మైత్రేయ మహర్షి బోధనలు - 23
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 23 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 15-1. ప్రాథమిక దీక్ష 🌻
రక్తసంబంధపు సోదరత్వమే అంతంత మాత్రముగ మిగిలి యున్న ఈ రోజులలో విశ్వమానవ సోదరత్వము అనెడి భావము హాస్యముగ తోచవచ్చును. దైనందిన జీవితమున తా నెదుర్కొను
ప్రతి జీవి యందును తన సోదరుని చూచుట సాధకునకు మేమందించు ప్రాథమిక దీక్ష.
ఎదుటి జీవియందు ముందు సోదరుని గుర్తింపుము. ఆ తరువాత లౌకిక సంబంధములను గుర్తింపవచ్చును. సమస్త జీవకోటి ప్రకృతి నుండి వ్యక్తమైనదే కావున జీవులందరూ సహోదరులే. ఇతరుల దృక్పథముతో సంబంధము లేకయే ఈ దీక్షలను నిర్వర్తించుకొన వచ్చును. అనగా ఇతరులు నిన్ను సోదరునిగ గుర్తించ కున్నను నీవు సోదరుని గుర్తించుట ఒక దీక్ష. యుధిష్ఠిరుడు అట్టి దీక్షనే నిర్వర్తించెను. కనుకనే దివ్య లోకములయందు కూడ గౌరవింప బడెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
06 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment