శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-2🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 307-2. 'రమ్యా' 🌻

రమ్యగుణ మాధారముగ ఈశ్వరుని నుండి జీవులను విముఖులను చేయుట, మరల ఈశ్వరునికి సుముఖులను చేయునది కూడ శ్రీమాతయే. ఇరువురికిని మధ్యస్థముగ నిలచి సృష్టి పురోగమనమునకు, తిరోధానమునకు కారణమై నిలచును. కనుకనే ఆమెను 'మహామాయ' అని కూడ సంబోధింతురు. సృష్టియం దాకర్షణ లేర్పరచి జీవులను ఈశ్వరునకు దూరము చేయును.

త్రిమూర్తులు సహితము ఆమె యేర్పరచు రమ్యమగు సన్నివేశములలో మునిగి మాయ యందు పడిన సందర్భము లెన్నియో గలవు. జీవుడు ఏ కాలము నందైననూ, ఏ దేశము నందైననూ, ఏ రూపము నందైననూ, ఏ నామము నందైననూ తగులుకొని యుండు టకు రమ్యతే కారణము. తాను అమితాసక్తిని, ఆనందమును పొందు చున్న విషయమును శ్రీమాత అని భావించినచో ఆనందానుభూతియే యుండును గాని దుష్ఫలితము లుండవు.

ఏ యిష్టము లేక జీవుడుండడు. తన యిష్టానుపూర్తి కొరకే జీవించుచు నుండును. ఇష్టము వస్తువుపై నుండవచ్చును, రూపముపై నుండవచ్చును, దృశ్యముపై నుండవచ్చును, భావముపై నుండవచ్చును, సిద్ధాంతముపై నుండవచ్చును. దేనిపైననూ జీవునికి గల యిష్టము అతనియందు గల రమ్య ప్రజ్ఞయే. ఇష్ట మున్నచోట కష్ట మనిపించదు కదా! ఇట్టి ఆసక్తి అనేకానేక విషయములయందు కలుగుట తత్కారణ ముగ వారు జన్మ పరంపరలను పొందుట, జీవించుట జరుగుచున్నది. 'రమ్య' అను పదము శ్రీమాత తత్త్వములలో ఒక అద్భుతమగు తత్త్వము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 307 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 307. Ramyā रम्या (307) 🌻

She is the most beautiful of all.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Sep 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 68

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 68 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఎప్పుడు నువ్వు పరమానందంలో వుంటావో ఆ క్షణం నించీ నువ్వు అనంతంతో సమశృతిలో వున్నావనీ తెలుసుకో. మనం ఎప్పుడూ బాధగా వుంటే తెలిసో తెలియకో అనంతానికి వ్యతిరేకంగా, విశ్వగానానికి వ్యతిరేకంగా మనం వున్నామని గుర్తించాలి. దారి తప్పామని గుర్తించాలి. 🍀

జీవితం ఒక దైవికమయిన కథ. అది నీ జీవిత చరిత్ర. మనం కేవలం అందులోని పేజీలం, పేరాగ్రాపులం. ఫుట్ నోట్‌లం. అస్తిత్వమే మన గొప్ప ఆర్కెస్ట్రా. మనం చిన్ని వాద్యాలం. మనం అనంత గానంతో శృతి కలుపుతాం. అది మనకు పరమానందాన్నిస్తుంది. మనం అనంతానికి వ్యతిరేకంగా పాడితే అది కష్టాల్ని తెస్తుంది. కాబట్టి ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనం ఎప్పుడూ బాధగా వుంటే తెలిసో తెలియకో అనంతానికి వ్యతిరేకంగా, విశ్వగానానికి వ్యతిరేకంగా మనం వున్నామని గుర్తించాలి. దారి తప్పామని గుర్తించాలి. సరైన మార్గంలోకి రావాలి. దానికి ఎవర్నీ బాధ్యుల్ని చెయ్యకు. నీకు నిన్నే బాధ్యుణ్ణి చేయి.

ఎప్పుడు నువ్వు పరమానందంలో వుంటావో ఆ క్షణం నించీ నువ్వు అనంతంతో సమశృతిలో వున్నావనీ తెలుసుకో. అదెట్లా జరిగిందో గమనించు. అట్లాంటి అనుబంధాన్ని మళ్ళీ మళ్ళీ ఏర్పరచుకో. గాఢంగా ఏర్పరచుకో.

విషాదం, పరమానందం గొప్ప ఉపాధ్యాయులు. నిశ్శబ్దంగా ఈ యిద్దరు ఉపాధ్యాయుల్ని నువ్వు పరిశీలిస్తే నువ్వు ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్ళకు మించిన పవిత్ర గ్రంథాలు లేవు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

06 Sep 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 1

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 1 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 1. గురుపరంపర-1 🌻

మానవజాతి చరిత్రలో సత్యమును గూర్చి సిద్ధాంతములు వెలువడినవి. ఎన్ని సిద్ధాంతములు వ్యక్తమైనచో అన్ని వక్రసిద్ధాంతములు కూడ ఏర్పడినవి. ఎన్నియో సత్యసూత్రములు కూడ నశించినవి. కాని ఎప్పటి కప్పుడు సత్యము తనకు తానుగా హృదయ ద్వారము నుండి నిత్య నూతనముగా వ్యక్తమగుట భగవదనుగ్రహము. హృదయగహ్వరమునకు నడిపించుట గురుపరంపర యొక్క ముఖ్య ప్రయోజనము.

భృక్తమును సంఘసేవ ద్వారా రహితమును కావించుట, క్రమబద్ధమైన సాధన ద్వారా జీవునికి పరిణతి కలిగించుట, సృష్టి యందలి అందమును, వైభవమును రుచి చూపించుట, తత్ మార్గమున తపో దీక్షతో హృదయమున ప్రవేశపెట్టుట వేల సంవత్సరముల నుండి మా గురుపరంపర నిర్వర్తించుచున్న మహాయజ్ఞము.

గురుపరంపర అనంతత్వమునకు నిచ్చెన వలె నిలచిన బృందము. అనంతత్వము వరకు జీవునకు ప్రేరణనిచ్చి తద్వారమున జీవునికి అనుభూతి కలుగు అర్హత కల్పించుట వారి కర్తవ్యము నందొక భాగము. దారి వెదుకుకొను వారికి ధృవతారగా నిలచి వెలుగు మార్గమున ప్రవేశపెట్టి తాము నిష్క్రమింతురు. అనగా తెర వెనుక నుందురు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

06 Sep 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 484 / Vishnu Sahasranama Contemplation - 484

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 484 / Vishnu Sahasranama Contemplation - 484 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 484. విధాతా, विधाता, Vidhātā 🌻

ఓం విధాత్రే నమః | ॐ विधात्रे नमः | OM Vidhātre namaḥ

మహావిష్ణుర్విశేషేణ శేషదిగ్గజభూధరాన్ ।
భూతధాతౄన్దధాతీతి విధాతేత్యుచ్యతే బుధైః ॥

సర్వభూతములను ధరించు శేషునీ, అష్టదిగ్గజములను, సప్తకుల పర్వతములను కూడా తాను విశేషముగా ధరించువాడుగనుక ఆ మహావిష్ణునకు విధాతా అను నామముగలదు.

44. విధాతా, विधाता, Vidhātā

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 484 🌹

📚. Prasad Bharadwaj

🌻 484. Vidhātā 🌻

OM Vidhātre namaḥ

महाविष्णुर्विशेषेण शेषदिग्गजभूधरान् ।
भूतधातॄन्दधातीति विधातेत्युच्यते बुधैः ॥

Mahāviṣṇurviśeṣeṇa śeṣadiggajabhūdharān,
Bhūtadhātṝndadhātīti vidhātetyucyate budhaiḥ.

Since Lord Mahā Viṣṇu is the unique support of all agencies like Ādiśeṣa, the diggajas i.e., the eight elephants in the cardinal directions, the mountains that support all other things, He is called Vidhātā.

44. విధాతా, विधाता, Vidhātā

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

06 Sep 2021

6-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 6 సెప్టెంబర్ 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 87  / Bhagavad-Gita - 87 - 2-40🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 656 / Bhagavad-Gita -  656 -18-67🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 484 / Vishnu Sahasranama Contemplation - 484🌹
5) 🌹 DAILY WISDOM - 162🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 1 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 68 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. దారిద్య్ర దహన శివస్తోత్రం-1 🍀*

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 1 

గౌరీప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిపకంకణాయ |
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 2 

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 3 

🌻 🌻 🌻 🌻 🌻

06, సోమవారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 07:39:47 వరకు తదుపరి అమావాస్య
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: మఘ 17:52:23 వరకు తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: శివ 06:54:04 వరకు తదుపరి సిధ్ధ
 కరణం: శకుని 07:37:47 వరకు
వర్జ్యం: 06:00:00 - 07:34:56 మరియు 25:36:40 - 27:09:36
దుర్ముహూర్తం: 12:39:01 - 13:28:33 మరియు
15:07:35 - 15:57:07
రాహు కాలం: 07:35:42 - 09:08:33
గుళిక కాలం: 13:47:07 - 15:19:58
యమ గండం: 10:41:24 - 12:14:16
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 15:29:36 - 17:04:32
సూర్యోదయం: 06:02:51, సూర్యాస్తమయం: 18:25:41
వైదిక సూర్యోదయం: 06:06:23
వైదిక సూర్యాస్తమయం: 18:22:08
చంద్రోదయం: 05:11:44, చంద్రాస్తమయం: 18:14:24
సూర్య రాశి: సింహం, చంద్ర రాశి: సింహం
ఆనందాదియోగం: ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని 17:52:23 వరకు తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
పండుగలు :  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 87 / Bhagavad-Gita - 87 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 40 🌴

40. నేహాభీక్రమనాశోస్తి 
ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య 
త్రాయతే మహతో భయాత్ ||

🌷. తాత్పర్యం :
ఈ ప్రయత్నము నందు నష్టము గాని, హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్పపురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును.

🌻. భాష్యము :
కృష్ణభక్తిరసభావన యందు కర్మనొనరించుట (శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఎటువంటి భోగాభిలాష లేకుండా కర్మను చేయుట) యనునది మహోన్నత దివ్యకార్యము. అటువంటి కార్యమును కొద్దిగా ఆరంభిచినను అందు ఎటువంటి ఆటంకములు కలుగవు. అంతియేగాక అట్టి స్వల్పయత్నము ఏనాడును నశించిపోదు. 

భౌతికపరిధిలో ప్రారంభింపబడు కర్మ ఒకనాటికి సంపూర్ణము చెందవలసియే యుండును. అట్లుకానిచో ఆ యత్నమంతయు విఫలము కాగలదు. కాని కృష్ణభక్తిభావనలో ప్రారంభించబడు కర్మ సంపూర్ణము కాకున్నను శాశ్వతప్రభావమును కలిగియుండును. అనగా కృష్ణభక్తిభావన యందలి తన కర్మ పూర్ణము కానప్పటికిని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. 

కృష్ణపరమగు కర్మ ఒక్క శాతము పూర్తియైనను శాశ్వత ఫలమును కలిగియుండి తదుపరి ప్రారంభము రెండవ శాతము నుండి మొదలగును. కాని లౌకికకర్మ యందు నూటికి నూరుపాళ్లు సఫలత కలుగనిదే లాభము చేకూరదు. అజామిళుడు తన ధర్మమును కృష్ణభక్తి భావనలో కొద్దిగానే నిర్వర్తించినను భగవానుని కరుణా వలన అంత్యమున నూటికినూరుపాళ్ళు ఫలితమును పొందెను. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 87 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 40 🌴

40. nehābhikrama-nāśo ’sti pratyavāyo na vidyate 
sv-alpam apy asya dharmasya trāyate mahato bhayāt

🌻 Translation :
In this endeavor there is no loss or diminution, and a little advancement on this path can protect one from the most dangerous type of fear.

🌻 Purport :
Activity in Kṛṣṇa consciousness, or acting for the benefit of Kṛṣṇa without expectation of sense gratification, is the highest transcendental quality of work. Even a small beginning of such activity finds no impediment, nor can that small beginning be lost at any stage. Any work begun on the material plane has to be completed, otherwise the whole attempt becomes a failure. 

But any work begun in Kṛṣṇa consciousness has a permanent effect, even though not finished. The performer of such work is therefore not at a loss even if his work in Kṛṣṇa consciousness is incomplete. 

One percent done in Kṛṣṇa consciousness bears permanent results, so that the next beginning is from the point of two percent, whereas in material activity without a hundred percent success there is no profit. Ajāmila performed his duty in some percentage of Kṛṣṇa consciousness, but the result he enjoyed at the end was a hundred percent, by the grace of the Lord. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 656 / Bhagavad-Gita - 656 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 67 🌴*

67. ఇదం తే నాతపస్కాయ 
నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం 
న చ మాం యోభ్యసూయతి ||

🌷. తాత్పర్యం : 
ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపస్సంపన్నులు కానివారికి గాని, భక్తులు కానివారికి గాని, భక్తియుతసేవలో నిలువని వారికి గాని, నా యెడ అసూయను కలిగినవారికి గాని ఎన్నడును వివరించరాదు.

🌷. భాష్యము :
ధర్మవిధానములందలి తపస్సులకు ఆచరింపనివారికి, కృష్ణభక్తిభావనలో భక్తియోగమును నిర్వహింప సమకట్టనివారికి, శుద్ధభక్తుని సేవింపనివారికి, ముఖ్యముగా శ్రీకృష్ణుని చారిత్రాత్మక వ్యక్తిగా మాత్రమే భావించువారికి లేదా శ్రీకృష్ణుని గొప్పతనము నెడ అసూయను కలిగియుండువారికి ఈ గుహ్యతమజ్ఞానమును వివరింపరాదు. అయినను దానవప్రవృత్తి కలిగి శ్రీకృష్ణుని యెడ అసూయను కలిగినవారు సైతము కొన్నిమార్లు శ్రీకృష్ణుని వేరే విధముగా అర్చించుచున్నట్లు గోచరించును. 

అట్టివారు భిన్నవిధములుగా గీతావ్యాఖ్యానము చేయుట యనెడి వృత్తిని చేపట్టి, దానిని వ్యాపారముగా కొనసాగింతురు. కాని శ్రీకృష్ణుని యథార్థముగా తెలిసికొనగోరువారు మాత్రము అట్టి గీతావ్యాఖ్యానముల నుండి దూరులు కావలెను. భోగలాలసులైనవారికి గీతాప్రయోజనము అవగతము కాదు. 

భోగలాలసుడు కాకుండ, వేదనిర్దేశితములైన నియమములను కచ్చితముగా పాటించువాడు సైతము ఒకవేళ భక్తుడు కానిచో శ్రీకృష్ణుని అవగతము చేసికొనజాలడు. తమను తాము భక్తులుగా ప్రదర్శించుకొనుచు కృష్ణపరకర్మల యందు మాత్రము నియుక్తులు కానివారు కూడా శ్రీకృష్ణుని ఎరుగజాలరు. 

శ్రీకృష్ణుడు తాను దేవదేవుడనియు మరియు తనకు సమానమైనది లేదా తనకున్నను అధికమైనది వేరొక్కటి లేదనియు భగవద్గీత యందు తెలిపిన కారణముగా అతని యెడ అసూయను కలిగినవారు పలువురుందురు. కృష్ణుని యెడ అసూయను కలిగియుండెడి అట్టివారు గీతావగాహనకు అసమర్థులు కావున వారికి గీతను బోధింపరాదు.

 శ్రద్దారహితులైనవారు శ్రీకృష్ణుని మరియు భగవద్గీతను అవగతము చేసికొను అవకాశమే లేదు. కనుక శుద్ధభక్తుని నుండి శ్రీకృష్ణుని అవగతము చేసికొనకుండ ఎవ్వరును భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నింపరాదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 656 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 67 🌴*

67. idaṁ te nātapaskāya nābhaktāya kadācana
na cāśuśrūṣave vācyaṁ na ca māṁ yo ’bhyasūyati

🌷 Translation : 
This confidential knowledge may never be explained to those who are not austere, or devoted, or engaged in devotional service, nor to one who is envious of Me.

🌹 Purport :
Persons who have not undergone the austerities of the religious process, who have never attempted devotional service in Kṛṣṇa consciousness, who have not tended a pure devotee, and especially those who are conscious of Kṛṣṇa only as a historical personality or who are envious of the greatness of Kṛṣṇa should not be told this most confidential part of knowledge. 

It is, however, sometimes found that even demoniac persons who are envious of Kṛṣṇa, worshiping Kṛṣṇa in a different way, take to the profession of explaining Bhagavad-gītā in a different way to make business, but anyone who desires actually to understand Kṛṣṇa must avoid such commentaries on Bhagavad-gītā. 

Actually the purpose of Bhagavad-gītā is not understandable to those who are sensuous. Even if one is not sensuous but is strictly following the disciplines enjoined in the Vedic scripture, if he is not a devotee he also cannot understand Kṛṣṇa. 

And even when one poses himself as a devotee of Kṛṣṇa but is not engaged in Kṛṣṇa conscious activities, he also cannot understand Kṛṣṇa. There are many persons who envy Kṛṣṇa because He has explained in Bhagavad-gītā that He is the Supreme and that nothing is above Him or equal to Him. There are many persons who are envious of Kṛṣṇa. 

Such persons should not be told of Bhagavad-gītā, for they cannot understand. There is no possibility of faithless persons’ understanding Bhagavad-gītā and Kṛṣṇa. Without understanding Kṛṣṇa from the authority of a pure devotee, one should not try to comment upon Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 484 / Vishnu Sahasranama Contemplation - 484 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 484. విధాతా, विधाता, Vidhātā 🌻*

*ఓం విధాత్రే నమః | ॐ विधात्रे नमः | OM Vidhātre namaḥ*

మహావిష్ణుర్విశేషేణ శేషదిగ్గజభూధరాన్ ।
భూతధాతౄన్దధాతీతి విధాతేత్యుచ్యతే బుధైః ॥

సర్వభూతములను ధరించు శేషునీ, అష్టదిగ్గజములను, సప్తకుల పర్వతములను కూడా తాను విశేషముగా ధరించువాడుగనుక ఆ మహావిష్ణునకు విధాతా అను నామముగలదు.

44. విధాతా, विधाता, Vidhātā

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 484 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 484. Vidhātā 🌻*

*OM Vidhātre namaḥ*

महाविष्णुर्विशेषेण शेषदिग्गजभूधरान् ।
भूतधातॄन्दधातीति विधातेत्युच्यते बुधैः ॥

Mahāviṣṇurviśeṣeṇa śeṣadiggajabhūdharān,
Bhūtadhātṝndadhātīti vidhātetyucyate budhaiḥ.

Since Lord Mahā Viṣṇu is the unique support of all agencies like Ādiśeṣa, the diggajas i.e., the eight elephants in the cardinal directions, the mountains that support all other things, He is called Vidhātā.

44. విధాతా, विधाता, Vidhātā

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 162 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 10. Yoga is not Practised without Understanding 🌻*

The wisdom of life, which is philosophy, is an understanding of life. Yoga therefore is a philosophy upon which is constructed the beautiful edifice of its psychology. 

Yoga is not practised without understanding. It is a practice with a tremendous understanding behind it. When this understanding becomes complete, one becomes a perfect human being attuned not merely to sociological reality but to reality in its completeness. It has many stages, and not merely the stage of sociological reality which psychoanalysts are concerned with. 

There is some deeper reality to which we have to attune ourselves systematically. When through all the levels of reality we attune ourselves and harmonise ourselves, we are one with nature, one with truth, and ultimately one with God. This is yoga. Yoga began to contemplate the mysteries behind the phenomenon of unhappiness persisting in spite of one’s having everything in life.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 1 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 1. గురుపరంపర-1 🌻*

మానవజాతి చరిత్రలో సత్యమును గూర్చి సిద్ధాంతములు వెలువడినవి. ఎన్ని సిద్ధాంతములు వ్యక్తమైనచో అన్ని వక్రసిద్ధాంతములు కూడ ఏర్పడినవి. ఎన్నియో సత్యసూత్రములు కూడ నశించినవి. కాని ఎప్పటి కప్పుడు సత్యము తనకు తానుగా హృదయ ద్వారము నుండి నిత్య నూతనముగా వ్యక్తమగుట భగవదనుగ్రహము. హృదయగహ్వరమునకు నడిపించుట గురుపరంపర యొక్క ముఖ్య ప్రయోజనము. 

భృక్తమును సంఘసేవ ద్వారా రహితమును కావించుట, క్రమబద్ధమైన సాధన ద్వారా జీవునికి పరిణతి కలిగించుట, సృష్టి యందలి అందమును, వైభవమును రుచి చూపించుట, తత్ మార్గమున తపో దీక్షతో హృదయమున ప్రవేశపెట్టుట వేల సంవత్సరముల నుండి మా గురుపరంపర నిర్వర్తించుచున్న మహాయజ్ఞము. 

గురుపరంపర అనంతత్వమునకు నిచ్చెన వలె నిలచిన బృందము. అనంతత్వము వరకు జీవునకు ప్రేరణనిచ్చి తద్వారమున జీవునికి అనుభూతి కలుగు అర్హత కల్పించుట వారి కర్తవ్యము నందొక భాగము. దారి వెదుకుకొను వారికి ధృవతారగా నిలచి వెలుగు మార్గమున ప్రవేశపెట్టి తాము నిష్క్రమింతురు. అనగా తెర వెనుక నుందురు. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
 #మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 68 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ఎప్పుడు నువ్వు పరమానందంలో వుంటావో ఆ క్షణం నించీ నువ్వు అనంతంతో సమశృతిలో వున్నావనీ తెలుసుకో. మనం ఎప్పుడూ బాధగా వుంటే తెలిసో తెలియకో అనంతానికి వ్యతిరేకంగా, విశ్వగానానికి వ్యతిరేకంగా మనం వున్నామని గుర్తించాలి. దారి తప్పామని గుర్తించాలి. 🍀*

జీవితం ఒక దైవికమయిన కథ. అది నీ జీవిత చరిత్ర. మనం కేవలం అందులోని పేజీలం, పేరాగ్రాపులం. ఫుట్ నోట్‌లం. అస్తిత్వమే మన గొప్ప ఆర్కెస్ట్రా. మనం చిన్ని వాద్యాలం. మనం అనంత గానంతో శృతి కలుపుతాం. అది మనకు పరమానందాన్నిస్తుంది. మనం అనంతానికి వ్యతిరేకంగా పాడితే అది కష్టాల్ని తెస్తుంది. కాబట్టి ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనం ఎప్పుడూ బాధగా వుంటే తెలిసో తెలియకో అనంతానికి వ్యతిరేకంగా, విశ్వగానానికి వ్యతిరేకంగా మనం వున్నామని గుర్తించాలి. దారి తప్పామని గుర్తించాలి. సరైన మార్గంలోకి రావాలి. దానికి ఎవర్నీ బాధ్యుల్ని చెయ్యకు. నీకు నిన్నే బాధ్యుణ్ణి చేయి. 

ఎప్పుడు నువ్వు పరమానందంలో వుంటావో ఆ క్షణం నించీ నువ్వు అనంతంతో సమశృతిలో వున్నావనీ తెలుసుకో. అదెట్లా జరిగిందో గమనించు. అట్లాంటి అనుబంధాన్ని మళ్ళీ మళ్ళీ ఏర్పరచుకో. గాఢంగా ఏర్పరచుకో. 

విషాదం, పరమానందం గొప్ప ఉపాధ్యాయులు. నిశ్శబ్దంగా ఈ యిద్దరు ఉపాధ్యాయుల్ని నువ్వు పరిశీలిస్తే నువ్వు ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్ళకు మించిన పవిత్ర గ్రంథాలు లేవు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-2🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 307-2. 'రమ్యా' 🌻* 

రమ్యగుణ మాధారముగ ఈశ్వరుని నుండి జీవులను విముఖులను చేయుట, మరల ఈశ్వరునికి సుముఖులను చేయునది కూడ శ్రీమాతయే. ఇరువురికిని మధ్యస్థముగ నిలచి సృష్టి పురోగమనమునకు, తిరోధానమునకు కారణమై నిలచును. కనుకనే ఆమెను 'మహామాయ' అని కూడ సంబోధింతురు. సృష్టియం దాకర్షణ లేర్పరచి జీవులను ఈశ్వరునకు దూరము చేయును. 

త్రిమూర్తులు సహితము ఆమె యేర్పరచు రమ్యమగు సన్నివేశములలో మునిగి మాయ యందు పడిన సందర్భము లెన్నియో గలవు. జీవుడు ఏ కాలము నందైననూ, ఏ దేశము నందైననూ, ఏ రూపము నందైననూ, ఏ నామము నందైననూ తగులుకొని యుండు టకు రమ్యతే కారణము. తాను అమితాసక్తిని, ఆనందమును పొందు చున్న విషయమును శ్రీమాత అని భావించినచో ఆనందానుభూతియే యుండును గాని దుష్ఫలితము లుండవు. 

ఏ యిష్టము లేక జీవుడుండడు. తన యిష్టానుపూర్తి కొరకే జీవించుచు నుండును. ఇష్టము వస్తువుపై నుండవచ్చును, రూపముపై నుండవచ్చును, దృశ్యముపై నుండవచ్చును, భావముపై నుండవచ్చును, సిద్ధాంతముపై నుండవచ్చును. దేనిపైననూ జీవునికి గల యిష్టము అతనియందు గల రమ్య ప్రజ్ఞయే. ఇష్ట మున్నచోట కష్ట మనిపించదు కదా! ఇట్టి ఆసక్తి అనేకానేక విషయములయందు కలుగుట తత్కారణ ముగ వారు జన్మ పరంపరలను పొందుట, జీవించుట జరుగుచున్నది. 'రమ్య' అను పదము శ్రీమాత తత్త్వములలో ఒక అద్భుతమగు తత్త్వము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 307 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 307. Ramyā रम्या (307) 🌻*

She is the most beautiful of all.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹