విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 463, 464 / Vishnu Sahasranama Contemplation - 463, 464

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 463 / Vishnu Sahasranama Contemplation - 463 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 463. వీరబాహుః, वीरबाहुः, Vīrabāhuḥ 🌻

ఓం వీరబాహవే నమః | ॐ वीरबाहवे नमः | OM Vīrabāhave namaḥ

స్థాపయన్వేదమర్యాదాం నిఘ్నంస్త్రిదశవిద్విషః ।
యద్వీరబాహవోస్యేతి వీరబాహుస్సఉచ్యతే ॥

దేవశత్రువులను చంపునదియు వేదమర్యాదను చెడకుండ నిలుపునదియు అగు వీరము, విక్రమశాలి అగు బాహువు ఈతనికి కలదు. కావున హరి 'వీరబాహుః' అనబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 463🌹

📚. Prasad Bharadwaj

🌻 463. Vīrabāhuḥ 🌻

OM Vīrabāhave namaḥ

Sthāpayanvedamaryādāṃ nighnaṃstridaśavidviṣaḥ,
Yadvīrabāhavosyeti vīrabāhussaucyate.

स्थापयन्वेदमर्यादां निघ्नंस्त्रिदशविद्विषः ।
यद्वीरबाहवोस्येति वीरबाहुस्सउच्यते॥

One whose arms are capable of heroic deeds in nullifying the asuras or demons and establishing the righteous Vedic dharma.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr̥t ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 464 / Vishnu Sahasranama Contemplation - 464 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 464. విదారణః, विदारणः, Vidāraṇaḥ🌻

ఓం విదారణాయ నమః | ॐ विदारणाय नमः | OM Vidāraṇāya namaḥ

అధార్మికాన్విదారయత్యతో విష్ణుర్విదారణః అధార్మికులను చీల్చు విష్ణువు 'విదారణః' అని చెప్పబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 464🌹

📚. Prasad Bharadwaj

🌻464. Vidāraṇaḥ🌻

OM Vidāraṇāya namaḥ

Adhārmikānvidārayatyato viṣṇurvidāraṇaḥ / अधार्मिकान्विदारयत्यतो विष्णुर्विदारणः He destroys the unrighteous and hence He is known as Vidāraṇaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr̥t ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

28 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 119

🌹. దేవాపి మహర్షి బోధనలు - 119 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 96. పనితనము 🌻

కొందరు పరమగురువుల బృందముల గూర్చి మాటాడరు. తలవంచుకొని వారి పని వారు చేయుచుందురు. మరికొందరు గురువులను గూర్చి అధికముగ మాట్లాడుదురు. మా అనుభవమున రెండవ తెగవారే మా బృందమునకు ద్రోహము చేయుదురు. మాకు అధికముగ మాటాడువారన్నచో భయము. మౌనముగ పనిచేయువారు మా దృష్టిలో శ్రేయస్కరులు. అధిక భాషణము అపాయకరము. పనిచేయువారికది తగదు.

మమ్మనుసరించువారికి పగలు పనిచేయుట, రాత్రి నిద్రించుట అని యుండదు. పగలుబట్టి పనికాదు. పనిని బట్టి పగలు. పని యున్నచో వారికి పగలు, రాత్రి తేడా యుండదు. ఇట్టివారే పనిని ప్రేమింపగలవారు. అట్టివారిని మేము ప్రేమింతుము. ఇట్టిపనివారు ఉల్లాసముగ నృత్యము, గీతము అనుభవించు చున్నట్లుగ పనిచేయు చున్నప్పుడు మేమును వారితో వంత కలుపుదుము.చేయవలసిన పనియందు యిట్టి ప్రీతికలుగుట ఉత్తమోత్తమ స్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 51

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 51 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రార్థన తెలిసిన మనిషి తాకితే ధూళి కూడా బంగారు రంగుతో మెరుస్తుంది. ప్రార్థన అన్నది యింద్రజాల శక్తి. కాని అది ధ్యానం గుండా వస్తుంది. మరో మార్గం గుండా రాదు. 🍀

ధ్యానం చేయి. అపుడు ప్రార్థన రంగంలోకి వస్తుంది. దానికి ఆధారమేమిటంటే ప్రార్థన వచ్చినపుడు దాంతో బాటు పరిమళం కూడా వస్తుంది. నీ అనుభవానికి సంబంధించిన పరిమళాన్ని యితరులు అనుభూతి చెందుతారు. దాన్ని నువ్వు ప్రసరించవచ్చు. నువ్వు ఆదిగానే వున్నావు. నువ్వు స్పర్శించిన ప్రతిదీ ఆనంద నాట్యం చేస్తుంది. ప్రార్థన తెలిసిన మనిషి తాకితే ధూళి కూడా బంగారు రంగుతో మెరుస్తుంది. ప్రార్థన అన్నది యింద్రజాల శక్తి. కాని అది ధ్యానం గుండా వస్తుంది. మరో మార్గం గుండా రాదు.

అందువల్ల నేను ధ్యానం గురించి పదే పదే ఒత్తి చెబుతాను. ప్రార్థన గురించి చెబుతాను. ఎందుకంటే అక్కడ ప్రార్థన అనివార్యం. ఎందుకంటే అక్కడ ప్రార్థన తప్పనిసరి అని నాకు తెలుసు. ధ్యానమంటే ప్రార్థన అనివార్యం. ఫలితం పరిమళం సహజంగా ప్రసరిస్తుంది. కాబట్టి ప్రార్థనని బోధించకండి.

నేను మానవత్వం గురించి వుపన్యసించను. ఎందుకంటే కావలసింది ధ్యానం. అక్కడ ధ్యానముండే ప్రతిదీ దాన్ని అనుసరిస్తుంది. సకాలంలో, సరయిన సమయంలో అన్నీ సమకూరుతాయి. ప్రార్థన వస్తుంది. ప్రార్థన నుంచి మానవ జాతి పట్ల మమకారం వస్తుంది. అది దాని పరిమళ ప్రభావం.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 295-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 295-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 295-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 295-1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀

🌻 295-1. 'అంబికా'🌻

జగన్మాత అని ఈ నామమున కర్థము. మాతృభావము జీవులకు సంక్రమించుట శ్రీమాత నుండియే. మాతృభావము నిర్మలమైన ప్రేమ భావము. తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు. పిల్లలకు తల్లిపై ప్రేమ యుండుట అంతంతమాత్రమే. కాని తల్లికి పిల్లలపై ప్రేమ అత్యధికము. తన నుండి పుట్టుట వలన ప్రతి తల్లి తన పిల్లలను అత్యధికముగ ప్రేమించును. తన పిల్లల తరువాతే తల్లి కెవ్వరైనను. కేవలము మహోన్నతమైన వ్యక్తులే ఇతరులను కూడ తమ పిల్లలతో సమానముగ చూడగలరు.

మహా భారతమున కుంతీదేవి, ద్రౌపదీదేవి అట్టివారు. అందరికీ తల్లు లుందురు గాని, కొందరే తల్లులు కాగలరు. పురుషులు తల్లులు కాలేరు గనుక వారియందు మాతృభావము తక్కువ. హృదయ వికాసము కలిగినవారే ఇట్టి మాతృభావమును కలిగియుందురు. ఆ రుచి వారికి తెలియును. మహత్తరమైన జ్ఞానులు కాకున్ననూ, తల్లులు మధురమైన మాతృభావము ననుభవింతురు. అందలి మాధుర్యము వారికే తెలియును. ఆ మాధుర్యము కారణముగనే ఉచ్చ నీచములను మరచి పిల్లలకు సేవ చేయుదురు.

మహాత్ముల యందు కూడ ఈ మాతృభావము ఆవిష్కరింప బడుటచే వారునూ ఉచ్చ, నీచములు మఱచి జీవులకు సేవ చేయుదురు. అట్టి శ్రీమాత మాతృ భావము అంబికా భావము నుండి విడుదల అగుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 295-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |
ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀

🌻 Ambikā अम्बिका (295) 🌻

The mother of the universe. This is different from the first nāma Śrī Mātā. There She was referred as the mother of all living beings of the universe. Here She is called as the mother of the universe itself comprising of both living and non-living beings.

This nāma mentions about Her creative action that comprises of iccā, jñāna and kriyā śaktī-s (desire or will, knowledge and action). There is also a saying that Śiva represents day and Śaktī represents night, basically due to Her māyā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2021

28-JULY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-70 / Bhagavad-Gita - 1-70 - 2 - 23🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 638 / Bhagavad-Gita - 638 - 18-49🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 463 464 / Vishnu Sahasranama Contemplation - 463, 464🌹
4) 🌹 Daily Wisdom - 145🌹
5) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 119 🌹
6) 🌹. నిర్మల ధ్యానములు - 51🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 295-1 / Sri Lalita Chaitanya Vijnanam - 295-1🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 70 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 23 🌴*

23. నైనం చిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావక: |
 న చైనం క్లేక్లేదయన్త్యాపో న శోషయతి మారుత: ||

🌷. తాత్పర్యం :
*ఆత్మ ఎత్తి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే శోషింపబడదు.*

🌷. భాష్యము :
ఖడ్గములు, ఆగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయవ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేవు. 

ఆధునిక అగ్ని అస్త్రములతో పాటు పృథివి, జలము,వాయువు,ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు సైతము పలుగాలవని తెలియవచ్చుచున్నది. ఈనాటి అణ్వస్త్రములు ఆగ్నేయాస్త్రములు కోవకు చెందినవి. కాని పూర్వపు అస్త్రములు అన్నిరకములైన భౌతిక ములకములతో చేయబడి యుండెడివి. 

ఆగ్నేయాస్త్రములు వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతుల నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రమునకు తెలియవు. అదే కాకుండా వాయవ్యాస్త్రములు గూర్చి నవీన శాస్త్రజ్ఞులకు ఏమాత్రము జ్ఞానము లేదు. ఏదిఏమైనను ఎన్ని ఆయుధములను ఉపయోగించినను (అవి ఎంతటి వైజ్ఞానికములైననను) ఆత్మ చేదింపబడదు లేదా నశింపబడదు.

ఏ విధముగా ఆత్మ అజ్ఞానముచే ఉనికి లోనికి వచ్చి ఆపై మాయచే కప్పబడుచున్నదో మాయవాదులు వివరింపలేరు. అలాగుననే మూలమైన పరమాత్మా నుండి ఆత్మలను ఖండించుటయు సాధ్యమయిన విషయము కాదు. 

వాస్తవమునకు ఆత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడివడియుండెడి అంశలు. నిత్యముగా(సనాతముగా) విడివడియుండెడి అంశలైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడునవై యున్నవి. అగ్నికణములు అగ్ని గునమునే కలిగియున్నట్లు, భగవానుని సాహచార్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడిగలవు. జీవులు శ్రీకృష్ణభగవానుని నుండి విడివడియున్న అంశలుగా వరాహపురాణమునందు వర్ణింపబడినది. 

భగవద్గీత ప్రకారము కుడా ఈ విషయము సత్యమై యున్నది. కావున మాయ నుండి ముక్తి పొందిన పిదపయు జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే యుండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు ఒసగిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము వలన అర్జునుడు ముక్తిని పొందెనే గాని శ్రీకృష్ణునితో ఎన్నడును ఏకము కాలేదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 70 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 23 🌴*

23. nainaṁ chindanti śastrāṇi nainaṁ dahati pāvakaḥ 
na cainaṁ kledayanty āpo na śoṣayati mārutaḥ

🌻 Translation :
*The soul can never be cut to pieces by any weapon, nor burned by fire, nor moistened by water, nor withered by the wind.*

🌻 Purport :
All kinds of weapons – swords, flame weapons, rain weapons, tornado weapons, etc. – are unable to kill the spirit soul. It appears that there were many kinds of weapons made of earth, water, air, ether, etc., in addition to the modern weapons of fire. Even the nuclear weapons of the modern age are classified as fire weapons, but formerly there were other weapons made of all different types of material elements. 

Fire weapons were counteracted by water weapons, which are now unknown to modern science. Nor do modern scientists have knowledge of tornado weapons. Nonetheless, the soul can never be cut into pieces, nor annihilated by any number of weapons, regardless of scientific devices.

The Māyāvādī cannot explain how the individual soul came into existence simply by ignorance and consequently became covered by the illusory energy. Nor was it ever possible to cut the individual souls from the original Supreme Soul; rather, the individual souls are eternally separated parts of the Supreme Soul. 

Because they are atomic individual souls eternally (sanātana), they are prone to be covered by the illusory energy, and thus they become separated from the association of the Supreme Lord, just as the sparks of a fire, although one in quality with the fire, are prone to be extinguished when out of the fire. In the Varāha Purāṇa, the living entities are described as separated parts and parcels of the Supreme. 

They are eternally so, according to the Bhagavad-gītā also. So, even after being liberated from illusion, the living entity remains a separate identity, as is evident from the teachings of the Lord to Arjuna. Arjuna became liberated by the knowledge received from Kṛṣṇa, but he never became one with Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 639 / Bhagavad-Gita - 639 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 50 🌴*

50. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||

🌷. తాత్పర్యం : 
ఓ కుంతీపుత్రా! ఇట్టి పూర్ణత్వమును పొందినవాడు నేను ఇపుడు సంగ్రహముగా చెప్పాబోవు రీతి వర్తించుచు అత్యున్నత జ్ఞానస్థితియైన పరమపూర్ణత్వస్థితిని (పర బ్రహ్మము) ఏ విధముగా బడయగలడో నీవు ఆలకింపుము.

🌷. భాష్యము :
కేవలము స్వధర్మమునందు నెలకొనినవాడై దానిని భగవంతుని కొరకు ఒనరించుట ద్వారా ఏ విధముగా మనుజుడు అత్యున్నత పూర్ణత్వస్థితిని బడయగలడో శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు వివరించుచున్నాడు. 

కర్మఫలములను శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై త్యాగమొనర్చుట ద్వారా మానవుడు బ్రహ్మముయొక్క దివ్యస్థితి బడయగలడు. అదియే ఆత్మానుభవ విధానము. నిజమైన జ్ఞానపూర్ణత్వము పవిత్రమగు కృష్ణభక్తిభావనను పొందుట యందే గలదు. ఈ విషయము రాబోవు శ్లోకములందు వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 639 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 50 🌴*

50. siddhiṁ prāpto yathā brahma
tathāpnoti nibodha me
samāsenaiva kaunteya
niṣṭhā jñānasya yā parā

🌷 Translation : 
O son of Kuntī, learn from Me how one who has achieved this perfection can attain to the supreme perfectional stage, Brahman, the stage of highest knowledge, by acting in the way I shall now summarize.

🌹 Purport :
The Lord describes for Arjuna how one can achieve the highest perfectional stage simply by being engaged in his occupational duty, performing that duty for the Supreme Personality of Godhead. 

One attains the supreme stage of Brahman simply by renouncing the result of his work for the satisfaction of the Supreme Lord. That is the process of self-realization. The actual perfection of knowledge is in attaining pure Kṛṣṇa consciousness; that is described in the following verses.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 463, 464 / Vishnu Sahasranama Contemplation - 463, 464 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 463. వీరబాహుః, वीरबाहुः, Vīrabāhuḥ 🌻*

*ఓం వీరబాహవే నమః | ॐ वीरबाहवे नमः | OM Vīrabāhave namaḥ*

స్థాపయన్వేదమర్యాదాం నిఘ్నంస్త్రిదశవిద్విషః ।
యద్వీరబాహవోస్యేతి వీరబాహుస్సఉచ్యతే ॥

దేవశత్రువులను చంపునదియు వేదమర్యాదను చెడకుండ నిలుపునదియు అగు వీరము, విక్రమశాలి అగు బాహువు ఈతనికి కలదు. కావున హరి 'వీరబాహుః' అనబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 463🌹*
📚. Prasad Bharadwaj

*🌻 463. Vīrabāhuḥ 🌻*

*OM Vīrabāhave namaḥ*

Sthāpayanvedamaryādāṃ nighnaṃstridaśavidviṣaḥ,
Yadvīrabāhavosyeti vīrabāhussaucyate.

स्थापयन्वेदमर्यादां निघ्नंस्त्रिदशविद्विषः ।
यद्वीरबाहवोस्येति वीरबाहुस्सउच्यते॥

One whose arms are capable of heroic deeds in nullifying the asuras or demons and establishing the righteous Vedic dharma.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr‌t ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 464 / Vishnu Sahasranama Contemplation - 464 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 464. విదారణః, विदारणः, Vidāraṇaḥ🌻*

*ఓం విదారణాయ నమః | ॐ विदारणाय नमः | OM Vidāraṇāya namaḥ*

అధార్మికాన్విదారయత్యతో విష్ణుర్విదారణః అధార్మికులను చీల్చు విష్ణువు 'విదారణః' అని చెప్పబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 464🌹*
📚. Prasad Bharadwaj

*🌻464. Vidāraṇaḥ🌻*

*OM Vidāraṇāya namaḥ*

Adhārmikānvidārayatyato viṣṇurvidāraṇaḥ / अधार्मिकान्विदारयत्यतो विष्णुर्विदारणः He destroys the unrighteous and hence He is known as Vidāraṇaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr‌t ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 145 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 24. Self-knowledge can be Attained even in this Very Life 🌻*

Swami Sivananda teaches that the bondage of man consists in his ignorance of the true nature of his Self and that his freedom is in the knowledge of the Self. By bondage he means subjection to the process of birth and death and the consequent experience of suffering and pain. 

Self-knowledge can be attained even in this very life, provided one puts forth sufficient effort towards this end. True happiness can be had only in the Self, and it is futile to search for it in this temporal world, which does not partake of the nature of Reality. The knowledge that man has to strive for is not a theoretical understanding but is the consciousness of the Self. 

It is neither information gathered regarding the Self, nor a mere acquaintance with it through discursive reason, that can liberate man from his bondage. What is required is practical realisation, which is possible only through profound meditation on the nature of Brahman.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 119 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 96. పనితనము 🌻*

కొందరు పరమగురువుల బృందముల గూర్చి మాటాడరు. తలవంచుకొని వారి పని వారు చేయుచుందురు. మరికొందరు గురువులను గూర్చి అధికముగ మాట్లాడుదురు. మా అనుభవమున రెండవ తెగవారే మా బృందమునకు ద్రోహము చేయుదురు. మాకు అధికముగ మాటాడువారన్నచో భయము. మౌనముగ పనిచేయువారు మా దృష్టిలో శ్రేయస్కరులు. అధిక భాషణము అపాయకరము. పనిచేయువారికది తగదు. 

మమ్మనుసరించువారికి పగలు పనిచేయుట, రాత్రి నిద్రించుట అని యుండదు. పగలుబట్టి పనికాదు. పనిని బట్టి పగలు. పని యున్నచో వారికి పగలు, రాత్రి తేడా యుండదు. ఇట్టివారే పనిని ప్రేమింపగలవారు. అట్టివారిని మేము ప్రేమింతుము. ఇట్టిపనివారు ఉల్లాసముగ నృత్యము, గీతము అనుభవించు చున్నట్లుగ పనిచేయు చున్నప్పుడు మేమును వారితో వంత కలుపుదుము.చేయవలసిన పనియందు యిట్టి ప్రీతికలుగుట ఉత్తమోత్తమ స్థితి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 51 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ప్రార్థన తెలిసిన మనిషి తాకితే ధూళి కూడా బంగారు రంగుతో మెరుస్తుంది. ప్రార్థన అన్నది యింద్రజాల శక్తి. కాని అది ధ్యానం గుండా వస్తుంది. మరో మార్గం గుండా రాదు. 🍀*

ధ్యానం చేయి. అపుడు ప్రార్థన రంగంలోకి వస్తుంది. దానికి ఆధారమేమిటంటే ప్రార్థన వచ్చినపుడు దాంతో బాటు పరిమళం కూడా వస్తుంది. నీ అనుభవానికి సంబంధించిన పరిమళాన్ని యితరులు అనుభూతి చెందుతారు. దాన్ని నువ్వు ప్రసరించవచ్చు. నువ్వు ఆదిగానే వున్నావు. నువ్వు స్పర్శించిన ప్రతిదీ ఆనంద నాట్యం చేస్తుంది. ప్రార్థన తెలిసిన మనిషి తాకితే ధూళి కూడా బంగారు రంగుతో మెరుస్తుంది. ప్రార్థన అన్నది యింద్రజాల శక్తి. కాని అది ధ్యానం గుండా వస్తుంది. మరో మార్గం గుండా రాదు. 

అందువల్ల నేను ధ్యానం గురించి పదే పదే ఒత్తి చెబుతాను. ప్రార్థన గురించి చెబుతాను. ఎందుకంటే అక్కడ ప్రార్థన అనివార్యం. ఎందుకంటే అక్కడ ప్రార్థన తప్పనిసరి అని నాకు తెలుసు. ధ్యానమంటే ప్రార్థన అనివార్యం. ఫలితం పరిమళం సహజంగా ప్రసరిస్తుంది. కాబట్టి ప్రార్థనని బోధించకండి. 

నేను మానవత్వం గురించి వుపన్యసించను. ఎందుకంటే కావలసింది ధ్యానం. అక్కడ ధ్యానముండే ప్రతిదీ దాన్ని అనుసరిస్తుంది. సకాలంలో, సరయిన సమయంలో అన్నీ సమకూరుతాయి. ప్రార్థన వస్తుంది. ప్రార్థన నుంచి మానవ జాతి పట్ల మమకారం వస్తుంది. అది దాని పరిమళ ప్రభావం.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 295-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 295-1 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।*
*అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀*

*🌻 295-1. 'అంబికా'🌻* 

జగన్మాత అని ఈ నామమున కర్థము. మాతృభావము జీవులకు సంక్రమించుట శ్రీమాత నుండియే. మాతృభావము నిర్మలమైన ప్రేమ భావము. తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు. పిల్లలకు తల్లిపై ప్రేమ యుండుట అంతంతమాత్రమే. కాని తల్లికి పిల్లలపై ప్రేమ అత్యధికము. తన నుండి పుట్టుట వలన ప్రతి తల్లి తన పిల్లలను అత్యధికముగ ప్రేమించును. తన పిల్లల తరువాతే తల్లి కెవ్వరైనను. కేవలము మహోన్నతమైన వ్యక్తులే ఇతరులను కూడ తమ పిల్లలతో సమానముగ చూడగలరు. 

మహా భారతమున కుంతీదేవి, ద్రౌపదీదేవి అట్టివారు. అందరికీ తల్లు లుందురు గాని, కొందరే తల్లులు కాగలరు. పురుషులు తల్లులు కాలేరు గనుక వారియందు మాతృభావము తక్కువ. హృదయ వికాసము కలిగినవారే ఇట్టి మాతృభావమును కలిగియుందురు. ఆ రుచి వారికి తెలియును. మహత్తరమైన జ్ఞానులు కాకున్ననూ, తల్లులు మధురమైన మాతృభావము ననుభవింతురు. అందలి మాధుర్యము వారికే తెలియును. ఆ మాధుర్యము కారణముగనే ఉచ్చ నీచములను మరచి పిల్లలకు సేవ చేయుదురు. 

మహాత్ముల యందు కూడ ఈ మాతృభావము ఆవిష్కరింప బడుటచే వారునూ ఉచ్చ, నీచములు మఱచి జీవులకు సేవ చేయుదురు. అట్టి శ్రీమాత మాతృ భావము అంబికా భావము నుండి విడుదల అగుచున్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 295-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |*
*ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀*

*🌻 Ambikā अम्बिका (295) 🌻*

The mother of the universe. This is different from the first nāma Śrī Mātā. There She was referred as the mother of all living beings of the universe. Here She is called as the mother of the universe itself comprising of both living and non-living beings.  

This nāma mentions about Her creative action that comprises of iccā, jñāna and kriyā śaktī-s (desire or will, knowledge and action). There is also a saying that Śiva represents day and Śaktī represents night, basically due to Her māyā.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

27-JULY-2021 MESSAGES

Join and Share ALL
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://pyramidbook.in/Chaitanyavijnanam

Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://pyramidbook.in/dailywisdom

Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
https://pyramidbook.in/vivekachudamani

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
https://pyramidbook.in/maharshiwisdom

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

Join and Share
🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹
www.facebook.com/groups/dattachaitanyam/

Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/