శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 4 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బర్బరాలకా ॥ 111 ॥ 🍀

🌻 547. 'బర్బరాలకా’ - 4 🌻


సత్వగుణము మిన్నగ నున్నచో చిత్తము ప్రశాంతమై యుండును. రజస్తమస్సులు అశాంతిని కలిగించును. స్వభావమున సత్వ మేర్పడవలె నన్నచో సంస్కారవంతమైన జీవితము ప్రధానము. అట్టివారి జీవితమునకు అపజయ ముండదు. అపజయమున కతీతమైనదే అయోధ్య. అయోధ్య అనగా అవధ్యయే. వ్యధ్యము కానిది అయోధ్య. జీవుడు అయోధ్యవాసి అయినచో మరణము కూడ అతనిని జయింపగలేదు. అట్లు గాక శిరోజములను విరబోసికొని తిరుగుచూ నాగరికులమని గర్వపడు వారందరూ వ్యర్ధులే. శ్రీమాత శిరోజములీ సందేశము నందించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 4 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 547. 'Barbaralaka' - 4 🌻


When the sattva guna is there, the mind is calm. Rajasthamas cause restlessness. A cultured life is important to imbibe sattva in nature. There is no failure in such lives. Ayodhya is full of failure. Ayodhya means Avadhya. Ayodhya is inviolable. If Jiva is a resident of Ayodhya, even death cannot conquer him. As such, all those who are proud of being civilized and going around with loose hair let down, are worthless. Srimata's hair gives out this message.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

You are a Part of Divinity / మీరు దైవత్వంలో ఒక భాగం


🌹 మీరు దైవత్వంలో ఒక భాగం / You are a Part of Divinity 🌹

✍️ ప్రసాద్ భరద్వాజ


సచ్చిదానందమైన కాంతి ద్వారా మన ఆత్మకు దగ్గరగా భగవంతుని చూడగలం. ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు, సంపూర్ణ ఆనందం వస్తుంది. అన్ని భయాలు జయించ బడతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు అజ్ఞానపు చీకటిని పారద్రోలుతుంది. భయం, దుఃఖం, బాధ, జనన మరణాల నుండి, అజ్ఞానం నుండి వచ్చే బంధాల నుండి, అసంపూర్ణత మరియు మాయ నుండి కూడా ఆత్మజ్ఞాన కాంతి విముక్తి కలుగ చేస్తుంది.

మీరు దైవత్వంలో ఒక భాగం. దానిని నిరంతరం అనుభూతి చెందండి, గ్రహించండి. ఇది అన్ని బంధాలు తొలగడానికి మార్గం. తద్వారా మీరు స్వేచ్ఛను పొందుతారు. ఆత్మజ్ఞానం ద్వారా ఈ స్వాతంత్య్రాన్ని పొందడం వల్ల దైవత్వంతో మీ ఏకత్వం యొక్క సాక్షాత్కారం మీకు లభిస్తుంది.

🌹🌹🌹🌹🌹




🌹 You are a Part of Divinity 🌹

✍️ Prasad Bharadwaj


We can see God closer to our soul through the light of truth. When self-knowledge is attained, absolute happiness comes and all fears will be conquered. The light of self-knowledge dispels the darkness of ignorance. The light of self-knowledge liberates us from fear, sorrow, suffering, birth and death, from the bonds of ignorance, from imperfection and even from delusion.

You are a part of divinity. Feel it constantly, realize it. This is the way to remove all the bonds. Through this you get freedom. Achieving this freedom through Self-knowledge gives you the realization of your oneness with the Divine.

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 78 Siddeshwarayanam - 78

🌹 సిద్దేశ్వరయానం - 78 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 రత్న ప్రభ - 5 🏵

పద్మనంభవుడామెను నమ్మోహనస్థితి నుండి సామాన్య సహజస్థితికితెచ్చాడు. అన్నీ గుర్తు నిలిచేలా చేశాడు. “శాక్యదేవీ ! నీవిప్పుడు పూర్ణమానవివి. భాష, భావం అన్నీ నీకు వశమైనవి. అయితే డాకినిగా మరణించి తల్లి గర్భం నుండి పుట్టావు గనుకను, శాపం వల్లను మరపు, శక్తివిహీనత వచ్చింది. మళ్ళీ నీవు డాకినీ శక్తులు పొందాలంటే తపస్సు చేయాలి” అన్నాడు. శాక్యదేవి “గురుదేవా! కరుణతో నన్నుద్ధరించి కాపాడారు. ఈ ప్రపంచంలో మీరు తప్ప నా కెవరూ లేరు. నా సమస్తము మీరే! గురువు, దైవము అన్నీ మీలో చూస్తున్నాను. నన్ను స్వీకరించండి. నాకు మళ్ళీ దివ్యశక్తులు వచ్చేలా చేయండి” అన్నది. ఆమె అంతరంగ సంగీతం అతని హృదయాన్ని స్పందింపజేసింది.

ఆ కన్య కంఠంలో నుండి బాలపల్లవగ్రాస కషాయ కంఠ కుహూ కల కాకలీధ్వనితో ఆర్తి, ఆవేదన, భక్తితో సమ్మిళితమైన మధురగానం అప్రయత్నంగా రస నిర్ఝరియై ప్రవహిస్తున్నది. వజ్ర యోగిని మంత్రం జపంతో ధ్యానంతో శబ్దంలో నుండి తేజస్సులోకి ప్రయాణం జరిగింది.

అత్యంత సుఖశక్తి సమన్విత సురత శబ్దయోగ భావాతీతధ్యానదశకు చేరిన వారికి సమంతభద్రభవ్యానుభూతి లభించింది. ఆ స్థితిలో నాల్గు పారవశ్య భూమికలు దాటిన వారికి వజ్రసత్వ హేరుక దర్శనం లభించింది. శక్తిసాధనలో ఆ దశను మించినది లేదు. పరిపూర్ణమైన మహాజ్ఞానము, దివ్యమహాముద్రాస్థితి వారిని వరించినవి. ఆ నేపాల శాక్యదేవి నిజంగా బుద్ధడాకినియై ప్రకాశించింది. పద్మసంభవుడు అపరబుద్ధుడైనాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది.

ఒకరోజు పద్మసంభవుడు శాక్యదేవితో అన్నాడు. “దేవీ ! ఈరోజు ధ్యానంలో బుద్ధగయకు వెళ్ళమని ఆదేశం వచ్చింది. అక్కడ వివిధ ప్రదేశాల నుండి వచ్చిన భిన్న మతస్థులు అయిదు వందల మంది బౌద్ధపండితులతో వాదిస్తున్నారు. నా మిత్రుడు శాంతరక్షితుడు, ఇతర ధర్మాచార్యులు ఆ వాదఘర్షణలో సతమత మవుతున్నారు. దానికి తోడు ఆ వచ్చినవారిలో కొందరు మంత్రవేత్తలున్నారు. వారు మన విద్వాంసులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే అచటికి చేరుకోవాలి. ఇంక ఇక్కడ ఈ నిర్మానుష్య ప్రదేశంలో నీవుండవలసిన పనిలేదు. నాతో వద్దువుగాని. నేపాల్లో నీ తల్లిదండ్రులున్న పట్టణం వెళ్లాము. నీవు నీ తల్లి పోలికతో ఉండటం వల్ల మీ బంధువులు నిన్ను సులభంగా గుర్తుపడతారు. అక్కడ నా భక్తులు చాలా మంది ఉన్నారు. మీ రాజవంశీయులు ఆ భక్తుల సహకారంతో ఒక ఆశ్రమం నిర్మించేలా చేస్తాను. మీ బంధువర్గానికి సమీపంలో నీ వసతి ఉంటుంది. బౌద్ధభిక్షుకిగా అక్కడ ఉండి వజ్రవారాహీమంత్ర సాధన చేద్దువుగాని. ఆ దేవత యొక్క మనశ్శక్తివి నీవు. సుప్తమైన ఆ శక్తి త్వరలో నీ యందు పూర్ణజాగృతిని పొందుతుంది. దానివల్ల ప్రజలకు మేలు చేసే ప్రభావం నీకు ప్రాప్తిస్తుంది. నీకు ఏ యిబ్బంది రాకుండా సిద్ధస్థితి వచ్చేలా నేనుచూచు కొంటాను. నన్ను విడిచి నీవుండలేవని నాకు తెలుసు. కాని దేవకార్య సముద్యతులం మనం. ఆ కర్తవ్య నిర్వహణ కోసం కొంత త్యాగం చేయకతప్పదు. పద ! వెళుదాము!”.

ఆమె అతని గుండెపై వాలి కన్నీరు కార్చింది. కొండలలో కోసలలో కోతులమధ్య అమాయకంగా పెరిగిన పిల్ల తన సర్వస్వ మనుకొన్న స్వామితో వియోగాన్ని భరించే శక్తిలేదు. ఇప్పుడిప్పుడే వికసిస్తున్న మనస్సు నెమ్మది నెమ్మదిగా విషయాలను తెలుసుకొంటున్నది. వేదనాభరితమైన హృదయంతో ఇలా ప్రార్థించింది. “గురుదేవా! నాకు మీరుతప్ప ఎవరూలేరు. మీరు లేకుండా నేను జీవించలేను. నా భవిష్యత్తు ఏమిటో అర్ధం కావటం లేదు. ఇప్పుడు మీతోవెళ్ళి నా పూర్వబంధువులను కలుసుకోవచ్చు. కానీ నేను బ్రతకకపోవచ్చు." పద్మసంభవుడు "శాక్యదేవీ! నీ బాధ నేనర్థం చేసుకోగలను. నీవు మరణించటానికి వీలులేదు. నీవలన బౌద్ధ ధర్మానికి కావలసిన మహాకార్యములున్నవి. నిన్ను నేనెప్పుడూ విడిచిపెట్టను. భౌతిక ప్రపంచంలో నేను నిర్వహించవలసిన పనులు చాలా ఉన్నవి. అందువల్ల నిన్ను వదిలి వెళుతున్నట్లు బయటి ప్రపంచానికి కనిపిస్తుంది. అంతవరకే. నీకు నాదైన వజ్ర గురుమంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. రోజూ నిద్రకు ఉపక్రమించినపుడు ఈ మంత్రాన్ని స్మరిస్తూ పడుకో. స్వప్నభూమికలో నీ దగ్గరకువచ్చి కర్తవ్యోపదేశం చేస్తుంటాను." అని వరమిచ్చాడు.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 540: 14వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 540: Chap. 14, Ver. 16

 

🌹. శ్రీమద్భగవద్గీత - 540 / Bhagavad-Gita - 540 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 16 🌴

16. కర్మణ: సుకృతస్యాహు: సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమస: ఫలమ్ ||


🌷. తాత్పర్యం : సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.

🌷. భాష్యము : సత్త్వగుణము నందుండి ఒనరింపబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలత్వము లేదా పవిత్రత్వము. కనుకనే మోహరహితులైన ఋషులు సదా ఆనందమునందే స్థితులై యుందురు. కాని రజోగుణమునందు ఒనరింపబడు కార్యములు కేవలము దుఃఖపూర్ణములే. భౌతికానందము కొరకు చేయబడు ఏ కర్మకైనను అపజయము తప్పదు. ఉదాహరణమునకు ఆకాశమునంటెడి ఎత్తైన భవంతిని మనుజుడు నిర్మింపదలచినచో ఆ భవన నిర్మాణమునకు అత్యంత ఎక్కువ మానవపరిశ్రమ అవసరమగును. తొలుత అతడు అధికమొత్తములో ధనమును కూడబెట్టవలెను. అంతియేగాక భవన నిర్మాణమునకు మనుష్యుల చమటోర్చి పనిచేయవలసివచ్చును.

ఈ విధముగా అడుగడుగునా ఆ కార్యమున దుఖమే అధికముగా నుండును. కనుకనే రజోగుణమునందు చేయబడిన ఏ కార్యముమందైనను గొప్ప దుఃఖము తప్పక ఉండునని భగవద్గీత యందు ఇచ్చట పేర్కొనవడినది. “నాకీ గృహమున్నది, ఇంత ధనమున్నది” అనెడి నామమాత్ర మనస్సంతోషము లేదా సౌఖ్యము కలిగనను వాస్తవమునకు అది నిజమైన సౌఖ్యము కాదు. ఇక తమోగుణమునకు సంబంధించినంత వరకు ఆ గుణమునందు కర్తయైనవాడు జ్ఞానరహితుడై యుండును. తత్కారణముగా అతని కర్మలన్నియును వర్తమానమున దుఃఖమును కలిగించుటయే గాక, పిదప అతడు జంతుజాలమున జన్మించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 540 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 16 🌴

16. karmaṇaḥ sukṛtasyāhuḥ sāttvikaṁ nirmalaṁ phalam
rajasas tu phalaṁ duḥkham ajñānaṁ tamasaḥ phalam

🌷 Translation : The result of pious action is pure and is said to be in the mode of goodness. But action done in the mode of passion results in misery, and action performed in the mode of ignorance results in foolishness.

🌹 Purport : The result of pious activities in the mode of goodness is pure. Therefore the sages, who are free from all illusion, are situated in happiness. But activities in the mode of passion are simply miserable. Any activity for material happiness is bound to be defeated. If, for example, one wants to have a skyscraper, so much human misery has to be undergone before a big skyscraper can be built. The financier has to take much trouble to earn a mass of wealth, and those who are slaving to construct the building have to render physical toil.

The miseries are there. Thus Bhagavad-gītā says that in any activity performed under the spell of the mode of passion, there is definitely great misery. There may be a little so-called mental happiness – “I have this house or this money” – but this is not actual happiness. As far as the mode of ignorance is concerned, the performer is without knowledge, and therefore all his activities result in present misery, and afterwards he will go on toward animal life.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 12, JUNE 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 12, JUNE 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 540 / Bhagavad-Gita - 540 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 51 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 51 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 78 🌹
🏵 రత్నప్రభ - 5 🏵
4) 🌹 మీరు దైవత్వంలో ఒక భాగం / You are a Part of Divinity 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 4 🌹 
🌻 547. 'బర్బరాలకా’ - 4 / 547. 'Barbaralaka' - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 540 / Bhagavad-Gita - 540 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 16 🌴*

*16. కర్మణ: సుకృతస్యాహు: సాత్త్వికం నిర్మలం ఫలమ్ |*
*రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమస: ఫలమ్ ||*

*🌷. తాత్పర్యం : సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.*

*🌷. భాష్యము : సత్త్వగుణము నందుండి ఒనరింపబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలత్వము లేదా పవిత్రత్వము. కనుకనే మోహరహితులైన ఋషులు సదా ఆనందమునందే స్థితులై యుందురు. కాని రజోగుణమునందు ఒనరింపబడు కార్యములు కేవలము దుఃఖపూర్ణములే. భౌతికానందము కొరకు చేయబడు ఏ కర్మకైనను అపజయము తప్పదు. ఉదాహరణమునకు ఆకాశమునంటెడి ఎత్తైన భవంతిని మనుజుడు నిర్మింపదలచినచో ఆ భవన నిర్మాణమునకు అత్యంత ఎక్కువ మానవపరిశ్రమ అవసరమగును. తొలుత అతడు అధికమొత్తములో ధనమును కూడబెట్టవలెను. అంతియేగాక భవన నిర్మాణమునకు మనుష్యుల చమటోర్చి పనిచేయవలసివచ్చును.*

*ఈ విధముగా అడుగడుగునా ఆ కార్యమున దుఖమే అధికముగా నుండును. కనుకనే రజోగుణమునందు చేయబడిన ఏ కార్యముమందైనను గొప్ప దుఃఖము తప్పక ఉండునని భగవద్గీత యందు ఇచ్చట పేర్కొనవడినది. “నాకీ గృహమున్నది, ఇంత ధనమున్నది” అనెడి నామమాత్ర మనస్సంతోషము లేదా సౌఖ్యము కలిగనను వాస్తవమునకు అది నిజమైన సౌఖ్యము కాదు. ఇక తమోగుణమునకు సంబంధించినంత వరకు ఆ గుణమునందు కర్తయైనవాడు జ్ఞానరహితుడై యుండును. తత్కారణముగా అతని కర్మలన్నియును వర్తమానమున దుఃఖమును కలిగించుటయే గాక, పిదప అతడు జంతుజాలమున జన్మించును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 540 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 16 🌴*

*16. karmaṇaḥ sukṛtasyāhuḥ sāttvikaṁ nirmalaṁ phalam*
*rajasas tu phalaṁ duḥkham ajñānaṁ tamasaḥ phalam*

*🌷 Translation : The result of pious action is pure and is said to be in the mode of goodness. But action done in the mode of passion results in misery, and action performed in the mode of ignorance results in foolishness.*

*🌹 Purport : The result of pious activities in the mode of goodness is pure. Therefore the sages, who are free from all illusion, are situated in happiness. But activities in the mode of passion are simply miserable. Any activity for material happiness is bound to be defeated. If, for example, one wants to have a skyscraper, so much human misery has to be undergone before a big skyscraper can be built. The financier has to take much trouble to earn a mass of wealth, and those who are slaving to construct the building have to render physical toil.*

*The miseries are there. Thus Bhagavad-gītā says that in any activity performed under the spell of the mode of passion, there is definitely great misery. There may be a little so-called mental happiness – “I have this house or this money” – but this is not actual happiness. As far as the mode of ignorance is concerned, the performer is without knowledge, and therefore all his activities result in present misery, and afterwards he will go on toward animal life.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 78 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 రత్న ప్రభ - 5 🏵*

*పద్మనంభవుడామెను నమ్మోహనస్థితి నుండి సామాన్య సహజస్థితికితెచ్చాడు. అన్నీ గుర్తు నిలిచేలా చేశాడు. “శాక్యదేవీ ! నీవిప్పుడు పూర్ణమానవివి. భాష, భావం అన్నీ నీకు వశమైనవి. అయితే డాకినిగా మరణించి తల్లి గర్భం నుండి పుట్టావు గనుకను, శాపం వల్లను మరపు, శక్తివిహీనత వచ్చింది. మళ్ళీ నీవు డాకినీ శక్తులు పొందాలంటే తపస్సు చేయాలి” అన్నాడు. శాక్యదేవి “గురుదేవా! కరుణతో నన్నుద్ధరించి కాపాడారు. ఈ ప్రపంచంలో మీరు తప్ప నా కెవరూ లేరు. నా సమస్తము మీరే! గురువు, దైవము అన్నీ మీలో చూస్తున్నాను. నన్ను స్వీకరించండి. నాకు మళ్ళీ దివ్యశక్తులు వచ్చేలా చేయండి” అన్నది. ఆమె అంతరంగ సంగీతం అతని హృదయాన్ని స్పందింపజేసింది.*

*ఆ కన్య కంఠంలో నుండి బాలపల్లవగ్రాస కషాయ కంఠ కుహూ కల కాకలీధ్వనితో ఆర్తి, ఆవేదన, భక్తితో సమ్మిళితమైన మధురగానం అప్రయత్నంగా రస నిర్ఝరియై ప్రవహిస్తున్నది. వజ్ర యోగిని మంత్రం జపంతో ధ్యానంతో శబ్దంలో నుండి తేజస్సులోకి ప్రయాణం జరిగింది.*

*అత్యంత సుఖశక్తి సమన్విత సురత శబ్దయోగ భావాతీతధ్యానదశకు చేరిన వారికి సమంతభద్రభవ్యానుభూతి లభించింది. ఆ స్థితిలో నాల్గు పారవశ్య భూమికలు దాటిన వారికి వజ్రసత్వ హేరుక దర్శనం లభించింది. శక్తిసాధనలో ఆ దశను మించినది లేదు. పరిపూర్ణమైన మహాజ్ఞానము, దివ్యమహాముద్రాస్థితి వారిని వరించినవి. ఆ నేపాల శాక్యదేవి నిజంగా బుద్ధడాకినియై ప్రకాశించింది. పద్మసంభవుడు అపరబుద్ధుడైనాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది.*

*ఒకరోజు పద్మసంభవుడు శాక్యదేవితో అన్నాడు. “దేవీ ! ఈరోజు ధ్యానంలో బుద్ధగయకు వెళ్ళమని ఆదేశం వచ్చింది. అక్కడ వివిధ ప్రదేశాల నుండి వచ్చిన భిన్న మతస్థులు అయిదు వందల మంది బౌద్ధపండితులతో వాదిస్తున్నారు. నా మిత్రుడు శాంతరక్షితుడు, ఇతర ధర్మాచార్యులు ఆ వాదఘర్షణలో సతమత మవుతున్నారు. దానికి తోడు ఆ వచ్చినవారిలో కొందరు మంత్రవేత్తలున్నారు. వారు మన విద్వాంసులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే అచటికి చేరుకోవాలి. ఇంక ఇక్కడ ఈ నిర్మానుష్య ప్రదేశంలో నీవుండవలసిన పనిలేదు. నాతో వద్దువుగాని. నేపాల్లో నీ తల్లిదండ్రులున్న పట్టణం వెళ్లాము. నీవు నీ తల్లి పోలికతో ఉండటం వల్ల మీ బంధువులు నిన్ను సులభంగా గుర్తుపడతారు. అక్కడ నా భక్తులు చాలా మంది ఉన్నారు. మీ రాజవంశీయులు ఆ భక్తుల సహకారంతో ఒక ఆశ్రమం నిర్మించేలా చేస్తాను. మీ బంధువర్గానికి సమీపంలో నీ వసతి ఉంటుంది. బౌద్ధభిక్షుకిగా అక్కడ ఉండి వజ్రవారాహీమంత్ర సాధన చేద్దువుగాని. ఆ దేవత యొక్క మనశ్శక్తివి నీవు. సుప్తమైన ఆ శక్తి త్వరలో నీ యందు పూర్ణజాగృతిని పొందుతుంది. దానివల్ల ప్రజలకు మేలు చేసే ప్రభావం నీకు ప్రాప్తిస్తుంది. నీకు ఏ యిబ్బంది రాకుండా సిద్ధస్థితి వచ్చేలా నేనుచూచు కొంటాను. నన్ను విడిచి నీవుండలేవని నాకు తెలుసు. కాని దేవకార్య సముద్యతులం మనం. ఆ కర్తవ్య నిర్వహణ కోసం కొంత త్యాగం చేయకతప్పదు. పద ! వెళుదాము!”.*

*ఆమె అతని గుండెపై వాలి కన్నీరు కార్చింది. కొండలలో కోసలలో కోతులమధ్య అమాయకంగా పెరిగిన పిల్ల తన సర్వస్వ మనుకొన్న స్వామితో వియోగాన్ని భరించే శక్తిలేదు. ఇప్పుడిప్పుడే వికసిస్తున్న మనస్సు నెమ్మది నెమ్మదిగా విషయాలను తెలుసుకొంటున్నది. వేదనాభరితమైన హృదయంతో ఇలా ప్రార్థించింది. “గురుదేవా! నాకు మీరుతప్ప ఎవరూలేరు. మీరు లేకుండా నేను జీవించలేను. నా భవిష్యత్తు ఏమిటో అర్ధం కావటం లేదు. ఇప్పుడు మీతోవెళ్ళి నా పూర్వబంధువులను కలుసుకోవచ్చు. కానీ నేను బ్రతకకపోవచ్చు." పద్మసంభవుడు "శాక్యదేవీ! నీ బాధ నేనర్థం చేసుకోగలను. నీవు మరణించటానికి వీలులేదు. నీవలన బౌద్ధ ధర్మానికి కావలసిన మహాకార్యములున్నవి. నిన్ను నేనెప్పుడూ విడిచిపెట్టను. భౌతిక ప్రపంచంలో నేను నిర్వహించవలసిన పనులు చాలా ఉన్నవి. అందువల్ల నిన్ను వదిలి వెళుతున్నట్లు బయటి ప్రపంచానికి కనిపిస్తుంది. అంతవరకే. నీకు నాదైన వజ్ర గురుమంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. రోజూ నిద్రకు ఉపక్రమించినపుడు ఈ మంత్రాన్ని స్మరిస్తూ పడుకో. స్వప్నభూమికలో నీ దగ్గరకువచ్చి కర్తవ్యోపదేశం చేస్తుంటాను." అని వరమిచ్చాడు.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మీరు దైవత్వంలో ఒక భాగం / You are a Part of Divinity 🌹*
*✍️ ప్రసాద్ భరద్వాజ*

*సచ్చిదానందమైన కాంతి ద్వారా మన ఆత్మకు దగ్గరగా భగవంతుని చూడగలం. ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు, సంపూర్ణ ఆనందం వస్తుంది. అన్ని భయాలు జయించ బడతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు అజ్ఞానపు చీకటిని పారద్రోలుతుంది. భయం, దుఃఖం, బాధ, జనన మరణాల నుండి, అజ్ఞానం నుండి వచ్చే బంధాల నుండి, అసంపూర్ణత మరియు మాయ నుండి కూడా ఆత్మజ్ఞాన కాంతి విముక్తి కలుగ చేస్తుంది.*

*మీరు దైవత్వంలో ఒక భాగం. దానిని నిరంతరం అనుభూతి చెందండి, గ్రహించండి. ఇది అన్ని బంధాలు తొలగడానికి మార్గం. తద్వారా మీరు స్వేచ్ఛను పొందుతారు. ఆత్మజ్ఞానం ద్వారా ఈ స్వాతంత్య్రాన్ని పొందడం వల్ల దైవత్వంతో మీ ఏకత్వం యొక్క సాక్షాత్కారం మీకు లభిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

*🌹 You are a Part of Divinity 🌹*
*✍️ Prasad Bharadwaj*

*We can see God closer to our soul through the light of truth. When self-knowledge is attained, absolute happiness comes and all fears will be conquered. The light of self-knowledge dispels the darkness of ignorance. The light of self-knowledge liberates us from fear, sorrow, suffering, birth and death, from the bonds of ignorance, from imperfection and even from delusion.*

*You are a part of divinity. Feel it constantly, realize it. This is the way to remove all the bonds. Through this you get freedom. Achieving this freedom through Self-knowledge gives you the realization of your oneness with the Divine.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 547 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 547 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బర్బరాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 547. 'బర్బరాలకా’ - 4 🌻*

*సత్వగుణము మిన్నగ నున్నచో చిత్తము ప్రశాంతమై యుండును. రజస్తమస్సులు అశాంతిని కలిగించును. స్వభావమున సత్వ మేర్పడవలె నన్నచో సంస్కారవంతమైన జీవితము ప్రధానము. అట్టివారి జీవితమునకు అపజయ ముండదు. అపజయమున కతీతమైనదే అయోధ్య. అయోధ్య అనగా అవధ్యయే. వ్యధ్యము కానిది అయోధ్య. జీవుడు అయోధ్యవాసి అయినచో మరణము కూడ అతనిని జయింపగలేదు. అట్లు గాక శిరోజములను విరబోసికొని తిరుగుచూ నాగరికులమని గర్వపడు వారందరూ వ్యర్ధులే. శ్రీమాత శిరోజములీ సందేశము నందించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 547 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 547. 'Barbaralaka' - 4 🌻*

*When the sattva guna is there, the mind is calm. Rajasthamas cause restlessness. A cultured life is important to imbibe sattva in nature. There is no failure in such lives. Ayodhya is full of failure. Ayodhya means Avadhya. Ayodhya is inviolable. If Jiva is a resident of Ayodhya, even death cannot conquer him. As such, all those who are proud of being civilized and going around with loose hair let down, are worthless. Srimata's hair gives out this message.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj