🌹 18, JULY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 18, JULY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, JULY 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 400 / Bhagavad-Gita - 400 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 28 / Chapter 10 - Vibhuti Yoga - 28 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 247 / Agni Maha Purana - 247 🌹 
🌻. శివ పూజా విధి వర్ణనము - 3 / Mode of worshipping Śiva (śivapūjā) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 112 / DAILY WISDOM - 112 🌹 
🌻 21. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం యొక్క అధ్యయనం / 21. The Study of Man is the Study of Consciousness 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 378 🌹*
6) 🌹. శివ సూత్రములు - 114 / Siva Sutras - 114 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 17 / 2-07. Mātrkā chakra sambodhah   - 17 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 18, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : అధిక మాసం ప్రారంభం, Adhik Maas Begins🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 12 🍀*

*24. ధ్యాతా ధ్యేయో జగత్సాక్షీ చేతా చైతన్యవిగ్రహః |*
*జ్ఞానదః ప్రాణదః ప్రాణో జగత్ప్రాణః సమీరణః*
*25. విభీషణప్రియః శూరః పిప్పలాశ్రయసిద్ధిదః |*
*సిద్ధః సిద్ధాశ్రయః కాలః కాలభక్షకపూజితః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అహంకార పూర్వక ప్రేమ కూడదు - పూర్ణయోగ సాధనలో అహంకార పూర్వకమైన ప్రేమకు తావులేదు. ఆహంకారం దెబ్బతిన్నా, అసంతృప్తి చెందినా ప్రేమించడం మాని వేయడం, లేక కక్షపూని ద్వేషించడం – ఇదీ అహంకార పూర్వక ప్రేమ స్వభావం. నిక్కమైన ప్రేమకు మూలంలో సుస్థిరైక్యం భాసిస్తుంది. కామప్రవృత్తి కాలుష్యాలను సాధకుడు తనలో నిలువనీయ రాదనేది వేరుగ చెప్పనక్కరలేదు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 26:11:04 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: పుష్యమి 31:58:20 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: హర్షణ 09:35:14 వరకు
తదుపరి వజ్ర
కరణం: కింస్తుఘ్న 13:05:33 వరకు
వర్జ్యం: 14:07:20 - 15:54:24
దుర్ముహూర్తం: 08:27:18 - 09:19:30
రాహు కాలం: 15:37:58 - 17:15:50
గుళిక కాలం: 12:22:13 - 14:00:05
యమ గండం: 09:06:27 - 10:44:20
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 24:49:44 - 26:36:48
సూర్యోదయం: 05:50:42
సూర్యాస్తమయం: 18:53:43
చంద్రోదయం: 06:04:28
చంద్రాస్తమయం: 19:36:30
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: వర్ధమాన యోగం -
ఉత్తమ ఫలం 31:58:20 వరకు
తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 400 / Bhagavad-Gita - 400 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 28 🌴*

*28. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |*
*ప్రజనశ్చాస్మి కందర్ప: సర్పాణామస్మి వాసుకి: ||*

*🌷. తాత్పర్యం : నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మథుడను మరియు సర్పములలో వాసుకుని అయి యున్నాను.*

*🌷. భాష్యము : నిక్కముగా మహాత్తరమగు ఆయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యము వహించును. ఆధ్యాత్మిక జగము నందలి కృష్ణలోకమున ఎప్పుడు కోరినను, ఎంత కోరినను క్షీరము నొసగగల గోవులు అసంఖ్యాకములుగా కలవు. అటువంటి గోవులు ఈ భౌతికజగమున లేవు. అవి కృష్ణలోకమున ఉన్నట్లుగా మాత్రము పేర్కొనబడినది.*

*“సురభి” నామము గల ఆ గోవులను శ్రీకృష్ణభగవానుడు పెక్కింటిని కలిగియుండి వానిని గాంచుట యందు నిమగ్నుడై యుండుననియు తెలుపబడినది. సత్సాంతానము కొరకై కలిగెడి కామవాంఛ కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణుని ప్రతినిధి. కొన్నిమార్లు మైథునక్రియ కేవలము ఇంద్రియభోగము కొరకే ఒనరింపబడుచుండును. అదియెన్నడును కృష్ణునికి ప్రాతినిధ్యము వహింపదు. కేవలము సత్సాంతానప్రాప్తికై ఒరరింపబడెడిదే కందర్పునిగా పిలువబడి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 400 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 28 🌴*

*28. āyudhānām ahaṁ vajraṁ dhenūnām asmi kāma-dhuk*
*prajanaś cāsmi kandarpaḥ sarpāṇām asmi vāsukiḥ*

*🌷 Translation : Of weapons I am the thunderbolt; among cows I am the surabhi. Of causes for procreation I am Kandarpa, the god of love, and of serpents I am Vāsuki.*

*🌹 Purport : The thunderbolt, indeed a mighty weapon, represents Kṛṣṇa’s power. In Kṛṣṇaloka in the spiritual sky there are cows which can be milked at any time, and they give as much milk as one likes. Of course such cows do not exist in this material world, but there is mention of them in Kṛṣṇaloka. The Lord keeps many such cows, which are called surabhi. It is stated that the Lord is engaged in herding the surabhi cows. Kandarpa is the sex desire for presenting good sons; therefore Kandarpa is the representative of Kṛṣṇa. Sometimes sex is engaged in only for sense gratification; such sex does not represent Kṛṣṇa. But sex for the generation of good children is called Kandarpa and represents Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 247 / Agni Maha Purana - 247 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*

*🌻. శివ పూజా విధి వర్ణనము - 3 🌻*

*ఈ భూతశుద్ధికి సంబంధించిన విశేషవివరణము వినుము. భూమండల స్వరూపము చతుష్కోణాకారము. దాని రంగు సువర్ణము వలె పచ్చగా ఉండును. అది కఠిన ముగ నుండుటయే గాక వజ్రచిహ్నముతోను, 'హాం' అను తన బీజముతోను కూడికొని యున్నది. దీనిలో 'నివృత్తి' అను కళ ఉన్నది. (శరీరమున పాదములు మొదలు మోకాళ్లవరకును భూమండల మున్నది.) ఈ విధమున పాదములు మొదలు శిరస్సువరకు శరీరమునందు పంచమహాభూతముల భావన చేయవలెను. ఈ విధముగ పంచగుణయుక్తము లగు వాయు - భూ మండలముల చింతకన చేయవలెను.*

*జలస్వరూపము అర్ధచంద్రాకారము. అది ద్రవస్వరూపము. చంద్రమండలమయము. దానివర్ణము ఉజ్జ్వలము. అది రెండు కమలములచే చిహ్నితము. 'హ్రీం' బీజముతో కూడినది. ''ప్రతిష్ఠా'' అను కల గలది. వామదేవ-తత్పురుషమంత్రములతో సంయుక్తమగు జలతత్త్వము నాలుగు గుణములతో కూడినది. దానిని ఈ విధముగ (మోకాళ్లు మొదలు పాదాల వరకు) చింతనము చేయుచు వహ్ని స్వరూపమునందు లీనముచేసి శోధన చేయవలెను. అగ్ని మండలము త్రికోణాకారము. రంగు ఎరుపు. (అది నాభినుండి హృదయమువరకును ఉండును). అది స్వస్తికచిహ్నయుక్తము. దానియందు 'హూం' బీజము అంకిత మై యుండును. అది విద్యాకలాస్వరూప మైనది. దాని మంత్రము అఘోరమంత్రము. ఇది మూడు గుణములతో కూడిన జలభూతము. ఈ విధముగ భావించి అగ్ని తత్త్వమును శోధించవలెను. వాయుమండలము షట్కోణాకారము (హృదయము మొదలు కనుబొమ్మలవరకును ఉండునది) అది ఆరు బిందువులచే చిహ్నితమైనది. రంగు నలుపు. 'హైం' బీజము తోడను, సద్యోజాతమంత్రముతోడను యుక్తమై యున్న అది శాంతికలాస్వరూపమైనది. దానిలో రెండు గుణములున్నవి. అది పృథ్వీభూతము. ఈ విధముగ భావన చేసి వాయుతత్త్వమును శోధింపవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 247 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 3 🌻*

17. One should merge the earth, wind, water, fire and sky, one into the other without any deviation in the order. You hear about it now!

18. The principle of earth is hard, of yellowish colour and bears the mark of thunderbolt. Then its destruction is wrought by the subtle mantra of the soul (namely) hauṃ.

19. The entire body from foot to head should be contemplated as a four-sided figure, and the principle of wind should be meditated therein by five stretches of retention of breath.

20. This principle which has been established with the principal syllable hrīṃ should be contemplated as of half-crescent-shaped in a liquid state, white in colour, beautiful and impressed with (the figure of) the lotus.

21. The reverential principle of fire which is causeless and which is the end of men, should be purified by four stretches of retention of breath along with the Rāma mantra.

22. The orb of fire should be conceived as three-sided, red (in colour), marked with (the sign of) svastika and as the form of knowledge and endowed with the principal syllable hūṃ.

23. The principle of water should be purified by means of three stretches of awful minuteness. The orb of wind (principle) (should be conceived) as marked with six dots.

24. It should be meditated as composed of tranquility, black in colour and endowed with the principal syllable of hrīṃ (and purified) by two stretches (of retention of breath). The principle of earth should be purified.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 112 / DAILY WISDOM - 112 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 21. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం యొక్క అధ్యయనం 🌻*

*జీవిత ప్రక్రియలు, స్థూలంగా చెప్పాలంటే, రాజకీయాలు, ప్రపంచ చరిత్ర, సామాజిక శాస్త్రం, నీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, సౌందర్యశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం రంగాలలో అధ్యయనం చేయబడినవి. మనిషితో అనుసంధానించబడిన ప్రతి జీవితపు కోణం ఈ రూపురేఖలలోనే గ్రహించబడవచ్చు. అయితే ఇదంతా చైతన్యానికి సంబంధించినదై ఉండాలి; లేకపోతే, అవి అధ్యయన అంశాలుగా లేదా అనుభవ వస్తువులుగా కూడా ఉండవు.*

*కాబట్టి మనిషి సమస్య అంతా చైతన్యం యొక్క సమస్య. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం. చైతన్యాన్ని విభజించడం సాధ్యం కాదు కాబట్టి చైతన్య భాగాలు అనేవి ఉండవు. కాబట్టి చైతన్యం అవిభాజ్య కాబట్టి, జీవితం అంతా ఈ అనంత చైతన్యం తనలో తాను ఆడిన ఆట అనే చెప్పవచ్చు. ఉనికి మరియు చైతన్యాన్ని గుర్తించడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 112 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 21. The Study of Man is the Study of Consciousness 🌻*

*The processes of life are, broadly speaking, those which are studied in the fields of politics, world history, sociology, ethics, economics, aesthetics, psychology, biology, chemistry, physics and astronomy. Everything connected with man can be said to be comprehended within this outline of the framework of life’s activity. But all this has to be related to consciousness; else, they would not exist even as subjects of study or objects of experience.*

*The problem of man is therefore the problem of consciousness. The study of man is the study of consciousness. Since it is impossible to conceive a real division of consciousness within itself, it is also not possible to imagine that there can be real objects of consciousness. If there are no such real objects, the whole of life would be a drama played by consciousness within itself in the realm of its infinite compass. There cannot be a greater joy than the identification of existence and consciousness.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 378 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నీ శాశ్వతత్వాన్ని గుర్తించడానికి హృదయమే మార్గం. ఒకసారి మరణం లేదని గుర్తించిన క్షణం జీవితం మారిపోతుంది. జీవితంలోకి అపూర్వ లక్షణాలు అడుగు పెడతాయి. 🍀*

*నువ్వు ఎంతగా 'తల'కు అతుక్కుని వుంటే అంతగా హృదయాన్ని మరచిపోతావు. దేవుడు హృదయం గుండా తెలుస్తాడు. సత్యం హృదయం ద్వారా తెలిసి వస్తుంది. హృదయం అస్తిత్వాన్ని గ్రహించడానికి ఆరంభం. సముద్ర అనుభవానికి బిందువు. మనిషి శాశ్వతమైన వాడు.*

*వాస్తవానికి మరణం లేదు. కానీ దాన్ని 'మేథ'తో గుర్తించడం ఎలా? అది హృదయమార్గం. నీ శాశ్వతత్వాన్ని గుర్తించడానికి హృదయమే మార్గం. ఒకసారి మరణం లేదని గుర్తించిన క్షణం జీవితం మారిపోతుంది. జీవితంలోకి అపూర్వ లక్షణాలు అడుగు పెడతాయి. అవి నాట్యం, గానం, కవిత్వం, ఉత్సవం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 114 / Siva Sutras - 114 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 17 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*అచ్చులు మరియు హల్లులు కాకుండా, కొన్ని అక్షరాలను ఉభయాక్షరములు అంటారు. య, ర, ల మరియు వ ఈ వర్గంలోకి వస్తాయి. ఈ నాలుగు అక్షరాలు శివుని చుట్టుముట్టిన ఆరు కవచాలను ఏర్పరుస్తాయి. తద్వారా అతని స్వాభావిక వైభవాన్ని నిష్ణాతులైన ఆత్మలు గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఆ ఆరు కవచాలు కాల, విద్య, రాగ, కాల, నియతి మరియు మాయ. వాటిని కనుకా అని కూడా అంటారు. కాల కాలాన్ని సూచిస్తుంది, గతం యొక్క కొలమానం, వర్తమానం యొక్క ఆనందాన్ని ఇస్తుంది మరియు భవిష్యత్తు కోసం నిల్వ ఉన్న వాటిని కలిగి ఉంటుంది. కర్మని నియమబద్థీకరించడం నియతి చేస్తుంది. కాల చర్యను ప్రేరేపిస్తుంది, విద్య తెలివికి బాధ్యత వహిస్తుంది. ఇంద్రియ అవగాహనలకు రాగం బాధ్యత వహిస్తుంది. సంశయం, అజ్ఞానం మరియు భ్రాంతిని మాయ ప్రేరేపిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 114 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07.  Mātrkā chakra sambodhah   - 17 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*Apart from vowels and consonants, some letters are known as semi-vowels. Ya, ra, la and va (य र ल व) fall under this category. These four letters give rise to six coverings that surround Śiva, blocking His inherent splendour to be perceived by nescient souls. The six coverings are kalā, vidyā, rāga, kāla, niyati and māyā. They are also known as kañuca. Kāla refers to time, a measurement of past, gives enjoyment of the present and contains what is in store for the future. Niyati is responsible in fixing the order and sequence of karma. While kalā induces action, vidyā is responsible for intelligence. Rāga is responsible for sensory perceptions and māyā is responsible for inducing doubt, ignorance and illusion.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 464. 'కాంతిమతి' - 3 🌻


పదార్థమయమగు విషయము లందాసక్తి కలిగిన మనస్సునకు కళాకళ లుండును. దివ్యమున కుమ్ముఖము చెందిన మనస్సునకు పూర్ణకళ యుండును. మనస్సు అద్దము వంటిది. దానిని భూమికి ఉన్ముఖము చేసిన పదార్థమయ రూపము గోచరించును. చెట్టు, పుట్ట, కొండ, కోతి కనిపించును. ఆకాశమునకు అద్దము నున్ముఖము చేసినచో వెలుగే ప్రతిబింబించును. ఆకాశమున విహరించు జీవులు కూడ గోచరించెదరు. ఇట్లు మనసు ఉన్ముఖత్వమును బట్టి కాంతివంతమగుట, కాంతిహీన మగుట జరుగును. యోగీశ్వరులు, పరమహంసలు, సిద్ధులు, దివ్య పురుషులు కాంతిమతులు. ఇక శ్రీమాత కాంతిమతి అనుట యందు ఎట్టి విశేషము లేదు. ఆమె సతతము శివుని యందే యున్నది. ఆమె శాశ్వత కాంతిమతి. ఇతర జీవులు ఆమె అనుగ్రహమున కాంతిమతులగు చున్నారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 464. 'Kantimati' - 3 🌻


A mind that is oriented to the materialistic things have these phases. A mind that is focused on the divine will be always full. Mind is like a mirror. If it is only oriented to the physical objects, it sees only physical objects. If the mirror is turned towards the sky, the light will be reflected. Even the living beings who wander in the sky are seen. Thus, depending on the disposition of the mind, there will be light and darkness. Yogiswaras, paramahamsas, siddhas, divine men are luminaries. There is no doubt Srimata being called Kantimati. Her eternity belongs to Lord Shiva. She is an eternal light. Other beings became luminaries by her grace.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 14. GRACE / ఓషో రోజువారీ ధ్యానాలు - 14. దయ




🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 14 / Osho Daily Meditations - 14 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 14. దయ 🍀

🕉. దయ అందాన్ని తెస్తుంది -- దయ అంటే మొత్తం విశ్రాంతిని చుట్టుముట్టే ప్రకాశం అని అర్థం. 🕉


మీరు ఆకస్మికంగా కదిలితే, ప్రతి క్షణం అది ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. ఈ క్షణం తదుపరిది నిర్ణయించ బడదు, కాబట్టి మీరు ప్రతి దానికి సిద్ధంగా ఉంటారు. తదుపరి క్షణం దాని స్వంత ఉనికిని నిర్ణయిస్తుంది; మీకు ప్రణాళిక లేదు, నమూనా లేదు, నిరీక్షణ లేదు. ఈ రోజు సరిపోతుంది; రేపటి కోసం లేదా తదుపరి క్షణం కోసం కూడా ప్రణాళిక చేయవద్దు. ఈ రోజు ముగుస్తుంది, ఆపై రేపు తాజాగా మరియు అమాయకంగా వస్తుంది, ఎటువంటి తికమక లేకుండా. ఇది దాని స్వంత ఒప్పందంతో మరియు గతం లేకుండా తెరుచుకుంటుంది. ఇది కృప.

ఉదయం పూవు విడవవడాన్ని చూడండి. చూస్తూనే ఉండండి... ఇది కృప. అస్సలు శ్రమ లేదు- పువ్వు ప్రకృతికి అనుగుణంగా కదులుతుంది. లేదా అప్రయత్నంగా, దాని చుట్టూ విపరీతమైన లావణ్య౦తో పిల్లిని మేల్కొనడం చూడండి. ప్రకృతి అంతా దయతో నిండి ఉంది, కానీ లోపల విభజనల కారణంగా మనం మనోహరంగా ఉండే సామర్థ్యాన్ని కోల్పోయాము. కాబట్టి కదలండి మరియు ఈ క్షణాన్ని నిర్ణయించు కోనివ్వండి--దానిని నిర్వహించడానికి ప్రయత్నించవద్దు. దీనినే నేను వదలడం (లెట్-గో) అని పిలుస్తాను - మరియు ప్రతిదీ దీని నుండి జరుగుతుంది. అవకాశం ఇవ్వండి!


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 14 🌹

📚. Prasad Bharadwaj

🍀 14. GRACE 🍀

🕉. Grace brings beauty -- Grace simply means the aura that surrounds total relaxation. 🕉


If you move spontaneously, each moment itself decides how it will be. This moment is not going to decide for the next, so you simply remain open-ended. The next moment will decide its own being; you have no plan, no pattern, no expectation. Today is enough; don't plan for tomorrow, or even for the next moment. Today ends, and then tomorrow comes fresh and innocent, with no manipulator. It opens of its own accord, and without the past. This is grace.

Watch a flower opening in the morning. Just go on watching ... this is grace. There is no effort at all- the flower just moves according to nature. Or watch a cat awakening, effortlessly, with a tremendous grace surrounding it. The whole of nature is full of grace, but we have lost the capacity to be graceful because of the divisions within. So just move, and let the moment decide--don't try to manage it. This is what I call it let-go --and everything happens out of this. Give it a chance!


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 760 / Sri Siva Maha Purana - 760


🌹 . శ్రీ శివ మహా పురాణము - 760 / Sri Siva Maha Purana - 760 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴

🌻. దేవాసుర యుధ్ధము - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను - మరల అచటకు మచ్చిన ఆ రాక్షసుని గాంచి ఇంద్రాది దేవతలందరు భయముతో వణుకుతూ శీఘ్రముగా పలాయనమును చిత్తగించిరి (1). వారందరు బ్రహ్మగారిని ముందిడు కొని వైకుంఠమునకు వెళ్లి నమస్కరించి స్తుతించిరి (2).

దేవతలిట్లు పలికిరి - ఇంద్రియములకు ప్రభువైన వాడా! హేభగవాన్‌! గొప్ప బాహువులు గలవాడా! మధువు అను రాక్షసుని సంహరించిని వాడా! దేవదేవా! ఈశ్వరా! రాక్షసుల నందరినీ నశంపజేసినవాడా! నీకు నమస్కారము (3). హే విష్ణో! సత్యవ్రతుడనే పుణ్యశీలుడగు రాజుతో గుడి ప్రలయ కాలమునందు మత్స్యరూపముతో సముద్రమునందు విహరించి వేదములను కాపాడిని నీకు నమస్కారము (4). సముద్రమును మథించుటకు దేవతలు పెద్ద యత్నమును చేయుచుండగా కూర్మరూపమును దాల్చి మందరపర్వతమును మోసిన నీకు నమస్కారము (5). హే భగవాన్‌! నాథా! యజ్ఞవరాహరూపమును దాల్చి జనులకు ఆధారమైన బూమిని శిరస్సుపై ధరించిన నీకు నమస్కారము (6).

హే ప్రభో! వామనావతారములో నీవు ఇంద్రుని సోదరుడవై బ్రహ్మణ వేషముతో రాక్షసరాజైన బలిని మోసగించి బ్రహ్మాండమునంతనూ నీ అడుగులతో వ్యాపించినవు. అట్టి నీకు నమస్కారము (7). పాపులను సంహరించు నీవు పరశురాముడవై తల్లి హితము కొరకు క్రోధముతో భూమియందు క్షత్రియులు లేకుండగా చేయుటకు ఉద్యమించితివి. అట్టి నీకు నమస్కారము (8). లోకుల మనస్సులను రంజింప చుయువాడు, మర్యాదాపురుషోత్తముడు, సీతాపతి అగు రాముని రూపమును దాల్చి రావణుని సంహరించిన నీకు నమస్కారము (9).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 760🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴

🌻 The battle of the gods - 1 🌻



Sanatkumāra said:—

1. On seeing the Asura coming again, the gods including Indra trembled with fear. They fled together.

2. With Brahmā at the head they went to Vaikuṇṭha. All of them including Prajāpati eulogised Viṣṇu after bowing down to him.


The gods said:—

3. O Hṛṣīkeśa of long arms, O lord, O slayer of Madhu, O lord of gods, Obeisance to you, O destroyer of all Asuras.

4. O Viṣṇu, of the form of fish[1] who redeemed the Vedas through king Satyavrata, obeisance to you who sport about in the ocean of Dissolution.

5. Obeisance to you of the form of Tortoise who bore the mountain Mandara of the gods who were attempting to churn the ocean.

6. Obeisance to you O holy lord, of the form of Boar. Obeisance to you who hold the earth, the support of people. Obeisance to Viṣṇu.

7. Obeisance to you, the Dwarf. Obeisance to Viṣṇu the younger brother of Indra, the lord who deceived the king of Asuras in the guise of a Brahmin.

8. Obeisance to Paraśurāma who exterminated the Kṣattriyas, who rendered help to your mother. Obeisance to you who are angry and inimical to the evil beings.

9. Obeisance to Rama who delighted the worlds and who set the limits of decent behaviour. Obeisance to you the destroyer of Rāvaṇa and the lord of Sītā.



Continues....

🌹🌹🌹🌹🌹



విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 799 / Vishnu Sahasranama Contemplation - 799


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 799 / Vishnu Sahasranama Contemplation - 799🌹

🌻799. సర్వవిజ్జయీ, सर्वविज्जयी, Sarvavijjayī🌻

ఓం సర్వవిజ్జయినే నమః | ॐ सर्वविज्जयिने नमः | OM Sarvavijjayine namaḥ


సర్వార్థ విషయం జ్ఞాన మసాస్తీతి స సర్వవిత్ ।
రాగాదీనాన్తరాన్ బాహ్యాన్ హిరణ్యాక్షాదికానరీన్ ॥

దుర్జయాన్ జేతు మప్యస్య శీలమస్తీత్యతో జయీ ।
జయీ చ సర్వవిచ్చాసా వుచ్యతే సర్వవిజ్జయీ ॥

జిదృక్షీత్యాది పాణిని వచనాదిని రుష్యతే ॥


ఈతడు సర్వ విదుడును, జయియును. సర్వమును, తెలియ వలసినదంతయును, ప్రతియొకదానిని ఎరుగువాడు. సర్వవిషయకమగు జ్ఞానమును ఈతనికి గలదు. లోనుండెడి అభ్యంతరములు అగు రాగాది ద్వేషము, కామ క్రోధాదికము మొదలగు శత్రువులను, బాహ్యులగు హిరణ్యాక్షాదులను - ఇట్లు రెండు విధములగు శత్రువులను జయించుట తన శీలముగా కలవాడు గావున 'జయీ'. ఇట్లు పరమాత్ముడు సర్వ విషయక జ్ఞానమును సమగ్రముగా కలిగిన వాడును, ఎన్నడును ఓటమిని ఎరుగని జయశీలుడును అను అర్థము ఈ నామమునకు ఏర్పడుచున్నది. ఈ రెండు శబ్దములును ఒకే నామముగా గ్రహింపదగినవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 799🌹

🌻799. Sarvavijjayī🌻

OM Sarvavijjayine namaḥ


सर्वार्थ विषयं ज्ञान मसास्तीति स सर्ववित् ।
रागादीनान्तरान् बाह्यान् हिरण्याक्षादिकानरीन् ॥

दुर्जयान् जेतु मप्यस्य शीलमस्तीत्यतो जयी ।
जयी च सर्वविच्चासा वुच्यते सर्वविज्जयी ॥

जिदृक्षीत्यादि पाणिनि वचनादिनि रुष्यते ॥


Sarvārtha viṣayaṃ jñāna masāstīti sa sarvavit,
Rāgādīnāntarān bāhyān hiraṇyākṣādikānarīn.

Durjayān jetu mapyasya śīlamastītyato jayī,
Jayī ca sarvaviccāsā vucyate sarvavijjayī.

Jidr‌kṣītyādi pāṇini vacanādini ruṣyate.


In one Name, He being both Sarvavit and Jayī, He is Sarvavijjayī. Everything, what all can be known about, each and every aspect is known to Him. He has knowledge of everything hence Sarvavit. He has conquered the internal enemies like anger, greed etc., and also external adversaries like Hiraṇyākṣā and others, He is called Jayī.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr‌ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 207 / Kapila Gita - 207


🌹. కపిల గీత - 207 / Kapila Gita - 207 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 17 🌴

17. మహతాం బహుమానేన దీనానామనుకంపయా|
మైత్ర్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ॥


తాత్పర్యము : మహాత్ములయెడ గౌరవభావమును,దీనుల యెడ కనికరమును చూపవలెను. తనతో సమానుని యందు మైత్రిని నెరపవలెను. యమ, నియమములను పాటింపవలెను.

వ్యాఖ్య : అసంగం కలగాలంటే పెద్దలను సేవించాలి, దీనులని చూచి జాలి చూపాలి. అసూయ అమర్షమూ ద్వేషమూ - ఇవే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపములు. పక్కవాడికి మనకన్నా ఏదో కొద్దిగా ఎక్కువ ఉంది అనగానే మనకు కలిగేది అసూయ. మనకంటే గొప్పవాన్ని చూస్తే అసూయ, మనకన్నా చిన్నవాన్ని చూస్తే అసహనం కలుగుతుంది. మనతో సమానున్ని చూస్తే అమర్షం కలుగుతుంది (ఉదా వాడు నా అంత వాడా? ) మనకంటే గొప్పవాన్ని చూసి సంతోషించాలి (మహతాం బహుమానేన), మనకంటే చిన్న వాడిని చూచి జాలిపడాలి (దీనానామనుకమ్పయా), మనతో సమానుడితో మైత్రి సలుపు (మైత్ర్యా చైవాత్మతుల్యేషు). ఇవి కలగాలంటే యమ నియమాదులు కలగాలి ( యమేన నియమేన చ). వేదాంత శాస్త్రమును వినడము వలన కలుగుతుంది. పురాణం వినాలన్న బుద్ధి ఎలా పడుతుంది - నామ సంకీర్తనతో పుడుతుంది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 207 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 17 🌴

17. mahatāṁ bahu-mānena dīnānām anukampayā
maitryā caivātma-tulyeṣu yamena niyamena ca


MEANING : The pure devotee should execute devotional service by giving the greatest respect to the spiritual master and the ācāryas. He should be compassionate to the poor and make friendship with persons who are his equals, but all his activities should be executed under regulation and with control of the senses.

PURPORT : It is recommended herewith that all the ācāryas be given the highest respect. It is stated, guruṣu nara-matiḥ. Guruṣu means "unto the ācāryas," and nara-matiḥ means "thinking like a common man." To think of the Vaiṣṇavas, the devotees, as belonging to a particular caste or community, to think of the ācāryas as ordinary men or to think of the Deity in the temple as being made of stone, wood or metal, is condemned. Niyamena: one should offer the greatest respect to the ācāryas according to the standard regulations. A devotee should also be compassionate to the poor. This does not refer to those who are poverty-stricken materially. According to devotional vision, a man is poor if he is not in Kṛṣṇa consciousness. A man may be very rich materially, but if he is not Kṛṣṇa conscious, he is considered poor. On the other hand, many ācāryas, such as Rūpa Gosvāmī and Sanātana Gosvāmī, used to live beneath trees every night. Superficially it appeared that they were poverty-stricken, but from their writings we can understand that in spiritual life they were the richest personalities.

A devotee shows compassion to those poor souls who are wanting in spiritual knowledge by enlightening them in order to elevate them to Kṛṣṇa consciousness. That is one of the duties of a devotee. He should also make friendship with persons who are on an equal level with himself or who have the same understanding that he does. For a devotee, there is no point in making friendships with ordinary persons; he should make friendship with other devotees so that by discussing among themselves, they may elevate one another on the path of spiritual understanding. This is called iṣṭa-goṣṭhī.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 17, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : సోమావతి (హరియాళి) అమావాస్య, Somvati (Hariyali) Amavas 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 39 🍀

79. కైలాసగిరివాసీ చ హిమవద్గిరిసంశ్రయః |
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః

80. వణిజో వర్ధకీ వృక్షో వకుళశ్చందనఛ్ఛదః |
సారగ్రీవో మహాజత్రురలోలశ్చ మహౌషధః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : అసూయా ద్వేషాదుల విసర్జన - పూర్ణయోగ సాధనలో మానవ సంబంధాలు ప్రాణకోశము నాధారము చేసుకుని ప్రవర్తిల్లక ఆత్మస్థములై విలసిల్లడం అవసరం. ప్రాణకోశం అట్టి ఆత్మస్థితికి ఉపకరణం మాత్రమే కావాలి. అనగా, అసూయ, ద్వేషం, ఘర్షణ మొదలైన ప్రాణకోశ ప్రవృత్తులకు ఏవిధమైన మానవ సంబంధాలలోను తావీయరాదు. ఆధ్యాత్మిక జీవనంలో వాటికి స్థానం లేదు. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

శ్రావణ మాసం

తిథి: మావాశ్య 24:03:02 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: పునర్వసు 29:12:26

వరకు తదుపరి పుష్యమి

యోగం: వ్యాఘత 08:57:01 వరకు

తదుపరి హర్షణ

కరణం: చతుష్పద 11:04:18 వరకు

వర్జ్యం: 15:55:30 - 17:41:42

దుర్ముహూర్తం: 12:48:15 - 13:40:29

మరియు 15:24:57 - 16:17:11

రాహు కాలం: 07:28:19 - 09:06:15

గుళిక కాలం: 14:00:04 - 15:38:01

యమ గండం: 10:44:12 - 12:22:08

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48

అమృత కాలం: 26:32:42 - 28:18:54

మరియు 24:49:44 - 26:36:48

సూర్యోదయం: 05:50:22

సూర్యాస్తమయం: 18:53:54

చంద్రోదయం: 05:10:35

చంద్రాస్తమయం: 18:51:11

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: ధూమ్ర యోగం - కార్య

భంగం, సొమ్ము నష్టం 29:12:26 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹