దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి Devi Navratra - Nav Durgas Sadhana - 3. Chandraghanta - Annapurna Devi

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి 🌹

📚 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

🌷. అలంకారము : అన్నపూర్ణ దేవి - లేత రంగు

🌷. నివేదనం : కొబ్బరి అన్నం

🌷. మహిమ :

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

🌷. చరిత్ర :

దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది.

ఈమె శరీర కాంతి బంగారు వన్నెలో మిలమిల లాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమర సన్నాహయై యుద్ధ ముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటా దేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడం వల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి.

వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹

08 Oct 2021

08-OCTOBER-2021

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 2. బ్రహ్మచారిణి 🌹
📚 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

🌷. అలంకారము : గాయత్రీ దేవి - పసుపు రంగు
🌷. నివేదనం : పులిహోర  

🌷. మహిమ :
ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.
శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది .

దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

🌷. చరిత్ర :
హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.

ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.

బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“

దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమె కృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గాయత్రీ కవచం Sri Gayatri Kavacham

🌹. శ్రీ గాయత్రీ కవచం 🌹

ఓం శ్రీగణేశాయ నమః !!

యాజ్ఞవల్క్య ఉవాచ:-

1) స్వామిన్ సర్వజగన్నాథ సంశయోఽస్తి మహాన్మమ ! చతుఃషష్ఠికలానం చ పాతకానాం చ తద్వద !!

2) ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపం కథం భవేత్ .! దేహం చ దేవతారూపం మంత్రరూపం విశేషతః !!

3) క్రమతః శ్రోతుమిచ్ఛామి కవచం విధిపూర్వకం ! బ్రహ్మోవాచ ! గాయత్ర్యాః కవచస్యాస్య బ్రహ్మా విష్ణుః శివో ఋషిః !!

4) ఋగ్యజుః సామాథర్వాణి ఛందాంసి పరికీర్తితాః ! పరబ్రహ్మస్వరూపా సా గాయత్రీ దేవతా స్మృతా !!

5) రక్షాహీనం తు యత్స్థానం కవచేన వినా కృతం ! సర్వం సర్వత్ర సంరక్షేత్సర్వాంగం భువనేశ్వరీ !!

6) బీజం భర్గశ్చ యుక్తిశ్చ ధియః కీలకమేవ చ ! పురుషార్థవినియోగో యో నశ్చ పరికీర్త్తితః !!

7) ఋషిం మూర్ధ్ని న్యసేత్పూర్వం ముఖే ఛంద ఉదీరితం ! దేవతాం హృది విన్యస్య గుహ్యే బీజం నియోజ యేత్ !!

8) శక్తిం విన్యస్య పదయోర్నాభౌ తు కీలకం న్యసేత్ ! ద్వాత్రింశత్తు మహావిద్యాః సాంఖ్యాయనస గోత్రజాః !!

9) ద్వాదశ లక్ష సంయుక్తా వినియోగాః పృథక్పృథక్ ! ఏవం న్యాసవిధిం కృత్వా కరాంగం విధిపూర్వకం !!

10) వ్యాహృతి త్రయముచ్చార్య హ్యనులోమ విలోమతః ! చతురక్షరసంయుక్తం కరాంగన్యాసమాచరేత్ !!

11) ఆవాహనాది భేదం చ దశ ముద్రాః ప్రదర్శయేత్ ! సా పాతు వరదా దేవీ అంగప్రత్యంగసంగమే !!

12) ధ్యానం ముద్రాం నమస్కారం గురుమంత్రం తథైవ చ ! సంయోగమాత్మసిద్ధిం చ షడ్విధం కిం విచారయేత్ !!

అస్య శ్రీగాయత్రీ కవచస్య బ్రహ్మవిష్ణురుద్రా ఋషయః,

ఋగ్యజుఃసామాధర్వాణి ఛందాంసి,
పరబ్రహ్మస్వరూపిణీ గాయత్రీ దేవతా,
భూర్బీజం, భువః శక్తిః, స్వాహా కీలకం,

శ్రీగాయత్రీప్రీత్యర్థే జపే వినియోగః !! ఓం భూర్భువః స్వః తత్సవితురితి హృదయాయ నమః !

ఓం భూర్భువః స్వః వరేణ్యమితి శిరసే స్వాహా ! ఓం భూర్భువః స్వః భర్గో దేవస్యేతి శిఖాయై వషట్ ! ఓం భూర్భువః స్వః ధీమహీతి కవచాయ హుం ! ఓం భూర్భువః స్వః ధియో యో నః ఇతి నేత్రత్రయాయ వౌషట్ ! ఓం భూర్భువః స్వః ప్రచోదయాదితి అస్త్రాయ ఫట్ !!

13) వర్ణాస్త్రాం కుండికాహస్తాం శుద్ధనిర్మలజ్యోతిషీమ్మ్ ! సర్వతత్త్వమయీం వందే గాయత్రీం వేదమాతరం !!

. అథ ధ్యానం:-

14) ముక్తా విద్రుమహేమనీలధవలచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణై- ర్యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం ! గాయత్రీం వరదాభయాంకుశ కశాం శూలం కపాలం గుణం శంఖం చక్రమథారవిందయుగలం హస్తైర్వహంతీం భజే !!

15) ఓం గాయత్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే ! బ్రహ్మవిద్యా చ మే పశ్చాదుత్తరే మాం సరస్వతీ !!

16) పావకీ మే దిశం రక్షేత్పావకోజ్జ్వలశాలినీ ! యాతుధానీం దిశం రక్షేద్యాతు ధానగణార్దినీ !!

17) పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ ! దిశం రౌద్రీమవతు మే రుద్రాణీ రుద్రరూపిణీ !!

18) ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా ! ఏవం దశ దిశో రక్షేత్ సర్వతో భువనేశ్వరీ !!

19) బ్రహ్మాస్త్ర స్మరణాదేవ వాచాం సిద్ధిః ప్రజాయతే ! బ్రహ్మదండశ్చ మే పాతు సర్వశస్త్రాస్త్ర భక్షక్రః !!

20) బ్రహ్మశీర్షస్తథా పాతు శత్రూణాం వధకారకః ! సప్త వ్యాహృతయః పాంతు సర్వదా బిందుసంయుతాః !!

21) వేదమాతా చ మాం పాతు సరహస్యా సదైవతా ! దేవీసూక్తం సదా పాతు సహస్రాక్షర దేవతా !!

22) చతుఃషష్టికలా విద్యా దివ్యాద్యా పాతు దేవతా ! బీజశక్తిశ్చ మే పాతు పాతు విక్రమ దేవతా !!

23) తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదం ! వరేణ్యం కటిదేశం తు నాభిం భర్గస్తథైవ చ !!

24)దేవస్య మే తు హృదయం ధీమహీతి గలం తథా ! ధియో మే పాతు జిహ్వాయాం యఃపదం పాతు లోచనే !!

25) లలాటే నః పదం పాతు మూర్ధానం మే ప్రచోదయాత్ ! తద్వర్ణః పాతు మూర్ధానం సకారః పాతు భాలకం !!

26) చక్షుషీ మే వికారస్తు శ్రోత్రం రక్షేత్తు కారకః ! నాసాపుటేర్వకారో మే రేకారస్తు కపోలయోః !!

27) ణికారస్త్వ ధరోష్ఠే చ యకారస్తూర్ధ్వ ఓష్ఠకే ! ఆత్యమధ్యే భకారస్తు గోకారస్తు కపోలయోః !!

28) దేకారః కంఠదేశే చ వకారః స్కంధదేశయోః ! స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామహస్తకం !!

29) మకారో హృదయం రక్షేద్ధికారో జఠరం తథా ! ధికారో నాభిదేశం తు యోకారస్తు కటిద్వయం !!

30) గుహ్యం రక్షతు యోకార ఊరూ మే నః పదాక్షరం ! ప్రకారో జానునీ రక్షేచ్చోకారో జంఘదేశయోః !!

31) దకారో గుల్భదేశం తు యాత్కారః పాదయుగ్మకం ! జాతవేదేతి గాయత్రీ త్ర్యంబకేతి దశాక్షరా !!

32) సర్వతః సర్వదా పాతు ఆపోజ్యోతీతి షోడశీ ! ఇదం తు కవచం దివ్యం బాధాశతవినాశకం !!

33) చతుఃషష్ఠి కలావిద్యాసకలైశ్వర్యసిద్ధిదం ! జపారంభే చ హృదయం జపాంతే కవచం పఠేత్ !!

34) స్త్రీగోబ్రాహ్మణ మిత్రాదిద్రోహాద్యఖిలపాతకైః ! ముచ్యతే సర్వపాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి !!

35) పుష్పాంజలిం చ గాయత్ర్యా మూలేనైవ పఠేత్సకృత్ ! శతసాహస్రవర్షాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ !!

36) భూర్జపత్రే లిఖిత్వైతత్ స్వకంఠే ధారయేద్యది ! శిఖాయాం దక్షిణే బాహౌ కంఠే వా ధారయేద్బుధః !!

37) త్రైలోక్యం క్షోభయేత్సర్వం త్రైలోక్యం దహతి క్షణాత్ ! పుత్రవాన్ ధనవాన్ శ్రీమాన్నానావిద్యానిధిర్భవేత్ !!

38) బ్రహ్మాస్త్రాదీని సర్వాణి తదంగ స్పర్శనాత్తతః ! భవంతి తస్య తుచ్ఛని కిమన్యత్కథయామి తే !!

39) అభిమంత్రిత గాయత్రీకవచం మానసం పఠేత్ ! తజ్జలం పిబతో నిత్యం పురశ్చర్యాఫలం భవేత్ !!

40)లఘుసామాన్యకం మంత్రం, మహామంత్రం తథైవ చ ! యో వేత్తి ధారణాం యుంజన్, జీవన్ముక్తః స ఉచ్యతే !!

41)సప్తావ్యాహృతివిప్రేంద్ర సప్తావస్థాః ప్రకీర్తితాః ! సప్తజీవశతా నిత్యం వ్యాహృతీ అగ్నిరూపిణీ !!

42) ప్రణవే నిత్యయుక్తస్య వ్యాహృతీషు చ సప్తసు ! సర్వేషామేవ పాపానాం సంకరే సముపస్థితే !!

43) శతం సహస్రమభ్యర్చ్య గాయత్రీ పావనం మహత్ ! దశశతమష్టోత్తరశతం గాయత్రీ పావనం మహత్ !!

44) భక్తియుక్తో భవేద్విప్రః సంధ్యాకర్మ సమాచరేత్ ! కాలే కాలే ప్రకర్తవ్యం సిద్ధిర్భవతి నాన్యథా !!

45) ప్రణవం పూర్వముద్ధృత్య భూర్భువస్వస్తథైవ చ ! తుర్యం సహైవ గయత్రీజప ఏవముదాహృతం !!

46) తురీయ పాదముత్సృజ్య గాయత్రీం చ జపేద్ద్విజః ! స మూఢో నరకం యాతి కాలసూత్రమధోగతిః !!

47) మంత్రాదౌ జననం ప్రోక్తం మత్రాంతే మృతసూత్రకం ! ఉభయోర్దోషనిర్ముక్తం గాయత్రీ సఫలా భవేత్ !!

48) మత్రాదౌ పాశబీజం చ మంత్రాంతే కుశబీజకం ! మంత్రమధ్యే తు యా మాయా గాయత్రీ సఫలా భవేత్ !!

49) వాచికస్త్వహ మేవ స్యాదుపాంశు శతముచ్యతే ! సహస్రం మానసం ప్రోక్తం త్రివిధం జపలక్షణం !!

50)అక్షమాలాం చ ముద్రాం చ గురోరపి న దర్శయేత్ ! జపం చాక్షస్వరూభేణానామికామధ్యపర్వణి !!

51)అనామా మధ్యయా హీనా కనిష్ఠాదిక్రమేణ తు ! తర్జనీమూలపర్యంతం గాయత్రీ జపలక్షణం !!

52) పర్వభిస్తు జపేదేవమన్యత్ర నియమః స్మృతః ! గాయత్రీ వేదమూలత్వాద్వేదః పర్వసు గీయతే !!

53) దశభిర్జన్మ జనితం శతేనైవ పురా కృతం ! త్రియుగం తు సహస్రాణి గాయత్రీ హంతి కిల్బిషం !!

54) ప్రాతఃకాలేయు కర్తవ్యం సిద్ధిం విప్రో య ఇచ్ఛతి ! నాదాలయే సమాధిశ్చ సంధ్యాయాం సముపాసతే !!

55) అంగుల్యగ్రేణ యజ్జప్తం యజ్జప్తం మేరులంఘనే ! అసంఖ్యయా చ యజ్జప్తం తజ్జప్తం నిష్ఫలం భవేత్ !!

56) వినా వస్త్రం ప్రకుర్వీత గాయత్రీ నిష్ఫలా భవేత్ ! వస్త్రపుచ్ఛం న జానాతి వృథా తస్య పరిశ్రమః !!

57) గాయత్రీం తు పరిత్యజ్య అన్యమంత్రముపాసతే ! సిద్ధాన్నం చ పరిత్యజ్య భిక్షామటతి దుర్మతిః !!

58) ఋషిశ్ఛందో దేవతాఖ్యా బీజం శక్తిశ్చ కీలకం ! నియోగం న చ జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ !!

59)వర్ణముద్రాధ్యానపదమావాహనవిసర్జనం ! దీపం చక్రం న జానాతి గాయత్రీ నిషఫలా భవేత్ !!

60) శక్తిర్న్యాస స్తథా స్థానం మంత్రసంబోధనం పరం ! త్రివిధం యో న జానాతి గాయత్రీ తస్య నిష్ఫలా !!

61) పంచోపచార కాంశ్చైవ హోమద్రవ్యం తథైవ చ ! పంచాంగం చ వినా నిత్యం గాయత్రీ నిష్ఫలా భవేత్ !!

62) మంత్రసిద్ధిర్భవే జ్జాతు విశ్వామిత్రేణ భాషిం ! వ్యాసో వాచస్పతిర్జీవస్తుతా దేవీ తపఃస్మృతౌ!!

63) సహస్రజప్తా సా దేవీ హ్యుప పాతకనాశినీ ! లక్షజాప్యే తథా తచ్చ మహా పాతక నాశినీ ! కోటిజాప్యేన రాజేంద్ర యదిచ్ఛతి తదాప్నుయాత్ !!

64)న దేయం పరశిష్యేభ్యో హ్యభక్తేభ్యో విశేషతః ! శిష్యేభ్యో భక్తియుక్తేభ్యో హ్యన్యథా మృత్యు మాప్నుయాత్ !!

ఇతి శ్రీమద్వసిష్ఠ సంహితోక్తం శ్రీ గాయత్రీ కవచం సంపూర్ణం.

🌹 🌹 🌹 🌹 🌹

08 Oct 2021

దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 2. బ్రహ్మచారిణి Devi Navratras - Nava Durgas Sadhana - 2. Brahmacharini