నిర్మల ధ్యానాలు - ఓషో - 263


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 263 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడంటే అంతిమ చైతన్యం. ధ్యానం వంతెన లాంటిది. నీ అస్తిత్వపు పునాదుల వేపు నిన్ను తీసుకుపోతుంది. ఒకసారి నీ అస్తిత్వపు పునాదుల్ని నువ్వు రుచి చూస్తే తక్కినవన్నీ అర్థరహితాలని తెలుసుకుంటావు. 🍀


ప్రతి చెట్టు వేర్లూ భూమిలోకి వున్నట్లు ప్రతి చైతన్య పునాదులూ దేవుడిలో వున్నాయి. దేవుడంటే అంతిమ చైతన్యం. ధ్యానం వంతెన లాంటిది. నీ అస్తిత్వపు పునాదుల వేపు నిన్ను తీసుకుపోతుంది. ఒకసారి నీ అస్తిత్వపు పునాదుల్ని నువ్వు రుచి చూస్తే తక్కినవన్నీ అర్థరహితాలని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు సాధారణ జీవితాన్ని గడుపుతావు కానీ అది నటనలాంటిదే.

అయితే అది అందమయిన నాటకం. దాంట్లో వీలయినంత బాగా నటించు. కానీ నువ్వు అందులో భాగస్వామివి కాదన్న విషయం నీకు తెలుసు. అదొక పాత్ర. అది నీ అస్తిత్వం కాదు. ఒకసారి కిటికీ తెరుచుకుంటే నువ్వు రూపాంతరం చెందుతావు. సన్యాసత్వానికి సంబంధించిన సమస్త లక్ష్యమదే. కిటికీ తెరవడమంటే నీ దైవత్వాన్ని నువ్వు నిజంగా తెలుసుకోవడమే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment