🌹. అష్టాదశ శక్తిపీఠములు - దివ్యస్తుతులు 🌹

🌹. అష్టాదశ శక్తిపీఠములు - దివ్యస్తుతులు 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

రావణ స్తుతి సంతుష్టా కృతాలంకాధివాసినీ |
సీతాపహరణరోషేణ త్యక్తలంకామహేశ్వరీ |
సజ్జన స్తితి సంతుష్టా కదంబవన వాసినీ |
లంకాయం శాంకరీదేవి రక్షేత్ ధర్మపరాయణా ||1 శ్రీ శాంకరీదేవి

శివనేత్రిని మీల్యైవ ధృతాకాత్యాయనీవపుః |
గంగాప్లావసముద్విగ్నా సైకతం లింగమాశితా |
భక్తానామిష్టదానిత్యం కామాక్షీ కాంచికాపురే |
ఏకాంరనాథ గృహిణీ శుభం కుర్యాన్మహేశ్వరీ ||2

విశృంఖలాస్వయందేవీ భక్తానుగ్రహకారిణీ |
భక్యానాంశృంఖలా హర్త్రీ స్వయం బద్దాకృపాపరా |
శృంఖలాకటికబద్దా చ జగన్మాతాయశశ్విని |
మాంగల్యదా శుభకరీ వేదమార్గాను పాలినీ |
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ ఏౠష్యశృంగసమర్చితా |
శుభం తనోతుసాదేవీ కరుణాపూరవాహినీ ||3

మహిషంసంహృత్యదేవీ కంట కం త్రిషుజమసు |
చండీ కాళీ స్వరూపేణ దుర్గారూపేణ శాంకరీ |
అథితాసిలోకరక్షణార్ధం చాముండాక్రౌంచ పట్టణే |
దేవీ త్వం ప్రసీదాస్మాన్ సర్వదా సర్వదాశుభే ||4

అలంపురం మహాక్షేత్రేం తుంగాచోత్తర వాహినీ |
బాలబ్రహ్మేశ్వరోదేవః జోగులాంబా సమంవితః |
తీర్ధం పరశురాశ్య నవబ్రహ్మసమంవితం |
అలంపురే జోగులాంబా విశాలాక్ష్యా సమాశ్మృతా |
భువికాశ్యాసమంక్షేత్రం సర్వదేవ మర్చితం ||5 జోగులాంబ (అలంపురం )


భ్రమరైరరుణం హత్వా భ్రామ్యంతీ శ్రీగిరౌస్థితా |
భక్తానుకంపినీదేవీ మల్లికార్జున తోషిణీ |
శివానుగ్రాహ సంధాత్రీ బ్ఘక్తరక్షణ తత్పరా |
సానః పాయాత్ సదామాతా శ్రీశైలే భ్రమరాంబికా ||6 శ్రీశైల భ్రమరాంపికా

కోల్హాతపః ప్రీతా దేవీ వరదానమహోజ్వలా |
మహాలక్ష్మీ ర్మహామాతాలోకానుగ్రహకారిణీ |
దత్తాత్రేయఆది సుప్రీతా నానాతీర్ధ నిషేవితా |
కరవీరసుమారాధ్యా కోల్హాసద్గతిదాయినీ |
భావానీచామలాదేవి కరవీరసువాసినీ |
కోల్హాపురే మహాలక్ష్మీర్మమాస్తు శుభదాయినీ || 7 మహాలక్ష్మీ (కోల్హాపురం)

దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా |
ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ |
రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ |
కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || 8 ఏకవీర్యాదేవి

త్రిపురాసురసంహర్తా మహాకాలోత్రవర్తతే |
యస్యాట్టహాస సందగ్ధం దుస్సహంతత్ పురత్రయం |
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా |
ఉజ్జయిన్యాం మహాకాళీ భక్తానామిష్టదా స్దా ||9 ఉజాయిని మహాకాళీ

ఏలర్షిపూజిత పూజితశ్శంభుః తస్మై గంగామదాత్ పురా |
రురువాకుక్కుటోభుత్వా భగవాన్ కుక్కుటేశ్వరః |
దేవీ చాత్ర సమాయతా భర్తృచిత్తానుసారిణీ |
పురుహుత సమార్ధా పీఠయాం పురుహుతికా || 10 పురుహుతికా

ఓడ్యాణేగిరిజాదేవీపిత్రర్చనఫలప్రదా |
బిరజా పరపర్యాయా స్థితావైతరణీ తటే |
త్రిశక్తి స్వరూపా చైవ లోకత్రాణపరాయణా |
నిత్యం భవతు సాదేవీ వరదా కులవర్దినీ ||11

స్వయం భూరస్తి భీమేశః మాణిక్యాంబాతదైవ చ |
సప్తర్షిస్సమానీతం సప్త గోదావరం శుభం |
సూర్యేణసేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః |
భక్తరక్షణ సంవ్యగ్రా దక్షవాటికే ||12 మాణిక్యాంబ

కామేఖ్యే కామదే ద్వివి నీలాచల నివాసిని |
కామస్యసర్వదేమాతః మాతృసప్తక సేవితే |
జామదగ్న్యస్యరామస్య మాతృహత్యా విమోచినీ |
పంచ శంకర సంస్థాణ భక్త పాలన తత్పరా |
కల్యాణదాయినీ మాతా విప్రదర్శిత నర్తనా |
హర్షిక్షేత్రే కామరూపే ప్రసన్నాభవ సర్వదా ||13 కామరూపాదేవి

త్రివేణీ సంగమోద్భుతా త్రిశక్తీనాం సమాహృతిః |
ప్రజాపతికృత్యా శేష యాగమాభిలాషాభి వందితా |
బృహస్పతికరాంతస్థ పీయూష పరిసేవితా |
ప్రయాగే మాధవీ దేవీ సదాపాయాత్ శుభాకృతిః ||14 మధవీ దేవీ

కాలపర్వతాగ్రే జ్వాలారూపాను భాససే |
జ్వాలాముఖీతి విఖ్యాతా జ్యోతిర్మూర్తి నిదర్శనా |
రాధేశ్యామేతి నాదేనవర్ధమానాత్విషాంతితః |
జ్వాలాయాం వైష్ణవీదేవీ సదారక్షతు శాంకరీ ||15 జ్వాలాముఖీ

గదాధరసహోదరీ గయా గౌరీ నమోస్తుతే |
పితౄణాంచ సకర్తౄణాంచ దేవి సద్గత్తిదాయినీ |
త్రిశక్తి రూపిణీ మాతా సచ్చిదానంద రూపిణీ |
మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్య గౌరికా ||16 గయా మాంగల్య గౌరీ

కాశీంతు పునరాగత్య సంహృష్టంతాండవోన్ముఖం |
విశ్వేశందేవ మాలోక్య ప్రీతివిస్తారితేక్షణా|
సానురాగాచ సాగౌరీ దద్యాత్ శుభ పరంపరాం |
వారాణస్యాం విశాలక్షీ అన్నపూర్ణా పరాకృతిః |
అన్నం జ్నానం చ దదతి సర్వాన్ రక్షతినిత్యశః |
త్వత్పసాదాన్మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే ||17

సరస్వతి నమస్తుభ్యం సర్వవిద్యా స్వరూపిణి |
రాగ ద్వేషాదియుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్చసి |
కాశ్మీరదేశ వద్రమ్యా విశదాభవదాకృతిః |
సాంత్వయంతీ మహాదేవీం తదుక్త్యా శారికా అభూః |
ప్రసన్నతాం సమాంబుద్ధిం విశదాం పాండితీశుభాం |
విద్యావృద్ధిం సదా దద్యాత్ కాశ్మీరేషు సరశ్వతీ ||18
🌹 🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 13 🌹🌻. 11. శ్రీ గిరిజ దేవి - 11వ శక్తి పీఠం - ఓఢ్యాణము., ఒరిస్సా 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 13 🌹
🌻. 11. శ్రీ గిరిజ దేవి  - 11వ శక్తి పీఠం -  ఓఢ్యాణము., ఒరిస్సా  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴.  శ్రీ శ్రీ గిరిజ దేవి దివ్యస్తుతి 🌴

ఓడ్యాణేగిరిజాదేవీపిత్రర్చనఫలప్రదా |
బిరజా పరపర్యాయా స్థితావైతరణీ తటే |
త్రిశక్తి స్వరూపా చైవ లోకత్రాణపరాయణా |
నిత్యం భవతు సాదేవీ వరదా కులవర్దినీ ||11

ఓఢ్యాణే గిరిజా దేవి:
ఆత్మయే శంకరుడు. బుద్ధియే గిరిజాదేవి. కావున జగద్గురు ఆదిశంకరాచార్యులవారిలా “గిరిజా శంకరులను” స్తోత్రంతో అర్చించారు. 

“ఆత్మాత్వం గిరిజా మతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం పూజతే విషయోప భోగ రచనా నిద్రా సమాధి స్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన్‌ం “.

“శంభో! నా ఆత్మవు నీవు, నామతి గిరిజాదేవి, పంచప్రాణాలు నీకు పరిచారికలు, శరీరము అనే ఈ గృహంలో మీ ఆదిదంపతులను నిలిపిన. నాకు ఏఏ విషయోప భోగాలందాసక్తి కలదో అవన్నీ నీకు నిత్యపూజలు, నా నిద్రా స్థితి నీ ధ్యాన సమాధి స్థితి. నా పాదాలు భూమిని సంచరించినదంతా నీకు భక్తి ప్రదక్షిణలు. నే పలికే ప్రతి పలుకు నీ స్తోత్ర గానాలే నేను ఏఏ కర్మలొనర్చినా అవి నీకు ఆరాధనలే. కనుక నిత్యం నీపై నుండి దృష్టి మరలని వరమీయి” అని ప్రార్థించారు. 

మనము కూడా మన తనువును “శక్తి ఆలయం”గా మలచుకొని బుద్ధి అనే అర్చనతో “శక్తి”నుపాసించి మనసు “శక్తి” దక్షిణగా ఇచ్చినచో “శక్తి” సంపన్నులమౌతాము.

గిరిజ అనగా గిరి (హిమవంతుడు)కి జనియించినది. జన్మించినది మొదలు జటధారిపై మనసు నిలిపి ధ్యానంతో కొలిచేది.

విరజానది పాపులను పుణ్యలను చేసే పావన జల ప్రవాహం. ఓఢ్యాణము అనగా ఓడ్రదేశము. అదే నేటి ఒరిస్సా రాష్ట్రము. ఈ రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరిణి నది ఉన్నది. ఈ నదీ తీరంలో వైతరిణి అనే గ్రామం కూడా ఉంది. ఇప్పటి ఒరిస్సాలోని జాజ్‌పూర్ రోడ్‌కి సుమారు 20 కి|| మీ|| దూరంలో ఉంది ఓఢ్యాణము.

గిరిజా దేవినేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది.ఈ ప్రాంతాన్ని వైతరణీపురం అని కూడా అంటారు.

ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్డు నుంచి 20కి.మీ దూరం ప్రయాణిస్తే గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయానికి చేరుకోవచ్చు.సతీ దేవి "నాభీస్థానం" ఇక్కడ పడిందని అంటారు.అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలతో, దండలతో మరియు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.

గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు.

 సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. 

ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఇక్కడి గిరిజాదేవి సింహవాహనగా కనిపిస్తుంది. అమ్మ వారు ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. ఈమె శక్తి త్రయరూపిణి.

🌻. స్థల పురాణం : 
ఒరిస్సా - జాజ్ పూర్ టౌను సమీపంలోగల 'ఓడ్యాణం' అనే ప్రాంతంలో ఈ శక్తి పీఠం దర్శనమిస్తుంది. ఇక్కడ సతీదేవి 'నాభి'భాగం పడినట్టుగా చెప్పుకుంటారు. బ్రహ్మదేవుడి కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ 'గిరిజాదేవి' పేరున కొలువుదీరినట్టు స్థల పురాణం చెబుతోంది. స్థానికులు అమ్మవారిని గిరిజా దేవనీ ... బిరజాదేవని పిలుచుకుంటూ ఉంటారు.

ఇక్కడ వైతరణి అనే ఊరుతోపాటు, అదే పేరుతో పిలవబడే నది కూడా ప్రవహిస్తూ వుంటుంది. జీవుడు సూక్ష్మ శరీరంలో యమలోక ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో వైతరణి నది వస్తుంది. ఆ నది అంశగా ఇక్కడ ఈ వైతరణి ప్రవహిస్తోందని విశ్వసిస్తుంటారు. ఇక్కడ జరిగే ఆబ్దిక క్రియలు పితృ దేవతలను నరకం నుంచి బయటపడేసి స్వర్గ ప్రవేశాన్ని కలిగిస్తాయని అంటారు.

వైతరణీ నదిలోని ఓ ప్రదేశంలో 'శ్వేత వరాహ విష్ణుమూర్తి' ఆలయం వుండటం ఒక విశేషం. ఇక అమ్మవారు దుర్గాష్టమి రోజున ప్రత్యేక దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 12 🌹🌻. 10. శ్రీ పురుహూతిక దేవి - 10వ శక్తి పీఠం - పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 12 🌹
🌻. 10. శ్రీ పురుహూతిక దేవి  - 10వ శక్తి పీఠం - పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴.  శ్రీ పురుహూతిక దేవి దివ్యస్తుతి 🌴
ఏలర్షిపూజిత పూజితశ్శంభుః తస్మై గంగామదాత్ పురా |
రురువాకుక్కుటోభుత్వా భగవాన్ కుక్కుటేశ్వరః |
దేవీ చాత్ర సమాయతా భర్తృచిత్తానుసారిణీ |
పురుహుత సమార్ధా పీఠయాం పురుహుతికా || 10 పురుహుతికా

పీఠికాయాం పురుహూతికా:
ఓం శ్రీ కుక్కుటేశ్వర సమేత శ్రీ పురుహూతికాయై నమః

అది అందమైన తల్లి పీఠము. బంగారు తల్లి పేరు పురుహూతికా దేవి. ఆ బంగారు తల్లిని చేపట్టినవాడు కుక్కుటేశ్వరస్వామి. పిఠపురం అనాదిగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం. ఎందుకంటే ఇక్కడి శివలింగం కుక్కుటాకారంలో ఉంటుంది. కుక్కుటమనగా కోడి. పైగా ఏలముని యోగానికి సారమైనది. అత్యద్భుతమైన మహితమలకు ఆలవాలమైనది. పాదగయ అని ఇక్కడి ప్రాంతానికి మరోపేరు. ప్రప్రథమంగా దేవేంద్రునిచే ఆరాధించబడిన పుణ్యక్షేత్రం ఈ పిఠాపురం.

ఈ పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుండి 60కి||మీ|| దూరంలోను మరియు కాకినాడకు 18 కి||మీ దూరంలోను ఉంది.

భీహారులో ఉన్న ప్రదేశాన్ని “విష్ణుగయ” లేదా “శిరోగయ” అని, పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశానికి “పాదగయ” అనే పేరు వచ్చింది. అలా శివ, శక్తి, విష్ణు పీఠాలతో పవిత్రమైన ఈ పిఠాపురం మంగళప్రద మహాత్మ్యలకు ఆలవాలమై ఉన్నది.

సత్ చిదానంద శక్తి క్షేత్రమైన ఈ పిఠాపురం దర్శనం పరమం పవిత్రం !

పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. 

ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని చెబుతుంటారు. 

ఈ పీఠాన్ని అష్టాదశ పీఠాల్లో 10వ పీఠంగా పేర్కొంటారు. 

ఒక పురాణ గాధ ప్రకారం పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు. తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు... వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు. శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఈ క్షేత్రం అపరకర్మలకు ప్రసిద్ధి.

🌻. స్థలపురాణం :
అష్టాదశా శక్తి పీఠాల్లో ఒకటైన 'శ్రీ పురుహూతికా దేవి' శక్తి పీఠం పిఠాపురంలో భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. సతీదేవి 'ఎడమ హస్తం'ఈ ప్రాంతంలో పడినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి అమ్మవారు పురుహూతికాదేవి గా పూజలు అందుకోవడానికి, సాక్షాత్తు సదాశివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా కొలువుదీరడానికి వెనుక ఇంకొక పురాణగాధ కూడా చెప్తారు.

పూర్వం 'గయాసురుడు'అనే రాక్షసుడు, ఇంద్రుడి సింహాసనాన్ని సొంతం చేసుకుని దేవతలందరినీ పీడించసాగాడు. దాంతో త్రిమూర్తులు బ్రాహ్మణ పండితుల వేషాలను ధరించి గయాసురుడి దగ్గరికెళ్లి తాము ఒక యజ్ఞం చేస్తున్నామని చెప్పారు. భూమాత ఆ వేడిని తట్టుకోలేదనీ ... దానిని అతని దేహం మాత్రమే భరించగలదని అన్నారు. తన దేహాన్ని యజ్ఞ వాటికగా ఉంచడానికి గయాసురుడు అంగీకరించడంతో, వారం రోజుల పాటు సాగే ఈ యజ్ఞానికి ఎలాంటి పరిస్థితుల్లోను భంగం కలగకూడదనీ ... అదే జరిగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు.

గయాసురుడి తల దగ్గర విష్ణువు ... నాభి దగ్గర బ్రహ్మ ... పాదాల చెంత శివుడు కూర్చుని యజ్ఞాన్ని ప్రారంభించారు. ఏడో రోజు అర్ధరాత్రి వరకూ కూడా ఆ యజ్ఞం వేడిని గయాసురుడు భరిస్తూ వచ్చాడు. దాంతో తెల్లవారితే మళ్లీ గయాసురుడిని నియంత్రించడం కష్టమని భావించిన శివుడు, పార్వతీదేవిని అక్కడికి ఆహ్వానించాడు. ఆమె సూచనమేరకు శివుడు అర్ధరాత్రివేళ కోడిలా కూశాడు. తెల్లవారిందనుకుని గయాసురుడు కదలడంతో యజ్ఞ భంగం జరిగింది.

దాంతో బ్రాహ్మణ పండితులు గయాసురుడి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. వాళ్లు తనని సంహరించడానికి వచ్చిన త్రిమూర్తులని గయాసురుడు గ్రహించి సంతోషించాడు. అతని దేహం నశించక తప్పదనీ, ఆ ప్రదేశంలో తాము క్షేత్ర దేవతలుగా కొలువుదీరతామని త్రిమూర్తులు అనుగ్రహించారు.

 శివుడు కోడిలా కోసిన ప్రదేశం కాబట్టి కుక్కుటేశ్వర క్షేత్రంగా ... గయాసురుడి పాదాల చెంత కూర్చుని శివుడు యజ్ఞం చేసిన కారణంగా 'పాదగయ'గా ఈ శక్తి పీఠం పిలవబడుతోంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 11 🌹🌻. 9. శ్రీ మహాకాళి దేవి - 9వ శక్తి పీఠం - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 11 🌹
🌻. 9. శ్రీ మహాకాళి దేవి  - 9వ శక్తి పీఠం - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴.  శ్రీ మహాకాళీ: దేవి దివ్యస్తుతి 🌴
త్రిపురాసురసంహర్తా మహాకాలోత్రవర్తతే |
యస్యాట్టహాస సందగ్ధం దుస్సహంతత్ పురత్రయం |
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా |
ఉజ్జయిన్యాం మహాకాళీ భక్తానామిష్టదా స్దా ||9  ఉజాయిని మహాకాళీ

9. ఉజ్జయిన్యాం మహాకాళీ:
మహామంత్రాధి దేవతాం ధీగంభీరతాం|
మహా కాళీ స్వరూపిణీం. మాం పాలయమాం||

ఎక్కడైతే స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో, అదే దేవతల స్థానం. ఎప్పుడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో ఆ అజ్ఞానాన్ని ద్రుంచే విజ్ఞాన స్థానమే కాళీ నిలయం.

ధర్మగ్లాని జరిగే వేళ దేవతల ప్రార్థనతో అంబిక నవదుర్గ రూపాలలో దుష్ట శిక్షణకై బయలుదేరింది. ఆ నవదుర్గ రూపాలలో అతి భీకరమైనదీ కాళీ స్వరూపం.

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు 55 కి|| మీ|| దూరంలో క్షిప్రానదీ తీరంలో ఉజ్జయినీ క్షేత్రం ఉన్నది. ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగం, మహాకాళీ శక్తి పీఠం ఉన్న శక్తి ప్రదేశమే ఉజ్జయిని. 

సతీదేవి మోచేయి పడిన ఈ ప్రాంతానికి అష్టాదశ శక్తి పీఠలలో ఒక విశిష్ఠ స్థానం ఉంది. అదేమిటంటే ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా పేర్కొంటారు. ప్రతి 12 సం||లకు ఒకసారి ఇక్కడ “కుంభమేళా” ఉత్సవం జరుగుతుంది.

ఇక్కడి స్వామివారైన మహాకాళేశ్వరునకు కన్నులుండటం అనగా శివలింగానికి కన్నులుండటం విశేషం.

ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో కాల పరిస్థితులను బట్టి మారింది. సప్తమోక్ష పురలలో ఒకటి ఈ ఉజ్జయిని.

అదిగో చూడండి ! మహాకాలుని ఎదుట మహాకాళి ఆనంద తాండవం చేస్తోంది. ఒక్కసారి ఆ ఆదిదంపతులను స్మరించి మనసుతో ఆ ఆనంద తాండవాన్ని తిలకించండి.

అప్పుడు మనకి లభించేది సత్ + చిత్ ఆనంద మోక్షపురి. అదే ఉజ్జయిని, (విజయవంతమైన) మహాపురి, శివపురి.

సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి 50కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి ఆలయం ఉన్నాయి.

🌻. స్థలపురాణం.
పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధం చేస్తాడు.కానీ బ్రహ్మదేవుని వరం కారణంగా అంధకాసురుని రక్తం ఎన్ని చుక్కలు నేలను తాకితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు.

అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుధ్ధభూమిలో ప్రవేశించి తన పొడవైన నాలుకను చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 10 🌹🌻. 8. శ్రీ ఏకవీరాదేవి - 8వ శక్తి పీఠం - మహార్, మహారాష్ట్ర 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 10 🌹
🌻. 8. శ్రీ  ఏకవీరాదేవి  - 8వ శక్తి పీఠం - మహార్, మహారాష్ట్ర  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. శ్రీ  ఏకవీరాదేవి దివ్యస్తుతి 🌴

దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా |
ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ |
రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ |
కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || 8 

 పెన్‌గంగా అనబడే పంచగంగా నది తీరాన అమ్మవారు ఏకవీర దేవిగా ఆవిర్భవించినట్లు ఇక్కడ పురాణాలు చెపుతున్నాయి. అమ్మవారిని ఇక్కడ భక్తులు ఏకవీర దేవిగా, రేణుకాదేవిగా పిలుస్తారు. 

ఈ క్షేత్రం నాందేడ్‌ పట్టణానికి 127 కి.మీ. దూరంలో ఉంది.  ఏకవీరాదేవి ఆలయం మహారాష్ట్రలోని మహుర్లో వెలసియున్నది. సతీదేవి యొక్క కుడిచేయు ఇక్కడ పడినది చెబుతారు. మిగతా శక్తిపీఠాలలో లోగా ఇక్కడ భక్తుల తాకిడి ఉండదు. ఇక్కడ ప్రధాన దేవత రేణుకా దేవి. 

ఏకవీరాదేవి రేణుకాదేవి పెద్ద సోదరి అని భావిస్తారు. ఇక్కడ ఈ ఇద్దరే దేవతలే కాక పరశురామ ఆలయం. దత్తాత్రేయస్వామి ఆలయం, అనసూయామాత ఆలయం, అత్రి మహర్షి, మాతృతీర్ధం మరియు దేవదేవేశ్వరుని మందిరాలు కూడా ఉన్నవి. ఇక్కడి ప్రత్యేకత ప్రసాదం. తమలపాకులు, వక్కపొడి నూరి ఇస్తారు.

ఈ ప్రదేశంలోని 3 పర్వతాలున్నాయి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రేండవ పర్వతంపైన అత్రి, అనసూయల ఆలయాలు ఉన్నాయి.

  మూడవ శిఖరం సతీదేవి కుడిస్తం పడిన శ్రీ క్షేత్రం.. ఈ శిఖరంపైన గల ఆలయంలోగల ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది. 

అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. 

జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవి మనసు చెదిరిందని ఆగ్రహించి ఆమె తల తీసేయమని కొడుకైన పరశురాముడిని ఆదేశిస్తాడు. తండ్రి మాటను పరశురాముడు శిరసావహిస్తాడు. ఫలితంగా మొండెం నుంచి వేరైన రేణుకామాత తల అక్కడికి దగ్గరలో వున్న ఓ గూడెంలో పడుతుంది. 

రేణుకామాత పాతివ్రత్యం గురించి ముందుగానే తెలిసి వుండటం వలన, ఆ గూడెం ప్రజలు ఆమె తల పడిన ప్రదేశంలో గుడికట్టి పూజించడం మొదలు పెట్టారు. అలా ఇక్కడి అమ్మవారు పూజలు అందుకుంటోందని భక్తుల విశ్వాసం. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అని కూడా అంటారు.

అయితే ఇది రేణుకా మాత ఆలయమేగానీ శక్తి పీఠం కాదనే మాట ప్రచారంలో వుంది. అక్కడికి దగ్గరలోనే అంటే మాహొర్ కి 10 కిలోమీటర్ల దూరంలో అసలైన శక్తి పీఠం ఉందనేది స్థానికుల విశ్వాసం. 

పొలాల మధ్య చిన్న గుడిలో వెలసిన ఈ అమ్మవారి ప్రతిమ కూడా ముఖం వరకు (తల భాగం ) మాత్రమే ఉండటం విశేషం. నిజమైన శక్తి పీఠం ఇదేనని చెప్పే ఆధారాలు ఇక్కడ ఉన్నాయని చెబుతున్నారు. ఏదేవైనా ఈ ప్రాంతానికి వెళితే రేణుకా మాత క్షేత్రంతో పాటు అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించిన భాగ్యం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

  ఆ అమ్మను బుద్ధి అనే అక్షింతల అర్చన చేస్తూ హృదయమనే కమలంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. అమ్మ కోసం మనం తపిస్తే అమ్మ మనకోసం పరితపిస్తుంది.

  ఇక అమ్మ ఏకవీరికా దేవిగా వెలసిన మయూర పురం దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది.

  సహ్యద్రి పర్వత శ్రేణులో ఒక శిఖరంపై గల ఈ పీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి బలులు ఇచ్చి అమ్మను సంతృప్తిపరుస్తారు. దీనినే మహాగ్రామమని, తులజాపూర్ అని అంటుంటారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించాడని అంటారు. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక.

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 72వ నామం ఏకవీరాదేవిది వస్తుంది. 

అర్ధ మాత్రా పరాసూక్ష్మా, సూక్ష్మార్ధార్ధ పరాపరా
ఏకవీరా విశేషాఖ్యా షష్టీ దేవీ మనస్వినీ        72
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 9 🌹🌻. 7. శ్రీ మహాలక్ష్మి - 7వ శక్తి పీఠం - కొల్హాపూర్, మహారాష్ట్ర 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 9 🌹
🌻. 7. శ్రీ మహాలక్ష్మి - 7వ శక్తి పీఠం -  కొల్హాపూర్, మహారాష్ట్ర  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

కొలాహపురి మహాలక్ష్మీ:
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే|
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||

తా|| శ్రీ పీఠముపై సుఖముగా కూర్చొని యుండి, శంఖము, చక్రము, గద మరియు అభయ హస్తముద్రతో నుండి మాయను మటుమాయం చేసే మహామాయగా దేవతల రత్న కిరీట కాంతులతో మొరయుచున్న పద్మపాదములుగల తల్లి, దేవతలచే పూజింపబడుతున్న మహాలక్ష్మికి భక్తిపూర్వక నమస్కారము.

అష్టాదశ శక్తి పీఠములలో ముఖ్యమైన శక్తిపీఠము కొలాహపురి మహలక్ష్మీ శక్తిపీఠము. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. 

ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ కొలాహపూర్ సముద్ర మట్టానికి 550 అడుగుల ఎత్తులో వున్నది. క్రీ.శ.9వ శతాబ్దంలో ఈ మహాలక్ష్మి ఆలయం నిర్మించబడినదని చరిత్రకారుల భవన.

ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

పద్మావతి పురంవంటి కొలాహపురంలో కొలువైనది, కరుణ మాత్రమున వీరత్వము నొసగే కరవీర పురవాసిని, విభూతి అనగా ఐశ్వర్యప్రదమైన శివలింగమును కిరీటంపై ధరించి, వాత్సల్యంతో కోరిన వారికి సంపదనొసగే సచ్చిదానంద స్వరూపిణీ, ఓ లక్ష్మిదేవీ నీకు జయమగుకాక…

మాత లుంగం గదాం ఖేటం పానపాత్రం చ భిభ్రతే|
నాగలింగం చ యోనించ భిభ్రతీ నృప మూర్థని||

కొలాహపురి మహలక్ష్మికి నాలుగు చేతులున్నాయి. (కొలాహపుర మహాత్మ్యము) క్రింద కుడిచేతిలో మాతలుంగ ఫలం (మాదిఫలం), పైకుడి చేతిలో కిందికి దిగి ఉన్న పెద్ద గద, పైన ఎడమ చేతిలో డాలు, క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ఉండగా, శిరస్సుపై ఒక నాగపడగ, దానిలో శివలింగము, యోని ముద్ర ఉన్నాయి. చంద్రఘంటా దేవి కిరీటంలోని ఘంటయే లక్ష్మిదేవి కిరీటంలోని శివలింగంగా మారిందని పెద్దల ప్రవచనం. 

అత్రి, అనసూయల పుత్రుడైన సద్గురు దత్తాత్రేయుడు ప్రతిరోజు మద్యాహ్నం ఈ లక్ష్మీదేవి వద్దకు వచ్చి భిక్షస్వీకరించేవాడట. వింధ్య గర్వమణచిన అగస్త్యుడు కొలాహపురి క్షేత్రదర్శనంతో దేవి సాక్షాత్కారం పొందాడు.

వందే పద్మకరాం ప్రసన్న వదనాం సర్వసౌభాగ్యదాయినీం|
వందే కరవీరపురస్థితాం మహాలక్షీం మానసార్చిత వందనం||

ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయి అని చెప్పుతారు. మహాలక్ష్మి అనే పేరు ఉండడం మూలంగా ఈ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు భార్య అని అనుకుంటారు. కానీ, ఈమె విష్ణుపత్ని కాదు. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్న మహాశక్తి. 

రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి.  కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. 

కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. 

మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు. 

🌻. స్థల పురాణం  :
మహారాష్ట్రలోని కొల్హాపురంలో పంచగంగా నదీ సమీపంలో ఈ శక్తి పీఠం విరాజిల్లుతోంది. 

సిరిసంపదలను ప్రసాదించే ఈ శక్తి పీఠం గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకానొకప్పుడు ఈ ప్రాంతాన్ని కరవీరుడు పాలిస్తూ వున్న కారణంగా ఇది 'కరవీరపురం'గా ప్రసిద్ధి చెందింది.

కరవీరుడు అతని ముగ్గురు సోదరులు ప్రజలను నానాకష్టాలు పెడుతూ ఉండటంతో, రాక్షస కుమారులైన ఆ నలుగురిని కూడా శివుడు సంహరించాడు. 

దాంతో కరవీరుడి తండ్రి అయిన కొల్హుడు ప్రతీకారంతో రగిలిపోతూ దేవతలపైకి దండెత్తాడు. దాంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి అతణ్ణి సంహరించింది. కొల్హుడి అభ్యర్ధన మేరకు ఆ ప్రాంతానికి అతని పేరు స్థిరపడేలా అనుగ్రహించింది.

ఇక్కడి అమ్మవారు మూడు అడుగుల ఎత్తులో శివలింగాకారంలో దర్శనమిస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. 

మహిమాన్వితమైనటువంటి ఈ శక్తి పీఠానికి క్షేత్ర పాలకుడు కపిలేశ్వరుడు, ముందుగా ఆయనను దర్శించిన తరువాతనే అమ్మవారిని దర్శించాలి. 

అమ్మవారికి చెరో వైపున మహాకాళి - మహా సరస్వతి ఆలయములు వున్నాయి. నవదుర్గల ఆలయాలు ... నవగ్రహాల ఆలయాలతో పాటు, సాక్షి గణపతి .. సూర్యనారాయణుడు .. దత్తాత్రేయుడు ఇక్కడ కొలువుదీరి కనిపిస్తారు.

 దత్తాత్రేయుడు ఈ అమ్మవారి దగ్గరే ప్రతి రోజు బిక్ష స్వీకరించేవాడని స్థల పురాణం చెబుతోంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹🌻. 6. భ్రమరాంబిక దేవి - 6వ శక్తి పీఠం - శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ 🌻

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹
🌻. 6. భ్రమరాంబిక దేవి - 6వ శక్తి పీఠం - శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ,ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమర

అష్టాదశ శక్తిపీఠలలో ఆరవ శక్తి పీఠమై భ్రామరి శక్తితో విరాజిల్లుతున్న శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా విశిష్ట స్థానం పొంది యున్నది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

ఆంధ్రరాష్ట్రంలోని కర్ణూలు జిల్లాలో గల శ్రీశైలం సముద్రమట్టానికి చుట్టూ నాలుగు ప్రధాన గోపురాలతో కోట గోడల్లాంటి ఎతైన ప్రాకారంలో 279300 చ.అడుగుల విశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉన్నది. ఆలయ ప్రాకారం 2121 అడుగుల పొడవుతో దాదాపు 20 అడుగుల ఎత్తుగల కోట గోడ పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలచి ఉన్నది.

 కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లేశ్వరల దర్శనం ముక్తిదాయకమని పురాణ ప్రవచనం. 

అందుకే “శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే” అని ఆర్యోక్తి. శ్రీశైలము అనగా వరములనిచ్చె శివ కైలాసము. సతీదేవి కంఠభాగము ఈ ప్రదేశంలో పడిందని చరిత్ర ఆదారం.

విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. 

అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర (తుమ్మెద) రూపంలో అవతరించిందట. 

అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు. 

  ఒకరోజున సౌందర్యలహరి అయిన జగజ్జనని అరుణాసురుని కంటపడింది. ఓ సుందరీ ! నీకీ కానలలో పని ఏమి? నేను లోకాల నేలేటి అరుణాసురుడను. నా సామ్రాజ్ఞ్‌వై నాతో సుఖించు అని ఆమె చేయిపట్టుకోబోగా ఆమె చుట్టూ తిరుగుతున్న భ్రమరాల (తుమ్మెదలు) అరుణాసురునిపై దాడిచేసి, చంపివేసి వాడి రాజ్యంలో వున్న రక్కసులందరినీ తుదముట్టించాయి.

   కొంతకాలానికి మహిషాసురుని సంహరించేందుకు ఉగ్ర చండీరూపంతో, పద్దెనిమిది భుజములతో వెలసి వాడిని తుదముట్టించింది.రెండవసారి మహిషుడు మళ్ళీ పుట్టినప్పుడు భద్రకాళిగా ఎనిమిది చేతులతో అవతరించి వాడిని సంహరించింది. 

మూడవసారి మహిషుడు పుట్టి ‘అమ్మా! రేండు జన్మలలో నీచేత సంహరింపబడి నా అజ్ఞానం పొగొట్టుకున్నాను. ఇప్పటికైనా నన్ను కటాక్షించి నీ వాహనంగా నన్ను సేవచేయనీ, అని ప్రార్థించగా వాడిని తన పాదల క్రింద తొక్కి ఉంచింది భ్రమరాంబాదేవి.

  ఈ క్షేత్రమున ముందుగా వెలసినది అర్ధనారీశ్వరి అయినప్పటికీ భ్రమరాంబా దేవి వెలసిన నాటినుండి ఈమెయే ప్రధాన శక్తి స్వరూపిణి అయినది.

  శ్రీశైలానికి నాలుగు ప్రధాన ద్వారములు కలవు. అవి త్రిపురాంతకము,సిద్ధవటము, అలంపురము, ఉమామహేశము అనునవి.

  ఇక్కడి పాతాళగంగ భక్తుల పాపాలు కడిగే పావనగంగ. నల్లమలై అడవిలోపల గల “ఇష్టకామేశ్వరి” ఆలయం కాకుండా ఆరుబయటే ఆ దేవి ఉంటుంది. ఇష్టకామేశ్వరీ దేవి నొసట కుంకుమ దిద్దినపుడు మనిషి నుదురువలె మెత్తగా ఉంటుంది. ఇంకా చంద్రావతి నిర్మించిన “వృద్ధ మల్లికార్జునాలయము” అలా అడుగడుగునా అలరారే వన సౌందర్యాలు, ఔషధీ విలువలు, ఆరోగ్య ప్రశాంతతో అలరారే శ్రీశైలం నిజంగా భూతల కైలాసం.

చంద్రమతి అనే రాజకుమార్తె, శివుని ధ్యానించి ప్రసన్నం చేసుకుని, తాను మల్లికగా మారి శివుని జటాజూటంలో ఉండే వరాన్ని పొందింది.

పద్మ పురాణం, మత్స్యపురాణం, స్కాంద పురాణం, దేవీ భాగవతం వగైరా అనేక పురాణాలలో ప్రస్తుతించబడిన ఈ క్షేత్రం భూమండలానికి నాభిస్ధానం అని స్ధల పురాణం చెబుతోంది.  ప్రతి పూజ, వ్రతం ముందు మనం చెప్పుకునే సంకల్పంలో మనమున్న స్ధలం శ్రీశైలానికి ఏ దిశగా వున్నదో చెప్పుకోవటం ఈ క్షేత్రం యొక్క ప్రాచీనత్వానికి నిదర్శనం. 

శ్రీశైలంలో స్వామి ఆలయం వెనుక వున్న  శ్రీ భ్రమరాంబాదేవి ఆలయ మండపంలో అద్భుత శిల్ప కళతో అలరారే స్తంభాలున్నాయి.  పూర్వం ఈ ఆలయంలో వామాచార పధ్ధతి వుండేది.  విశేషంగా  జంతుబలి  జరిగేది.  

గుడిలోకి ప్రవేశించగానే, ముందుగా అయ్యేది అయ్య, మల్లికార్జునస్వామి దర్శనమే.  ఉపాలయాలలో శ్రీరాముడు ప్రతిష్టించిన సహస్ర లింగేశ్వరస్వామి, వృధ్ధ మల్లికార్జునస్వామి, రాజేశ్వరి, రాజేశ్వరుడు, సీతాదేవి ప్రతిష్టించిన సహస్రలింగేశ్వరస్వామి, ఇంకా పాండవులు ప్రతిష్టించిన శివ లింగాలు, వగైరా అనేక దేవతా మూర్తుల దర్శనం చేసుకోవచ్చు.

అంతేకాదు, ఈ చుట్టు పక్కల చూడవలసిన ప్రదేశాలు అనేకం వున్నాయి.  సాక్షి గణపతి, శిఖరం, పాల ధార, పంచధార, హటకేశ్వరం, శ్రీ పూర్ణానందస్వామి ఆశ్రమం, అందులో కామేశ్వరీ ఆలయం, ఇష్ట కామేశ్వరి వగైరాలు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 7 🌹🌻. 5. జోగులాంబ - 5వ శక్తి పీఠం - అలంపురం , మహబూబ్‌నగర్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 7 🌹
🌻. 5. జోగులాంబ - 5వ శక్తి పీఠం - అలంపురం , మహబూబ్‌నగర్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

అలంపురే జోగులాంబ:
అష్టాదశ క్షేత్రాలలో ఐదవది. అలంపురం పూర్వనామం హలంపురం, మరో పేరు హేమలాపురం. ఈ అలంపురంలోని శక్తిపీఠం జోగులాంబా దేవి శక్తిక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కలదు. ఆదియుగంలో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా భాసిల్లింది. కాశీక్షేత్రంలో ఉత్తర వాహిని గంగానది, అలాగే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర. కాశీకి అటు, ఇటు వరుణ, అసి నదులున్నాయి. అదే విధంగా అలంపురానికి వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీలో గంగ, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఉన్న విధంగా అలంపురంలో వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీ అధిదేవతలు విశాలాక్షీ, విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలు జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపురం శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది. కావున ఈ అలంపురాన్ని “దక్షిణ కాశి” అంటారు.

అలంపురం శక్తి జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్నచిన్న గుంటలుంటాయి. ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలుంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు. ఇసుకతో రూపుదిద్దిన “రససిద్ది వినాయకుడు” అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు. గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది.

తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాశేశ్వర ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్క స్నానం చేస్తే సంవత్సరం పాటు గంగానదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది.

ఎంతో అద్భుత మహిమల చరిత్రల అలంపురం క్షేత్రాన్ని 7,8 శతాబ్దాలలో చాళుక్య రాజులు; 9వ శతాబ్దంలో రాష్ట్రకూటం రాజులు; 10,11 శతాబ్దాలలో కళ్యాణ, చాళుక్య రాజులు అభివృద్ధిపరచారు. కాని బహుమని సుల్తానుల తాకిడికి ఈ ప్రాంతం జీర్ణస్థితికి చేరుకుంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ అలంపురాన్ని అభివృద్ధిప్రిచాడు. ఇలా కాలమనే ఆటుపోటులకు తట్టుకుంటు నాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలచి నేటికి ఆ ప్రతిభను చాటుతూ నిలచిన అలంపురం చూసి తీరవలసిన మహిమాన్విత పర్యాటక కేంద్రం.

పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. ఇది హరిక్షేత్రం.

9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అపాద్భాంధవ పాత్ర పోషిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 6 🌹🌻. 4. శ్రీ చాముండేశ్వరీ దేవి - 4వ శక్తి పీఠం - మైసూరు 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 6 🌹
🌻. 4. శ్రీ చాముండేశ్వరీ దేవి - 4వ శక్తి పీఠం - మైసూరు 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

క్రౌంచపట్టణ చాముండేశ్వరి:
అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం|
చాముండేశ్వరి, చిత్కళవాసిని! శ్రీ జగదీశ్వరి రక్షయమాం||

అంటూ క్రౌంచి పట్టణమందున్న చాముండేశ్వరి ఆలయం భక్తజన జయజయ ధ్వానాలతో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. క్రౌంచి పట్టణం అనగా మహిషాసురుని ప్రధాన పట్టణం. అదే ఈనాటి మైసూరు పట్టణం. కర్నాటక రాష్ట్రంలోగల మైసూరు పట్టణమందు మహిషాసుర మర్ధినిగా, చాముండేశ్వరీ మాతగా తన చల్లని దేవెనలు కురిపిస్తూ, భక్తజన మనోభీష్టాలనీడేరుస్తూ నిత్యసేవా కైంకర్యాల నందుకుంటున్న బంగారు తల్లి ఆదిపరాశక్తి చాముండేశ్వరికి నిత్యం మనః పూర్వక వందనం.

శ్రీ చాముండేశ్వరీ దేవి… ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి. సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. 

దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. 

మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.

 కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని మైసూరులో మైసూరు ప్యాలెస్ కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉన్నది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. 

ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గ అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. మైసూరు మహరాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కుల దేవతగా ఆరాధీస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని 12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. సంవత్సరాని కొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. 

తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతుంది. 

నవరాత్రి ఏడవ రోజున చాముండీ దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు.

🌻. ప్రచారంలో ఉన్న పురాణ కథ:

పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.

ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై శక్తి వెలికివచ్చింది. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది.

ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.

అమ్మ చాముండేశ్వరి దేవీ, “చాముండి కొండ” అనబడే ఒక పర్వతము పై కొలువై ఉంటుంది.

‘స్కంద పురాణం' మరియు ఇతర పురాతన గ్రంథాలు ఈ క్షేత్రాన్ని ఎనిమిది కొండల చుట్టూ ఉన్న 'త్రిముత క్షేత్రం' అనే పవిత్ర ప్రదేశం అని ప్రస్తావించాయి. ఆ ఎనిమిది కొండలలో ఒకటైన ఈ చాముండి కొండ పశ్చిమ దిశలో ఉంటుంది. 

పూర్వ రోజులలో, ఈ కొండ పై వెలసిన మహాబలేశ్వర స్వామి) గౌరవార్ధం, ఈ కొండను 'మహాబలద్రి' అని అనేవారు.తరువాతి రోజులలో, “దేవి మహత్యం” యొక్క ప్రధాన దేవత చాముండి గౌరవార్థం 'చాముండి కొండా అని పిలువబడింది.

దేశం నలుమూలల నుంచి మరియు విదేశాల్లో నుండి అనేకమంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దేవత వారి కోరికలను నెరవేర్చును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 5 🌹🌻. 3. శృంఖలాదేవి. - 3వ శక్తి పీఠం - ప్రద్యుమ్నం - పశ్చిమబెంగాల్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 5 🌹
🌻. 3. శృంఖలాదేవి. - 3వ శక్తి పీఠం - ప్రద్యుమ్నం - పశ్చిమబెంగాల్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రద్యుమ్నం శృంఖలా దేవి 🌷

“ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలానామ భూషితే!
శ్రీవిశ్వమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ!!

ఈ చరాచర ప్రపంచానికంతటకు తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుదీరి, తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరుపొందిన దేవి. ‘శృంఖలా దేవి ‘కొలువు దీరిన దివ్యక్షేత్రం – ప్రద్యుమ్నం. ప్రద్యుమ్నం అష్టాదశ శక్తిపీఠములలో మూడవది అయిన శృంఖలాదేవి శక్తిపీఠము.

నేటి బెంగాల్ బంగ్లా దేశముగా, వంగ దేశముగా విడిపోయి ఉన్నది. హుగ్లీ జిల్లాలోని పాండుపా గ్రామంలోని దేవినే “శృంఖలాదేవి” అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లొని హుగ్లీ జిల్లాలోగల కలకత్తా (కోల్‌కతా) పట్టణానికి సుమారు 80 కి.మీ. దూరంలో పాండవ ప్రాంతమయిన “ప్రద్యుమ్న” అనే ప్రదేశంలో ఈ శృంఖలాదేవి క్షేత్రం ఉండేదని ఆర్యుల ప్రామాణికం. దాన్ని అనుసరిస్తే కలకత్తాకు 135 కి.మీ. దూరంలో గల గంగా సాగర్ క్షేత్రం శక్తి పీఠముగా పిలువబడుతోంది. ఈ క్షేత్రంలో సతీదేవి కన్ను పడిందని కొందరూ, స్థనము పడిందని మరికొందరి వాదన.

త్రేతాయుగంలో ‘ఋష్యశృంగ మహర్షి ‘ శృంఖలా దేవిని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ. 

ఈ క్షేత్రంలో వెలిసిన దేవీ విగ్రహంలో కనిపించే మాతృప్రేమను అర్ధం చేసుకోలేని సాధకులకు ఇది శృంగార క్షేత్రంగా కనిపించేది. కనుక పూర్వంకాలం నాటి గురువులు తమ శిష్యులలో నిర్వికారులైన ఉత్తమమైన వారిని మాత్రమే ఈ క్షేత్రదర్శనానికి అనుమతించేవారు. దీనికి పురాణకాలం నాటి కథ ఒకటి ఆలంబనగా ఉంది.

స్థలపురాణం:
త్రేతాయుగంలో దశరథుని పుత్రిక ఐన శాంతను వివాహం చేసుకున్న రుష్యశృంగ మహర్షి సతీసమేతుడై దేవిని చాలాకాలం ఉపాసించాడు. ఆయనకు దేవి యొక్క విచిత్రమైన ఆజ్ఞ మనస్సులో వినిపించసాగింది. అపుడు రుష్యశృంగ మహర్షి అక్కడనుండి దక్షిణ పశ్చిమ దిశగా వచ్చాడు. శృంఖలాదేవి యొక్క దివ్వశక్తి రుష్యశృంగ మహర్షిలో ఉంది. అలా వచ్చిన మహర్షి శృంగగిరి శిఖరపై తపస్సు చేసి ఆత్మానందం పొందుతాడు. తరువాత ఆ శృంగగిరి ప్రాంతంలో కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా స్థాపించుతాడు. శృంగ మహర్షి స్థాపించిన దేవతలు కనుక సాధకులు ఆ దేవతలను శృంఖలా దేవతలుగా పిలిచారు.

శ్రుంఖలము అనగా బందనం అని అర్థము. బాలింత కట్టుకొనే నడి కట్టుని కూడా శ్రుంఖళ అనవొచ్చు. అమ్మవారు జగన్మాత కాబట్టి ఇక్కడ ఒక బాలింత రూపము లో నడి కట్టు తో ఉంటారు. అందువలనే శృంఖలా దేవి అని పేరు వచ్చింది అని అంటారు.

మరికొందరు ఈ దేవి ని విశృంఖల అని కొలుచుకుంటారు. విశృంఖల అంటే ఎటువంటి బంధనాలు లేని తల్లి అని అర్థము.

సమస్త జగత్తను కన్న తల్లి గా, బాలింత నడి కట్టు తో అలరారే ఈ తల్లి నీ శాంతా సమేతముగా రుష్య శ్రుంగ మహర్షుల వారు పూజించారు అని, అమ్మ వారి పూజకు మెచ్చి అనుగ్రహించింది అని అంటారు. ఆ ఋషి పేరు మీదగా శృంఖల అని అమ్మ పేరు అని కొందరు అంటారు.

అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా (శృంగళా)దేవిగా భావిస్తారు. 

కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. 

పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

ఇంకొక కధనం ప్రకారం జమ్మూకి దగ్గరలోని జింద్రాహ ప్రాంతంలోని నాభాదేవి ఆలయం అమ్మవారి నాభి పడిన ప్రాంతంగా చెబుతారు. 

కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మహిష్మతీ నగరం నుంచి తీసుకొని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ అమ్మ శక్తితరంగాలకు లోనవుతాడు. తరువాత ఈ ప్రాంతంలోనే శారదా మాతను ప్రతిష్టిస్తాడు.

శృంఖలాదేవి భక్తుల సమస్యల సంకెళ్ళు తొలగించే తల్లిగా పేరుపొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని పేరు. దీనికే శృంఖల అనే పేరు వుండడం వల్ల క్రొత్తగా ప్రసవించిన బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల నమ్మకం.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు -4. 🌹 🌻. 2. శ్రీ కామాక్షి దేవీ - 2వ శక్తి పీఠం - కాంచీపురం 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 4 🌹

🌻. 2. శ్రీ కామాక్షి దేవీ - 2వ శక్తి పీఠం - కాంచీపురం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. 

అష్టాదశ శక్తి పీఠాలలో రెండవది కంచిలోని కామాక్షీదేవి ఆలయం . కంపా నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి.. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే అమ్మగా ఆమె ఇక్కడ విలసిల్లింది. 

ఇక్కడే శ్రీ మహావిష్ణువుతో పాటు దేవతలంతా తమతమ నెలవులను ఏర్పరచుకొన్న పుణ్యపావన క్షేత్రం ఈ శక్తి పీఠం. శ్రీ కామాక్షి దేవి ని 'కామాక్షి తాయి' అని 'కామాక్షి అమ్మణ్ణ్ ' పిలుస్తారు.

పూర్వం ఇక్కడ ఉండే బంగారు కామాక్షి దేవి, ఇప్పుడు తంజావూరులో కొలువుదీరి ఉన్నారు. కాంచీపురంలో భగవత్ శ్రీఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీకామాక్షిదేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది.

“కా” అంటే “లక్ష్మి”, “మా” అంటే “సరస్వతి”, “అక్షి” అంటే “కన్ను”. కామాక్షి దేవి అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది. సోమస్కంద రూపంగా శివ (ఏకాంబరేశ్వర్) , ఉమ (కామాక్షి) మధ్యలో స్కంధుడు (కుమారస్వామి) కొలువుదీరి ఉన్నారు.

చెన్నైకి 70 కి.మీ. దూరంలో గల కంచిక్షేత్రాన్ని కాంచీపురం, కాంజీవరం అని కూడా పిలుస్తారు. చెన్నైనుండి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు. దేవాలయాల కేంద్రంగా.. విశిష్ఠ విద్యాకేంద్రంగా గల ఈ కంచిపురంలో సతీదేవి “కంకాళం” పడినట్లు చరిత్రకారుల నమ్మకం.

కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, పుష్పాలు మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. 

కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించింది అని , మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు.

🌻. స్థల పురాణము:

కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్టచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేయుటకు ఘోర తపము చేసిందని చెబుతారు. శివుడు పెట్టిన అనేక పరీక్షలకు నిలిచి, ఆయనను మెప్పించి పరిణయమాడినది .

మొదట ప్రసన్నంగ ఉన్న అమ్మవారు, తరువాత కొన్ని పూజా పద్దతులలో వచ్చిన మార్పులు వల్ల చాలా ఉగ్రంగా ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి పూజా పద్ధతిని సవరించి, అమ్మ ను శంతపరచి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు.

భగవత్ శ్రీ ఆది శంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆది శంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది.

ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ చేస్తారు. 

గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు.

శ్రీ కామాక్షి దేవి దివ్య మంగళ రూపం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వారహి అమ్మవారు, అరూప లక్ష్మి, రూప లక్ష్మి, వినాయకుడు, కల్వనూర్(విష్ణువు), అర్ధనారీశ్వర, అన్నపూర్ణ, రాజ శ్యామలా దేవి, క్షేత్రపాలకుడు అయిన పూర్ణ పుష్కల సమేత ధర్మ శాస్త, కామాక్షి దేవి పూజ పద్ధతిని తొలుత నిర్ణయించిన దుర్వాస మహర్షి, ఆ పద్ధతిని పునః ప్రతిష్ట చేసిన ఆది శంకరులను దర్శనం చేసుకోవచ్చు.

ఈ దేవాలయ ప్రాంగణంలో కుంభస్థలంపై అందంగా అలంకరించబదిన ఏనుగులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న పంచ తీర్థం అనే కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయ శిల్పసంపద చాలా రమణీయంగా ఉంటుంది.

అష్టాదశ శక్తి పిఠాలలో రెండవ శక్తిపీఠమైన ఈ కంచి దేవాలయంలోని బంగారు బల్లి, వెండి బల్లి రూపాలను తాకి తరించే భాగ్యం ఈ క్షేత్రాన్ని దర్శించే వారికి కలుగుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - 3 🌹. 1. శ్రీ శాంకరీ దేవి


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 3 🌹

🌻 1. శ్రీ శాంకరీ దేవీ - ప్రథమ శక్తి పీఠం - శ్రీ లంక 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

స్థల పురాణము

లంకాధీశుడైన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యమునకు తీసుకు వెళ్ళాలని భావించి, కైలాసమునకు వెళ్ళి బలవంతంగా పార్వతీ దేవిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా, కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుడిని అస్త్రబంధనం చేసింది. దీనితో బలగర్వం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా భక్తితో ప్రార్థించాడు. 

రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమై వరం కోరుకోమనగా – తన రాజ్యంలో కొలువుదీరి తనను, తన ప్రజలను, రాజ్యమును రక్షిస్తూ వుండమని వరం కోరాడు. అందుకు పార్వతీదేవి –

“రావణా! నీవు అనేక అకృత్యాలు చేస్తున్నావు. అందువల్ల నీ రాజ్యం సముద్రంలో మునిగిపోయి కుచించుకుపోతుంది. నీకు వరం ప్రసాదించి నేను వచ్చి నీ రాజ్యంలో వుంటాను. అయితే నీవు అకృత్యాలు చేయనంతకాలం నేను నీ రాజ్యంలో వుంటాను. 

నీవు మళ్ళీ అకృత్యాలు చేసిన మరుక్షణం నేను నీ రాజ్యం వదిలివెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత నీకు కష్టాలు ప్రారంభమై, నీ పాలన అంతమొందుతుంది.” అని పలికింది.

అందుకు రావణాసురుడు అంగీకరించగా – పార్వతీ దేవి లంకారాజ్యంలో శాంకరీదేవిగా కొలువుదీరి ఆరాధనలందుకో సాగింది.

తర్వాత కొంత కాలానికి రావణాసురుడు సీతాదేవిని తీసుకొనివచ్చి అశోకవనంలో బంధించాడు. ఆ మరునాడు శాంకరీదేవి దర్శనమునకు వెళ్ళి రావణాసురునితో –

“రావణా! సీతాదేవిని బంధించి నీవు తప్పు చేశావు. నీవు ఆమెను వదిలిపెట్టు. లేదంటే నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను” అని పలికింది.

శాంకరీ దేవి మాటలను రావణాసురుడు ఖాతరు చేయక పోవడంతో లంకను వదిలి వెళ్ళిపోసాగింది. 

ఈ సమయంలో మహర్షులు లంక వదిలివెళ్ళినా భూలోకం వదలి వెళ్ళవద్దని ప్రార్థించడంతో ఆదేవి దక్షిణం నుంచి ఉత్తరమునకు సాగిపోయి హిమాలయం, కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోయిందని చెప్తారు. మహర్షులు ఆ దీవిని “బనశంకరీ” అని పిలిచారు. 

ఆ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని భావిస్తారు. కొందరు రావణ సంహారానంతరం శాంకరీ దేవీ తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది అని భావిస్తారు.

అయితే అనేక వివాదాలు ఉన్న ప్రస్తుతం శ్రీలంక దేశంలోని “ట్రింకోమలి” పట్టణంలో వున్న దేవీ ఆలయమును ప్రథమ శక్తి పీఠంగా భావిస్తున్నారు. ఈ క్షేత్రంలో సతీదేవి కాలిగజ్జెలు పడినట్లు కొందరు చెబుతారు, కానీ అమ్మవారి "తొడభాగం" పడిన స్థలంగా ప్రతీతి ఈ క్షేత్రం.

శ్రీ శాంకరీ దేవి ఆలయం ,శ్రీలంక తూర్పు ప్రాంతం లోని కోనేశ్వరం లో త్రిముకోమలై వద్ద వుందని చెప్పబడుతుంది . దానినే కొనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు .

అయితే ప్రస్తుతం, ఈ ప్రదేశంలో .. ఏ ఆలయం లేకపోయినా, శ్రీ శాంకరీ దేవి ఆలయం ఖచ్చితంగా వున్నదని చెప్పినచోట, అది వున్నట్లు చూపే గుర్తుగా, ఒక స్తూప స్థంబాన్ని కొండ శిఖరం మీద నిర్మిచారు.

ఈ ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17 వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరం పైన వున్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు.

అయితే, శాంకరీ దేవి విగ్రహాన్ని, ఆలయం వున్నదని చూపిన స్థలం ప్రక్కనే, ఇప్పుడు ఉన్న శ్రీ త్రికోనేశ్వర (శివ) స్వామి ఆలయంలో భద్రపరచ బడిందని భక్తుల విశ్వాసం.

ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని, శాంకరీ దేవి ఆలయంగా కంటే కూడా, స్థానికులు శివాలయం గానే భావిస్తారు.

త్రిముకోమలై అంటే “త్రిభుజం ఆకారంలో” వున్న “కొండ” పై ఉండటం వల్ల - ఆ దేవుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా పిలుస్తారు.

ఆ శివాలాయం ప్రక్కనే… ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.. ఆ ఆలయంలోని కొలువైవున్న దేవినే శాంకరీ దేవిగా కొలుస్తున్నారు. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - 2 🌹


🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - 2 🌹

🌴. ప్రదేశాల సంక్షిప్త వివరాలు 🌴
📚. ప్రసాద్ భరద్వాజ 

హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం.. 

🌻. 1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

🌻. 2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

🌻. 3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

🌻. 4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

🌻. 5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.

🌻. 6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

🌻. 7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

🌻. 8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

🌻. 9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

🌻. 10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

🌻. 11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.

🌻. 12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

🌻. 13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

🌻. 14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

🌻. 15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

🌻. 16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

🌻. 17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

🌻. 18. సరస్వతి - జమ్ము, కాశ్మీర్ - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - విశిష్టత - దర్శన ఫలితం - 1 🌹


🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - విశిష్టత - దర్శన ఫలితం - 1🌹
🌴. శక్తి పీఠాల ఉద్భవ పురాణ గాధ 🌴
📚. ప్రసాద్ భరద్వాజ 

మన హిందూ ధర్మంలో అష్టాద శక్తి పీఠాలను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. సాక్షాత్త్ శ్రీ ఆది పరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఒక గాథ ఉన్నట్లు మన పురాణాల్లో తెలుపుతున్నాయి. 

ఆ గాథలు ఏవి, ఆ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ కొలువుధీరాయి, ఆ ఫీఠాల విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

అఖండ భారతావని అంతా వ్యాపించి ఉన్న ఆ అష్టాదశ పీఠాలు సాక్షాత్ సతీ దేవి యొక్క శరీర భాగాలుగా మన పురాణాలు తెలుపుతున్నాయి. 

బ్రహ్మ దేవుడి కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతికి యాబై మూడు గురు కుమార్తెలుండే వారు. వారిలో ఇరవై ఏడు గురిని చంద్రుడికి, పదమూడు మందని కశ్యప మహర్షికి పది మందిని దర్ముణకు , ఒక ఆమెను పితురులకు, ఒక ఆమెను అగ్నికి ఇచ్చి వివాహం చేశారు. మిగిలిన కూతురే సతీ దేవి. 

ఈమె సాక్షాత్త్ ఈ ఆది పరాశక్తికి అంశ. సతికి చిన్ననాటి నుండి శివుడి మీద ఉండే మక్కువ చేత, ఆమెను చంద్రుడికిచ్చి పెళ్ళిచేయలేదు. 

ఇలా ఉండగా ఒక నాడు చంద్రుని భార్యలో 26 మంది తమ తండ్రి దక్షుడి వద్దకు వచ్చి, రోహిణిని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని మెరపెట్టుకోవడంతో దక్షుడు చంద్రుడిని పిలిచి మందలించాడు. అయినా చంద్రుడు మళ్ళీ అదే పనిచేయడంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని కురుపిగా మారమని శపించాడు. 

ఆ తర్వాత నారధుడి సలహా మేరకు చంద్రుడు ఆ పరమేశ్వరున్ని ప్రార్థించి తన శాపానికి పరిష్కారం అడగగా అందుకు ఆ పరమేశ్వరుడు పాక్షిక విమోచనం కలుగజేశాడు. 

ఇది తెలుసుకున్న దక్షుడు ఈ పరమేశ్వరునిపై కోపం పెంచుకుని , ఈశ్వరునికి సతీదేవిని ఇచ్చి వివాహం జరిపించుటకు ఇష్టపడలేదు. అయినా సతీ దేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేకున్నా ఆ పరమేశ్వరున్ని పెళ్ళాడింది. 

దక్షుడు ఆ పరమేశ్వరునిపై మరింత కోపం పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఒక రోజు బ్రహ్మ తలపెట్టి యాగానికి సకల దేవతామూర్తులు అక్కడ చేరగా, ఆఖరున దక్షుడు కూడా అక్కడి వచ్చాడు. అతన్ని చూసి గౌరవ భావంతో త్రిమూర్తూలు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు. 

అంతట దక్షుడు బ్రహ్మ నాకు తండ్రి, విష్ణువు నాకు తాత వరుస , అందుకు నాకు వారు గౌరవం ఇవ్వనవసరం లేదు. కానీ శివుడి స్వయానా మామగారు కాబట్టి, నేను ఇక్కడకు వచ్చినా కూడా లేచి మర్వాద ఇవ్వవా అని కోప్పడుతాడు దక్షుడు. 

అందుకు అక్కడున్నవారంత త్రిమూర్తులు ఆది దేవుళ్ళు, వారి తర్వాతే మనం, కాబట్టి, మనమే వారి గౌరవించాలి తప్ప మనం వారిని నిలబడమనటం మంచిది కాదని వారించారు. 

దాంతో దక్షుడు మరింత కోపోద్రిక్తుడై శివరహిత మహాయాగాన్ని నేను నిర్వహిస్తానని చెప్పి అక్కడ నుండి వెనుతిరిగాడు. ఆ తర్వాత బ్రుహస్పతి సహాయంతో దక్ష యగ్నాన్ని ప్రారంభించి, అందుకు సమస్త దేవతలకు ఆహ్వానం పంపి, ఒక్క శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. 

అయితే ఆ పరమేశ్వరుడు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ విష్ణువులు ఆ యాగానికి వెళ్ళలేదు. అయితే తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశ్యంతో ఆ పరమశివుడు వెళ్ళవద్దని వారించినా.. దాక్షాయని దక్ష యగ్నానికి వెళ్ళింది. 

అక్కడ దక్షుడు సతినీ, శివుడిని ఘోరగంగా అందరి ముందు అవమానించాడు. దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. 

ఈ విషయం తెలుసుకున్న ఆ రుద్రుడు తన సమస్త గణాలను పంపగా వారు దక్షయగ్నాన్ని నాశనం చేసి దక్షుణ్ని సంహరించారు. 

ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని మన పెద్దలు రెండు కథలుగా చెబుతారు..

ఒక కథ ఏంటంటే.. ఆ పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని తీసుకెళుతున్న సమయంలో ఆ తల్లి శరీర భాగాలు పడ్డ చోట శక్తి పీఠాలుగా వెలిశాయని చెబుతుంటే..

మరో కథ ప్రకారం శివుడు సతీ వియోగం దు:ఖం తీరక ఆమె శరీరాన్ని పట్టుకుని ఉండిపోయి, జగత్ రక్షణ కార్యాన్ని విస్మరించడంతో సఖల దేవతల ప్రార్థనలతో శ్రీమహా విష్ణువు సతీ దేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసి శివుడిని కర్తవ్వోన్ముకున్ని చేశాడు. 

ఆ విచ్చిన్నమైన సతీ దేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా మారి. భక్తులకు ఆరాధనా స్థలాలుగా మారాయి. ఈ శక్తి పీఠాలందు దాక్షాయని మాతకు తోడుగా శివుడు కూడా వేలసి, సకల జనులకు దర్శనమిస్తున్నాడు. 

ఈ శక్తి పీఠాలు భారత దేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి మూడు దేశాలలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. 

అయితే కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తి పీఠాలు 51 అని, మరికొంత మంది 108 అని వారించగా ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్లోకం ఆధారంగా చూస్తే శక్తి పీఠాలు 18 మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. 

అయితే 18 శక్తి పీఠాలలో ఒకటి పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్ లో వెలసింది, మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తిపీఠాలు మన ప్రస్తుత భారత దేశంలో ఉన్నాయి. వీటినే మహాశక్తి పీఠాలని కూడా అంటారు.

సశేషం..... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. ధృవతార - ధ్రువరేఖ - 1 🌹

*🌹. ధ్రువతార - ధ్రువరేఖ - 1 🌹*

*ధ్రువతారకు పైనున్న ఆకాశమందలి శక్తుల సుడిగుండముగా పనిచేయు తావునకు ' విష్ణుపదము యొక్క బొటనవ్రేలు' అని పేరు. అందుండి దిగివచ్చు ప్రజ్ఞామయమైన శక్తిధారనే 'ఆకాశగంగ' అందురు.*

*ధ్రువుడచట నిజస్థానము వహించి ధ్రువతార మీదుగా భూమి ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువము దాటి రేఖను కల్పించి తన రాజ్యమును పరిపాలించును......*

*✍🏼. మాస్టర్ ఇ.కె.*
*🌻. భాగవతము 4-291 - ధ్రువోపాఖ్యానము 🌻*
🌹 🌹 🌹 🌹 🌹

🌹. ధృవతార - ధ్రువరేఖ - 2 🌹

🌹. ధ్రువతార - ధ్రువరేఖ - 2 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

*ఇట్టి రేఖను మొట్టమొదటగా మన ఖగోళమునకు యజ్ఞవరాహమూర్తి తన కోరలతో నేర్పరచెను.*

*అటుపైన భూగోళము చుట్టును భూమధ్యరేఖను మనువేర్పరచెను. ధ్రువుడు ధ్రువరేఖను ఏర్పరచెను.*

*వరాహమూర్తి యేర్పరచిన రేఖలను బట్టి గోళములకు స్థితి ఏర్పడెను. మనువు గీచిన రేఖను‌ బట్టి జీవుల ధర్మము లేర్పడెను. ధ్రువుని రేఖను బట్టి అహోరాత్రాది పరిభ్రమణ మేర్పడెను.*

*ఇందు వరాహరేఖలు, ధ్రువరేఖ సృష్టిని శాసించును. మనురేఖ ధర్మమును శాసించును. అంతేగాక మానవులు స్వధర్మాచరణము రూపమున మనురేఖ ననుసరించి సుఖపడుచున్నారు.......*

✍🏼 *మాస్టర్ ఇ.కె.*
*🌻. భాగవతము 4-291*
*ధ్రువోపాఖ్యానము 🌻*
🌹 🌹 🌹 🌹 🌹

🌹. ధృవతార - ధ్రువరేఖ - 3 🌹

🌹. ధృవతార - ధ్రువరేఖ - 3 🌹
✍🏼 మాస్టర్ ఇ.కె.
భాగవతము 4-291, ధ్రువోపాఖ్యానము
📚. ప్రసాద్ భరద్వాజ 

"మనువు నుండి రేఖగా వచ్చుచున్న మార్గము పరమముగా అంగీకరించి అటు నిటు దాటకుండ చక్రనేమి యందు దిలీపుని ప్రజలు వర్తించుచున్నారు " అని కాళిదాసు రఘువంశమున వర్ణించెను.  

వృత్తి ధర్మములు, వయో ధర్మములు, వర్ణ ధర్మములు సక్రమముగా పరిపాలింపబడుట చేత మానవులీ రేఖను తమ యందు స్పష్టపరచు కొనుచుందురు. అపుడు దేవతలను గౌరవించుటయు, దేవతలు జీవులకు సకాల వర్షమును సస్య గో క్షీరాది సంపదలను ప్రసాదించి గౌరవించుటయు జరుగును.  

ఇట్లు పరస్పరము గౌరవించుటయే యజ్ఞమాచరించుట. " ఈ యజ్ఞమార్గమున దేవతలను గౌరవించుట వలననే దేవతలు మిమ్ము గౌరవించు చున్నారు", అని గీతలో కృష్ణుడు చెప్పెను.
🌹 🌹 🌹 🌹 🌹

మనస్సును దైవాధీనం చేయడమే మార్గము

🌹. ఆత్మిక మార్గమునకు సహాయ పడే కార్యములను మాత్రమే ఎంచుకుని, కాని వాటిని తెలివిగా తప్పించుకోగల నేర్పుని అలవరచు కోవడమే బుద్ధి యోగ సాధన. దానికై మనస్సును దైవాధీనం చేయడమే మార్గము. 🌹 
📚. ప్రసాద్ భరద్వాజ 

శ్రీగురుభ్యోనమః🙏

పరమశివుడు ఆత్మలోకమునకు, ప్రాపంచకమైనటువంటి లోకములకు మధ్య వ్యత్యాసమును సతీదేవికి అవగాహన కలిగిస్తున్నాడు. 

ఆత్మ సాధనకు అనుబంధమైన కార్యక్రమములను మాత్రమే అనుసరిస్తూ, ఇతర కార్యక్రమములను సున్నితముగా ప్రక్కకు నెట్టేయ గలిగినటువంటి వాడే ఆత్మానుసంధానానికి యోగ్యత ఎక్కువ సంపాదించుకుంటాడు.  

జీవితములో మనకు ఎంతోమంది పరిచయమవుతారు. అది ఆత్మ సంబంధమా, దేహ సంబంధమా అని తెలుసుకోవాలి. 

సతీదేవి మనలాగా జీవలోకములో జన్మించి తన యొక్క తపస్సు చేత శివుని అనుగ్రహము పొందినదే కాని, పరిపూర్ణముగా శివతత్త్వము లోకి ఇమిడినటువంటి వ్యక్తి కాదు.

ఆత్మ సాధనలో బాగా పెరుగుతున్నటువంటి వారికి సద్గురువు కార్యక్రమమే ప్రధానం. 

ఇతర కార్యక్రమములు అప్రధానము అయి ఉండాలి అనేటువంటిది ఇక్కడ బోధ. కర్తవ్యము లేనివాటికి గూడా వెడుతుంటే 
మన సమయము కాలిపోతుంది.

🌻. భాగవతము 🌻 
✍️ Master K.P.K. 🙏
నవ గోపికా సంఘము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 17 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 17 🌹
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ

Q:-- భూలోకంలో ఆత్మలోకం గురించి ఎందుకు గుర్తుండదు, ఆత్మలోకమే నిజమైన నివాసమైతే చనిపోయిన వెంటనే గుర్తించం ఎందుకని, ఆత్మ లక్షణాలు ఎలా అలవడతాయి?

A:--1) ఆత్మ లోకంలో ఎంత స్వేచ్ఛ గా మన శరీరం ఎంత తేలికగా ఉంటుందో గుర్తుంటే, ఒక్క క్షణం కూడా భూలోకంలో జీవించాలనుకొము, మన కంటికి కనిపించే రుజువు ఏమి లేకపోయినా ఇది సత్యం, మరణాంతర జీవితం సత్యం.

మరణించాక మన శరీరం చనిపోతుంది,కానీ మన జ్ఞాపకాలు మన జ్ఞానం అలానే ఉంటాయి, మన ఉపచేతనాత్మక మనస్సు మెల్లి మెల్లిగా ఒక్కొక్క సమాచారాన్ని గుర్తుచేస్తుంది, సమయం గడిచే కొద్దీ ఆత్మలోకం మన నిజమైన నివాసం అని గుర్తిస్తాము.

ఆత్మ లక్షణాలు:--
మనం మన ఆత్మకు ఇచ్చే శిక్షణ. అది సన్మార్గమైన, వ్యతిరేక మార్గమైన, అవి అన్ని ఆత్మలో భాగాలే, ఈ విధంగా సన్మార్గంలో, వ్యతిరేక మార్గంలో ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది. అవన్నీ ఆత్మ లక్షణాలు గా పరిగణింపబడతాయి. 

మనలో వ్యతిరేక గుణాలు ఏమి లేవు అనుకుంటారు కొంతమంది, అయిన కూడా వారు పరిపూర్ణులు కారు. ఆత్మలోకంలో ఉన్న అక్కడ కూడా పాఠాలు నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటారు. 

మనం గనుక వ్యతిరేక లక్షణాలను మార్చుకోవాలని భూలోకంలో వున్నప్పుడు ప్రయత్నించి ఉంటే ఆత్మలోకం లో వాటిని సులభంగా పోగొట్టుకోవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 114 / Sripada Srivallabha Charithamrutham - 114 🌹

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 114 / Sripada Srivallabha Charithamrutham - 114 🌹*
*✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*అధ్యాయము 15*
*🌴. బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - 3 🌴*

*🌻. శ్రీపాదులు క్షుద్రోపాసకుల పీడ తొలగించుట - 2 🌻*

ప్రాణమయకోశము నందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగియుందురు. మనోమయకోశము నందలి జీవులు మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. 

విజ్ఞానమయకోశము నందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచముతో సంబంధమును కలిగి యుందురు. 

ఆనందమయ కోశము నందలి జీవులకు ఆనందానుభవముండును. ప్రాణమయశక్తిని ఒకానొక యోగప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయశక్తితో అనుసంధానమొనరించెదను. తద్వారా, యీ తాదాత్మ్యభావము వలన యిది సాధ్యమగును. 

ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమున వాలి, తన ఎదురుగానున్న వానికంటె రెట్టింపు బలమును, శక్తిని పొందుచుండెను. అందువలననే రాముడు వాలిని చెట్టు చాటు నుండి వధించెను. విశ్వామిత్రమహర్షి రామ లక్ష్మణులకు బల అతిబల అను రెండు పవిత్ర మంత్రములనుపదేశించెను. 

ఈ మంత్రముల స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని సిద్ధపరచుకొనినయెడల విశ్వాంతరాళమునందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకొన వీలుకలుగును. 

శరీరము పరిశుద్ధమైనది గానిచో, ఆ శక్తి మన శరీరములోనికి ప్రవేశించునపుడు విపరీతమైన బాధ కలుగుటయే గాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణము కూడా సంభవించును. పరిశుద్ధతాక్రమములో మానవ శరీరములు 12 దశలలో కలవు. 

శ్రీరాముని శరీరము 12 వ దశకు చెందినది. శ్రీదత్తుని శరీరము 12 వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులయిన శ్రీపాదులవారియందు అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా నుండును." అని చెప్పెను. 

అంతట నేను "అయ్యో! గౌతమమహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందెననియూ, శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యెనని అందురు గదా! ఆమె నిజముగా శిలారూపమును పొందెనా? లేక యిందులో ఏదయినా రహస్యార్థమున్నదా?" అని ప్రశ్నించితిని.

అంతట బంగారప్ప, "మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగియుండెను. 

ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను 'శిల'కమ్మని శపించెను. అంతట అహల్య గౌతముని, ఓ తెలివిమాలిన మునీ! ఎంతపని చేసితివి? అనెను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలములను దర్శించుచూ శివానుగ్రహమున స్వస్థత నందెను. 

చైతన్య పరిణామక్రమములో 'శిల' ప్రథమ స్థానము లోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచున్నది. 

ఆ అనుభవముల తర్వాతా మరియొక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగానున్న ప్రథమశిలలో మరియొక ఆత్మ ప్రవేశించును. ఏ ఆత్మ ఏ శిలలో ఎంత కాలము ఉన్నదనుట కేవలము యోగదృష్టి కలవారికి మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. 

ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా, ఆ శిల రెండుగా ఖండించబడెననుకొనుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా, మరియొక ఖండములో మరియొక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. 

అవి ఏ రకమయిన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నపుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధను అనుభవించును. వాటికి జీవము లేదు గాని బాధా అనుభవము మాత్రముండును." వివరించెను.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 114 🌹*
*✍️ Satya prasad*
*📚. Prasad Bharadwaj*

*CHAPTER 11*
*🌴 The Story of Subbaiah Shresti, Chintamani and Bilva Mangaludu Worship of Datta will give the fruit of worship of all Gods Sripada’s Birth 🌴*

*🌻. Most wonderful lumiscence 🌻*

Subbaiah Shresti said on the next day, ‘Sri Datta Prabhu is embodiment of all Gods. If one worships Datta, one gets the fruit of worshipping all Gods. Sri Datta indeed is there merged in all Gods. Sri Sumathi Matha used to worship Paramasiva in Anasuya tatwam at dusk on Saturdays. 

So the Siva tatwam in Sri Datta Prabhu reflected in Anasuya tatwam and manifested in the womb of Sumathi Matha, who was in a state equal to that of Anasuya Matha, as Sripada Srivallabha. This is one wonderful yoga feat. He was not born as a result of union of father and mother. 

When Appala Raju Sharma and Sumathi Matha were in ‘Yoga Nishta’, Yoga Jyothis (lights) emanated from their eyes and after union entered the womb of Sumathi Matha and after nine months, it came out as Jyothi form. Sripada is indeed ‘Jyothi Swaroopa’. 

He used to express some strange powers from the third year. After Sripada, three sisters were born to these parents named Sri Vidyadhari, Radha and Surekha. 

On the day Sri Vidyadhari was born, a distant relative of Bapanarya, Malladi Ramakrishna avadhanulu, a great pundit came to their house. He had a son by name Chandrasekhar. 

The relatives said in one voice ‘Mahalakshmi Herself was born in Ghandikota people’s house. It will be good if she becomes Malladi people’s daughter-in-law. Sripada also said it was good if His sister Sri Vidyadhari was married to Chandrasekhar. 

Sripada was ‘Siddha Sankalpa’ and ‘Vajra Sankalpa’. In accordance with His words, in later years, Sri Vidyadhari and Chandrasekhar avadhanulu got married grandly in Peethikapuram.

His sister Radha was married to Viswanadha Muralikrishnavadhanulu, a resident of Vijayavatika and another sister Surekha was married to Tadepalli Dattatreya Avadhanulu, a resident of Mangalagiri. ‘My Dear! Shankar Bhatt! Sripada’s leelas cannot be predicted. 

People who remember those leelas will have their sins destroyed. In Godavari mandalam, there is a village called Tatankapuram (Tanuku). There lived a most sacred family who performed many vajapeyams, poundareekams and great yagas. 

They are called Vajapeyayajulu. There is a close relation between the Malladi family of Peethikapuram and Vajapeyayajulu family of Tanuku. 

But Vajapeyayajulu family believes in the theory of ‘Idam Brahmam, Idam Kshatram’. They belong to Parasara gothra having three rishis vasista, shakti and parasara. 

They are Rigvedis and Malladi family are Yajurvedis. In Karnataka desam, there were no proper teachers to teach Rigvedam for children. 

When they invited Vajapeyayajulu Maayanacharya of Tanuku, he migrated to Hoyasala in Karnataka. Since then they were called Hoyasala brahmins. 

They took up Brahmana profession and Kshatra profession equally. They struggled a lot to protect sanatana dharma.

 Maayanacharya had two children. One was Madhavacharya and the second one Saayanacharya. Both of them were great pundits.

 Saayanacharya wrote ‘bhashyam’ (interpretation) on Vedas. Madhavacharya did intense penance for the grace of Mahalakshmi. 

When Mahalakshmi manifested, he asked for Her grace in plenty. Then Sri Devi said, ‘My Dear! It is not possible for you in this birth’. 

He said immediately, ‘Amma! I am taking sanyas. It is my second birth.’ Sri Devi gave her blessings. If he touched a metal, it would turn into gold. He is Vidyaranya Maharishi.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 244 / Yoga Vasishta - 244 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 244 / Yoga Vasishta - 244 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 41 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 7 🌻

సంకల్ప మనోరాజ్యము వలె జగత్తు అసత్తేయగుచు, హృదయమున వ్యాపించియున్నది. ఆకాశమువలె, పృధివియందు వివిధ సృష్టులు కలవని యోగదృష్టిచే నేనెరుగితిని. 

అట్లు జీవునియొక్క బుద్ధిలో తాదాత్మ్యముపొంది దీప పర్వత సమస్త పదార్ధములు నాయందు అద్దములోవలె ప్రతిబింభించినవి. 

భూతలమున, నచట నున్నవి, నాచే వీక్షింపబడిన విశేషములిచట వర్ణించబడినవి.

ఒకచోట, పతిపుత్రాదుల మరణముచే నేడ్చుచున్న స్త్రీల రోదనలు, ఒకచోట స్త్రీ నృత్యగానాదులు, ఒకచోట క్షామమున నేడ్చుచున్న జనులు, ఒకచోట ధాన్యాగారములు, ఇంకొకచోట అగ్నిదమనములు, పక్షుల, జంతువుల సమూహములు, చీమలు, దోమలు; ఇట్లు నా భూతల శరీరమును అనుభవించితిని. ఇవన్నియు నాయొక్క మనోవికారములగుటచే మానసికములే గాని రూపములు గావు. 

ఈ విధముగ భూమండలము నా యొక్క సంకల్పము మాత్రమై మనోమయమై ధారణాభ్యాసముచే పరిపూర్ణమైనది. ఇది చిదాకాశమైనను, తన స్థూలరూపముచే చిరకాలమున్నది. 

చిరకాలాభ్యాసముచే ఈ జగత్తంతయు స్థిరముగనున్నది. స్వప్నమందు చైతన్యము, నగరాదులరూపమున భాసించునట్లు, సృష్ట్యాదియందు చైతన్యమే జగత్తు రూపునొందినది. 

ఓ రామచంద్రా| జనన మరణ రహితమైన, చిన్మాత్రయైన పరమాత్మతత్వమే, అజ్ఞాన దశయందు తన ఆత్మరూపమును త్యజింపకయే, అనేక చరాచర ప్రపంచములను గాంచుచున్నది. 

పృధివియందనేక జగత్తులు గాంచుట, జలధారణచే సంపూర్ణజల లీల దర్శించబడుట. పర్వత శిలలందనేక రెట్లు బ్రహ్మాండము లేవిధముగ గాంచితినో అటఈ భూమియందు, సర్వత్ర అనేక జగత్‌ సమూహములుండి యుండును. 

సర్వత్ర జగంబులు, సర్వత్ర బ్రహ్మము కలదు. సృష్టికి పూర్వము అహంకారాది జగత్తు చిదాకాశమే. సృష్ట్యానంతరము చిదాకాశమున కల్పించినను, నయ్యది స్వప్నపురమువంటిదే అగును. 

పృధివి యందెట్లు అనేక జగంబులున్నవో, అట్లే జలమందును అనేక జగంబులు కలవు. నేను జలరూపము పొంది ''గులగుల'' శబ్ధము గాంచితిని. 

జలపానము చేసినపుడు, ఆ జలము నోటనుండి హృదయమున ప్రవేశించి అన్నిభాగములకు ప్రసరించితిని. పిపీలకాది అతిసూక్ష్మశరీరులందు, నాడులందు పరమ సూక్ష్మమైన జలరూపముతోటి, సర్వరూపుడగు బ్రహ్మదేవునివలెనుంటిని. 

మధు రసాదిరూపములు ధరించి, నేను జిహ్వాది యొక్క పరమాణువులతో కలసి, వాటి అనుభవమును పొందితిని. ఇదియంతయు మోహానుభవమగును. అట్టి దశయందు పరమాణువులందు సంపూర్ణమైన జగత్తును గాంచితిని. 

అరటి పట్ట వలె ఒకదానిలోనొకటి వర్తించుచున్న లక్షల కొలది బ్రహ్మాండములను, వాని అనేక నాశోత్పత్తులను నేనచట గాంచితిని. 
తేజముయొక్క ధారణచే, సూర్యచంద్రాగ్నులను గాంచితినని వసిస్ఠుడు పల్కెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 244 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 74 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU - 5 🌻

„Of these seven stages, the three first may be included under Jagrat Avastha (or the waking state). The fourth stage, in which all the universes do appear like a dream, will fall under Swapna (the dreaming state).  

The fifth stage which is filled with uniform bliss alone comes under the category of Sushupti. That which is of the nature of bliss with intelligence is the sixth stage coming under the head of Turya.  

Then comes the Turyatita, the seventh stage which is above the reach of the fluctuating mind and speech, self-shining and of the nature of Sat. If through the control of Chitta (mind) within the heart, all the visibles are destroyed by one past all resurrection, then there is no doubt that he will become a Jivanmukta through the great Be-ness.  

If one without suffering from the pleasures or pains of enjoyments becomes of a high intelligence and merges into Atman and enjoys the beatitude there, then to the certitude of such a being, the supreme Moksha will ensue.  

Such a person is a Jivanmukta, no matter whether he involves himself in many actions or not, or whether he is a householder or an ascetic, or whether he is disembodied or embodied.  

Such a sturdy person will never droop in spirit, since he is convinced that he neither dies nor lives, neither exists nor non-exists, neither is one nor another. 

Such a sturdy person, will never be afflicted in mind, being without grayness or desires or mind or egoism or any such and never clinging to any. 

Such a person being without the three gunas, birth and death and being a pure person and a Jnani of eternal quiescence and equal vision, will not in the least be afflicted.  

Such a person knowing that he is that which pervades all things such as straw, Akasa, Sun, Devas, Nagas or men, will never give way to despondency of heart.  

Those who have cognized through enquiry that Chit (consciousness) pervades everywhere in the world, warp-wise and woof-wise, up and down, are the indestructible Ones.‟   

An object enjoyed firmly through one‟s Vasanas brings immediately in its train pleasures; but when it perishes soon with its terrific results, it will of itself be productive of pains. 

 It is indeed a notorious fact that the majority of mankind do not relieve themselves from pleasures or pains.  

But when Vasanas are either destroyed completely or do decay little by little, no joy will be experienced in sensual objects.  

Pleasures and pains are so inseparably interblended that they both manifest themselves together when they originate or disappear together when they perish.  

When the Vasanas of the mind decay, then the Karmas done by it will never generate pleasures or pains, like a burnt seed.  

Diverse Karmas have arisen through the separate appearance of the body and its organs. Whoever will like to come forward as the cook and the enjoyer therein?  

One who through his great intelligence, is not attracted by the created objects will be of a heart as cool as the moon and of the lustre of the rays of the sun.  

Then by the whirlwind of wisdom, the cotton pods of Karmas, Sanchita and Agami 141 will be broken and scattered away from the cotton plant of this body with its nine gates. 

Note : 141. Agami are the Karmas now enacted.   

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 320 / Bhagavad-Gita - 320

🌹. శ్రీమద్భగవద్గీత - 320 / Bhagavad-Gita - 320 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 01 🌴

01. శ్రీ భగవానువాచ
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే |
జ్ఞాన విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్షసే(శుభాత్ ||

🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవు నా యెడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమజ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతికస్థితి వలన కలిగెడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు.

🌷. భాష్యము :
భక్తుడు శ్రీకృష్ణభగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసినకొలది అధికముగా ఆత్మవికాసము నొందుచుండును. ఇట్టి శ్రవణవిధానమే శ్రీమద్భాగవతమునందు ఈ విధముగా ఉపదేశింపబడినది. “భాగవత్కథలు పరమశక్తిపుర్నములు. 

భవత్సంబంధిత విషయములు భక్తుల సంగములో చర్చించినచో అవి అనుభవమునకు వచ్చును. అనుభవపూర్వక జ్ఞానమైనందున ఇది ఎన్నడును మానసికకల్పనాపరులు లేదా లౌకికవిద్వాంసుల సాంగత్యమున సాధింపబడదు.”

భక్తులు సదా శ్రీకృష్ణభగవానుని సేవలో నిలిచియుందురు. ఆ విధముగా కృష్ణభక్తిభావనాయుతుడైన జీవుని మనోగతమును, శ్రద్ధను గమనించిన ఆ భగవానుడు భక్తుల సాంగత్యములో తనను గూర్చి సంపూర్ణముగా అవగతము చేసికొను బుద్ధిని అతనికి ప్రసాదించును. 

కృష్ణపరమగు చర్చ అత్యంత శక్తివంతమైనది. అదృష్టభాగుడైన మనుజుడు అట్టి సాంగత్యమును పొంది ఈ జ్ఞానమును అవగతము చేసికొనుటకు యత్నించినచో తప్పక ఆధ్యాత్మికానుభావమును బడయగలడు. 

తన శక్తిపూర్ణమైన సేవ యందు అత్యంత ఉన్నతస్థితిని అర్జునుడు బడయనట్లుగా చేయుటకే శ్రీకృష్ణుడు తానింతవరకు తెలియజేసిన విషయముల కన్నను పరమరహస్యమైనవానిని ఈ నవమాధ్యాయమున వివరింపనున్నాడు.

భగవద్గీతకు ఆదియైనటువంటి ప్రథమాధ్యాయము దాదాపు గీతకు ఉపోద్ఘాతము వంటిది కాగా, ద్వితీయ మరియు తృతీయ అధ్యయములలో వివరింపబడిన ఆధ్యాత్మికజ్ఞానము “గుహ్యము” అయియున్నది. 

సప్తమ, అష్టమాధ్యాయములలో చర్చించబడిన విషయములు ప్రత్యేకముగా భక్తియుతసేవకు సంబంధించినవై యున్నవి. కృష్ణభక్తిభావన యందు వికాసము కూర్చునవైనందున అవి “గుహ్యతరము” అయియున్నవి. 

కాని ఈ నవమాధ్యాయమున వివరింపబడిన విషయములు శుద్ధభక్తికి సంబంధించినవైనందున “గుహ్యతమము” అని పిలువబడుచున్నవి. శ్రీకృష్ణభగవానుని అట్టి గుహ్యతమ జ్ఞానమునందు స్థితిని పొందినవాడు సహజముగా దివ్యుడగును. తత్కారణముగా అతడు భౌతికజగమునందున్నను భౌతికక్లేశములను పొందడు. 

కనుకనే హృదయపూర్వకముగా కృష్ణసేవాభిలాషను కలిగియుండెడివాడు భౌతికబంధస్థితిలో నున్నప్పటికి ముక్తునిగానే భావింపబడవలెనని భక్తిరసామృతసింధువు తెలుపుచున్నది. అదేవిధముగా భగవద్గీత దశామాధ్యాయమునందు కూడా భక్తియందు నియుక్తుడైనవాడు ముక్తపురుషుడని తెలుపబడినది.

నవమాధ్యయపు ఈ ప్రథమశ్లోకమునకు ఒక వేశేష ప్రాధాన్యము కలదు. దీని యందలి “ఇదం జ్ఞానం” (ఈ జ్ఞానము) అణు పదము శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనములను నవవిధకర్మలను కూడిన భక్తియుతసేవను సూచించుచున్నది. 

భక్తియుతసేవ యందలి ఈ తొమ్మిది అంశములను అభ్యాసము చేయుట ద్వారా మనుజుడు ఆధ్యాత్మకచైతన్యము (కృష్ణభక్తిరసభావనము) బడయగలడు. 

ఆ విధముగా హృదయము భౌతికకల్మషము నుండి శుద్ధిపడినంతట అతడు కృష్ణపరజ్ఞానము సంపూర్ణముగా అవగాహన చేసికొనగలడు. వాస్తవమునకు జీవుడు భౌతికము కాదన్న భావనను పొందుట ఒక్కటే సరిపోదు. 

అది ఆధ్యాత్మికానుభావమునకు నాంది మాత్రమే. పిదప ప్రతియొక్కరు దేహపరములగు కర్మలు మరియు దేహాత్మభావన తొలగినవాని ఆధ్యాత్మికకర్మల నడుమ గల భేదమును చక్కగా గుర్తించవలెను.

శ్రీకృష్ణభగవానుని విభూతిపూర్ణశక్తి, ఉన్నత, న్యూనప్రకృతులుగా తెలియబడు అతని వివిధశక్తులు, భౌతికజగత్తు మొదలుగునవి సప్తమధ్యాయమున ఇదివరకే మనము చర్చించియున్నాము. ఇప్పుడు ఈ నవమాధ్యాయమున ఆ భగవానుని వైభవములు విశదీకరింపబడునున్నవి.

ఈ శ్లోకమున “అనసూయవే” అను పదము కూడా మిక్కిలి ప్రధానమైనది.

 సాధారణముగా గీతావ్యాఖ్యాతలు గొప్ప పండితులైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అసూయను కలిగియుందురు. మాహాపండితులైనవారు కుడా భగవద్గీతకు అసమంజసముగనే వ్యాఖ్యానములు వ్రాయుదురు. 

వారు కృష్ణుని యెడ అసూయను కలిగియున్నందున వారి వ్యాఖ్యానములు ప్రయోజనశూన్యములు. కేవలము భగవద్భక్తులు వ్రాసిన వ్యాఖ్యానములు మాత్రమే నిజమునకు ప్రామాణికములు. 

అసూయగ్రస్థుడైన వాడెవ్వడును భగవద్గీతను యథాతథముగా వివరింపలేడు మరియు కృష్ణుని గూర్చిన సమగ్రమైన జ్ఞానమును అందించలేడు. కృష్ణుని గూర్చి ఎరుగకయే విమర్శలు కావించువాడు నిక్కముగా మూర్ఖుడు. అటువంటి గీతా వ్యాఖ్యానములను జాగరూకతతో త్యజించవలెను. 

శ్రీకృష్ణుని పరమపవిత్రుడును, దివ్యపురుషుడును అగు దేవదేవునిగా అవగతము చేసికొనగలిగిన వానికి ఈ గీతాధ్యాయములు మిక్కిలి ప్రయోజనములు కాగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 320 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 01 🌴

01 . śrī-bhagavān uvāca
idaṁ tu te guhya-tamaṁ
pravakṣyāmy anasūyave
jñānaṁ vijñāna-sahitaṁ
yaj jñātvā mokṣyase ’śubhāt

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: My dear Arjuna, because you are never envious of Me, I shall impart to you this most confidential knowledge and realization, knowing which you shall be relieved of the miseries of material existence.

🌹 Purport :
As a devotee hears more and more about the Supreme Lord, he becomes enlightened. This hearing process is recommended in the Śrīmad-Bhāgavatam: 

“The messages of the Supreme Personality of Godhead are full of potencies, and these potencies can be realized if topics regarding the Supreme Godhead are discussed amongst devotees.” 

This cannot be achieved by the association of mental speculators or academic scholars, for it is realized knowledge.

The devotees are constantly engaged in the Supreme Lord’s service. 

The Lord understands the mentality and sincerity of a particular living entity who is engaged in Kṛṣṇa consciousness and gives him the intelligence to understand the science of Kṛṣṇa in the association of devotees. 

Discussion of Kṛṣṇa is very potent, and if a fortunate person has such association and tries to assimilate the knowledge, then he will surely make advancement toward spiritual realization. 

Lord Kṛṣṇa, in order to encourage Arjuna to higher and higher elevation in His potent service, describes in this Ninth Chapter matters more confidential than any He has already disclosed.

The very beginning of Bhagavad-gītā, the First Chapter, is more or less an introduction to the rest of the book; and in the Second and Third chapters, the spiritual knowledge described is called confidential. 

Topics discussed in the Seventh and Eighth chapters are specifically related to devotional service, and because they bring enlightenment in Kṛṣṇa consciousness, they are called more confidential. But the matters which are described in the Ninth Chapter deal with unalloyed, pure devotion. 

Therefore this is called the most confidential. One who is situated in the most confidential knowledge of Kṛṣṇa is naturally transcendental; he therefore has no material pangs, although he is in the material world. 

In the Bhakti-rasāmṛta-sindhu it is said that although one who has a sincere desire to render loving service to the Supreme Lord is situated in the conditional state of material existence, he is to be considered liberated. Similarly, we shall find in the Bhagavad-gītā, Tenth Chapter, that anyone who is engaged in that way is a liberated person.

Now this first verse has specific significance. The words idaṁ jñānam (“this knowledge”) refer to pure devotional service, which consists of nine different activities: hearing, chanting, remembering, serving, worshiping, praying, obeying, maintaining friendship and surrendering everything. 

By the practice of these nine elements of devotional service one is elevated to spiritual consciousness, Kṛṣṇa consciousness. 

When one’s heart is thus cleared of material contamination, one can understand this science of Kṛṣṇa. Simply to understand that a living entity is not material is not sufficient. 

That may be the beginning of spiritual realization, but one should recognize the difference between activities of the body and the spiritual activities of one who understands that he is not the body.

Continues in page 2....
🌹 🌹

Cont..from Page 1... 
🌹 🌹. Bhagavad-Gita 320, ch. 9 - 01

The Sanskrit word anasūyave in this verse is also very significant. Generally the commentators, even if they are highly scholarly, are all envious of Kṛṣṇa, the Supreme Personality of Godhead. 

Even the most erudite scholars write on Bhagavad-gītā very inaccurately. Because they are envious of Kṛṣṇa, their commentaries are useless. 

The commentaries given by devotees of the Lord are bona fide. No one can explain Bhagavad-gītā or give perfect knowledge of Kṛṣṇa if he is envious. 

One who criticizes the character of Kṛṣṇa without knowing Him is a fool. So such commentaries should be very carefully avoided. 

For one who understands that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the pure and transcendental Personality, these chapters will be very beneficial.
🌹 🌹 🌹 🌹 🌹