🍀 24 - NOVEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

🌹🍀 24 - NOVEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 24 - NOVEMBER - 2022 THURSDAY, గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 94 / Kapila Gita - 94 🌹 సృష్టి తత్వము - 50
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 686 / Vishnu Sahasranama Contemplation - 686 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 133 / Agni Maha Purana - 133 🌹 🌻. శిలా విన్యాస విధి - 3 🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 268 / Osho Daily Meditations - 268 🌹 వేగం - SPEED
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 415-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 415-1 🌹 ‘మనోవాచామగోచరా - 1 'Manovachamagochara' - 1

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹24, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 18 🍀*

*18. స్వైరానుభావాస్ త్వదధీనభావాః సమృద్ధవీర్యాస్త్వదనుగ్రహేణ*
*విపశ్చితోనాథ తరంతి మాయాం వైహారికీం మోహనపింఛికాం తే ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నీ కర్మలన్నిటినీ నీలో నిష్కామస్థితిని నెలకొల్పుకొన్న మీదట, ఈశ్వరునికి బలిగా సమర్పించుకుంటూ పోవడమే ఇక నీవు చేయవలసినది. నీలో పనిచేపేది ఈశ్వర శక్తియేననీ, ఆమెయే ఆ పనిని ఈశ్వరునికి బలిగా సమర్పిస్తున్నదనీ నీవు తెలుసుకోవాలి. చేసే పని ఎంతగా నిష్కామమైతే, అర్పించే బలి కూడా అంతగా విశుద్ధమవుతూ వుంటుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మృగశిర మాసం
తిథి: శుక్ల పాడ్యమి 25:38:21 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: అనూరాధ 19:38:35 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: అతిగంధ్ 12:19:52 వరకు
తదుపరి సుకర్మ
కరణం: కింస్తుఘ్న 15:02:18 వరకు
వర్జ్యం: 01:18:00 - 02:46:00
మరియు 24:42:02 - 26:08:54
దుర్ముహూర్తం: 10:10:16 - 10:55:11
మరియు 14:39:47 - 15:24:43
రాహు కాలం: 13:26:48 - 14:51:01
గుళిక కాలం: 09:14:07 - 10:38:20
యమ గండం: 06:25:40 - 07:49:53
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 10:06:00 - 11:34:00
సూర్యోదయం: 06:25:40
సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 06:36:37
చంద్రాస్తమయం: 18:00:25
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు : ఆనంద యోగం - కార్య సిధ్ధి
19:38:35 వరకు తదుపరి కాలదండ
యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 94 / Kapila Gita - 94🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 50 🌴*

*50. ఏతాన్యసంహత్య యదా మహదాదీని సప్త వై|*
*కాలకర్మగుణోపేతో జగదాదిరుపావిశత్॥*

*మహత్తత్త్వము, అహంకారము, పంచభూతములను ఏడు తత్త్వములను పరస్పరము కలియకుండును. దేనికదియే విడివిడిగా ఉండును. అప్పుడు జగత్తునకు కారణుడైన శ్రీమన్నారాయణుడు కాలము, అదృష్టము, సత్త్వాది త్రిగుణములతో గూడి వాటి యందు ప్రవేశించును.*

*ఇలా ఉన్న ఏడూ (మహత్తు అహంకారమూ పంచభూతాలు) సృష్టించబడి ఉన్నా ఒక ఆకారంగా ఏర్పడలేకపోయాయి. ఇంద్రియాలు, భూతాలు, వాటి గుణాలు, తన్మాత్రలు, అన్ని విడి విడిగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రాహ్యములూ, ఇంకోటి గ్రాహకములూ. ఇంద్రియములు గ్రాహ్యములూ, గుణాలు గ్రాహకములు. తమలో తాము ఒకటై తమలో ఉన్న వాటిని గ్రహించి, "ఇది బాగుంది, ఇది బాగా లేదు" అని చెప్పడమే భోగము. అన్ని భోగాలకు మూలము శరీరము. అప్పుడు పరమాత్మ వీటన్నిటిలో ప్రవేశించాడు. ఒంటిగా ప్రవేశించకుండా, కాల కర్మ గుణములతో ప్రవేశించాడు. కర్మ అంటే మనము చేసుకున్న కర్మ, అదృష్టం. గుణము అంటే సత్వ రజో తమో గుణాలు.*

*బ్రహ్మాండములో ఉన్న అనంతకోటి జీవరాశులకూ ఆకారం చేయాలి. అందరినీ ఒకే ఆకారము చేయలేదు. దేవతలూ మానవులూ రాక్షసులూ పక్షులూ మొదలైన జీవాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు కలిపి ఒక ఆకారం చేయాలంటే ఒకే ఆకారం ఉండాలి. మరి, ఇంద్రియాలు ఒకటే ఐతే ఇన్ని ఆకారాలు ఎందుకు ఉన్నాయి. వాటి వాటి కర్మకనుగుణముగా, వాటిని అనుభవించడానికి అనువైన ఆకారముండాలి. అదే భోగాయతనం.*

*కాలమూ కర్మా అనే వాటి వలన ఇన్ని జీవులు ఉద్భవిస్తున్నాయి. ఏ ప్రాణికి ఏ పాపాన్ని ఏ ప్రాణికి ఏ పుణ్యాన్ని సరఫరా చేయాలో అలా చేస్తాడు. పరమాత్మ పరమాత్మగా రాలేదు, కాల కర్మములతో కలిసి ప్రవేశించాడు. ఇది వరకి జన్మలో వారు ఆచరించిన కర్మానుసారముగా భోగము అనుభవించడానికి తగిన ఆకారము ఇస్తాడు. కర్మ అంటే అదృష్టము. గుణము అంటే సత్వం రజస్సు తమస్సు. వారి వారి పాప పుణ్యాలకు ఏ ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలకు తగిన శరీరాన్ని ఇస్తాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 94 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 50 🌴*

*50. etāny asaṁhatya yadā mahad-ādīni sapta vai*
*kāla-karma-guṇopeto jagad-ādir upāviśat*

*When all these elements were unmixed, the Supreme Personality of Godhead, the origin of creation, along with time, work, and the qualities of the modes of material nature, entered into the universe with the total material energy in seven divisions.*

*After stating the generation of the causes, Kapiladeva speaks about the generation of the effects. At that time when the causes were unmixed, the Supreme Personality of Godhead, in His feature of Garbhodakaśāyī Viṣṇu, entered within each universe. Accompanying Him were all of the seven primary elements—the five material elements, the total energy (mahat-tattva) and the false ego. This entrance of the Supreme Personality of Godhead involves His entering even the atoms of the material world.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 686 / Vishnu Sahasranama Contemplation - 686🌹*

*🌻686. పూరయితా, पूरयिता, Pūrayitā🌻*

*ఓం పూరయిత్రే నమః | ॐ पूरयित्रे नमः | OM Pūrayitre namaḥ*

*న కేవలం పూర్ణ ఏవ సర్వేషామపి సమ్పదా ।*
*పూరయితాఽపి స హరిః పరమాత్మా జనార్దనః ॥*

*తాను కామిత ఫల పూర్ణుడగుట మాత్రమే కాదు; వారిని సంపదలతో పూరించువాడుగనుక ఆ పరమాత్మ అయిన జనార్దనుడు పూరయితా అని చెప్పబడుతాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 686🌹*

*🌻686. Pūrayitā🌻*

*OM Pūrayitre namaḥ*

न केवलं पूर्ण एव सर्वेषामपि सम्पदा ।
पूरयिताऽपि स हरिः परमात्मा जनार्दनः ॥

*Na kevalaṃ pūrṇa eva sarveṣāmapi sampadā,*
*Pūrayitā’pi sa hariḥ paramātmā janārdanaḥ.*

*He not merely Pūrṇah but also He fills all with riches. Hence for this reason, Lord Janārdana is called Pūrayitā.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 133 / Agni Maha Purana - 133 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 41*

*🌻. అథ శిలా విన్యాస విధి - 3🌻*

''సకలభూతముల అధీశ్వరివైన ఓ భూదేవీ! పర్వతాసమనముపై విరాజిల్లుచు, సముద్రములచే చుట్చబడియున్న నీవు ఏకాంతమునందు గర్భధారణము చేయుము. వసిష్ఠకన్యవైన ఓ నందా! వసువులతోడను, ప్రజలతోడను కూడియున్న నీవు నన్ను ఆనందింపచేయుము. భార్గవ పుత్రివైన ఓ జయా! నీవు ప్రజలకు విజయము నిచ్చుదానవు. (నాకు కూడ విజయము నిమ్ము.) 

అంగిరసుని పుత్రివైన ఓ పూర్ణా! నీవు నాకోరికలను తీర్పుము. కశ్యపమహర్షి పుత్రికవైన ఓభద్రా! నీవు నాకు కల్యాణమైన బుద్ధినిమ్ము. సకలబీజములతో నిండి, సమస్త రత్నౌషధుంతో సంపన్నమైన, సుందరియైన ఓ జయాదేవీ! వసిష్ఠ పుత్రికయైన ఓ నందాదేవీ! ఇచట ఆనంద పూర్వకముగ రమింపుము. 

కశ్యపుని కన్యయైన ఓ భద్రా! నీవు ప్రజాపతికి పుత్రివి. నాలుగు దిక్కులందును వ్యాపించినదానవు. చాలగొప్పదానవు సుందరివి, మనోహరమైనదానవు. ఈగృహమునందు రమింపుము. ఓ భార్గవీదేవీ! నీవు చాల ఆశ్చర్యమయురాలవు. గంధమాల్యాదులతో పూడింపబడి ప్రకాశించచున్నావు. జనులకు ఐశ్వర్యమునిచ్చు ఓదేవీ! నీవీ గృహమునందు విహరింపుము. ఈదేశాధిపతికిని, నగరాధిపతికిని, గృహాధిపతికిని, దీనియందు నివసించు బాలాదులకును, మనుష్యాది ప్రాణులకును ఆనందము కలిగించుటకై పశ్వాదులను వృద్ధిపొందింపుము.'' ఈవిధముగా ప్రార్థించి వాస్తుకుండమును గోమూత్రముతో తడుపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 133 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 41*
*🌻 Mode of performing consecration - 3 🌻*

21-22. The goddess earth should be worshipped in a copper vessel of the shape of a lotus. “O the exclusive mistress of all beings, abound with the summits of mountains as the seats, one surrounded by oceans, O goddess! You resort to this hole. O rejoicer! born of sage Vasiṣṭha! you rejoice with the Vasus and the progeny.

23. O Victorious! related to Bhārgava (Paraśurāma) Maker of thine subjects victorious! the perfect! the relative of Aṅgiras! fulfil all my desires.

24. O Auspicious one! related to sage Kāśyapa! Make my intellect good. One who is accomplished with all seeds! One who possesses all gems and herbs!

25. May you be victorious! O beautiful one! O rejoicer! Related to Vasiṣṭha! The daughter of the creator! O Goddess! O handsome one! Stay on here in bliss—O majestic one!

26. Stay thou in this house! O beautiful and brilliant one! the daughter of Kaśyapa! The honoured, most wonderful and bedecked with scents and garlands!

27. O Goddess! Stay in bliss in this room! O Bhār-gavi (daughter of Śukra)! Bestower of worldly prosperities! Possessed by the gods, kings, and masters of the house!

28. May you become the multiplier of animals for the happiness of men and others. Having said in this way one should then sprinkle cow’s urine on the pit.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 268 / Osho Daily Meditations - 268 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 268. వేగం 🍀*

*🕉. మనందరికీ మన స్వంత వేగం ఉంది. జీవితం మన స్వంత వేగంతో, సహజమైన దానితో కలసి కదలాలి. 🕉*

*మీరు మీ సరైన లయను కనుగొన్న తర్వాత, మీరు చాలా ఎక్కువ చేయగలరు. అప్పుడు మీ చర్యలు తీవ్రమైనవిగా వుండవు, అవి మరింత సజావుగా నడుస్తాయి. నెమ్మదిగా పనిచేసేవారు ఉన్నారు, కానీ నెమ్మదితనం దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. నిజానికి, ఇవి మంచి లక్షణాలు. వేగవంతమైన పనివాడు పరిమాణాత్మకంగా మంచివాడు. అతను లేదా ఆమె మరింత పరిమాణాత్మకంగా ఉత్పత్తి చేయగలరు కానీ గుణాత్మకంగా ఎప్పటికీ మంచిగా ఉండలేరు. నెమ్మదిగా పనిచేసేవాడు గుణాత్మకంగా మరింత పరిపూర్ణుడు. అతని శక్తి మొత్తం గుణాత్మక కోణంలోకి వెళుతుంది.*

*పరిమాణం ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ పరిమాణం నిజంగా విషయం కాదు. మీరు కొన్ని పనులు చేయగలిగితే, కానీ నిజంగా అందమైన పనులు, దాదాపు పరిపూర్ణంగా ఉంటే, మీరు చాలా సంతోషంగా మరియు సంతృప్తి చెందినట్లు భావిస్తారు. చాలా పనులు చేయాల్సిన అవసరం లేదు. మీకు పూర్తి సంతృప్తినిచ్చే ఒక పనిని మీరు చేయగలిగితే, అది సరిపోతుంది; మీ జీవితం సఫలమైంది. మీరు అనేక పనులు చేస్తూనే ఉంటారు, ఏదీ మీకు సఫలత నివ్వదు. దీనిలో ముఖ్యమైన విషయం ఏమిటి? కొన్ని ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవాలి. మానవ స్వభావము అంటూ లేదు. మనుషులు ఎంత మంది ఉన్నారో అన్ని మానవ స్వభావాలు ఉన్నాయి. వాటికి ఒక ప్రమాణం ఏమీ లేదు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 268 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 268. SPEED 🍀*

*🕉. We all have our own speeds. Life should move with our own speed, with that which is natural. 🕉*

*Once you find your right rhythm, you will be able to do much more. Your actions will not be hectic, they will run more smoothly, and you will be able to do much more. There are slow workers, but slowness has its own qualities. And in fact, those are better qualities. A fast worker can be quantitatively good. He or she can produce more quantitatively but qualitatively can never be very good. A slow worker is qualitatively more perfect. His whole energy moves into a qualitative dimension.*

*The quantity may not be much, but quantity is not really the point. If you can do a few things, but really beautiful things, almost perfect, you feel very happy and fulfilled. There is no need to do many things. If you can even do one thing that gives you total contentment, that is enough; your life is fulfilled. You can go on doing many things, with nothing fulfilling you. What is the point? A few basic things have to be understood. There is no such thing as human nature. There are as many human natures as there are human beings, so there is no one criterion.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 415 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 415 -1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

*🌻 415 'మనోవాచామగోచరా’ - 1🌻* 

*మనస్సునకు, వాక్కునకు గోచరము కానిది శ్రీమాత అని అర్థము. మనస్సుచేత పూర్ణముగ ఊహింపబడునది, వాక్కుచేత సంపూర్ణముగ ప్రకటింపబడునది శ్రీమాత. మనస్సుతో గాని, కన్నుతోగాని, చెవితోగాని, స్పర్శతోగాని, సుగంధ స్పర్శతోగాని, రుచితోగాని శ్రీమాతను లేశమాత్రము అనుభూతి చెందవచ్చును. మనస్సు, ఇంద్రియములు ఇత్యాదివి పరిమితములు. అట్టి వానిద్వారా అపరిమితమగు తత్త్వము ఎట్లు తెలియగలము. కాని తెలియు ప్రయత్నము చేయుచున్నచో మనస్సు, ఇంద్రియములు అపరిమిత తత్త్వమునకు ఉన్ముఖమై క్రమముగ అనుభూతి వృద్ధి యగుచుండును. అవగాహన పెరుగుచుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 415 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
✍️. Prasad Bharadwaj*

*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*

*🌻 415 'Manovachamagochara' - 1🌻*

*Srimata means that which is incomprehensible to mind and speech. Sri Mata cannot be fully conceived by the mind and cannot be fully revealed by speech. With the mind, with the eye, with the ear, with the touch, with the aromatic odour, with the taste, one can only feel a sliver of Srimata for mind and senses are limited and one cannot comprehend the infinite with finite mind. But if you try to know, the mind and the senses will be exposed to the unlimited philosophy and the comprehension will grow gradually. Awareness will increase.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 263


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 263 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడంటే అంతిమ చైతన్యం. ధ్యానం వంతెన లాంటిది. నీ అస్తిత్వపు పునాదుల వేపు నిన్ను తీసుకుపోతుంది. ఒకసారి నీ అస్తిత్వపు పునాదుల్ని నువ్వు రుచి చూస్తే తక్కినవన్నీ అర్థరహితాలని తెలుసుకుంటావు. 🍀


ప్రతి చెట్టు వేర్లూ భూమిలోకి వున్నట్లు ప్రతి చైతన్య పునాదులూ దేవుడిలో వున్నాయి. దేవుడంటే అంతిమ చైతన్యం. ధ్యానం వంతెన లాంటిది. నీ అస్తిత్వపు పునాదుల వేపు నిన్ను తీసుకుపోతుంది. ఒకసారి నీ అస్తిత్వపు పునాదుల్ని నువ్వు రుచి చూస్తే తక్కినవన్నీ అర్థరహితాలని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు సాధారణ జీవితాన్ని గడుపుతావు కానీ అది నటనలాంటిదే.

అయితే అది అందమయిన నాటకం. దాంట్లో వీలయినంత బాగా నటించు. కానీ నువ్వు అందులో భాగస్వామివి కాదన్న విషయం నీకు తెలుసు. అదొక పాత్ర. అది నీ అస్తిత్వం కాదు. ఒకసారి కిటికీ తెరుచుకుంటే నువ్వు రూపాంతరం చెందుతావు. సన్యాసత్వానికి సంబంధించిన సమస్త లక్ష్యమదే. కిటికీ తెరవడమంటే నీ దైవత్వాన్ని నువ్వు నిజంగా తెలుసుకోవడమే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 364 - 29. నాకు ఏమీ తెలియదు . . . / DAILY WISDOM - 364 - 29. I Knew Nothing . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 364 / DAILY WISDOM - 364 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻29. నాకు ఏమీ తెలియదు, కానీ బాగా నిద్ర పోయాను🌻


ఇంకా లోతులోకి వెళ్తే, నిద్ర అనే స్థితి ఉంది. నిద్రలో ఏమి జరుగుతుంది? మనస్సు కూడా ఇక్కడ పనిచేయదు. ఇది గమనార్హం. బుద్ధి, భావాలు, సంకల్పాలు మరియు ఇంద్రియ అవయవాలు సైతం అన్నీ పనిచేయడం మానేస్తాయి. అయితే నిద్రలో మనిషి ఉన్నాడా? అవును, అతను ఉనికిలోనే ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? అలాంటప్పుడు మనిషి అంటే ఏమిటి? 'నేను ఉన్నాను' అనేది సాధారణంగా ప్రతి ఒక్కరూ మేల్కొన్నప్పుడు చేసే వాదన. కానీ ఏ విధంగా ఉనికిలో ఉన్నారు? ఈ 'నేను', నేను ఏ స్థితిలో ఉంది? గాఢనిద్ర స్థితిలో 'నేను' శరీరంగా అయితే ఉనికిలో లేదు. అప్పుడు తెలివి పని చేయట్లేదు కాబట్టి ఇది కూడా ఉనికిలో లేదు. నిద్రావస్థలో ఎలాంటి మానసిక క్రియ జరగదు.

శరీరం లేనప్పుడు మనసు ఉండదు. మనిషిలో ఏమి మిగిలి ఉంది? ఏమీ మిగలలేదు; అది శూన్యం. మనిషి వివరించలేని ఒక చీకటిలో ఉన్నాడు, ఇది నిద్రతో గుర్తించబడింది. నిద్రలో ఎవరికీ ఏమీ తెలియదు. ఉదయం లేవగానే నిద్ర గురించి అందరూ ఏమంటారు? “నాకేమీ తెలియదు; నాకు బాగా నిద్ర పట్టింది.” కానీ 'నాకు ఏమీ తెలియదు, నాకు మంచి నిద్ర వచ్చింది' అని ఒకరు చెప్పినప్పుడు, ఒకరు స్వీయ-విరుద్ధమైన ప్రకటన చేస్తున్నారు. ఏమీ తెలియకపోతే, ఒక వ్యక్తి బాగా నిద్రపోయాడని ఎలా తెలుసుకో గలడు? నిద్రలో స్పృహకు సంబంధించిన వస్తువు లేనట్లు కనిపించినా ఏమీ తెలియదన్నది నిజం కాదు. నిద్రలో ఎవరికీ ఏమీ తెలియదు, ఎందుకంటే అక్కడ బాహ్య వస్తువు లేదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 364 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻29. I Knew Nothing, But I had a Good Sleep🌻


Deeper still, there is a state called sleep. What happens in sleep? Even the mind does not operate here. This is important to note. The intellect, feelings, volitions, and sense organs all cease to operate. But does man exist in sleep? Yes, he does exist. In what capacity? What is man then? “I am” is the assertion that everyone generally makes on waking. But in what way was one existing? In what state was this “I”, the self? In the state of deep sleep the “I” did not exist as the body. It did not exist as the intellect which was then not functioning.

There was no psychic operation of any kind in the state of sleep. When there is no body, no mind. what remains in man? Nothing remains; it is a vacuum, as it were. Man was in an inexplicable darkness, which is identified with sleep. No one knows anything in sleep. What does everyone say about sleep when one wakes up in the morning? “I knew nothing; I had a good sleep.” But when one says, “I knew nothing, I had good sleep,” one is making a self-contradictory statement. If nothing was known, how could one know that one slept well? It is not true that one does not know anything, though it appears there is no object of consciousness in sleep. One does not know anything in sleep, because there is no external object there.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 647 / Sri Siva Maha Purana - 647


🌹 . శ్రీ శివ మహా పురాణము - 647 / Sri Siva Maha Purana - 647 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴

🌻. గణేశ యుద్ధము - 2 🌻



బ్రహ్మ ఇట్లు పలికెను -

దండములచే అలంకరింపబడిన బాహువులు గల ఆ గణములను గణేశుడిట్లు భయపెట్టగా, వారు వివిధములగు ఆయుధములను ధరించి ముందునకురికిరి (10). పళ్లను పటపట కొరుకుచూ, అనేక పర్యాయములు హుంకరించి 'చూడు చూడు' అని పలుకుతూ, ఆ గణములు ముందునకురికిరి (11). మున్ముందుగా నంది వచ్చి కాలిని పట్టి లాగెను. భృంగి పరుగుతో వచ్చి గణేశుని రెండవ పాదమును లాగెను (12). వాళ్లిద్దరు పాదములను లాగ బోవునంతలో గణశుడు తన చేతిలో కొట్టి వారి పాదములను తన చేతులతో లాగి ఎత్తి పడవేసెను (13).

అపుడు వీరుడు, పార్వతీ తనయుడు, ద్వారపాలకుడు అగు గణపతి పెద్ద పరిఘను చేతబట్టి వారి నందరినీ పొడిచెను (14). కొందరి చేతులు, కొందరి వీపులు, కొందరి తలకాయలు, మరికొందరి లలాటములు (15), కొందరి మోకాళ్లు, మరికొందరి భుజములు విరిగినవి. ఎదురుగా వచ్చిన వారందరికీ వక్షస్థ్సలములో దెబ్బలు తగిలినవి (16). కొందరు నేల గూలిరి. కొందరు దిక్కులకు పరుగులు దీసిరి. కొందరి కాళ్లు విరిగినవి. మరికొందరు శివుని వద్దకు పరుగులెత్తిరి (17).

సింహమును చూచిన మృగములు వలె వారిలో ఒక్కరైననూ యుద్ధములో అతనిని ఎదిరించలేక పది దిక్కులకు పరువులు దీసిరి (18). ఆ విధముగా వేలాది గణములు వచ్చిరి. వచ్చిన వారందరు వెనుదిరిగిరి. అయిననూ ఆతడు ద్వారము నందు గట్టిగా నిలబడి యుండెను (19). కల్పాంతమునందు భయమును గొల్పు యముడెట్లుండునో అతడు అట్లు కన్పట్టెను. వారందరికీ ఆ క్షణములో ప్రళయమును కలుగజేసెను (20). అదే సమయములో నారదునిచే ప్రేరేపింపబడినవారై విష్ణువుతో, ఇంద్రునితో గూడి దేవతలందరు అచటకువిచ్చేసిరి (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 647🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴

🌻 Gaṇeśa’s battle - 2 🌻



Brahmā said:—

10. When thus taunted and rebuked they rushed towards him with big batons, decorating their arms and taking up different kinds of weapons.

11. Gnashing their teeth, grunting and bellowing and calling out “See, See”, the Gaṇas rushed at him.

12. Nandin came first and caught hold of his leg. He pulled at it. Bhṛṅgin then rushed at him and caught hold of his other leg.

13. Before the Gaṇas of Śiva had time to pull his legs Gaṇeśa struck a blow at their hands and got his legs free.

14. Then seizing a big iron club and standing at the doorway he smashed the gaṇas.

15. Some got their hands broken, others got their backs smothered. The heads of others were shattered and the foreheads of some were crushed.

16. The knees of some were fractured, the shoulders of others were blasted. Those who came in front were hit in the chest.

17. Some fell on the ground, some fled in various directions, some got their legs broken and some fled to Śiva.

18-19. Now none among them stood face to face. Just as deer flee to any direction on seeing a lion, the Gaṇas, who were thousands in number fled in that manner. Then Gaṇeśa returned to doorway and stood there.

20. He was seen as the annihilator of all in the manner of Yama, the terrible god of death at the end of a Kalpa.

21. At this time, urged by Nārada, all the gods including Viṣṇu and Indra came there.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 685 / Vishnu Sahasranama Contemplation - 685


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 685 / Vishnu Sahasranama Contemplation - 685🌹

🌻685. పూర్ణః, पूर्णः, Pūrṇaḥ🌻

ఓం పూర్ణాయ నమః | ॐ पूर्णाय नमः | OM Pūrṇāya namaḥ


సకలాభిశ్శక్తిభిశ్చ కామైశ్చ సకలైరపి ।
సమ్పూర్ణ ఇతి విష్ణుస్స పూర్ణ ఇత్యభిధీయతే ॥

కామిత ఫలములన్నియు తీరినవాడు. తాను పొందవలసిన కామిత ఫలములు ఏమియు లేనివాడు. సకల కామములతోను, కళలతోను పూర్ణుడు కావున పూర్ణః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 685🌹

🌻685.Pūrṇaḥ🌻

OM Pūrṇāya namaḥ


सकलाभिश्शक्तिभिश्च कामैश्च सकलैरपि ।
सम्पूर्ण इति विष्णुस्स पूर्ण इत्यभिधीयते ॥

Sakalābhiśśaktibhiśca kāmaiśca sakalairapi,
Sampūrṇa iti viṣṇussa pūrṇa ityabhidhīyate.


The One whose all desires are fulfilled. Has no desires left to be fulfilled. Since He is fully possessed of all objects of desire and also all the powers, He is called Pūrṇaḥ.


:: श्रीमद्भागवते पञ्चमस्कन्धे एकोनविंशोऽध्यायः ::

यैः श्रद्धया बर्हिषि भागशो हविर्निरुप्तमिष्टं विधिमन्त्रवस्तुतः ।
एकः पृथङ्नामभिराहुतो मुदा गृह्णाति पूर्णः स्वयमाशिषां प्रभुः ॥ 26 ॥


Śrīmad Bhāgavata - Canto 5, Chapter 19

Yaiḥ śraddhayā barhiṣi bhāgaśo havirniruptamiṣṭaṃ vidhimantravastutaḥ,
Ekaḥ pr‌thaṅnāmabhirāhuto mudā gr‌hṇāti pūrṇaḥ svayamāśiṣāṃ prabhuḥ. 26.


There are many worshipers of the different gods, the various deities appointed by the Lord, such as Indra, Candra and Sūrya - all of whom are worshiped differently. The worshipers offer these gods their oblations, considering the gods part and parcel of the whole, the Supreme Lord. Therefore the Supreme Lord accepts these offerings and gradually raises the worshipers to the real standard of devotional service by fulfilling their desires and aspirations. Because the Lord is complete, He offers the worshipers the benedictions they desire even if they worship only part of His transcendental body.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹




శ్రీమద్భగవద్గీత - 286: 07వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 286: Chap. 07, Ver. 06

 

🌹. శ్రీమద్భగవద్గీత - 286 / Bhagavad-Gita - 286 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 06 🌴

06. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగత: ప్రభవ: ప్రలయస్తథా ||


🌷. తాత్పర్యం :

సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండుప్రకృతులే కారణములై యున్నవి. ఈ జగత్తు నందలి భౌతికము, ఆధ్యాత్మికమగు అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే యని నిశ్చయముగా నెరుగుము.

🌷. భాష్యము :

దృశ్యమాన జగత్తంతయు ఆత్మ, భౌతికపదార్థముల కలయికచే ఏర్పడినది. సృష్టికి ఆత్మ మూలము కాగా, భౌతికపదార్థము ఆత్మచే సృష్టింపబడినది. అనగా ఆత్మ ఎట్టి స్థితియందును భౌతికపదార్థముచే సృష్టించబడదు.

వాస్తవమునకు ఈ జగత్తు ఆధ్యాత్మికశక్తి ఆధారము పైననే సృష్టింపబడినది. భౌతికపదార్థమునందు ఆత్మ నిలుచుట చేతనే స్థూలదేహము వృద్ధినొందును. శిశువు క్రమముగా బాలునిగా, పిదప యౌవనవంతునిగా మారుటకు ఉన్నతశక్తియగు ఆత్మఉనికియే కారణము.

అదే విధముగా పరమాత్మయైన విష్ణువు యొక్క ఉనికి వలననే బ్రహ్మాండమైన విశ్వము వృద్ధినొందినది. కనుకనే భౌతికపదార్థము, ఆత్మ అనునవి శ్రీకృష్ణభగవానుని శక్తులుగా తెలియబడుచున్నవి. అనగా శ్రీకృష్ణభగవానుడే సర్వమునకు మూలకారణుడై యున్నాడు.

అతని అంశయైన జీవుడు ఒక గొప్ప ఆకాశమునంటు భవంతినిగాని లేదా గొప్పనగరముగాని లేదా గొప్ప కర్మాగారమునుగాని సృష్టింపవచ్చునేమో గాని విశ్వమును మాత్రము సృష్టించలేడు. అనగా పెద్దదైన విశ్వమునకు పరమాత్ముడే (విభుఆత్మ) కారణుడై యున్నాడు. అటువంటి విభుఆత్మ మరియు అణుఆత్మలకు (జీవులకు) శ్రీకృష్ణుడే మూలకారణుడు.

కనుకనే అతడు సర్వకారణములకు కారణమై యున్నాడు. “నిత్యోనిత్యానం చేతనశ్చేతనానాం” అని ఈ విషయము కఠోపనిషత్తు (2.2.13) నందు నిర్ధారింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 286 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 06 🌴

06. etad-yonīni bhūtāni sarvāṇīty upadhāraya
ahaṁ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayas tathā


🌷 Translation :

All created beings have their source in these two natures. Of all that is material and all that is spiritual in this world, know for certain that I am both the origin and the dissolution.


🌹 Purport :

Everything that exists is a product of matter and spirit. Spirit is the basic field of creation, and matter is created by spirit.

Spirit is not created at a certain stage of material development. Rather, this material world is manifested only on the basis of spiritual energy.

This material body is developed because spirit is present within matter; a child grows gradually to boyhood and then to manhood because that superior energy, spirit soul, is present.

Similarly, the entire cosmic manifestation of the gigantic universe is developed because of the presence of the Supersoul, Viṣṇu.

Therefore spirit and matter, which combine to manifest this gigantic universal form, are originally two energies of the Lord, and consequently the Lord is the original cause of everything.

A fragmental part and parcel of the Lord, namely the living entity, may be the cause of a big skyscraper, a big factory, or even a big city, but he cannot be the cause of a big universe. The cause of the big universe is the big soul, or the Supersoul.

And Kṛṣṇa, the Supreme, is the cause of both the big and small souls. Therefore He is the original cause of all causes.

This is confirmed in the Kaṭha Upaniṣad (2.2.13). Nityo nityānāṁ cetanaś cetanānām.

🌷 🌷 🌷 🌷 🌷

23 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹23, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

🍀. సత్యసాయి జన్మదిన శుభాకాంక్షలు అందరికి, Good Wishes and Satya Sai Birthday to All. 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : సత్యసాయి జన్మదినం, కార్తీక అమావాస్య, Satya Sai Birthday, Kartika Amavasya 🌺

🍀. శ్రీ నారాయణ కవచం - 23 🍀


35. మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్ |
విజేష్యస్యంజసా యేన దంశితోఽసురయూథపాన్

36. ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా |
పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సమస్త కర్మయూ ఈశ్వరశక్తిదే యని చెప్పి, మానవుడు విచక్షణ రహితంగా సదసత్కర్మలు చేస్తూ అంతా ఈశ్వరుడే చేస్తున్నాడని చాటుకునే అవకాశం లేకపోలేదు. కాని, అట్టి సందర్భాలలో అతడు ఆ కర్మల యందు తనకుండే కర్తృత్వబుద్ధి ననుసరించే ఫలితాలను కూడ పొందుతూ

వుంటాడు.🍀


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ చతుర్దశి 06:54:37 వరకు

తదుపరి అమావాశ్య

నక్షత్రం: విశాఖ 21:38:36 వరకు

తదుపరి అనూరాధ

యోగం: శోభన 15:39:21 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: శకుని 06:53:36 వరకు

వర్జ్యం: 04:26:50 - 05:56:30

మరియు 25:18:00 - 26:46:00

దుర్ముహూర్తం: 11:39:48 - 12:24:46

రాహు కాలం: 12:02:17 - 13:26:35

గుళిక కాలం: 10:37:59 - 12:02:17

యమ గండం: 07:49:23 - 09:13:41

అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24

అమృత కాలం: 13:24:50 - 14:54:30

సూర్యోదయం: 06:25:06

సూర్యాస్తమయం: 17:39:28

చంద్రోదయం: 05:32:57

చంద్రాస్తమయం: 17:08:18

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు : ధాత్రి యోగం - కార్య జయం

21:38:36 వరకు తదుపరి సౌమ్య యోగం

- సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


🍀 23 - NOVEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹🍀 23 - NOVEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
🌹23 - NOVEMBER నవంబరు - 2022 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 286 / Bhagavad-Gita -286 - 7వ అధ్యాయము 06 జ్ఞాన విజ్ఞాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 685 / Vishnu Sahasranama Contemplation - 685 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 647 / Sri Siva Maha Purana - 647 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 364 / DAILY WISDOM - 364 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 263 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹23, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🍀. సత్యసాయి జన్మదిన శుభాకాంక్షలు అందరికి, Good Wishes and Satya Sai Birthday to All. 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : సత్యసాయి జన్మదినం, కార్తీక అమావాస్య, Satya Sai Birthday, Kartika Amavasya 🌺*

*🍀. శ్రీ నారాయణ కవచం - 23 🍀*

*35. మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్ |*
*విజేష్యస్యంజసా యేన దంశితోఽసురయూథపాన్*
*36. ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా |*
*పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సమస్త కర్మయూ ఈశ్వరశక్తిదే యని చెప్పి, మానవుడు విచక్షణ రహితంగా సదసత్కర్మలు చేస్తూ అంతా ఈశ్వరుడే చేస్తున్నాడని చాటుకునే అవకాశం లేకపోలేదు. కాని, అట్టి సందర్భాలలో అతడు ఆ కర్మల యందు తనకుండే కర్తృత్వబుద్ధి ననుసరించే ఫలితాలను కూడ పొందుతూ
వుంటాడు.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 06:54:37 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: విశాఖ 21:38:36 వరకు
తదుపరి అనూరాధ
యోగం: శోభన 15:39:21 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: శకుని 06:53:36 వరకు
వర్జ్యం: 04:26:50 - 05:56:30
మరియు 25:18:00 - 26:46:00
దుర్ముహూర్తం: 11:39:48 - 12:24:46
రాహు కాలం: 12:02:17 - 13:26:35
గుళిక కాలం: 10:37:59 - 12:02:17
యమ గండం: 07:49:23 - 09:13:41
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 13:24:50 - 14:54:30
సూర్యోదయం: 06:25:06
సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 05:32:57
చంద్రాస్తమయం: 17:08:18
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు : ధాత్రి యోగం - కార్య జయం
21:38:36 వరకు తదుపరి సౌమ్య యోగం
 - సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 286 / Bhagavad-Gita - 286 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 06 🌴*

*06. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |*
*అహం కృత్స్నస్య జగత: ప్రభవ: ప్రలయస్తథా ||*

🌷. తాత్పర్యం :
*సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండుప్రకృతులే కారణములై యున్నవి. ఈ జగత్తు నందలి భౌతికము, ఆధ్యాత్మికమగు అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే యని నిశ్చయముగా నెరుగుము.*

🌷. భాష్యము :
దృశ్యమాన జగత్తంతయు ఆత్మ, భౌతికపదార్థముల కలయికచే ఏర్పడినది. సృష్టికి ఆత్మ మూలము కాగా, భౌతికపదార్థము ఆత్మచే సృష్టింపబడినది. అనగా ఆత్మ ఎట్టి స్థితియందును భౌతికపదార్థముచే సృష్టించబడదు. 

వాస్తవమునకు ఈ జగత్తు ఆధ్యాత్మికశక్తి ఆధారము పైననే సృష్టింపబడినది. భౌతికపదార్థమునందు ఆత్మ నిలుచుట చేతనే స్థూలదేహము వృద్ధినొందును. శిశువు క్రమముగా బాలునిగా, పిదప యౌవనవంతునిగా మారుటకు ఉన్నతశక్తియగు ఆత్మఉనికియే కారణము. 

అదే విధముగా పరమాత్మయైన విష్ణువు యొక్క ఉనికి వలననే బ్రహ్మాండమైన విశ్వము వృద్ధినొందినది. కనుకనే భౌతికపదార్థము, ఆత్మ అనునవి శ్రీకృష్ణభగవానుని శక్తులుగా తెలియబడుచున్నవి. అనగా శ్రీకృష్ణభగవానుడే సర్వమునకు మూలకారణుడై యున్నాడు. 

అతని అంశయైన జీవుడు ఒక గొప్ప ఆకాశమునంటు భవంతినిగాని లేదా గొప్పనగరముగాని లేదా గొప్ప కర్మాగారమునుగాని సృష్టింపవచ్చునేమో గాని విశ్వమును మాత్రము సృష్టించలేడు. అనగా పెద్దదైన విశ్వమునకు పరమాత్ముడే (విభుఆత్మ) కారణుడై యున్నాడు. అటువంటి విభుఆత్మ మరియు అణుఆత్మలకు (జీవులకు) శ్రీకృష్ణుడే మూలకారణుడు. 

కనుకనే అతడు సర్వకారణములకు కారణమై యున్నాడు. “నిత్యోనిత్యానం చేతనశ్చేతనానాం” అని ఈ విషయము కఠోపనిషత్తు (2.2.13) నందు నిర్ధారింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 286 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 06 🌴*

*06. etad-yonīni bhūtāni sarvāṇīty upadhāraya*
*ahaṁ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayas tathā*

🌷 Translation : 
*All created beings have their source in these two natures. Of all that is material and all that is spiritual in this world, know for certain that I am both the origin and the dissolution.*

🌹 Purport :
Everything that exists is a product of matter and spirit. Spirit is the basic field of creation, and matter is created by spirit. 

Spirit is not created at a certain stage of material development. Rather, this material world is manifested only on the basis of spiritual energy. 

This material body is developed because spirit is present within matter; a child grows gradually to boyhood and then to manhood because that superior energy, spirit soul, is present. 

Similarly, the entire cosmic manifestation of the gigantic universe is developed because of the presence of the Supersoul, Viṣṇu. 

Therefore spirit and matter, which combine to manifest this gigantic universal form, are originally two energies of the Lord, and consequently the Lord is the original cause of everything. 

A fragmental part and parcel of the Lord, namely the living entity, may be the cause of a big skyscraper, a big factory, or even a big city, but he cannot be the cause of a big universe. The cause of the big universe is the big soul, or the Supersoul. 

And Kṛṣṇa, the Supreme, is the cause of both the big and small souls. Therefore He is the original cause of all causes. 

This is confirmed in the Kaṭha Upaniṣad (2.2.13). Nityo nityānāṁ cetanaś cetanānām. 
🌷 🌷 🌷 🌷 🌷

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 685 / Vishnu Sahasranama Contemplation - 685🌹*

*🌻685. పూర్ణః, पूर्णः, Pūrṇaḥ🌻*

*ఓం పూర్ణాయ నమః | ॐ पूर्णाय नमः | OM Pūrṇāya namaḥ*

*సకలాభిశ్శక్తిభిశ్చ కామైశ్చ సకలైరపి ।*
*సమ్పూర్ణ ఇతి విష్ణుస్స పూర్ణ ఇత్యభిధీయతే ॥*

*కామిత ఫలములన్నియు తీరినవాడు. తాను పొందవలసిన కామిత ఫలములు ఏమియు లేనివాడు. సకల కామములతోను, కళలతోను పూర్ణుడు కావున పూర్ణః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 685🌹*

*🌻685.Pūrṇaḥ🌻*

*OM Pūrṇāya namaḥ*

सकलाभिश्शक्तिभिश्च कामैश्च सकलैरपि ।
सम्पूर्ण इति विष्णुस्स पूर्ण इत्यभिधीयते ॥

*Sakalābhiśśaktibhiśca kāmaiśca sakalairapi,*
*Sampūrṇa iti viṣṇussa pūrṇa ityabhidhīyate.*

*The One whose all desires are fulfilled. Has no desires left to be fulfilled. Since He is fully possessed of all objects of desire and also all the powers, He is called Pūrṇaḥ.*

:: श्रीमद्भागवते पञ्चमस्कन्धे एकोनविंशोऽध्यायः ::
यैः श्रद्धया बर्हिषि भागशो हविर्निरुप्तमिष्टं विधिमन्त्रवस्तुतः ।
एकः पृथङ्नामभिराहुतो मुदा गृह्णाति पूर्णः स्वयमाशिषां प्रभुः ॥ 26 ॥

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 19
Yaiḥ śraddhayā barhiṣi bhāgaśo havirniruptamiṣṭaṃ vidhimantravastutaḥ,
Ekaḥ pr‌thaṅnāmabhirāhuto mudā gr‌hṇāti pūrṇaḥ svayamāśiṣāṃ prabhuḥ. 26.

*There are many worshipers of the different gods, the various deities appointed by the Lord, such as Indra, Candra and Sūrya - all of whom are worshiped differently. The worshipers offer these gods their oblations, considering the gods part and parcel of the whole, the Supreme Lord. Therefore the Supreme Lord accepts these offerings and gradually raises the worshipers to the real standard of devotional service by fulfilling their desires and aspirations. Because the Lord is complete, He offers the worshipers the benedictions they desire even if they worship only part of His transcendental body.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 647 / Sri Siva Maha Purana - 647 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴*
*🌻. గణేశ యుద్ధము - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

దండములచే అలంకరింపబడిన బాహువులు గల ఆ గణములను గణేశుడిట్లు భయపెట్టగా, వారు వివిధములగు ఆయుధములను ధరించి ముందునకురికిరి (10). పళ్లను పటపట కొరుకుచూ, అనేక పర్యాయములు హుంకరించి 'చూడు చూడు' అని పలుకుతూ, ఆ గణములు ముందునకురికిరి (11). మున్ముందుగా నంది వచ్చి కాలిని పట్టి లాగెను. భృంగి పరుగుతో వచ్చి గణేశుని రెండవ పాదమును లాగెను (12). వాళ్లిద్దరు పాదములను లాగ బోవునంతలో గణశుడు తన చేతిలో కొట్టి వారి పాదములను తన చేతులతో లాగి ఎత్తి పడవేసెను (13).

అపుడు వీరుడు, పార్వతీ తనయుడు, ద్వారపాలకుడు అగు గణపతి పెద్ద పరిఘను చేతబట్టి వారి నందరినీ పొడిచెను (14). కొందరి చేతులు, కొందరి వీపులు, కొందరి తలకాయలు, మరికొందరి లలాటములు (15), కొందరి మోకాళ్లు, మరికొందరి భుజములు విరిగినవి. ఎదురుగా వచ్చిన వారందరికీ వక్షస్థ్సలములో దెబ్బలు తగిలినవి (16). కొందరు నేల గూలిరి. కొందరు దిక్కులకు పరుగులు దీసిరి. కొందరి కాళ్లు విరిగినవి. మరికొందరు శివుని వద్దకు పరుగులెత్తిరి (17).

సింహమును చూచిన మృగములు వలె వారిలో ఒక్కరైననూ యుద్ధములో అతనిని ఎదిరించలేక పది దిక్కులకు పరువులు దీసిరి (18). ఆ విధముగా వేలాది గణములు వచ్చిరి. వచ్చిన వారందరు వెనుదిరిగిరి. అయిననూ ఆతడు ద్వారము నందు గట్టిగా నిలబడి యుండెను (19). కల్పాంతమునందు భయమును గొల్పు యముడెట్లుండునో అతడు అట్లు కన్పట్టెను. వారందరికీ ఆ క్షణములో ప్రళయమును కలుగజేసెను (20). అదే సమయములో నారదునిచే ప్రేరేపింపబడినవారై విష్ణువుతో, ఇంద్రునితో గూడి దేవతలందరు అచటకువిచ్చేసిరి (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 647🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴*

*🌻 Gaṇeśa’s battle - 2 🌻*

Brahmā said:—
10. When thus taunted and rebuked they rushed towards him with big batons, decorating their arms and taking up different kinds of weapons.

11. Gnashing their teeth, grunting and bellowing and calling out “See, See”, the Gaṇas rushed at him.

12. Nandin came first and caught hold of his leg. He pulled at it. Bhṛṅgin then rushed at him and caught hold of his other leg.

13. Before the Gaṇas of Śiva had time to pull his legs Gaṇeśa struck a blow at their hands and got his legs free.

14. Then seizing a big iron club and standing at the doorway he smashed the gaṇas.

15. Some got their hands broken, others got their backs smothered. The heads of others were shattered and the foreheads of some were crushed.

16. The knees of some were fractured, the shoulders of others were blasted. Those who came in front were hit in the chest.

17. Some fell on the ground, some fled in various directions, some got their legs broken and some fled to Śiva.

18-19. Now none among them stood face to face. Just as deer flee to any direction on seeing a lion, the Gaṇas, who were thousands in number fled in that manner. Then Gaṇeśa returned to doorway and stood there.

20. He was seen as the annihilator of all in the manner of Yama, the terrible god of death at the end of a Kalpa.

21. At this time, urged by Nārada, all the gods including Viṣṇu and Indra came there.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 364 / DAILY WISDOM - 364 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻29. నాకు ఏమీ తెలియదు, కానీ బాగా నిద్ర పోయాను🌻*

*ఇంకా లోతులోకి వెళ్తే, నిద్ర అనే స్థితి ఉంది. నిద్రలో ఏమి జరుగుతుంది? మనస్సు కూడా ఇక్కడ పనిచేయదు. ఇది గమనార్హం. బుద్ధి, భావాలు, సంకల్పాలు మరియు ఇంద్రియ అవయవాలు సైతం అన్నీ పనిచేయడం మానేస్తాయి. అయితే నిద్రలో మనిషి ఉన్నాడా? అవును, అతను ఉనికిలోనే ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? అలాంటప్పుడు మనిషి అంటే ఏమిటి? 'నేను ఉన్నాను' అనేది సాధారణంగా ప్రతి ఒక్కరూ మేల్కొన్నప్పుడు చేసే వాదన. కానీ ఏ విధంగా ఉనికిలో ఉన్నారు? ఈ 'నేను', నేను ఏ స్థితిలో ఉంది? గాఢనిద్ర స్థితిలో 'నేను' శరీరంగా అయితే ఉనికిలో లేదు. అప్పుడు తెలివి పని చేయట్లేదు కాబట్టి ఇది కూడా ఉనికిలో లేదు. నిద్రావస్థలో ఎలాంటి మానసిక క్రియ జరగదు. *

*శరీరం లేనప్పుడు మనసు ఉండదు. మనిషిలో ఏమి మిగిలి ఉంది? ఏమీ మిగలలేదు; అది శూన్యం. మనిషి వివరించలేని ఒక చీకటిలో ఉన్నాడు, ఇది నిద్రతో గుర్తించబడింది. నిద్రలో ఎవరికీ ఏమీ తెలియదు. ఉదయం లేవగానే నిద్ర గురించి అందరూ ఏమంటారు? “నాకేమీ తెలియదు; నాకు బాగా నిద్ర పట్టింది.” కానీ 'నాకు ఏమీ తెలియదు, నాకు మంచి నిద్ర వచ్చింది' అని ఒకరు చెప్పినప్పుడు, ఒకరు స్వీయ-విరుద్ధమైన ప్రకటన చేస్తున్నారు. ఏమీ తెలియకపోతే, ఒక వ్యక్తి బాగా నిద్రపోయాడని ఎలా తెలుసుకో గలడు? నిద్రలో స్పృహకు సంబంధించిన వస్తువు లేనట్లు కనిపించినా ఏమీ తెలియదన్నది నిజం కాదు. నిద్రలో ఎవరికీ ఏమీ తెలియదు, ఎందుకంటే అక్కడ బాహ్య వస్తువు లేదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 364 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻29. I Knew Nothing, But I had a Good Sleep🌻*

*Deeper still, there is a state called sleep. What happens in sleep? Even the mind does not operate here. This is important to note. The intellect, feelings, volitions, and sense organs all cease to operate. But does man exist in sleep? Yes, he does exist. In what capacity? What is man then? “I am” is the assertion that everyone generally makes on waking. But in what way was one existing? In what state was this “I”, the self? In the state of deep sleep the “I” did not exist as the body. It did not exist as the intellect which was then not functioning.*

*There was no psychic operation of any kind in the state of sleep. When there is no body, no mind. what remains in man? Nothing remains; it is a vacuum, as it were. Man was in an inexplicable darkness, which is identified with sleep. No one knows anything in sleep. What does everyone say about sleep when one wakes up in the morning? “I knew nothing; I had a good sleep.” But when one says, “I knew nothing, I had good sleep,” one is making a self-contradictory statement. If nothing was known, how could one know that one slept well? It is not true that one does not know anything, though it appears there is no object of consciousness in sleep. One does not know anything in sleep, because there is no external object there.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 263 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. దేవుడంటే అంతిమ చైతన్యం. ధ్యానం వంతెన లాంటిది. నీ అస్తిత్వపు పునాదుల వేపు నిన్ను తీసుకుపోతుంది. ఒకసారి నీ అస్తిత్వపు పునాదుల్ని నువ్వు రుచి చూస్తే తక్కినవన్నీ అర్థరహితాలని తెలుసుకుంటావు. 🍀*

*ప్రతి చెట్టు వేర్లూ భూమిలోకి వున్నట్లు ప్రతి చైతన్య పునాదులూ దేవుడిలో వున్నాయి. దేవుడంటే అంతిమ చైతన్యం. ధ్యానం వంతెన లాంటిది. నీ అస్తిత్వపు పునాదుల వేపు నిన్ను తీసుకుపోతుంది. ఒకసారి నీ అస్తిత్వపు పునాదుల్ని నువ్వు రుచి చూస్తే తక్కినవన్నీ అర్థరహితాలని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు సాధారణ జీవితాన్ని గడుపుతావు కానీ అది నటనలాంటిదే.*

*అయితే అది అందమయిన నాటకం. దాంట్లో వీలయినంత బాగా నటించు. కానీ నువ్వు అందులో భాగస్వామివి కాదన్న విషయం నీకు తెలుసు. అదొక పాత్ర. అది నీ అస్తిత్వం కాదు. ఒకసారి కిటికీ తెరుచుకుంటే నువ్వు రూపాంతరం చెందుతావు. సన్యాసత్వానికి సంబంధించిన సమస్త లక్ష్యమదే. కిటికీ తెరవడమంటే నీ దైవత్వాన్ని నువ్వు నిజంగా తెలుసుకోవడమే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj