కార్తీక సోమవార ప్రత్యేక శ్రీ కాశీ విశ్వేశ్వర అలంకార దర్శనం Darshan of Sri Kashi Vishweshwara on Karthika Monday (a YT Short)



https://youtube.com/shorts/VAdsXtn5b3U


🌹 కార్తీక సోమవార ప్రత్యేక శ్రీ కాశీ విశ్వేశ్వర అలంకార దర్శనం 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Special decorative darshan of Sri Kashi Vishweshwara on Karthika Monday 🌹
Prasad Bharadwaja


Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా ఊపిరి నీవే శివయ్యా '...you are Shivayya' (a YT Short)



https://youtube.com/shorts/Dzdam7WbWag


🌹  నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా ఊపిరి నీవే శివయ్యా  🌹

ప్రసాద్ భరద్వాజ



🌹You are my mother, you are my father, you are my breath, you are Shivayya 🌹

Prasad Bharadwaja



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తీక మాసంలో ధన దీపం వెలిగించాల్సిందే Light Dhana Deepam in the month of Kartika



🌹 ధన దీపం Dhana Deepam : ఖర్చులు తగ్గి సంపద పెరగాలంటే.. కార్తీక మాసంలో ధన దీపం వెలిగించాల్సిందే..! ధన దీపం వెలిగించే విధానం.. 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Dhana Deepam: To reduce expenses and increase wealth.. you should light the Dhana Deepam in the month of Karthika..! How to light the Dhana Deepam.. 🌹

Prasad Bharadwaja



కార్తీక మాసంలో అఖండ ధన లాభం కలగటానికి, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, ఖర్చులు తగ్గటానికి ధన దీపాన్ని లేదా లక్ష్మి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో తెలుసుకుందాం.

ఐశ్వర్యం కలగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, మొండి బాకీలు తొందరగా వసూలు కావాలన్నా కార్తీక మాసంలో తప్పకుండా ప్రతీ ఇంట్లో ధన దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా ధన దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే గురువారం లేదా శుక్రవారం రోజున ఈ ధన దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ ధనదీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం..

మీ ఇంట్లో పూజ గదిలో గజలక్ష్మి దేవి ఫోటో లేదా ధన లక్ష్మి దేవి ఫోటోకు దండం బొట్లు పెట్టి పీట ఏర్పాటు చేసుకోవాలి. పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, పీట మీద బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు అష్టదళ పద్మం ముగ్గు. 8 దళాలున్న పద్మం ముగ్గు అంటే లక్ష్మీ దేవికి ఇష్టం. స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి ఆ పీఠం మీద అష్ట దళ పద్మం ముగ్గు లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి.

అలా ముగ్గులు వేశాక పీట మీద ఒక రాగి లేదా ఇత్తడి పళ్లెం ఏర్పాటు చేయాలి. అందులో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత రాగి లేదా ఇత్తడి పళ్లెంలో బియ్యాన్ని కుప్పలాగా పోయాలి. అందులో చిటికెడు పసుపు, కుంకుమ వేయాలి. ఒక గులాబీ పువ్వు కూడా పెట్టాలి. కొన్ని రూపాయి నాణెలు కనీసం 11 నాణెలు ఆ బియ్యంలో ఉంచాలి.

రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. వాటికి కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి. రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉన్న బియ్యంలో మొదటి ప్రమిదను ఉంచాలి. అందులో మూడు యాలకులు, మూడు లవంగాలు, ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు పోయాలి. అలా పోసిన తర్వాత మొదటి ప్రమిదలో రెండవ చిన్న ప్రమిదను ఉంచాలి. ఆ రెండవ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండూ లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ ఆగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే ధన దీపం లేదా లక్ష్మీ దీపం అని పిలుస్తారు.

🌹🌹🌹🌹🌹

విశ్వేశ్వరుని పంచామృత అభిషేకం Panchamrit Abhishekam of Lord Vishweshwara (a YT Short)



https://youtube.com/shorts/G90ow7w9mZw



🌹 విశ్వేశ్వరుని పంచామృత అభిషేకం - నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ - కార్తీక సోమవారం 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Panchamrit Abhishekam of Lord Vishweshwara - Namaste Astu Bhagavan Vishweshwara - Kartika Monday 🌹

Prasad Bharadwaja




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తిక పురాణం - 13 : 13వ అధ్యాయము - సువీర చరిత్రము Kartika Purana - 13 : Chapter 13 - The Story of Suvira


🌹 కార్తిక పురాణం - 13 🌹
🌻 13వ అధ్యాయము - కన్యాదాన ఫలము - సువీర చరిత్రము 🌻
📚. ప్రసాద్ భరద్వాజ


🌹 Kartika Purana - 13 🌹
🌻 Chapter 13 - The Fruit of the Offering of the Bride - The Story of Suvira 🌻
📚. Prasad Bharadwaja



ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకి౦పుము.

కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తా౦బూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన౦దువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకి౦పుము.


🌻 సువీర చరిత్రము 🌻

ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు"డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒక సారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారబముతో పెరుగుచుండెను, ఆమె చూచు వారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచినకొలదీ, బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు"నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.

అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంత మంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.

ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశమును నేలుచుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా,


కార్తిక పురాణం 13 - 2వ భాగం

"ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన' మను నరకమనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవించును. కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును" అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦పగలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను" అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.

మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.

అంతటా శ్రుతకీర్తి "నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?"నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధర్మముర్తివి, బుద్దిశాలివి. ప్రాణకోటినంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి "శ్రుతకీర్తి! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమును భావించుటయే గాక, నీచ జన్మలెత్త వలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము" అని పలికెను.

శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.

కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 13వ రోజు పూజించ వలసిన దైవం Deity to be worshipped on the 13th day of Karthika month






🌹కార్తీక మాసం 13వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి

దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము:- మన్మధుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹





🌹Deity to be worshipped on the 13th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Dinner, Uddha

Donations:- Flowers like jasmine, jaji, etc., forest food

Deity to be worshipped:- Manmadhu

Mantra to be chanted:-

Om Sri Virisharaya Namah Swaha

🌹 🌹 🌹 🌹 🌹