శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 350 / Sri Lalitha Chaitanya Vijnanam - 350
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 350 / Sri Lalitha Chaitanya Vijnanam - 350 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🌻 350. 'వాగ్వాదిని' 🌻
వాక్కులను పలుకునది శ్రీమాత అని అర్థము. వాక్కు నాలుగు శ్రుతులలో నున్నది. పరా వాక్కుగ నుండు శ్రీదేవి నుండి వచ్చు సంకల్పము పశ్యంతి అగుచున్నది. అనగా ఏమి లేనట్టు వున్నట్టి స్థితి నుండి సంకల్ప స్థితికి వచ్చుట. సంకల్పము కలుగుటయే యుండును గాని ఎవ్వరునూ సంకల్పించలేరు. సంకల్పము కలిగినపుడు దానిని గ్రహింతురు. అనగా దర్శింతురు. ఇట్లు దర్శన స్థితిలోనికి వచ్చిన పరావాక్కే పశ్యంతి. అటుపైన భాష ననుసరించి మధ్యమ వాక్కుగ నేర్పడి కంఠము ద్వారా వైఖరిగా నాలుకమీదుగ వెలువడును.
సంకల్పము కలుగుట, దానిని దర్శించుట, దర్శించిన దానికి భాష నేర్పరచుట, ఆ భాషను పలుకుట ఇది నిత్య జీవితమున కలుగు విచిత్రము. అందరునూ ఈ విధముగనే పలుకుచున్నారు. కాని వారు పలుకుటకు ఆధారమైన సంకల్పము, భాష, వాక్పటిమ శ్రీదేవియే అని తెలియలేరు. ఇట్లు వాక్కు రూపమున అంతర్యామిత్వము చెంది శ్రీదేవి జీవుల కార్యములను చక్కబెట్టుచున్నది. ఆమెయే ఋగ్వేద దేవత. వాగ్గేవత. ' వాగేవ ఋగ్వేదః' అని ఉపనిషత్తు తెలుపుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 350 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻
🌻 350. Vāgvādinī वाग्वादिनी 🌻
She prompts speech or She is in the form of speech itself. Goddess Sarasvatī is referred to as the goddess of speech. This nāma could mean that Sarasvatī acquired the control of speech from Her (like allocation of portfolios in a government). Since She is the origin of speech, She is Vāgvādinī.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 152
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 152 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సర్వాంతర్యామి తత్త్వము 🌻
సృష్టిలో ఒక్కొక్క డొక్కొక్క విధముగా వర్తించును. ఎందరిని గూర్చి తెలిసికొన్నను , ఎన్ని శాస్త్ర రహస్యములు నేర్చినను , తెలిసికొన వలసినది మిగిలియే యుండును.
వాని యందు సర్వాంతర్యామిగా నున్న తత్త్వమొక్కటే గనుక దాని వైపునకు మనస్సు మరలింపజేయ గలిగినచో తెలియవలసినది మరియొకటి యని యుండదు. ఆ మార్గమలవాటు పడిన వెనుక మరియొకటి ఏదియును మనస్సునాకర్షింపదు.
మాస్టర్ ఇ.కె. 🌻
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2022
శ్రీ శివ మహా పురాణము - 522
🌹 . శ్రీ శివ మహా పురాణము - 522 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 44
🌻. మేన యొక్క మంకు పట్టు - 8 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు మేన పరిపరి విధముల విలపించి వారితో నిట్లనెను: ఉగ్రరూపుడగు కైలాస పతికి నేను కుమార్తెను ఈయను (83). సిద్ధులైన మీరందరు ప్రపంచ వ్యవహారములో ప్రవేశించి ఒక్కటిగా జతగూడి ఈమె యొక్క సుందరరూపమును వ్యర్థము చేయుటకు నడుము కట్టినారు. కారణమేమి? (84)
ఓ మునీ! అచట ఆమె ఇట్లు పలుకగా, నేను, దేవతలు, సిద్ధులు, ఋషులు, మానవులు అందరు ఆశ్చర్యమగ్నుల మైతిమి (85). ఇంతలో ఆమె గట్టి మొండి పట్టుదలను గూర్చి వినిన శివ ప్రియుడగు విష్ణువు వెంటనే వచ్చి ఇట్లు పలికెను (86).
విష్ణువు ఇట్లు పలికెను -
నీవు పితృదేవతల అనుంగు మానస పుత్రివి. సద్గుణవతివి. హిమవంతుని భార్యవు. మీ కులము సాక్షాత్తు బ్రహ్మగారి నుండి ప్రవర్తిల్లుటచే ఉత్తమమైనది (87). నీకు అటువంటి వారు పరిచారకులు. నీవీ లోకములో ధన్యురాలవు. నేనేమి చెప్పగలను? నీవు ధర్మమునకు ఆధారమై యున్నావు. నీవు ధర్మమును ఎట్లు విడిచి పెట్టుచున్నావు? (88) దేవతలు గాని, ఋషులు గాని, బ్రహ్మగాని, నేను గాని విరుద్ధముగా పలుకుచున్నామా? నీవే ఆలోచించుకొనుము (89).
నీవు శివుని యెరుంగవు. ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా. సుందరాకారుడ, వికృతాకారుడు కూడా. ఆయన అందరికీ ఆరాధ్యుడు. సత్పురుషులు పొందే గతి ఆయనయే (90). మూల ప్రకృతి యగు ఈశ్వరీదేవిని ఆయనయే సృష్టించినాడు. తరువాత ఆయన ఆమె ప్రక్కన ఉండునట్లు పురుషోత్తముని సృష్టించినాడు (91).
వారి నుండియే నేను, బ్రహ్మ జన్మించితిమి. తరువాత లోకమునకు హితమును చేయు రుద్రుడు తాను స్వయముగా గుణములను రూపమును స్వీకరించి అవతరించినాడు (92). ఆ తరువాత శంకరుని నుండి వేదములు, దేవతలు, కనబడే ఈ సమస్త జగత్తు. చరాచరణ ప్రాణులు, ఈ సర్వము ఉద్భవించినవి (93).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2022
గీతోపనిషత్తు -324
🌹. గీతోపనిషత్తు -324 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-4 📚
🍀 24-4. తత్త్వదర్శనము - ఒక్కటియే పది రకములుగ అవతరించినపుడు అన్నిటియందును ఆ ఒకటిని చూచుట తత్త్వజ్ఞానము. పది రకములుగ చూచుట, ఒకటి అంగీకరించి ఇతరములను నిరాకరించుట మార్గము కాదు. భిన్నత్వ మందు ఏకత్వము దర్శించుటే జ్ఞానము. బ్రహ్మమే కృష్ణుడుగను, త్రిమూర్తులుగను, సమస్త దేవతా ప్రజ్ఞలుగను, సమస్త సృష్టిగను, సమస్త జీవుల మూలముగను యున్నాడని తెలియనంత కాలము దైవమును గూర్చిన అల్లరులే యుండును గాని అవగాహన యుండదు. 🍀
24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||
తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.
వివరణము : నన్ను తత్త్వపరముగ తెలియకపోవుట వలన మానవులు చిక్కులు పొందుచున్నారు. ఆకాశము నుండి భూమిపై వర్షము పడినపుడు అన్ని ఖండముల యందు వర్షపు నీరు నదులై పారుచుండును. అన్నిటి యందున్నది వర్షపునీరే. కాని గంగ యని, గోదావరి యని, కృష్ణ యని, కావేరి యని, నైలునది యని, అమేజాను నదియని, మిసి సిపి, మిస్సోరియన్, రైను, రోను అని కొన్ని వేలాది నదులుగ భూమి పై పడిన నీరు పిలువబడుచున్నది. ఒక్కటియే పది రకములుగ అవతరించినపుడు అన్నిటియందును ఆ ఒకటిని చూచుట తత్త్వజ్ఞానము. పది రకములుగ చూచుట, ఒకటి అంగీకరించి ఇతరములను నిరాకరించుట మార్గము కాదు. భిన్నత్వ మందు ఏకత్వము దర్శించుటే జ్ఞానము. అట్టి జ్ఞానము లభ్య మగుటకు దైవము యొక్క స్వభావ స్వరూపముల నెరుగవలెను.
అట్లెరుగక, భజన చేయువారు ఊరకే భూమిపై చప్పుడు చేయుచు నుందురు. రాముడెవరో తెలియక రామభజన చేయుటవలన రాముడు లభింపడు. బ్రహ్మమే రాముడుగను, బ్రహ్మమే కృష్ణుడుగను, త్రిమూర్తులుగను, సమస్త దేవతా ప్రజ్ఞలుగను, సమస్త సృష్టిగను, సమస్త జీవుల మూలముగను యున్నాడని తెలియనంత కాలము దైవమును గూర్చిన అల్లరులే యుండును గాని అవగాహన యుండదు. ఇది ఈ శ్లోకము యొక్క పరమార్ధము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2022
19 - FEBRUARY - 2022 శనివారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 19, శనివారం, ఫిబ్రవరి 2022 స్థిర వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 24-4 - 324 - తత్వదర్శనము 🌹
3) 🌹. శివ మహా పురాణము - 522 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -152 🌹
5) 🌹 Osho Daily Meditations - 141 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 350 / Sri Lalitha Chaitanya Vijnanam - 350 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 19, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ వేంకటేశ అష్టకం-2 🍀*
*3. గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః |*
*వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః*
*4. శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః |*
*శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : నిజమైన భక్తుడు జ్ఞాని, నిజమైన జ్ఞాని ఎప్పుడూ భక్తుడే. భక్తి, జ్ఞానము ఎప్పుడు కలిసే వుంటాయి. 🍀*
*పండుగలు మరియు పర్వదినాలు : శతభిషం కార్తె, గురుమౌఢ్యమి ప్రారంభం*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
మాఘ మాసం
తిథి: కృష్ణ తదియ 21:57:39 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 16:52:04 వరకు
తదుపరి హస్త
యోగం: ధృతి 16:56:51 వరకు
తదుపరి శూల
కరణం: వణిజ 10:14:30 వరకు
సూర్యోదయం: 06:40:40
సూర్యాస్తమయం: 18:19:14
వైదిక సూర్యోదయం: 06:44:16
వైదిక సూర్యాస్తమయం: 18:15:37
చంద్రోదయం: 20:46:26
చంద్రాస్తమయం: 08:29:22
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కన్య
వర్జ్యం: 25:12:51 - 26:48:15
దుర్ముహూర్తం: 08:13:48 - 09:00:23
రాహు కాలం: 09:35:18 - 11:02:38
గుళిక కాలం: 06:40:40 - 08:07:59
యమ గండం: 13:57:16 - 15:24:36
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 09:37:18 - 11:13:54
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య
నాశనం 16:52:04 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -324 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-4 📚*
*🍀 24-4. తత్త్వదర్శనము - ఒక్కటియే పది రకములుగ అవతరించినపుడు అన్నిటియందును ఆ ఒకటిని చూచుట తత్త్వజ్ఞానము. పది రకములుగ చూచుట, ఒకటి అంగీకరించి ఇతరములను నిరాకరించుట మార్గము కాదు. భిన్నత్వ మందు ఏకత్వము దర్శించుటే జ్ఞానము. బ్రహ్మమే కృష్ణుడుగను, త్రిమూర్తులుగను, సమస్త దేవతా ప్రజ్ఞలుగను, సమస్త సృష్టిగను, సమస్త జీవుల మూలముగను యున్నాడని తెలియనంత కాలము దైవమును గూర్చిన అల్లరులే యుండును గాని అవగాహన యుండదు. 🍀*
*24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |*
*న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||*
*తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.*
*వివరణము : నన్ను తత్త్వపరముగ తెలియకపోవుట వలన మానవులు చిక్కులు పొందుచున్నారు. ఆకాశము నుండి భూమిపై వర్షము పడినపుడు అన్ని ఖండముల యందు వర్షపు నీరు నదులై పారుచుండును. అన్నిటి యందున్నది వర్షపునీరే. కాని గంగ యని, గోదావరి యని, కృష్ణ యని, కావేరి యని, నైలునది యని, అమేజాను నదియని, మిసి సిపి, మిస్సోరియన్, రైను, రోను అని కొన్ని వేలాది నదులుగ భూమి పై పడిన నీరు పిలువబడుచున్నది. ఒక్కటియే పది రకములుగ అవతరించినపుడు అన్నిటియందును ఆ ఒకటిని చూచుట తత్త్వజ్ఞానము. పది రకములుగ చూచుట, ఒకటి అంగీకరించి ఇతరములను నిరాకరించుట మార్గము కాదు. భిన్నత్వ మందు ఏకత్వము దర్శించుటే జ్ఞానము. అట్టి జ్ఞానము లభ్య మగుటకు దైవము యొక్క స్వభావ స్వరూపముల నెరుగవలెను.*
*అట్లెరుగక, భజన చేయువారు ఊరకే భూమిపై చప్పుడు చేయుచు నుందురు. రాముడెవరో తెలియక రామభజన చేయుటవలన రాముడు లభింపడు. బ్రహ్మమే రాముడుగను, బ్రహ్మమే కృష్ణుడుగను, త్రిమూర్తులుగను, సమస్త దేవతా ప్రజ్ఞలుగను, సమస్త సృష్టిగను, సమస్త జీవుల మూలముగను యున్నాడని తెలియనంత కాలము దైవమును గూర్చిన అల్లరులే యుండును గాని అవగాహన యుండదు. ఇది ఈ శ్లోకము యొక్క పరమార్ధము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 522 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 44
*🌻. మేన యొక్క మంకు పట్టు - 8 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు మేన పరిపరి విధముల విలపించి వారితో నిట్లనెను: ఉగ్రరూపుడగు కైలాస పతికి నేను కుమార్తెను ఈయను (83). సిద్ధులైన మీరందరు ప్రపంచ వ్యవహారములో ప్రవేశించి ఒక్కటిగా జతగూడి ఈమె యొక్క సుందరరూపమును వ్యర్థము చేయుటకు నడుము కట్టినారు. కారణమేమి? (84)
ఓ మునీ! అచట ఆమె ఇట్లు పలుకగా, నేను, దేవతలు, సిద్ధులు, ఋషులు, మానవులు అందరు ఆశ్చర్యమగ్నుల మైతిమి (85). ఇంతలో ఆమె గట్టి మొండి పట్టుదలను గూర్చి వినిన శివ ప్రియుడగు విష్ణువు వెంటనే వచ్చి ఇట్లు పలికెను (86).
విష్ణువు ఇట్లు పలికెను -
నీవు పితృదేవతల అనుంగు మానస పుత్రివి. సద్గుణవతివి. హిమవంతుని భార్యవు. మీ కులము సాక్షాత్తు బ్రహ్మగారి నుండి ప్రవర్తిల్లుటచే ఉత్తమమైనది (87). నీకు అటువంటి వారు పరిచారకులు. నీవీ లోకములో ధన్యురాలవు. నేనేమి చెప్పగలను? నీవు ధర్మమునకు ఆధారమై యున్నావు. నీవు ధర్మమును ఎట్లు విడిచి పెట్టుచున్నావు? (88) దేవతలు గాని, ఋషులు గాని, బ్రహ్మగాని, నేను గాని విరుద్ధముగా పలుకుచున్నామా? నీవే ఆలోచించుకొనుము (89).
నీవు శివుని యెరుంగవు. ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా. సుందరాకారుడ, వికృతాకారుడు కూడా. ఆయన అందరికీ ఆరాధ్యుడు. సత్పురుషులు పొందే గతి ఆయనయే (90). మూల ప్రకృతి యగు ఈశ్వరీదేవిని ఆయనయే సృష్టించినాడు. తరువాత ఆయన ఆమె ప్రక్కన ఉండునట్లు పురుషోత్తముని సృష్టించినాడు (91).
వారి నుండియే నేను, బ్రహ్మ జన్మించితిమి. తరువాత లోకమునకు హితమును చేయు రుద్రుడు తాను స్వయముగా గుణములను రూపమును స్వీకరించి అవతరించినాడు (92). ఆ తరువాత శంకరుని నుండి వేదములు, దేవతలు, కనబడే ఈ సమస్త జగత్తు. చరాచరణ ప్రాణులు, ఈ సర్వము ఉద్భవించినవి (93).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 152 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. సర్వాంతర్యామి తత్త్వము 🌻*
*సృష్టిలో ఒక్కొక్క డొక్కొక్క విధముగా వర్తించును. ఎందరిని గూర్చి తెలిసికొన్నను , ఎన్ని శాస్త్ర రహస్యములు నేర్చినను , తెలిసికొన వలసినది మిగిలియే యుండును.*
*వాని యందు సర్వాంతర్యామిగా నున్న తత్త్వమొక్కటే గనుక దాని వైపునకు మనస్సు మరలింపజేయ గలిగినచో తెలియవలసినది మరియొకటి యని యుండదు. ఆ మార్గమలవాటు పడిన వెనుక మరియొకటి ఏదియును మనస్సునాకర్షింపదు.*
*మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 141 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 141. UNHAPPINESS 🍀*
*🕉 People say they would like to be happy, but they really don't want to be. They are afraid that they will be lost. 🕉*
*Whenever you become aware of something, you are separate from it. If you are happy, you are separate and happiness is separate. So being really happy means becoming happiness rather than becoming happy. You dissolve, by and by. When you are unhappy, you are too much. The ego comes into focus when one is unhappy. That's why egoistic people remain very unhappy, and unhappy people remain very egoistic. There is an interconnection. If you want to be egoistic, you have to be unhappy.*
*Unhappiness gives you the background and the ego, comes out of it very clear, crystal-clear, like a white dot on a black background. The happier you are, the less you are. That's why many people want to become happy but really they are afraid to. Its my observation that people say they would like to be happy but they really don't want to be. They are afraid that they will be lost. Happiness and egos can't go together. The happier you are, the less you are. There comes a moment when only happiness is, and you are not.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 350 / Sri Lalitha Chaitanya Vijnanam - 350 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*
*🌻 350. 'వాగ్వాదిని' 🌻*
*వాక్కులను పలుకునది శ్రీమాత అని అర్థము. వాక్కు నాలుగు శ్రుతులలో నున్నది. పరా వాక్కుగ నుండు శ్రీదేవి నుండి వచ్చు సంకల్పము పశ్యంతి అగుచున్నది. అనగా ఏమి లేనట్టు వున్నట్టి స్థితి నుండి సంకల్ప స్థితికి వచ్చుట. సంకల్పము కలుగుటయే యుండును గాని ఎవ్వరునూ సంకల్పించలేరు. సంకల్పము కలిగినపుడు దానిని గ్రహింతురు. అనగా దర్శింతురు. ఇట్లు దర్శన స్థితిలోనికి వచ్చిన పరావాక్కే పశ్యంతి. అటుపైన భాష ననుసరించి మధ్యమ వాక్కుగ నేర్పడి కంఠము ద్వారా వైఖరిగా నాలుకమీదుగ వెలువడును.*
*సంకల్పము కలుగుట, దానిని దర్శించుట, దర్శించిన దానికి భాష నేర్పరచుట, ఆ భాషను పలుకుట ఇది నిత్య జీవితమున కలుగు విచిత్రము. అందరునూ ఈ విధముగనే పలుకుచున్నారు. కాని వారు పలుకుటకు ఆధారమైన సంకల్పము, భాష, వాక్పటిమ శ్రీదేవియే అని తెలియలేరు. ఇట్లు వాక్కు రూపమున అంతర్యామిత్వము చెంది శ్రీదేవి జీవుల కార్యములను చక్కబెట్టుచున్నది. ఆమెయే ఋగ్వేద దేవత. వాగ్గేవత. ' వాగేవ ఋగ్వేదః' అని ఉపనిషత్తు తెలుపుచున్నది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 350 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*
*🌻 350. Vāgvādinī वाग्वादिनी 🌻*
*She prompts speech or She is in the form of speech itself. Goddess Sarasvatī is referred to as the goddess of speech. This nāma could mean that Sarasvatī acquired the control of speech from Her (like allocation of portfolios in a government). Since She is the origin of speech, She is Vāgvādinī.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)