శ్రీ శివ మహా పురాణము - 601 / Sri Siva Maha Purana - 601


🌹 . శ్రీ శివ మహా పురాణము - 601 / Sri Siva Maha Purana - 601 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. కుమారాభిషేకము - 3 🌻

శివుని ఆజ్ఞచే రంభ మొదలగు అప్సరసలు దివ్యవేషములను ధరించి నవ్వుతూ పాడుతూ నర్తించిరి (20). శంకరునితో పోల్చదగిన గంగా పుత్రుడగు కుమారుని చూచినవారందరు ముల్లోకములలో వ్యాపించు చున్న గొప్ప తేజస్సును చూచిరి (21). అట్టి తేజస్సుచే చుట్టు వారబడి యున్నవాడు, బాలుడు, పుటము పెట్టిన బంగారము వంటి కాంతి గలవాడు, సూర్యునితో సమమగు వర్చస్సు గలవాడు అగు కుమారునకు అందరు వెంటనే నమస్కరించిరి (22).

వారు అతని ఎడమవైపున, కుడివైపున చేరి శిరస్సులను వంచి నమస్కరిస్తూ నమశ్శబ్దమును పలుకుతూ నిలబడిన వారై హర్షమును పొందిరి (22). నేను, విష్ణువు, ఇంద్రుడు, మరియు సర్వదేవతలు కుమారుని చుట్టు ముట్టి భూమిపై దండమువలె సాష్టాంగ ప్రణామమును చేసితిమి (24). ఇంతలో శివుడు, మహానందముతో నున్న పార్వతియు కలిసి మహోత్సవపురస్సరముగా విచ్చేసి ఆనందముతో కుమారుని చూచిరి (25).

జగత్తునకు ఏకైక బంధువు, ప్రేమ స్వరూపుడు, పాములే అలంకారముగా గలవాడు, పరమాత్మ అగు శివుడు పరాభట్టారికయగు భవానితో గూడి పుత్రుని గాంచి చాల ఆనందించెను (26). అపుడు శక్తిని ధరించి యున్న స్కందుడు ఆ పార్వతీ పరమేశ్వరులను చూచి రథము నుండి వెను వెంటనే క్రిందకు దిగి శిరస్సు వంచి నమస్కరించెను (27).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 601🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 Kārttikeya is crowned - 3 🌻

20. At the bidding of Pārvatī, the smiling celestial damsels, Rambhā and others, dressed gorgeously, were engaged in singing and dancing.

21. Those who looked at Kumāra resembling Śiva saw a great halo pervading the three worlds.

22. Immediately they saluted Kumāra who was enveloped by the brilliant halo, the lustre of molten gold and the refulgence of the sun.

23. With shoulders stooping down and eagerly engaged in shouting the cry of “Obeisance” they flanked him to the right and left and stood by.

24. Viṣṇu, Indra and I as well as the gods prostrated on the ground and went round Kumāra.

25. In the meantime Śiva, and Pārvatī highly delighted and jubilant came there and saw their son.

26. On seeing his son, the great lord Śiva, the sole kinsman of the universe along with the great goddess Pārvatī was filled with pleasure and love—the lord who wore snakes on his body and was surrounded by the Pramathas.

27. On seeing Pārvatī and Śiva, Kārttikeya got down from the chariot immediately and saluted them.


Continues....

🌹🌹🌹🌹🌹


28 Jul 2022

No comments:

Post a Comment