🌹 18, JULY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 18, JULY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, JULY 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 400 / Bhagavad-Gita - 400 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 28 / Chapter 10 - Vibhuti Yoga - 28 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 247 / Agni Maha Purana - 247 🌹 
🌻. శివ పూజా విధి వర్ణనము - 3 / Mode of worshipping Śiva (śivapūjā) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 112 / DAILY WISDOM - 112 🌹 
🌻 21. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం యొక్క అధ్యయనం / 21. The Study of Man is the Study of Consciousness 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 378 🌹*
6) 🌹. శివ సూత్రములు - 114 / Siva Sutras - 114 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 17 / 2-07. Mātrkā chakra sambodhah   - 17 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 18, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : అధిక మాసం ప్రారంభం, Adhik Maas Begins🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 12 🍀*

*24. ధ్యాతా ధ్యేయో జగత్సాక్షీ చేతా చైతన్యవిగ్రహః |*
*జ్ఞానదః ప్రాణదః ప్రాణో జగత్ప్రాణః సమీరణః*
*25. విభీషణప్రియః శూరః పిప్పలాశ్రయసిద్ధిదః |*
*సిద్ధః సిద్ధాశ్రయః కాలః కాలభక్షకపూజితః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అహంకార పూర్వక ప్రేమ కూడదు - పూర్ణయోగ సాధనలో అహంకార పూర్వకమైన ప్రేమకు తావులేదు. ఆహంకారం దెబ్బతిన్నా, అసంతృప్తి చెందినా ప్రేమించడం మాని వేయడం, లేక కక్షపూని ద్వేషించడం – ఇదీ అహంకార పూర్వక ప్రేమ స్వభావం. నిక్కమైన ప్రేమకు మూలంలో సుస్థిరైక్యం భాసిస్తుంది. కామప్రవృత్తి కాలుష్యాలను సాధకుడు తనలో నిలువనీయ రాదనేది వేరుగ చెప్పనక్కరలేదు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 26:11:04 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: పుష్యమి 31:58:20 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: హర్షణ 09:35:14 వరకు
తదుపరి వజ్ర
కరణం: కింస్తుఘ్న 13:05:33 వరకు
వర్జ్యం: 14:07:20 - 15:54:24
దుర్ముహూర్తం: 08:27:18 - 09:19:30
రాహు కాలం: 15:37:58 - 17:15:50
గుళిక కాలం: 12:22:13 - 14:00:05
యమ గండం: 09:06:27 - 10:44:20
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 24:49:44 - 26:36:48
సూర్యోదయం: 05:50:42
సూర్యాస్తమయం: 18:53:43
చంద్రోదయం: 06:04:28
చంద్రాస్తమయం: 19:36:30
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: వర్ధమాన యోగం -
ఉత్తమ ఫలం 31:58:20 వరకు
తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 400 / Bhagavad-Gita - 400 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 28 🌴*

*28. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |*
*ప్రజనశ్చాస్మి కందర్ప: సర్పాణామస్మి వాసుకి: ||*

*🌷. తాత్పర్యం : నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మథుడను మరియు సర్పములలో వాసుకుని అయి యున్నాను.*

*🌷. భాష్యము : నిక్కముగా మహాత్తరమగు ఆయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యము వహించును. ఆధ్యాత్మిక జగము నందలి కృష్ణలోకమున ఎప్పుడు కోరినను, ఎంత కోరినను క్షీరము నొసగగల గోవులు అసంఖ్యాకములుగా కలవు. అటువంటి గోవులు ఈ భౌతికజగమున లేవు. అవి కృష్ణలోకమున ఉన్నట్లుగా మాత్రము పేర్కొనబడినది.*

*“సురభి” నామము గల ఆ గోవులను శ్రీకృష్ణభగవానుడు పెక్కింటిని కలిగియుండి వానిని గాంచుట యందు నిమగ్నుడై యుండుననియు తెలుపబడినది. సత్సాంతానము కొరకై కలిగెడి కామవాంఛ కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణుని ప్రతినిధి. కొన్నిమార్లు మైథునక్రియ కేవలము ఇంద్రియభోగము కొరకే ఒనరింపబడుచుండును. అదియెన్నడును కృష్ణునికి ప్రాతినిధ్యము వహింపదు. కేవలము సత్సాంతానప్రాప్తికై ఒరరింపబడెడిదే కందర్పునిగా పిలువబడి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 400 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 28 🌴*

*28. āyudhānām ahaṁ vajraṁ dhenūnām asmi kāma-dhuk*
*prajanaś cāsmi kandarpaḥ sarpāṇām asmi vāsukiḥ*

*🌷 Translation : Of weapons I am the thunderbolt; among cows I am the surabhi. Of causes for procreation I am Kandarpa, the god of love, and of serpents I am Vāsuki.*

*🌹 Purport : The thunderbolt, indeed a mighty weapon, represents Kṛṣṇa’s power. In Kṛṣṇaloka in the spiritual sky there are cows which can be milked at any time, and they give as much milk as one likes. Of course such cows do not exist in this material world, but there is mention of them in Kṛṣṇaloka. The Lord keeps many such cows, which are called surabhi. It is stated that the Lord is engaged in herding the surabhi cows. Kandarpa is the sex desire for presenting good sons; therefore Kandarpa is the representative of Kṛṣṇa. Sometimes sex is engaged in only for sense gratification; such sex does not represent Kṛṣṇa. But sex for the generation of good children is called Kandarpa and represents Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 247 / Agni Maha Purana - 247 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*

*🌻. శివ పూజా విధి వర్ణనము - 3 🌻*

*ఈ భూతశుద్ధికి సంబంధించిన విశేషవివరణము వినుము. భూమండల స్వరూపము చతుష్కోణాకారము. దాని రంగు సువర్ణము వలె పచ్చగా ఉండును. అది కఠిన ముగ నుండుటయే గాక వజ్రచిహ్నముతోను, 'హాం' అను తన బీజముతోను కూడికొని యున్నది. దీనిలో 'నివృత్తి' అను కళ ఉన్నది. (శరీరమున పాదములు మొదలు మోకాళ్లవరకును భూమండల మున్నది.) ఈ విధమున పాదములు మొదలు శిరస్సువరకు శరీరమునందు పంచమహాభూతముల భావన చేయవలెను. ఈ విధముగ పంచగుణయుక్తము లగు వాయు - భూ మండలముల చింతకన చేయవలెను.*

*జలస్వరూపము అర్ధచంద్రాకారము. అది ద్రవస్వరూపము. చంద్రమండలమయము. దానివర్ణము ఉజ్జ్వలము. అది రెండు కమలములచే చిహ్నితము. 'హ్రీం' బీజముతో కూడినది. ''ప్రతిష్ఠా'' అను కల గలది. వామదేవ-తత్పురుషమంత్రములతో సంయుక్తమగు జలతత్త్వము నాలుగు గుణములతో కూడినది. దానిని ఈ విధముగ (మోకాళ్లు మొదలు పాదాల వరకు) చింతనము చేయుచు వహ్ని స్వరూపమునందు లీనముచేసి శోధన చేయవలెను. అగ్ని మండలము త్రికోణాకారము. రంగు ఎరుపు. (అది నాభినుండి హృదయమువరకును ఉండును). అది స్వస్తికచిహ్నయుక్తము. దానియందు 'హూం' బీజము అంకిత మై యుండును. అది విద్యాకలాస్వరూప మైనది. దాని మంత్రము అఘోరమంత్రము. ఇది మూడు గుణములతో కూడిన జలభూతము. ఈ విధముగ భావించి అగ్ని తత్త్వమును శోధించవలెను. వాయుమండలము షట్కోణాకారము (హృదయము మొదలు కనుబొమ్మలవరకును ఉండునది) అది ఆరు బిందువులచే చిహ్నితమైనది. రంగు నలుపు. 'హైం' బీజము తోడను, సద్యోజాతమంత్రముతోడను యుక్తమై యున్న అది శాంతికలాస్వరూపమైనది. దానిలో రెండు గుణములున్నవి. అది పృథ్వీభూతము. ఈ విధముగ భావన చేసి వాయుతత్త్వమును శోధింపవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 247 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 3 🌻*

17. One should merge the earth, wind, water, fire and sky, one into the other without any deviation in the order. You hear about it now!

18. The principle of earth is hard, of yellowish colour and bears the mark of thunderbolt. Then its destruction is wrought by the subtle mantra of the soul (namely) hauṃ.

19. The entire body from foot to head should be contemplated as a four-sided figure, and the principle of wind should be meditated therein by five stretches of retention of breath.

20. This principle which has been established with the principal syllable hrīṃ should be contemplated as of half-crescent-shaped in a liquid state, white in colour, beautiful and impressed with (the figure of) the lotus.

21. The reverential principle of fire which is causeless and which is the end of men, should be purified by four stretches of retention of breath along with the Rāma mantra.

22. The orb of fire should be conceived as three-sided, red (in colour), marked with (the sign of) svastika and as the form of knowledge and endowed with the principal syllable hūṃ.

23. The principle of water should be purified by means of three stretches of awful minuteness. The orb of wind (principle) (should be conceived) as marked with six dots.

24. It should be meditated as composed of tranquility, black in colour and endowed with the principal syllable of hrīṃ (and purified) by two stretches (of retention of breath). The principle of earth should be purified.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 112 / DAILY WISDOM - 112 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 21. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం యొక్క అధ్యయనం 🌻*

*జీవిత ప్రక్రియలు, స్థూలంగా చెప్పాలంటే, రాజకీయాలు, ప్రపంచ చరిత్ర, సామాజిక శాస్త్రం, నీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, సౌందర్యశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం రంగాలలో అధ్యయనం చేయబడినవి. మనిషితో అనుసంధానించబడిన ప్రతి జీవితపు కోణం ఈ రూపురేఖలలోనే గ్రహించబడవచ్చు. అయితే ఇదంతా చైతన్యానికి సంబంధించినదై ఉండాలి; లేకపోతే, అవి అధ్యయన అంశాలుగా లేదా అనుభవ వస్తువులుగా కూడా ఉండవు.*

*కాబట్టి మనిషి సమస్య అంతా చైతన్యం యొక్క సమస్య. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం. చైతన్యాన్ని విభజించడం సాధ్యం కాదు కాబట్టి చైతన్య భాగాలు అనేవి ఉండవు. కాబట్టి చైతన్యం అవిభాజ్య కాబట్టి, జీవితం అంతా ఈ అనంత చైతన్యం తనలో తాను ఆడిన ఆట అనే చెప్పవచ్చు. ఉనికి మరియు చైతన్యాన్ని గుర్తించడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 112 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 21. The Study of Man is the Study of Consciousness 🌻*

*The processes of life are, broadly speaking, those which are studied in the fields of politics, world history, sociology, ethics, economics, aesthetics, psychology, biology, chemistry, physics and astronomy. Everything connected with man can be said to be comprehended within this outline of the framework of life’s activity. But all this has to be related to consciousness; else, they would not exist even as subjects of study or objects of experience.*

*The problem of man is therefore the problem of consciousness. The study of man is the study of consciousness. Since it is impossible to conceive a real division of consciousness within itself, it is also not possible to imagine that there can be real objects of consciousness. If there are no such real objects, the whole of life would be a drama played by consciousness within itself in the realm of its infinite compass. There cannot be a greater joy than the identification of existence and consciousness.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 378 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నీ శాశ్వతత్వాన్ని గుర్తించడానికి హృదయమే మార్గం. ఒకసారి మరణం లేదని గుర్తించిన క్షణం జీవితం మారిపోతుంది. జీవితంలోకి అపూర్వ లక్షణాలు అడుగు పెడతాయి. 🍀*

*నువ్వు ఎంతగా 'తల'కు అతుక్కుని వుంటే అంతగా హృదయాన్ని మరచిపోతావు. దేవుడు హృదయం గుండా తెలుస్తాడు. సత్యం హృదయం ద్వారా తెలిసి వస్తుంది. హృదయం అస్తిత్వాన్ని గ్రహించడానికి ఆరంభం. సముద్ర అనుభవానికి బిందువు. మనిషి శాశ్వతమైన వాడు.*

*వాస్తవానికి మరణం లేదు. కానీ దాన్ని 'మేథ'తో గుర్తించడం ఎలా? అది హృదయమార్గం. నీ శాశ్వతత్వాన్ని గుర్తించడానికి హృదయమే మార్గం. ఒకసారి మరణం లేదని గుర్తించిన క్షణం జీవితం మారిపోతుంది. జీవితంలోకి అపూర్వ లక్షణాలు అడుగు పెడతాయి. అవి నాట్యం, గానం, కవిత్వం, ఉత్సవం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 114 / Siva Sutras - 114 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 17 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*అచ్చులు మరియు హల్లులు కాకుండా, కొన్ని అక్షరాలను ఉభయాక్షరములు అంటారు. య, ర, ల మరియు వ ఈ వర్గంలోకి వస్తాయి. ఈ నాలుగు అక్షరాలు శివుని చుట్టుముట్టిన ఆరు కవచాలను ఏర్పరుస్తాయి. తద్వారా అతని స్వాభావిక వైభవాన్ని నిష్ణాతులైన ఆత్మలు గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఆ ఆరు కవచాలు కాల, విద్య, రాగ, కాల, నియతి మరియు మాయ. వాటిని కనుకా అని కూడా అంటారు. కాల కాలాన్ని సూచిస్తుంది, గతం యొక్క కొలమానం, వర్తమానం యొక్క ఆనందాన్ని ఇస్తుంది మరియు భవిష్యత్తు కోసం నిల్వ ఉన్న వాటిని కలిగి ఉంటుంది. కర్మని నియమబద్థీకరించడం నియతి చేస్తుంది. కాల చర్యను ప్రేరేపిస్తుంది, విద్య తెలివికి బాధ్యత వహిస్తుంది. ఇంద్రియ అవగాహనలకు రాగం బాధ్యత వహిస్తుంది. సంశయం, అజ్ఞానం మరియు భ్రాంతిని మాయ ప్రేరేపిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 114 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07.  Mātrkā chakra sambodhah   - 17 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*Apart from vowels and consonants, some letters are known as semi-vowels. Ya, ra, la and va (य र ल व) fall under this category. These four letters give rise to six coverings that surround Śiva, blocking His inherent splendour to be perceived by nescient souls. The six coverings are kalā, vidyā, rāga, kāla, niyati and māyā. They are also known as kañuca. Kāla refers to time, a measurement of past, gives enjoyment of the present and contains what is in store for the future. Niyati is responsible in fixing the order and sequence of karma. While kalā induces action, vidyā is responsible for intelligence. Rāga is responsible for sensory perceptions and māyā is responsible for inducing doubt, ignorance and illusion.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment