కార్తీక మాసం 16వ రోజు చేయవలసినవి. Things to do on 16th day of Kartika month.



https://youtube.com/shorts/yvYOLeGEimI


🌹 కార్తీక మాసం 16వ రోజు చేయవలసినవి.
Things to do on 16th day of Kartika month. 🌹


ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తిక పురాణం - 16 :- 16వ అధ్యాయము - స్తంభ దీప ప్రశంస - దీప స్తంభము విప్రుడగుట Kartika Purana - 16 :- Chapter 16 - Praise of the Pillar of Light - The Pillar of Light is Extinct


🌹. కార్తిక పురాణం - 16 🌹
🌻. 16వ అధ్యాయము -
స్తంభ దీప ప్రశంస - దీప స్తంభము విప్రుడగుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 16 🌹
🌻. Chapter 16 -
Praise of the Pillar of Light - The Pillar of Light is Extinct 🌻
📚. Prasad Bharadwaja



వశిష్టుడు చెబుతున్నాడు -

"ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ, తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.

సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని, స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు శాలిధాన్యం గాని, నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.


🌻. దీప స్తంభము విప్రుడగుట 🌻

ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను జూచి "ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీకశుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భముపాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము, రండు" అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి "ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి" అని ప్రశించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని, నన్ను మన్ని౦పు" డని వేడుకొనెను.


🌹 🌹. కార్తిక పురాణం - 16

ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్యమొంది "ఆహా! కార్తీకమాసమహిమ మెంత గొప్పది అదియునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు, రాళ్లు, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్త౦భమునకు ముక్తికలిగిన" దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి "మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చుటెట్లు? నాయీ సంశయము బాపు"డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦దరును తమలో నోకడగు అంగీరసమునితో "స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన, వివరించు"డని కోరిరి. అంత నా౦గీరసుడిట్లు చెప్పుచున్నాడు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయము - పదహారో రోజు పారాయణము సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 16వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల

దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

🌹 🌹 🌹 🌹 🌹

సంపద మరియు పదవుల కోసం కార్తీక మాసంలో ఈరోజు (నవంబర్, 06) ఇలా చేయండి. Do this today (Nov,06) during Kartik month for wealth and positions.




🌹 కార్తీక మాసం.. నవంబర్ 6.. ఈ చిన్న పని చేస్తే చాలు..! అంతులేని సంపదలు, పదవులు ఖాయం..! 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Karthika month.. November 6.. Just do this small task..! Endless wealth and positions are guaranteed..! 🌹

Prasad Bharadwaja



కార్తీక మాసంలో 16వ రోజు ఎలాంటి శక్తిమంతమైన విధివిధానాలు పాటిస్తే సంపదలు, అధికార పదవులు అద్భుతంగా కలుగుతాయో తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్ల పక్షానికి ఎంత శక్తి ఉందో బహుళ పక్షానికి కూడా అంతే శక్తి ఉంది.

పౌర్ణమికి ముందు చేసే పూజలకు ఎంత శక్తి ఉందో పౌర్ణమి తర్వాత కూడా చేసే పూజలకు అంతే శక్తి ఉంది. కార్తీక బహుళ పాడ్యమి తిథి.. కార్తీక మాసంలో 16వ రోజు.. నవంబర్ 6వ తేదీ.. గురువారం.. కొన్ని ప్రత్యేక విధివిధానాలు పాటిస్తే సంపదలు, పదవులు రెండూ సిద్ధింపజేసుకోవచ్చు.

కార్తీక మాసంలో 16వ రోజున ప్రతి ఒక్కరు చేయాల్సిన పని.. ఆలయంలో సమ్మార్జన (సమార్జనం) చేయాలి. అంటే ఆలయం దగ్గర చీపురుతో చిమ్మటం, తుడవటం, అక్కడ ముగ్గులు పెట్టటం. మీ దగ్గరలో ఉన్న శివాలయం లేదా విష్ణువు ఆలయానికి వెళ్లి చీపురుతో చిమ్మి, తడబట్ట పెట్టి తర్వాత ముగ్గులు వేయాలి. ఇలా శివాలయంలో చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి. విష్ణువు ఆలయంలో చేస్తే అధికార పదవులు కలుగుతాయని కార్తిక మహత్యం తెలుపుతుంది. ప్రమోషన్లు రావాలన్నా, రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా, సంఘంలో మంచి పదవులు రావాలన్నా విష్ణువు ఆలయంలో ఈ పని చేయాలి. ధన పరంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే విపరీతంగా ధనం రావాలంటే శివాలయంలో ఈ పని చేయాలి.

శివాలయంలో కనిపించే ఆకాశ దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఆకాశ దీపాన్ని చూడగానే నమస్కారం చేసుకుని, ప్రార్ధన చేస్తే అంతులేని సంపదలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తం నూనె కానీ నెయ్యి కానీ దేవాలయానికి ఇవ్వాలి. అలా ఇచ్చిన వారు సాక్ష్యాత్తు నందీశ్వరుడితో సమానం అవుతారని కార్తీక మహత్యం తెలుపుతుంది. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే పాడ్యమి అంటే కార్తీక మాసంలో 16వ రోజున శివాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తం నూనె కానీ నెయ్యి కానీ ఇస్తారు వారు నాతో సమానమైపోయిన వాళ్లు అవుతారని, శివుడు నన్ను ఎంతగా అనుగ్రహిస్తాడో వారిని కూడా అంతగానే అనుగ్రహిస్తాడని నందీశ్వరుడు స్వయంగా సెలవిచ్చాడు.

🌹🌹🌹🌹🌹

మానవజన్మ - పరమార్థం Human birth - the ultimate meaning


🌹 మానవజన్మ - పరమార్థం 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Human birth - the ultimate meaning 🌹
Prasad Bharadwaja



మనిషి జీవితంలో.

ప్రగతి..! అంటే..

ఉద్యోగంలోనూ..! ఆస్తిలోను..! అంతస్తు లోను కాదు..


ఆ మనిషి జీవితంలో.

ఆధ్యాత్మిక ప్రగతి..! ముఖ్యం.


మనిషి జీవితం.

మిగతా జీవుల కంటే గొప్పది.


భగవంతుడు.

తనను చేరుకోవడానికి.

ఒక..! అవకాశంగా.°

మనుష్య జన్మ నిస్తాడు.


కావున..! ఈ జన్మలో.

ఆ స్వామిని చేరుకోవడానికి.

మార్గం ఏర్పాటు చేసుకోవాలి.


అన్యధా..! శరణంనాస్తి..

త్వమేవ..! శరణంమమ..


ఓ అరుణాచలేశ్వరా!!

నీవు కోపము లేని సద్గుణుడవు..నీ భక్తుడనైన నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను స్వీకరించు.. అలా స్వీకరించకుండా ఆలస్యం చేస్తున్నావు.. నేను నీకు తక్కువ ఏమి చేసాను...

నేను మానవ మాత్రుడను.నీవలె క్రోధము మొదలైన అరిషడ్వర్గాలను జయించిన వాడను కాను.. అందువలన నేను పొరపాట్లు చేసి ఉండవచ్చు.. కానీ నీవు కోపము వంటి గుణాలు లేని సద్గుణవంతుడవు కదా... అడుగకుండానే భక్తులను రక్షిస్తావన్న కీర్తి నీకు ఉన్నది.. నీ భక్తుడనైన నన్ను రక్షించటమే నీ ధ్యేయం,నీ బాధ్యత.నేను నీకు శరణాగతుడనైనపుడు నీ దృష్టికి నేను ఎందుకు లేను... నేను నీకు ఏమి తక్కువ చేశాను.. నాకున్న సమస్తము అనగా ధన మాన ప్రాణాలను నీకు అర్పించి శరణు వేడుతున్నాను కదా.

నీవు నాకు ఏమీ ఇవ్వనవసరము లేదు..ఏదో లాభము ఆశించి నేను నీ దగ్గరకు రాలేదు.. నన్ను నీలో ఐక్యము చేసుకో చాలు.. అంతే నాకు కావలసింది..


భగవద్గీత.....

శ్లో॥ చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున ।

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥

నలుగురు నన్ను భజిస్తారు..కష్టములో ఉన్నవాడు, జ్ఞానము కోరేవాడు, ధనం కోరేవాడు, మరియు జ్ఞాని.

భక్తుని దృష్టిలో తన సాధనలో ఉన్న లోపాల కన్నా భగవంతునిలో లేని లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి...

కానీ భగవంతుడు భక్తుని లోపాలు ఎంచకుండా అతని శరణాగతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని అతనిని అంగీకరిస్తాడు.

శరణాగతి భక్తుల లోపాలను క్షమించి,అభయమిచ్చే స్థితి..

సంపూర్ణ శరణాగతి చెందిన భక్తునికి భగవంతుడు అభయము ఇచ్చే క్షణం కోసం ఎదురుచూస్తున్న ఉండడమే నిజమైన సాధన. జీవిత పరమావధి, సాఫల్యత.

🌹 🌹 🌹 🌹 🌹

కోటి దీపోత్సవం కార్తీక మాసం స్పెషల్ Koti Deepotsav Karthika Masam (a YT Short)



https://youtube.com/shorts/_dnQ4ISnSyg



🌹🪔 కోటి దీపోత్సవం కార్తీక మాసం స్పెషల్ Koti Deepotsav Karthika Masam 🪔🌹

ప్రసాద్ భరద్వాజ




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🪔🪔🪔🪔🪔


గరుత్మంతుడు, సుదర్శన చక్రం, సత్యభామలకు కృష్ణుడు నేర్పిన గుణపాఠం Lesson Taught by Krishna



https://youtube.com/shorts/qGNbBOoCt2M


🌹 గరుత్మంతుడు, సుదర్శన చక్రం, సత్యభామలకు కృష్ణుడు నేర్పిన గుణపాఠం Lesson Taught by Krishna. 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹