🍀 30 - DECEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀

🌹🍀 30 - DECEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 30 - DECEMBER - 2022 FRIDAY, శుక్రవారం బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 111 / Kapila Gita - 111 🌹 సృష్టి తత్వము - 67
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 703 / Vishnu Sahasranama Contemplation - 703 🌹 🌻703. సత్పరాయణమ్, सत्परायणम्, Satparāyaṇam🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 664 / Sri Siva Maha Purana - 664 🌹 🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 2 / Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 2 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 285 / Osho Daily Meditations - 28 🌹 🍀 285. ఆశ్చర్యం / WONDER 🍀 
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 421 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 2 🌹 🌻 421. 'వ్యాహృతి' - 2 / 'Vyahrti' - 2🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹30, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, శాకంబరి ఉత్సవారంభం, Masik Durgashtami, Shakambhari Utsavarambha🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -25 🍀*

*25. జలధీశసుతే జలజాక్షవృతే జలజోద్భవసన్నుతే దివ్యమతే ।*
*జలజాన్తరనిత్యనివాసరతే శరణం శరణం వరలక్ష్మి నమః॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నిక్కమైన జ్ఞానం తాదాత్మ్యం వలన కలుగుతుంది గాని, బుద్ధితో చేసే హేతువాదం వలన కలుగదు. తాదాత్మ్యం వలన కలిగిన జ్ఞానాన్ని బుద్ధి హేతుబద్ధం చేసి ప్రదర్శిస్తుంది. అంతే. క్రోధంతో తాదాత్మ్యం చెంచడం వలననే క్రోధాన్ని నీవు తెలుసుకుంటావు. అయితే, దాని నుండి వేరై దానిని తిలకించే సామర్థ్యం కూడ నీకు ఉండవచ్చు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: శుక్ల-అష్టమి 18:35:43 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 11:26:29
వరకు తదుపరి రేవతి
యోగం: వరియాన 09:45:14 వరకు
తదుపరి పరిఘ
కరణం: విష్టి 06:50:30 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:58:30 - 09:42:56
మరియు 12:40:38 - 13:25:04
రాహు కాలం: 10:55:08 - 12:18:26
గుళిక కాలం: 08:08:32 - 09:31:50
యమ గండం: 15:05:02 - 16:28:19
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:40
అమృత కాలం: 06:40:48 - 08:15:32
సూర్యోదయం: 06:45:13
సూర్యాస్తమయం: 17:51:38
చంద్రోదయం: 12:25:03
చంద్రాస్తమయం: 00:02:49
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
11:26:29 వరకు తదుపరి శ్రీవత్స 
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 111 / Kapila Gita - 111🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 67 🌴*

*67. విష్ణుర్గత్త్యేవ చరణౌ నోదతిష్ఠత్తదా విరాట్|*
*నాడీర్నద్యో లోహితేన నోదతిష్థత్తదా విరాట్॥*

*అట్లే విష్ణువు గమన క్రియతో గూడి పాదముల యందు ప్రవేశించెను.కాని, ఆయన లేవలేదు. నదులు రక్తముతో గూడి నాడుల యందును ప్రవేశించెను. ఐనను ఆ విరాట్ పురుషుడు లేవలేదు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 111 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 67 🌴*

*67. viṣṇur gatyaiva caraṇau nodatiṣṭhat tadā virāṭ*
*nāḍīr nadyo lohitena nodatiṣṭhat tadā virāṭ*

*Lord Viṣṇu entered His feet with the faculty of locomotion, but the virāṭ-puruṣa refused to stand up even then. The rivers entered His blood vessels with the blood and the power of circulation, but still the Cosmic Being could not be made to stir.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 703 / Vishnu Sahasranama Contemplation - 703🌹*

*🌻703. సత్పరాయణమ్, सत्परायणम्, Satparāyaṇam🌻*

*ఓం సత్పరాయణాయ నమః | ॐ सत्परायणाय नमः | OM Satparāyaṇāya namaḥ*

*బ్రహ్మ ప్రకృష్టమయనమ్ సతాం తత్త్వవిదాం పరమ్ ।*
*ఇతి సత్పరాయణమిత్యుచ్యతే విదుషాం వరైః ॥*

*'సత్‍' అనబడువారికి, తత్త్వజ్ఞానము కలవారికి పరమమైన ఆయనము అనగా చాలా గొప్పది అయిన గమ్యము కావున 'సత్పరాయణమ్‍' అని పరమాత్ముడు చెప్పబడు చున్నాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 703🌹*

*🌻703. Satparāyaṇam🌻*

*OM Satparāyaṇāya namaḥ*

ब्रह्म प्रकृष्टमयनम् सतां तत्त्वविदां परम् ।
इति सत्परायणमित्युच्यते विदुषां वरैः ॥

*Brahma prakr‌ṣṭamayanam satāṃ tattvavidāṃ param,*
*Iti satparāyaṇamityucyate viduṣāṃ varaiḥ.*

*He is the param āyanam i.e., the supreme resting place of those who are sat, the knowers of truth. Hence He is Satparāyaṇam.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥
సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥
Sadgatissatkr‌tissattā sadbhūtissatparāyaṇaḥ,Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 664 / Sri Siva Maha Purana - 664 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴*
*🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 2 🌻*

పుష్పములు, శుభమగు గంధము, నైవేధ్యము, యథావిధిగా రమ్యమగు నీరాజనము (10). తాంబూలము నిచ్చుట, ప్రదక్షిణ నమస్కారములు అను విధానముచే ఎవరు నిన్ను పూజించెదరో (11), వారికి నిస్సంశయముగా సర్వము సిద్ధించును. అనేక రకముల విఘ్నములు నిశ్చితముగా నశించును (12). ఆ దేవి తన పుత్రునితో మరియు మహేశ్వరునితో ఇట్లు పలికి, అపుడు మరల విఘ్నేశ్వరుని అనేక వస్తువులతో అలంకరించి పూజించెను (13).

ఓ విప్రా! అపుడు దేవతలకు మరియు గణములకు పార్వతి కృపచే వెనువెంటనే అధిక స్వస్థత చేకూరెన (14). ఆ సమయములో ఇంద్రాది దేవతలు శివదేవుని ఆనందముతో స్తుతించి ప్రసన్నుని చేసి బక్తితో పార్వతి వద్దకు దోడ్కిని వెళ్లిరి (15). మహేశ్వరుని ప్రక్కన మమేశ్వరిని కూర్చుండబెట్టి, తరువాత ముల్లోకములకు సుఖము కలుగుట కొరకై ఆ బాలకుని ఆమె ఒడిలో కర్చుండబెట్టిరి (16). శివుడు కూడా ఆ బాలుని శిరస్సుపై పద్మము వంటి తన చేతిని ఉంచి దేవతలతో 'వీడు నా రెండవ కుమారుడు ' అని పలికెను (17).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 664🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴*

*🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 2 🌻*

10-12. All achievements certainly accrue to him who performs your worship with flowers, sandal paste, scents, auspicious food offerings Nīrājana rites, betel leaves, charitable gifts, circumambulations and obeisance. All kinds of obstacles will certainly perish.

13. After saying this, she worshipped her good son with various articles, once again.

14. O Brahmin, then with the graceful blessings of

Pārvatī, instantly peace reigned upon gods and particularly on the Gaṇas.

15. In the meantime, Indra and other gods eulogised and propitiated Śiva joyously and brought him devoutly near Pārvatī.

16. After pleasing her they placed the boy in her lap for the happiness of the three worlds.

17. Placing his lotus-like hand on his head, Śiva told the gods. “This is another son of mine.”

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 285 / Osho Daily Meditations - 285 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 285. ఆశ్చర్యం 🍀*

*🕉. జ్ఞానం ఆశ్చర్యపోయే సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో అత్యంత విలువైన విషయాలలో ఆశ్చర్యం ఒకటి, జ్ఞానం దానిని నాశనం చేస్తుంది. మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీరు అంత తక్కువ ఆశ్చర్య పోతారు. దాని వల్ల చాలా తక్కువ జీవితం మీకు అర్థం అవుతుంది. 🕉*

*మీరు జీవితంలో ఉల్లాసంగా లేరు. దేనికీ మీరు ఆశ్చర్యపోరు. మీరు విషయాలను తేలికగా తీసుకోవడం ప్రారంభించారు. అమాయక హృదయం ఒక చిన్న పిల్లవాడు సముద్రపు ఒడ్డున సముద్రపు గవ్వలు లేదా రంగు రాళ్లను సేకరిస్తున్నట్లుగా లేదా సీతాకోక చిలుకల తర్వాత తోటలో అటు ఇటు పరిగెడుతూ ప్రతిదానికీ ఆశ్చర్యపోతూ విస్మయం చెందుతూ ఉంటుంది. అందుకే పిల్లలు చాలా ప్రశ్నలు అడుగుతారు. మీరు పిల్లలతో ఉదయపు నడకకు వెళితే, మీరు అలసి పోయినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లవాడు దీని గురించి, దాని గురించి అడుగుతూ, సమాధానం చెప్పలేని ప్రశ్నలను అడుగుతాడు: 'చెట్లు ఎందుకు పచ్చగా ఉన్నాయి?' మరియు 'గులాబీ ఎందుకు ఎర్రగా ఉంది?' లాంటివి. కానీ పిల్లవాడు ఎందుకు అడుగుతున్నాడు? అతను ఆసక్తిగా ఉన్నాడు. అతను ప్రతిదానిపై ఆసక్తి కలిగి ఉంటాడు. ఆసక్తి అనే పదం మూలం నుండి వచ్చింది. దీని అర్థం అంతర్గతమైన దానిలో పాలుపంచు కోవడం. పిల్లవాడు జరుగుతున్న ప్రతి దానిలో పాల్గొంటాడు.*

*మీరు ఎంత ఎక్కువ జ్ఞానవంతులు అవుతారో, జీవితంలో అంతగా నిమగ్నమై ఉంటారు. మీరు కేవలం ప్రతీదానిని దాటి వెళతారు - మీరు ఆవు మరియు కుక్క మరియు గులాబీ మరియు సూర్యుడు మరియు పక్షి గురించి పట్టించుకోరు; మీరు ప్రతీదానికి ఆందోళన చెందుతారు. మీ మనస్సు చాలా ఇరుకైనది; మీరు మీ కార్యాలయానికి లేదా మీ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. మీరు డబ్బు వెంబడి, లేదా అధికారం వెనుక మరింతగా పరిగెడుతున్నారు, అంతే. దాని వల్ల మీరు ఇకపై జీవితం యొక్క బహుళ పరిధులతో సంబంధం కలిగి ఉండరు. ఆశ్చర్యంలో ఉండటం అంటే ప్రతి దానితో సంబంధం కలిగి ఉండటం మరియు నిరంతరం స్వీకరించడం.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 285 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 285. WONDER 🍀*

*🕉. Knowledge destroys the capacity to wonder. Wonder is one of the most valuable things in life, and knowledge destroys it. The more you know, the less you wonder, and the less you wonder, the less life means to you. 🕉*

*You are not exhilarated with life. You are not surprised-you start taking things for granted. The innocent heart is continuously in wonder like a small child collecting seashells or colored stones on the beach or just running hither and thither in a garden after butterflies and being surprised by everything. That's why children ask so many questions. If you go for a morning walk with a child you start feeling exhausted, because the child goes on asking about this and that, asking questions that cannot be answered: "Why are the trees green?" and "Why is the rose red?" But why is the child asking? He is intrigued. He is interested in everything.*

*The word interest comes from a root that means to be involved in--inter-esse. The child is involved in everything that is happening. The more you become knowledgeable, the less and less you remain involved in life. You simply pass by--you are not concerned with the cow and the dog and the rose bush and the sun and the bird; you are not concerned. Your mind has become very narrow; you are just going to your office or back to your home. You are just running after money more and more, that's all. Or after power, but you are no longer related to life in its multi dimensionality. To be in wonder is to relate with everything, and to be constantly receptive.*
 
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 421 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 421 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*

*🌻 421. 'వ్యాహృతి' - 2🌻* 

*వ్యాహృతి మార్గమున శ్రీమాత నిత్యము జీవులను చేరును. నిత్యము అవతరించుచున్న గాయత్రిని వ్యాహృతి అని కూడ అందురు. విశేషముగ గాయత్రి మంత్రము నారాధించువారు గాయత్రి మంత్రము నకు పూర్వ భాగమున వ్యాహృతులను చేర్చి మంత్రోచ్చారణ చేయుదురు. అపుడు గాయత్రి మంత్రము నాలుగు పాదములను సంతరించుకొనును.*

*"ఓం తత్సవితుర్వరేణ్యం” అనుచు గాయత్రి మంత్రము ప్రారంభమగును. దానికి పూర్వమున "ఓం భూర్భువస్సువః” అని చేర్చుట వలన మంత్రోచ్చారణము విశేష రూపమును దాల్చును. అట్లు ఉచ్చరించి నపుడు ఉచ్చరించు వాని రూపమున గాయత్రి నిలచును. అపుడుతడు గాయత్రీ స్వరూపుడు కాగలడు. అట్టి వానినే "గాయత్ర్యాత్మకుడు”
అని పిలుతురు. వారు బుద్ది ప్రచోదకులు కాగలరు. సద్గురువు లట్టివారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 421 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*

*🌻 421. 'Vyahrti' - 2🌻*

*Through the path of Vyahrti ( the planes of existence), Sri Mata always reaches living beings. Gayatri is also known as Vyahrti. Devotees who worship the Gayatri Mantra more specifically, recite the mantra with Vyahritas before the Gayatri Mantra. Then the Gayatri mantra acquires four parts. The Gayatri Mantra begins with the chanting of 'Om Tatsavithurvarenyam'.*

*By adding 'Om Bhurbhuvassuvah' before it, the mantra takes on a special form. Gayatri stands in the form of the one who utters it. He/She, then, becomes the incarnation of Gayatri. Such a devotee is called "Gayatriaatmaka" the one whose essence is made of Gayatri. Their intellect is activated towards the divine. Sadgurus are such souls.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 17 - 6. Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 1 / శివ సూత్రములు - 17 - 6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 1


🌹. శివ సూత్రములు - 17 / Siva Sutras - 17 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 1 🌻

🌴. అనేక శక్తుల కలయికలో ద్వందాత్మకమైన విశ్వం నాశనం అవుతుంది. 🌴


చక్ర అనే పదం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. క్రమా వ్యవస్థ అంతిమ తత్వం యొక్క ఐదు శక్తులను అంగీకరిస్తుంది. అవి సృష్టి, జీవనోపాధి, వినాశనం, అనిర్వచనీయ స్థితి (అనాఖ్య) మరియు స్వేచ్ఛ (భాస, కాంతి, మెరుపు, ప్రకాశం మరియు మనస్సుపై చేసిన ముద్ర.). క్రమ వ్యవస్థ మరియు భాసం గురించి సూత్రం 5లో చర్చించబడ్డాయి (ఖచ్చితమైన ఆలోచన యొక్క శుద్ధీకరణ అంతిమ సాక్షాత్కారానికి సాధనం అని క్రమ వ్యవస్థ చెబుతుంది.

అనిశ్చిత ప్రకృతిలో శూన్యం నుండి పరిపూర్ణ స్పష్టత వరకు వరుస దశల ద్వారా శుద్దీకరణ జరగుతుంది). పైన పేర్కొన్న ఐదింటిలో మొదటి నాలుగింటిని చక్రాలు అంటారు. సంధానము (సంధిః (संधिः) పదం నుండి ఉద్భవించింది) అంటే కలయిక, సంయోగం, అనుసంధానం మొదలైనవి. విశ్వ అంటే విశ్వం మరియు సంహారః అంటే విధ్వంసం.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Siva Sutras - 017 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻6. Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 1 🌻

🌴. In union of multitude of powers is destruction of the differentiated universe. 🌴


Śakti means energy. The word chakra is slightly complicated. The krama system accepts five powers of the Ultimate. They are creation, sustenance, annihilation, assumption of the indefinable state (anākhya) and freedom (bhāsā, the light, luster, brightness and impression made on the mind.). Krama system and bhāsā have been discussed in sūtrā 5 (Krama system says that purification of definitive idea is the means to the realization of the Ultimate.

It is the nature of indetermination where purification happens through successive stages from nothingness to perfect clarity). Out of the five mentioned above the first four are known as cakras. Sandhāna (derived from the word sandhiḥ (संधिः) means union, conjunction, connection, etc. Viśva means the universe and saṁhāraḥ means destruction.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 280


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 280 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఒకసారి నువ్వు సిద్ధపడితే నువ్వు ఆశ్చర్యపోతావు. సమస్త అస్తిత్వం గొప్ప కవిత్వ పరిమళంతో కళకళలాడుతోంది. వ్యక్తి అన్నిటిలో అర్థాన్ని వెతకాల్సిన పన్లేదు. అప్పుడది తాత్విక అన్వేషణ అవుతుంది.🍀


పక్షుల నుంచి వాటి పాటల్ని నేర్చుకో. వృక్షాల నించీ నాట్యాన్ని నేర్చుకో. నదుల నించీ సంగీతం నేర్చుకో. ఒకసారి నువ్వు సిద్ధపడితే నువ్వు ఆశ్చర్యపోతావు. సమస్త అస్తిత్వం గొప్ప కవిత్వ పరిమళంతో కళకళలాడుతోంది. వ్యక్తి అన్నిటిలో అర్థాన్ని వెతకాల్సిన పన్లేదు. అప్పుడది తాత్విక అన్వేషణ అవుతుంది. నువ్వు 'దీని అర్థమేమిటి?' అని అడిగిన క్షణం నువ్వు కవిత్వ మార్గం నించి తప్పుకుంటావు.

'ఈ చెట్టు గాల్లో ఎందుకు కదులుతోంది' అని నువు అడగని క్షణం నువ్వు కవితాత్మకంగా మారతావు. అప్పుడు అద్భుతాలకు అద్భుతం సంభవం. అర్థాన్ని లక్ష్యపెట్టని వ్యక్తికి అప్పుడు అర్థం తెలిసి వస్తుంది. చెట్లతో నాట్యం చేయి. పిట్టలతో పాటలు పాడు. సముద్రంలో ఈతకొట్టు. ఎట్లాంటి అన్వేషణతో సంబంధం లేకుండా నీకు అర్థం తెలిసి వస్తుంది. నువ్వు ఈ అద్భుత అస్తిత్వంలో భాగమవుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

DAILY WISDOM - 15 - 15. To Assert Diversity . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 15 - 15. వైవిధ్యాన్ని నొక్కి . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 15 / DAILY WISDOM - 15 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 15. వైవిధ్యాన్ని నొక్కి చెప్పడం అంటే సంపూర్ణతను తిరస్కరించడం 🌻


అనేకత్వాన్ని గుర్తించడమంటే సంపూర్ణతను తిరస్కరించడమే. అంటే దాని అర్థం సంపూర్ణత భిన్నత్వాన్ని తిరస్కరిస్తుందని కాదు. భిన్నత్వం సంపూర్ణతలో కరిగిపోయి తన ఉనికిని కోల్పోతుందని అర్థం. భేదాలను విస్మరించడం అంటే సంపూర్ణత యొక్క ఉనికిని తిరస్కరించడమే అని కొంతమంది వాదిస్తారు. సంపూర్ణమైనది భేదపూరితమైన వాస్తవికతపై ఆధారపడి ఉండదు. సాపెక్షాన్ని గుర్తించకపోవడం ద్వారా మనం సంపూర్ణతను ప్రభావితం చేయలేము.

కానీ మనం, తద్వారా, మన ప్రస్తుత చైతన్య స్థితిని మెరుగుపరచుకొగలుగుతాము. వ్యక్తిత్వం ప్రతి అణువులో ఉంటుంది. ఈ అహాలు ఎంత అవిభాజ్యమై ఉండాలంటే, విడిపాటు అనేది ఒక అసాధ్యమైన భావనగా మారాలి. అప్పుడు సంపూర్ణత యొక్క స్వభావం అవగతమౌతుంది. మనం అనేకత్వాన్ని గుడ్డిగా నొక్కిచెప్పవచ్చు, కానీ ఏదైనా ఆమోదయోగ్యమైన తార్కికం ద్వారా దానిని స్థాపించడం సాధ్యం కాదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 DAILY WISDOM - 15 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 15. To Assert Diversity is to Deny Absoluteness 🌻


To assert diversity is to deny absoluteness. It does not, however, mean that the Absolute excludes the diverse finitudes, but the finite is eternally dissolved in or is identical with the Absolute, and therefore, it does not claim for itself an individual reality. It is argued that to ignore differences is to reduce the Absolute to a non-entity. The Absolute does not depend upon the reality of egoistic differences. By cancelling the relative we may not affect the Absolute.

But we, so long as we are unconscious of the fundamental Being, improve thereby our present state of consciousness. Individuality is in every speck of space and these egos must be so very undivided that diversity becomes an impossible conception and homogeneity persists in every form of true reasoning in our effort to come to a conclusion in regard to the nature of the Absolute. We may blindly assert difference, but it is not possible to establish it through any acceptable reasoning.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 150 / Agni Maha Purana - 150


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 150 / Agni Maha Purana - 150 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 46

🌻. శాలగ్రామాది మూర్తి వర్ణనము - 1🌻


హయగ్రీవుడు చెప్పెను.

బ్రహ్మదేవా! సాలగ్రామాదులపై నుండు హరిమూర్తులను గూర్చి చెప్పదను. ఇది భోగ మోక్షముల నిచ్చునది.

ద్వారము నందు రెండు చక్రములతో నల్లని సాలగ్రామము వాసుదేవుడు.

రెండు చట్రములున్న ఎఱ్ఱని శాల గ్రామము సంకర్షణుడు.

చిన్న చక్రము, అనేక రంధ్రములును ఉన్న నీలవర్ణ సాలగ్రామము ప్రద్యుమ్నుడు.

కమల చిహ్నము, గోలాకారము, పచ్చని రంగు, మూడురేఖలు ఉన్నది అనిరుద్ధుడు.

నాభి యందు ఉన్నతమై, పెద్ద రంధ్రములతో నల్లగా నుండునది నారాయణుడు.

కమల-చక్రచిహ్నములు, పృష్ఠభాగమున రంధ్రము, బిందువు ఉన్న శాలగ్రామము పరమేష్ఠి.

స్థూలమైన చక్రము మధ్య గద వంటి రేఖ ఉన్న శ్యామవర్ణమగు శాలగ్రామము విష్ణువు.

స్థూలచక్రము ఐదు బిందువులు ఉన్న కపిలవర్ణ శాలగ్రామము నృసింహుడు.

శక్తి అను అస్త్రముగుర్తు, విషమములైన రెండు చక్రములు, మూడు స్థూల రేఖలు ఉన్న ఇంద్రనీలమణి వంటి రంగుగల శాలగ్రామము వరాహము.

ఎత్తైన పృష్ఠ భాగము, గోలాకారమైన సుడి ఉన్న శ్యామవర్ణ శాలగ్రమము కూర్మము.

అంకుశ రేఖలు, బిందువులు ఉన్న నీల వర్ణ శాలగ్రామము హయగ్రీవుడు.

ఒక చక్రము, ఒక కమలము, పుచ్ఛాకారమేన రేఖలు ఉన్న, మణి వలె ప్రకాశించు శాలగ్రామము వైకుంఠుడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 150 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 46

🌻Characteristics of different Śālagrāma stones- 1 🌻


The Lord said:

1. I shall describe (the characteristics of) the śālagrāma mūrti[1] (the different gods represented by different kinds of śālagrāma stones) which yield enjoyment and emancipation. (The stone called) Vāsudeva is black (coloured) around its mouth and has (marks) of two discs on it.

2. The Saṅkarṣaṇa (stone) is red (in colour) and has marks

3. The Aniruddha (stone) is yellow (in colour) and has the mark of a lotus. It is circular (in shape) and has two or three rays. The Nārāyaṇa (stone) is black (in colour) with an elevated, and deep hole.

4. The Parameṣṭi (stone) (has the marks of) the lotus and. disc. It is perforated at the back and has dots on the surface. The Viṣṇu (stone) has a big disc (mark). It is black (in colour). It has a line in the middle part. It is of the shape of a mace.

5-6. The Nṛsiṃha (stone) is tawny. It has (the mark of) a big disc and five dots. The Varāha (stone) is of the shape of the female divinity. It has unequal discs. It is of the colour of sapphire. It is large with the marks of three lines and is good. The Kūrma stone has an elevated hinder part with circular lines. and is black (in colour).

7. The Hayagrīva (stone) has a line of the shape of a good. It is blue (coloured) and is dotted. The Vaikuṇṭha (stone) has (the mark of) a disc and lotus. It has the radiance of a gem. It has tail-shaped lines.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 303: 07వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 303: Chap. 07, Ver. 23

 

🌹. శ్రీమద్భగవద్గీత - 303 / Bhagavad-Gita - 303 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 23 🌴

23. అన్తవత్తు ఫలం తేషాం తద్ భవత్యల్పమేధసాం |
దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి ||


🌷. తాత్పర్యం :

అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు. కాని వారొసగెడి ఫలములు అల్పములు, తాత్కాలికములై యున్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు.

🌷. భాష్యము :

ఇతరదేవతలను పూజించువారు కూడా శ్రీకృష్ణభగవానునే చేరుదురని భగవద్గీతా వ్యాఖ్యాతలు కొందరు పలుకుదురు. కాని దేవతలను పూజించువారు ఆ దేవతలు నివసించు లోకమునె చేరుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అనగా సూర్యుని పూజించువారు సూర్యలోకమును చేరగా, చంద్రుని పూజించువారు చంద్రలోకమును చేరుదురు. అదే విధముగా ఇంద్రుని వంటి దేవతను పూజించినచో ఆ దేవతకు సంబంధించిన లోకమును మనుజుడు పొందగలడు.

అంతియే గాని ఏ దేవతను పూజించినను చివరకు అందరును శ్రీకృష్ణభగవానునే చేరుదున్నది సత్యము కాదు. అట్టి భావనమిచ్చుట ఖండింపబడినది. అనగా దేవతలను పూజించువారు భౌతికజగమునందలి ఆయా దేవతలా లోకములను చేరగా, దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తులు మాత్రము ఆ భగవానుని దివ్యధామమునే నేరుగా చేరుచున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 303 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 23 🌴

23. antavat tu phalaṁ teṣāṁ tad bhavaty alpa-medhasām
devān deva-yajo yānti mad-bhaktā yānti mām api


🌷 Translation :

Men of small intelligence worship the demigods, and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of the demigods, but My devotees ultimately reach My supreme planet.

🌹 Purport :

Some commentators on the Bhagavad-gītā say that one who worships a demigod can reach the Supreme Lord, but here it is clearly stated that the worshipers of demigods go to the different planetary systems where various demigods are situated, just as a worshiper of the sun achieves the sun or a worshiper of the demigod of the moon achieves the moon. Similarly, if anyone wants to worship a demigod like Indra, he can attain that particular god’s planet. It is not that everyone, regardless of whatever demigod is worshiped, will reach the Supreme Personality of Godhead.

🌹 🌹 🌹 🌹 🌹


గురు గోవింద్‌ సింగ్‌ జయంతి, Guru Gobind Singh Jayanti


🍀. గురు గోవింద్‌ సింగ్‌ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Guru Gobind Singh Jayanti to all 🍀

ప్రసాద్ భరద్వాజ

29 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹29, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

🍀. గురు గోవింద్‌ సింగ్‌ జయంతి శుభాకాంక్షలు, Good Wishes on Guru Gobind Singh Jayanti🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : గురు గోవింద్‌ సింగ్‌ జయంతి, Guru Gobind Singh Jayanti 🌺

🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 21 🍀


21. పరిస్ఫురన్నూపురచిత్రభాను – ప్రకాశనిర్ధూత తమోనుషంగా
పదద్వయీం తే పరిచిన్మహేఽంతః ప్రబోధరాజీవ విభాతసంధ్యామ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : క్రీడారంగంలో మితిమీరిన ఆటకోటితనం కూడదు. జీవితరంగంలో మితిమీరిన గంభీరముద్ర తగదు. రెండింటి యందునూ ఆటకోటితనపు స్వేచ్ఛతోపాటు గంభీరమైన కట్టుబాటును మనం అలవరించుకోడం అవసరం.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పౌష్య మాసం

తిథి: శుక్ల-సప్తమి 19:18:38 వరకు

తదుపరి శుక్ల-అష్టమి

నక్షత్రం: పూర్వాభద్రపద 11:45:31

వరకు తదుపరి ఉత్తరాభద్రపద

యోగం: వ్యతీపాత 11:45:58 వరకు

తదుపరి వరియాన

కరణం: గార 07:56:57 వరకు

వర్జ్యం: 21:12:24 - 22:47:08

దుర్ముహూర్తం: 10:26:54 - 11:11:19

మరియు 14:53:24 - 15:37:49

రాహు కాలం: 13:41:13 - 15:04:30

గుళిక కాలం: 09:31:23 - 10:54:40

యమ గండం: 06:44:50 - 08:08:06

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:39

అమృత కాలం: 04:04:40 - 05:36:32

మరియు 30:40:48 - 32:15:32

సూర్యోదయం: 06:44:50

సూర్యాస్తమయం: 17:51:04

చంద్రోదయం: 11:47:50

చంద్రాస్తమయం: 00:02:49

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: ముద్గర యోగం - కలహం

11:45:31 వరకు తదుపరి ఛత్ర యోగం

- స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

శివ సూత్రములు - 000 - పరిచయం / Siva Sutras - 000 - INTRODUCTION



🌹. శివ సూత్రములు - 000 / Siva Sutras - 000 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻పరిచయం🌻


శివ సూత్రాలు వాసుగుప్త (ca875–925 CE) ద్వారా వెల్లడి చేయబడి వ్రాయబడింది. సూత్రం ఆధ్యాత్మిక మరియు దైవిక మూలంగా పరిగణించబడుతుంది. కాశ్మీర్ శైవమతానికి, ఇది చాలా ముఖ్యమైన మూలాధారాలలో ఒకటి. ఇది శైవ ద్వంద్వ రహిత బోధనలను వివరిస్తుంది, ఇక్కడ ప్రతిదీ సృష్టించబడిన మరియు కరిగిపోయే అంతిమ వాస్తవికతను సాధించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ అంతిమ స్థితిని పరమ శివ అని పిలుస్తారు మరియు ఇది వర్ణించలేనిది.

శివ స్వభావాన్ని కలిగి ఉన్న వారి స్వంత స్వాభావిక- స్వభావంలో నివసించాలని గుర్తుంచుకునే వారికి ఈ శివ స్థితిని పొందడం కోసం ఎటువంటి ప్రయత్నం లేదా మార్గం (anpAy an-up¯aya) అవసరం లేదు. శివసూత్రంలో వివరించబడిన పరమ శివుని ప్రాప్తి కోసం మిగతా అందరికీ మూడు మార్గాలు (ఉపాయాలు) ఉన్నాయి. సూత్రంపై ధ్యానం చేయడానికి కఠినమైన ఆదేశం ఇవ్వబడలేదు. ఇది ఒకరి పరిణామ దశపై ఆధారపడి ఉంటుంది.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Siva Sutras - 000 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 INTRODUCTION 🌻

The Shiva Sutra was revealed to and written down by Vasugupta (ca875–925 CE). The Sutra is considered mystical and of divine origin. For Kashmir Saivism, it is one of the most important key sources. It outlines the teachings of Shaiva non-dualism, where the focus is on attaining the Ultimate Reality in which everything is created and dissolved. This ultimate state is called Param Shiva and is beyond description.

For attaining this state of Shiva for those who remember to reside in their own inherent-self-nature, which is of the nature of Shiva, no effort or no way (anpAy an-up¯aya) is needed. For everyone else there are three ways (up¯ayas) for the attainment of Param Shiva described in the Shiva Sutra. There is no strict order given for meditating on the Sutra. It depends on one’s stage of evolution.

🌹 🌹 🌹 🌹 🌹