🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 13 🌹
🌻. 11. శ్రీ గిరిజ దేవి - 11వ శక్తి పీఠం - ఓఢ్యాణము., ఒరిస్సా 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. శ్రీ శ్రీ గిరిజ దేవి దివ్యస్తుతి 🌴
ఓడ్యాణేగిరిజాదేవీపిత్రర్చనఫలప్రదా |
బిరజా పరపర్యాయా స్థితావైతరణీ తటే |
త్రిశక్తి స్వరూపా చైవ లోకత్రాణపరాయణా |
నిత్యం భవతు సాదేవీ వరదా కులవర్దినీ ||11
ఓఢ్యాణే గిరిజా దేవి:
ఆత్మయే శంకరుడు. బుద్ధియే గిరిజాదేవి. కావున జగద్గురు ఆదిశంకరాచార్యులవారిలా “గిరిజా శంకరులను” స్తోత్రంతో అర్చించారు.
“ఆత్మాత్వం గిరిజా మతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం పూజతే విషయోప భోగ రచనా నిద్రా సమాధి స్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన్‌ం “.
“శంభో! నా ఆత్మవు నీవు, నామతి గిరిజాదేవి, పంచప్రాణాలు నీకు పరిచారికలు, శరీరము అనే ఈ గృహంలో మీ ఆదిదంపతులను నిలిపిన. నాకు ఏఏ విషయోప భోగాలందాసక్తి కలదో అవన్నీ నీకు నిత్యపూజలు, నా నిద్రా స్థితి నీ ధ్యాన సమాధి స్థితి. నా పాదాలు భూమిని సంచరించినదంతా నీకు భక్తి ప్రదక్షిణలు. నే పలికే ప్రతి పలుకు నీ స్తోత్ర గానాలే నేను ఏఏ కర్మలొనర్చినా అవి నీకు ఆరాధనలే. కనుక నిత్యం నీపై నుండి దృష్టి మరలని వరమీయి” అని ప్రార్థించారు.
మనము కూడా మన తనువును “శక్తి ఆలయం”గా మలచుకొని బుద్ధి అనే అర్చనతో “శక్తి”నుపాసించి మనసు “శక్తి” దక్షిణగా ఇచ్చినచో “శక్తి” సంపన్నులమౌతాము.
గిరిజ అనగా గిరి (హిమవంతుడు)కి జనియించినది. జన్మించినది మొదలు జటధారిపై మనసు నిలిపి ధ్యానంతో కొలిచేది.
విరజానది పాపులను పుణ్యలను చేసే పావన జల ప్రవాహం. ఓఢ్యాణము అనగా ఓడ్రదేశము. అదే నేటి ఒరిస్సా రాష్ట్రము. ఈ రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరిణి నది ఉన్నది. ఈ నదీ తీరంలో వైతరిణి అనే గ్రామం కూడా ఉంది. ఇప్పటి ఒరిస్సాలోని జాజ్‌పూర్ రోడ్‌కి సుమారు 20 కి|| మీ|| దూరంలో ఉంది ఓఢ్యాణము.
గిరిజా దేవినేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది.ఈ ప్రాంతాన్ని వైతరణీపురం అని కూడా అంటారు.
ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్డు నుంచి 20కి.మీ దూరం ప్రయాణిస్తే గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయానికి చేరుకోవచ్చు.సతీ దేవి "నాభీస్థానం" ఇక్కడ పడిందని అంటారు.అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలతో, దండలతో మరియు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు.
సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు.
ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.
ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఇక్కడి గిరిజాదేవి సింహవాహనగా కనిపిస్తుంది. అమ్మ వారు ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. ఈమె శక్తి త్రయరూపిణి.
🌻. స్థల పురాణం :
ఒరిస్సా - జాజ్ పూర్ టౌను సమీపంలోగల 'ఓడ్యాణం' అనే ప్రాంతంలో ఈ శక్తి పీఠం దర్శనమిస్తుంది. ఇక్కడ సతీదేవి 'నాభి'భాగం పడినట్టుగా చెప్పుకుంటారు. బ్రహ్మదేవుడి కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ 'గిరిజాదేవి' పేరున కొలువుదీరినట్టు స్థల పురాణం చెబుతోంది. స్థానికులు అమ్మవారిని గిరిజా దేవనీ ... బిరజాదేవని పిలుచుకుంటూ ఉంటారు.
ఇక్కడ వైతరణి అనే ఊరుతోపాటు, అదే పేరుతో పిలవబడే నది కూడా ప్రవహిస్తూ వుంటుంది. జీవుడు సూక్ష్మ శరీరంలో యమలోక ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో వైతరణి నది వస్తుంది. ఆ నది అంశగా ఇక్కడ ఈ వైతరణి ప్రవహిస్తోందని విశ్వసిస్తుంటారు. ఇక్కడ జరిగే ఆబ్దిక క్రియలు పితృ దేవతలను నరకం నుంచి బయటపడేసి స్వర్గ ప్రవేశాన్ని కలిగిస్తాయని అంటారు.
వైతరణీ నదిలోని ఓ ప్రదేశంలో 'శ్వేత వరాహ విష్ణుమూర్తి' ఆలయం వుండటం ఒక విశేషం. ఇక అమ్మవారు దుర్గాష్టమి రోజున ప్రత్యేక దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment