✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రార్థన తెలిసిన మనిషి తాకితే ధూళి కూడా బంగారు రంగుతో మెరుస్తుంది. ప్రార్థన అన్నది యింద్రజాల శక్తి. కాని అది ధ్యానం గుండా వస్తుంది. మరో మార్గం గుండా రాదు. 🍀
ధ్యానం చేయి. అపుడు ప్రార్థన రంగంలోకి వస్తుంది. దానికి ఆధారమేమిటంటే ప్రార్థన వచ్చినపుడు దాంతో బాటు పరిమళం కూడా వస్తుంది. నీ అనుభవానికి సంబంధించిన పరిమళాన్ని యితరులు అనుభూతి చెందుతారు. దాన్ని నువ్వు ప్రసరించవచ్చు. నువ్వు ఆదిగానే వున్నావు. నువ్వు స్పర్శించిన ప్రతిదీ ఆనంద నాట్యం చేస్తుంది. ప్రార్థన తెలిసిన మనిషి తాకితే ధూళి కూడా బంగారు రంగుతో మెరుస్తుంది. ప్రార్థన అన్నది యింద్రజాల శక్తి. కాని అది ధ్యానం గుండా వస్తుంది. మరో మార్గం గుండా రాదు.
అందువల్ల నేను ధ్యానం గురించి పదే పదే ఒత్తి చెబుతాను. ప్రార్థన గురించి చెబుతాను. ఎందుకంటే అక్కడ ప్రార్థన అనివార్యం. ఎందుకంటే అక్కడ ప్రార్థన తప్పనిసరి అని నాకు తెలుసు. ధ్యానమంటే ప్రార్థన అనివార్యం. ఫలితం పరిమళం సహజంగా ప్రసరిస్తుంది. కాబట్టి ప్రార్థనని బోధించకండి.
నేను మానవత్వం గురించి వుపన్యసించను. ఎందుకంటే కావలసింది ధ్యానం. అక్కడ ధ్యానముండే ప్రతిదీ దాన్ని అనుసరిస్తుంది. సకాలంలో, సరయిన సమయంలో అన్నీ సమకూరుతాయి. ప్రార్థన వస్తుంది. ప్రార్థన నుంచి మానవ జాతి పట్ల మమకారం వస్తుంది. అది దాని పరిమళ ప్రభావం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
28 Jul 2021
No comments:
Post a Comment