శ్రీ లలితా సహస్ర నామములు - 102 / Sri Lalita Sahasranamavali - Meaning - 102

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 102 / Sri Lalita Sahasranamavali - Meaning - 102 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀

🍀 495. మణిపూరాబ్జనిలయా -
మణిపూర పద్మములో వసించునది.

🍀 496. వదనత్రయ సంయుతా -
మూడు ముఖములతో కూడి యుండునది.

🍀 497. వజ్రాదికాయుధోపేతా -
వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.

🍀 498. డామర్యాదిభిరావృతా -
డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 102 🌹

📚. Prasad Bharadwaj

🌻 102. maṇipūrābja-nilayā vadanatraya-saṁyutā |
vajrādikāyudhopetā ḍāmaryādibhirāvṛtā || 102 || 🌻

🌻 495 ) Mani poorabja nilaya -
She who lives in ten petalled lotus

🌻 496 ) Vadana thraya samyudha -
She who has three faces

🌻 497 ) Vajradhikayudhopetha -
She who has weapons like Vajrayudha

🌻 498 ) Damaryadhibhi ravrutha -
She who is surrounded by Goddess like Damari.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

11 Jul 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 53

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 53 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అప్రయత్నము - శ్రమ 🌻

దూది పరుపులు, వెండి, బంగారు కంచములు, పట్టు వస్త్రములు, మేడలు, మిద్దెలు మున్నగునవి అప్రయత్నముగా లభించినపుడు అనుభవింప వచ్చును. కాని వానిని సాధించుకొనుటకై శ్రమపడుట అవివేకము.

సుఖమునకై శ్రమపడుట తెలివి తక్కువయే కాని సుఖము కాదు. మరియు శరీరమునకు సుఖము నలవాటు చేసినచో ఎపుడయిన పరుపులు మొదలగునవి లభింపనపుడు మనసు ఏడ్చును. అట్టిది కలుగకుండ తెలివిగా మెలగినచో అనుభవింపవచ్చును.

భాగవతము 2-21 వివరణము

🌹 🌹 🌹 🌹 🌹

11 Jul 2021

శ్రీ శివ మహా పురాణము - 425

🌹 . శ్రీ శివ మహా పురాణము - 425🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 25

🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

కరుణా సముద్రుడగు శివుడు మహర్షుల ఈ విన్నపమును విని, వికసించిన పద్మముల వంటి నేత్రములు గలవాడై ప్రేమతో నవ్వి ఇట్లు పలికెను (12).

మహేశ్వరుడిట్లు పలికెను-

ఓ సప్తర్షులారా! కుమారులారా! నా మాటను వెంటనే వినుడు. సర్వజ్ఞులగు మీరు మాకు హితమును చేయువారు (13). దేవ దేవి యగు పార్వతి ఈ సమయములో గౌరీ శిఖరమును పేరుగల పర్వతమునందు దృఢచిత్తయై తపము నాచరించుచున్నది(14).ఓ ద్విజులారా ! అమె నన్ను భర్తగా పొందవలెననే అంతిమ నిశ్చయమును చేసుకొని ఇతర కామనలనన్నిటినీ వీడినది. అమెను సఖురాండ్రు కనిపెట్టియున్నారు (15). ఓ మహర్షులారా! మీరు నా అజ్ఞచే అచటకు వెళ్లి, ప్రేమతో నిండిన మనస్సు గలవారై, ఆమె మనస్సు ఎంత దృఢమైనది? అను విషయమును పరీక్షించుడు (16). మీరు పూర్తి అసత్యములను, నిందవాక్యములను పలుకుడు, దృఢమగు వ్రతము గల ఓ ఋషులారా! మీరు నా శాసనముచే ఈ విషయములో ఎట్టి సంశయమునైననూ పొందకుడు (17).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు ఆజ్ఞాపింపబడిన ఆ మునులు శీఘ్రమే అచటకు వెళ్లరి. అచట జగన్మాతయగు పార్వతి గొప్ప తేజస్సుతో విరాజిల్లు చుండెను (18). మూర్తీభవించిన తపస్సిద్ధివలె నున్న, పరమతేజస్సుతో విలసిల్లు చున్న పార్వతిని వారచట చూచిరి (19).దృఢవ్రతులగు ఆ సప్తర్షులు ఆమెకు మనస్సులో నమస్కరించి, ఆమెచే ప్రత్యేకముగా పూజింపబడినవారై, వినయముతో నిట్లు పలికిరి (20).

ఋషులిట్లు పలికిరి-

ఓ పార్వతీ దేవీ! వినుము, నీవు దేని కొరకు తపస్సును చేయుచున్నావు? ఏ దేవతను కోరుచున్నావు? ఏ ఫలమును కోరుచున్నావు? ఇపుడా విషయమును చెప్పుము. (21)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

11 Jul 2021

గీతోపనిషత్తు -225

🌹. గీతోపనిషత్తు -225 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 10 - 4

🍀 9 - 4 . ధ్యాన మార్గము - ధ్యాన మార్గ మిట్లున్నది. 🍀

10. ధ్యానమందలి ఈ స్థితి యందు శ్వాస సున్నితముగ సాగుచున్నను ప్రజ్ఞ అంతర్ముఖమై ప్రాణాపానములనుండి విడిపడి, వానికి మూలమైన సమాన ప్రాణ స్పందనమునందు నిలచును. అట్టి స్థితిలో ప్రాణాయామము సిద్ధించినట్లగును. ప్రాణాయామమనగా ప్రాణము యమింపబడుట. అనగా ప్రాణము, అపానము యమింపబడి, ప్రజ్ఞ అంతరంగమున సమాన ప్రాణముతో కూడి యుండును.

11. సమాన ప్రాణ స్పందనతో కూడియున్న మనస్సు స్పందన ననుసరించుచు, సూక్ష్మ స్పందనమును చేరి హృదయకర్ణిక కాధారమైన యొక ఊర్ధ్వమగు వెలుగు నాళము చేరును. అచటగల ఉదాన ప్రాణ స్పందనముతో ప్రజ్ఞ కూడును.

12. ఉదాన ప్రాణ స్పందనము నాళమున ఊర్ద్యముగ స్పందించుచు, ప్రజ్ఞను ఊర్ధ్యముఖముగ గొనిపోవును. ఇట్టి సమయమున బుద్ధిలోకమందలి ధ్యానమంతయు క్రమముగ సాధకునకు ఆవిష్కరింప బడుట, అవగతమగుట జరుగు చుండును. ఉదాన స్పందనము ప్రజ్ఞను ఊర్ధ్వముగ గొనిపోవుచు విశుద్ధిని దాటి ముఖమున చేరి అటు పైన నాసికాంతర ద్వారమున భ్రూమధ్యమును చేరును.

ఉదాన ప్రాణమునకు భ్రూమధ్యము శిఖర స్థానము. ప్రజ్ఞను అచ్చటికి చేర్చి నీలాకాశమును దర్శించుచు నుండుట ధ్యానస్థితిగ తెలుపుదురు. ఉదాన స్పందన మాధారముగ, హృదయము నుండి విశుద్ధి మీదుగ, భ్రూమధ్యమును చేరుట 'ప్రత్యాహార' మని, భ్రూమధ్యమున స్థిరముగ ఉదాన స్పందన శిఖరమున నుండుట 'ధారణ' యని, అట నుండి నీలాకాశమును గూర్చి ధ్యానించుట 'ధ్యాన' మని తెలియవలెను.

యోగబలముచేత ప్రాణమును సమన్వయించి, భ్రూమధ్య మును చేరుమను ఈ వాక్యమందు భగవానుడు సమస్త యోగమును నిర్దేశించినాడు. పరమును చేరు మార్గమును సున్నితముగ తెలిపి నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

11 Jul 2021

11-JULY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 225 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 426🌹 
3) 🌹 Light On The Path - 172🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -53🌹  
5) 🌹 Osho Daily Meditations - 42🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 102 / Lalitha Sahasra Namavali - 102🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 102 / Sri Vishnu Sahasranama - 102🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -225 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 10 - 4

*🍀 9 - 4 . ధ్యాన మార్గము - ధ్యాన మార్గ మిట్లున్నది. 🍀*

10. ధ్యానమందలి ఈ స్థితి యందు శ్వాస సున్నితముగ సాగుచున్నను ప్రజ్ఞ అంతర్ముఖమై ప్రాణాపానములనుండి విడిపడి, వానికి మూలమైన సమాన ప్రాణ స్పందనమునందు నిలచును. అట్టి స్థితిలో ప్రాణాయామము సిద్ధించినట్లగును. ప్రాణాయామమనగా ప్రాణము యమింపబడుట. అనగా ప్రాణము, అపానము యమింపబడి, ప్రజ్ఞ అంతరంగమున సమాన ప్రాణముతో కూడి యుండును. 

11. సమాన ప్రాణ స్పందనతో కూడియున్న మనస్సు స్పందన ననుసరించుచు, సూక్ష్మ స్పందనమును చేరి హృదయకర్ణిక కాధారమైన యొక ఊర్ధ్వమగు వెలుగు నాళము చేరును. అచటగల ఉదాన ప్రాణ స్పందనముతో ప్రజ్ఞ కూడును. 

12. ఉదాన ప్రాణ స్పందనము నాళమున ఊర్ద్యముగ స్పందించుచు, ప్రజ్ఞను ఊర్ధ్యముఖముగ గొనిపోవును. ఇట్టి సమయమున బుద్ధిలోకమందలి ధ్యానమంతయు క్రమముగ సాధకునకు ఆవిష్కరింప బడుట, అవగతమగుట జరుగు చుండును. ఉదాన స్పందనము ప్రజ్ఞను ఊర్ధ్వముగ గొనిపోవుచు విశుద్ధిని దాటి ముఖమున చేరి అటు పైన నాసికాంతర ద్వారమున భ్రూమధ్యమును చేరును. 

ఉదాన ప్రాణమునకు భ్రూమధ్యము శిఖర స్థానము. ప్రజ్ఞను అచ్చటికి చేర్చి నీలాకాశమును దర్శించుచు నుండుట ధ్యానస్థితిగ తెలుపుదురు. ఉదాన స్పందన మాధారముగ, హృదయము నుండి విశుద్ధి మీదుగ, భ్రూమధ్యమును చేరుట 'ప్రత్యాహార' మని, భ్రూమధ్యమున స్థిరముగ ఉదాన స్పందన శిఖరమున నుండుట 'ధారణ' యని, అట నుండి నీలాకాశమును గూర్చి ధ్యానించుట 'ధ్యాన' మని తెలియవలెను. 

యోగబలముచేత ప్రాణమును సమన్వయించి, భ్రూమధ్య మును చేరుమను ఈ వాక్యమందు భగవానుడు సమస్త యోగమును నిర్దేశించినాడు. పరమును చేరు మార్గమును సున్నితముగ తెలిపి నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 425🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 25

*🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

కరుణా సముద్రుడగు శివుడు మహర్షుల ఈ విన్నపమును విని, వికసించిన పద్మముల వంటి నేత్రములు గలవాడై ప్రేమతో నవ్వి ఇట్లు పలికెను (12).

మహేశ్వరుడిట్లు పలికెను-

ఓ సప్తర్షులారా! కుమారులారా! నా మాటను వెంటనే వినుడు. సర్వజ్ఞులగు మీరు మాకు హితమును చేయువారు (13). దేవ దేవి యగు పార్వతి ఈ సమయములో గౌరీ శిఖరమును పేరుగల పర్వతమునందు దృఢచిత్తయై తపము నాచరించుచున్నది(14).ఓ ద్విజులారా ! అమె నన్ను భర్తగా పొందవలెననే అంతిమ నిశ్చయమును చేసుకొని ఇతర కామనలనన్నిటినీ వీడినది. అమెను సఖురాండ్రు కనిపెట్టియున్నారు (15). ఓ మహర్షులారా! మీరు నా అజ్ఞచే అచటకు వెళ్లి, ప్రేమతో నిండిన మనస్సు గలవారై, ఆమె మనస్సు ఎంత దృఢమైనది? అను విషయమును పరీక్షించుడు (16). మీరు పూర్తి అసత్యములను, నిందవాక్యములను పలుకుడు, దృఢమగు వ్రతము గల ఓ ఋషులారా! మీరు నా శాసనముచే ఈ విషయములో ఎట్టి సంశయమునైననూ పొందకుడు (17).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు ఆజ్ఞాపింపబడిన ఆ మునులు శీఘ్రమే అచటకు వెళ్లరి. అచట జగన్మాతయగు పార్వతి గొప్ప తేజస్సుతో విరాజిల్లు చుండెను (18). మూర్తీభవించిన తపస్సిద్ధివలె నున్న, పరమతేజస్సుతో విలసిల్లు చున్న పార్వతిని వారచట చూచిరి (19).దృఢవ్రతులగు ఆ సప్తర్షులు ఆమెకు మనస్సులో నమస్కరించి, ఆమెచే ప్రత్యేకముగా పూజింపబడినవారై, వినయముతో నిట్లు పలికిరి (20).

ఋషులిట్లు పలికిరి-

ఓ పార్వతీ దేవీ! వినుము, నీవు దేని కొరకు తపస్సును చేయుచున్నావు? ఏ దేవతను కోరుచున్నావు? ఏ ఫలమును కోరుచున్నావు? ఇపుడా విషయమును చెప్పుము. (21)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 172 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 Regard the three truths. They are equal. - 9 🌻*

604. Our examination of the history of these saints shows that among them were included individuals of many different types. Some of them were unquestionably great, learned and capable men. 

Others were not that at all, but were quite ordinary and ignorant, their great virtue being that they were good. Only when we come to study it deeply do we realize that the religion is intended not only to feed the fire of devotion, but also to assist its people at all levels and along all lines.

605. When we examine other great religions, such as Buddhism or Hinduism, we find them also prepared to meet their people everywhere. Each of these religions has certain precepts for the uneducated, by virtue of which they will be helped, if they follow them truly, to lead a good life. It has also much metaphysical and philosophical teaching for those who need it. 

606. Every true religion must be capable of adapting itself to people at all levels, of meeting the wise and learned, as well as the ignorant devotee. It certainly must not exalt the ignorant but devoted man above the wiser, who wants to understand. Unfortunately there has been a distinct tendency on the part of religion to condemn the people who have wanted to know, to disparage their wisdom as merely the wisdom of this world, and to regard those who take the attitude of a little child as likely to make more rapid progress. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 53 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. అప్రయత్నము - శ్రమ 🌻*

దూది పరుపులు, వెండి, బంగారు కంచములు, పట్టు వస్త్రములు, మేడలు, మిద్దెలు మున్నగునవి అప్రయత్నముగా లభించినపుడు అనుభవింప వచ్చును. కాని వానిని సాధించుకొనుటకై శ్రమపడుట అవివేకము.  

సుఖమునకై శ్రమపడుట తెలివి తక్కువయే కాని సుఖము కాదు. మరియు శరీరమునకు సుఖము నలవాటు చేసినచో ఎపుడయిన పరుపులు మొదలగునవి లభింపనపుడు మనసు ఏడ్చును. అట్టిది కలుగకుండ తెలివిగా మెలగినచో అనుభవింపవచ్చును.

భాగవతము 2-21 వివరణము
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 42 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 POSTPONING 🍀*

*🕉 Life is very short, and much has to be learned; those people who go on postponing go on missing_ 🕉*

Ask yourself constantly whether you are moving into more blissful states or not. If you are moving into more and more blissful states, you are on the right track. Go into it more, have more of it. And if you are feeling miserable, then look: Somewhere you have fallen off track, gone astray. You have been distracted by something; you are no longer natural, you are alienated from nature; hence, misery. Look, analyze, and whatever you find to be the cause of misery, drop it. And don't postpone for tomorrow; drop it immediately.

Life is very short, and much has to be learned; those people who go on postponing go on missing. Today you will postpone for tomorrow and again tomorrow you will postpone. Slowly, slowly postponement becomes your habit. And it is always today that it comes; tomorrow never comes. So you can go on postponing forver. 

Whenever you see that something is creating misery, drop it then and there--don't hold it for a single moment. This is courage: courage to live, courage to risk, courage to adventure. And only those who are courageous are one day rewarded by the whole, by light, by love, bliss, and benediction.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 102 / Sri Lalita Sahasranamavali - Meaning - 102 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।*
*వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀*

🍀 495. మణిపూరాబ్జనిలయా -
 మణిపూర పద్మములో వసించునది.

🍀 496. వదనత్రయ సంయుతా - 
మూడు ముఖములతో కూడి యుండునది.

🍀 497. వజ్రాదికాయుధోపేతా - 
వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.

🍀 498. డామర్యాదిభిరావృతా - 
డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 102 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 102. maṇipūrābja-nilayā vadanatraya-saṁyutā |*
*vajrādikāyudhopetā ḍāmaryādibhirāvṛtā || 102 || 🌻*

🌻 495 ) Mani poorabja nilaya -   
She who lives in ten petalled lotus

🌻 496 ) Vadana thraya samyudha -   
She who has three faces

🌻 497 ) Vajradhikayudhopetha -   
She who has weapons like Vajrayudha

🌻 498 ) Damaryadhibhi ravrutha -   
She who is surrounded by Goddess like Damari.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 102 / Sri Vishnu Sahasra Namavali - 102 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 102. ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః|*
*ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః || 102 ‖ 🍀*

 🍀 950) ఆధార నిలయ: - 
సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.

🍀 951) అధాతా - 
తానే ఆధారమైనవాడు.

🍀 952) పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.

🍀 953) ప్రజాగర: - 
సదా మేల్కొనియుండువాడు.

🍀 954) ఊర్ధ్వగ: - 
సర్వుల కన్నా పైనుండువాడు.

🍀 955) సత్పధాచార: - 
సత్పురుషుల మార్గములో చరించువాడు.

🍀 956) ప్రాణద: - 
ప్రాణ ప్రదాత యైనవాడు.

🍀 957) ప్రణవ: -
 ప్రణవ స్వరూపుడైనవాడు.

🍀 958) పణ: - 
సర్వ కార్యములను నిర్వహించువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 102 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Uttara Bhadra 2nd Padam* 

*🌻 102. ādhāranilayōdhātā puṣpahāsaḥ prajāgaraḥ |*
*ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ || 102 || 🌻*

🌻 950. Ādhāra-nilayaḥ: 
One who is the support of even all the basic supporting factors like the five elements - Ether, Air, Fire, Water and Earth.

🌻 951. Adhātā: 
One who is one's own support and therefore does not require another support.

🌻 952. Puṣpahāsaḥ: 
One whose manifestation as the universe resembles the Hasa or blooming of buds into flowers.

🌻 953. Prajāgaraḥ: 
One who is particularly awake, because He is eternal Awareness.

🌻 954. Ūrdhvagaḥ: 
One who is above everything.

🌻 955. Satpathācāraḥ:
One who follows the conduct of the good.

🌻 956. Prāṇadaḥ: 
One who givesback life to dead ones as in the case of Parikshit.

🌻 957. Praṇavaḥ: 
Pranava (Om) the manifesting sound symbol of Brahman. As He is inseparably related with Pranava, He is called Pranava.

🌻 958. Paṇaḥ: 
It comes from the root 'Prana' meaning transaction. So one who bestows the fruits of Karma on all according to their Karma.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹