నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం - నాగ స్తోత్రం Navanaga Nama Stotram - Sarpa Suktam - Naga Stotram



https://youtu.be/W7z8M6_6yRo



🌹 నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం - నాగ స్తోత్రం 🌹

🐍 కలిదోష నివారణకు, సర్వ దోష విముక్తికి తప్పక పఠించ వలసిన స్తోత్రాలు 🐍



🌹 Navanaga Nama Stotram - Sarpa Suktam - Naga Stotram 🌹

🐍 Stotras that must be recited to prevent Kali Dosha and get rid of all sins 🐍


పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం పూజా విధులలో కొలుస్తారు. అవి అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, ఆశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియా, తక్షక, పింగళ నాగులు. సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాముకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

Like and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

'నమో నాగరాజ నమో ఫణిరాజా నమో నమో నాగేంద్రా' 'Namo Nagaraja Namo Phaniraja Namo Namo Nagendra' (a YT Short)



https://youtube.com/shorts/qaqX0xb2mBQ


🌹 నమో నాగరాజ నమో ఫణిరాజా నమో నమో నాగేంద్రా 🌹


🌹 Namo Nagaraja Namo Phaniraja Namo Namo Nagendra 🌹


(a YT Short)


నాగులచవితి రోజున చేయవలసిన సర్ప ప్రార్థన Nagulu Prarthana (Snake prayer) to be performed on Nagula Chavithi day



https://youtube.com/shorts/oGkWiySUAlA


🌹 నాగులచవితి రోజున చేయవలసిన సర్ప ప్రార్థన. తప్పక వినండి. 🌹

🌹 Snake prayer to be performed on Nagula Chavithi day. Must listen. 🌹


(a YT Short)

ఆపదలను కష్టాలను తొలగించి, దోషాలను నివారించే The Navanaga Nama Stotram - Sarpa Suktham


https://youtu.be/mxNBm68X2I8


🌹ఆపదలను కష్టాలను తొలగించి, దోషాలను నివారించే, రక్షణను కల్పించే నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం. 🌹

🌹The Navanaga Nama Stotram - Sarpa Suktham, which removes obstacles and hardships, prevents faults, and provides protection. 🌹



🌹🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀🌹

ప్రసాద్ భరద్వాజ


ఈ సందేశం నాగుల చవితి పర్వదినాన్ని గురించి వివరిస్తోంది. నాగుల చవితి పూజ విశిష్టతను, శరీరంలోని కాలనాగం పాత్రను, మనస్సులో ఉన్న కోపం, కామం మొదలైన పాపాలు ఎలా హరించ బడతాయో వివరిస్తుంది. శ్రీ మహావిష్ణువు శేషపాన్పుగా మారే ఆంతర్యమని కూడా తెలియజేస్తుంది. నవనాగ నామ స్తోత్రం, సర్ప సూక్తం వాచ్యముల విశేషాలు, వాటి ఫలితాలు ఇవ్వబడ్డాయి.

🌹🌹🌹🌹🌹


నాగుల చవితి శుభాకాంక్షలు Greetings on Nagula Chavithi


🐍. నాగులచవితి విశిష్టత 🐍

🌹🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀🌹

ప్రసాద్ భరద్వాజ


కాలనాగము మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.


🍀. నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం 🍀

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!

శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!


ఫలశృతి:

ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!

సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!


సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!

సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!


సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!

తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!


🙏ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి🙏

ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.

🐍🐍🐍🐍🐍




🌹. సర్ప సూక్తం 🌹


బ్రహ్మలోకేషు యేసర్పాః శేషనాగ పురోగమాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


ఇంద్రలోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


ఇంద్రలోకేషు యేసర్పాః తక్షకా ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


సత్యలోకేషు యేసర్పాః వాసుకి నా సురక్షితాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


మలయేచైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


పృథివ్యాం చైవ యేసర్పాః యే సాకేత నివాసినః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


గ్రామే యదివారణ్యే యేసర్పాః ప్రచరన్తిచ

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


సముద్ర తీరే యేసర్పాః యే సర్పా జలవాసినః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


రసాతలేఘ యేసర్పాః అనంతాది మహాబలాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

🌹 🌹 🌹 🌹 🌹


005 - కార్తీక పురాణం - 4 : 4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ Kartika Purana - 4 ; Chapter 4: The glory of Deeparadhana, the story of Shatrujit


🌹. కార్తీక పురాణం - 4 🌹

🌻 4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 4 🌹

🌻 Chapter 4: The glory of Deeparadhana, the story of Shatrujit. 🌻

📚. Prasad Bharadwaja



జనకుడు అడుగుతున్నాడు: "హే బ్రహ్మర్షీ ! నువ్వింత వరకూ కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో యీ వ్రత మాచరించాలో - ఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి."

వశిష్ట ఉవాచ: అన్ని పాపాలనూ మన్ను చేసేదీ, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేదీ అయిన యీ కార్తీక వ్రతానికి ఫలానా 'సంకల్పము' అనేది హాస్యాస్పదమయిన విషయము.

ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలనూ, తత్ఫలాలనూ చెబుతాను విను.

కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ - శివలింగ సన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకములో శివాలయములో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఇప్ప - నారింజనూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో - వాళ్లు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నయినా సమర్పించిన వాళ్లు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము, కాంక్షతో గాని - నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్లు కూడా శివప్రియులవుతారు. ఇందు కుదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను.


🌻. కార్తీక దీపారాధనా మహిమ

పూర్వము పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజొకడు, కుబేరుని మించిన సంపద కూర్చుకుని వున్నా, కుమారులు లేని కారణంగా క్రుంగిపోయినవాడై, కరంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని - అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, 'ఓ రాజా! ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి, బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే - నీకు తప్పక పుత్రక సంతానము కలుగుతుందని" చెప్పాడు. బుషి వాక్యమును శిరోధార్యముగా తలచి - ఆ పాంచాలుడు తన పట్టణము చేరి, కార్తీక వ్రతమాచరించి, శివప్రీతికై బ్రహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెల తప్పి, యుక్తకాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజ దంపతులా శిశువుకి 'శత్రుజిత్తు' అని పేరు పెట్టారు.


🌻. శత్రుజిత్తు చరిత్రము

ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్థమానుడై పెరిగి, యువకుడై, వీరుడై వేశ్యాంగనా లోలుడై, అప్పటికీ తృప్తి చెందక, పరస్త్రీరక్తుడై, యుక్తా యుక్త విచక్షణా నాస్తికుడై, శాస్త్ర దిక్కారియై, వర్ణసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదరించుచు, స్వేచ్చాచారియై ప్రవర్తింపసాగేడు. అటువంటి సందర్భంలో -సౌందర్యరాశి సింహమధ్యమా, అరటి దోనెల వంటి తొడలు గలదీ, పెద్ద పెద్ద పిరుదులూ, కుచాలూ, కన్నులూ కలదీ, చిలుకవలే చక్కని పలుకులు గలదీయైన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య, శౌర్య, తేజో విరాజితుడైన యీ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా - ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే - సంకేత స్ధలంలో రాజకుమారుని కలిసి - సురత క్రీడలలో సుఖించేది. రంకూ- బొంకూ దాగవు గదా! ఏదో విధంగా యీ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనొక కత్తిని ధరించి - ఈ రంకు జంటకు ప్రత్యక్షంగా చూసి, వారి గొంతు లుత్తరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకురాలయిన జారిణిగాని, ఆ శత్రుజిత్తుగాని యీ సంగతి నెరుగరు.

రోజులిలా గడుస్తూ వుండగా ఒకానొక కార్తీక పూర్ణిమా సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్ధానముగా యెంచుకున్నారు. అపరరాత్రివేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా వుంది. ఆ బాపనిది తన చీరచెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడెక్కడినించో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు.

ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడెలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తునీ, అనంతరం తన భార్యనూ తెగనరికి - తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్లు ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే - పాశహస్తులైన యమదూతలూ - పవిత్రాత్ములైన శివదూతలూ - ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలా రాకుమారుడినీ, రంకులాడినీ తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలీ యమాయకపు బాపడిని తమతో నరకమువైపు లాగుకొనిపోసాగారు. అందుకచ్చెరుపడిన పారుడు - "ఓ శివదూతలారా! కానిపని చేసిన వారికి కైలాసభోగము - నా వంటి సదాచారుడికి నరక యోగమూనా?' అని ప్రశ్నించగా, అందులకా శివదూతలు - 'వీరెంత పాపాత్ములయినా - ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి, శివాలయములో - అందునా - శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక, వారి పాపాలూ, నేరాలూ నశించి పుణ్యాత్ములయ్యారు.

ఏ కారణం చేతనైనాసరే కార్తీక మాసములో అందునా పౌర్ణమినాడు, పైగా సోమవారమునాడు దేవాలయములో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్యులైన వీళ్లని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివీ, పాపాత్ముడివీ అయ్యావు. అందుకే, నీకు నరకము - వీరికి కైలాసము' అని చెప్పారు.

బ్రహ్మణుడికీ, శివపారిషదులకూ జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, 'అయ్యలారా! దోషులము మేమైయుండగా, మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము గాదు. కార్తీక మాసము దొడ్డదయితే, అందునా పూర్ణిమ గొప్పదయితే, సోమవారము మరీ ఘనమయనదయితే, దీపారధాన మరీ పుణ్యకరమైనదయితే మాతోబాటే కలసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్ప'దని వాదించడం జరిగింది. తత్ఫలముగా - శత్రుజిత్తు తానూ, తన ప్రియురాలూ ఆచరించిన వత్తీ, తైలముల పుణ్యము తాముంచుకుని, ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా , శివదూతలా విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి - తమతో కైలాసానికి తీసికొనివెళ్ళారు.

కాబట్టి, ఓ మిధిలానగరాధీశ్వరా ! కార్తీకమాసములో తప్పనిసరిగా - శివాలయములోగాని, విష్ణ్వాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందునా, శివాలయములో చేసిన దీపారాధన విరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని - కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు చతుర్థాధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹