శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 464. 'కాంతిమతి' - 3 🌻


పదార్థమయమగు విషయము లందాసక్తి కలిగిన మనస్సునకు కళాకళ లుండును. దివ్యమున కుమ్ముఖము చెందిన మనస్సునకు పూర్ణకళ యుండును. మనస్సు అద్దము వంటిది. దానిని భూమికి ఉన్ముఖము చేసిన పదార్థమయ రూపము గోచరించును. చెట్టు, పుట్ట, కొండ, కోతి కనిపించును. ఆకాశమునకు అద్దము నున్ముఖము చేసినచో వెలుగే ప్రతిబింబించును. ఆకాశమున విహరించు జీవులు కూడ గోచరించెదరు. ఇట్లు మనసు ఉన్ముఖత్వమును బట్టి కాంతివంతమగుట, కాంతిహీన మగుట జరుగును. యోగీశ్వరులు, పరమహంసలు, సిద్ధులు, దివ్య పురుషులు కాంతిమతులు. ఇక శ్రీమాత కాంతిమతి అనుట యందు ఎట్టి విశేషము లేదు. ఆమె సతతము శివుని యందే యున్నది. ఆమె శాశ్వత కాంతిమతి. ఇతర జీవులు ఆమె అనుగ్రహమున కాంతిమతులగు చున్నారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 464. 'Kantimati' - 3 🌻


A mind that is oriented to the materialistic things have these phases. A mind that is focused on the divine will be always full. Mind is like a mirror. If it is only oriented to the physical objects, it sees only physical objects. If the mirror is turned towards the sky, the light will be reflected. Even the living beings who wander in the sky are seen. Thus, depending on the disposition of the mind, there will be light and darkness. Yogiswaras, paramahamsas, siddhas, divine men are luminaries. There is no doubt Srimata being called Kantimati. Her eternity belongs to Lord Shiva. She is an eternal light. Other beings became luminaries by her grace.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment