🌹 19 - JULY - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం , భౌమ వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 19, జూలై 2022 మంగళవారం, భౌమ వాసరే Tuesday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 234 / Bhagavad-Gita - 234 - 6- 01 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 633 / Vishnu Sahasranama Contemplation - 633 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 312 / DAILY WISDOM - 312 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 212 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹19, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మంగళగౌరి వ్రతం, Mangala Gauri Vrat 🌻*
*🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 1 🍀*
*1. గౌరీశివవా యువరాయ అంజని కేసరి సుతాయ చ |*
*అగ్నిపంచక జాతాయ ఆంజనేయాయ మంగళమ్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : జీవుడు తనదిగా చెప్పుకు నేదంతా తనలోని ఈశ్వరునికి సమర్పించుకునే పర్యంతం తాను పరిపూర్ణుడు కానేరడు. అట్లే మానవజాతి తనకు కలిగినదంతా ఈశ్వరార్పణ చేయగలిగే టంతవరకూ మానవ సమాజానికి పరిపూర్ణత సిద్దింపనేరదు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాడ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ షష్టి 07:51:17 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 12:13:31
వరకు తదుపరి రేవతి
యోగం: అతిగంధ్ 13:43:18 వరకు
తదుపరి సుకర్మ
కరణం: వణిజ 07:52:18 వరకు
వర్జ్యం: 26:07:00 - 39:10:20 ?
దుర్ముహూర్తం: 08:27:36 - 09:19:45
రాహు కాలం: 15:37:53 - 17:15:40
గుళిక కాలం: 12:22:17 - 14:00:05
యమ గండం: 09:06:43 - 10:44:30
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 07:26:24 - 09:01:36
సూర్యోదయం: 05:51:07
సూర్యాస్తమయం: 18:53:28
చంద్రోదయం: 23:28:13
చంద్రాస్తమయం: 11:11:48
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మీనం
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
12:13:31 వరకు తదుపరి శుభ యోగం
- కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 234 / Bhagavad-Gita - 234 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగము - 01 🌴*
*01. శ్రీ భగవానువాచ*
*అనాశ్రిత: కర్మఫలం కార్యం కర్మ కరోతి య: |*
*స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియ:*
🌷. తాత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు పలికెను: కర్మఫలముల యెడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్న్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతియేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక యుండెడి వాడు యోగి కాజాలడు.*
🌷. భాష్యము :
అష్టాంగయోగపధ్ధతి మనస్సును మరియు ఇంద్రియములను నియమించుటకు ఒక మార్గమని శ్రీకృష్ణభగవానుడు ఈ అధ్యాయమున వివరింపనున్నాడు. కాని కలియుగములో దీనిని ఆచరించుట సాధారణ మానవులకు అత్యంత కటినమైన కార్యము. ఈ ఆధ్యాయమున అష్టాంగయోగపద్ధతి ప్రతిపాదించబడినను కర్మయోగమే (కృష్ణభక్తిరసభావిత కర్మ) ఉత్తమమని శ్రీకృష్ణభగవానుడు నొక్కి చెప్పెను.
ప్రతియొక్కరు ఈ జగమునందు కుటుంబమును పోషించుట కొరకే కర్మను చేయుచుందురు. తన కొరకు లేదా తనవారు కొరకు యనెడి స్వార్థము లేకుండా ఎవ్వరును పనిచేయలేరు. కాని కర్మఫలములను ఆశింపక కృష్ణభక్తిభావన యందే కర్మ చేయుట పూర్ణత్వలక్షణమై యున్నది. జీవులందరును శ్రీకృష్ణభగవానుని అంశలైనందున వారు వాస్తవమునకు కృష్ణభక్తిభావన యందే కర్మ నొనరింపవలెను. దేహాన్గములు దేహతృప్తి కొరకే కర్మనొనరించును. అవి ఎన్నడును తమ తృప్తి కొరకు వర్తించక దేహతృప్తి కొరకే పనిచేయును. అదే విధముగా స్వీయతృప్తి కొరకు కాక శ్రీకృష్ణభగవానుని ప్రిత్యర్థము కర్మ నొనరించు జీవుడే సన్న్యాసి (పూర్ణుడైన యోగి) యనబడును.
శ్రీకృష్ణభగవానుని ప్రీతియే తన ఆధ్యాత్మికజయమునకు ప్రయాణమనెడి భావన కలిగినందున ఆ భక్తుడు పూర్ణుడైన సన్న్యాసి లేదా పూర్ణుడైన యోగి యనబడును. సన్న్యాసమునకు ప్రతిరూపమైన శ్రీచైతన్యమాహాప్రభువు ఈ క్రింది విధముగా ప్రార్థించిరి.
న ధనం న జనం న సుందరీం కవిటం వా జగదీశ కామయే |
మం జన్మనీ జన్మనీశ్వరే భావతాద్భక్తిరహైతుకీ త్వయి
“హే భగవాన్! ధనమును కూడబెట్టవలెనని గాని, సుందరస్త్రీలతో ఆనందింపవలెనని గాని లేక శిష్యులు పలువురు కావలెనని గాని నేను కోరను. ప్రతిజన్మ యందును నీ భక్తి యనెడి నిర్హేతుక కరుణనే నేను వాంచించుచున్నను.”
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 234 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 01 🌴*
*01. śrī-bhagavān uvāca*
*anāśritaḥ karma-phalaṁ kāryaṁ karma karoti yaḥ*
*sa sannyāsī ca yogī ca na niragnir na cākriyaḥ*
🌷 Translation :
*The Supreme Personality of Godhead said: One who is unattached to the fruits of his work and who works as he is obligated is in the renounced order of life, and he is the true mystic, not he who lights no fire and performs no duty.*
🌹 Purport :
In this chapter the Lord explains that the process of the eightfold yoga system is a means to control the mind and the senses. However, this is very difficult for people in general to perform, especially in the Age of Kali. Although the eightfold yoga system is recommended in this chapter, the Lord emphasizes that the process of karma-yoga, or acting in Kṛṣṇa consciousness, is better. Everyone acts in this world to maintain his family and their paraphernalia, but no one is working without some self-interest, some personal gratification, be it concentrated or extended. The criterion of perfection is to act in Kṛṣṇa consciousness, and not with a view to enjoying the fruits of work.
To act in Kṛṣṇa consciousness is the duty of every living entity because all are constitutionally parts and parcels of the Supreme. The parts of the body work for the satisfaction of the whole body.
The limbs of the body do not act for self-satisfaction but for the satisfaction of the complete whole. Similarly, the living entity who acts for satisfaction of the supreme whole and not for personal satisfaction is the perfect sannyāsī, the perfect yogī. Lord Caitanya, the highest perfectional symbol of renunciation, prays in this way:
na dhanaṁ na janaṁ na sundarīṁ kavitāṁ vā jagad-īśa kāmaye
mama janmani janmanīśvare bhavatād bhaktir ahaitukī tvayi
“O Almighty Lord, I have no desire to accumulate wealth, nor to enjoy beautiful women. Nor do I want any number of followers. What I want only is the causeless mercy of Your devotional service in my life, birth after birth.”
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 633 / Vishnu Sahasranama Contemplation - 633🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻633. అర్చిష్మాన్, अर्चिष्मान्, Arciṣmān🌻*
*ఓం అర్చిష్మతే నమః | ॐ अर्चिष्मते नमः | OM Arciṣmate namaḥ*
* అర్చిష్మాన్, अर्चिष्मान्, Arciṣmān*
*అర్చిష్మన్తే యదీయేన స్వర్చిషా భాస్కరాదయః ।*
*స విష్ణురేవ భగవాన్ ముఖ్యోఽర్చిష్మా నితీర్యతే ॥*
*మహత్త్వము గల అర్చిస్సులు అనగా కిరణములు, జ్వాలలు ఈతనికి కలవు. ఎవని అర్చిస్సులచే చంద్ర సూర్యాదులును అర్చిష్మంతులు అగుచున్నారో, ఆ పరమాత్ముడే ముఖ్యుడగు అర్చిష్మంతుడు. ఈతని సాదృశ్యము వలననే ఇతరులు అర్చిష్మంతులనదగును.*
:: శ్రీమద్భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము ::
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ॥ 18 ॥
*(పరబ్రహ్మము) ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకుగూడ ప్రకాశమునిచ్చునది. తమస్సు (అజ్ఞానము) కంటె వేఱైనదియు, జ్ఞానస్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు విశేషించియున్నదియునని చెప్పబడుచున్నది.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 633🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻633. Arciṣmān🌻*
*OM Arciṣmate namaḥ*
अर्चिष्मन्ते यदीयेन स्वर्चिषा भास्करादयः ।
स विष्णुरेव भगवान् मुख्योऽर्चिष्मा नितीर्यते ॥
*Arciṣmante yadīyena svarciṣā bhāskarādayaḥ,*
*Sa viṣṇureva bhagavān mukhyo’rciṣmā nitīryate.*
*From Him radiate great Arciṣ - illuminating flames, rays. He by whom the luminaries like sun, moon etc., get their luminosity is alone the preeminent Arciṣmān.*
:: श्रीमद्भगवद्गीत क्षेत्रक्षेत्रज्ञविभाग योगमु ::
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥ १८ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 13
Jyotiṣāmapi tajjyotistamasaḥ paramucyate,
Jñānaṃ jñeyaṃ jñānagamyaṃ hr̥di sarvasya viṣṭhitam. 18.
That is the Light even of the lights; It is spoken as beyond darkness. It is Knowledge, the Knowable, and the Known. It exists specially in the hearts of all.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 312 / DAILY WISDOM - 312 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 7. వస్తువుతో విలీనం అవ్వాలనే కోరిక 🌻*
*ఒక వ్యక్తి ఒక వస్తువును కోరుకున్నప్పుడు, దానితో ‘ఒకటిగా మారడం’ అనేది సూక్ష్మమైన కోరిక. అందుకే మీరు కోరుకునే వస్తువు దగ్గరలో ఉందని వింటే, మీరు సంతోషంగా ఉంటారు. అది మీ దగ్గరకు వచ్చినప్పుడు, మరియు మీరు దానిని చూడగలిగినప్పుడు, ఆనందం పెరుగుతుంది; అది ఇంకా దగ్గరగా వస్తున్నప్పుడు, మరింత ఆనందం వేస్తుంది. మీరు దానిని తాకినప్పుడు, అది ఇంకా ఎక్కువగా ఉంటుంది, కానీ అది కూడా సరిపోదు. దురదృష్టవశాత్తు, మీరు ఆ స్థాయిని దాటి వెళ్ళలేరు. మీరు కోరిన వస్తువును తాకవచ్చు, కానీ మీరు దాని ఉనికిలోకి ప్రవేశించి మమేకం అవలేరు. అందుకే కోరుకున్న వస్తువులతో పాటు వాటి పట్ల వియోగం, బాధ, మరణం, పుట్టుక మొదలైన భావాలు కూడా ఉంటాయి.*
*అసలు కోరిక ఏమిటంటే, వస్తువు మీ ఉనికిలో కరిగి పోయేలా చేయడం. మీరు దాని వెలుపల నిలబడటానికి ఇష్టపడరు. మీరు శాశ్వతమైన ఆనందాన్ని కోరుకుంటారు, కానీ బయట ఉన్న స్థూల జగత్తు, వస్తువు మీలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది ఎందుకంటే ప్రతి వస్తువు స్వతంత్రంగా ఉంటుంది; కాబట్టి, అది మీ ఆస్తి ఎలా అవుతుంది? దేనిపట్లైనా యాజమాన్యత అనేదేమీ లేదు. ఇది ఒక మూర్ఖపు ఆలోచన, కానీ వాస్తవానికి, ఉద్దేశ్యం ఏమిటంటే, ఆ వస్తువు యొక్క స్వయంతో మిమ్మల్ని మీరు విలీనం చేసుకోవడం, తద్వారా రెండు స్వయాలు పెద్ద పరిమాణంలో ఒక స్వయంగా మారతారు. ఇలా ఆత్మలన్నీ కలిసి విలీనమై పోతే, అది ఇంకా పెద్దగా అనంతంగా అవుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 312 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 7. The Desire to Merge with the Object 🌻*
*Even when a person desires a thing, the subtle desire is to ‘become one' with it. That is why if you hear that your object of desire is nearby, you feel happy. When it comes near, and you can see it, the joy increases; and when it is coming nearer still, there is more joy. When you touch it, it is still more, but even that is not sufficient. You cannot, unfortunately, go beyond that. You can touch an object of desire, but you cannot enter into it. That is why there is bereavement, suffering, death, birth, following desires.*
*The ultimate desire is to make the object melt into your being. You do not want to stand outside it. You want perpetual enjoyment, but the space-time complex which is outside prevents the object from entering into you because every object is independent; so, how can it become your property? There is no such thing as possessing anything. It is a foolish idea, but actually, the intention is to merge yourself with the self of that object, so that the two selves become one self of a bigger size. If all the selves melt together, it becomes a larger self.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 212 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నీ సొంత అనుభవానికి వచ్చినపుడే సత్యం నిజమైన సత్యమవుతుంది. దానిని ఎవరూ నీకు యివ్వలేరు. నీలోపలికి వెళ్ళాలి. నీ అస్తిత్వం లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీకది కనిపిస్తుంది. 🍀*
*సత్యాన్ని కొనలేం. యితరుల్ని అందుకోలేం. అది మార్పిడి వస్తువు కాదు. వ్యక్తి తనంగా తాను దాన్ని కనిపెట్టాలి. ధనంతో కొనలేం. అధికారంతో కొనలేం. వ్యక్తి తన లోపలికి వెళితే దాన్ని కనిపెడతాడు. అదప్పటికే అక్కడుంది. దాన్ని కొనలేం. చిత్రమేమిటంటే ప్రతి ఒక్కడూ దాన్ని కొంటాడు. ఒక సంగతి గుర్తుంచుకోవాలి. నువ్వు కొన్న దేదయితే వుందో అదంతా సత్యానికి సంబంధించిది. కానీ సత్యం కాదు. నువ్వు కొన్నది కేవలం పదాల్ని. నీ సొంత అనుభవానికి వచ్చినపుడే సత్యం నిజమైన సత్యమవుతుంది. దానిని ఎవరూ నీకు యివ్వలేరు. కారణం అది అప్పటికే నీ దగ్గర వుంది. నీలోపలికి వెళ్ళాలి. నీ అస్తిత్వం లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీకది కనిపిస్తుంది.*
*అది కొనగలిగే సరుకు కాకపోవడం మంచిదయింది. అది నీకు ఎవ్వరూ యివ్వలేక పోవడం మంచిదయింది. అట్లా అయితే అది విలువ లేనిదయ్యేది. జనాలకు తల్లిదండ్రుల్నించీ ఆస్తి సంక్రమిస్తుంది. జనం వాళ్ళ వీలునామాలో 'సగం సత్యాన్ని నా భార్యకు, నా గర్ల్ ఫ్రెండ్కు తక్కిన సగం సత్యాన్ని నా పిల్లలకు సమంగా పంచాలి' అని రాసేవాళ్ళు. అట్లా వీలుకాకపోవడం మంచిదే అయింది. అది కేవలం వ్యక్తిగతం. అది కేవలం నీ ఏకాంతంలోనే నీ అనుభవానికి వస్తుంది. అది నీ లోపలి కాంతి, నీ నిజమైన ఆలయం. అది అక్కడ నీ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+S6XP2HV0Y1g9-hVo
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj