🍀 06 - DECEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 06 - DECEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 06 - DECEMBER - 2022 SUNDAY,మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 100 / Kapila Gita - 100 🌹 సృష్టి తత్వము - 56
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 692 / Vishnu Sahasranama Contemplation - 692 🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 139 / Agni Maha Purana - 139 🌹 🌻. ఆలయ ప్రాసాద దేవతా స్థాపన శాంత్యాది వర్ణనము - 2 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 274 / Osho Daily Meditations - 274 🌹 భ్రాంతి - అంతర్దృష్టి - DISILLUSIONMENT - INSIGHT 
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 417-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 417-2 🌹 'చేతనా రూపా' - 2 - Chetana Rupa' - 2
7) 🌹పరిమితులు మరియు మానసిక అవరోధాలు అధిగమించడం - 1 / Rising Above Limits and Mental Barriers - 1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹06, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాతిగై దీపం, Karthigai Deepam🌻*

*🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 5 🍀*

*7. వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయాఽమితతేజసే |*
*బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే*
*8. రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్ |*
*శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మృత్యువు మన నేస్తమే - ఓ మృత్యువా ! నీవు మారువేసములో నున్న మా నేస్తమువు. సదవకాశ కల్పనమే నీ పని. మా కొరకై నీవు గేటు తెరచునప్పుడు, ముందుగా మాకు తెలియ జేయుటకు సంకోచింపవద్దు. ఏలనంటే, దాని కర్కశ ధ్వనులకు మేము జడిసిపోవు వారము కాదు.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల త్రయోదశి 06:48:03 
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: భరణి 08:39:12 వరకు
తదుపరి కృత్తిక
యోగం: శివ 26:51:54 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: తైతిల 06:48:03 వరకు
వర్జ్యం: 21:32:30 - 23:15:38
దుర్ముహూర్తం: 08:46:24 - 09:30:57
రాహు కాలం: 14:53:59 - 16:17:31
గుళిక కాలం: 12:06:54 - 13:30:26
యమ గండం: 09:19:48 - 10:43:21
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28
అమృత కాలం: 03:34:12 - 05:15:48
సూర్యోదయం: 06:32:44
సూర్యాస్తమయం: 17:41:04
చంద్రోదయం: 16:18:17
చంద్రాస్తమయం: 04:44:44
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు : ముసల యోగం - దుఃఖం 08:39:12
వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 100 / Kapila Gita - 100🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 56 🌴*

*56. నిర్బిభేదవిరాజస్త్వగ్రోమశ్మశ్ర్వాదయస్తతః|*
*తత ఓషధయశ్చాసన్ శిశ్నం నిర్బిభిదే తతః॥*

*పిమ్మట ఆ విరాట్ పురుషునకు చర్మము ఏర్పడెను. దానినుండి రోమములు, గడ్డము, మీసములు, శిరోజములు వెలువడెను. ఆ చర్మముయొక్క అభిమానదేవతలైన అన్నము మొదలగు ఓషధులు ఉత్పన్నములయ్యెను. అనంతరము లింగము బహిర్గతమయ్యెను.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 100 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 56 🌴*

*56. nirbibheda virājas tvag- roma-śmaśrv-ādayas tataḥ*
*tata oṣadhayaś cāsan śiśnaṁ nirbibhide tataḥ*

*Then the universal form of the Lord, the virāṭ-puruṣa, manifested His skin, and thereupon the hair, mustache and beard appeared. After this all the herbs and drugs became manifested, and then His genitals also appeared.*

*The skin is the site of the touch sensation. The demigods who control the production of herbs and medicinal drugs are the deities presiding over the tactile sense.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 692 / Vishnu Sahasranama Contemplation - 692🌹*

*🌻692. వసురేతాః, वसुरेताः, Vasuretāḥ🌻*

*ఓం వసురేతసే నమః | ॐ वसुरेतसे नमः | OM Vasuretase namaḥ*

*సువర్ణం వసు రేతోఽస్యేత్యచ్యుతః పరమేశ్వరః ।*
*వసురేతా ఇతి ప్రోక్తో వేద విద్యా విశారదైః ॥*

*వసువు అనగా సువర్ణము. సువర్ణము రేతస్సుగా (వీర్యము లేదా సృష్టిబీజము) గలవాడు వసురేతా.*

*దేవః పూర్వ మపః సృష్ట్వా తాసు వీర్య మవాసృజత్ ।*
*త దణ్డ మభవద్ధైమం బ్రహ్మణః కారణం పరమ్ ॥*

*భగవానుడు మొదట జలములను సృజించి వానియందు వీర్యమును వ్యాప్తమొనర్చెను. అది చతుర్ముఖ బ్రహ్మ ఉత్పత్తినందుటకు హేతువును, ఉత్కృష్టమును అగు హిరణ్మయమగు అండముగానయ్యెను.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 692🌹*

*🌻692. Vasuretāḥ🌻*

*OM Vasuretase namaḥ*

सुवर्णं वसु रेतोऽस्येत्यच्युतः परमेश्वरः ।
वसुरेता इति प्रोक्तो वेद विद्या विशारदैः ॥

*Suvarṇaṃ vasu reto’syetyacyutaḥ parameśvaraḥ,*
*Vasuretā iti prokto veda vidyā viśāradaiḥ.*

*The One whose retas or vital substance is gold is Vasuretāḥ.*

देवः पूर्व मपः सृष्ट्वा तासु वीर्य मवासृजत् ।
त दण्ड मभवद्धैमं ब्रह्मणः कारणं परम् ॥

*Devaḥ pūrva mapaḥ sr‌ṣṭvā tāsu vīrya mavāsr‌jat,
Ta daṇḍa mabhavaddhaimaṃ brahmaṇaḥ kāraṇaṃ param.*

*The Lord first created the waters and then deposited vital essence in them. That became the golden egg and was the supreme source of Brahma.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥
Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 139 / Agni Maha Purana - 139 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 43*

*🌻. ఆలయ ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనము - 2🌻*

లేదా తూర్పు మొదలగు దిక్కులతో కేశవాది ద్వాదశ విగ్రహములను స్థాపించి మిగిలన గృహమునందు సాక్షాత్తు శ్రీహరిని స్థాపింపవలెను. భగవత్ర్పతిమను మట్టి, కఱ్ఱ, లోహము, రత్నములు, ఱాయి, చందనము, పుష్పము అను ఏడువస్తువులతో నిర్మింపబడి ఏడువిధములుగ నుండును. పుష్పములతోమట్టితో, చందనముతో నిర్మించిన ప్రతిమను వెంటనే పూజింపవలెను. చాల సమయము ఉంచకూడదు. పూజింపబడిన ఈ ప్రతిమలు సమస్తకామములను శీఘ్రముగ ఫలింప జేయును.

ఇప్పుడు శిలానిర్మిత ప్రతిమను గూర్చి చెప్పెదను. పర్వతమునుండి తీసికొనివచ్చిన ఱాయితో చేసిన ప్రతిమ ఉత్తమమైనది. పర్వతములు లేని పక్షమున భూమిలో లభించిన ఱాయి ఉపయోగింపవచ్చును. బ్రాహ్మణాదివర్ణముల వారికి వరుసగ తెల్లని, ఎఱ్ఱని, పచ్చని, నల్లని ఱాళ్ళు ఉత్తమమైనవి. తగిన వర్ణముగల శిల లభించినచో ఆలోపమును తీర్చుచటకై నరసింహ మంత్రముతో హోమము చేయవలెను. శిలపై తెల్లని రేఖఉన్నచో అది చాల ఉత్తమమైనది. 

నల్లరేఖ ఉన్నచో నరసింహ హోమము చేసిన పిమ్మట అది ఉత్తమముగాను కంచుఘంటవంటి ధ్వని వచ్చుచు, భేదించినపుడు అగ్నికణములు వచ్చు శిల ''పులింగము'' ఆ చిహ్నములు తక్కువగా ఉన్న శిల ''స్త్రీ లింగము'' ఈ రెండు చిహ్నములను తేనిది ''నపుంసకలింగము'' ఏదైన మండలము వంటి గుర్తు ఉన్న శిల 'సగర్భ'; దానిని పరిత్యజింపవెలను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 139 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 43*
*🌻 Installation of deities in the temples - 2 🌻*

9-11. (Images of) Keśava and others (should be placed) in the east and other directions or (the images) of Hari himself in all chambers. The images are of seven kinds—earthen, wooden, metallic, made of gems, made of stones, made of sandal and made of flowers. The images made of flowers, sandal and earth yield all desired fruits when they are worshipped at that moment. I shall describe the stone image (where such practice) prevails.

12. In the absence of hills, the stone lying buried in the earth should be taken out. Among the colours, white, red, yellow, and black are extolled.

13. When stones of the above-mentioned colours are not available (the desired) colour is brought about by the (ceremony known as) siṃhavidyā.[1]

14. After (the performance of) the siṃhahoma (a piece of) stone (which becomes) tinged with white colour or black colour or produces sound like a bell-metal or emits sparks of fire (is deemed) as male.

15. The female one is that in which these characteristics are present in a lesser degree. If they are devoid of colours they are neuter. (The stones) in which the sign of a circle is found are to be taken as impregnated and should be rejected.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 274 / Osho Daily Meditations - 274 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 274. భ్రాంతి - అంతర్దృష్టి🍀*

*🕉. మీరు ఇప్పటివరకు ప్రేమ అని పిలిచేవన్నీ ప్రేమ కాదని అర్థం చేసుకోవడం చాలా అర్ధవంతమైన అంతర్దృష్టులలో ఒకటి. ఇది జరిగినప్పుడు, చాలా సాధ్యమవుతుంది. 🕉*

*ప్రజలు తాము ప్రేమిస్తున్నామని ఆలోచిస్తూనే ఉంటారు, అది వారి గొప్ప భ్రమగా మారుతుంది-మరియు వారు ఎంత త్వరగా భ్రమ పడితే అంత మంచిది. ప్రేమ అనేది చాలా అరుదైన విషయం, అది అంత తేలిగ్గా అందరికీ అందుబాటులో ఉండదు. అది బుద్ధుడింత అరుదైనది, అంతకంటే తక్కువ కాదు. మీరు ఇప్పటివరకు ప్రేమ అని పిలిచేవన్నీ ప్రేమ కాదని అర్థం చేసుకోవడం చాలా అర్ధవంతమైన అంతర్దృష్టులలో ఒకటి. కానీ అది మిమ్మల్ని బాధపెడుతుంది, మీకు కొంత చీకటిని కూడా ఇస్తుంది. కానీ చింతించకండి, ఎందుకంటే చీకటి రాత్రి నుండి ఉదయం పుడుతుంది. రాత్రి చీకటిగా ఉన్నప్పుడు ఉదయం దగ్గరగా ఉంటుంది. మీరు చాలా నిరుత్సాహంగా ఉంటారు, ఎందుకంటే మీరు ఇంతకాలం ఏదైతే ఆలోచిస్తున్నారో అది ప్రేమ కాదు.*

*మీరు కలలలో జీవించారు, వాస్తవికతను కోల్పోయారు. ఈ అంతర్దృష్టి మీకు తెలిసినప్పుడు, మీరు చాలా విచారంగా ఉంటారు, దాదాపు చనిపోతారు. ఈ స్థితి నుండి తప్పించు కోవడానికి ప్రయత్నించవద్దు. దానిలో విశ్రాంతి తీసుకోండి, ఈ విచారంలో మునిగిపోనివ్వండి మరియు త్వరలో మీరు దాని నుండి పూర్తిగా కొత్తగా బయటకు వస్తారు. సహజ మానవ ధోరణి ఏమిటంటే, దానిని అనుమతించక పోవడం, దాని నుండి తప్పించుకోవడం. అంటే రెస్టారెంట్‌కి వెళ్లడం, సినిమా హాల్‌కి వెళ్లడం, స్నేహితులను కనుగొనడం లాంటివి చేయడం. మీరు ఆ స్థితి నుండి తప్పించు కోవడానికి ఏదైనా చేస్తుంది. కానీ మీరు తప్పించుకుంటే, మీరు మళ్ళీ జరగబోయే ఏదో కోల్పోతారు. కాబట్టి అందులో విశ్రాంతి తీసుకోండి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 274 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 274. DISILLUSIONMENT - INSIGHT 🍀*

*🕉. To understand that whatever you have called love up to now was not love is one of the most meaningful insights. When it happens, much becomes possible. 🕉*

*People go on thinking that they love, and that becomes their greatest illusion-and the sooner they are disillusioned the better. Love is such a rare thing that it cannot be so easily available to all. It is not; it is as rare as Buddhahood, not less than that. The insight that you do not know love is good, but it will make you sad, even give you a certain gloom. But don't be worried, because out of a dark night the morning is born. When the night is darkest the morning is closest. You will be very morose, because whatever- you were thinking was love was not, and you have lived in dreams and have been missing reality.*

*When this insight dawns on you, you become very sad, almost dead. Don't try to escape from this state. Relax into it, let yourself be drowned in this sadness, and soon you will come out of it completely new. The human tendency is not to allow it, to escape from it--to go to the restaurant, to the cinema hall, to find friends-anything so that you can escape from this state. But if you escape, you again miss something that was going to happen. So relax into it.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 417 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 417 -2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*

*🌻 417. 'చేతనా రూపా' - 2🌻* 

*సాత్విక శక్తికి కుడి ఎడమలుగ, హెచ్చు తగ్గులుగ, రాజసిక తామసిక శక్తు లుద్భవించును. అట్లే ధీశక్తియగు బుద్దికి అటు నిటుగ అహంకారము, చిత్తము ఏర్పడును. అన్ని స్థితుల యందు సమతూకముగ నుండునది చిత్రశక్తి. ఏడు లోకములందును చైతన్యశక్తికి స్థానము కలదు. సమతూకముగ ఎక్కడ గోచరించునో ఆ రూపములన్నియు చైతన్యరూపములే. చైతన్య రూపము సృష్టియందు శ్రీమాత శాశ్వత రూపము. ఇతర రూపములు కార్యార్థమును బట్టి శ్రీమాత యేర్పరచుకొనును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 417 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*

*🌻 417. 'Chetana Rupa' - 2🌻*

*Sattvic Shakti dichotomises as right and left, ups and downs and Rajasic Tamasic Shakti. In the same way, a Dhishakthi will dichotomise into self and will. Chitrashakti is balanced in all these states. Consciousness has a place in all the seven worlds. Where there is balance, all are forms of consciousness. Chaitanya is the eternal form of Srimata in creation. Other forms are chosen by Srimata depending on the purpose.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹పరిమితులు మరియు మానసిక అవరోధాలు అధిగమించడం - 1 / Rising Above Limits and Mental Barriers - 1 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*మన జీవిత ప్రయాణంలో అడ్డంకులు మరియు మన జీవిత లక్ష్యాల వైపు మన పురోగతిని మందగించే మానసిక పరిమితుల కంటే పైకి ఎదగడం అనేది మనం శిక్షణ పొందవలసిన ముఖ్యమైన ఆధ్యాత్మిక నైపుణ్యం. పరిమితి లేదా అవరోధం అనేది మన సంకల్ప శక్తిని తగ్గించేందుకు మనమే సృష్టించుకున్న స్వీయ ఆలోచన. ఇదే జీవితంలో విజయం సాధించేందుకు అడ్డంకులు కల్పిస్తుంది. తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు (సోదరుడు లేదా సోదరి) లేదా జీవిత భాగస్వామి వంటి ప్రియమైన వ్యక్తితో మీకు సత్సంబంధం లేదని అనుకుందాం. ఇది సంబంధాన్ని చక్కగా నిర్వహించడంలో మీరు విఫలమయ్యారు అనే నమ్మకం మీ మనస్సులో ఏర్పడేలా చేస్తుంది. అన్ని సంబంధాలు దుఃఖాన్ని ఇస్తాయనే నమ్మకం ప్రతికూల అవగాహనకు దారి తీస్తుంది. ఆ అవగాహన మన చర్యలలో ప్రవహించడం ప్రారంభించి నప్పుడు మరియు మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మన నుండి సానుకూల శక్తిని పొందకపోతే, అది సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది.*

*అలాగే, ఒక వ్యక్తి పట్ల మన మాటలు మరియు చర్యలు వారు ఆశించినట్లుగా ఉన్నప్పుడు సైతం, ఆ వ్యక్తి మన నుండి ఎందుకు దూరం అవుతున్నాడో కొన్నిసార్లు మనకు తెలియదు? ఈ సందర్భాలలో, పైన చెప్పినట్లుగా మన మనస్సు ఒక తప్పుడు నమ్మకంతో బంధించబడి, అది అవతలి వ్యక్తి పట్ల మనకున్న అవగాహనను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఆ అవగాహన యొక్క శక్తి నిరంతరం అవతలి వ్యక్తికి ప్రయాణించి అతనిని లేదా ఆమెను తాకుతుంది, దీని వలన అవతలి వ్యక్తి మనం కోరుకునే దానికి భిన్నంగా మనకు ప్రతిస్పందించేలా చేస్తుంది. ఈ సందర్భాలలో మనం సృష్టించుకున్న మానసిక అడ్డంకులే కారణంగా ఉన్నాయి. మనం చేతనంగా లేదా ఉపచేతనంగా సృష్టిస్తున్న ఆలోచనల శ్రేణియే దీనికి కారణం. ఒక సంవత్సరం పాఠశాల పరీక్షలో మీరు ఘోరంగా విఫలమయ్యారు అనుకుందాం. తత్ఫలితంగా, మీరు మీ మనస్సులో మానసిక అవరోధాల శ్రేణిని ఏర్పరచుకుంటారు - మీరు అంత పదునైనవాడిని కాదని లేదా పోటీదారుని కాదని లేదా మీరు పరీక్షల సమయంలో చాలా భయానికి లోనవుతారని లేదా మీరు విజయం సాధించలేరనే మానసిక అడ్డంకులు సృష్టించుకున్నారు. అలాంటి అడ్డంకులు మన మనస్సు మరియు వ్యక్తిత్వంపై బలంగా పనిచేసే మానసిక శక్తులు. ఇది అలాంటి భవిష్యత్తు సంఘటనలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు ఈ సందర్భంలో మరొక పాఠశాల పరీక్షను ఇవ్వడం లాంటి సందర్భాలు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹Rising Above Limits and Mental Barriers - 1🌹*

*Rising above mental limitations, which are obstacles in our life journey and slow our progress towards our life goals, is an important spiritual skill that we need to be trained in. A limitation or a barrier is a self created thought which reduces our power of determination and power to succeed in any life sphere. Suppose I have a broken relationship with a loved one, like a parent or a sibling (brother or sister) or a life partner. This causes a belief to set inside my mind that I have been unsuccessful in handling a relationship well. The belief can result in a negative perception that all relationships are sorrow giving. When that perception then starts flowing in our actions and people whom we are close to do not receive the positive energy from us which they should, it starts affecting relationships negatively.*

*Also, sometimes we do not know why a particular person is distancing himself from us when our words and actions towards the person are what they are expecting? In these cases, our mind has been imprisoned by an incorrect belief like the one shared above and that has affected our perception of the other person negatively. The energy of that perception constantly travels to the other person and hits him or her which causes the other person to respond to us in a manner which is different from what we would like them to. So, the mental limit is in the background in these cases. It is a self-limiting thought or series of thoughts which we constantly create either consciously or sub-consciously. Suppose, I have fared badly in a school exam in one year. As a result, I have formed a series of mental barriers in our mind like - I am not so sharp or competitive or I am a nervous exam giver or I am not so intelligent or I cannot succeed. Such barriers are strong mental forces which are like hammers hitting on our mind and personality. This causes a negative impact on future events of the same nature, in this case the giving of another school exam.*
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శివ సూత్రములు - 06 - 3. యోనివర్గః కాలశరీరం - 1 / Siva Sutras - 06 - 3. Yonivargaḥ kalāśarīram - 1


🌹. శివ సూత్రములు - 06 / Siva Sutras - 06 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻3. యోనివర్గః కాలశరీరం - 1 🌻

🌴. ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలే విశ్వం యొక్క సంపూర్ణ దేహం.🌴


యోని అనేది దైవిక సంతానోత్పత్తి శక్తికి విలక్షణమైన చిహ్నం (లలితా సహస్రనామం నామం 895 'యోని నిలయా'). బ్రహ్మ సూత్రం (I.iv.27) కూడా 'యోని కా హి గీయతే' అని చెబుతుంది. కావున దివ్య సంతాన శక్తికి మూలం బ్రహ్మం. ముండక ఉపనిషత్తు (III.i.3) 'బ్రహ్మ యోనిమ్' అని చెప్పడం ద్వారా పై ప్రకటనలను ధృవీకరిస్తుంది. సూత్రం 2లో చర్చించినట్లుగా ఈ సృష్టించే శక్తి మాయ. వర్గ అంటే మనస్సు యొక్క ఐదు ప్రాథమిక అంశాల యొక్క విభిన్న తత్త్వాలు.

ఈ తత్వాల ఫలితమే మాయ. మాయే ఈ భౌతిక విషయప్రపంచానికి మూలం . మొదటి సూత్రం చైతన్యం యొక్క స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది మరియు రెండవ సూత్రం జ్ఞానం యొక్క స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ సూత్రం అజ్ఞానానికి మూలం గురించి చర్చిస్తుంది. కాలా అంటే ప్రక్రియ మరియు శరీరం అంటే దేహం. కాబట్టి, కాలశరీరం అంటే భౌతిక జీవితాన్ని నిర్వహించే ప్రక్రియ. భౌతిక జీవితమే బంధం మరియు ఈ బంధానికి మూలం మాయ లేదా భ్రాంతి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Siva Sutras - 06 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻3. Yonivargaḥ kalāśarīram - 1 🌻

🌴 The multitude of similar origins is the body of parts of the whole.🌴


Yoni is the typical symbol of divine procreative energy (Lalithā Sahasranāmam nāmā 895 ‘yoni nilayā’). Brahma sūtrā (I.iv.27) also says “yoni ca hi gīyathe”. Therefore, the source of the divine procreative energy is the Brahman. Mundaka Upanishad (III.i.3) confirms the above statements by saying “brahma yonim”. This procreative energy is māyā as discussed in sūtrā 2. Vargaḥ means the tattvās, known as the principles of creation, comprising of different modifications of five basic elements and products of mind.

Māyā is the outcome of tattvās which is the source for the materialistic world. First sūtrā stressed the importance of purity of consciousness and the second sūtrā emphasised the importance of purity of knowledge. This sūtrā discusses about the source of ignorance. Kalā means process and śarīram means body. Therefore, kalāśarīram means the process through which materialistic life is carried out. Materialistic life itself is bondage and the source for this bondage is māyā or illusion.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 269


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 269 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నీ అస్తిత్వం, అనంత అస్తిత్వం కలిసే దగ్గర కాంతి వస్తుంది. శాశ్వత జీవనం ఆరంభం మొదలవుతుంది. 🍀

నమ్మకాన్ని ప్రేమని, ఆనందాన్ని సృష్టించడానికి స్వేచ్ఛను వుపయోగిస్తే దేవుడు వాటి గుండా ప్రవేశిస్తాడు. నీ అస్తిత్వం, అనంత అస్తిత్వం కలిసే దగ్గర కాంతి వస్తుంది. శాశ్వత జీవనం ఆరంభం మొదలవుతుంది.

జ్ఞాతంగా, అజ్ఞాతంగా ప్రతి మనిషి ప్రయత్నం దాని కోసమే. అవ్యక్తమయిన దాని అన్వేషణే ప్రతి మనిషిలో వుంది. ప్రతి ఒక్కరూ కాంతిలోకి రావాలను కుంటారు. దాన్ని చూడ్డానికి కళ్ళు కావాలను కుంటారు. కానీ తమ చూపుకు అడ్డు వచ్చే పనులు చేస్తారు. అంతదృష్టిని అడ్డుకుంటారు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 04 - 04. అపరిచతంలోకి . . . / DAILY WISDOM - 04 - 04. The Heroic Leap . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 04 / DAILY WISDOM - 04 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 04. అపరిచతంలోకి వ్యక్తి వీరోచిత దూకుడు 🌻


అపరిచితం లోకి వీరోచితంగా దూకడం అనేది ఉన్నతమైన ఆనందము అందుకోవడానికి గల సంసిద్ధతను తెలియజేస్తుంది. జీవితంలో పరిమితికి సంబంధించిన అసంతృప్తి వల్ల ఆత్మ తన వ్యక్తిత్వ పరిధి అందుకోలేని పరిపూర్ణతను పట్టుకోవడానికి పూనుకుంటుంది. అందువల్ల, విశ్వచలనము మరియు వ్యక్తిగత ప్రయత్నం, ప్రకృతి పట్ల వారి వైఖరి భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తున్నా, జీవుడు తన పరిపూర్ణత అందుకునే ప్రక్రియలోని భిన్న పార్శ్వాలు.

సర్వత్రా సత్యమే అయి ఉన్న చైతన్యం యొక్క ఒత్తిడి వ్యక్తులను వారి పరిమితులను అధిగమించడానికి, ఆ అపరిమితంలో వారి శాశ్వతమైన విశ్రాంతిని కనుగొనడానికి ప్రేరేపించే శక్తికి మూలం. ఈ శాశ్వత సత్యం అనేది సృష్టిలో విశ్వప్రయత్నం ద్వారా అన్వేషించబడే అత్యున్నత వస్తువు, ఇందులో మాత్రమే శక్తుల బాహ్యీకరణకు సంబంధించిన అన్ని ప్రేరణలు అంతం చేయబడతాయి. సర్వం తానకే కావాలనే కోరిక అనంతం యొక్క అనుభవంలో ముగుస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 04 🌹

🍀 📖 From The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj

🌻 04. The Heroic Leap of the Individual Into the Unknown 🌻

The heroic leap of the individual into the unknown is the expression of the want of a superior joy. The dissatisfaction with limitedness in life directs the soul to catch the fullness of perfection in the truth of its Integrality, with which the individualised condition is not endowed. Hence, universal movement and individual effort, though differing in their altruism of nature, can be understood as a reflection of the tendency to Self-Perfection of Being.

The pressure of the truth of the absoluteness of consciousness is the source of the force that compels individuals to transcend their finitude and find their eternal repose in it alone. This permanent Verity is the supreme object of quest through the cosmical endeavour in creation, wherein alone all further impulses for externalisation of forces are put an end to. The desire to become the All terminates in the experience of Infinitude.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 653 / Sri Siva Maha Purana - 653

🌹 . శ్రీ శివ మహా పురాణము - 653 / Sri Siva Maha Purana - 653 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴

🌻. గణేశ శిరశ్ఛేదము - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! భక్తులననుగ్రహించు మహేశ్వరుడు ఈ నీ మాటను విని నీ మాటచే ఆ బాలునితో యుద్ధమును చేయుటకు నిశ్చయించెను (1). ముక్కంటి దేవుడు విష్ణవును పిలిచి ఆయనతో సంప్రదించి పెద్ద సైన్యముతో దేవతలతో గూడి గణేశుని ఎదుట నిలబడెను (2). మహాబలము గలవారు, గొప్ప ఉత్సహము గలవారు, శివుని మంచి చూపు ప్రసరించిన వారు అగు దేవతలు శివుని పాదపద్మములను స్మరించి వానితో యుద్ధమును చేసిరి (3). మహాబలపరాక్రమ శాలి, గొప్ప దివ్యమగు ఆయుధములు గలవాడు, వీరుడు, సమర్థుడు, శివస్వరూపుడు అగు విష్ణువు అపుడు అతనితో యుద్ధమును చేసెను (4).

శక్తిచే ఈయబడిన మహాబలము గల ఆ గణాధిపుడు అపుడు కర్రతో దేవ శ్రేష్ఠులను మరియు విష్ణువును వెంటనే కొట్టెను (5). ఓ మునీ! విష్ణువుతో సహా దేవతలందరు ఆ వీరునిచే కర్రతో కొట్ట బడిన వారై మొక్క వోయిన బలము గల వారై వెనుకకు దిరిగిరి (6). ఓ మునీ! శివుడు కూడా సైన్యముతో గూడి చిరకాలము యుద్ధము చేసి, భయమును గొల్పుచున్న ఆ గణేశుని గాంచి మిక్కలి ఆశ్చర్యమును పొందెను (7).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 653🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴

🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 1 🌻



Brahmā said:—

1. O Nārada, on hearing your words, the great lord who grants benediction to his devotees became desirous of fighting with the boy.

2. He called Viṣṇu and consulted him. Then with a great army and the gods, He, the three-eyed lord, stood face to face with him.

3. After remembering the lotuslike feet of Śiva, the gods possessing great strength, kindly glanced at by Śiva and highly jubilant, fought with him.

4. Viṣṇu of great strength, valour and skill and possessing great divine weapons and Śivā’s form fought with him.

5. Gaṇeśa hit all the chief gods with his staff. He hit Viṣṇu too, all of a sudden. The hero had been conferred great strength by the Śaktis.

6. O sage, all the gods including Viṣṇu were hit by him with the stick. They were turned back with their strength sapped.

7. O sage, after fighting for a long time along with the army and seeing him terrific, even Śiva was greatly surprised.


Continues....

🌹🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత - 273: 07వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 273: Chap. 07, Ver. 12

 

🌹. శ్రీమద్భగవద్గీత - 292 / Bhagavad-Gita - 292 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 12 🌴

12. యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ||


🌷. తాత్పర్యం :

సత్త్వగుణమునకు గాని, రజోగుణమునకు గాని లేదా తమోగుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నియును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలిసికొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై యున్నాను. ప్రకృతిత్రిగుణములు నా యందున్నను నేను వాటికి లోబడియుండును.

🌷. భాష్యము :

జగమునందలి సమస్తకర్మలు ప్రకృతిజన్య త్రిగుణముల చేతనే నిర్వహింపబడుచున్నవి. ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండియే కలుగుచున్నను అతడెన్నడును వాటిచే ప్రభావితుడు కాడు. ఉదాహరణకు రాజ్యాంగనియమములచే ఎవ్వరైనను శిక్షింపబడవచ్చునేమో కాని, ఆ రాజ్యాంగమును తయారుచేసిన రాజు మాత్రం రాజ్యాంగనియమములకు అతీతుడై యుండును. అదే విధముగా సత్త్వరజస్తమోగుణములు శ్రీకృష్ణభగవానుని నుండియే ఉద్భవించినను అతడెన్నడును ప్రకృతిచే ప్రభావితుడు కాడు. కనుకనే అతడు నిర్గుణుడు. అనగా గుణములు అతని నుండియే కలుగుచున్నను అతనిపై ప్రభావము చూపలేవు. అదియే భగవానుని లేదా దేవదేవుని ప్రత్యేక లక్షణములలో ఒకటి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 292 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 12 🌴

12. ye caiva sāttvikā bhāvā rājasās tāmasāś ca ye
matta eveti tān viddhi na tv ahaṁ teṣu te mayi


🌷 Translation :

Know that all states of being – be they of goodness, passion or ignorance – are manifested by My energy. I am, in one sense, everything, but I am independent. I am not under the modes of material nature, for they, on the contrary, are within Me.


🌹 Purport :

All material activities in the world are being conducted under the three modes of material nature. Although these material modes of nature are emanations from the Supreme Lord, Kṛṣṇa, He is not subject to them. For instance, under the state laws one may be punished, but the king, the lawmaker, is not subject to that law. Similarly, all the modes of material nature – goodness, passion and ignorance – are emanations from the Supreme Lord, Kṛṣṇa, but Kṛṣṇa is not subject to material nature. Therefore He is nirguṇa, which means that these guṇas, or modes, although issuing from Him, do not affect Him. That is one of the special characteristics of Bhagavān, or the Supreme Personality of Godhead.

🌷🌷🌷🌷🌷



05 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹05, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, హనుమాన్‌ జయంతి (కన్నడ), Pradosh Vrat, Hanuman Jayanti (Kannada) 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 10 🍀


17. త్రిజటీ చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో నక్తంచరస్తిగ్మమన్యుః సువర్చసః

18. గజహా దైత్యహా కాలో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : నీ సొంతవిషయాల్లో, వివాదాలకు దిగకుండా వుండడానికే నీవెప్పుడూ ప్రయత్నించాలి. కాని, ప్రజా వ్యవహారాల్లో మాత్రం సమరానికి నీవు వెనుదీయరాదు. అయితే, ఆ సమరం కొనసాగించే టప్పుడు కూడా, నీ ప్రతికక్షి శక్తిసామర్థ్యాలను గుర్తించి మెచ్చుకో. 🍀


🌷🌷🌷🌷🌷



శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: శుక్ల త్రయోదశి 30:48:49

వరకు తదుపరి శుక్ల చతుర్దశి

నక్షత్రం: అశ్విని 07:15:07 వరకు

తదుపరి భరణి

యోగం: పరిఘ 27:06:05 వరకు

తదుపరి శివ

కరణం: కౌలవ 18:22:53 వరకు

వర్జ్యం: 03:05:20 - 04:45:12

మరియు 17:24:36 - 19:06:12

దుర్ముహూర్తం: 12:28:46 - 13:13:21

మరియు 14:42:30 - 15:27:05

రాహు కాలం: 07:55:44 - 09:19:18

గుళిక కాలం: 13:30:04 - 14:53:39

యమ గండం: 10:42:53 - 12:06:29

అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28

అమృత కాలం: 27:34:12 - 29:15:48

సూర్యోదయం: 06:32:09

సూర్యాస్తమయం: 17:40:49

చంద్రోదయం: 15:38:12

చంద్రాస్తమయం: 03:51:36

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు : రాక్షస యోగం - మిత్ర కలహం

07:15:07 వరకు తదుపరి చరయోగం -

దుర్వార్త శ్రవణం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹