నిర్మల ధ్యానాలు - ఓషో - 219

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 219 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. లోపలి ప్రపంచంలో ప్రేమ వెలిగే తార, కాంతి, సూర్యుడు. అది నీ లోపలి ప్రపంచపు ఆత్మ. ఆధారం. లోపలికి వెళ్ళి దాన్ని కనిపెట్టు. ఆనందంగా వుండడానికి కాంతి ముఖ్య అవసరం. జీవితాన్ని ఒక సమస్యగా భావించకు. అది సమస్యే కాదు. అది జీవించదగిన రహస్యం. 🍀

నీ అస్తిత్వంలోని ఆకాశంలో ప్రేమ అన్నది మెరుస్తున్న నక్షత్రం. బాహ్య ప్రపంచాన్ని దాంతో పోల్చలేం. బాహ్యమైంది. అందంగానే వుంటుంది. కానీ ఆంతర్యలోని దాంతో దాన్ని పోల్చడానికి లేదు. లోపలి ప్రపంచంలో ప్రేమ వెలిగే తార, కాంతి. సూర్యుడు అది నీ లోపలి ప్రపంచపు ఆత్మ. ఆధారం. లోపలికి వెళ్ళి దాన్ని కనిపెట్టు. దాన్ని కనిపెడితే యితరుల్తో పంచుకో. ఉత్సవం జరుపుకో. నువ్వు కాంతిగా వుండడం అన్న దాని అర్థాన్ని మరచిపోతే ఆనంంగా వుండడమన్న అర్థాన్ని కూడా మరచి పోయావన్న మాట. అవి ఒకే విషయానికి రెండు కోణాలు.

ఆనందంగా వుండడానికి కాంతి ముఖ్య అవసరం. ఆట్లాంటి సందర్భంలోనే ఆనందం సంభవం. జీవితాన్ని ఒక సమస్యగా భావించకు. అది సమస్యే కాదు. అది జీవించదగిన రహస్యం. పరిష్కరించాల్సిన రహస్యం కాదు. అది ఆనందం, నాట్యం, ప్రేమ, అది ప్రహేళిక కాదు. విస్ఫోటించడానికి అవకాశం, అందం, అద్భుతం, ఆశ్చర్యం,. కాబట్టి ఉత్సాహంగా వుండడం నేర్చుకో. ఆటగా తీసుకో. ప్రతిదాన్ని నవ్వులాటగా భావించు. చివరికి మరణాన్ని కూడా నవ్వులాటగా తీసుకో.

సశేషం ...

02 Aug 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 319 - 14. అన్ని విజ్ఞాన శాస్త్రాల వెనుక ఉన్నవారు మీరే / DAILY WISDOM - 319 - 14. You Yourself are Something Behind Science

🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 319 / DAILY WISDOM - 319 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ

🌻 14. అన్ని విజ్ఞాన శాస్త్రాల వెనుక ఉన్నవారు మీరే🌻

ఆధునిక పరమాణు శాస్త్రం సాధారణ గణిత గణనల పరంగా కొలవదగినది కాదు. గణితం మరియు తర్కం పనిచేయని తలంలో జీవిత విలువలన్నీ తారుమారు అవుతాయి. ఈ స్థితిలో, విజ్ఞాన శాస్త్రం కూడా పనిచేయదు. మీరు ఆ పరిమితిని దాటినప్పుడు, అది మెటాఫిజిక్స్ అంటే తత్వశాస్త్రం అవుతుంది. ఇది భౌతిక శాస్త్రం కాదు, భూగర్భ శాస్త్రం కాదు. ఇది తరువాత మెటా-జియాలజీ అంటే మన శాస్త్రాలకు ఆవల ఉన్న విజ్ఞానం అవుతుంది. ఎందుకంటే మన శాస్త్రాలకు ప్రామాణికమైన కొలత, పరిశీలన, గణన కొన్ని రంగాలలో వర్తించవు. మీరు మొత్తం వ్యక్తిగా ఇక్కడ కూర్చున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ మీరు చిన్న భాగాలతో రూపొందించ బడినప్పుడు మీరు మొత్తం ఒక వ్యక్తి అని ఎలా భావించగలరు?

మీకు చెవులు, కళ్ళు, ముక్కు, ఎముకలు, మాంసం, గుండె మరియు ఊపిరితిత్తులు ఉన్నాయి. మీరు అనేక చిన్న విషయాల కలయిక అని మీకు ఎందుకు అనిపించదు? ఇక్కడ ఎవరు కూర్చున్నారు? మీరు ఇక్కడ కూర్చున్నట్లు చెప్పకూడదు; ఇక్కడ చిన్న రేణువుల సమూహం ఉందని మీరు చెప్పాలి. మీకు అలా ఎందుకు అనిపించడం లేదు? ఇక్కడ మీరే శాస్త్రానికి పూర్తిగా అర్థం కారు. మీ అస్తిత్వమే విజ్ఞానశాస్త్రం యొక్క గణన ప్రక్రియకు అందడం లేదు. అలా కాకుండా, మిమ్మల్ని మీరొక కొలవదగిన విషయంగా అభివర్ణించ గలిగితే, మిమ్మల్ని ఒక అంగాల సమూహంగా, కొన్ని ప్రక్రియల సమూహంగా వర్నించు కోవాలి తప్ప ఫలానా వ్యక్తి అని కాదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 DAILY WISDOM - 319 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 14. You Yourself are Something Behind Science 🌻

Modern subatomic science is not measurable in terms of ordinary mathematical calculations. All the values of life get negatived in a realm where mathematics and logic do not operate. In this condition, science also will not operate. When you cross that limit, it becomes metaphysics. It is not physics any more; it is not geology. It becomes meta-geology afterwards, because any kind of measurement, observation and calculation cannot apply in certain realms. You are feeling that you are sitting here as a whole person, but how should you feel that you are one whole total being when you are made up of little parts?

You have got ears and eyes and nose and bone and flesh, heart and lungs. Why don't you feel that you are an assemblage of so many little things? Who is sitting here? You should not say that you are sitting here; you should say that here is a bundle of little particles. Why don't you feel like that? Here you yourself are something behind science. Your very existence as so-and-so defeats the calculative process of science. Otherwise, if it is an observable, measurable thing that you are, then you have to describe yourself as an anatomical and physiological entity, and not so-and-so.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

02 Aug 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 640 / Vishnu Sahasranama Contemplation - 640

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 640 / Vishnu Sahasranama Contemplation - 640🌹

🌻640. ప్రద్యుమ్నః, प्रद्युम्नः, Pradyumnaḥ🌻

ఓం ప్రద్యుమ్నాయ నమః | ॐ प्रद्युम्नाय नमः | OM Pradyumnāya namaḥ

ద్యుమ్నం ప్రకృష్టం ద్రవిణం యస్య ప్రద్యుమ్న ఏవ సః ।
చతుర్వ్యూహేష్వన్యతమ ఇతి వా సతథోచ్యతే ॥

ఉత్తమమైన ద్యుమ్నము అనగా శుద్ధజ్ఞానరూపమగు ధనము ఈతనికి కలదుగనుక ప్రద్యుమ్నః. లేదా 'చతుర్వ్యూహ' (138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ) నామము నందు ప్రస్తావించబడిన నాలుగు వ్యూహములలో ప్రద్యుమ్న వ్యూహము కూడ ఈతనే.

:: శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::

న చ జీవం వినా బ్రహ్మన్ వాయవశ్చేష్టయన్తుత ।
స జీవః పరిసంఖ్యాతహ్ శేషః సంకర్షణః ప్రభుః ॥ 36 ॥

తస్మాత్ సనత్కుమారత్వం యోఽలభత్ స్వేన కర్మణా ।

సస్మింశ్చ సర్వభూతాని ప్రలయం యాన్తి సంక్షయమ్ ॥ 37 ॥
స మనః సర్వభూతానాం ప్రద్యుమ్నః పరిపఠ్యేతే ।

జీవము లేక ప్రాణవాయువు వ్యాపారము అనగా చేష్ట చేయలేదు. అట్టి జీవమే శేషుడు లేదా భగవాన్ సంకర్షణుడుగా చెప్పబడుచున్నాడు. అట్టి సంకర్షణుడు లేదా జీవునినుండి ఉత్పన్నమై, తన కర్మల (ధ్యాన పూజాదులు) ద్వారా సనత్కుమారత్వమును అనగా జీవన్ముక్తిని పొందుతున్నది. అట్టి ఏ సనత్కుమారత్వమున సమస్త ప్రాణికోటియును లయ, క్షయములను పొందుచున్నవో, అట్టి సంపూర్ణ భూతముల మనమే 'ప్రద్యుమ్న' గా చెప్పబడుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 640🌹

🌻640.Pradyumnaḥ🌻

OM Pradyumnāya namaḥ

द्युम्नं प्रकृष्टं द्रविणं यस्य प्रद्युम्न एव सः ।
चतुर्व्यूहेष्वन्यतम इति वा सतथोच्यते ॥

Dyumnaṃ prakr‌ṣṭaṃ draviṇaṃ yasya pradyumna eva saḥ,
Caturvyūheṣvanyatama iti vā satathocyate.

He who has infinite wealth. Or since being one of the four vyuhas (138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ), Pradyumna is also the Lord Himself.

:: श्री महाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकोनचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::

न च जीवं विना ब्रह्मन् वायवश्चेष्टयन्तुत ।
स जीवः परिसङ्ख्यातह् शेषः सङ्कर्षणः प्रभुः ॥ ३६ ॥

तस्मात् सनत्कुमारत्वं योऽलभत् स्वेन कर्मणा ।
सस्मिंश्च सर्वभूतानि प्रलयं यान्ति संक्षयम् ॥ ३७ ॥
स मनः सर्वभूतानां प्रद्युम्नः परिपठ्येते ।

Śrī Mahābhārata - Book XII, Chapter 339

Na ca jīvaṃ vinā brahman vāyavaśceṣṭayantuta,
Sa jīvaḥ parisaṃkhyātah śeṣaḥ saṃkarṣaṇaḥ prabhuḥ. 36.
Tasmāt sanatkumāratvaṃ yo’labhat svena karmaṇā,
Sasmiṃśca sarvabhūtāni pralayaṃ yānti saṃkṣayam. 37.
Sa manaḥ sarvabhūtānāṃ pradyumnaḥ paripaṭhyete,

Without, again, the entrance of Jīva into the body, the mind dwelling within it cannot cause it to move and act. He that enters the body is possessed of great puissance and is called Jīva. He is known also by other names, viz., Śeṣa and Sankarṣana. He that takes his rise, from that Sankarṣana, by his own acts, Sanatkumāra, and in whom all creatures merge when the universal dissolution comes, is the Mind of all creatures and is called by the name of Pradyumna.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

02 Aug 2022

శ్రీమద్భగవద్గీత - 241: 06వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 241: Chap. 06, Ver. 08

🌹. శ్రీమద్భగవద్గీత - 241 / Bhagavad-Gita - 241 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 08 🌴

08. జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియ: |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్ట్రాశ్మకాంచన:

🌷. తాత్పర్యం :

మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన,విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినపుడు ఆత్మానుభవము నందు స్థితిని పొందినట్టివాడై యోగి యనబడును. అట్టివాడు ఆధ్య్తాత్మికస్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్లనైనను, రాళ్ళనైనను లేదా బంగారమైనను సమానముగా గాంచును.

🌷. భాష్యము :

పరతత్వానుభవము లేనటువంటి కేవల పుస్తపాండిత్యము నిష్ప్రయోజనమైనట్టిది. ఈ విషయమే ఇట్లు చెప్పబడినది.

అత: శ్రీకృష్ణనామాది న భవేద్ గ్రాహ్యమింద్రియై: |
సేవన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్పురత్యద:

“శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలల దివ్యస్వభావమును భౌతికత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవ్వరును అవగాహన చేసికొనలేరు. కేవలము దివ్యమైన భక్తియుక్తసేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మనుజునకు ఆ ఆదిదేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తములగును.” (భక్తిరసామృతసింధువు 1.2.234)

కృష్ణభక్తిరసభావన శాస్త్రమే ఈ శ్రీమద్భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవ్వరును కృష్ణభక్తిరసభావితులు కాలేరు. అందులకు శుద్దాంతరంగునితో సాహచర్యము అత్యంత అవసరము.

అట్టి భక్తుడు శుద్ధమగు భక్తియోగాముతో సంతృప్తుడై యుండుటచే కృష్ణుని కరుణ వలన అనుభవజ్ఞానమును కలిగియుండును. అటువంటి అనుభవజ్ఞానము చేతనే ఎవ్వరైనను పూర్ణులు కాగలరు మరియు తమ విశ్వాసము నందు స్తిరులై నిలువగలరు.

కాని అనుభవజ్ఞానము లేక కేవలము పుస్తకజ్ఞానము కలవారు బాహ్యవరుధ్యములచే భ్రాంతులును, కలతనొందినవారును కాగలరు. శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందియున్నందున ఆత్మజ్ఞానము గలవాడే నిజముగా ఆత్మనిగ్రహమును కలిగియుండగలడు.

లౌకికపాండిత్యముతో ఎట్టి సంబంధము లేనందున అతడు దివ్యస్థితిలో నెలకొని యుండును. ప్రాపంచిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారము వంటివైనను అతనికి మాత్రము గులకరాళ్ళు లేదా రాళ్ళతో సమానమై యుండును.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 241 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 08 🌴

08. jñāna-vijñāna-tṛptātmā kūṭa-stho vijitendriyaḥ
yukta ity ucyate yogī sama-loṣṭrāśma-kāñcanaḥ

🌷 Translation :

A person is said to be established in self-realization and is called a yogī [or mystic] when he is fully satisfied by virtue of acquired knowledge and realization. Such a person is situated in transcendence and is self-controlled. He sees everything – whether it be pebbles, stones or gold – as the same.

🌹 Purport :

Book knowledge without realization of the Supreme Truth is useless. This is stated as follows:

ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ

“No one can understand the transcendental nature of the name, form, quality and pastimes of Śrī Kṛṣṇa through his materially contaminated senses.

Only when one becomes spiritually saturated by transcendental service to the Lord are the transcendental name, form, quality and pastimes of the Lord revealed to him.” (Bhakti-rasāmṛta-sindhu 1.2.234)

This Bhagavad-gītā is the science of Kṛṣṇa consciousness. No one can become Kṛṣṇa conscious simply by mundane scholarship. One must be fortunate enough to associate with a person who is in pure consciousness.

A Kṛṣṇa conscious person has realized knowledge, by the grace of Kṛṣṇa, because he is satisfied with pure devotional service. By realized knowledge, one becomes perfect.

By transcendental knowledge one can remain steady in his convictions, but by mere academic knowledge one can be easily deluded and confused by apparent contradictions.

It is the realized soul who is actually self-controlled, because he is surrendered to Kṛṣṇa. He is transcendental because he has nothing to do with mundane scholarship.

For him mundane scholarship and mental speculation, which may be as good as gold to others, are of no greater value than pebbles or stones.

🌹 🌹 🌹 🌹 🌹

02 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹02, AUGUST 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగ పంచమి, మంగళగౌరి వ్రతం, Nag Panchami, Mangala Gauri Vrat 🌻

🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 3 🍀

4. సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళమ్

5. దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళమ్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : భగవదానందం గ్రహించ లేని లౌకిక బుద్ధి దానిని ఎన్నో విధాలుగా ఎగతాళి చేస్తూ వుంటుంది. కాని, ఆ ఆనందాన్ని ఒక్కసారి చవి చూచిన ఆత్మ మాత్రం దాని మూలంగా తాను ప్రపంచంలో ఎట్టి అప్రతిష్ఠకూ, ఎన్ని కష్టనష్టాలకూ గురి కావలసి వచ్చినా ఇక దానిని విడనాడజాలదు. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల పంచమి 29:43:12

వరకు తదుపరి శుక్ల షష్టి

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 17:29:35

వరకు తదుపరి హస్త

యోగం: శివ 18:37:34 వరకు

తదుపరి సిధ్ధ

కరణం: బవ 17:28:07 వరకు

వర్జ్యం: 26:12:15 - 27:51:55

దుర్ముహూర్తం: 08:30:15 - 09:21:48

రాహు కాలం: 15:35:36 - 17:12:16

గుళిక కాలం: 12:22:16 - 13:58:56

యమ గండం: 09:08:55 - 10:45:35

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 09:52:42 - 11:34:06

సూర్యోదయం: 05:55:35

సూర్యాస్తమయం: 18:48:57

చంద్రోదయం: 09:35:11

చంద్రాస్తమయం: 22:00:40

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కన్య

ధాత్రి యోగం - కార్య జయం 17:29:35

వరకు తదుపరి సౌమ్య యోగం

- సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 02 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 02, ఆగస్టు 2022 మంగళవారం, భౌమ వాసరే Tuesday 🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 241 / Bhagavad-Gita - 241 -6-08 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 640 / Vishnu Sahasranama Contemplation - 640 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 319 / DAILY WISDOM - 319 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 219 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹02, AUGUST 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగ పంచమి, మంగళగౌరి వ్రతం, Nag Panchami, Mangala Gauri Vrat 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 3 🍀*

*4. సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |*
*ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళమ్*

*5. దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |*
*తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవదానందం గ్రహించ లేని లౌకిక బుద్ధి దానిని ఎన్నో విధాలుగా ఎగతాళి చేస్తూ వుంటుంది. కాని, ఆ ఆనందాన్ని ఒక్కసారి చవి చూచిన ఆత్మ మాత్రం దాని మూలంగా తాను ప్రపంచంలో ఎట్టి అప్రతిష్ఠకూ, ఎన్ని కష్టనష్టాలకూ గురి కావలసి వచ్చినా ఇక దానిని విడనాడజాలదు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల పంచమి 29:43:12
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 17:29:35
వరకు తదుపరి హస్త
యోగం: శివ 18:37:34 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బవ 17:28:07 వరకు
వర్జ్యం: 26:12:15 - 27:51:55
దుర్ముహూర్తం: 08:30:15 - 09:21:48
రాహు కాలం: 15:35:36 - 17:12:16
గుళిక కాలం: 12:22:16 - 13:58:56
యమ గండం: 09:08:55 - 10:45:35
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 09:52:42 - 11:34:06
సూర్యోదయం: 05:55:35
సూర్యాస్తమయం: 18:48:57
చంద్రోదయం: 09:35:11
చంద్రాస్తమయం: 22:00:40
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కన్య
ధాత్రి యోగం - కార్య జయం 17:29:35
వరకు తదుపరి సౌమ్య యోగం
- సర్వ సౌఖ్యం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 241 / Bhagavad-Gita - 241 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 08 🌴*

*08. జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియ: |*
*యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్ట్రాశ్మకాంచన:*

🌷. తాత్పర్యం :
*మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన,విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినపుడు ఆత్మానుభవము నందు స్థితిని పొందినట్టివాడై యోగి యనబడును. అట్టివాడు ఆధ్య్తాత్మికస్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్లనైనను, రాళ్ళనైనను లేదా బంగారమైనను సమానముగా గాంచును.*

🌷. భాష్యము :
పరతత్వానుభవము లేనటువంటి కేవల పుస్తపాండిత్యము నిష్ప్రయోజనమైనట్టిది. ఈ విషయమే ఇట్లు చెప్పబడినది. 

అత: శ్రీకృష్ణనామాది న భవేద్ గ్రాహ్యమింద్రియై: |
సేవన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్పురత్యద: 

“శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలల దివ్యస్వభావమును భౌతికత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవ్వరును అవగాహన చేసికొనలేరు. కేవలము దివ్యమైన భక్తియుక్తసేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మనుజునకు ఆ ఆదిదేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తములగును.” (భక్తిరసామృతసింధువు 1.2.234) 

కృష్ణభక్తిరసభావన శాస్త్రమే ఈ శ్రీమద్భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవ్వరును కృష్ణభక్తిరసభావితులు కాలేరు. అందులకు శుద్దాంతరంగునితో సాహచర్యము అత్యంత అవసరము. 

అట్టి భక్తుడు శుద్ధమగు భక్తియోగాముతో సంతృప్తుడై యుండుటచే కృష్ణుని కరుణ వలన అనుభవజ్ఞానమును కలిగియుండును. అటువంటి అనుభవజ్ఞానము చేతనే ఎవ్వరైనను పూర్ణులు కాగలరు మరియు తమ విశ్వాసము నందు స్తిరులై నిలువగలరు. 

కాని అనుభవజ్ఞానము లేక కేవలము పుస్తకజ్ఞానము కలవారు బాహ్యవరుధ్యములచే భ్రాంతులును, కలతనొందినవారును కాగలరు. శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందియున్నందున ఆత్మజ్ఞానము గలవాడే నిజముగా ఆత్మనిగ్రహమును కలిగియుండగలడు. 

లౌకికపాండిత్యముతో ఎట్టి సంబంధము లేనందున అతడు దివ్యస్థితిలో నెలకొని యుండును. ప్రాపంచిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారము వంటివైనను అతనికి మాత్రము గులకరాళ్ళు లేదా రాళ్ళతో సమానమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 241 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 08 🌴*

*08. jñāna-vijñāna-tṛptātmā kūṭa-stho vijitendriyaḥ*
*yukta ity ucyate yogī sama-loṣṭrāśma-kāñcanaḥ*

🌷 Translation : 
*A person is said to be established in self-realization and is called a yogī [or mystic] when he is fully satisfied by virtue of acquired knowledge and realization. Such a person is situated in transcendence and is self-controlled. He sees everything – whether it be pebbles, stones or gold – as the same.*

🌹 Purport :
Book knowledge without realization of the Supreme Truth is useless. This is stated as follows:

ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ

“No one can understand the transcendental nature of the name, form, quality and pastimes of Śrī Kṛṣṇa through his materially contaminated senses. 

Only when one becomes spiritually saturated by transcendental service to the Lord are the transcendental name, form, quality and pastimes of the Lord revealed to him.” (Bhakti-rasāmṛta-sindhu 1.2.234)

This Bhagavad-gītā is the science of Kṛṣṇa consciousness. No one can become Kṛṣṇa conscious simply by mundane scholarship. One must be fortunate enough to associate with a person who is in pure consciousness. 

A Kṛṣṇa conscious person has realized knowledge, by the grace of Kṛṣṇa, because he is satisfied with pure devotional service. By realized knowledge, one becomes perfect. 

By transcendental knowledge one can remain steady in his convictions, but by mere academic knowledge one can be easily deluded and confused by apparent contradictions. 

It is the realized soul who is actually self-controlled, because he is surrendered to Kṛṣṇa. He is transcendental because he has nothing to do with mundane scholarship. 

For him mundane scholarship and mental speculation, which may be as good as gold to others, are of no greater value than pebbles or stones.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 640 / Vishnu Sahasranama Contemplation - 640🌹*

*🌻640. ప్రద్యుమ్నః, प्रद्युम्नः, Pradyumnaḥ🌻*

*ఓం ప్రద్యుమ్నాయ నమః | ॐ प्रद्युम्नाय नमः | OM Pradyumnāya namaḥ*

*ద్యుమ్నం ప్రకృష్టం ద్రవిణం యస్య ప్రద్యుమ్న ఏవ సః ।*
*చతుర్వ్యూహేష్వన్యతమ ఇతి వా సతథోచ్యతే ॥*

*ఉత్తమమైన ద్యుమ్నము అనగా శుద్ధజ్ఞానరూపమగు ధనము ఈతనికి కలదుగనుక ప్రద్యుమ్నః. లేదా 'చతుర్వ్యూహ' (138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ) నామము నందు ప్రస్తావించబడిన నాలుగు వ్యూహములలో ప్రద్యుమ్న వ్యూహము కూడ ఈతనే.*

:: శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
న చ జీవం వినా బ్రహ్మన్ వాయవశ్చేష్టయన్తుత ।
స జీవః పరిసంఖ్యాతహ్ శేషః సంకర్షణః ప్రభుః ॥ 36 ॥
తస్మాత్ సనత్కుమారత్వం యోఽలభత్ స్వేన కర్మణా ।
సస్మింశ్చ సర్వభూతాని ప్రలయం యాన్తి సంక్షయమ్ ॥ 37 ॥
స మనః సర్వభూతానాం ప్రద్యుమ్నః పరిపఠ్యేతే ।

*జీవము లేక ప్రాణవాయువు వ్యాపారము అనగా చేష్ట చేయలేదు. అట్టి జీవమే శేషుడు లేదా భగవాన్ సంకర్షణుడుగా చెప్పబడుచున్నాడు. అట్టి సంకర్షణుడు లేదా జీవునినుండి ఉత్పన్నమై, తన కర్మల (ధ్యాన పూజాదులు) ద్వారా సనత్కుమారత్వమును అనగా జీవన్ముక్తిని పొందుతున్నది. అట్టి ఏ సనత్కుమారత్వమున సమస్త ప్రాణికోటియును లయ, క్షయములను పొందుచున్నవో, అట్టి సంపూర్ణ భూతముల మనమే 'ప్రద్యుమ్న' గా చెప్పబడుచున్నది.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 640🌹*

*🌻640.Pradyumnaḥ🌻*

*OM Pradyumnāya namaḥ*

द्युम्नं प्रकृष्टं द्रविणं यस्य प्रद्युम्न एव सः ।
चतुर्व्यूहेष्वन्यतम इति वा सतथोच्यते ॥

*Dyumnaṃ prakr‌ṣṭaṃ draviṇaṃ yasya pradyumna eva saḥ,*
*Caturvyūheṣvanyatama iti vā satathocyate.*

*He who has infinite wealth. Or since being one of the four vyuhas (138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ), Pradyumna is also the Lord Himself.*

:: श्री महाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकोनचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
न च जीवं विना ब्रह्मन् वायवश्चेष्टयन्तुत ।
स जीवः परिसङ्ख्यातह् शेषः सङ्कर्षणः प्रभुः ॥ ३६ ॥
तस्मात् सनत्कुमारत्वं योऽलभत् स्वेन कर्मणा ।
सस्मिंश्च सर्वभूतानि प्रलयं यान्ति संक्षयम् ॥ ३७ ॥
स मनः सर्वभूतानां प्रद्युम्नः परिपठ्येते । 

Śrī Mahābhārata - Book XII, Chapter 339
Na ca jīvaṃ vinā brahman vāyavaśceṣṭayantuta,
Sa jīvaḥ parisaṃkhyātah śeṣaḥ saṃkarṣaṇaḥ prabhuḥ. 36.
Tasmāt sanatkumāratvaṃ yo’labhat svena karmaṇā,
Sasmiṃśca sarvabhūtāni pralayaṃ yānti saṃkṣayam. 37.
Sa manaḥ sarvabhūtānāṃ pradyumnaḥ paripaṭhyete,

Without, again, the entrance of Jīva into the body, the mind dwelling within it cannot cause it to move and act. He that enters the body is possessed of great puissance and is called Jīva. He is known also by other names, viz., Śeṣa and Sankarṣana. He that takes his rise, from that Sankarṣana, by his own acts, Sanatkumāra, and in whom all creatures merge when the universal dissolution comes, is the Mind of all creatures and is called by the name of Pradyumna.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka

अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 319 / DAILY WISDOM - 319 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 14. అన్ని విజ్ఞాన శాస్త్రాల వెనుక ఉన్నవారు మీరే🌻*

ఆధునిక పరమాణు శాస్త్రం సాధారణ గణిత గణనల పరంగా కొలవదగినది కాదు. గణితం మరియు తర్కం పనిచేయని తలంలో జీవిత విలువలన్నీ తారుమారు అవుతాయి. ఈ స్థితిలో, విజ్ఞాన శాస్త్రం కూడా పనిచేయదు. మీరు ఆ పరిమితిని దాటినప్పుడు, అది మెటాఫిజిక్స్ అంటే తత్వశాస్త్రం అవుతుంది. ఇది భౌతిక శాస్త్రం కాదు, భూగర్భ శాస్త్రం కాదు. ఇది తరువాత మెటా-జియాలజీ అంటే మన శాస్త్రాలకు ఆవల ఉన్న విజ్ఞానం అవుతుంది. ఎందుకంటే మన శాస్త్రాలకు ప్రామాణికమైన కొలత, పరిశీలన, గణన కొన్ని రంగాలలో వర్తించవు. మీరు మొత్తం వ్యక్తిగా ఇక్కడ కూర్చున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ మీరు చిన్న భాగాలతో రూపొందించ బడినప్పుడు మీరు మొత్తం ఒక వ్యక్తి అని ఎలా భావించగలరు?

మీకు చెవులు, కళ్ళు, ముక్కు, ఎముకలు, మాంసం, గుండె మరియు ఊపిరితిత్తులు ఉన్నాయి. మీరు అనేక చిన్న విషయాల కలయిక అని మీకు ఎందుకు అనిపించదు? ఇక్కడ ఎవరు కూర్చున్నారు? మీరు ఇక్కడ కూర్చున్నట్లు చెప్పకూడదు; ఇక్కడ చిన్న రేణువుల సమూహం ఉందని మీరు చెప్పాలి. మీకు అలా ఎందుకు అనిపించడం లేదు? ఇక్కడ మీరే శాస్త్రానికి పూర్తిగా అర్థం కారు. మీ అస్తిత్వమే విజ్ఞానశాస్త్రం యొక్క గణన ప్రక్రియకు అందడం లేదు. అలా కాకుండా, మిమ్మల్ని మీరొక కొలవదగిన విషయంగా అభివర్ణించ గలిగితే, మిమ్మల్ని ఒక అంగాల సమూహంగా, కొన్ని ప్రక్రియల సమూహంగా వర్నించు కోవాలి తప్ప ఫలానా వ్యక్తి అని కాదు.

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 319 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻 14. You Yourself are Something Behind Science 🌻*

Modern subatomic science is not measurable in terms of ordinary mathematical calculations. All the values of life get negatived in a realm where mathematics and logic do not operate. In this condition, science also will not operate. When you cross that limit, it becomes metaphysics. It is not physics any more; it is not geology. It becomes meta-geology afterwards, because any kind of measurement, observation and calculation cannot apply in certain realms. You are feeling that you are sitting here as a whole person, but how should you feel that you are one whole total being when you are made up of little parts? 

You have got ears and eyes and nose and bone and flesh, heart and lungs. Why don't you feel that you are an assemblage of so many little things? Who is sitting here? You should not say that you are sitting here; you should say that here is a bundle of little particles. Why don't you feel like that? Here you yourself are something behind science. Your very existence as so-and-so defeats the calculative process of science. Otherwise, if it is an observable, measurable thing that you are, then you have to describe yourself as an anatomical and physiological entity, and not so-and-so. 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 219 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. లోపలి ప్రపంచంలో ప్రేమ వెలిగే తార, కాంతి, సూర్యుడు. అది నీ లోపలి ప్రపంచపు ఆత్మ. ఆధారం. లోపలికి వెళ్ళి దాన్ని కనిపెట్టు. ఆనందంగా వుండడానికి కాంతి ముఖ్య అవసరం. జీవితాన్ని ఒక సమస్యగా భావించకు. అది సమస్యే కాదు. అది జీవించదగిన రహస్యం. 🍀*

*నీ అస్తిత్వంలోని ఆకాశంలో ప్రేమ అన్నది మెరుస్తున్న నక్షత్రం. బాహ్య ప్రపంచాన్ని దాంతో పోల్చలేం. బాహ్యమైంది. అందంగానే వుంటుంది. కానీ ఆంతర్యలోని దాంతో దాన్ని పోల్చడానికి లేదు. లోపలి ప్రపంచంలో ప్రేమ వెలిగే తార, కాంతి. సూర్యుడు అది నీ లోపలి ప్రపంచపు ఆత్మ. ఆధారం. లోపలికి వెళ్ళి దాన్ని కనిపెట్టు. దాన్ని కనిపెడితే యితరుల్తో పంచుకో. ఉత్సవం జరుపుకో. నువ్వు కాంతిగా వుండడం అన్న దాని అర్థాన్ని మరచిపోతే ఆనంంగా వుండడమన్న అర్థాన్ని కూడా మరచి పోయావన్న మాట. అవి ఒకే విషయానికి రెండు కోణాలు.*

*ఆనందంగా వుండడానికి కాంతి ముఖ్య అవసరం. ఆట్లాంటి సందర్భంలోనే ఆనందం సంభవం. జీవితాన్ని ఒక సమస్యగా భావించకు. అది సమస్యే కాదు. అది జీవించదగిన రహస్యం. పరిష్కరించాల్సిన రహస్యం కాదు. అది ఆనందం, నాట్యం, ప్రేమ, అది ప్రహేళిక కాదు. విస్ఫోటించడానికి అవకాశం, అందం, అద్భుతం, ఆశ్చర్యం,. కాబట్టి ఉత్సాహంగా వుండడం నేర్చుకో. ఆటగా తీసుకో. ప్రతిదాన్ని నవ్వులాటగా భావించు. చివరికి మరణాన్ని కూడా నవ్వులాటగా తీసుకో.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹