నిర్మల ధ్యానాలు - ఓషో - 353


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 353 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రతిస్పందించడమంటే యాంత్రికత. అచేతనత్వం. స్పందించడమంటే యాంత్రికత లేని తత్వం, చైతన్యం. స్పందిచడమంటే పరిస్థితిని బట్టి కలిగేది, ప్రతిస్పందించడమంటే పాత పద్ధతిని బట్టి ప్రవర్తించేది. 🍀

మనిషి యాంత్రికంగా జీవిస్తాడు. నిద్రలో నడిచినట్లు జీవిస్తాడు. అతను రోబోట్ లాగా పని చేసుకుంటూ పోతాడు. నువ్వు నీ చర్యల్ని పరిశీలిస్తే ఆశ్చర్యపడతావు. నువ్వు ఒకే ఒక తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చెయ్యడం చూసి విస్తుపోతావు. వాటిని మళ్ళీ చేయకూడదని చాలా సార్లు నువ్వు నిర్ణయాలకు కూడా వచ్చి వుంటావు. కానీ ఆ నిర్ణయాలు అర్థరహిత మయినవి. ఆ పరిస్థితి వచ్చినపుడల్లా నువ్వు మళ్ళీ మళ్ళీ పాతపద్ధతిలోనే పరిష్కరించాలనుకుంటావు. ఎట్లా స్పందించాలో నీకు తోచదు. ఈ రెండు పదాలు ముఖ్యమైనవి.

ప్రతిస్పందించడమంటే యాంత్రికత. అచేతనత్వం. స్పందించడమంటే యాంత్రికత లేని తత్వం, చైతన్యం. స్పందిచడమంటే పరిస్థితిని బట్టి కలిగేది, ప్రతిస్పందించడమంటే పాత పద్ధతిని బట్టి ప్రవర్తించేది. ప్రతిస్పందన అంటే సిద్ధంగా వున్న సమాధానాల్ని ముందుకు తేవడం. గతం ఆధిపత్యం చెలాయించడం, అదీ ప్రతిస్పందన. ఈ క్షణంలో జీవించడం, గతం జోక్యం చేసుకోకపోవడం అది స్పందించడం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment