శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 46, 47 / Sri Lalitha Chaitanya Vijnanam - 46, 47

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 27 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 46 / Sri Lalitha Chaitanya Vijnanam - 46 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

20. శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ

మరాళి మందగమనా మహాలావణ్య శేవధి

🌻 46. 'శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా' 🌻

ఈ నామమున అమ్మవారి కాలి అందెల వర్ణన మున్నది. శబ్దములు చేయుచున్న, మణిమయ కాంతులచే విరాజిల్లుచున్న అందెలుకల పాదములు గలది శ్రీదేవి అని అర్థము. ఆమె కాలి అందెలు చేయు శబ్దములు వేద నాదములని గ్రహింపవలెను. వాటి మణిమయ కాంతులు చిత్కళ అనుభూతులని తెలియవలెను.

ఉత్తమ ఉపాసకులకు అమ్మవారి ధ్యానమున నాదములు వినిపించుట జరుగుచున్నవి. అవి కింకిణి శబ్దములుగ మొదలై దశ విధములగు నాదములుగ వినిపించుచు అనుశ్యూతము, శ్రావ్యము అగు వేణునాదముగ పరిణమించును.

అట్లే నాద శ్రవణముతోపాటు చిత్కళను గోచరించుచు తేజోమయమైన కాంతుల వరకు దర్శనము జరుగు చుండును. ఉపాసకులకు గృహము నందు గజ్జల మ్రోతలు వినపడుట నుండి వేదనాదము వరకు వినిపించుట జరుగుచుండును.

ఈ నాద ధ్వనులన్నియు అనాహతములే. అట్లే చిత్కళలతో ప్రారంభమై బింబ దర్శనము వరకు దర్శనములు జరుగుచుండును.

పై నాద కళానుభూతులు అమ్మవారి సాన్నిధ్యమును సంకేతించును. పై అనుభూతులు కలవారు దేవీ దర్శనమునకు ప్రాతులగు చున్నారని తెలియవలెను. పరహితము చేయుచు, పవిత్రతను పెంచుకొనుచు వారు శ్రీదేవి పాద దర్శనమునకు చేరువగుచుందురు. ఈ కాలి అందెల తళుకులు, నాదములు తన్మయత్వము కలిగించుచు ఉపాసకుని దివ్యసాన్నిధ్యమున నిలుపును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 46 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Siñjāna- maṇi- mañjīra- maṇḍita-srīpadāmbujā सिञ्जान-मणि-मञ्जीर-मण्डित-स्रीपदाम्बुजा (46)

She is wearing anklets made out of precious gems that shine.

It is to be noted that five nāma-s 42 to 46 describe only about Her feet. When Her feet alone are described in such a detailed manner, it is beyond human comprehension to think about Her powerful form.

This is made so by Vāc Devi-s, to impress about Her prākaśa vimarśa mahā māyā svarūpinī form.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 47 / Sri Lalitha Chaitanya Vijnanam - 47 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

20. శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ

మరాళి మందగమనా మహాలావణ్య శేవధి

🌻 47. 'మరాళీ మందగమనా' 🌻

ఆడుహంస వలె విశేషమైన సౌందర్యముతో కూడిన మెల్లని, ఒయ్యారమైన నడక గలది శ్రీదేవి అని అర్థము. హంస నడకలు వర్ణింపలేని ఒయ్యారము గలవి.

ఆ నడకలు నెమ్మదిగను, సౌందర్యముగను, చూపరులను ఆకర్షించునట్టివిగను, ఆనందదాయకముగను ఉండును. అందున ఆడుహంస మరింత విశేషించి పై లక్షణములను కలిగియుండును. మరాళ మనగా హంస, మరాళి అనగా ఆడుహంస. శ్రీదేవి గమనము ఆడుహంస గమనముతో పోల్చబడినది.

హంస శబ్దమునకు అనేకార్థములు గలవు. హంస అనగా తేజో మూర్తియగు సూర్యుడు. హంస అనగా "నే నతడే” అని యర్థము.

అనగా నేను పరమాత్మ స్వరూపుడను అని యర్థము. శ్రీదేవి తేజోమయ మూర్తి. సృష్టియందలి తేజస్సంతయు ఆమెదే. అగ్ని, సూర్యుడు, చంద్రుల కాంతి ఆమెదే. ఆమె పరమాత్మ యొక్క వ్యక్తరూపమే. పరమాత్మ అగుపించుట యనగా ఆమె యగుపించుటయే.

ఆమె దర్శనము అతడి దర్శనమే. కేనోపనిషత్తు దీని నద్భుతముగ ప్రకటింపజేసినది. మరియు హంస పరమ మంత్రము. అనగా పరమును చేర్చు మంత్రము. ఇహము నుండి తరింపుచేయు మంత్రము. తారకమంత్రము.

అమ్మవారి హంస గమనము మనయందలి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగ గమనించవలెను. సూక్ష్మముగ, మందముగ, మంద్రముగ జరుగు సూక్ష్మ స్పందన శ్రీదేవి కదలిక యని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 47 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 47. Marālī-manda-gamanā मराली-मन्द-गमना (47) 🌻

Her walking gait is like a female swan. When She comes out of the kunda (nāma 4) and walking towards gods and goddesses, Her gait is described like this.

The fact is that Her gait cannot be compared to that of swans, as Her gait is incomparable. In order to give an idea about Her gait such visual comparisons are made.

Saundarya Laharī (verse 91) says, “Oh! Goddess of graceful gait! Your household swans, as if intent on practising to balance their steps with tripping gait, do not abandon your feet.”

With this nāma the subtle description of Śaktī kūṭa of Pañcadaśī is concluded.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


22 Oct 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 79


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 79 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ



🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 01 🌻

సూక్ష్మగోళము:

334. సూక్ష్మ మండలము అనంత ప్రాణ సామ్రాజ్యము. భగవంతుని అనంత స్వభావత్రయములో ఒకటైన అనంత శక్తి, పరిమితమైన మిద్యాజగత్తులోనికి ప్రసరించినప్పుడు, అది సూక్ష్మలోకములో అనంత ప్రాణశక్తిగా రూపాంతర మొందెను.

335. సూక్ష్మలోకము 7 డివిజనులుగా విభజింపబడిఉన్నను అది అంతయూ ఒకటే ప్రపంచము. ఇది ప్రాణశక్తి మయ గోళము. ఈ గోళము మనోమయ గోళము పై ఆధార పడి యున్ననూ, భౌతిక గోళము పట్ల స్వతంత్రమైనది.

336. సూక్ష్మగోళము, దాని ప్రాణశక్తి, అందలి దివ్యజీవులు, మానవుని పూర్తి సూక్ష్మచైతన్యము పాక్షిక సూక్ష్మ చైతన్యముల ద్వారా భౌతిక గోళమును అల్లుకొనుచుప్పుడు,సూర్యులు, నక్షత్రములు, గ్రహములు అన్ని ప్రపంచములో నున్న ప్రతి వస్తువు, ప్రతిజీవి వీటిఅన్నిటితో కూడిన అనంత ఆకాశము కూడా అల్లుకొనుచున్నది. అనంతాకాశము కూడా భౌతిక గోళము లోపల నున్నది.

337.అపరిమితమైన నానాత్వమును సూక్ష్మదృశ్యములు, సూక్ష్మధ్వనులు, సూక్ష్మానుభూతులు శక్తులయొక్క తీవ్రతయును భౌతికగోళములో సమాంతరమును కలిగియుండక ప్రాణశక్తిని కాపాడుచున్నవి.ఈ ప్రాణశక్తి భౌతిక హద్దులలోపల పరిమిత మగుచున్నది. మానవుని చైతన్యము భౌతిక పరిమితులచే చుట్టబడియున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



22 Oct 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 85 / Sri Gajanan Maharaj Life History - 85



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 85 / Sri Gajanan Maharaj Life History - 85 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 17వ అధ్యాయము - 4 🌻

అటుపిమ్మట...నాకు పంజాబ్ వెళ్ళడానికి శ్రీగజానన్ మహారాజునుండి ఆదేశంవచ్చింది, కావుననేను ఏవిధమయిన విలంబన చెయ్యకుండా వెళ్ళితీరాలి, నేను మీకు నిజం చెబుతున్నాను, శ్రీగజానన్ మహారాజు కృపవల్ల ఆమసీదు కట్టడం పూర్తి అవుతుంది.

యోగులు మతబేధం నమ్మక అన్ని మతాలు ఒకటిగానే వాళ్ళు చూస్తారు, ఈవిధంగా మసీదులకు, మతానికి అవసరంలేని ప్రాముఖ్యత ఇస్తే మీఅందరినీ నాశనం చేస్తుంది. గుడి, మసీదు రెండూకూడా ఒకే రకమయిన సామాగ్రితో కట్టబడ్డాయి, కానీ వాటి ఆకారాలు వేరవడంవల్ల కొట్టుకోవడం మూర్ఖత్వం.

ముస్లింలు మాత్రమే భగవంతునికి చెందినవారు, హిందువులు భూతాలకి చెందినవారు అని అనడం మీ ఉద్దేశ్యమా ? పూర్తి మానవాళి మంచికోరి తెలివిగా ఆలోచించండి, ముస్లింలను, హిందువులను ఒకే భగవంతుడు సృష్టించాడు అని గుర్తుంచుకోండి. తమతమ మతాన్ని ప్రేమించాలి కానీ దానితోపాటు ఇతరమతాలనికూడా గౌరవించాలి. ఆ విధమయిన ఆలోచన లేకపోతే సంతోషం అనేది చాలాదూరంగా ఉంటుంది. ఇక ఇప్పుడు వెళ్ళండి. మసీదు కట్టడంపని శ్రీమాహారాజు కృపవల్ల పూర్తి అవుతుంది అని శ్రీమెహతబ్షా అన్నారు.

శ్రీమెహతబ్షా వెళ్ళపోయారు, తరువాత ఎప్పటికి తిరిగి రాలేదు. హిందువులు, ముస్లింలు ఇద్దరూకూడా ఈసలహా గూర్చి ఆలోచించాలి. శ్రీమహారాజు, శ్రీమెహతబ్షాను కొట్టినా ఆయన హృదయం పూర్తిగా అతనిమీద ప్రేమతో నిండిఉంది. అందులో ఏవిధమయిన మాలిన్యంలేదు. శ్రీమహారాజు మెహతబ్షా లేకుండా వెళ్ళి భోజనం చెయ్యలేదు, ఈవిషయం మీద అందరూ ఆలోచించాలి. బాపూరావు భార్య బాణామతి చిక్కులో ఇరికింది.

ఒకనిమిషానికి నుదిటిమీద కుంకం వస్తే ఇంకోక్షణంలో మెడలో తాడు వచ్చేది, ఒక్కోసారి ఆమె బట్టలో మంటతో వెలిగేవి, ఒక్కోక్కప్పుడు నల్లచారలు వీపుమీద వచ్చేవి, ఆరవేసిన ఆమె బట్టలకు నిప్పు అంటుకునేది. ఈవిధమయిన విచిత్రమయిన పిచ్చిసంగతులు ఆమె ఆరోగ్యం దెబ్బతీస్తాయి. ఆమెకు భోజనంమీద చవిపోయి చివరికి చాలా నీరసించిపోయింది. బాపూరావు ఆమె నయమవడం కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టాడు, కానీ ఉపయోగం లేకపోయింది.

చివరికి మిగిలిన ఒకేఒక ఉపాయంగా అతను శ్రీగజానన్ మహారాజుకు లొంగిపోయి, చేతులు కట్టుకుని... మహారాజ్ నాభార్య బాణామతితో బాధపడుతోంది, నేను నాసాయశక్తులా ప్రయత్నించాను. కానీ ఫలితం లేకపోయింది. నేను పూర్తిగా ఈ బాధతో విసిగిపోయాను. మీరు నివసించే స్థలంలో బాణామతి ఎలా చొరపడగలదు ? ఒక నక్కకి సింహం గుహలోకి వచ్చి అరవడానికి ఎంతదైర్యం ? కస్తూరి దరిదాపులలో ఉండగా మురికివాసన ఎలా ఉండగలదు ? అని అన్నాడు. ఇది విన్న శ్రీమహారాజు బాపురావు భార్యవైపు చూసారు అంతే బాణామతి మాయం అయింది.

ఒకసారి శ్రీమహారాజు తన పరిభ్రమణాలలో, తనతోటి యోగి సోదరుడయిన శ్రీనరసింహజీని కలిసేందుకు అకోట్ చేరతారు. ఆయన మఠం దగ్గర ఒక బావి ఉంది. శ్రీమహారాజు వెళ్ళి కాళ్ళు బావిలో వేళ్ళాడేట్టు ఆబావి గట్టుమీద కూర్చున్నారు. ఆయన తదేకంగా బావిలోకి చూస్తున్నారు. అందరూ ఆయన ఇలా చెయ్యడంచూసి ఆశ్చర్యపోయారు.

నరసంహజీ అయితే ఆయనని ఆవిధంగా చూస్తూ ఉండడానికి కారణం అడిగారు. గోదావరి, భగీరధి మరియు యమునను నేను ఈబావిలో చూస్తున్నాను, ఇంకా ఏ పుణ్యనదులు వాటితోపాటు ఉన్నాయో నేను తెలుసుకుందామని.

నీకు రోజూ వాటి నీళ్ళు స్నానానికి దొరుకుతూంటే, నేను ఎందుకు ఆ ఆనందంనుండి వంచితుడిని కావాలి ? ఈ నదులన్నీ పైకి వచ్చి నాకు పవిత్ర స్నానం చేయించాలి. అలా అవి చేసేంతవరకూ నేను ఈస్థలం వదలను అని శ్రీమహారాజు అన్నారు. ఈవిధంగా ఆయన అనడం విన్న ప్రజలు, ఆవిధంగా జరగాలని అనుకోవడానికి ఆయనకు నిజంగా పిచ్చి అని తలచారు.

కానీ కొద్ది క్షణాలతరువాత ఆబావిలో నీరు ధారలాగా ఉబికి వచ్చి శ్రీమహారాజుమీద పడింది. ఆయన ప్రజలందరినీ తనతో ఈ పుణ్య నదులయిన గంగ, యమున, గోదావరి మరియు ఇతర నదుల అన్నిటి నీళ్ళతో స్నానం చేయడంలో కలవమని పిలిచారు. నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్ళి శ్రీమహారాజుతో పాటు ఆ పవిత్ర స్నానం చేసారు.

శక్తివంతుడయిన భగవంతుడు ఎల్లప్పుడూ యోగుల కోరిక నెరవేర్చుతూ ఉంటారు. స్నానం అయిన తరయవాత శ్రీమహారాజు వెళ్ళి పోయారు, ఆధార వెనక్కి వెళ్ళిపోయి బావిలో నీళ్ళు ముందటి సహజ స్థితికి వచ్చాయి. శ్రీమహారాజు శ్రీనరసింహజీని కలసి మనోవేగంతో షేగాం వెళ్ళిపోయారు.

శ్రీదాసగణు చేత వ్రాయబడ్డ ఈ గజానన్ విజయ గ్రంధం భక్తులకు రక్షకునిగా నిరూపించుగాక

శుభం భవతు

17. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 86 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 17 - part 4
🌻

Thereupon he said, I got orders from Shri Gajanan Maharaj for going to Punjab, so I must go without any delay.

To tell you the truth, the work of the construction of the mosque will be completed by the grace of Shri Gajanan Maharaj. Saints do not believe in difference of religions and treat all the religions as equal.

The fads of mosques and religions, if given undue importance, will ruin all of you. Both, temples and mosques, are built by the same material, and to fight because of their different shapes is foolish.

Do you mean to say that only Muslims belong to God and Hindus to ghosts? Think wisely in the interest of all humanity. Remember that the same God creates both Hindus and Muslims. One should love his own religion, but also respect that of others.

Without such thinking, happiness will be far away. Now go, the mosque will be completed by the grace of Shri Gajanan Maharaj.” Shri Mehatabshah went away and never returned thereafter.

Both Hindus and Muslims should give a thought to this advice. Look, even though Shri Gajanan Maharaj beat Shri Mehatabshah, His heart was full of love for him. There was no malice at all. Shri Gajanan Maharaj did not go to take meals without Mehatabshah. All should think over this aspect.

The wife of Shri Bapurao came under the spell of Bhanamati. In a moment she used to get Kunku on her forehead, next moment a rope round her neck and at times her clothes used to glow with fire. Some times she used to get black scars on her back and had her clothes spread for drying for catching fire.

Such mysterious and maddening happenings had affected her health. She lost taste for food and consequently became very weak. Bapurao had spent a lot of money for her cure, but to no effect.

At last, and as a last resort, he surrendered to Shri Gajanan Maharaj and with folded hands said, Maharaj, my wife is suffering from Bhanamati, I tried my best to get her cured, but failed. I am completely fed up with the malady.

How can Bhanamati enter the place of your abode? How dare a fox come and shout in the lion's den? How can a stink exist in the vicinity of the musk fragrance?

Hearing this, Shri Gajanan Maharaj glanced at Bapurao's wife and her Bhanamati vanished. Once in his wanderings Shri Gajanan Maharaj reached Akot to meet Shri Narsinghji-his brother saint.

There was a well near His 'math'. Shri Gajanan Maharaj went and sat on its parapet with His legs hanging inside. He was constantly looking in the well. All were surprised to see him do like that and even Narsinghji asked Him the reason for doing so.

Shri Gajanan Maharaj replied, I see Godavari, Bhagirathi and Yamuna in the well, and want to find out which other holy rivers are there alongwith them. When you are daily getting their waters for you bath, why should I be denied that pleasure? These rivers must come out and give me a holy bath today, and I will not leave this place until they do so.

Hearing Him say so, people thought that he was really mad to except such things to happen. However, a moment later, the well water came up gushing like fountain and poured on Shri Gajanan Maharaj .

He called upon all people to join him and take a bath in the holy waters of Ganga, Yamuna, Godavari and all other rivers. Believers went and readily took the holy bath with Shri Gajanan Maharaj .

God Almighty always fulfils the wishes of saints. After the bath Shri Gajanan Maharaj went away, and the fountain of water withdrew, taking the water in the well to its original level.

Shri Gajanan Maharaj met Shri Narsinghji and went away to Shegaon with mind's speed. May this Gajanan Vijay epic, sung by Shri Dasganu, prove to be a savior to all devotees.

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Seventeen

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



22 Oct 2020

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 12 / Sri Devi Mahatyam - Durga Saptasati - 12



🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 12 / Sri Devi Mahatyam - Durga Saptasati - 12 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 3

🌻. మహిషాసుర వధ - 3 🌻

30. ఆ వెంటనే అతడు సింహమయ్యాడు. అంబిక ఆ (సింహ) శిరస్సును ఖండించగానే అతడు ఖడ్గహస్తుడైన మానవుని రూపం ధరించాడు.

31. తక్షణమే దేవి తన బాణాలతో ఆ పురుషుణ్ణి, ఆతని ఖడ్గం, డాలుతోసహా ఛేదించివేసింది. అతడు అంతట పెద్ద ఏనుగు అయ్యాడు.

32. (ఆ ఏనుగు) తన తొండంతో దేవి మహాసింహాన్ని పట్టుకొని లాగి గట్టిగా ఘీంకారం చేసింది. కాని అలా లాగుతున్నప్పుడే దేవి దాని తొండాన్ని తన ఖడ్గంతో నరికివేసింది.

33. ఆ మహాసురుడు అంతట తన మహిషరూపాన్ని మళ్ళీ దాల్చి, చరాచర సహితంగా ముల్లోకాలనూ తల్లడిల్లజేసింది.

34. అప్పుడు జగన్మాత అయిన చండిక క్రోధం దాల్చి దివ్య పానీయాన్ని మాటిమాటికీ త్రాగి నవ్వాసాగింది. ఆమె కన్నులు ఎర్రబడ్డాయి.

35. అసురుడు తన బలసాహసాలతో మదోన్మత్తుడై, మహానాదం చేసి, తన కొమ్ములతో పర్వతాలను చండికపై విసిరాడు.

36. తనపై రువ్వబడిన పర్వతాలను ఆమె తన బాణ సమూహంతో నుగ్గునూచం చేసి, దివ్యపానోన్మత్తత చేత అధికతరమై ఒప్పుతున్న ముఖవర్ణంతో, తొట్రుపడు పలుకులతో, అతనితో ఇలా పలికింది.

37-38. దేవి పలికెను : ఓ మూఢుడా! ఇంకొక క్షణంసేపు, నేను ఈ మద్యం అంతా త్రాగేసే వరకూ గర్జిస్తూ ఉండు. నిన్ను నేను

వధించినప్పుడు దేవతలు త్వరలోనే ఇక్కడే గర్జిస్తారు.

39–40. ఋషి పలికెను :

ఇలా చెప్పి ఆమె ఎగిరి ఆ మహాసురునిపై వ్రాలి, పాదంతో అతని కంఠాన్ని తొక్కిపట్టి శూలంతో అతనిని పొడిచింది.

41. అతడు అంతట దేవిపాదం క్రింద చిక్కుకొని, ఆమె శౌర్యానికి పూర్తిగా లొంగిపోయి, తన (మహిష) ముఖం నుండి యథార్థ స్వరూపంతో సగం వెలువడ్డాడు.

42. ఇలా సగం వెలువఱచిన నిజస్వరూపంతో పోరాడుతున్న ఆ మహాసురుణ్ణి దేవి తన మహాఖడ్గంతో శిరశ్ఛేదం చేసి కూల్చివేసింది.

43. అంతట దైత్యసైన్యమంతా హాహారవాలు చేస్తూ నాశనమయ్యింది. దేవగణాలందరూ పరమహర్షాన్ని పొందారు.

దేవతలు, దివ్యమహర్షులు, దేవిని స్తుతించారు. గంధర్వపతులు పాడారు, అప్సర గణాలు ఆడారు.

శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “మహిషాసుర వధ” అనే నామమ తృతీయాధ్యాయము సమాప్తం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 12 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 3:
🌻 The Slaying of Mahishasura - 3
🌻

30. Then he became a lion suddenly. While Ambika cut off the head (of his lion form), he took the appearance of a man with sword in hand.

31. Immediately then the Devi with her arrows chopped off the man together with his sword and shield. Then he became a big elephant.

32. (The elephant) tugged at her great lion with his trunk and roared loudly, but as he was dragging, the Devi cut off his trunk with her sword.

33. The great asura then resumed his buffalo shape and shook the three worlds with their movable and immovable objects.

34. Enraged threat, Chandika, the Mother of the worlds, quaffed a divine drink again and again, and laughed, her eyes becoming red.

35, And the asura, also roared intoxicated with his strength and valour, and hurled mountains against Chandika with his horns.

36. And she with showers of arrows pulverized ( those mountains) hurled at her, and spoke to him in flurried words, the colour of her face accentuated with the intoxication of the divine drink. The Devi said:

37-38. 'Roar, roar, O fool, for a moment while I drink this wine. When you sill be slain by me, the devas will soon roar in this very place.' The Rishi said:

39-40. Having exclaimed thus, she jumped and landed herself on that great asura, pressed him on the neck with her foot and struck him with her spear.

41. And thereupon, caught up under her foot. Mahishasura half issued forth ( in his real form) from his own (buffalo) mouth, being completely overcome by the valour of the Devi.

42. Fighting thus with his half-revealed form, the great asura was laid by the Devi who struck off his head with her great sword.

43. Then, crying in consternation, the whole asura army perished; and all the hosts of deva were in exultation.

44. With the great sages of heaven, the devas praised the Devi. The Gandharva chiefs sang and the bevies of apsaras danced.

Here ends the third chapter called 'The Slaying of Mahishasura' of Devi-mahatmya in Markandeya-purana during the period of Savarni, the Manu.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


22 Oct 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 81



🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 81  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -11 🌻

సాధన చతుష్టయ సంపత్తి అనగానే, మీకు గుర్తుకు రావలసినది ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి. ఏమిటవి? నిత్యానిత్ర వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము. ఈ నాలుగు సాధన చతుష్టయ సంపత్తులను ఎవరైతే చక్కగా శీలించి సంపాదిస్తారో, నిరంతరాయము నిలబెట్టుకుంటారో, వారు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఇతరులకు శక్యము కాదు.

కేవలము ‘ఆత్మానుభూతి మాత్రమే నా జీవిత లక్ష్యం’ అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, వారు మాత్రమే ఈ బుద్ధి గుహయందున్నటువంటి, హృదయాకాశమునందు ఉన్నటువంటి ఆత్మను పొందగలుగుతున్నారు. దీనికి ఏమని చెప్పారు మనకి నిన్నా మొన్నా? దాని యొక్క శబ్ద స్ఫురణ కలగగానే, నీకు దర్శనం కలగాలి. అటువంటి సూక్ష్మబుద్ధిని నీవు కలిగిన వాడివై యుండాలి.

‘ఆత్మా సాక్షి’ – ముఖ్యమైనటువంటి, ఆత్మకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం - ఆత్మసాక్షి. అది కర్మను అంటదు. కర్మకు సాక్షి. దానికి కర్తృత్వాభిమానము లేదు, భోక్తృత్వాభిమానము లేదు. దానికి ఏ రకమైనటువంటి పరిమితులు లేవు. సర్వవ్యాపకమైనటువంటిది.

దానికి ఇహ పరములందు సుఖ ఆసక్తి లేదు. బాగా గుర్తుపెట్టుకోవల్సిన అంశం ఏమిటంటే, జీవుడిని నిరంతరాయంగా వెంబడించేటటువంటిది ‘సుఖ అపేక్ష’. ఆ సుఖాపేక్ష చేతనే, ఆ సుఖ ఆసక్తి చేతనే మానవులందరూ కూడా జీవులుగా వ్యవహరిస్తున్నారు. ఈ జీవభావము అన్నా, సుఖాపేక్ష అన్నా రెండూ ఒక్కటే. ఏమీ భేదము లేదు. ప్రయత్నించి ఈ సుఖాపేక్షను పోగొట్టుకోవాలి. ప్రయత్నించి సర్వకర్మ ఫలత్యాగము చేయాలి.

ప్రయత్నించి నిష్కామకర్మగా జీవించాలి. ప్రయత్నించి ఇంద్రియ జయాన్ని సంపాదించాలి. ప్రయత్నించి సాధన చతుష్టయ సంపత్తి సంపాదించాలి. ప్రయత్నించి ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి. ప్రయత్నించి ఆంతరికంగా చతుర్విధ శుశ్రూషలను చేయాలి. ప్రయత్నించి తన మనోబుద్ధులను తానే అధిగమించాలి.

ప్రయత్నించి తనలో ఉన్నటువంటి త్రిగుణ మాలిన్య ప్రభావము ఎలా ఉన్నది అనేది గ్రహించి, దానిని అధిగమించాలి. ప్రయత్నించి తనయందున్నటువంటి సంగత్వ దోషము ఏయే విషయములందు, ఏయే గుణములున్న తాదాత్మ్యముతో అనుభవిస్తున్నాడో గ్రహించి తప్పక ఆ రకమైనటువంటి సంగత్వదోషాన్ని పోగొట్టుకోవాలి. ఇవన్నీ సాధన సాధ్యములన్నమాట.

సాధన అంటే అర్థం ఏమిటంటే, ప్రతీ ఒక్కరూ ఏమనుకుంటారంటే, ఏదో కళ్ళు మూసుకుని కూర్చోవడము, లేకపోతే ప్రాణాయామము చేయడము, లేకపోతే యోగాసనాలు చేయడము, లేకపోతే ధ్యానము చేయడమో, లేకపోతే షోడశోపచార పూజలు చేయడమో, లేదంటే తీర్థయాత్రలు చేయడమో, లేదంటే స్తోత్ర పాఠాలు చదవడమో.... ఇలా వీటిని మాత్రమే సాధనలుగా లెక్క కడుతారన్నమాట.

ఇవన్నీ బహిరంగ సాధనలు. బాహ్యసాధనలన్నమాట. కాబట్టి, అట్టి బాహ్యసాధనలతో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేరు. తప్పక ప్రతి ఒక్కరూ ఆంతరిక పరిణామాన్ని సాధించాలి. అట్టి ఆంతరిక పరిణామాన్ని పొందిన తరువాత మాత్రమే అది వీలౌతుంది. ఈ సత్యాన్ని గ్రహించాలి.

ఈ ప్రపంచము విధాయక, ధారకమను అని రెండు శక్తులతో కూడియున్నది. బ్రహ్మ, క్షత్రములనబడు ఈ రెండు శక్తులును, ఆ ఆత్మకు అన్నమగుచున్నది. మరియు మృత్యువు అన్నములో నంజుకొను ఊరగాయ అగుచున్నది. అట్టి వానిని ఎవడు తెలుసుకొన గలరు? సాధన సంపత్తి కలవారే కానీ, ఇతరులు తెలుసుకొన లేరు.

ఇక్కడేమి చెబుతున్నారు? ఈ ప్రపంచంలో రెండు శక్తులున్నాయి - బ్రాహ్మము, క్షాత్రము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భుజబలంతో, శారీరక బలంతో, ప్రధానంగా ఉండేటటువంటి, రాజస లక్షణంతో ఉండేటటువంటి క్షాత్ర శక్తి ఒకటి. భౌతిక శక్తితో ప్రధానంగా ఉండేటటుంవంటి బ్రాహ్మీ శక్తి. ఈ రెండు శక్తులు కూడా ఈ ఆత్మకు అన్నమగుచున్నది. అంటే ఈ రెండు శక్తులను ఆత్మ భుజించి వేస్తుంది. అన్నం అంటే అర్థం అది.

ఈ రెండు బ్రాహ్మము, క్షాత్రము. ‘ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం’ అంటారు అన్నమాట దీనిని. పరుశురామ అవతారంలో ఈ రెండు శక్తులు కూడా ఒకే అవతారములో కూడుకుని ఉన్నాయి. ఇదం బ్రాహ్మం, ఇదం క్షాత్రం. మిగిలిన అవతారములలో ఏదో ఒక శక్తి మాత్రమే ఉన్నదన్నమాట. ఈ రెండు శక్తులు లేవు. కానీ ఈ విధాయక, ధారక. విధాయక అంటే, ఏది చేయాలి, ఏది చేయక్కర్లేదు అనేటటువంటి విజ్ఞతను బోధించేటటువంటి బ్రాహ్మీశక్తి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


22 Oct 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 63, 64 / Vishnu Sahasranama Contemplation - 63, 64


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 63, 64 / Vishnu Sahasranama Contemplation - 63, 64 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 63. మఙ్గళం పరమ్, मङ्गलं परम्, Maṅgaḷaṃ param 🌻

ఓం మఙ్గళాయ పరస్మై నమః | ॐ मङ्गलाय परस्मै नमः | OM Maṅgalāya parasmai namaḥ

ఇది రెండు పదాల నామము. మంగళం - విశేషము. పరం విశేష్యము. శుభకరమును, శుభస్వరూపమును, సర్వభూతములకంటే ఉత్కృష్టమును అగు బ్రహ్మ తత్త్వము.

:: విష్ణు పురాణము ::

అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం ।

స్మృతిమాత్రేణ య త్పుంసాం బ్రహ్మ తన్మంగలం విదుః ॥

ఏ బ్రహ్మము తన స్మరణమాత్రముచేతనే జీవుల అశుభములను తొలగించునో శుభనైరంతర్యమును (ఎడతెగని శుభములను) వర్ధిల్లజేయునో అటువంటి బ్రహ్మ తత్త్వమును 'మంగలం' అని తత్త్వవేత్తలు తలచుచున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 63🌹

📚. Prasad Bharadwaj

OM Maṅgalāya parasmai namaḥ

🌻 63. Maṅgaḷaṃ param 🌻

Maṅgaḷaṃ and param make one word as adjective and noun. Supremely auspicious. He is Maṅgaḷaṃ due to His auspicious form and param of all beings the highest, Brahma.

Viṣṇu purāṇa

Aśubhāni nirācaṣṭe tanoti śubha saṃtatiṃ,

Smr̥timātreṇa ya tpuṃsāṃ brahma tanmaṃgalaṃ viduḥ.

Brahman is known as Maṅgaḷaṃ, the beneficent, which wards off evils and dowers with series of good by being merely remembered.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 64/ Vishnu Sahasranama Contemplation - 64 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 64. ఈశానః, ईशानः, Īśānaḥ 🌻

ఓం ఈశానాయ నమః | ॐ ईशानाय नमः | OM Īśānāya namaḥ

ఈష్టే - సర్వభూతాని - స్వస్వవ్యాపారేషు నియమయతి - ప్రవర్తయతి సర్వ భూతములను తమ తమ వ్యాపరములయందు నియమించును లేదా ప్రవర్తిల్లజేయును.

:: శ్వేతాశ్వతరోపనిషత్ - తృతీయోఽఅధ్యాయః ::

సర్వేంద్రియగుణాభాసగ్‍ం సర్వేంద్రియ వివర్జితమ్ ।

సర్వస్య ప్రభుమ్ ఈశానం సర్వస్య శరణం సుహృత్ ॥ 17 ॥

బ్రహ్మతత్త్వమును సర్వేంద్రియ గుణములను భాసింపజేయునదిగన, సర్వేంద్రియములు లేనిదానిగను, సమస్తమునకు ప్రభునిగను, ఈశానునిగను, సకలమునకు నమ్మదగినదీ, శరణుజొచ్చదగినదిగనూ తెలిసికొనవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 64 🌹

📚. Prasad Bharadwaj

🌻 64. Īśānaḥ 🌻

OM Īśānāya namaḥ

Īṣṭe - sarvabhūtāni - svasvavyāpāreṣu niyamayati He who controls and regulates everything. Or by the reason of His controlling all things, He is called Īśānaḥ. 'Īś' implies 'to control'.

Śvetāśvataropaniṣat - Chapter 3

Sarveṃdriyaguṇābhāsagˈṃ sarveṃdriya vivarjitam,

Sarvasya prabhum īśānaṃ sarvasya śaraṇaṃ suhr̥t. (17)

He is shining through the functions of all the senses, yet without the senses, Lord of everything, the controller and is the most reliable refuge for all.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:

https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


22 Oct 2020