by step rose to the highest spiritual level.
 
Swamiji is initiating all of you into this Guru Gita with the hope and desire that in addition to fulfilling all your desires, it would also open the doors to your blissful inner consciousness, the existence of which you never even imagined. 

He is not only initiating you into this teaching, but he is also sharing with you all the secret inner meanings contained in it. You are indeed very fortunate and blessed. Utilize this great beneficence and fulfill the purpose of your lives. 

Wishing for your welfare, for the satisfaction of all your wishes, and for granting you an experience of bliss, by meditating upon Guru Lord Dattatreya, he is now going to begin this spiritual journey.
 
We have to learn the detailed meaning of the verses that lead us into the contemplation of Guru. 

Before commencing any good deed, one should remember Guru. Since we are going to be discussing the Guru Gita, an act that is unsurpassed in the world for its merit, let us begin with the contemplation of Guru. 

The foremost Guru of all is Lord Dattatreya. He embodies the Trinity. Guru is Brahma, Guru is Vishnu, and Guru is Siva. 

All Gurus who follow in this lineage are all also embodiments of all the three. Without question, Lord Dattatreya is the ultimate Supreme Soul. We offer him our prostrations.
 
In this context, let us learn how Guru Veda Dharma blessed his disciple Deepaka. It is an important incident in a short story. In the olden days, Deepaka, the disciple of Guru Veda Dharma believed that Guru was all in all. 

He believed that all deities resided in his Guru. When Siva and Vishnu appeared before him and offered him boons, Deepaka remained unmoved in his dedication to Guru. 

For possessing such intense devotion, let us find out what immense grace he received. Assuming that Deepaka’s devotion to Guru was not genuine, the other disciples created obstacles in every single effort of his. It is natural and commonplace that when one is trying to rise high, others try to pull him down. 

Afraid that Deepaka may rise to dizzying heights by the grace of Guru, the rest of the disciples tried their level best to drag him down by placing hurdles in his path of devotion to Guru. Let us see what happened after they managed to drag him down.

Continues..
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శివగీత - 21 / The Siva-Gita - 21 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
*🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 5 🌻*

అగస్త్య ఉవాచ:-
శుక్ల పక్షే చతుర్దశ్యా - మష్టమ్యా వా విశేషతః,
ఏకా దశ్యాం సోమవారే - ఆర్ద్రాయాం వా సమర భేత్ 20

అగస్త్యుడు నుడుపు చున్నాడు: -
శుక్ల పక్షము చతుర్దశి యందు గాని ,లేదా అష్టమి యందును గాని,
 అధవా ఏకాదశి యందు గాని లేదా ఆర్ద్రా నక్షత్ర యుక్త సోమవారమందు గాని యీ పాశుపత వ్రతమును ప్రారంబించ వలెను.

యం వామ మాహుర్యం రుద్రం -శాశ్వతం పరమేశ్వరమ్,
పరాత్పరం పరం బాహుం - పరాత్పర తరం శివమ్ 21

బ్రహ్మాణాం జనకం విష్ణో ర్వహ్నే - ర్వాయో స్సదాశివమ్,
ద్యాత్వాగ్ని నావ సధ్యాగ్నిం - విశోద్యచ పృధ క్ప్రుధక్. 22

పంచ భూతాని సం యమ్య - దగ్ద్వా గుణ విధి క్రమాత్,
మాత్రాః పంచ చత స్రశ్చ - త్రిమాత్రా ద్విస్తతః పరమ్ 23

ఏక మాత్ర మమాత్రం చ - ద్వాదశాం తవ్య వస్తితమ్,
స్థిత్యాం స్థాప్యా మృతో భూత్వా - వ్రతం పాశుపతం చరేత్. 24

ఏ దేవుడి ని రుద్రుని గాను, పరమేశ్వరుని గాను, పరాత్పరు ని గాను, శివుని గాను, విష్ణ్వగ్ని వాయువులకు - 

జన్మ నొసంగిన వానిన గాను ఏ పెద్దలు అంగీకరించుచున్నారో అటువంటి భగవంతుని మొట్ట మొదట ధ్యానించి వహ్నిని బూజించి పంచ భూతంబు లను నియమించి 
పంచ చతుస్త్రి ద్వైక (ఐదు- నాలుగు - మూడు - రెండు -ఒకటి ) మాత్రల చేత నైన గాని, ఆ మాత్రగ నైనా గాని, ద్వాద శ్వాంత స్థితుండై యమృతం డై యీ పాశుపత వ్రతము ననుష్టించవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 21 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
*🌻 Viraja Deeksha Lakshana Yoga - 5 🌻*

The Lord whom scriptures call as Rudra, Parameshwara (greatest lord), Paratpara (higher than the highest), Shiva (auspicious), the father of Vishnu, Agni, Vayu kind of gods; that bhagawan Sadashiva has to be meditated upon. 

Then one should worship the fire, and subdue the five elements. 

One should follow this Pashupata penance by following the mantras of any of the type called 'Pancha chatushtridwaika' 
(five­four­three­two­one).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 13 / Sri Gajanan Maharaj Life History - 13 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 3వ అధ్యాయము - 3 🌻*

సచ్చిదానందుడిని జ్ఞానేశ్వర్ పునర్జీవిని చేసారు. అదేవిధంగా జానరావోను శ్రీగజానన్ చెయ్యగలరని వారినమ్మకం. అందువల్ల, శ్రీగజానన్ నివసించే బనకటలాల్ ఇంటికి జానరావ్ బంధువు ఒకరు వెళ్ళి, జానరావ్ వృత్తాంతం బనకటలాలకు వర్నించి, శ్రీగజానన్ పాదతీర్ధం జానరావుకు ఇచ్చేందుకు ఇవ్వ వలసిందిగా వేడుకుంటారు. 

తన తండ్రి అయిన భవానీరాం అనుమతితో ఒక గ్లాసునీళ్ళు శ్రీమహారాజు కాలికి తగిలించి, ఇది తీర్ధంగా జానరావుకు ఇస్తున్నామని దానికి శ్రీగజానన్ సమ్మతించగా బనకటలాల్ ఆతీర్ధం జానరావు కొరకుఇస్తాడు. అది త్రాగుతూనే జానరావుకు తెలివివస్తుంది. 

ఆతరువాత క్రమేణా జబ్బునుండి కోలుకున్నాడు. ఔషదాలన్నీ ఆపివేసి జానరావుకు శ్రీమహారాజు పాదతీర్ధం రోజూఔషదంగా ఇచ్చారు. జానరావు ఒక వారంరోజులకు పూర్తిగా కోలుకున్నాకా, భవానిరాం ఇంటికి వెళ్ళి శ్రీగజానన్ మహారాజు దర్శనం చేసుకున్నాడు. 

శ్రీమహారాజు పాదతీర్ధం అమృతంలా పనిచేసింది ఎందుకంటే ఈకలియుగంలో, ఈ యోగులే భగవంతులు. ఈవిధంగా జరగడంతో, శ్రీగజానన్ షేగాంలో ఉన్నంతవరకు ఎవరూ చనిపోరాదని ఎవరయినా అనవచ్చు. కానీ ఈతర్కంసరికాదు. యోగులు ప్రకృతిని వ్యతిరేకించరు, మరియు మృత్యువును ఆపరు.

అసహజము లేదా ఆకస్మిక మృత్యువును వీరు తప్పించగలరు. శ్రీజ్ఞానేశ్వర్, శ్రీసచ్చిదానందుని మృత్యువును నవాషాలో నిరోధించారు. తరువాత శ్రీసచ్చిదానందుడు అళందిలో మరణించవలసివచ్చింది. 

యోగులకు ఈవిధమయిన ఆకస్మిక మరియు అసహజ మృత్యువును పసికట్టడం కష్టంకాదు. మృత్యువులు మూడువిధాలుగా ఉన్నాయి: 

1. ఆధ్యాత్మిక కారణంవల్ల - సహజ లేదా ప్రారబ్ధంవల్ల 

2. ఆదిభౌతిక కారణంవల్ల - జీవన సరళి వలన . 

3. ఆదిదైవిక కారణంవల్ల - ఆకస్మిక లేదా అసహజ కారణంవల్ల. 

ఈమూడింటిలో మొదటిది చాలా శక్తివంతమైనది మరియు ఎవరూ ఆపసక్యంకానిది. 

రెండవది ఆదిభౌతిక మృత్యువు చెడు అలవాట్లు, క్రమశిక్షణలేని జీవన సరళి వల్ల శరీరంలో అనేకరోగాలు వల్ల వచ్చేది. మంచివైద్యుని సహాయంతో దీనిని ఆపవచ్చు. 

మూడవది ఆదిదైవిక మృత్యువు. యోగుల ప్రార్ధన మరియు ఆశీర్వచనాలవల్ల ఆపవచ్చు. ఇందులో మరల రెండువిధాలుగా చెయ్యవచ్చు. 1. భౌతిక - జీవనసరళి 2. దైవిక - భగవంతుని అప్రియతవలన ఆధ్యాత్మిక మృత్యువును ఎవరూ నిరోధించలేరు.

అర్జునుడు కుమారుడు అయిన అభిమన్యుడు స్వయానా శ్రీకృష్ణుని ఎదుట చనిపోయాడు. జానారావు మృత్యువు అసహజమయినది కనుక శ్రీగజానన్ మహారాజు నిరోధించారు. భగవంతుని మీద ధృడవిశ్వాసంతో ఆయనకు మొక్కుకుంటేకొన్ని మృత్యువులను తప్పించవచ్చు. 

ఈవిశ్వాస బలమే అసహజ మృత్యువును ఆపుతుంది. ఇదేమృత్యువు, జీవితంలో ఆరు అవలక్షణాలను జయించిన యోగుల పాదతీర్ధం వలన కూడా ఆపవచ్చు. నిజమయిన యోగికి పూర్తిగా అర్పించుకోవాలేతప్ప, అందరూ కపటి సన్యాసుల నుండి దూరంగా ఉండాలి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 13 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 3 - part 3 🌻*

Shri Dnyaneshwar brought Sachhidananda back to life, and the same can be done by Shri Gajanan for Janrao. So one of the relatives went to the house of Bankatlal, where Shri Gajanan was staying, and narrating the whole story of Janrao requested him to give Pada Tirtha of Shri Gajanan which they would give to Janrao Deshmukh. 

Shri Bankatlal with the permission of his father Bhavaniram, took a glass of water touched it to the feet of Shri Gajanan Maharaj and told Him that the Tirtha was being given to Janrao Deshmukh. Shri Gajanan Maharaj gave His consent. 

Thereafter the Tirtha was given to Janrao Deshmukh who immediately regained consciousness and thereafter slowly recovered from the illness. All the medicines were stopped and Janrao was kept on a daily dose of the Tirtha from the feet of Shri Gajanan Maharaj . 

He gained his normal health within a week and went to Shri Bhavaniram’s house for the Darshan of Shri Gajanan Maharaj. Look, the water from the feet of Shri Gajanan Maharaj had the effect of life saving nectar. 

This is so because the saints are the God incarnates in Kalyuga. With such a happening one may say that nobody should die in Shegaon as long as Shri Gajanan Maharaj is there. 

This statement, however, is not logical. Saints do not prevent death, nor do they behave against the laws of the nature. But they can avoid death if it is unnatural or accidental. Shri Dnyaneshwar avoided the death of Shri Sachhidananda at Newasha, but the same Sachhidananda later on had to die at Alandi. 

That means, the saints can check unnatural or accidental death and it is not at all difficult for them.

There are three types of deaths namely, Adhyatmic (subjective) meaning natural or destined, Adhibhoutic (Phenomenal) meaning by material effects and Adhidaivic (God sent) meaning accidental or un-natural. 

Of these three, the first, Adhyatmic, is most powerful and nobody can avoid it. The second i.e. Adhibhoutic is the result of bad eating and living habits and an undisciplined lifestyle which gives rise to various diseases in the body. 

This type of death, however, can be averted with the help of a competent doctor. The third i.e. Adhidaivic can be prevented by prayers and blessings of Saints. This category is further divided into two types: Bhoutic, caused by material effects, and Daivic, caused by the displeasure of God. Adhyatmic i.e. the natural death cannot be prevented by anybody.

Remember that Abhimanyu, the son of Arjuna, died in the presence of Shri Krishna Himself. Janrao’s death was of an unnatural type and so could be prevented by Shri Gajanan Maharaj. 

Some deaths can be averted by vows of offerings to God. But they should be taken with full faith in the Almighty. In fact it is the strength of the faith involved that works to prevent the unnatural type of death. 

This sort of death can also be avoided by the Pada Tirtha of a saint who is pious and free from the six hostile forces of life. One should surrender to a real saint and keep away from the hypocrites.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. సౌందర్య లహరి - 63 / Soundarya Lahari - 63 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ఉన్నత అధికారం, మోక్షము కొరకు 🌴

శ్లో:63. స్మితజ్యోత్స్నా జాలం తవ వదన చంద్రస్య పిబతాం 
చకోరాణామాసీ దతి రసతయా చంచుజడిమా l 
అతస్తే శీతాంశో రమృత లహరీ రామ్లరుచియః 
పిబంతి స్వచ్ఛన్డం నిశినిశి భృశం కాంజికధియా ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా! భగవతీ , నీ చంద్ర బింబము వంటి ముఖమున గల చిరునవ్వు అను వెన్నెలను త్రాగుచున్న చకోరపక్షుల ముక్కులకు అతి మాధుర్యము వలన అరుచి కలిగి, అవి పులుపునందు కోరిక కలిగి చంద్రుని యొక్క అమృత ప్రవాహమును బియ్యపు కడుగు అనుకొని ప్రతి రాత్రియు వెన్నెల యందు తృప్తిగా త్రాగుచున్నవి కదా! 

🌻. జప విధానం - నైవేద్యం :--
ఈ శ్లోకమును 30000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, పెరుగు అన్నం, తేనె, పండ్లు, కొబ్బరికాయను నివేదించినచో అందరి మీద స్వామిత్వము, అధికారిత్వము, మోక్షమునకు దారి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 SOUNDARYA LAHARI - 63 🌹 
📚. Prasad Bharadwaj 

Sloka - 63 

🌴 Gaining Power over others and gives waybto Moksha 🌴

63. Smitha-jyothsna-jalam thava vadana-chandrasya pibatham Chakoranam asid athi-rasataya chanchu-jadima; Athas the sithamsor amrtha-laharim amla-ruchayah Pibanthi svacchhandam nisi nisi bhrusam kaanjika-dhiya. 
 
🌻 Translation : 
The Chakora birds, Feel that their tongues have been numbed, by forever drinking, The sweet nectar like light emanating, from your moon like face, and for a change wanted to taste, The sour rice gruel during the night, and have started drinking, The white rays of the full moon in the sky.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
If one chants this verse 30000 times a day for 30 days, offering curd rice honey,fruits and coconut as prasadam, they are said to create an good impression in others and gives way to moksha

🌻 BENEFICIAL RESULTS: Commanding power, gives moksha.
 
🌻. Literal Results:  
Bestows magnetic and attractive face and personality.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 362 / Bhagavad-Gita - 362 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 10 🌴

10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే ||

🌷. తాత్పర్యం :
ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైనవారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనొసగుదును. 

🌷. భాష్యము :
“బుద్ధియోగమ్” అను పదము ఈ శ్లోకమునందు ముఖ్యమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశమొసగుచు తాను అనేక విషయములను చర్చించితిననియు మరియు ఇకపై బుద్ధియోగము ద్వారా కొన్ని విషయములు తెలుపనున్నట్లుయు పలికియున్న విషయమును మనమిచ్చట జ్ఞాపకము చేసికొనవలెను. అట్టి బుద్ధియోగమే ఇచ్చట పేర్కొనబడినది. బుద్ధియోగమనగా కృష్ణభక్తిరసభావనలో కర్మనొనర్చుట యనియే భావము. అదియే అత్యుత్తమబుద్ధి మరియు జ్ఞానము అనబడును. బుద్ధి యనగా తెలివి మరియు యోగమనగా యోగకర్మలు. భగవద్దామమునకు చేరగోరి మనుజుడు కృష్ణభక్తిభావనలో భక్తియుక్తసేవయందు నిలిచినచో అతని కర్మలు బుద్ధియోగమనబడును. అనగా బుద్ధియోగము ద్వారా మనుజుడు భౌతికజగత్తు బంధముల నుండి సులభముగా విడివడగలడు. పురోగతి యనుదాని చరమప్రయోజనము శ్రీకృష్ణుడే. కాని జనసామాన్యము ఈ విషయము నెరుగరు. కనుకనే గురువు మరియు భక్తుల సాంగత్యము అత్యంత ముఖ్యమై యున్నది. కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుడే పరమగమ్యమని తెలిసికొనవలసియున్నది. ఆ విధముగా గమ్యమును నిర్ణయించి, నెమ్మదిగా అయినప్పటికిని క్రమముగా ప్రయాణించినచో అంతిమలక్ష్యము ప్రాప్తించగలదు.

మానవుడు జీవితలక్ష్యము నెరిగియు తన కర్మఫలముల యెడ అనురక్తిని కలిగియున్నచో అతడు కర్మయోగమునందు వర్తించినవాడగును. అదే విధముగా మానవుడు కృష్ణుడే గమ్యమని తెలిసియు, కృష్ణుని అవగతము చేసికొనుటకు మానసికకల్పనలను ఆశ్రయించినచో జ్ఞానయోగమునందు వర్తించినవాడగును. ఇక మానవుడు తన గమ్యమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన యందు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినపుడు భక్తియోగమునందు లేదా బుద్ధియోగమునందు వర్తించినవాడగును. వాస్తవమునకు ఈ బుద్ధియోగమే సంపూర్ణము మరియు సమగ్రమైన యోగమై యున్నది. ఇదియే మానవజన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణస్థితి.

మనుజుడు ఆధ్యాత్మికగురువును పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మికసంఘముతో సంబంధమును కలిగయున్నను ఒకవేళ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధిని పొందలేకపోయినచో ఎటువంటి కష్టము లేకుండా అతడు అంత్యమున తనను చేరురీతిలో శ్రీకృష్ణుడే అతనికి అంతర్యమున ఉపదేశములొసగును. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 362 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 10 🌴

10. teṣāṁ satata-yuktānāṁ
bhajatāṁ prīti-pūrvakam
dadāmi buddhi-yogaṁ taṁ
yena mām upayānti te

🌷 Translation : 
To those who are constantly devoted to serving Me with love, I give the understanding by which they can come to Me.

🌹 Purport :
In this verse the word buddhi-yogam is very significant. We may remember that in the Second Chapter the Lord, instructing Arjuna, said that He had spoken to him of many things and that He would instruct him in the way of buddhi-yoga. Now buddhi-yoga is explained. Buddhi-yoga itself is action in Kṛṣṇa consciousness; that is the highest intelligence. Buddhi means intelligence, and yoga means mystic activities or mystic elevation. When one tries to go back home, back to Godhead, and takes fully to Kṛṣṇa consciousness in devotional service, his action is called buddhi-yoga. In other words, buddhi-yoga is the process by which one gets out of the entanglement of this material world. The ultimate goal of progress is Kṛṣṇa. People do not know this; therefore the association of devotees and a bona fide spiritual master are important. One should know that the goal is Kṛṣṇa, and when the goal is assigned, then the path is slowly but progressively traversed, and the ultimate goal is achieved.

When a person knows the goal of life but is addicted to the fruits of activities, he is acting in karma-yoga. When he knows that the goal is Kṛṣṇa but he takes pleasure in mental speculations to understand Kṛṣṇa, he is acting in jñāna-yoga. And when he knows the goal and seeks Kṛṣṇa completely in Kṛṣṇa consciousness and devotional service, he is acting in bhakti-yoga, or buddhi-yoga, which is the complete yoga. This complete yoga is the highest perfectional stage of life.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 189 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
42. అధ్యాయము - 17

*🌻. గుణనిధి చరిత్ర - 2 🌻*

ప్రేరితోsపి జనన్యా స న య¸° పితురంతికమ్‌ || 12

గృహకార్యాంతరవ్యాప్తో దీక్షితో దీక్షితాయినీమ్‌ |యదా యదైవ తాం పృచ్ఛేదయే గుణనిధిస్సుతః || 13

న దృశ్యతే మయా గేహే కల్యాణి విదధాతి కిమ్‌ | తదా తదేతి సా బ్రూయాదిదానీం స బహిర్గతః || 14

స్నాత్వా సమర్చ్యవై దేవా నేతావంత మనేహసమ్‌ | అధీత్యాధ్యయనార్థం స ద్విత్రై స్సమం య¸° || 15

ఏకపుత్రేతి తన్మాతా ప్రతారయతి దీక్షితమ్‌ | న తత్కర్మ చ తద్వృత్తం కించిద్వేత్తి దీక్షితః || 16

తల్లి ప్రోత్సహించిననూ, ఆతడు తండ్రి వద్దకు వెళ్లలేదు (12). 

దీక్షితుడగు ఆ తండ్రి ఇతర గృహకార్యములలో నిమగ్నుడై యుండి భార్యతో'ఓసీ! మన కుమారుడు గుణనిధి (13) 

నాకు ఇంటిలో కనబడుటలేదు. ఓ కల్యాణీ! వాడు ఏమి చేయుచున్నాడు? అని ప్రశ్నించిన ప్రతి పర్యాయము ఆమె 'ఇప్పుడే బయటకు వెళ్లినాడు (14). 

స్నానము చేసి దేవతల నారాధించి ఇంతవరకు పాఠములను చదువుకొని, మరల అధ్యయనము కొరకు ఇద్దరు, ముగ్గురు మిత్రులతో కూడి వెళ్లినాడు' అని చెప్పెడిది (15). 

ఏకైక కుమారుడగుటచే ఆ తల్లి దీక్షితుని మోసపుచ్చెడిది. ఆయనకు వాని చేతల గురించి, వ్యవహారముల గురించి ఏ మాత్రమూ తెలియకుండెను (16).

సర్వం కేసాంతకర్మాస్య చక్రే వర్షేsథ షోడశే | అ థో స దీక్షితో యజ్ఞదత్తః పుత్రస్య తస్య చ || 17

గృహ్యోక్తేన విధానేన పాణి గ్రాహమకారయత్‌ | ప్రత్యహం తస్య జననీ సుతం గుణనిధిం మృదు || 18

శాస్తి స్నేహార్ద్ర హృదయా హ్యుపవేశ్య స్మ నారద | క్రోధనస్తేsస్తి తనయ స మహాత్మా పితేత్యలమ్‌ || 19

యది జ్ఞాస్యతి తే వృత్తం త్వాం చ మాం తాడయిష్యతి | ఆచ్ఛాదయామితే నిత్యం పితురగ్రే కుచేష్టితమ్‌ || 20

దీక్షితుడగు యజ్ఞదత్తుడు కుమారునకు పదునారవయేట స్నాతకము చేసి, సంస్కారములనన్నిటినీ చేయించి (17), 

గృహ్యసూత్రోక్త విధానముతో వివాహము చేసెను. ఓ నారదా! ప్రతి దినము ప్రేమతో నిండిన హృదయము గల తల్లి కుమారుడగు గుణనిధిని కూర్చుండబెట్టి (18) 

భయమును చెప్పెను. కుమారా! మహాత్ముడగు నీ తండ్రి కోపిష్ఠి. ఈ చేష్టలను కట్టిపెట్టుము (19). 

నీ వృత్తాంతము ఆయనకు తెలిసినచో, నిన్ను నన్ను కూడ దండించును. ప్రతి దినము నీ చెడు చేష్టము ఆయనకు తెలియకుండగా కప్పిపుచ్చుచున్నాను (20).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 64 🌹*
Chapter 18
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 Though He Suffers He Forgives - 1 🌻*

God comes as the Avatar to wipe out the unnaturalness in human consciousness, and this is known as the forgiveness of sins. 

This forgiveness is not through his words, but through his actions. His forgiveness wipes out the sanskaric unnaturalness in each individual. 
 
What is this sanskaric unnaturalness of human consciousness called sin? Un-naturalness or sin is produced by those actions, which in turn produce terrible sanskaric obstructions, making one unable to follow the path toward Truth. 

Thus, the realization of God, which ought to be most natural for human consciousness to achieve, becomes impossible to achieve. And God, who is most close to man, seems most far. 
 
Hypocrisy is the worst kind of sin, and it is called unforgivable, because it is the worst, most unnatural condition of human consciousness. Hypocrites are in the worst of predicaments; because they pose to be that which they are not! Hypocrites are therefore the most unnatural of persons.  

The actions which are unnecessary for progress toward the path of Truth are  
unnatural actions, and these unnatural acts produce more unnatural impressions. 

These are the sins which delay the development of involutionary consciousness—the natural progress of human individual consciousness. The natural aim of life is to realize the Truth, and to become one with the Truth. 

This natural aim becomes intensely selfconscious during the process of involution. Thus the actions which help one to follow the path to Truth, and thereby enter one's own involution are natural sanskaric actions. 
 
Those actions which prevent one from following the path toward involution are unnatural sanskaric actions—sins. 

Sinful actions produce unnatural impressions which produce unnatural states of human consciousness, and so human beings find themselves in unnatural situations.

These unnatural sanskaras are like a coat of thorns, and when one has a coat of thorns, he cannot pass through a tangle of thorns with others, and so his progress is delayed. His own coat of thorns gets stuck and entangled with the thorns of another. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 60 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. దీక్షా విధి - 1 🌻*

అథ సప్తవింశో7ధ్యాయః

అథ దీక్షా విధిః

నారద ఉవాచ :

వక్ష్యే దీక్షాం సర్వదం చ మణ్డలే7బ్జే హరిం యజేత్‌ | దశమ్యాముపసంహృత్య యాగద్రవ్యం సమస్తకమ్‌.

విన్యస్యనారసిం హేన సంమన్త్య్ర శతవారకమ్‌ | సర్షపాంస్తు ఫడ న్తేన రక్షోఘ్నోన్‌ సర్వతః క్షిపేత్‌. 2

నారుదుడు పలికెను. :

అన్ని ఫలములను ఇచ్చు దీక్షను చెప్పదను. మండలమునందలి పద్మమునందు హరిని పూజించవలెను. దశమి యందు సమస్తమైన యాగద్రవ్యములను సమకూర్చుకొని, అచట ఉంచి, 'ఫట్‌' అనునది అంతమునందు గల నారసింహా మంత్రముచేత ఆవాంను నూరు పర్యాయములు అభిమంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను.

శక్తిం సర్వాత్మికాం తత్ర న్యసేత్ప్రాసాదరూపిణీమ్‌ | సర్వౌషదీః సమాహృత్య వికిరానభిమన్త్రయేత్‌. 3

శతవారం శుభే పాత్రే వాసుదేవేన సాధకః | సంసాధ్య పఞ్చగవ్యం తు పఞ్చ భిర్మూలమూర్తిభిః. 4

నారాయణాన్తైః సంప్రోక్ష్య కుశాగ్త్రెస్తేన తాం భువమ్‌ | వికిరన్వాసుదేవేన క్షి పేదుత్తానపాణినా. 5

త్రిధా పూర్వముఖస్తిష్ఠన్‌ ధ్యాయేద్విష్ణుం తథా హృధి | వర్ధన్యా సహితే కుమ్ఛే సాఙ్గం విష్ణం ప్రపూజయేత్‌. 6

అచట సర్వాత్మికయు, ప్రాసాదరూపిణియు అగు శక్తిని నిలుపవలెను. సాధకుడు శుభ మైన పాత్రయందు సమస్తౌషధును ఉంచి నూరు పర్యాయములు వాసుదేవమంత్రముచే వికిరములను అభిమంత్రించవలెను. పంచగవ్యమును నారాయణాన్తములైన ఐదు మూలమూర్తులచే సంపాదించుకొని, దానిచే ఆ భూమిని కుశాగ్రములతో సంప్రోక్షించి, వాసుదేవ మంత్రముచే చిమ్ముచు, వెల్లిగితం ఉంచబడిన హస్తుముతో మూడు పర్యాయములు విసిరివేయవలెను. తూర్పుగా తిరిగి విష్ణువును మనస్సులో ధ్యానించవలెను. వర్ధనితో కూడిన కుంభమునందు అంగసహితుడగు విష్ణువును పూజింపవలెను.

శతవారం మన్త్రయిత్వా త్వస్త్రేణౖవ చ వర్ధనీమ్‌ | అచ్ఛిన్నధారయా సిఞ్చన్నీశానాన్తం నయేచ్చ తామ్‌ . 7

వర్ధనిని అస్త్రముచేతనే నూరు పర్యాయములు అభిమంత్రించి, భిన్నము కాని ధారతో తడుపుచు ఈశాన్యదిక్కు వరకును తీసికొని వెళ్ళవలెను.

కలశం పృష్ఠతో నీత్వా స్థాపయేద్వికిరోపరి | సంహృత్య వికిరాన్దర్భైః కుమ్భేశం కర్కరీం యజేత్‌. 8

కలశమును వెనుకనుంచి తీసికొని వెళ్ళి వికిరములపై స్థాపించవలెను. వికిరములను దర్భలచేత పోగుచేసి కుంభేశుని కర్కరిని పూజింపవలెను.

సవస్త్రం పఞ్చరత్నాఢ్యం స్థణ్డిలే పూజయేద్దరిమ్‌ | అగ్నావపి సమభ్యర్చ్వ మన్త్రాన్‌ సంజప్య పూర్వవత్‌. 9

ప్రక్షాళ్య పుణ్డరీ కేణ విలిప్యాన్తః సుగన్ధినా | ఉఖామాజ్యేన సంచపూర్య గోక్షీరేణ తు సాధకః 10

ఆలోక్య వాసుదేవేన తతః సఙ్కర్షణన చ | తణ్డులానాజ్యసంసృష్టాన్‌ క్షిపేత్‌ క్షీరే సుసంస్కృతే. 11

వస్త్రములతోడను పంచరత్నములతోడను కూడిన విష్ణువును స్థండిలముపై పూజించవలెను. అగ్నియందు కూడ పూజించి, పూర్వమునందు వలె మంత్రములను జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మములచే లోపల తుడిచి, నేతితోను, గోక్షీరముతోను నింపి, వాసుదేవమంత్రముతో దానివైపు చూచి, పిమ్మట సంకర్షణమంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసిన తండులమును పోయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 75 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కర్దమ మహర్షి – దేవహూతి - 1 🌻*

వంశము: బ్రహ్మ
భార్య(లు): దేవహూతి
కుమారులు/కుమార్తెలు: కపిలుడు, కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ,ఖ్యాతి అరుంధతి,శాంతి
కాలము: కృతయుగం
భౌగోళిక ప్రాంతములు: బ్రహ్మావర్త దేశం (బర్మా)

🌻. జ్ఞానం:

1. బ్రహ్మ ఆజ్ఞప్రకారం సంతానోత్పత్తి కొరకు చిరకాలం తపస్సు చేసాడు. తపస్సు కేవలం భావంతుణ్ణి గురించే చెయ్యనవసరంలేదు.

2. నిష్కారణంగా, నిర్గుణంగా తపస్సుచేసి సమాధిలో ఉన్న తరువాత, ఏ దేవతను స్మరించినా అప్పుడే వస్తారు వాళ్ళు. భావనచేసి దేవతలను ప్రత్యక్షంచేసుకునే శక్తి తపస్సుకే ఉన్నటువంటి విశేషమయిన శక్తి.

3. అంటే నిర్గుణమయినటువంటిది ఒక తేజస్సుకై తపస్సుచేస్తే, ఆ తేజస్సు సర్వాంతర్యామిగా ఉండటంచేత, ఏ రూపంలో కావాలంటే ఆ రూపం పొంది కడునబడుతుంది. రుద్రడంటే రుద్రుడు ఆ తేజస్సులోంచి వస్తాడు.

4. అలా తపస్సు అనంతరం విష్ణువును స్మరించడం చేత, విష్ణువు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ‘బ్రహ్మావర్తదేశపు రాజు నీ దగ్గరికి వస్తాడు. ఆయన కుమార్తెను నీవువివాహం చెసుకో. మీకు తొమ్మిది మంది కుమార్తెలు పుడతారు. నువ్వు బంధనం అని దుఖఃపడకు. ఈ సంసారం బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, నా అభిమతం ప్రకారం జరుగుతుంది.

5. నీవు ఈ కర్మచేసూనేఉండు. ఈ కర్మ అంతా కూడా నాయందు జరుగుతుంది. ఈ కర్మంతా కూడా నా యందు సమర్పణబుద్ధితో చెయ్యి. బంధనహేతువుగా భావించి నీవు దుఖఃపడవద్దు. కర్మచేసేటప్పుడు నీకు బంధనం ఏర్పడుతుంది. కాని దానిని నాకర్పణం చేయటం చేత నీకు దుఖఃం కలుగదు. ఆ తరువాత నేనే స్వయంగా నీజు కుమారుడిగా పుడతాను” అన్నాడు హరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 140 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻. MAYA ( ILLUSION ) IS VERY POWERFUL...... 🌻*

Where has the experience of being alive come from which started all this trouble? The 'I' consciousness appeared spontaneously and the experiences started. 

When you got yourself separated from the Absolute with this identity, 'I am', your demands started. In the Absolute there are no needs of any kind, not even the need to know Itself.

Brahman is the total truth; there is nothing else but Brahman. In That, the touch of beingness, 'I am', started, and then the separation and the sense of otherness appeared.

Coming down into this world from the Absolute is like the appearance of a dream. Along with that appearance comes the primary ignorance, the false notion that you are the body. That is illusion, maya. Maya is very powerful; she will get you completely wrapped up. 

She will make you do all her tricks, and that light of yours, the beingness gets extinguished. But, although she might be your greatest enemy, if you propitiate her properly, she will turn around and lead you to the highest state.

First, know that you are the manifest consciousness, the 'I am'. 

Then go to the source and find out where this 'I am' came from. When you have knowledge you see the 'I am' as all-pervasive, so long as that consciousness is there. 

But then, this knowledge merges into no-knowledge, the Parabrahman, the witness of the consciousness. That has no 'I am'; that is you true eternal nature.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 78 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

Q 75:-- మానవుడు vs జంతుజాతి

Ans :--
1) భూమిని ఒక చెట్టుతో పోలిస్తే మానవజాతిని వేర్లుగానూ, ఇతర జీవజాతుల్ని చెట్టులోని ఇతర భాగాలతో పోల్చవచ్చు.

2) చెట్టులోని ఏ భాగానికి హాని జరిగినా ఆ బాధ చెట్టంతా భరించాల్సి ఉంటుంది. చెట్టులోని ఒక వేరుని నరికి వేసిన చెట్టుకి నష్టం వాటిల్లుతుంది.

3) భూమి మీద మానవుడు నేటి సమాజంలో అగ్రభాగాన వున్నాడు, అలాగని అతడికి భూమి మీద ఏ జీవజాతిని చంపే అధికారం లేదు.

మానవుడు ఏ జీవాత్మ ను చంపినా భూమి యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ ని అందుకోలేడు.

4) జీవహింసకు పాల్పడేవాడు దేవుని మార్గంలోకి ప్రవేశించలేడు, మనం ఒక జీవాత్మను చంపితే మనల్ని మనమే దెబ్బతీసుకున్నట్టు అవుతుంది.

5) జీవహింస వల్లే మతవిద్వేషాలు యుద్ధాలు పేరిట మానవజాతి ఒకరిని ఒకరు చంపుకుంటుంది.అంటే చెట్ల వేర్లు తెగిపోతున్నాయి.భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుడిదే. 

ఎప్పుడైతే మానవుడు జీవహింస మానివేస్తాడో అప్పుడే పురోగతి ని సాధిస్తాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 24 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నవాబుకు కాలజ్ఞానం వినిపించిన వీరబ్రహ్మేంద్రస్వామి - 2 🌻*

కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ దాత్రు నామ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో రూపాయికి చారెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.

ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి. కిలో బియ్యం 40 రూపాయలు ఉంది. మరో ఐదేళ్ళలో కిలో 100 రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదు. ఆకలి చావులు ఎక్కువయ్యాయి. కొన్నాళ్ళకి పేద ప్రజలకు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో!

బ్రహ్మంగారు తాను చెప్పినవన్నీ నిజాయితీతో, నిర్భీతితో చెప్పారు. నవాబును సంతోషపెట్టేందుకు కాకుండా తనకు ఏది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా, ఈ కింద చెప్పినవి చదివితే ఈ విషయం సులభంగా అర్ధం అవుతుంది.

5000 సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు. ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు.

బనగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనమైపోతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.

బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకు 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరల తన భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు.

దేశాటనకు బయల్దేరిన బ్రహ్మంగారికి ఒక సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక పుట్టింది. తన కోరికను భక్తులు, శిష్యులకు చెప్పారు. వారెవ్వరూ దీనికి ఒప్పుకోలేదు. కానీ, అంతా ఆ సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తన పర్యటనను ఆపేందుకు ఎవ్వరూ ప్రయత్నించరాదని నచ్చచెప్పారు స్వామి. ఆ తర్వాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు.

ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె చేరుకున్నారు. ఆ ఊరు ఆయనకు బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన ఒక మామూలు వడ్రంగి మాదిరిగా జీవించడం మొదలుపెట్టారు. తన గురించి ఎప్పుడూ, ఎవరికీ చెప్పుకోలేదు.

ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగడం ఆనవాయితీ. దీనికోసం ఊళ్ళో ఉన్న వారందరూ చందాలు వేసుకునేవారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 7 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

*🌻 STANZA II - The Knowledge of the Heart - 2 🌻*

15. The Sun was shining. Keeping a close watch on human Hearts, he tried to nourish them with Fires in a bid to reinforce the power of Life. Life herself was the gift of the Light, for without him, she could not be conceived. Would this world even exist if there were no Sun? 

He gave the Light, and it was in the rays of Light that Life had spread her Immortal Wings. Yes, Life was immortal, for she was the forever companion of the Light, who did not know death. Life and the Light were One.

16. The Heart, woven out of Light, belonged to Life. The most delicate particles of condensed Matter were used in its formation. The Heart’s secret was that it could not live without Love. 

Only Love’s energizing currents could wind the hidden mainspring therein — the spring that allowed the Wheel of Life to rotate. The Heart without Love was dying away, losing its life-force, even turning to
stone.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 18 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 6 🌻*

ఈ రకంగా వస్తు సముదాయ భ్రాంతి ఎందువల్ల ఏర్పడింది అంటే ఆ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. ఈ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. నా సుఖమునకు ఈ వస్తువు చాలా అవసరం అనేటటువంటి పరుగులాట బాగా బలంగా వుంది. 

ఇంకేమున్నదీ అంటే ఆ వస్తు సముదాయాన్ని పొందటానికై ధన సముపార్జన, ధన సేకరణ, ధనమును దాచుకొనుట, ధనమును దోచుకొనుట. ఈ రకంగా క్రమాంతరమున గుణధర్మంలో పతనం చెందుతూ వస్తాడు. 

ఎంతగా ధనము దాచుకోవాలని ప్రయత్నిస్తావో, అంతగా ధనమును దోచుకొనాలనేటటువంటి ప్రయత్నం కూడా దాని వెనకనే నీడవలె బలపడిపోతూ వుంటుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే!

“శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం”. అసలు ఈ శరీరమే ఒక వస్త్రము. ఇది ధర్మమార్గంలో నడవడం కోసం, జీవనాన్ని నడపడం కోసం, ధర్మమునకు లక్ష్యమైనటువంటి పరము ఏదైతే వుందో ఆ మోక్ష మార్గంలో ప్రవేశించడంకోసం ఈ శరీరమనేటటువంటి పనిముట్టుని వాడుకోవాలి. 

ఐహికమైనటువంటి అంశాలయందు ఎవరికైతే విరమణ వుంటుందో ఎవరికైతే ఉపరతి వుంటుందో ఎవరికైతే తితీక్ష వుంటుందో ఎవరికైతే ఉదాసీనత వుంటుందో వారు మాత్రమే శ్రేయోమార్గమైనటువంటి ఆత్మజ్ఞాన విచారణలో పరమును సాధించేటటువంటి పద్ధతిగా తీవ్ర మోక్షాపేక్షతో తీవ్ర వైరాగ్యంతో అధికారిత్వాన్ని సాధిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి జీవన విధానం. జ్ఞానమార్గంలో ప్రవేశించాలి అంటే తప్పక ప్రతిఒక్కరూ కూడా తీవ్ర వైరాగ్యనిష్ఠని కలిగివుండాలి.

 జ్ఞానమార్గంతో నాకు పనిలేదండి, నాకు కర్మమార్గంతోనే పని అన్నావనుకో ఇహపరములు రెండింటినీ ఒక్కసారే సాధించాలనేటటువంటి భ్రమ భ్రాంతిలో పడతావు.

దేనికి ఎప్పుడు అవకాశం వస్తుందో, దేనికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో, దేనిని ఎప్పుడు తగ్గించుకోవాలో, దేనిని ఎప్పుడు ఆశ్రయించాలో - సరియైన జ్ఞానం ఆ కర్మ మార్గంలో వుండదు. ప్రతిచోటా రెండు రెండు మార్గాలని కర్మమార్గం చూపిస్తుంది. 

వాటిలో ప్రతిఒక్కరూ తప్పక ఆ ప్రేయోమార్గంలోనే పడిపోతాడు. ఎట్లా అయితే మిడత దీపాన్ని చూసి, శలభము దీపాన్ని చూసి ఆహారమని భ్రమశి, భ్రమశి ఏమి చేస్తుంది? దగ్గరికి వెళ్ళి ఆ మంటమీద పడుతుంది. పడగానే దాని రెక్కలు కాలిపోతాయి. కాలిపోగానే అక్కడే విరిగి పడిపోతుంది. తన జీవితాన్ని ముగిస్తుంది. 

మానవుడు కూడా ఇటువంటి విషయసక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, అట్టి విషయములే సుఖమునిస్తాయనే భ్రాంతికి గురవుతూ అట్టి శలభము వలే మిడతవంటి జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 3 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 3 🌻*

8. అపారము అనంతము దివ్యము పరమము అయిన ఈ కేవల శూన్యత్వములో -

1. చైతన్య స్థితియు లేదు, చైతన్యరాహిత్య స్థితియు లేదు.

2. అపరిమిత అహమ్‌ లేదు (దివ్యాహమ్‌), పరిమిత అహమ్‌ లేదు.

౩. సార్వభౌమిక మనస్సు లేదు, పరిమిత మనస్సు లేదు.

4. అపారమైన శక్తి లేదు. పరిమిత శక్తి లేదు.

5. మహాకారణ శరీరము లేదు. పరిమిత దేహము లేదు.

6. విశ్వములు లేవు, లోకములు లేవు.

చైతన్యమందుగాని లేక, చైతన్యరాహిత్యస్థితి యందు గాని అసలు ఎరుకే లేదు.
ఇది - నిర్గుణ నిరాకారమును కాదు. సగుణ సాకారమును కాదు. 
అక్కడ ఉన్నదే “భగవంతుడు” చైతన్యము “లేదు”. 

9. అపారము, కేవలము (పూర్ణము) అనంత దివ్యశూన్యత్వము (మహాకాశము) అయిన
పరాత్పరస్తితిలో అన్ని గుణములు, అన్ని రూపములు, అన్ని స్పితులు, అణు ప్రమాణ చైతన్యము, అనంతముగా ఎరుకగల అనంత చైతన్యమును; అనంతముగా ఎరుకలేని అనంత చైతన్యమును, అనంత భగవల్లీలయు, తనను తాను తెలిసి కొనవలెననెడి అనంత ఆదిప్రేరణము, భగవంతుని స్వీయ అనంత స్వభావత్రయము, తదితరములు

అన్నియు అంతర్ష్నిహితములై యున్నవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹