🌺 మహా జ్ఞానం (Messages from 40 masters) 🌺
🌷(మూలం:- C.అరుణ ---- అనువాదం:- D.రేవతిదేవి)🌷🌹 నానాజీ 🌹
◆ ఆధ్యాత్మికతలో సాహసాల వైపుకు ఎప్పుడైతే మనిషి ప్రయాణం ప్రారంభిస్తాడో ఆ సమయంలో అతనికి భవిష్యత్తులో తనకేది ప్రాప్త మున్నదో తెలియదు . అసలా మార్గంలో ఎలా వెళ్ళాలన్నది కూడా బొత్తిగా తెలియదు .
◆ నేనొక అమాయక బ్రాహ్మణుడిని . పేద మరాఠీ కుటుంబంలో పుట్టాను . మా వాళ్ళకి పూజలలో శ్రద్ధ మెండు . ఇంటిల్లిపాదీ నిత్యమూ దుర్గాదేవిని పూజించే వాళ్ళం . ఆమె మా ఇలవేల్పు . ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే నిత్యమూ పూజలు , పారాయణలు చేయమని మా పెద్దలు చెప్పారు . తెలివితేటలు లేకపోవటం , అజ్ఞానం , పొట్ట పొడిస్తే అక్షరం రాకపోవటం ఈ మూడింటి వల్ల మాకింకేమీ తెలుసుకునే అవకాశం లేకపోయింది . మా “ పెద్దలు ” చెప్పిన దాన్ని మేము గ్రుడ్డిగా అనుసరించేవాళ్ళం . కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రతీదీ తెలుసుకోవాలన్న ఆసక్తి , చిన్నపిల్లలందరిలాగా నేను కూడా ప్రతి విషయానికీ సంబంధించిన ప్రతి వివరం గురించి ప్రశ్నలు వేస్తూండే వాడిని .
◆ మా అమ్మ , నాన్న నేనే ఏదడిగినా ఎంతో ఓపిగ్గా వివరించే వాళ్ళు ! కానీ దుర్గాదేవికి సంబంధించిన ఒక చిన్న వివరం మాత్రం వాళ్ళెన్నడూ చెప్పే వాళ్ళు కాదు . నన్ను మందలించేవాళ్ళు . కొన్ని రకాల ప్రశ్నలు అడగవచ్చునట , మరికొన్ని రకాల ప్రశ్నలు అడగనే కూడదట . తల్లి దండ్రులెంత తమాషా మనుష్యులో కదా ?! ఇలాంటి వివరాలు వాళ్ళు పిల్లలతో చర్చించేటప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానం ఏపాటిదో తెలిసి పోతుంది . ఇక మీ బిడ్డ అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానమివ్వాలన్న శ్రద్ధ మీకుంటే మీరు చేయవలసిందల్లా ఓర్పుగా ఆలోచించి జవాబు ఇవ్వటమే . మీ బిడ్డ అడిగిన ప్రశ్న గురించి మీరేమనుకుంటున్నారో వాడికి జాగ్రత్తగా చెప్పాలి . అలా చేయటం వల్ల ఆ బిడ్డకు మీరు పదును పెట్టటమేగాక మీకే తెలీకుండా నిద్రాణంగా ఉన్న ఏదో జ్ఞానాన్ని తట్టి లేపడానికి ప్రయత్నిస్తారు .
◆ మా ఇంటి పరిస్థితులవల్ల నేను నా ప్రశ్నలకు సమాధానాలు ఇంకెక్కడో వెతుక్కోవలసి వచ్చింది . మొదట్లో గుళ్ళో పూజారికి మా కంటే ఎక్కువ తెలిసి ఉంటుందని అనుకున్నాను . అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నా ప్రశ్నలన్నీ ఆయన ముందుంచాను . ఆయన నాకు కేవలం రెండే విషయాలు చెప్పాడు .
● 1) “ చూడు నాయనా ! నువ్వు అడిగిన ప్రశ్నలకు నాకు సమాధానాలు తెలీవు . నాకు అసలలాంటి ఆలోచనలే ఎన్నడూ రాలేదు.
● 2) కళ్ళు మూసుకుని ఆలోచనలు లేకుండా కూర్చుంటే మానసికంగా ప్రశాంతత కలుగుతుంది అని ఒకప్పుడు నమ్మేవాడిని . ఈ రకమైన మానసిక స్థితి వల్ల నీ ప్రశ్నలకు సమాధానాలు నీకు దొరుకుతాయి అని నా మట్టుకు నేను అనుకుంటున్నాను.
◆ అప్పుడు నేననుకున్నాను . అలా అయితే వెంటనే అక్కడే గుళ్ళో కళ్ళు మూసుకుని కూర్చోవాలి . నాకు ధ్యానం గురించి బొత్తిగా ఏమీ తెలీదు . అయినా సరే ఓపిగ్గా కూర్చుని సమాధానాల కోసం ఎదురుచూస్తుండేవాడిని. సాయంత్రమయ్యే సరికి ఇంటికి వెళ్ళక తప్పదు . నా సాధన విజయవంతంగా పూర్తయ్యేవరకు మా ఇంట్లో ఎవ్వరికీ నా సాధన గురించి చెప్పటం నాకు ఇష్టం లేదు .
◆ అలా గుళ్ళో రోజూ కళ్ళు మూసుకుని కూర్చునేవాడిని . అలా మూడు రోజులు కూర్చున్నాక ఏదో వెలుతురు నావైపుకొస్తూ కనిపించింది . అది నా దగ్గరకొచ్చే కొద్దీ పెద్ద బంగారు కాంతిలాగా అయింది ! అందమైన స్త్రీ రూపంలోకి మారుతోంది ! ఆ అందాన్నీ , ఆ కళనూ చూసి ముగ్ధుడి నయ్యాను . “ సరే . ఈమె వచ్చింది కదా . ఈమెకే నా ప్రశ్నలు వేస్తాను ” అనుకున్నాను . ఆమె చిరునవ్వు నవ్వింది . ధ్యాన విధానం చెప్పింది నాకు . తాను రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పింది . ఆమె చెప్పిన దాన్ని నేను శ్రద్ధగా పాటించాను . మూడవరోజు మళ్ళీ వచ్చింది . తానే నా గురువుననీ , ఆధ్యాత్మిక విషయాల్లో నేను ఏమేం తెల్సుకోవాలనుకుంటున్నానో అదంతా తానే నాకు చెబుతాననీ , అన్నింటినీ అర్ధం చేసుకునేలా నేను ఎదగడానికి సాయం చేస్తాననీ చెప్పింది .
◆ అలా నేను ధ్యానం మొదలుపెట్టాను ! నేను ధ్యానం మొదలు పెట్టేటప్పటికి నా వయస్సు పదకొండేళ్ళు ! తొమ్మిదేళ్ళల్లో ఆమె నన్ను మాస్టర్ గా చేసింది . నాకు ఇరవయ్యేళ్ళు వచ్చేటప్పటికి నేను బోధించడానికి సిద్ధంగా ఉన్నానని నా గురువు . అందరూ , నేనూ అనుకున్నాము . నా గురువు దగ్గర సాగిన నా తొమ్మిదేళ్ళ శిక్షణా కాలంలో ఆమె నాకు ఇతర లోకాల గురించి నేర్పింది . మరణానంతర జీవితం , సూక్ష్మశరీర ప్రయాణంలోని అద్భుతాలు , మూడవ కన్ను ప్రాధాన్యత , మానవుల స్వచ్ఛత , సాధనలోనూ సమాజ జీవనంలోనూ సమతులంగా తొణక్కుండా ఉండాల్సిన అవసరం . స్వయంగా ఇతరులకు విద్య నేర్పడంలోని ప్రాధాన్యత , ఇతర ధ్యానుల్ని గౌరవిస్తూ వారి నుంచి నేర్చుకోవటం , ఇతర మాస్టర్ను కలుసుకుని పరిచయాలు పెంచుకోవటం , ధ్యానంలో కొత్తగా పైకొచ్చే వాళ్ళను కల్సుకుని వారి అనుభవాలు వినటం , ఇతరుల సమస్యల్ని అర్ధం చేసుకుని వాటి నుంచి నేర్చుకోవటం , నిర్భయంగా ప్రతి సమస్యనూ మన ఆధ్యాత్మిక విద్యకూ , ఆత్మ ఎదుగుదలకూ సాధనంగా లెక్కగట్టడం - ఇవన్నీ నేర్పిందామె నాకు .
◆ అవన్నీ అనుభవాలు కూడా కలిగించింది . ఇంకా ఎన్నెన్నో చేయించింది . వాటిల్లో చాలా వాటిని పైన చెప్పటం మరచిపోయాను . మీకు నేను ముఖ్యంగా చెప్పదల్చుకున్నది ధ్యాన ఫలితాల గురించి .
◆ నాకు నేను సహాయం చేసుకోవటమే కాదు మా కుటుంబ సభ్యులకూ , సమాజంలో ఇతరులకూ కూడా సహాయం చేయగలిగాను . అంతేకాదు . మన సృష్టికర్త నాకు ఇచ్చిన అపూర్వమైన అపురూపమైన బహుమతిలా కనిపించసాగింది నా జీవితం మొత్తం ! మనసంతా ప్రకృతి ఏర్పరచిన అద్భుత యంత్రాలం ! మానవత్వంలో మౌలిక లక్షణాలైన “ ప్రేమ ” , “ పరస్పర సానుభూతి " అనే వాటిని మనందరం మరచిపోయి వాటినే ద్వేషం , అసూయ అనే వాటితోనే మన మనస్సులు నింపు కున్నాం .
◆ మనం ధ్యానం చేస్తే తప్ప ప్రకృతిలా ఆనందంగా ఉండలేము ! ధ్యానం చేస్తే తప్ప ప్రశాంతంగా జీవించలేము ! ప్రశాంతంగా చావలేము ! భూమి మీద జీవితం సౌరభాలు చిందేది కేవలం మన అంతర్ జ్ఞానాన్ని తట్టి లేపినప్పుడే , మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకున్నప్పుడే . మీరు ధ్యానం చేయనంతవరకు ఈ మౌలిక విషయాలను అర్ధం చేసుకోవడానికీ , మీ జీవితాలను అందంగా చేసుకోవడానికీ కావలసినంత అంతరిక్ష శక్తి మీకు రాదు .
◆ చూడండి మిత్రులారా ! ఈ జీవితం మీరు ప్లాన్ చేసుకుని వచ్చింది . అంతా మీ చేతుల్లోనే ఉంది . అవగాహన , తెలివితేటలు పెంచుకుని దానిని స్వర్గతుల్యం చేసుకుంటారో , అజ్ఞానానికీ అపార్థాలకూ తావిచ్చి దుఃఖభరితమైన నరకంగా చేసుకుంటారో మీ ఇష్టం . ధ్యానం చేయాలని , బ్రతికే అద్భుత విధానాన్ని తెల్సుకోవాలనీ మీరు గట్టిగా నిర్ణయించుకోక పోతే దుర్భరమైన చావు చస్తారు . దుర్భరంగా పశ్చాత్తాప పడి అంత కంటే దుర్భరంగా మళ్ళీ వచ్చి పుడతారు . అప్పుడు ధ్యానం ద్వారా నిద్రాణంగా ఉన్న జ్ఞానాన్ని తట్టిలేపడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు మళ్ళీ .
◆ మీరు తెలుసుకోవాలని చెబుతున్నాను . మరాఠా రాజు శివాజీకి ఆధ్యాత్మిక గురువును నేను . ప్రస్తుతం నేను ఇతర లోకాల నమూనాలనూ , వ్యవస్థలనూ చూడటంలో మునిగి ఉన్నాను . భూమి మీద చనిపోయిన వారిని వారి వారి ఎదుగుదలకు బట్టి ఆ యా లోకాలకు వాళ్ళను పంపే పనిలో నిమగ్నమై ఉన్నాను . వాలి చేసేదానికీ , నేను చేసే దానికీ కొద్దిగా తేడా ఉంది . ప్రస్తుతం నేనతని మాస్టర్ ని. ఒక్కొక్కరిని ఎక్కడికి పంపాలో అతనికి చెబుతూంటాను . - ఆ లోకాలన్నీ నేను బాగా తెల్సుకున్నాను కాబట్టి .
06 Nov 2021