🌹 11, SEPTEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 11, SEPTEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹11, SEPTEMBER 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 12 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 12 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 787 / Sri Siva Maha Purana - 787 🌹
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 5 / The fight between the Gaṇas and the Asuras - 5 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 40 / Osho Daily Meditations  - 40 🌹
🍀 40. పనిలో ఉండడం / 40. AT WORK 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 -2 🌹 
🌻 484. 'డాకినీశ్వరీ' - 2 / 484. 'Dakinishwari' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 11, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 47 🍀*

*95. ఆరోహణోఽధిరోహశ్చ శీలధారీ మహాయశాః |*
*సేనాకల్పో మహాకల్పో యోగో యోగకరో హరిః*
*96. యుగరూపో మహారూపో మహానాగహనో వధః |*
*న్యాయనిర్వపణః పాదః పండితో హ్యచలోపమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పూర్ణానుమోదం - మనోమయ చేతనలోని భావాల వల్ల, ప్రాణమయ చేతనలోని కామనల వల్ల, అన్నమయ చేతనలోని స్తబ్ధత వల్ల పూర్ణానుమోదం దీర్ఘకాలం పట్టవచ్చు. ఈశ్వర శక్తి సహాయాన్నే సాధకుడు వీటిని తొలగించుకోడానికి అర్థించాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 23:53:17
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: పుష్యమి 20:01:30
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: పరిఘ 24:14:28 వరకు
తదుపరి శివ
కరణం: కౌలవ 10:40:11 వరకు
వర్జ్యం: 02:05:00 - 03:52:36
దుర్ముహూర్తం: 12:37:20 - 13:26:34
మరియు 15:05:02 - 15:54:16
రాహు కాలం: 07:35:46 - 09:08:05
గుళిక కాలం: 13:45:01 - 15:17:20
యమ గండం: 10:40:24 - 12:12:43
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 12:50:36 - 14:38:12
సూర్యోదయం: 06:03:28
సూర్యాస్తమయం: 18:21:58
చంద్రోదయం: 02:48:18
చంద్రాస్తమయం: 16:16:40
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ధాత్రి యోగం - కార్య
జయం 20:01:30 వరకు తదుపరి
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 12 🌴*

*12. దివి దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |*
*యది భా: సదృశీ సా స్యా ద్భాసస్తస్య మహాత్మన: ||*

*🌷. తాత్పర్యం : లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమపురుషుని తేజస్సును పోలగలదు.*

*🌷. భాష్యము : అర్జునుడు గాంచిన విషయము వర్ణణాతీతమైనది. అయినను సంజయుడు ఆ అద్భుతము యొక్క మనోచిత్రణను ధృతరాష్ట్రునకు తెలుప యత్నించుచున్నాడు. సంజయుడుగాని, ధృతరాష్ట్రుడుగాని యుద్ధరంగమున లేకున్నను వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు జరిగినదంతయు యథాతథముగా గాంచగలిగెను. కనుకనే అతడు అచ్చటి పరిస్థితిని సాధ్యమైనంతవరకు అవగతమగునట్లు వేలాదిసూర్యులు ఉదయించుట వంటి ఊహాత్మక భావములతో పోల్చుచున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 426 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 12 🌴*

*12. divi sūrya-sahasrasya bhaved yugapad utthitā*
*yadi bhāḥ sadṛśī sā syād bhāsas tasya mahātmanaḥ*

*🌷 Translation : If hundreds of thousands of suns were to rise at once into the sky, their radiance might resemble the effulgence of the Supreme Person in that universal form.*

*🌹 Purport : What Arjuna saw was indescribable, yet Sañjaya is trying to give a mental picture of that great revelation to Dhṛtarāṣṭra. Neither Sañjaya nor Dhṛtarāṣṭra was present, but Sañjaya, by the grace of Vyāsa, could see whatever happened. Thus he now compares the situation, as far as it can be understood, to an imaginable phenomenon (i.e., thousands of suns).*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 787 / Sri Siva Maha Purana - 787 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴*

*🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 5 🌻*

*మహేశ్వరుడిట్లు పలికెను- దేవతలలో శ్రేష్ఠుడవగు ఓ విష్ణూ! నా మాటను నీవు శ్రద్ధతో వినుము. మహారాక్షసుడగు జలంధరుని నిస్సందేహముగా సంహరించగలను (35). నీవు నిర్భయముగా నీ స్థానమునకు వెళ్లుము. ఆ రాక్షసరాజు హతుడైనాడని తలంచి దేవతలు కూడా నిస్సందేహముగా నిర్భయముగా నిశ్చయముగా తమ స్థానములకు వెళ్లెదరు గాక! (36).*

*సనత్కుమారుడిట్లు పలికెను- మహేశ్వరుని ఈ మాటను విని ఆ లక్ష్మీపతి తొలగిన సంశయములు గల వాడై దేవతలతో గూడి తన స్థానమునకు శీఘ్రముగా చేరుకొనెను (37). ఓ వ్యాసా! ఇంతలో మహాపరాక్రమ శాలి, బలశాలి అగు ఆ రాక్షసరాజు యుద్ధ సన్నద్ధులైన రాక్షసులతో గూడి కైలాసపర్వత సమీపమునకు చేరెను (38). యమునితో సమమగు ఆ జలంధరుడు పెద్దసేనతో గూడిన వాడై కైలాసమును ముట్టడించి సింహనాదమును చేయుచూ ఉత్కర్ష గల వాడై స్థిరముగా నుండెను (39). గొప్ప లీలలు గలవాడు, దుష్టసంహారకుడు అగు శివుడు రాక్షసుల సింహనాదమునుండి బయల్వెడలిన ఆ కోలాహలమును విని అపుడు మిక్కిలి కోపించెను (40). గొప్ప లీలలు గలవాడు, యుద్ధమునందు ఉత్సాహము గలవాడు, పాపహారి అగు మహాదేవుడు మహాబలశాలురగు నంది మొదలైన తన గణములను యుద్ధమునకు ఆదేశించెను (41). నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణములందరు శివుని ఆజ్ఞచే మిక్కిలి వేగముతో యుద్ధమునకు సన్నద్ధులైరి. (42). క్రోధముచే మిక్కిలి మదించి ఉన్న మహావీరులగు గణములందరు సింహనాదములను చేయుచూ యుద్ధము కొరకై కైలాసమునుండి క్రిందకు దిగిరి (43).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 787 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴*

*🌻 The fight between the Gaṇas and the Asuras - 5 🌻*

The great lord Śiva said:—
35. O Viṣṇu, foremost among the gods, please listen to my words attentively. I will kill the great Daitya Jalandhara. There is no doubt about this.

36. Go back to your abode fearlessly. Let the gods too go back without fear and hesitation, considering the ruler of the Asuras already killed.

Sanatkumāra said:—
37. On hearing the words of lord Śiva, the lord of Lakṣmī immediately went to his abode without doubts along with the gods.

38. In the meantime, O Vyāsa, that valorous king of the Daityas went along with the well-equipped Asuras to the outskirts of the mountain.

39. Accompanied by a vast army he laid siege to Kailāsa. He stood there like the god of death roaring like a lion.

40. On hearing the tumultuous roar of the Daityas, lord Śiva of great sports, the destroyer of the wicked, became very furious.

41. The great lord of various sports, the enthusiastic Śiva commanded his powerful Gaṇas, Nandin and others, severally.

42. Nandin, Vighneśvara, Kumāra and all other Gaṇas, at the bidding of Śiva hurriedly got ready for the battle.

43. The infuriated and invincible Gaṇas descended from Kailāsa heroically shouting war cries and leaping to fight.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 40 / Osho Daily Meditations  - 40 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 40. పనిలో ఉండడం 🍀*

*🕉 పనిలో సహచరులుగా ఉన్న వ్యక్తులు మీ అంతరంగిక విషయాల గురించి అస్సలు పట్టించుకోరని గుర్తుంచుకోవాలి. అది మీ పని; వారు పని చేయడానికి వారి స్వంత అంతర్గత జీవితాలను కలిగి ఉన్నారు. 🕉*

*మీ సహోద్యోగులకు మీతో సహా ప్రతి ఒక్కరికి ఉన్నట్లే వారి స్వంత ప్రతికూల మానసిక స్థితి, వారి స్వంత వ్యక్తిగత సమస్యలు మరియు ఆందోళనలు ఉంటాయి. కానీ మీరు ఎవరితోనైనా పని చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, మీరు ఈ విషయాలను తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు వారి ప్రతికూలతలను తీసుకురావడం ప్రారంభిస్తే మరియు మీరు మీ అన్నింటిని తీసుకురావడం ప్రారంభిస్తే, అది ఎప్పటికీ అంతం లేని ప్రక్రియ. మీకు ప్రతికూలంగా అనిపిస్తే, ఏదైనా చేయండి. ఉదాహరణకు, చాలా ప్రతికూల విషయం వ్రాసి దానిని కాల్చండి. థెరపీ గదికి వెళ్లి, ఒక దిండు కొట్టి విసిరేయండి. భయంకరమైన నృత్యం చేయండి! మీరు దాన్ని సంభాలించుకోoడి; ఇది మీ సమస్య.*

*మీతో పని చేస్తున్న వారితో మీరు ప్రతికూలంగా ఉన్నారా, వారు బాధపడ్డారా అని మధ్య మధ్యలో అడగడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ప్రతికూలంగా ఉన్నారని మీకు తెలియకపోవచ్చు. చిన్న సంజ్ఞలు, కేవలం ఒక మాట, ఒక మౌనం కూడా బాధ కలిగించవచ్చు; మీరు ఒకరిని చూసే విధానం బాధ కలిగించవచ్చు. కాబట్టి మధ్య మధ్యలో వారిని క్షమించమని అడగండి. వారికి చెప్పండి, 'నేను మిమ్మల్ని అడిగిన ప్రతిసారీ, మీరు నిజాయితీగా ఉండాలి. నాకు చెప్పండి, ఎందుకంటే నేను మనిషిని మరియు కొన్నిసార్లు నా వైపు నుండి తప్పు జరగవచ్చు. నేను వాటిని సరిదిద్దాలి.'*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 40 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 40. AT WORK 🍀*

*🕉  One has to remember that the people who are associates at work are not at all concerned with your inner lye. That is your work to do; they have their own inner lives to work out.  🕉*

*Your work colleagues have their own negative moods, their own personal problems and anxieties, just as everybody else, including you, has. But when you are in a working situation with somebody, you need not bring these things in, because if they start bringing in all their negativities and you start bringing in all of yours, it will be a neverending process. If you are feeling negative, do something. For example, write out a very negative thing and burn it. Go to the therapy room, beat a pillow and throw it. Do a terrible dance! You have to work it out; it is your problem.*

*And once in a while it is good to ask whoever is working with you whether you have been negative, if they are feeling hurt. Because sometimes you may not know that you have been negative. Small gestures, just a word, even a silence, can be hurtful; the way you look at someone can be hurtful. So once in a while ask their forgiveness. Tell them, "Every time I ask you, you have to be honest. Just tell me, because I am a human being and sometimes things can go wrong from my side and I have to put them right."*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 484 -2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 484 -2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ ।*
*అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀*

*🌻 484. 'డాకినీశ్వరీ' - 2 🌻*

*పరమాత్మ, జీవాత్మ, పంచభూతములు అను సప్తమ కేంద్రములను శ్రీమాతయే తన యోగ శక్తిచే నిర్మాణము గావించి ఆయా లోకముల నేర్పరచి, ఆయా ప్రకృతి ధర్మములను ప్రవేశింపజేసి, ఆయా లోకశక్తుల నేర్పరచి, ఆయా రూపములను ధరించి శ్రీమాత వసించుచున్నది. ఇందలి ప్రజ్ఞా కేంద్ర వర్ణనము యోగమున వ్యాసము చేయుట సంప్రదాయము. ప్రతి ప్రజ్ఞా కేంద్రమందు ఆ కేంద్రీకమలమును, అందు ఆశీనురాలైన శ్రీమాతను, ఆమె రూపమును, ఆమె ధరించియున్న శక్తులను, ఆమె పొందియున్న కాంతిని, ఆమె నామమును న్యాసము చేసి యోగించుట కొరకు ఈ న్యాసము ఈయబడినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 484 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari*
*amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻*

*🌻 484. 'Dakinishwari' - 2 🌻*

*With her yogic power, Sri Mata constructed The seven centers of Paramatma, Jeevatma and Panchabhuta and structured the respective worlds, introduced the nature's virtues, set up the powers for those worlds, and resides in respective forms in those worlds. It is customary in yoga to write essays on the pragnya kendra. In every prajna kendra, this nyasa is performed in order to meditate on that central lotus, that Sri Mata, her form, the powers she wears, the light she has received, and her name.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శివ సూత్రములు - 140 : 3-2. జ్ఞానం బంధః -1 / Siva Sutras - 140 : 3-2. jnanam bandhah -1


🌹. శివ సూత్రములు - 140 / Siva Sutras - 140 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-2. జ్ఞానం బంధః -1 🌻

🌴. అంతర్గత అవయవాల (మనస్సు, ఇంద్రియాలు, మేధస్సు మరియు అహంకారం) నుండి ఉద్భవించే జ్ఞానం ద్వంద్వత్వం, భ్రాంతి, అహంకారం, అనుబంధాలు మరియు సంసార బంధాన్ని కలిగిస్తుంది కాబట్టి బంధిస్తుంది. 🌴


మొదటి విభాగంలోని రెండవ సూత్రం కూడా చెబుతుంది, జ్ఞాన బంధః మరియు దాని సంక్షిప్త వివరణ క్రింది విధంగా ఉంది: అత్యున్నత జ్ఞానం మనస్సు యొక్క అనుభవం ద్వారా తప్ప ఇంద్రియ అనుభవం ద్వారా ఉద్భవించదు. మనస్సు ద్వారా ఉద్భవించిన, పెంపొందించబడిన మరియు వ్యక్తీకరించబడిన జ్ఞానం ప్రాపంచిక బంధాలతో కలుషితం కాకుండా ఉంటుంది. మునుపటి సూత్రం (3-1) ఒక సాధారణ మనస్సు మనస్సు, బుద్ధి మరియు అహంకారం అనే మూడు భాగాలపై పనిచేస్తుందని చెప్పింది. ప్రస్తుత విభాగంలో, జ్ఞానం అంటే చెప్పబడిన మూడు భాగాలచే ప్రభావితమైన మనస్సు నుండి ఉత్పన్నమయ్యే జ్ఞానం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 140 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-2. jñānam bandhah -1 🌻

🌴. The knowledge which arises from the internal organ (the mind, the senses, intelligence and ego) is binding because it causes duality, delusion, egoism, attachments and bondage to samsara. 🌴


The second sūtra of the first section also says, Jñānaṁ bandhaḥ and its brief interpretation provided therein is as follows: Supreme knowledge is the experience of the mind and not derived through sensory experience. Knowledge conceived, nurtured and manifested by the mind remains uncontaminated with temporal matters such as bondage. The previous sūtra (3-1) said that a normal mind works on three constituents - mind, intellect and ego. In the present section, knowledge means the knowledge arising out of the mind influenced by the said three constituents.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



DAILY WISDOM - 138 : 17. The Value of Philosophy / నిత్య ప్రజ్ఞా సందేశములు - 138 : 17. తత్వశాస్త్రం యొక్క విలువ



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 138 / DAILY WISDOM - 138 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 17. తత్వశాస్త్రం యొక్క విలువ 🌻


తత్వశాస్త్రం అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క తార్కిక అధ్యయనం లేదా వివిధ శాస్త్రాల సంశ్లేషణ మాత్రమే కాదు. దీని పద్ధతులు విజ్ఞాన శాస్త్రానికి భిన్నంగా ఉంటాయి. కానీ, విషయాలను ఉన్నతంగా, లోతుగా అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం యొక్క సంపూర్ణ సారాంశాన్ని ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే స్వామి శివానంద విజ్ఞాన శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడరు, అయినప్పటికీ, ఆధునిక మనిషికి తత్వశాస్త్రంలోని గొప్ప సత్యాలను బోధించే ఉద్దేశ్యంతో, విజ్ఞాన శాస్త్రం పరిమితుల నుండి మరియు ఆధునిక అవసరాల నుండి దృష్టాంతాలను తీసుకోవడానికి ఆయనకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంద్రియ గ్రహణశక్తికి మించిన వాస్తవికత ఉనికిని విజ్ఞాన శాస్త్రం అంగీకరించదు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారు.

తత్వశాస్త్రం తన విలువను ప్రధానంగా స్వీయ విచారణలోనూ మరియు పరమాత్మపై ధ్యానించడంలోనూ అది పోషించే ప్రధాన పాత్ర వల్ల సంతరించుకుంటుంది. తత్వశాస్త్రాన్ని కేవలం హేతువాద పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషణలో ఉపయోగిస్తే అది పనికిరానిదిగా తను భావిస్తాడు. జ్ఞాన యోగ మార్గంలో ఆధ్యాత్మిక ధ్యానం యొక్క పునాదిగా, తత్వశాస్త్రం యొక్క విలువ లెక్కించలేనిది. ఇది రాజయోగం, భక్తి యోగం మరియు కర్మ యోగం యొక్క మార్గాల వెనుక ఉన్న కారణాలను కూడా అందిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 138 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 17. The Value of Philosophy 🌻


According to Swami Sivananda, philosophy is not merely a logical study of the conclusions of science or a synthesis of the different sciences. Its methods are different from those of science, though, for purposes of higher reflection and contemplation, it would accept the research of science and its accumulated material. Swami Sivananda, however, is not inclined to give too much importance to science, though, for purposes of instructing the modern man in the great truths of philosophy, he has no objection to taking illustrations from the limitations of science and from the necessity that modern science feels for accepting the existence of a reality beyond sense-perception.

To Swami Sivananda, the value of philosophy rests mainly in its utility in reflective analysis and meditation on the Supreme Being. Philosophy in the sense of a mere play of reason he regards as useless in one’s search for spiritual knowledge. As a necessary condition of spiritual meditations on the path of Jnana Yoga, the value of philosophy is incalculable. It also provides the necessary prop for and gives the rationale behind the paths of Raja Yoga, Bhakti Yoga and Karma Yoga.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 825 / Vishnu Sahasranama Contemplation - 825


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 825 / Vishnu Sahasranama Contemplation - 825🌹

🌻825. చాణూరాన్ధ్రనిషూదనః, चाणूरान्ध्रनिषूदनः, Cāṇūrāndhraniṣūdanaḥ🌻

ఓం చాణూరాన్ధ్రనిషూదనాయ నమః | ॐ चाणूरान्ध्रनिषूदनाय नमः | OM Cāṇūrāndhraniṣūdanāya namaḥ

చాణూర నామాన మన్ధ్రం యోనిషూదితవాన్ హరిః ।
ససద్భిరుచ్యతే ఇతి చాణూరాన్ధ్ర నిషూదనః ॥

చాణూరుడు అను నామము కల అంధ్ర జాతీయుని చంపినందున హరి చాణూరాన్ధ్రనిషూదనః.


:: పోతన భాగవతము దశమ స్కంధ పూర్వ భాగము ::

క. హరికిని లోఁబడి బెగడక, హరియురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్‍
హరి కుసుమమాలికాహత, కరిభంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై. (1360)

క. శౌరి నెఱిఁజొచ్చి కరములు, క్రూరగతిన్ బట్టి త్రిప్పి కుంభిని వైచెన్‍
శూరుం గలహ గభీరున, వీరుం జాణూరు ఘోరు వితతాకారున్‍. (1361)

క. శోణితము నోర నొకఁగ, జాణూరుం డట్లు కృష్ణసంభ్రామణ సం
క్షీణుండై క్షోణిం బడి, ప్రాణంబులు విడిచెఁ గంసుప్రాణము గలఁగన్‍. (1362)


విరోధి అయిన చాణూరుడు కృష్ణునకు లోబడినప్పటికిని, భయపడక మహాభయంకరమైన పిడికిలితో వెన్నుని రొమ్మును పొడిచినాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగు చందముగా ఆ పోటును లెక్క చేయక శ్రీహరి యుద్ధమందు విజృంభించి పరాక్రమము చూపినాడు. పరాక్రమవంతుడును, యుద్ధమందు గంభీరుడును, భీతిగొలిపెడి వాడును, దొడ్డదేహము కలవాడును, వీరుడునుయగు చాణూరుడిని కృష్ణుడు చొచ్చుకొనిపోయి కర్కశముగా వాని చేతులు పట్టుకొని గిరగిర త్రిప్పి నేలపై కొట్టినాడు. ఆ విధముగా అచ్యుతునిచేత గిర గిర త్రిప్పబడిన చాణూరుడు మిక్కిలిగ నలిగినవాడై నోటినుంచి నెత్తురు కారగా పుడమిమీదబడి ప్రాణములు విడిచినాడు. అతని ప్రాణములు వీడినవెంటనె కంసుని ప్రాణము కలబారినది.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 825🌹

🌻825. Cāṇūrāndhraniṣūdanaḥ🌻

OM Cāṇūrāndhraniṣūdanāya namaḥ


चाणूर नामान मन्ध्रं योनिषूदितवान् हरिः ।
ससद्भिरुच्यते इति चाणूरान्ध्र निषूदनः ॥

Cāṇūra nāmāna mandhraṃ yoniṣūditavān hariḥ,
Sasadbhirucyate iti cāṇūrāndhra niṣūdanaḥ.


Since He is the killer of the wrestler from andhra deśa of the name Cāṇūra, He is called Cāṇūrāndhraniṣūdanaḥ.



:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे चतुश्चत्वारिंशोऽध्यायः ::

नचलत्तत्प्रहारेण मालाहत इव द्विपः ।
बाह्वोर्निगृह्य चाणूरं बहुशो भ्रामयन्हरिः ॥ २२ ॥

भूपृष्ठे पोथयामास तरसा क्षीण जीवितम् ।
विस्रस्ताकल्पकेशस्रगिन्द्रध्वज इवापतत् ॥ २३ ॥


Śrīmad Bhāgavata - Canto 10, Chapter 44

Nacalattatprahāreṇa mālāhata iva dvipaḥ,
Bāhvornigr‌hya cāṇūraṃ bahuśo bhrāmayanhariḥ. 22.

Bhūpr‌ṣṭhe pothayāmāsa tarasā kṣīṇa jīvitam,
Visrastākalpakeśasragindradhvaja ivāpatat. 23.


No more shaken by the demon's mighty blows than an elephant struck with a flower garland, Lord Kr‌ṣṇa grabbed Cāṇūra by his arms, swung him around several times and hurled him onto the ground with great force. His clothes, hair and garland scattering, the wrestler fell down dead, like a huge festival column collapsing.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥



Continues....

🌹 🌹 🌹 🌹




కపిల గీత - 233 / Kapila Gita - 233


🌹. కపిల గీత - 233 / Kapila Gita - 233 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 43 🌴

43. నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదదః|
లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతమ్॥


తాత్పర్యము : కాలము యొక్క ఆజ్ఞకు లోబడి ఈ ఆకాశము ప్రాణులకు స్థానము నొసగుచున్నది. అటులనే, మహత్తత్త్వము కాలమునకు వశవర్తియై అహంకార రూపమైన తన శరీరమును ఏడు ఆవరణలతో కూడిన బ్రహ్మాండము రూపములో విస్తరించు చున్నది.

వ్యాఖ్య : ఆకాశము వాయువుకి అవకాశం ఇస్తోంది. (మనము వదిలే గాలి వెళ్ళేది ఆకాశములోకి. అదే ఆకాశము ఆ గాలి వెళ్ళడానికి చోటివ్వకపోతే ?. కానీ కాలనికి భయపడి చోటు ఇస్తున్నది.) . ఆకాశము పీల్చే వారికి దారిని ఇస్తోంది. మహత్ తత్వమూ పంచభూతములూ అన్ని కలిసి బ్రహ్మాండము అదే రూపములో ఉన్నదంటే, ఎవరి వల్ల? మనకు ఉన్న ఇన్ని గోళాలకు ఆధారం ఏమిటి? గ్రహాల ఆకర్షణ శక్తి ఉండడానికి ఆధారం ఏమిటి? ఇవి అన్నీ కాలం వలననే. ఏడు ఆవరణలతో ఉన్న బ్రహ్మాండం తన దేహాన్ని విస్తరింపచేస్తున్నా, తగ్గించుకున్నా, అది కాలము వలననే.

అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నీ తేలుతున్నాయని, అవన్నీ జీవులను కలిగి ఉన్నాయని ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. శాస్వతం, అనే పదానికి అర్థం 'ఊపిరి పీల్చుకునే వారు' లేదా జీవులు. వాటికి తగ్గట్టు లెక్కలేనన్ని గ్రహాలున్నాయి. ప్రతి గ్రహం అసంఖ్యాక జీవులకు నివాసం, మరియు భగవంతుని యొక్క అత్యున్నత ఆజ్ఞ ద్వారా ఆకాశంలో అవసరమైన స్థలం అందించ బడుతుంది. మొత్తం విశ్వ శరీరం పెరుగుతోందని కూడా ఇక్కడ పేర్కొనబడింది. ఇది ఏడు పొరలతో కప్పబడి ఉంటుంది మరియు విశ్వంలో ఐదు మూలకాలు ఉన్నందున, మొత్తం మూలకాలు, పొరలలో, సార్వత్రిక శరీరం వెలుపల కప్పబడి ఉంటాయి. మొదటి పొర భూమి, మరియు అది విశ్వంలోని స్థలం కంటే పరిమాణంలో పది రెట్లు ఎక్కువ; రెండవ పొర నీరు, మరియు అది భూమిపై పొర కంటే పది రెట్లు ఎక్కువ; మూడవది అగ్ని, ఇది నీటి కవచం కంటే పది రెట్లు ఎక్కువ. ఈ విధంగా ప్రతి పొర మునుపటి కంటే పది రెట్లు ఎక్కువ.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 233 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 43 🌴

43. nabho dadāti śvasatāṁ padaṁ yan-niyamād adaḥ
lokaṁ sva-dehaṁ tanute mahān saptabhir āvṛtam


MEANING : Subject to the control of Godhead, the sky allows outer space to accommodate all the various planets, which hold innumerable living entities. The total universal body expands with its seven coverings under His supreme control.

PURPORT : It is understood from this verse that all the planets in outer space are floating, and they all hold living entities. The word śvasatām means "those who breathe," or the living entities. In order to accommodate them, there are innumerable planets. Every planet is a residence for innumerable living entities, and the necessary space is provided in the sky by the supreme order of the Lord. It is also stated here that the total universal body is increasing. It is covered by seven layers, and as there are five elements within the universe, so the total elements, in layers, cover the outside of the universal body. The first layer is of earth, and it is ten times greater in size than the space within the universe; the second layer is water, and that is ten times greater than the earthly layer; the third covering is fire, which is ten times greater than the water covering. In this way each layer is ten times greater than the previous one.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




10 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 10, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : అజా ఏకాదశి, Aja Ekadasi 🌻

🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 23 🍀

45. కల్యాణః కల్యాణకరః కల్యః కల్యకరః కవిః |
కల్యాణకృత్ కల్యవపుః సర్వకల్యాణభాజనమ్

46. శాంతిప్రియః ప్రసన్నాత్మా ప్రశాంతః ప్రశమప్రియః |
ఉదారకర్మా సునయః సువర్చా వర్చసోజ్జ్వలః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సాధకుని పూర్ణానుమోద ఆవశ్యకత - ఈశ్వరానుగ్రహం, ఈశ్వరశక్తి సాధించలేనిది ఉండదనే మాట నిజమే. కాని, సాధకుని పూర్ణానుమోదం వున్నప్పుడే అవి ప్రవరిల్లుతాయి. పూర్ణానుమోదం యివ్వడమెట్లో నేర్చుకోడమే సాధన రహస్యం. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: కృష్ణ ఏకాదశి 21:30:17

వరకు తదుపరి కృష్ణ ద్వాదశి

నక్షత్రం: పునర్వసు 17:07:55

వరకు తదుపరి పుష్యమి

యోగం: వరియాన 23:19:09

వరకు తదుపరి పరిఘ

కరణం: బవ 08:22:06 వరకు

వర్జ్యం: 03:47:00 - 05:33:40

మరియు 26:05:00 - 27:52:36

దుర్ముహూర్తం: 16:44:12 - 17:33:30

రాహు కాలం: 16:50:22 - 18:22:48

గుళిక కాలం: 15:17:55 - 16:50:21

యమ గండం: 12:13:03 - 13:45:29

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37

అమృత కాలం: 14:27:00 - 16:13:40

సూర్యోదయం: 06:03:19

సూర్యాస్తమయం: 18:22:47

చంద్రోదయం: 01:54:49

చంద్రాస్తమయం: 15:33:21

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: ధ్వజ యోగం - కార్యసిధ్ధి

17:07:55 వరకు తదుపరి శ్రీవత్స

యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹