శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-3

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-3🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀

🌻 390. 'నిర్వాణ సుఖదాయిని' - 3 🌻

శ్రీకృష్ణుడు అనగా యోగీశ్వరులకు కూడ ఈశ్వరుడు. అతనికి శరీరము ఉపాధానము (పనిముట్టు) మాత్రమే. అతడు చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మధారి యైన శ్రీ మహావిష్ణువు. భూనభోంతరాళముల వ్యాపించిన యజ్ఞపురుషుడు. అతడికి శరీర మొక ఉపాధి. అతడు శరీరము నందు ఉండుట, లేకుండుట ఏక కాలమున నిర్వర్తించిన వాడు. కృష్ణ తత్త్వ మనగా శ్రీమాత తత్త్వమే అని పలుమార్లు వివరింప బడినది.

శ్రీమాత కూడ సమస్తము వ్యాపించి ఉపాధి ద్వారా ఉపాసకులకు దర్శన మిచ్చు చుండును. శ్రీమాత తన భక్తుడైన హిమవంతుని ఉద్దేశించి యిట్లు పలికెను : “నీవు నన్ను విడచి నిర్మలమైన నిర్వాణ పదమును పొందజాలవు. కావున నన్నే శరణు పొందుము. నేను ఏక కాలమున రూపిగ, అరూపిగ కూడ నుందును. ఇందేది తిరస్కరించిననూ నీకు పరిష్కారము లేదు.” ఈ నామము ఒక అద్భుతమగు రహస్యము. ఇది తెలిసిన వారే పూర్ణ సుఖమును పొందగలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 390 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻

🌻 390. Nirvāṇa-sukha-dāyinī निर्वाण-सुख-दायिनी -3 🌻

Nir (freed) + vāṇa (derived from bāṇa, meaning body). When mind is freed from body, it leads to bliss. When higher level of consciousness is reached, physical body is forgotten. When bodily afflictions are dissolved, what is derived is eternal bliss. She confers this bliss to those who worship Her as per nāma-s 381 and 382.

This stage is described by Kṛṣṇa “He who is happy within, who rejoices within, he obtains Absolute Freedom or mokṣa. Only that yogi who possesses the inner bliss, who rests on the inner foundation, who is one with inner light, becomes one with Spirit. With sins obliterated, doubts removed, senses subjugated, the sages contributing to the welfare of the mankind, attain emancipation in the Brahman”. (Bhagavad Gīta V.24 and 25)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 220. పవిత్రతను కాపాడుకోండి / Osho Daily Meditations - 220. KEEP THE SANCTITY

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 220 / Osho Daily Meditations - 220 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 220. పవిత్రతను కాపాడుకోండి 🍀

🕉. ప్రతి వ్యక్తి తన స్వంత అంతర్గత స్థలాన్ని కలిగి ఉండాలి. అప్పుడు కలవడంలో ఆనందం ఉంటుంది, కలవడంలో కోరిక మరియు అభిరుచి ఉన్నాయి. 🕉

మీ పనిని ప్రేమ నుండి వేరు చేయడం ఎల్లప్పుడూ మంచిదని నా భావన. అవి బాగా కలిసి ఉండవు. మీ పని సమస్యలు మీ ప్రేమను ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి మరియు మీ ప్రేమ సమస్యలు మీ పనిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి; విషయాలు గుణించ బడతాయి. ప్రేమ దానికదే సరిపోతుంది; అది ఒక ప్రపంచం. మరేదైనా దానిలోకి నింపడం చేయవద్దు; ఇది ఇప్పటికే సంక్లిష్టంగా ఉంది. విషయాలను వేరుగా ఉంచండి, అప్పుడు మీ పని సులభం అవుతుంది, మీ ప్రేమ జీవితం సున్నితంగా ఉంటుంది. భార్యాభర్తలు రోజుకు ఇరవై నాలుగు గంటలు కలిసి ఉండకూడదు; అది కష్టం కూడా. వారు ఆసక్తిని కోల్పోతాము. భార్యను తేలికగా తీసుకోవడం ప్రారంభం అవుతుంది, భర్త కూడా అంతే అవుతాడు.

మీకు మీ స్వంత స్థలం లేదు కనుక మీరు అతివ్యాప్తి చెందుతూ ఉంటారు. మీరు ఒకరినొకరు అతిక్రమించుకుంటూ ఉంటారు. దానితో త్వరగానే అది మీలో ఒత్తిడిగా మారుతుంది. వ్యక్తి పవిత్రతను కాపాడుకోవడం మంచిది. ప్రతి వ్యక్తికి తన స్వంత అంతర్గత స్థలం, ఆమె స్వంత అంతర్గత స్థలం ఉండాలి. అప్పుడప్పుడు అక్కడ కలవడం మంచిది. అప్పుడు కలవడంలో ఆనందం ఉంటుంది. కలవడంలో కోరిక మరియు అభిరుచి ఉంటుంది. ఇరవై నాలుగు గంటలు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిని ఒకరు మరచిపోతారు, స్పష్టంగా మరచి పోతారు. విడివిడిగా పని చేయండి. అందువల్ల మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 220 🌹

📚. Prasad Bharadwaj

🍀 220. KEEP THE SANCTITY 🍀

🕉. Each person has to have his or her own inner space. Then there is joy in meeting, there is longing and passion in meeting. 🕉

My feeling is that it is always good to separate your work from our love. They don't go well together. Your work problems start affecting your love, and your love problems start affecting your work; things become multiplied. Love in itself is enough; it is a world. Don't load it up with anything else; it is already complicated. Keep things separate, and your work will be easier, your love life will be smoother. A husband and wife should not be together twenty-four hours a day; that too is hard. We lose interest. The wife becomes taken for granted, the husband becomes taken for granted.

You don't have your own space. You keep overlapping, you keep crowding each other, and sooner or later it becomes a stress. Better to keep the sanctity of the person. Each person has to have his own inner space, her own inner space. Then it is good to meet sometimes. Then there is joy in meeting, there is a longing and a passion in meeting. One tends to forget the person who is too close twenty-four hours, the obvious tends to be forgotten. Work separately, and your closeness will grow, your intimacy will grow.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2022

శ్రీ శివ మహా పురాణము - 601 / Sri Siva Maha Purana - 601

🌹 . శ్రీ శివ మహా పురాణము - 601 / Sri Siva Maha Purana - 601 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. కుమారాభిషేకము - 3 🌻

శివుని ఆజ్ఞచే రంభ మొదలగు అప్సరసలు దివ్యవేషములను ధరించి నవ్వుతూ పాడుతూ నర్తించిరి (20). శంకరునితో పోల్చదగిన గంగా పుత్రుడగు కుమారుని చూచినవారందరు ముల్లోకములలో వ్యాపించు చున్న గొప్ప తేజస్సును చూచిరి (21). అట్టి తేజస్సుచే చుట్టు వారబడి యున్నవాడు, బాలుడు, పుటము పెట్టిన బంగారము వంటి కాంతి గలవాడు, సూర్యునితో సమమగు వర్చస్సు గలవాడు అగు కుమారునకు అందరు వెంటనే నమస్కరించిరి (22).

వారు అతని ఎడమవైపున, కుడివైపున చేరి శిరస్సులను వంచి నమస్కరిస్తూ నమశ్శబ్దమును పలుకుతూ నిలబడిన వారై హర్షమును పొందిరి (22). నేను, విష్ణువు, ఇంద్రుడు, మరియు సర్వదేవతలు కుమారుని చుట్టు ముట్టి భూమిపై దండమువలె సాష్టాంగ ప్రణామమును చేసితిమి (24). ఇంతలో శివుడు, మహానందముతో నున్న పార్వతియు కలిసి మహోత్సవపురస్సరముగా విచ్చేసి ఆనందముతో కుమారుని చూచిరి (25).

జగత్తునకు ఏకైక బంధువు, ప్రేమ స్వరూపుడు, పాములే అలంకారముగా గలవాడు, పరమాత్మ అగు శివుడు పరాభట్టారికయగు భవానితో గూడి పుత్రుని గాంచి చాల ఆనందించెను (26). అపుడు శక్తిని ధరించి యున్న స్కందుడు ఆ పార్వతీ పరమేశ్వరులను చూచి రథము నుండి వెను వెంటనే క్రిందకు దిగి శిరస్సు వంచి నమస్కరించెను (27).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 601🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 Kārttikeya is crowned - 3 🌻

20. At the bidding of Pārvatī, the smiling celestial damsels, Rambhā and others, dressed gorgeously, were engaged in singing and dancing.

21. Those who looked at Kumāra resembling Śiva saw a great halo pervading the three worlds.

22. Immediately they saluted Kumāra who was enveloped by the brilliant halo, the lustre of molten gold and the refulgence of the sun.

23. With shoulders stooping down and eagerly engaged in shouting the cry of “Obeisance” they flanked him to the right and left and stood by.

24. Viṣṇu, Indra and I as well as the gods prostrated on the ground and went round Kumāra.

25. In the meantime Śiva, and Pārvatī highly delighted and jubilant came there and saw their son.

26. On seeing his son, the great lord Śiva, the sole kinsman of the universe along with the great goddess Pārvatī was filled with pleasure and love—the lord who wore snakes on his body and was surrounded by the Pramathas.

27. On seeing Pārvatī and Śiva, Kārttikeya got down from the chariot immediately and saluted them.

Continues....

🌹🌹🌹🌹🌹

28 Jul 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 85 / Agni Maha Purana - 85

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 85 / Agni Maha Purana - 85 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

🌻. సర్వతోభద్ర మండల విధి - 2 🌻

పంచదలాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్యచిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశ##రేఖకు బైట నున్న పీఠభాగమునందలి కోష్ఠములను తుడిచివేయవలెను. పీఠభాగముయొక్క నాలుగు కోణములలో మూడేసి కోష్ఠకములను ఆ పీఠముయొక్క నాలుగు పాదాలుగా కల్పింపవలెను.

నాలుగు దిక్కులందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్ఠకములను, తుడిచి వేయవలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పలక్తులను తుడిచివేసి వీథి ఏర్పరుపవలెను. పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను.

విద్వాంసుడు, ద్వారముల పార్శ్వభాగములందు ఎనిమిది శోభాస్థానములను, వాటి పార్శ్వభాగములందు ఉపశోభాస్థానములను, ఏర్పరుపవలెను. శోభలు ఎన్నియో ఉపశోభలు కూడ అన్నియే ఉండును.

ఉపశోభల సమీపమునందున్న స్థానములకు కోణము లని పేరు. పిమ్మట నాలుగు దిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్ఠములను, వాటి బాహ్యపంక్తిలోని, మధ్యకోష్ఠములను ద్వారనిర్మాణమునకై ఉపమోగింపవలెను. వాటి నన్నింటిని కలిపి తుడిచివేయగా నాలుగు ద్వారము లేర్పడును. ద్వారముయొక్క లెండు పార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్ఠమును, లోపలి పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను శోభానిర్మాణార్థమై తుడిచి వేయవలెను.

శోభాపార్శ్వభాగమునందు ఇందులకు విపరీతముగ చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను, లోపలనున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్టమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింపబడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపల నున్న మూడు మూడు కోష్ఠమలు భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయవలెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 85 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 29

🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 2 🌻

Nārada said:

12. Having drawn a fish with five petals of a lotus for the sake of success, the skyline (is made) outside the seat (altar). The compartments are (cleanly) swept.

13. Four other places for the feet (are made ready) in the angular points. Besmeared vessels are kept in the four quarters.

14. Two rows are marked in the quarters for the sake of pathway. Doors are made in all the four quarters.

15. A wise man has to make eight ornaments of graceful expressions by the side of the doors. An equal number of ornaments are also to be made by their side.

16. Then corners of ornaments should be made. In each one of the middle compartments in all the four directions, two figures are drawn.

17. The four outer compartments are cleansed, as well as one on each side. Three figures are drawn on each side of the petal for beautifying it.

18. Similarly, three ornaments are to be drawn on the oppo-:site direction inside the angular point as well as outside without any difference between the two.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2022

కపిల గీత - 46 / Kapila Gita - 46

🌹. కపిల గీత - 46 / Kapila Gita - 46🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
📚. ప్రసాద్‌ భరధ్వాజ

2 అధ్యాయము

🌴. సృష్టి తత్వం - 2 🌴

46. జ్ఞానం నిఃశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనమ్
యదాహుర్వర్ణయే తత్తే హృదయగ్రన్థిభేదనమ్

జ్ఞానం అనేది స్వీయ-సాక్షాత్కారం యొక్క అంతిమ పరిపూర్ణత. ఆ జ్ఞానం నేను తెలియ చేస్తాను. దాని ద్వారా మీకు భౌతిక ప్రపంచ బంధముల యొక్క ముడుల నుండి ఎలా విడుదల పొందవచ్చో తెలుస్తుంది.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 46 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 Fundamental Principles of Material Nature - 2 🌴

46. ji'ianarh niftsreyasiirthaya puru.sasyatma-darsanam
yad ahur vaqwye tat te hrdaya-granthi-bhedanam

Knowledge is the ultimate perfection of self-realization. I shall explain that knowledge unto you by which the knots of attachment to the material world are cut.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2022

28 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹28, July 2022 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

ఆషాడ అమావాస్య శుభాకాంక్షలు

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆషాడ అమావాస్య, Aashada Amavasai, చుక్కల అమావాస్య, భీమన అమావాస్య 🌻

🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 4 🍀

4. ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాః ప్రజ్ఞాదృష్టే రంజనశ్రీరపూర్వా
వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ప్రపంచమంతా నా అంతఃపురం. అందు చేత నా చేతన వస్తుజాతమంతా నా ఆనందావికి సాధనమే. హృదయంలో దివ్యదర్శనానుభూతి కలిగి నప్పుడు, సమస్తమూ ప్రియతముడైన భగవంతుని రూపంలోనే గోచరించి ఆనందోన్మత్తత కలుగజేస్తుంది.🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాఢ మాసం

దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: అమావాశ్య 23:24:43 వరకు

తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి

నక్షత్రం: పునర్వసు 07:05:29 వరకు

తదుపరి పుష్యమి

యోగం: వజ్ర 17:57:01 వరకు

తదుపరి సిధ్ధి

కరణం: చతుష్పద 10:19:31 వరకు

వర్జ్యం: 15:59:00 - 17:45:48

దుర్ముహూర్తం: 10:13:01 - 11:04:48

మరియు 15:23:46 - 16:15:33

రాహు కాలం: 13:59:36 - 15:36:42

గుళిక కాలం: 09:08:16 - 10:45:23

యమ గండం: 05:54:04 - 07:31:10

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 04:23:36 - 06:11:12

మరియు 26:39:48 - 28:26:36

సూర్యోదయం: 05:54:04

సూర్యాస్తమయం: 18:50:55

చంద్రోదయం: 05:18:12

చంద్రాస్తమయం: 18:50:37

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

07:05:29 వరకు తదుపరి శుభ యోగం

- కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

నడు చుక్కల అమావాస్య Chukkala Amavasya

🌹నడు చుక్కల అమావాస్య🌹_

ఈ రోజు ఏం చేయాలి

ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...

హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య.

ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !

ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం . కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.

ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారట. ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా !

ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి , చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి , బద్ధకానికీ , అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని , వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. మనం అంతగా పట్టించుకోని చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని తతంగాలు ఉన్నాయన్నమాట.

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2022

భీమన అమావాస్య Bheemana Amavasya

🌹.భీమన అమావాస్య 🌹

భీమన అమావాస్య దక్షిణ భారతదేశంలో జరుపుకునే పండుగ , ఎక్కువగా కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో.

నూతన వధూవరులు అమావాస్య రోజున జ్యోతిర్భేమేశ్వర వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని భర్త సంజీవిని వ్రతం అని కూడా అంటారు. భీముడి అమావాస్య శివుడిని పూజించే రోజు , తన భర్త దీర్ఘాయువు కోసం కరుణ కోరుతూ ఈ వ్రతం చేస్తారు.

భీముడి అమావాస్యను వివాహిత మహిళలు మాత్రమే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరుపుకోవచ్చు. పెళ్లికాని ఆడవారు మంచి భర్తను ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తారు మరియు వివాహిత స్త్రీ తన భర్త ఆయుష్షు పెరుగుటకు ఈ వ్రతం చేస్తారు.

ఆరాధన విధానం

గృహిణులు తమ చేతులకు కంకణాలు ధరించి జ్యోతిర్భీమేశ్వరుడిని ధ్యానించాలి. ఉదయం లేదా సాయంత్రం ఏదైనా శుభ సమయంలో వ్రతాన్ని ఆచరించవచ్చు. అన్నం ఒక ప్లేట్ మీద పెట్టి , దానిపై రెండు దీపాలు వేసి , నూనె వెలిగించండి. పూజలతో కూడిన 9 గంటల గౌరీ దారాన్ని పూజించాలి. ముందుగా గణపతిని పూజించి , తర్వాత భీమేశ్వరుని పూజించారు. 9 రకాల నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత భర్తకు పాదపూజ చేయాలి.

జరుపుకునే వివిధ మార్గాలు:

ప్రయోజనం ఒకటే అయినప్పటికీ , ఆచరణలో కొత్తదనం కనుగొనవచ్చు. దక్షిణ కన్నడలో దీనిని అమావాస్య అంటారు. ఈ రోజు , ఈ ప్రాంత సంస్కృతి , ఆచారాలు మరియు ఆలోచనలను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తర కన్నడలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని కోడె అమావాస్య అంటారు.

ఈ పండుగ యొక్క మరోక ప్రత్యేకత భండారా:

నల్లని మైదా పిండి నుండి రిపోజిటరీని తయారు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మీరు అందులో నాణెం ఉంచాలి. దీనిని గుమ్మంలో పెట్టి పూజించాలి.

పురాణ నేపథ్యం

పురాణాల ప్రకారం , అమావాస్య రోజున శివుడు పార్వతిని తన భార్యగా స్వీకరించారు.

పార్వతి శ్రేయస్సు , సంతానం , పవిత్రత , శక్తికి సంకేతం. ఈ విధంగా , ఈ రోజున ఉపవాసం ఉండి , స్త్రీలు శివుడిని మరియు పార్వతిని ఆరాధిస్తే , వారికి మంచి భర్త లభిస్తాడు. అదేవిధంగా , వివాహిత మహిళలు భర్త దీర్ఘాయువు , విజయం , సంతోషం కోసం శివుడిని పార్వతి దేవిని ఆరాధిస్తారు.

🌹 🌹 🌹 🌹 🌹

28 Jul 2022

🍀 28 - JULY - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 28, గురువారం, జూలై 2022 బృహస్పతి వాసరే  Thursday 🌹

2) 🌹 కపిల గీత - 46 / Kapila Gita - 46 🌹 సృష్టి తత్వము - 2
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 85 / Agni Maha Purana - 85 🌹
4) 🌹. శివ మహా పురాణము - 601 / Siva Maha Purana -601 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 220 / Osho Daily Meditations - 220 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-3 🌹

🌹.భీమన అమావాస్య 🌹, 🌹.  చుక్కల అమావాస్య 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹28, July 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*ఆషాడ అమావాస్య శుభాకాంక్షలు*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆషాడ అమావాస్య, Aashada Amavasai,
చుక్కల అమావాస్య, భీమన అమావాస్య 🌻*

*🍀.  శ్రీ హయగ్రీవ స్తోత్రము - 4 🍀*

*4. ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాః ప్రజ్ఞాదృష్టే రంజనశ్రీరపూర్వా*
*వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రపంచమంతా నా అంతఃపురం. అందు చేత నా చేతన వస్తుజాతమంతా నా ఆనందావికి సాధనమే. హృదయంలో దివ్యదర్శనానుభూతి కలిగి నప్పుడు, సమస్తమూ ప్రియతముడైన భగవంతుని రూపంలోనే గోచరించి ఆనందోన్మత్తత కలుగజేస్తుంది.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాఢ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: అమావాశ్య 23:24:43 వరకు
తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి
నక్షత్రం: పునర్వసు 07:05:29 వరకు
తదుపరి పుష్యమి
యోగం: వజ్ర 17:57:01 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: చతుష్పద 10:19:31 వరకు
వర్జ్యం: 15:59:00 - 17:45:48
దుర్ముహూర్తం: 10:13:01 - 11:04:48
మరియు 15:23:46 - 16:15:33
రాహు కాలం: 13:59:36 - 15:36:42
గుళిక కాలం: 09:08:16 - 10:45:23
యమ గండం: 05:54:04 - 07:31:10
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 04:23:36 - 06:11:12
మరియు 26:39:48 - 28:26:36
సూర్యోదయం: 05:54:04
సూర్యాస్తమయం: 18:50:55
చంద్రోదయం: 05:18:12
చంద్రాస్తమయం: 18:50:37
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
07:05:29 వరకు తదుపరి శుభ యోగం
- కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 46 / Kapila Gita - 46🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*
2 అధ్యాయము

*🌴. సృష్టి తత్వం  - 2 🌴*

*46. జ్ఞానం నిఃశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనమ్*
*యదాహుర్వర్ణయే తత్తే హృదయగ్రన్థిభేదనమ్*

*జ్ఞానం అనేది స్వీయ-సాక్షాత్కారం యొక్క అంతిమ పరిపూర్ణత. ఆ జ్ఞానం నేను తెలియ చేస్తాను. దాని ద్వారా మీకు భౌతిక ప్రపంచ బంధముల యొక్క ముడుల  నుండి  ఎలా విడుదల పొందవచ్చో తెలుస్తుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 46 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 Fundamental Principles of Material Nature - 2 🌴*

*46. ji'ianarh niftsreyasiirthaya puru.sasyatma-darsanam*
*yad ahur vaqwye tat te hrdaya-granthi-bhedanam*

*Knowledge is the ultimate perfection of self-realization. I shall explain that knowledge unto you by which the knots of attachment to the material world are cut.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 85 / Agni Maha Purana - 85 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 29*

*🌻.  సర్వతోభద్ర మండల విధి - 2 🌻*

పంచదలాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్యచిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశ##రేఖకు బైట నున్న పీఠభాగమునందలి కోష్ఠములను తుడిచివేయవలెను. పీఠభాగముయొక్క నాలుగు కోణములలో మూడేసి కోష్ఠకములను ఆ పీఠముయొక్క నాలుగు పాదాలుగా కల్పింపవలెను.

నాలుగు దిక్కులందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్ఠకములను, తుడిచి వేయవలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పలక్తులను తుడిచివేసి వీథి ఏర్పరుపవలెను. పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను.

విద్వాంసుడు, ద్వారముల పార్శ్వభాగములందు ఎనిమిది శోభాస్థానములను, వాటి పార్శ్వభాగములందు ఉపశోభాస్థానములను, ఏర్పరుపవలెను. శోభలు ఎన్నియో ఉపశోభలు కూడ అన్నియే ఉండును.

ఉపశోభల సమీపమునందున్న స్థానములకు కోణము లని పేరు. పిమ్మట నాలుగు దిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్ఠములను, వాటి బాహ్యపంక్తిలోని, మధ్యకోష్ఠములను ద్వారనిర్మాణమునకై ఉపమోగింపవలెను. వాటి నన్నింటిని కలిపి తుడిచివేయగా నాలుగు ద్వారము లేర్పడును. ద్వారముయొక్క లెండు పార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్ఠమును, లోపలి పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను శోభానిర్మాణార్థమై తుడిచి వేయవలెను.

శోభాపార్శ్వభాగమునందు ఇందులకు విపరీతముగ చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను, లోపలనున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్టమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింపబడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపల నున్న మూడు మూడు కోష్ఠమలు భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 85 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 29*
*🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 2 🌻*

Nārada said:

12. Having drawn a fish with five petals of a lotus for the sake of success, the skyline (is made) outside the seat (altar). The compartments are (cleanly) swept.

13. Four other places for the feet (are made ready) in the angular points. Besmeared vessels are kept in the four quarters.

14. Two rows are marked in the quarters for the sake of pathway. Doors are made in all the four quarters.

15. A wise man has to make eight ornaments of graceful expressions by the side of the doors. An equal number of ornaments are also to be made by their side.

16. Then corners of ornaments should be made. In each one of the middle compartments in all the four directions, two figures are drawn.

17. The four outer compartments are cleansed, as well as one on each side. Three figures are drawn on each side of the petal for beautifying it.

18. Similarly, three ornaments are to be drawn on the oppo-:site direction inside the angular point as well as outside without any difference between the two.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 601 / Sri Siva Maha Purana - 601 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 05 🌴*
*🌻. కుమారాభిషేకము  - 3 🌻*

శివుని ఆజ్ఞచే రంభ మొదలగు అప్సరసలు దివ్యవేషములను ధరించి నవ్వుతూ పాడుతూ నర్తించిరి (20). శంకరునితో పోల్చదగిన గంగా పుత్రుడగు కుమారుని చూచినవారందరు ముల్లోకములలో వ్యాపించు చున్న గొప్ప తేజస్సును చూచిరి (21). అట్టి తేజస్సుచే చుట్టు వారబడి యున్నవాడు, బాలుడు, పుటము పెట్టిన బంగారము వంటి కాంతి గలవాడు, సూర్యునితో సమమగు వర్చస్సు గలవాడు అగు కుమారునకు అందరు వెంటనే నమస్కరించిరి (22).

వారు అతని ఎడమవైపున, కుడివైపున చేరి శిరస్సులను వంచి నమస్కరిస్తూ నమశ్శబ్దమును పలుకుతూ నిలబడిన వారై హర్షమును పొందిరి (22). నేను, విష్ణువు, ఇంద్రుడు, మరియు సర్వదేవతలు కుమారుని చుట్టు ముట్టి భూమిపై దండమువలె సాష్టాంగ ప్రణామమును చేసితిమి (24). ఇంతలో శివుడు, మహానందముతో నున్న పార్వతియు కలిసి మహోత్సవపురస్సరముగా విచ్చేసి ఆనందముతో కుమారుని చూచిరి (25).

జగత్తునకు ఏకైక బంధువు, ప్రేమ స్వరూపుడు, పాములే అలంకారముగా గలవాడు, పరమాత్మ అగు శివుడు పరాభట్టారికయగు భవానితో గూడి పుత్రుని గాంచి చాల ఆనందించెను (26). అపుడు శక్తిని ధరించి యున్న స్కందుడు ఆ పార్వతీ పరమేశ్వరులను చూచి రథము నుండి వెను వెంటనే క్రిందకు దిగి శిరస్సు వంచి నమస్కరించెను (27).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 601🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  05 🌴*

*🌻 Kārttikeya is crowned - 3 🌻*

20. At the bidding of Pārvatī, the smiling celestial damsels, Rambhā and others, dressed gorgeously, were engaged in singing and dancing.

21. Those who looked at Kumāra resembling Śiva saw a great halo pervading the three worlds.

22. Immediately they saluted Kumāra who was enveloped by the brilliant halo, the lustre of molten gold and the refulgence of the sun.

23. With shoulders stooping down and eagerly engaged in shouting the cry of “Obeisance” they flanked him to the right and left and stood by.

24. Viṣṇu, Indra and I as well as the gods prostrated on the ground and went round Kumāra.

25. In the meantime Śiva, and Pārvatī highly delighted and jubilant came there and saw their son.

26. On seeing his son, the great lord Śiva, the sole kinsman of the universe along with the great goddess Pārvatī was filled with pleasure and love—the lord who wore snakes on his body and was surrounded by the Pramathas.

27. On seeing Pārvatī and Śiva, Kārttikeya got down from the chariot immediately and saluted them.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 220 / Osho Daily Meditations  - 220 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 220. పవిత్రతను కాపాడుకోండి 🍀*

*🕉. ప్రతి వ్యక్తి తన స్వంత అంతర్గత స్థలాన్ని కలిగి ఉండాలి. అప్పుడు కలవడంలో ఆనందం ఉంటుంది, కలవడంలో కోరిక మరియు అభిరుచి ఉన్నాయి. 🕉*
 
*మీ పనిని ప్రేమ నుండి వేరు చేయడం ఎల్లప్పుడూ మంచిదని నా భావన. అవి బాగా కలిసి ఉండవు. మీ పని సమస్యలు మీ ప్రేమను ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి మరియు మీ ప్రేమ సమస్యలు మీ పనిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి; విషయాలు గుణించ బడతాయి. ప్రేమ దానికదే  సరిపోతుంది; అది ఒక ప్రపంచం. మరేదైనా దానిలోకి నింపడం చేయవద్దు; ఇది ఇప్పటికే సంక్లిష్టంగా ఉంది. విషయాలను వేరుగా ఉంచండి, అప్పుడు  మీ పని సులభం అవుతుంది, మీ ప్రేమ జీవితం సున్నితంగా ఉంటుంది. భార్యాభర్తలు రోజుకు ఇరవై నాలుగు గంటలు కలిసి ఉండకూడదు; అది కష్టం కూడా. వారు ఆసక్తిని కోల్పోతాము. భార్యను తేలికగా తీసుకోవడం ప్రారంభం  అవుతుంది, భర్త కూడా అంతే అవుతాడు.*

*మీకు మీ స్వంత స్థలం లేదు కనుక మీరు అతివ్యాప్తి చెందుతూ ఉంటారు. మీరు ఒకరినొకరు అతిక్రమించుకుంటూ ఉంటారు. దానితో  త్వరగానే  అది మీలో ఒత్తిడిగా మారుతుంది. వ్యక్తి పవిత్రతను కాపాడుకోవడం మంచిది. ప్రతి వ్యక్తికి తన స్వంత అంతర్గత స్థలం, ఆమె స్వంత అంతర్గత స్థలం ఉండాలి. అప్పుడప్పుడు అక్కడ కలవడం మంచిది. అప్పుడు కలవడంలో ఆనందం ఉంటుంది. కలవడంలో కోరిక మరియు అభిరుచి ఉంటుంది. ఇరవై నాలుగు గంటలు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిని ఒకరు మరచిపోతారు, స్పష్టంగా మరచి పోతారు. విడివిడిగా పని చేయండి. అందువల్ల మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 220 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 220. KEEP THE SANCTITY 🍀*

*🕉. Each person has to have his or her own inner space. Then there is joy in meeting, there is longing and passion in meeting. 🕉*
 
*My feeling is that it is always good to separate your work from our love. They don't go well together. Your work problems start affecting your love, and your love problems start affecting your work; things become multiplied. Love in itself is enough; it is a world. Don't load it up with anything else; it is already complicated. Keep things separate, and your work will be easier, your love life will be smoother. A husband and wife should not be together twenty-four hours a day; that too is hard. We lose interest. The wife becomes taken for granted, the husband becomes taken for granted.*

*You don't have your own space.  You keep overlapping, you keep crowding each other, and sooner or later it becomes a stress. Better to keep the sanctity of the person. Each person has to have his own inner space, her own inner space. Then it is good to meet sometimes. Then there is joy in meeting, there is a longing and a passion in meeting. One tends to forget the person who is too close twenty-four hours, the obvious tends to be forgotten. Work separately, and your closeness will grow, your intimacy will grow.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 390 -3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 390-3🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।*
*నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀*

*🌻 390. 'నిర్వాణ సుఖదాయిని' - 3 🌻*

*శ్రీకృష్ణుడు అనగా యోగీశ్వరులకు కూడ ఈశ్వరుడు. అతనికి శరీరము ఉపాధానము (పనిముట్టు) మాత్రమే. అతడు చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మధారి యైన శ్రీ మహావిష్ణువు. భూనభోంతరాళముల వ్యాపించిన యజ్ఞపురుషుడు. అతడికి శరీర మొక ఉపాధి. అతడు శరీరము నందు ఉండుట, లేకుండుట ఏక కాలమున నిర్వర్తించిన వాడు. కృష్ణ తత్త్వ మనగా శ్రీమాత తత్త్వమే అని పలుమార్లు వివరింప బడినది.*

*శ్రీమాత కూడ సమస్తము వ్యాపించి ఉపాధి ద్వారా ఉపాసకులకు దర్శన మిచ్చు చుండును. శ్రీమాత తన భక్తుడైన హిమవంతుని ఉద్దేశించి యిట్లు పలికెను : “నీవు నన్ను విడచి నిర్మలమైన నిర్వాణ పదమును పొందజాలవు. కావున నన్నే శరణు పొందుము. నేను ఏక కాలమున రూపిగ, అరూపిగ కూడ నుందును. ఇందేది తిరస్కరించిననూ నీకు పరిష్కారము లేదు.” ఈ నామము ఒక అద్భుతమగు రహస్యము. ఇది తెలిసిన వారే పూర్ణ సుఖమును పొందగలరు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 390 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini*
*Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻*

*🌻 390. Nirvāṇa-sukha-dāyinī निर्वाण-सुख-दायिनी  -3 🌻*

*Nir (freed) + vāṇa (derived from bāṇa, meaning body).  When mind is freed from body, it leads to bliss.  When higher level of consciousness is reached, physical body is forgotten.  When bodily afflictions are dissolved, what is derived is eternal bliss.  She confers this bliss to those who worship Her as per nāma-s 381 and 382.*

*This stage is described by Kṛṣṇa “He who is happy within, who rejoices within, he obtains Absolute Freedom or mokṣa. Only that yogi who possesses the inner bliss, who rests on the inner foundation, who is one with inner light, becomes one with Spirit.  With sins obliterated, doubts removed, senses subjugated, the sages contributing to the welfare of the mankind, attain emancipation in the Brahman”. (Bhagavad Gīta V.24 and 25)*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. నేడు చుక్కల అమావాస్య 🌹

ఈ రోజు ఏం చేయాలి
 
ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...
 
హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య.

ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !
 
ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం . కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.
 
ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారట. ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా !
 
ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి , చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి , బద్ధకానికీ , అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని , వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. మనం అంతగా పట్టించుకోని చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని తతంగాలు ఉన్నాయన్నమాట.
🌹 🌹 🌹 🌹 🌹

 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹.భీమన అమావాస్య 🌹*

భీమన అమావాస్య దక్షిణ భారతదేశంలో జరుపుకునే పండుగ , ఎక్కువగా కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో.

నూతన వధూవరులు అమావాస్య రోజున జ్యోతిర్భేమేశ్వర వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని భర్త సంజీవిని వ్రతం అని కూడా అంటారు. భీముడి అమావాస్య శివుడిని పూజించే రోజు , తన భర్త దీర్ఘాయువు కోసం కరుణ కోరుతూ ఈ వ్రతం చేస్తారు.

భీముడి అమావాస్యను వివాహిత మహిళలు మాత్రమే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరుపుకోవచ్చు. పెళ్లికాని ఆడవారు మంచి భర్తను ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తారు మరియు వివాహిత స్త్రీ తన భర్త ఆయుష్షు పెరుగుటకు ఈ వ్రతం చేస్తారు.

*ఆరాధన విధానం*

గృహిణులు తమ చేతులకు కంకణాలు ధరించి జ్యోతిర్భీమేశ్వరుడిని ధ్యానించాలి. ఉదయం లేదా సాయంత్రం ఏదైనా శుభ సమయంలో వ్రతాన్ని ఆచరించవచ్చు. అన్నం ఒక ప్లేట్ మీద పెట్టి , దానిపై రెండు దీపాలు వేసి , నూనె వెలిగించండి. పూజలతో కూడిన 9 గంటల గౌరీ దారాన్ని పూజించాలి. ముందుగా గణపతిని పూజించి , తర్వాత భీమేశ్వరుని పూజించారు. 9 రకాల నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత భర్తకు పాదపూజ చేయాలి.

*జరుపుకునే వివిధ మార్గాలు:*

ప్రయోజనం ఒకటే అయినప్పటికీ , ఆచరణలో కొత్తదనం కనుగొనవచ్చు. దక్షిణ కన్నడలో దీనిని అమావాస్య అంటారు. ఈ రోజు , ఈ ప్రాంత సంస్కృతి , ఆచారాలు మరియు ఆలోచనలను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తర కన్నడలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని కోడె అమావాస్య అంటారు.

*ఈ పండుగ యొక్క మరోక ప్రత్యేకత భండారా:*

నల్లని మైదా పిండి నుండి రిపోజిటరీని తయారు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మీరు అందులో నాణెం ఉంచాలి. దీనిని గుమ్మంలో పెట్టి పూజించాలి.

*పురాణ నేపథ్యం*

పురాణాల ప్రకారం , అమావాస్య రోజున శివుడు పార్వతిని తన భార్యగా స్వీకరించారు.

పార్వతి శ్రేయస్సు , సంతానం , పవిత్రత , శక్తికి సంకేతం. ఈ విధంగా , ఈ రోజున ఉపవాసం ఉండి , స్త్రీలు శివుడిని మరియు పార్వతిని ఆరాధిస్తే , వారికి మంచి భర్త లభిస్తాడు. అదేవిధంగా , వివాహిత మహిళలు భర్త దీర్ఘాయువు , విజయం , సంతోషం కోసం శివుడిని పార్వతి దేవిని ఆరాధిస్తారు.

🌹 🌹 🌹 🌹 🌹

#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj