శ్రీ శివ మహా పురాణము - 647 / Sri Siva Maha Purana - 647


🌹 . శ్రీ శివ మహా పురాణము - 647 / Sri Siva Maha Purana - 647 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴

🌻. గణేశ యుద్ధము - 2 🌻



బ్రహ్మ ఇట్లు పలికెను -

దండములచే అలంకరింపబడిన బాహువులు గల ఆ గణములను గణేశుడిట్లు భయపెట్టగా, వారు వివిధములగు ఆయుధములను ధరించి ముందునకురికిరి (10). పళ్లను పటపట కొరుకుచూ, అనేక పర్యాయములు హుంకరించి 'చూడు చూడు' అని పలుకుతూ, ఆ గణములు ముందునకురికిరి (11). మున్ముందుగా నంది వచ్చి కాలిని పట్టి లాగెను. భృంగి పరుగుతో వచ్చి గణేశుని రెండవ పాదమును లాగెను (12). వాళ్లిద్దరు పాదములను లాగ బోవునంతలో గణశుడు తన చేతిలో కొట్టి వారి పాదములను తన చేతులతో లాగి ఎత్తి పడవేసెను (13).

అపుడు వీరుడు, పార్వతీ తనయుడు, ద్వారపాలకుడు అగు గణపతి పెద్ద పరిఘను చేతబట్టి వారి నందరినీ పొడిచెను (14). కొందరి చేతులు, కొందరి వీపులు, కొందరి తలకాయలు, మరికొందరి లలాటములు (15), కొందరి మోకాళ్లు, మరికొందరి భుజములు విరిగినవి. ఎదురుగా వచ్చిన వారందరికీ వక్షస్థ్సలములో దెబ్బలు తగిలినవి (16). కొందరు నేల గూలిరి. కొందరు దిక్కులకు పరుగులు దీసిరి. కొందరి కాళ్లు విరిగినవి. మరికొందరు శివుని వద్దకు పరుగులెత్తిరి (17).

సింహమును చూచిన మృగములు వలె వారిలో ఒక్కరైననూ యుద్ధములో అతనిని ఎదిరించలేక పది దిక్కులకు పరువులు దీసిరి (18). ఆ విధముగా వేలాది గణములు వచ్చిరి. వచ్చిన వారందరు వెనుదిరిగిరి. అయిననూ ఆతడు ద్వారము నందు గట్టిగా నిలబడి యుండెను (19). కల్పాంతమునందు భయమును గొల్పు యముడెట్లుండునో అతడు అట్లు కన్పట్టెను. వారందరికీ ఆ క్షణములో ప్రళయమును కలుగజేసెను (20). అదే సమయములో నారదునిచే ప్రేరేపింపబడినవారై విష్ణువుతో, ఇంద్రునితో గూడి దేవతలందరు అచటకువిచ్చేసిరి (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 647🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴

🌻 Gaṇeśa’s battle - 2 🌻



Brahmā said:—

10. When thus taunted and rebuked they rushed towards him with big batons, decorating their arms and taking up different kinds of weapons.

11. Gnashing their teeth, grunting and bellowing and calling out “See, See”, the Gaṇas rushed at him.

12. Nandin came first and caught hold of his leg. He pulled at it. Bhṛṅgin then rushed at him and caught hold of his other leg.

13. Before the Gaṇas of Śiva had time to pull his legs Gaṇeśa struck a blow at their hands and got his legs free.

14. Then seizing a big iron club and standing at the doorway he smashed the gaṇas.

15. Some got their hands broken, others got their backs smothered. The heads of others were shattered and the foreheads of some were crushed.

16. The knees of some were fractured, the shoulders of others were blasted. Those who came in front were hit in the chest.

17. Some fell on the ground, some fled in various directions, some got their legs broken and some fled to Śiva.

18-19. Now none among them stood face to face. Just as deer flee to any direction on seeing a lion, the Gaṇas, who were thousands in number fled in that manner. Then Gaṇeśa returned to doorway and stood there.

20. He was seen as the annihilator of all in the manner of Yama, the terrible god of death at the end of a Kalpa.

21. At this time, urged by Nārada, all the gods including Viṣṇu and Indra came there.


Continues....

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment