🌹 28, MAY 2023 SATURDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 28, MAY 2023 SATURDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 28, MAY 2023 SATURDAY ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 184 / Kapila Gita - 184🌹 
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 38 / 4. Features of Bhakti Yoga and Practices - 38 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 776 / Vishnu Sahasranama Contemplation - 776 🌹 
🌻776. దురతిక్రమః, दुरतिक्रमः, Duratikramaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 735 / Sri Siva Maha Purana - 735 🌹
🌻. దేవస్తుతి - 5 / The Gods’ prayer - 5 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 356 / Osho Daily Meditations - 356 🌹 
🍀 356. మాటల గోడ / 356. WALL OF WORDS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 457 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 457 - 2 🌹 
🌻 457. 'మలయాచల వాసినీ' - 2 / 457. 'malayachala vasini' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 28, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 8 🍀*

*15. సదాగతిర్గంధవహో విహితో విధిరాశుగః |*
*పతంగః పతగః స్థాణుర్విహంగో విహగో వరః*
*16. హర్యశ్వో హరితాశ్వశ్చ హరిదశ్వో జగత్ప్రియః |*
*త్ర్యంబకః సర్వదమనో భావితాత్మా భిషగ్వరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దర్శనం - దర్శనం పలురకాలు. సూల దర్శనం ధ్యేయరూపాన్ని తాత్కాలికంగా మాత్రమే గ్రహిస్తుంది, ఆంతరంగిక భక్తి ఉంటే తప్ప అట్టి దర్శనం వలన నీలో పరివ స్థానం కలుగదు. ధ్యేయరూపాన్ని సచేతనంగా హృదయంలోనికి గ్రహించే సూక్ష్మదర్శన మొకటి ఉన్నది. అది సద్యః ఫల దాయకమై ఆధ్యాత్మిక పురోగతికి శుభారంభ మవుతుంది. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల-అష్టమి 09:58:50 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 26:21:52
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: హర్షణ 20:39:29 వరకు
తదుపరి వజ్ర
కరణం: బవ 09:55:50 వరకు
వర్జ్యం: 08:36:20 - 10:22:48
దుర్ముహూర్తం: 17:00:52 - 17:53:09
రాహు కాలం: 17:07:24 - 18:45:25
గుళిక కాలం: 15:29:23 - 17:07:24
యమ గండం: 12:13:21 - 13:51:22
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 19:15:08 - 21:01:36
సూర్యోదయం: 05:41:17
సూర్యాస్తమయం: 18:45:25
చంద్రోదయం: 12:48:57
చంద్రాస్తమయం: 00:56:54
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
26:21:52 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 184 / Kapila Gita - 184 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 38 🌴*

*38. దేహోఽపి దైవవశగః ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతిసమీక్షత ఏవ సాసుః|*
*తం సప్రపంచమధిరూఢసమాధియోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః॥*

*తాత్పర్యము : ఆత్మస్వరూప సాక్షాత్కారముసు పొందిన యోగి తన ప్రారబ్ధకర్మానుభవము ముగియునంత వరకూ ప్రాణసహితుడై శరీరమును ధరించి యుండును. అతనికి పరమాత్మతో అఖండ సంయోగము ఏర్పడి యున్నందున మేల్కొనువాడు, స్వప్సదృశ్యములను మిథ్యగా భావించినట్లు అతడు సాంసారిక విషయములను అసత్తుగా భావించును. తిరిగి సంసార బంధమున చిక్కుకొనడు.*

*వ్యాఖ్య : ఈ శరీరం కూడా మనం ఆచరించిన పుణ్య పాప కర్మలకు అనుగుణమైన శరీరం పరమాత్మ ఇస్తే వస్తుంది. ఆ కర్మల ఫలితాన్ని అనుభవించడానికే ఏ శరీరం అణువైనదైతే ఆ శరీరం ఇస్తాడు. మనమే ప్రాణమూ (సాసుః) ఇంద్రియమూ మనసూ బుద్ధి ఉన్నవరకూ, ఈ శరీరముతో అనుభవించే వాటిగురించీ, కర్మల గురించీ ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనకు కావలసిన ఉపకరణాలు మాత్రం పరమాత్మే ఇస్తాడు. మరి ఆ పాపం చేసేవాటిని పరమాత్మ ఎందుకిచ్చాడు? విత్తనం భూమిలో పడ్డప్పుడు ఎలాంటి విత్తనం పడితే అలాంటి చెట్టు వస్తుంది. పూర్వ జన్మలో ఆచరించిన కరమ సంస్కారానికి తగిన శరీరం ఇస్తాడు. అది మారాలనటే సిద్ధుల సంపర్కం కావాలి. అదే సత్సంగం. పరమాత్మకు దయ కలిగితే అలాంటి వారితో సంగం కలిగిస్తాడు.*

*ఎంత వరకూ శరీర సంబంధం విడిచిపెట్టదో అంతవరకూ దేహాత్మాభిమానం పోదు, ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మ స్వరూప సాక్షాత్కారం కలగడం అనేది, ఈ శరీరమూ ప్రాణము పోయిన తరువాతనే. అంటే ప్రారబ్ధ కర్మ కూడా పోయిన తరువాతనే. కొందరు సిద్ధులకి మాత్రం ఈ శరీరం ఉన్నా వారికి ఆత్మ స్వరూపజ్ఞ్యానం మోక్షం కలుగుతుంది. ఒక సారి అలాంటి సాక్షాత్కారం కలిగితే, కలలో కన్న వస్తువులను పొందలేనట్లుగా, వారు సంసారాన్ని పొందలేరు. వాస్తవముగా ఈ బ్రతుకంతా ఒక స్వప్నములాంటిది. అలాంటి వారు మళ్ళీ దేహ సంబంధాన్ని పొందరు. మళ్ళీ సంసారానికి రారు ("నన్ను పొందిన తరువాత వాడు మరలా పుట్టడు - గీత)*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 184 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 4. Features of Bhakti Yoga and Practices - 38 🌴*

*38. deho 'pi daiva-vaśagaḥ khalu karma yāvat svārambhakaṁ pratisamīkṣata eva sāsuḥ*
*taṁ sa-prapañcam adhirūḍha-samādhi-yogaḥ svāpnaṁ punar na bhajate pratibuddha-vastuḥ*

*MEANING : The body of such a liberated yogī, along with the senses, is taken charge of by the Supreme Personality of Godhead, and it functions until its destined activities are finished. The liberated devotee, being awake to his constitutional position and thus situated in samādhi, the highest perfectional stage of yoga, does not accept the by-products of the material body as his own. Thus he considers his bodily activities to be like the activities of a body in a dream.*

*PURPORT : The gross body is made of the gross elements of matter, and the subtle body is made of mind, intelligence, ego and contaminated consciousness. If one can accept the subtle body of a dream as false and not identify oneself with that body, then certainly an awake person need not identify with the gross body. As one who is awake has no connection with the activities of the body in a dream, an awakened, liberated soul has no connection with the activities of the present body. In other words, because he is acquainted with his constitutional position, he never accepts the bodily concept of life.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 776 / Vishnu Sahasranama Contemplation - 776🌹*

*🌻776. దురతిక్రమః, दुरतिक्रमः, Duratikramaḥ🌻*

*ఓం దురతిక్రమాయ నమః | ॐ दुरतिक्रमाय नमः | OM Duratikramāya namaḥ*

నాతి క్రామన్తి సూర్యాద్యా ఆస్యాజ్ఞాం భయకృత్త్వతః ।
ఇతి దురతిక్రమ ఇత్యుచ్యతే సద్భిరచ్యుతః ॥
భయాదస్యాగ్నిస్తపతి భయాదితి మహద్భయమ్ ।
వజ్రముద్యతమిత్యాది శ్రుతివాక్యానుసారతః ॥

*ఈతని ఆజ్ఞ ఎంత శ్రమచేత కూడ అతిక్రమించుటకు శక్యము కాదు. ఈతడు సర్వులకును భయహేతువు కావున సూర్యాదులును ఈతని ఆజ్ఞను అతిక్రమించరు.*

:: తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి (బ్రహ్మానందవల్లి) ద్వితీయాధ్యాయః - అష్టమోఽనువాకః ::
భీషాఽస్మాద్వాతః పవతే । భీషోదేతి సూర్యః । భీషాఽస్మాదగ్నిశ్చేన్ద్రశ్చ । మృత్యుర్ధావతి పఞ్చమ ఇతి । ... (1)

*వాయువు పరబ్రహ్మము భయము చేత వీచుచున్నది. సూర్యుడు సైతమూ పరబ్రహ్మము భయము వలన ఉదయించుచున్నాడు. పరబ్రహ్మము వలన భయము చేత అగ్నియు, ఇంద్రుడు, అయిదవవాడగు యముడును ప్రవర్తించుచున్నారు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 776🌹*

*🌻776. Duratikramaḥ🌻*

*OM Duratikramāya namaḥ*

नाति क्रामन्ति सूर्याद्या आस्याज्ञां भयकृत्त्वतः ।
इति दुरतिक्रम इत्युच्यते सद्भिरच्युतः ॥
भयादस्याग्निस्तपति भयादिति महद्भयम् ।
वज्रमुद्यतमित्यादि श्रुतिवाक्यानुसारतः ॥

Nāti krāmanti sūryādyā āsyājñāṃ bhayakr‌ttvataḥ,
Iti duratikrama ityucyate sadbhiracyutaḥ.
Bhayādasyāgnistapati bhayāditi mahadbhayam,
Vajramudyatamityādi śrutivākyānusārataḥ.

*The One whose commandment cannot be disobeyed. On account of fear, the sun etc., do not transgress Him.*

Taittirīya Upaniṣad - Ānandavalli (Brahmānandavalli) Section II - Chapter VIII
Bhīṣā’smādvātaḥ pavate , bhīṣodeti sūryaḥ , bhīṣā’smādagniścendraśca , mr‌tyurdhāvati pañcama iti , ... (1)

:: तैत्तिरीयोपनिषत् - आनंदवल्लि (ब्रह्मानंदवल्लि) द्वितीयाध्यायः - अष्टमोऽनुवाकः ::
भीषाऽस्माद्वातः पवते । भीषोदेति सूर्यः । भीषाऽस्मादग्निश्चेन्द्रश्च । मृत्युर्धावति पञ्चम इति । ... (१)

*From Its (parabrahma) fear, the wind blows; from fear rises the sun, from the fear of It again Indra, Fire and the fifth i.e., death, proceed (to their respective duties).*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥
Samāvarto’nivr‌ttātmā durjayo duratikramaḥ,Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 737 / Sri Siva Maha Purana - 737 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 11 🌴*
*🌻. దేవస్తుతి - 5 🌻*

శంకరుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! హరీ! ధేవతలారా! నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. మీరందరు విచారము చేసి మీ మనస్సులలోని అభీష్టమును చెప్పుడు. వరము నిచ్చెదను (35).

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! హరుడు ప్రసన్నమగు మనస్సతో పలికిన ఈ మాటను విని దేవతలందరు ఇట్లు బదులిడిరి (36).

దేవతలందరు ఇట్లు పలికిరి -

హే భగవాన్‌! నీవు ప్రసన్నుడవై వరమునీయ దలంచినచో, దేవతలమగు మమ్ములను నీ దాసులుగా స్వీకరించుము. ఓ దేవదేవా! ఈశ్వరా! (37). దేవశ్రేష్ఠా! దేవతలకు ఎప్పుడెప్పుడు దుఃఖము కలిగిననూ, అప్పుడప్పుడు నీవునిశ్చయముగా ప్రకటమై దుఃఖమును నశింపజేయుము (38).

సనత్కుమారుడిట్లు పలికెను -

బ్రహ్మ, విష్ణువు మరియు దేవతలు ఒక్కుమ్మడిగా ఇట్లు పలుకగా, రుద్రభగవానుడు సంతసించిన అంతఃకరణము గలవాడై అనేక వర్యాయములు 'తథాస్తు' అని పలికెను (39). మీ ఈ స్తోత్రములచే సంతసించితిని. వీటిని పఠించు వారలకు, విను వారలకు సర్వకాలములయందు అభీష్టతమములైన సర్వసంపదలను నిశ్చయముగా నీయగలను. ఓ దేవతలార! తెలియుడు (40). సర్వదా దేవతల దుఃఖములను పోగొట్టు శంకరుడు సంతసిల్లి ఇట్లు పలికి,దేవతలందరికీ అభీష్టమైన కోర్కెలనన్నిటీని ఇచ్చెను (41).

శ్రీ శివ మహాపురానములో రుద్రసంహితయందు యుద్ధఖండలో దేవస్తుతి యను పదునొకండవ అధ్యాయము ముగిసినది (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 737🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 11 🌴*

*🌻 The Gods’ prayer - 5 🌻*

Śiva said:—
35. O Brahmā, O Viṣṇu, O gods, I am very much pleased with you all. All of you consider carefully and then let me know the boon you desire.

Sanatkumāra said:—
36. On hearing these words mentioned by Śiva, O excellent sage, all the Gods replied delightedly.

The gods said:—

31-38. O lord, if you are pleased, if the boon is to be granted by you to us, O lord of the master of gods, after knowing that we the gods are your slaves, then O most excellent deity, be pleased to appear always whenever misery befalls us and destroy the misery.
Sanatkumāra said:—

39. Thus requested simultaneously by Brahmā, Viṣṇu and the gods, Rudra was pleased in his mind and he said “Let it be ever so.

40. I am delighted by these hymns. O gods, I shall confer on those who read, recite and hear these hymns whatever they crave for”.

41. Saying this, the delighted Śiva the remover of the distress of gods, gave them every thing that was highly delightful to all the gods.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 356 / Osho Daily Meditations - 356 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 356. మాటల గోడ 🍀*

*🕉. భాషలో తొంభై శాతం కేవలం సంబంధానికి దూరంగా ఉండడమే. మనము సంబంధం కోరుకోని వాస్తవాన్ని దాచడానికి పదాల గొప్ప గోడను సృష్టిస్తాము. 🕉*

*మీకు బాధగా అనిపిస్తే చెప్పడం ఎందుకు? విచారంగా ఉండు! భాష లేకుండా మీరు ఏమనుకుంటున్నారో ప్రజలకు తెలుస్తుంది. మీరు చాలా చాలా సంతోషంగా ఉంటే, చెప్పడం ఎందుకు? సంతోషంగా ఉండు! మరియు ఆనందం ఇటాలియన్ లేదా ఇంగ్లీష్ లేదా జర్మన్ కాదు - ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు నృత్యం చేయవచ్చు, ఆపై వారు అర్థం చేసుకుంటారు. మీరు కోపంగా ఉన్నప్పుడు మీరు ఎవరినైనా కొట్టవచ్చు--చెప్పడం ఎందుకు? అది మరింత ప్రామాణికమయినది మరియు వాస్తవమైనది. మీరు కోపంగా ఉన్నారని ప్రజలు వెంటనే అర్థం చేసుకుంటారు. భాష అనేది మనం నిజంగా చెప్పకూడదనుకునే విషయాలను చెప్పే మార్గం.*

*ఉదాహరణకు, నేను మీపై కోపంగా ఉన్నాను కానీ నేను కోపంగా ఉండకూడదనుకుంటున్నాను, కాబట్టి నేను 'నాకు కోపంగా ఉంది' అని చెప్పాను. నేను కోపంగా ఉన్నాను అని చెప్పేందుకు ఇది చాలా అల్పమైన పద్దతి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను నిజంగా చెప్పదలచుకోలేదు, కాబట్టి నేను 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పాను. కేవలం మాటలు! నేను నిన్ను ప్రేమిస్తున్నట్లయితే, నేను దానిని మరింత నిజమైన పధ్ధతిలో చెబుతాను--పదాల ద్వారా ఎందుకు? సంజ్ఞ ద్వారా, ముఖం ద్వారా, శరీరం ద్వారా, స్పర్శ ద్వారా, వ్యక్తీకరణ ద్వారా వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి, కానీ భాష ద్వారా కాదు.అప్పుడు మీరు దాన్ని ఆస్వాదిస్తారు, ఎందుకంటే మీరు కొత్త అనుభూతిని కలిగి ఉంటారు మరియు మీరు ఆవిష్కరించగలరు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 356 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 356. WALL OF WORDS 🍀*

*🕉. Ninety percent of language is just an avoidance of relationship. We create a great wall of words to hide the fact that we don't want to relate. 🕉*

*If you are feeling sad, then why say it? Be sad! People will know what you mean without language. If you are very, very happy, then why say it? Be happy! And happiness is neither Italian nor English nor German-- everybody will understand it. You can dance when you are happy, and they will understand. When you are angry you can simply hit somebody--why say it? That will be more authentic and real. People will understand immediately that you are angry. Language is a way of saying things that we really don't want to say.*

*For example, I am angry at you and I don't want to be angry, so I simply say, "I am angry." It is a very impotent way of saying that I am angry. I love you and I don't want to really say it, so I simply say, "I love you." Just words! If I love you I will say it in some more real way--why through words? Try expressing through a gesture, through the face, through the body, through touch, through expression, but not through language. And you will enjoy it, because you will have a new feeling and you can innovate.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 457 -2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 457  - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।*
*మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀*

*🌻 457. 'మలయాచల వాసినీ' - 2 🌻* 

*భారతదేశమున మలయ పర్వతములు నైఋతి దిశయందున్నవి. ఈ కారణముగనే ఆ ప్రాంతము మలయాలయము అని ప్రసిద్ధి గాంచినది. మలయాలయమే కాలక్రమమున మళయాళ దేశమైనది. అందలి పర్వత శ్రేణులలో శ్రీమాత ముఖాంబికగా వెలసియున్నది. ఆమెను మూకాంబిక అని పిలుతురు. ఆమె ముఖ దర్శనము అత్యంత రమణీయముగ నుండును. భరతభూమి యందు గల శక్తి పీఠములలో ముఖాంబికా పీఠము అత్యంత శక్తివంతమైనది. శ్రీమాత ముఖతత్వము ఈ పర్వతశ్రేణులలో యుండుట విశేషము. ఆదిశంకరుల జన్మస్థానము కూడ ఈ ప్రాంతముననే యున్నది. శంకరుడు ముఖాంబిక అనుగ్రహముననే భరత భూమియందు ఆర్ష సంప్రదాయమును కలియుగమున సుస్థిరము గావించినారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 457 - 2  🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 95. Tejovati trinayana lolakshi kamarupini*
*Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻*

*🌻 457. 'malayachala vasini' - 2 🌻*

*In India, the Malayan mountains are in the south-west direction. It is for this reason that the region is known as Malayalam. Malayalam itself became the Malayalam country over time. In the beautiful mountain ranges, Srimata is shining brightly. She is called Mookambika. Her facial expression is very beautiful. The Mukhambika Peetha is the most powerful of the Shakti Peethas in Bharatabhumi. It is a privilege to have Srimata Mukhatattva in these mountain ranges. Birthplace of Adi Shankara is also in this area. With the grace of Mukambika, Shankara established the tradition of Arsha in the land of India in Kali Yuga.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శివ సూత్రములు - 090 - 2-05. విద్యాసముత్థానే స్వభావికే ఖేచరీ శివావస్తా - 2 / Siva Sutras - 090 - 2-05. vidyāsamutthāne svābhāvike khecarī śivāvasthā - 2


🌹. శివ సూత్రములు - 090 / Siva Sutras - 090 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-05. విద్యాసముత్థానే స్వభావికే ఖేచరీ శివావస్తా - 2 🌻

🌴. భగవంతుని చైతన్యం యొక్క స్వచ్ఛమైన జ్ఞానం అప్రయత్నంగా పెరుగుతుంది. ఈ శివ స్థితి ఖేచరీ స్థితితో ఒకటిగా గ్రహించ బడుతుంది. 🌴


విద్య అంటే అత్యున్నతమైన జ్ఞానం, శివుని గురించిన జ్ఞానం. శివ అంటే ఎదిగిన చైతన్యం యొక్క స్వచ్ఛమైన రూపం, విశ్వంలోని ప్రతిదీ అతని నుండే ఉద్భవించింది. ఈ అత్యున్నత జ్ఞానం ఇప్పటికే మానవులందరిలో ఉంది. కానీ మాయ ప్రభావం వల్ల, ఒకరి సంకల్ప శక్తి ద్వారా ప్రయత్నాలు ప్రారంభిస్తే తప్ప, ఈ అత్యున్నత జ్ఞానం వ్యక్తపరచబడదు. ఈ అప్రకటితమైన జ్ఞానాన్ని వెలిగించటానికి అవసరమైన సంకల్పం లేకపోతే, అది ఎప్పటికీ ప్రకటితమవదు. స్వాభావికమైన ఈ జ్ఞానాన్ని వ్యక్తీకరించేంత వరకు, ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యాన్ని సాధించలేము. కావున, ఈ స్వాభావిక జ్ఞానము చైతన్యం తన స్వయం యొక్క ఎల్లలు దాటి ప్రకటితమవడానికి ఉద్భవించవలసి ఉంటుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 090 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-05. vidyāsamutthāne svābhāvike khecarī śivāvasthā - 2 🌻

🌴. The pure knowledge of God consciousness effortlessly rises and this state of Śiva is realized as one with the state of khecarī. 🌴


Vidyā means supreme knowledge, the knowledge about Śiva. Śiva means the purest form of illuminated consciousness, from whom everything in the universe originates. This supreme knowledge already exists in all the human beings. But due to the effect of māyā, this supreme knowledge do not manifest, unless efforts are initiated by means of one’s will power. If one does not have the necessary will to kindle this muted knowledge, it remains muted forever. Unless this inherent knowledge is made to manifest, the ultimate goal of spirituality cannot be attained. Therefore, this inherent knowledge has to emerge out to fix his consciousness beyond his own self.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 353


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 353 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రతిస్పందించడమంటే యాంత్రికత. అచేతనత్వం. స్పందించడమంటే యాంత్రికత లేని తత్వం, చైతన్యం. స్పందిచడమంటే పరిస్థితిని బట్టి కలిగేది, ప్రతిస్పందించడమంటే పాత పద్ధతిని బట్టి ప్రవర్తించేది. 🍀

మనిషి యాంత్రికంగా జీవిస్తాడు. నిద్రలో నడిచినట్లు జీవిస్తాడు. అతను రోబోట్ లాగా పని చేసుకుంటూ పోతాడు. నువ్వు నీ చర్యల్ని పరిశీలిస్తే ఆశ్చర్యపడతావు. నువ్వు ఒకే ఒక తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చెయ్యడం చూసి విస్తుపోతావు. వాటిని మళ్ళీ చేయకూడదని చాలా సార్లు నువ్వు నిర్ణయాలకు కూడా వచ్చి వుంటావు. కానీ ఆ నిర్ణయాలు అర్థరహిత మయినవి. ఆ పరిస్థితి వచ్చినపుడల్లా నువ్వు మళ్ళీ మళ్ళీ పాతపద్ధతిలోనే పరిష్కరించాలనుకుంటావు. ఎట్లా స్పందించాలో నీకు తోచదు. ఈ రెండు పదాలు ముఖ్యమైనవి.

ప్రతిస్పందించడమంటే యాంత్రికత. అచేతనత్వం. స్పందించడమంటే యాంత్రికత లేని తత్వం, చైతన్యం. స్పందిచడమంటే పరిస్థితిని బట్టి కలిగేది, ప్రతిస్పందించడమంటే పాత పద్ధతిని బట్టి ప్రవర్తించేది. ప్రతిస్పందన అంటే సిద్ధంగా వున్న సమాధానాల్ని ముందుకు తేవడం. గతం ఆధిపత్యం చెలాయించడం, అదీ ప్రతిస్పందన. ఈ క్షణంలో జీవించడం, గతం జోక్యం చేసుకోకపోవడం అది స్పందించడం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 88 - 28. The Cosmic Being Manifested Himself as All Things / నిత్య ప్రజ్ఞా సందేశములు - 88 - 28. విశ్వరూపం తానే అన్ని వస్తువులుగా వ్యక్తమవుతుంది


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 88 / DAILY WISDOM - 88 🌹

🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 28. విశ్వరూపం తానే అన్ని వస్తువులుగా వ్యక్తమవుతుంది 🌻

దేవతలు మరియు అసురులు రెండు ధోరణులు, పదార్థాలు కాదు. ఏకీకరణ ధోరణి దైవిక సూత్రం, మరియు విభజన రాక్షసీ సూత్రం. ఇంద్రియాలు అసమర్థమైనవి; అవి అసురులచే ఓడిపోయాయి, అంటే ఇంద్రియాల దేవతల యొక్క అసలు స్థానాన్ని తిరిగి పొందేందుకు ఉద్దేశించిన ఈ ఏకీకరణ చర్యను తమంత తాము చేయలేవు అని అర్థం.

ఇంతకు ముందే చెప్పినట్లుగా, వ్యక్తిగత సృష్టి ప్రక్రియలో జరిగిన పొరపాటు ఏమిటంటే విషయం మరియు వస్తువు యొక్క తిరోగమనం. వాటిని తప్పు స్థానాల్లో ఉంచబడ్డాయి. ఐతరేయ ఉపనిషత్తులో, ఈ అవరోహణ ప్రక్రియ గురించి మనకు మరింత స్పష్టమైన వివరణ ఉంది. విశ్వ జీవి తనను తాను ఇంద్రియ వస్తువులుగా భావించే ఐదు మూలకాలు-భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఈథర్ వరకు అన్ని విషయాల వలె వ్యక్తీకరించబడింది. ఈ ఐదు అంశాలు మన ఇంద్రియాలు, కానీ అవి దైవిక అభివ్యక్తి ప్రక్రియలో చివరి పరిణామాలు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 88 🌹

🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 28. The Cosmic Being Manifested Himself as All Things 🌻


The Devas and the Asuras are two tendencies, and not substances. The tendency to unification is the divine principle, and the urge to diversification is the demoniacal principle. The sense organs are incapable; they were defeated by the Asuras, which means to say, that the sense organs cannot work up this unifying activity which is intended for regaining the original position of the deities of the senses.

As mentioned earlier, the mistake that happened during the process of individual creation is a reversal of the subject and the object, placing them in wrong positions. In the Aitareya Upanishad, we have a more clear exposition of this descending process. The Cosmic Being manifested Himself as all things, down to the five elements—earth, water, fire, air and ether—which we regard as objects of sense. The five elements are the objects of our senses, but they were the last evolutes in the process of Divine manifestation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 223 / Agni Maha Purana - 223


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 223 / Agni Maha Purana - 223 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 65

🌻. సభాగృహ స్థాపనము. - 2 🌻


త్రిశాలగృహమున కున్న అనేక భేదములలో మొదటి మూడును ఉత్తమమైనవి. వీటిని ఈశాన్యమునందు నిర్మింపరాదు. దక్షిణమున అన్యగృహములతో గూడిన ద్విశాలాగృహము సర్వదా శ్రేష్ఠము. దక్షిణమున అనేక శాలా గృహము, ఏకశాలాగృహము గూడ ఉత్తమము. నైరృతిదిక్కునందు ఏకశాలాగృహము శ్రేష్ఠము. ఏకశాలగృహములో మొదటి రెండు భేదములును (ధ్రువము, ధాన్యము అనునవి) ఉత్తమముల. మిగిలినవి, అనగా పంచమ-నవమ-దశమ-ఏకాదశ- త్రయోదశ-చతుర్దశ భేదములు భయహేతువులు, చతుఃశాలాగృహము సర్వదా ఉత్తమము; సర్వదోషరహితము, దేవతలకు ఒక అంతస్తు మొదలు, ఏడు అంతస్తులు లుండునట్లు ఏర్పరుపవలెను.

దానికి ద్వారవేధాది దోషములుగాని, ప్రాచీన వస్తువులు గాని ఉండకూడదు. దానిని మానవులకు చెప్పిన కర్మలు, ప్రతిష్ఠా విధానము అనుసరించి స్థాపించవలెను. గృహప్రవేశము చేయనున్న గృహస్థుడు, సోమరితనము లేనివాడై, ఉదయముననే లేచి, సర్వౌషధులు కలిపిన జలముతో స్నానముచేసి, పవిత్రుడై, దైవజ్ఞములైన బ్రహ్మణులకు నమస్కరించి, వారికి మధురపదార్థములు భుజింప చేసి, వారిచే స్వస్తివాచనాదికము చేయించి, నడ్డిపై చేతులు పెట్టుకొని పూర్ణకలశాదులతో సుశోభిత మగు తోరణములు గల గృహము ప్రవేశించవలెను. పిమ్మట ఏకాగ్రచిత్తుడై గోవు ఎదుట చేతులు జోడించి, ఈ పుష్టికారక మంత్రములు పఠించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 223 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 65

🌻The building of pavilions in front of the temples (sabhā-sthāpana) - 2 🌻

10. It is commended if we have three after leaving the north and east in houses having three storeys. Together with the building on the opposite side there will always be two buildings in the south.

11. One-storeyed building may be had in the south or there may be two one-storeyed buildings in the west. The other kinds of buildings cause fear.

12-13. A four-storeyed building devoid of all defects is always commended. One may build a mansion having one-storey or seven-storeys without the door, platform and moulding. The mansions of the images of gods should be consecrated in the prescribed way for the gods.

14-16. The hall should be consecrated with the ceremonies as described (for the installation of an image). The consecrator should bathe in the herbal waters and becoming pure and alert should feed brahmins with sweets. He should then enter the hall decked with pitchers and arches, with his hand placed on the back of a cow, and after having wished prosperity to the brahmins. The householder should then enter the house after having honoured the astrologers. The following mantra of prosperity should be repeated.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 376: 10వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 376: Chap. 10, Ver. 04

 

🌹. శ్రీమద్భగవద్గీత - 376 / Bhagavad-Gita - 376 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 04 🌴

04. బుద్ధిర్ జ్ఞానమసమ్మోహ: క్షమా సత్యం దమ: శమ: |
సుఖం దుఃఖం భవో(భావో భయం చాభయమేవ చ ||

🌷. తాత్పర్యం :

బుద్ధి, జ్ఞానము, సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము,

🌷. భాష్యము :

జీవుల శుభాశుభములైన వివధ గుణములన్నియును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. ఆ గుణములే ఇచ్చట వివరింపబడినవి. విషయములను సరియైన దృక్పథముతో విశ్లేషించు శక్తియే బుద్ధి యనబడును. ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికమనెడి అవగాహనయే జ్ఞానము. విశ్వవిద్యాలయ చదువుతో లభ్యమైన జ్ఞానము భౌతికమునకు సంబంధించిన జ్ఞానమైనందున, వాస్తవజ్ఞానముగా ఆంగీకరింపబడదు. ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ భేదము నెరుగగలుగుటయే వాస్తవజ్ఞానము. కాని నేటి ఆధునిక విద్యావిధానమున ఆధ్యాత్మికత్వమును గూర్చిన ఎట్టి జ్ఞానము లేదు. జనుల కేవలము భౌతికమూలకములు మరియు దేహావసరముల యెడ మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విద్యాలయజ్ఞానము అసంపూర్ణమై యున్నది. మనుజుడు శంకను వదిలి దివ్యతత్త్వము నవగాహన చేసికొనినప్పుడు సంశయము మరియు భ్రాంతిరాహిత్యమనెడి (అసమ్మోహము) స్థితిని సాధించగలడు. అట్టివాడు నెమ్మదిగా అయినప్పటికిని నిక్కముగా భ్రాంతి నుండి ముక్తుడు కాగలడు. కనుక దేనిని కూడా గ్రుడ్డిగా ఆంగీకరింపక శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింప వలసియున్నది.

ఓర్పు మరియు క్షమాగుణములను (క్షమ) అలవరచుకొని ఇతరుల సాధారణ అపరాధముల యెడ ఓర్పును కలిగి వారిని క్షమింపవలెను. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా తెలియజేయుటయే సత్యమనుదాని భావము. వాస్తవములనెన్నడును తప్పుగా ప్రదర్శించరాదు. ఇతరులకు నచ్చునదైనప్పుడే సత్యమును పలుకుట సాంఘికమర్యాదయైనను వాస్తవమునకు అది సత్యసంధత కానేరదు. కావున వాస్తవములను సర్వులు అవగాహన చేసికొను రీతిలో సత్యమును నిక్కచ్చిగా పలుకవలెను. దొంగను దొంగయని పలికి జనులను సావధానపరచుటయే సత్యము కాగలదు. సత్యము కొన్నిమార్లు రుచింపకపోయినను ఎవ్వరును దానిని పలుకుట యందు జంకును కలిగియుండరాదు. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా ప్రదర్శించవలెనని సత్యసంధత కోరును. సత్యమునకు ఒసగబడు నిర్వచనమిదియే.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 376 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 04 🌴

04. buddhir jñānam asammohaḥ kṣamā satyaṁ damaḥ śamaḥ
sukhaṁ duḥkhaṁ bhavo ’bhāvo bhayaṁ cābhayam eva ca

🌷 Translation :

Intelligence, knowledge, freedom from doubt and delusion, forgiveness, truthfulness, control of the senses, control of the mind, happiness and distress, birth, death, fear, fearlessness,

🌹 Purport :

The different qualities of living entities, be they good or bad, are all created by Kṛṣṇa, and they are described here. Intelligence refers to the power to analyze things in their proper perspective, and knowledge refers to understanding what is spirit and what is matter. Ordinary knowledge obtained by a university education pertains only to matter, and it is not accepted here as knowledge. Knowledge means knowing the distinction between spirit and matter. In modern education there is no knowledge about spirit; they are simply taking care of the material elements and bodily needs. Therefore academic knowledge is not complete.

Asammoha, freedom from doubt and delusion, can be achieved when one is not hesitant and when he understands the transcendental philosophy. Slowly but surely he becomes free from bewilderment. Nothing should be accepted blindly; everything should be accepted with care and with caution. Kṣamā, tolerance and forgiveness, should be practiced; one should be tolerant and excuse the minor offenses of others. Satyam, truthfulness, means that facts should be presented as they are, for the benefit of others. Facts should not be misrepresented.

🌹 🌹 🌹 🌹 🌹


27 May 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 27, మే, May 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 21 🍀

39. య యేన సంజపేత్ ధీమాన్ స్తోత్రం వా ప్రపఠేత్ సదా |
మహాభైరవసాయుజ్యం స్వాంతకాలే భవేద్ధ్రువమ్
ఇతి రుద్రయామల తంత్రే స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రమ్ ||

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : హృదయం విచ్చుకొన్నప్పుడు....

నీ హృదయ కవాటం విచ్చుకొన్నప్పుడు నీలోనుండి ప్రసరించే ప్రేమను ప్రాణకోశ సంబంధమైన ఇంద్రియ ప్రవృత్తుల పాలు చెయ్యకుండా పరమాత్మయందే దానిని లగ్నం చెయ్యి. అప్పుడది తన విశుద్ధతను కాపాడుకుంటూ చరితారతను పొందుతుంది. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: శుక్ల-సప్తమి 07:44:44

వరకు తదుపరి శుక్ల-అష్టమి

నక్షత్రం: మఘ 23:44:03 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: వ్యాఘత 19:57:13

వరకు తదుపరి హర్షణ

కరణం: వణిజ 07:42:44 వరకు

వర్జ్యం: 10:17:30 - 12:05:02

దుర్ముహూర్తం: 07:25:54 - 08:18:08

రాహు కాలం: 08:57:19 - 10:35:17

గుళిక కాలం: 05:41:25 - 07:19:22

యమ గండం: 13:51:11 - 15:29:09

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39

అమృత కాలం: 21:02:42 - 22:50:14

సూర్యోదయం: 05:41:25

సూర్యాస్తమయం: 18:45:04

చంద్రోదయం: 12:00:18

చంద్రాస్తమయం: 00:21:24

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య

ప్రాప్తి 23:44:03 వరకు తదుపరి లంబ

యోగం - చికాకులు, అపశకునం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹