1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 186🌹
2) 🌹. శివ మహా పురాణము - 386🌹
3) 🌹 Light On The Path - 135🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -14🌹
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 208🌹
6) 🌹 Osho Daily Meditations - 3 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 63 / Lalitha Sahasra Namavali - 63🌹
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 63 / Sri Vishnu Sahasranama - 63 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -186 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 27
*🍀 27. ప్రశాంత స్థితి - కల్మషరహితుడై ఆత్మతో యోగము చెందిన యోగి ప్రశాం తుడై, బ్రహ్మమును పొందిన వాడై ఉత్తమ సుఖమును పొందు చున్నాడు. అట్టి వానిని రజస్తమో గుణముల వికారములు అంటవు. ప్రశాంత చిత్తమును దాని మూలమగు బుద్ధిపై నిలపి, బుద్ధి యను వెలుగునందు ప్రవేశించి, అటుపైన బుద్ధి మూలమైన ఆత్మ యందు ధారణ చేసి, ధ్యానించి, ఆత్మతో యోగము చెందుట వలన రజస్తమస్సులు తాకని స్థిరచిత్త మేర్పడును. అదియే ఉత్తమ సుఖము. 🍀*
ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్ |
ఉపైతి శాంత రజసం బ్రహ్మభూత మకల్మషమ్ || 27
కల్మషరహితుడై ఆత్మతో యోగము చెందిన యోగి ప్రశాం తుడై, బ్రహ్మమును పొందిన వాడై ఉత్తమ సుఖమును పొందు చున్నాడు. అట్టి వానిని రజస్తమో గుణముల వికారములు అంటవు. రజస్తమస్సులు జీవితమున కుడి ఎడమలకు లాగు చుండును. జీవితము ఊయల కెక్కిన వానివలె తలత్రిప్పటగ సాగును. హెచ్చు తగ్గులతో కూడిన రహదారియందు ప్రయాణము చేయుట వలె అలసటగ జీవితముండును.
వరద ప్రవాహము నందు ఈత కొట్టుట వలె నుండును. విశ్రాంతి ఎండమావులవలె గోచరించును. ప్రశాంతి అను పదమున కర్థమే లేదు. సుఖము కొరకు యత్నించుటే గాని సుఖముండదు. ఇంతలో అనారోగ్యము, ముసలితనము ఆవరించి మరణము ద్వారా మాత్రమే విశ్రాంతి లభించును. ఇట్టి జీవితము లన్నియు రజస్తమస్సులుగ, ఆటు పోట్లలో వృథా అయిన జీవితములుగ తెలియవలెను.
గాలికి రెప రెపలాడుచు వెలుగుచున్న ద్వీపజ్వాలవంటి జీవితములు ఎప్పుడైనను ఆరిపోవచ్చును. రజస్తమస్సుల ఆటు పోట్ల నుండి రక్షింపబడుటకు దీపమున కేర్పరచు చిమ్నీ ఎట్టిదో, అంతరంగ ప్రవేశమట్టిది. చిమ్నీ లోపలి దీపము ఎట్లు స్థిరముగ నుండునో అంతరంగమునకు మరల్చబడిన మనస్సను దీపము స్థిరముగ నుండుట కవకాశ మేర్పడును.
గుహలో నున్నవానిపై వాతావరణ ప్రభావము ఎట్లుండదో, అట్లే అంతరంగమున చేరు అభ్యాసమున బహిరంగపు ఆటుపోట్లు ఉండవు. అంతరంగము గుహ వంటిది. గాలి వాన ఎండ చలి ఇట్టివాని ప్రభావము బహి రంగమందే యుండుట వలన గుహలోని వానికి ప్రశాంతత సహజముగ నుండును.
ప్రశాంత చిత్తమును దాని మూలమగు బుద్ధిపై నిలపి, బుద్ధి యను వెలుగునందు ప్రవేశించి, అటుపైన బుద్ధి మూలమైన ఆత్మ యందు ధారణ చేసి, ధ్యానించి, ఆత్మతో యోగము చెందుట వలన రజస్తమస్సులు తాకని స్థిరచిత్త మేర్పడును. అదియే ఉత్తమ సుఖము. కావున ప్రశాంత మనస్కు డగునని తెలుపబడినది. ప్రశాంతమనగ ప్రశస్తమగు శాంతము. చెదరని శాంతము ఆత్మ బ్రహ్మమునందు నిలచినవానికి ఇట్టి చెదరని స్థితి నిలచి యుండును. మరణమును కూడ దర్శించునే కాని కలత చెందడు. అట్టి వానికి మరణము దేహ విసర్జనమే కాని తనకు అంతము
కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 386🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 15
*🌻. తారకుని తపస్సు - 3 🌻*
అపుడు ఆ దేవతలు, మునులు అందరు పరస్పరము చర్చించుకొని భయముతో దీనులైనా లోకమునకు వచ్చి నన్ను సమీపించిరి (33). దుఃఖముతో గూడిన మనస్సు గల వారందరు చేతులు ఒగ్గి నాకు నమస్కరించి స్తుతించి వృత్తాంతమునంతనూ నివేదించిరి (34). ఆ లోకోపద్రవమునకు గల కారణమును నేను విమర్శ చేసి నిశ్చయించి, ఆ రాక్షసుడు తపము చేయుచున్న స్థలమునకు వరమునిచ్చుటకై వెళ్లితిని (35). ఓ మహర్షీ! నేనాతనితో నిట్లనింటిని వరమును కోరుకొనుము , నీవు తీవ్రమగు తపస్సును చేసియుంటివి . నీకు ఈయరాని వరము లేదు(36). ఈ నా మాటను విని మహా సురుడగు ఆ తారకుడు నాకు నమస్కరించి చక్కగా స్తుతించి మిక్కిలి దారుణమగు వరమును కోరుకొనెను,(37)
తారకుడిట్లు పలికెను-
వరములనిచ్చు నీవు ప్రసన్నుడవైనచో, నాకు సాధ్యము కానిది ఏమి ఉండును? హే పితామహా! నేను నీ నుండి కోరు వరమును చెప్పెదను. వినుము(38). హే దేవదేవా! నీవు నా యందు ప్రసన్నుడవై, నాకు వరమునీయ నిశ్చయించినచో , నాపై దయ ఉంచి నాకు రెండు వరముల నీయవలెను. (39). హే మహాప్రభో! నీవు నిర్మించిన బ్రహ్మండములో ఎక్కడైననూ నాతో సమమగు బలముగల పురుషుడు మరియొక్కడు ఎవడైననూ ఉండరాదు. ఇది నిశ్చయము(40). శివుని వీర్యముచే పుట్టిన కుమారుడు సేనాపతియై ఏనాడు నా పై ఆయుధమును ప్రయోగించునో, అపుడు మాత్రమే నాకు మరణము కలుగవలెను(41).
ఓ మహర్షీ! ఆ రాక్షసుడు అపుడు నాతో అట్లు పలుకగా, నేను ఆ వరములనిచ్చి వెంటనే నా లోకమునకు తిరిగి వచ్చితిని (42). ఆ రాక్షసుడు తాను కోరిన గొప్ప వరములను పొంది మిక్కిలి ప్రసన్నుడై శోణితమను పేరు గల నగరమును చేరెను(43). అపుడు రాక్షసగురువగు శుక్రుడు నా ఆజ్ఞను పొంది ఆ మహాసురుని రాక్షసుల సన్నిధిలో ముల్లోకములకు రాజుగా అభిషేకించెను. (44) అపుడా మహా రాక్షసుడు ముల్లోకములకు ప్రభువై, స్థావర జంగమములగు ప్రాణులను పీడించుచూ తన ఆజ్ఞను ప్రవర్తిల్లజేసెను.(45)
ఆ తారకుడు ముల్లోకములలో యథావిధిగా రాజ్యమునేలెను. అతడు దేవతలు మొదలగు వారిని పీడించుచూ, ఇతర ప్రజలను పాలించెను. (46). తరువాత ఆ తారకుడు వారి శ్రేష్ఠవస్తువులను లాగుకొనెను. ఇంద్రుడు మొదలగు దేవతలు ఆ రాక్షసునకు భయపడి శ్రేష్ఠవస్తువులను స్వయముగా అతనికి సమర్పించిరి. (47). ఇంద్రుడు భయముతో తన ఐరావత గజమును అతనికి సమర్పించెను. కుబేరుడు నవనిధులను ఇచ్చివేసెను(48). వరుణుడు తెల్లని, గుర్రములను, సూర్యుడు దివ్యమగు ఉచ్చైశ్శ్రవమును భయముతో అతనికిచ్చివేసిరి. ఋషులు కోర్కెల నీడేర్చు కామధేనువు నిచ్చిరి(49).
ఆ రాక్షసుడు ఎక్కడెక్కడ ఏయే శుభవస్తువు కంట పడినా, దానిని తీసుకొని వెళ్లెను. ఇట్లు ముల్లోకములు సారహీనములయ్యెను (50). ఓ మహర్షీ! సముద్రములు వానికి భయపడి తమలోని రత్నములను ఇచ్చివేసినవి. భూమి దున్నకుండగనే పంటలు పండినవి. ప్రజలందరు రాజుయొక్క కోర్కెలను దీర్చిరి(51). వానికి దుఃఖము కలుగకుండునట్లు సూర్యుడు ప్రకాశించెను. చంద్రుని కాంతి హవిర్భాగములను సర్వమును లాగుకొనెను. మరియు అతడు ఇతరులందరి సంపదలను హరించి వేసెను. (53).
అతడు ముల్లోకములను వశము చేసుకొని తానే ఇంద్రపదవి నధిష్ఠించి ఏకైక ప్రభువు అయి, సర్వమును తన వశమునందుంచుకొని , అద్భుతముగా రాజ్యమును చేసెను. (54). అపుడాతడు దేవతలనందరినీ వెళ్ల గొట్టి ఆ స్థానములలో రాక్షసులను స్వయముగా నియమించెను. గంధర్వాది దేవగణములను తన సేవకులుగా నియమించుకొనెను(55). ఓ మహర్షీ !అపుడు వానిచే పీడింపబడిన ఇంద్రాది దేవతలందరు దిక్కు తోచనివారై మహా దుఃఖముతో నన్ను శరణు జొచ్చిర(56).
శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండలో తారకాసురుని తపస్సు. రాజ్యము వర్ణన అనే పదునైదవ అధ్యాయము ముగిసినది(15).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 135 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 10 - THE Note on 20th RULE
*🌻 20. do you enter into a partnership of joy, which brings indeed terrible toil and profound sadness, but also a great and ever-increasing delight. - 4 🌻*
She thought that to take them to some extent into her confidence in that way was giving them a chance.
I cannot tell, and she could, how near they may have been inwardly to taking it, but on the surface their attitude was the conventional sneering attitude. We never heard any more of them, but they had had their chance. Some past karma had evidently given them the right to the opportunity, and though it meant nothing to them then, it may possibly help them a little towards taking it when another such chance comes to them.
511. On this occasion Madame Blavatsky carried out very fully the idea of not blaming people who are in darkness. She knew that the more self-satisfied they were the more they were to be pitied. It is useless to blame anybody for being what he habitually is, because that is his level in evolution; that is as far as he has got.
If he falls below his average level we may reasonably say: “You know, that is wrong; you ought not to have done that,” and it may possibly help him not to do it again. But the level where a man habitually is shows where he is in evolution, and however far back he is there is nothing to be gained by blaming him. It would be as foolish as to blame a child of five years old because he is not yet ten.
512. Then again, those very people who frequently exhibit the least pleasant characteristics have in them the potentiality of the high and noble things as well, and sometimes these come out in a great burst when an emergency arises.
As I explained before, there are men whose ordinary lives are certainly at- a very low level, yet in some great emergency they may show an unselfishness which enables them to throw away their lives for the sake of a comrade. Man always has the god within, and it shows out sometimes when we least expect it. Because it is there, it is always possible to appeal to it. We cannot always reach it, because it is so deeply buried, yet in most cases we are able to catch a glimpse of it in some way.
513. The sight of the suffering of the world also brings, it is said here, terrible toil; once having seen this vast mass of backwardness and misery we cannot help working all the time to alter it. There is nothing else to be done. We can never go back into the world and be careless of the existence of the suffering and sorrow when once we have really felt it. Yet behind the toil is a great and ever-increasing delight.
This comes from the recognition of the law; we see the meaning of suffering and the good that is to come out of it. Note the words: “You enter into a partnership of joy.” That is the real beauty of this higher life. We come into partnership with the greater people. We feel ourselves to be working for and with Them, and that is of itself so great a joy that it supports us through work which otherwise we might feel it impossible to carry out.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 14 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚. ప్రసాద్ భరద్వాజ
భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనబడు ద్రవ్యమయ, శక్తిమయ, ప్రజ్ఞామయ సృష్టులే మూడు లోకములు. జీవుల దేహములు కూడ ఈ మూడు లోకములందు సృష్టింపబడును.
మన దేహమునందున్న భౌతిక పదార్థము భూలోకము. దానిని కదలించు ప్రాణశక్తి భువర్లోకము. దానిని గమనించు మనస్సు మున్నగునవి స్వర్లోకము.
ఈ మూడును దేహము విడుచుకాలమున నశించును. అంతర్యామి యందుండు వాడు నశింపక ఈ మూడిటి ప్రళయమును గమనించును.
అట్లుగాక ఈ మూడింటిలో దేనియందో మెలగుచున్న ప్రజ్ఞ కలవాడు సంసార బద్ధుడనబడును. అట్టివాడు మృత్యువును పొందును. అనగా దేహాదులు పోవుటకు ముందే తెలివి తప్పిపోవును.
ఇట్లే ఒక భూగోళము యొక్క ప్రళయము, ఒక సౌరకుటుంబము యొక్క ప్రళయము , ఒక బ్రహ్మాండము యొక్క ప్రళయము కూడ వర్ణించబడినది.
భాగవతము 4-290, ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 208 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. సమీక్ష - 6 🌻*
772. రూపము లేని ఆత్మ జనన మరణములు లేని ఆత్మ అనంతమైన ఆత్మ శాశ్వతమైన ఆత్మ కాస్త-సుఖములు సుఖ - దుఃఖములు మొదలైన ద్వంద్వములకు అతీతమైన ఆత్మ తనకు -- రూపమున్నదనియు, జనన మరణములు పొందుచుంటిననియు, పరిమితమైన దానననియు, అనిత్యమైన దానననియు గల అనుభవమును పొందుటకు సంస్కారములే కారణము.
ఈ అజ్ఞానమునకు కూడా సంస్కారములు కారణము. ఈ ద్వంద్వ అనుభములన్నియు స్థూల రూపమే పొందుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్ మెహర్ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹Osho Daily Meditations - 3🌹*
📚. Prasad Bharadwaj
*🍀 CHOOSE NATURE 🍀*
*🕉 Wherever you find that society is in conflict with nature, choose nature-whatever the cost. You will never be a loser. 🕉*
The thinking up to now has been that the individual exists for the society, that the individual has to follow what the society dictates. The individual has to fit with the society. That has become the definition of the normal human being--one who fits with the society.
Even if the society is insane, you have to fit with it; then you are normal. Now the problem for the individual is that nature demands one thing, and society demands something contrary. If the society were demanding the same as nature demands, there would be no conflict.
We would have remained in the Garden of Eden. The problem arises because society has its own interests, which are not necessarily in tune with the interests of the individual. Society has its own investments, and the individual has to be sacrificed. This is a very topsy-turvy world. It should be just the other way round.
The individual does not exist for the society; the society exists for the individual. Because society is just an institution, it has no soul. The individual has the soul, is the conscious center.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
Join and Share
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 63 / Sri Lalita Sahasranamavali - Meaning - 63 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।*
*సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀*
🍀 260. సుప్తా -
నిద్రావస్థను సూచించునది.
🍀 261. ప్రాజ్ఞాత్మికా -
ప్రజ్ఞయే స్వరూపముగా గలది.
🍀 262. తుర్యా -
తుర్యావస్థను సూచించునది.
🍀 263. సర్వావస్థా వివర్జితా -
అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
🍀 264. సృష్టికర్త్రీ -
సృష్టిని చేయునది.
🍀 265. బ్రహ్మరూపా -
బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.
🍀 266. గోప్త్రీ -
గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.
🍀 267. గోవిందరూపిణీ -
విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 63 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 63. suptā prājñātmikā turyā sarvāvasthā-vivarjitā |*
*sṛṣṭikartrī brahmarūpā goptrī govindarūpiṇī || 63 || 🌻*
🌻 260 ) Suptha -
She who is in deep sleep
🌻 261 ) Prangnathmika -
She who is awake
🌻 262 ) Thurya -
She who is in trance
🌻 263 ) Sarvavastha vivarjitha -
She who is above all states
🌻 264 ) Srishti karthri -
She who creates
🌻 265 ) Brahma roopa -
She who is the personification of ultimate
🌻 266 ) Gopthri -
She who saves.
🌻 267 ) Govinda roopini -
She who is of the form of Govinda.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 63 / Sri Vishnu Sahasra Namavali - 63 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*విశాఖ నక్షత్ర తృతీయ పాద శ్లోకం*
*🌻 63. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |*
*గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ‖ 63 ‖ 🌻*
🍀 586) శుభాంగ: -
మనోహరమైన రూపము గలవాడు.
🍀 587) శాంతిద: -
శాంతిని ప్రసాదించువాడు.
🍀 588) స్రష్టా -
సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.
🍀 589) కుముద: -
కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.
🍀 590) కువలేశయ: -
భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.
🍀 591) గోహిత: -
భూమికి హితము చేయువాడు.
🍀 592) గోపతి: -
భూదేవికి భర్తయైనవాడు.
🍀 593) గోప్తా -
జగత్తును రక్షించువాడు.
🍀 594) వృషభాక్ష: -
ధర్మదృష్టి కలవాడు.
🍀 595) వృషప్రియ: -
ధర్మమే ప్రియముగా గలవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 63 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Visakha 3rd Padam*
*🌻 63. śubhāṅgaḥ śāntidaḥ sraṣṭā kumudaḥ kuvaleśayaḥ |*
*gōhitō gōpatirgōptā vṛṣabhākṣō vṛṣapriyaḥ || 63 || 🌻*
🌻 586. Śubhāṅgaḥ:
One with a handsome form.
🌻 587. Śāntidaḥ:
One who bestows shanti, that is, a state of freedom from attachment, antagonism, etc.
🌻 588. Sraṣṭā:
One who brought forth everything at the start of the creative cycle.
🌻 589. Kumudaḥ:
'Ku' means the earth. One who delights in it.
🌻 590. Kuvaleśayaḥ:
'Ku' means earth. That which surrounds it is water, so 'Kuvala' means water. One who lies in water is Kuvalesaya. 'Kuvala' also means the underside of serpents. One wholies on a serpent, known as Adisesha, is Kuvalesaya.
🌻 591. Gōhitaḥ:
One who protected the cows by uplifting the mount Govardhana in His incarnation as Krishna.
🌻 592. Gōpatiḥ:
The Lord of the earth is Vishnu.
🌻 593. Gōptā:
One who is the protector of the earth. Or one who hides Himself by His Maya.
🌻 594. Vṛṣapriyaḥ:
One whose eyes can rain all desirable objects on devotees. Vrushabha means Dharma and so one whose look is Dharma.
🌻 595. Vrushapriyaḥ:
One to whom Vrusha or Dharma is dear.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹