28-September-2020 Messages

 1) 🌹 శ్రీమద్భగవద్గీత - 501 / Bhagavad-Gita - 502 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 22 , 23 / Vishnu Sahasranama Contemplation - 22, 23 🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 290 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 11 - 2 / Sri Lalita Chaitanya Vijnanam - 11 - 2 🌹
5) 🌹. నారద భక్తి సూత్రాలు - 108 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 79 🌹
7) 🌹. శివగీత - 75 / The Shiva-Gita - 76 🌹
8) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 64 / Gajanan Maharaj Life History - 64 🌹 
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 58 🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 418 / Bhagavad-Gita - 418 🌹

11) 🌹. మంత్రపుష్పం తత్వ విచారణ.... విజ్ఞానం 🌹*
12) 🌹. మంత్రపుష్పం - భావగానం - 10 🌹 
13) 🌹. శివ మహా పురాణము - 234 🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 122 🌹
15) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 64 🌹
16) 🌹 Seeds Of Consciousness - 187 🌹 
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 42 📚
18) 🌹. అద్భుత సృష్టి - 41 🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasranama - 24 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 

 *🌹. శ్రీమద్భగవద్గీత - 502  / Bhagavad-Gita - 502 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ 

*🌴. 14వ అధ్యాయము -  గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు  - 12 🌴*

12.  లోభ: ప్రవృత్తిరారామ్భ: కర్మణామశమ: స్పృహా |
రజస్యేతాని జాయన్తే వివృద్దే భరతర్షభ ||

🌷. తాత్పర్యం : 
ఓ భరతవంశ శ్రేష్టుడా! రజోగుణము వృద్ధినొందినపుడు లోభము, కామ్యకర్మము, తీవ్రయత్నము, అణచసాధ్యముగాని కోరిక, తపన యను లక్షణములు వృద్దినొందును

🌷. భాష్యము  :
రజోగుణము నందున్నవాడు తాను పొందియున్న స్థితితో ఎన్నడును సంతృప్తినొందడు. దానిని వృద్ధిచేసికొనుటకు అతడు ఆకాంక్షపడుచుండును. 

నివసించుటకు గృహమును నిర్మించదలచినచో తానా గృహమందు అనంతకాలము నివసింపబోవుచున్నట్లు రాజమహలు వంటి భవంతిని నిర్మింప శాయశక్తులు యత్నించును. ఇంద్రియ భోగానుభవమునకై తీవ్రమైన ఆకాంక్షను వృద్ధిచేసికొను అతని భోగములకు అంతమనునది ఉండదు.

 ఇల్లు మరియు సంసారముతోడనే ఎల్లప్పుడును నిలిచి ఇంద్రియభోగానుభవమును కొనసాగించుటయే అతని కోరిక. ఆ కోరికకు త్రెంపు అనునది ఉండదు. ఈ చిహ్నములన్నింటిని రజోగుణ లక్షణములుగా అర్థము చేసికొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 502 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga  - Nature, 3 Gunas  - 12 🌴*

12. lobhaḥ pravṛttir ārambhaḥ
karmaṇām aśamaḥ spṛhā
rajasy etāni jāyante
vivṛddhe bharatarṣabha

🌷 Translation : 
O chief of the Bhāratas, when there is an increase in the mode of passion the symptoms of great attachment, fruitive activity, intense endeavor, and uncontrollable desire and hankering develop.

🌹 Purport :
One in the mode of passion is never satisfied with the position he has already acquired; he hankers to increase his position. If he wants to construct a residential house, he tries his best to have a palatial house, as if he would be able to reside in that house eternally. And he develops a great hankering for sense gratification. 

There is no end to sense gratification. He always wants to remain with his family and in his house and to continue the process of sense gratification. There is no cessation of this. All these symptoms should be understood as characteristic of the mode of passion.
🌹 🌹 🌹 🌹 🌹

 

 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹 Sripada  Srivallabha  Charithamrutham - 291 🌹*
✍️  Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 38
*🌻 About  Bairagi  - 2 🌻*

After  8  days  I  came  into  external  consciousness.  Sripada  with  His  divine  hands  touched  my head.  No  Brahmin  was  giving  me  ‘bhiksha’.  

Arrangements  were  made  for  my  accommodation  and food  in  the  house  of  a  ‘golla’  in  Sri  Peethikapuram.  As  I  did  not  insist  on  caste  limits  all  the  gollas (people  belonging  to  yadhav  caste)  became  dear  to  me.  Among  them,  there  was  a  woman  by  name Laxmi.  

Her  husband  used  to  look  after  her  with  loving  care.  He  was  the  chief  among  the  ‘gollas’  and also  used  to  be  like  a  judge  if  there  were  any  disputes  among  them.  Though  he  was  young,  he  was  a learned  person.  

So  he  used  to  read  the  papers  related  to  properties,  distribute  according  to  what was  written  there,  and  do  the  writing  works  related  to  the  lands.  So  their  caste  people  elected  him as  their  chief  though  he  was  young.  His  wife  Laxmi  had  all  the  qualities  of  a  ‘pathi  vratha’.  

She  lost her  husband  4-5  years  ago. Because  I  knew  the  greatness  of  Sripada,  I  told  Laxmi  that  she  would  be  benefited  if  she  had some  relation  with  Sripada.  

Meanwhile,  the  cow  in  Venkatappaiah  Shresti’s  house  stopped  giving milk.  So  Laxmi  used  to  bring  milk  to  Shresti’s  house.  Sripada  used  to  come  to  Shresti’s  house frequently.  

The  moment  He  said  that  He  was  hungry,  Venkata  Subbamma  would  give  hot  milk  to Sripada.  She  used  to  give,  cream  and  butter  also.  When  Laxmi  brought  milk  to  that  house,  Sripada would  say  that  he  was  more  hungry.  Venkata  Subbamma  asked  Laxmi  to  bring  some  more  milk.  

If she  brought  more  milk,  she  would  have  been  left  with  less  milk  at  her  house  and  she  would  have  to drink  watery  butter  milk.  Even  then,  being  a  generous  woman,  she  started  selling  the  remaining  milk also  in  Shresti’s  house.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 22 / Vishnu Sahasranama Contemplation - 22🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān 🌻*

*ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ*

యస్య వక్షసి నిత్యం శ్రీః వసతి ఎవని వక్షమునందు ఎల్లప్పుడును శ్రీ వసించునో అట్టివాడు 'శ్రీమాన్‌'.

'శ్రీ' అనగా ఐశ్వర్యము. జ్ఞానైశ్వర్యము, మనోనిర్మలత్వము, ధర్మముయెడల మోక్షముయెడల  ఉత్సాహము ఎచటనుండునో అచట సాక్షాత్ పరమాత్మ వెలుగుచున్నారని గ్రహింపనగును. భగవత్తేజముయొక్క అంశమువలన అట్టి పవిత్రగుణము సంభవించునని చెప్పుటవలన భగవత్తేజము, ఈశ్వరీయశక్తి (ఐశ్వర్యము) అనంతమని, అందలి ఏ ఒకానొక అంశమువలననో ఇట్టి ఉత్తమవిభూతి, ఉత్సాహాది సద్గుణములు సంభవించునని తెలియుచున్నది. కాబట్టి జనులట్టి సద్గుణములకు తమ హృదయములందు స్థానమొసంగి తద్వారా భగవత్సాన్నిధ్యమును అనుభూతమొనర్చుకొనవలెను. మఱియు ఆ ప్రకారములైన సుగుణము లెవనియందున్నను, అతడేజాతివాడైనను భగవంతునివలె వంద్యుడే యగును.

:: భగవద్గీత - విభూతి యోగము ::
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోఽoశసమ్భవమ్ ॥ 41 ॥

ఈ ప్రపంచమున ఐశ్వర్యయుక్తమైనదియు, కాంతివంతమైనదియు, ఉత్సాహముతో గూడినదియునగు వస్తువు ఏది యేది కలదో అదియది నా తేజస్సుయొక్క అంశమువలన కలిగిన దానినిగనే నీవెఱంగుము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 22 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 22 Śrīmān 🌻*

*22 OM Śrīmate namaḥ*

One on whose chest the goddess Śrī always dwells. Śrī means opulence and prosperity. The Supreme Lord is the owner of all opulences.

Bhagavad Gīta - Chapter 10
Yadyadvibhūtimatsattvaṃ śrīmadūrjitameva vā ,
Tattadevāvagaccha tvaṃ mama tejo’ṃśasambhavam.(41)

Whatever object is verily endowed with majesty, possessed of prosperity or is energetic you know for certain each of them as having a part of My power as its source.

Śrī, also known as Goddess Lakṣmī is His Consort/power and has His chest as her abode. The above stanza clearly indicates that all of the opulences and prosperity, have a part of His power otherwise known as Śrī or Lakshmi as its source.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka 
योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 23 / Vishnu Sahasranama Contemplation - 23🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 23. కేశవః, केशवः, Keśavaḥ 🌻*

*ఓం కేశవాయ నమః | ॐ केशवाय नमः | OM Keśavāya namaḥ*

అభిరూపాః కేశాః యస్య సః సుందరములగు కేశములు ఎవనికి కలవో అతడు కేశవః.

కః అనగా బ్రహ్మ; అః అనగా విష్ణువు; ఈశః అనగా రుద్రుడు. బ్రహ్మయు, విష్ణుడును, రుద్రుడును ఎవని వశముచే ప్రవర్తిల్లుదురో అట్టి పరమాత్ముడు కేశవః అనబడును.

కేశి వదాత్ కేశవః కేశి అను రాక్షసుని వధ చేయుట వలన కేశవః అనబడును.

:: విష్ణు పురాణము - ఐదవ అధ్యాయము ::
యస్యా త్త్వయైష దుష్టాత్మా హతః కేశి జనార్ధన ।
తస్మా త్కేశవనామ్నా త్వం లోకే క్యాతో భవిష్యసి ॥ 16.23 ॥

జనార్ధనా! ఏ హేతువు వలన దుష్టాత్ముడగు 'కేశి' అను దైత్యుడు నిచే వధ చేయబడెనో - ఆ హేతువు వలన నీవు లోకమున 'కేశవ' నామముతో ఖ్యాతి నందినవాడవయ్యెదవు అని నారద వచనము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 2౩ 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 23.Keśavaḥ 🌻*

*OM Keśavāya namaḥ*

Abhirūpāḥ keśāḥ yasya saḥ One whose Keśā or locks are beautiful he is Keśavaḥ.

Or one who is Himself the three - Kaḥ (Brahmā), Aḥ (Viṣṇu) and Īśaḥ  (Siva) he is Keśava.

Or Keśi vadāt Kēśava One who destroyed the asura/demon Keśi in the Kr̥ṣṇa incarnation.

Viṣṇu Purāṇa - Part 5, Chapter 16
Yasyā ttvayaiṣa duṣṭātmā hataḥ keśi janārdhana,
Tasmā tkeśavanāmnā tvaṃ loke kyāto bhaviṣyasi. (23)

Sage Nārada delightedly exclaimed 'O Janārdhana! For this, that You have slain the impious Keśi, You shall be known in the world by the name of Keśava.'

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka 
योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. నారద భక్తి సూత్రాలు - 108 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 78

*🌻 78. అహింనా సత్య శౌచ దయాస్తిక్వాది చారిత్ర్యాణి పరిపాలనీయాణి ॥ 🌻*

అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం మొదలైనవి కూడా భక్తిని నిలుపు కోవడానికి ఉపయోగపదే సాధనలు. 

అహింస అంటే తన వలన ఇతరులకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ విధమైన బాధ కలుగకుండుట. ఇతరులు బాధ పెట్టినా, ప్రతీకారంగా చెసేది కూడా హింసే అవుతుంది. ఇతరుల మనస్సుకు భక్తుడి వలన ఎట్టి బాధ కలుగకూడదు. సాధకుడు రజోగుణం విడిచి, సాత్వికుదైతే గాని భక్తి నిలవదు. 

సాధకుడి వ్రతం అహింస గనుక, తన కారణంగా ఇతరులకు బాధ కలుగక పోయినా తన తలపులలో కూడా ఇతరులకు బాధను కలిగించే ఆలోచన రాకూడదు. అంతేకాదు, శత్రువును కూడా ప్రేమించ గలగాలి.

జిల్లళ్ళమూడి అమ్మ బాధల గురించి ఏమి నిర్వచించారో చూడండి. “శరీరానికి తగిలితే నొప్పి, మనస్సుకు తగిలితే బాధ. మనస్సుకు బాధ ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటె లేదు. సుఖంగా బాధను అనుభవిస్తే బాధ బాధ కాదు. బాధంటే చైతన్యమే. బాధ లేకపోతే స్థాణువై పోతాడు. బాధలు అనుభవిస్తున్నా అది బాధ అనిపించనప్పుడు సహజ సహనమవుతుంది. సర్వకాల సర్వావస్థలందు సహజ సహనమె సమాధి. సమాధి అంటే మోక్షమే కదా !

అహింసకు అమ్మ చెప్పిన భాష్యమేమంటే బాధలుండడం భగవంతుని దయ. ఎందుకంటె బాధలు సహించుకోవడాన్ని సహజం చేసుకోవడానికి పరీక్ష అవసరం. ఆ పరిక్ష కోసమే బాధలున్నాయి. కనుక ప్రతిచర్య హింస అవుతుంది.

సత్యం అంటే అబద్దములాడకుండుట. సత్య వాక్పరిపాలనకు శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు ఉదాహరణీయం. సత్యవ్రతం అంటే సత్యం జ్ఞానం అనంతం అయిన భగవంతునితో అనుసంధానం చేసుకోవడం. అనిత్య వస్తువుల యెడ ఆసక్తి వీడి, సత్యమైన భగవంతుని మీద అనురాగం పెంచుకోవడం. స్వార్ధాన్ని త్వాగం చేయదం సత్యమే అవుతుంది.

అంతఃకరణ శుద్ధి భక్తికి కావలసిన ఉత్సాహం బాహ్య శౌచం వలన కలుగుతుంది. సర్వ జీవులందు వాటి దీనత్వాన్ని బట్టి కలిగేది దయ. నా వారు, ఇతరులు అనే భేదం లేకుండా కలిగేది దయ. 

భక్తి చేసేవాడికి “భగవంతుడున్నాడు,  తప్పక అనుగ్రహిస్తాడు” అనె విశ్వాసం ఉండాలి. దీనినే ఆస్తిక్యము అంటారు. ఇట్టి దృఢ విశ్వాసం లేకపోతే భక్తి సఫలం కాదు.

అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం ఉన్నప్పుడు, గొణభక్తి ముఖ్యభక్తిగా పరిణమిస్తుంది. రాగద్వేష అసూయలున్న వారికి భక్తి అనేది, కపట ప్రదర్శనే అవుతుంది. కనుక భక్తిని నిజాయితీగా సలపడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹 Guru Geeta - Datta Vaakya - 79 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
72

*We discussed that  the  term “Guru”  is  of  utmost importance  in one’s  life.  There is  no one greater  than the Guru. We  also discussed that Guru is  also  Lord Krishna.*  

Let’s understand the qualities  of  the  Guru through some  stories  of  Lord  Krishna.  If  compassion and sacrifice  were to take  a  form, that  form  would become  Guru. That  itself  is  the  divine  form  of  Lord Krishna.  

Wandering  in Gokulam  as  a  cowherd, Krishna  displayed many  miracles  that  amazed  even  the Gods. We’ll  understand them  if  we  read the  Bhagavatam. Recently, Swamiji  went  to Mathura and Vrindavan for  the  volunteer  camp with children from  Sri  Datta  Humane  Services. 

There, I  remembered a  lot  of  Krishna’s  childhood leelas. I  recalled  every  incident. The  songs  from the Kannada Bhagavatam  that  revered  Jayalakshmi  Mata composed  were  ringing  in  my  ears. Appaji  was  5  years  old when He  went  to Gokulam  with Jayalakshmi  Mata  and the  rest  of  the family. 

 Back then, it  was  not  as  chaotic  as  it  is  now. People  used to always  chant  “Radhe”  or “Radhe  Shyam”. Not  only  that, they  would serve  milk,  yogurt  and food in  every  house.  These days, they  keep demanding  money  instead.  

Back then, Jayalakshmi  Mata  wrote  the  song “Mathura Nagaravu…”  after  seeing  the  city  where  Lord Krishna  grew  up. I  still  cannot  forget the  song.  I  keep singing  the  song  once  a  while. Even today,  I  remember  the  place  where  Lord  Krishna  grew  up. 

Nanda  Gokulam, Govardhana  mountain are  all  located fairly  close  to each other,  about  16-17 kilometers  apart  from  each other.   Lord  Krishna  worked very  hard. He  worked very  hard to uphold Dharma.  Lord Krishna  stood by  every  being,  in  every  instance and  in  every  situation  as  a Guru.  

That  is  why,  Sri  Krishna is hailed  as  the best  among  the  best  and is  the  only  one  that  can be  called Jagadguru. Merely traveling  to  foreign lands  doesn’t  make  one  a  Jagadguru.  

Lord Krishna  is  worshiped as  Guru in all  the  worlds, in the  entire  cosmos. Nowadays,  traveling  to 2-3 continents  seems  to qualify someone  as  Jagadguru. That  is  not  correct.  

Beings  in all  the  worlds  in the  cosmos, from  gods to Yakshas, Kinnaras  and  Kimpurushas, all  worshiped  Lord Krishna.  That  is  why  the  Lord was  Guru to everyone.  He  remained  a  Guru  even in Golokam. 

Taking  on  a  body, discarding the  body,  Lord Krishna  worked very  hard.  You  will  see  this  when  you  read his  life  history. All  divine  incarnations  worked very  hard. Didn’t  the  Lord work hard in Matsya  (fish) Avatara?  Appearing  as  a  gigantic  fish, he  had to work very  hard. 

As  Kurma  (tortoise) Avatara,  as  Varaha  (boar)  Avatara, he  worked very  hard. Just  when we  thought  that  the  Lord would not  have  to work so hard in a  human form, he  had to work very  hard  in his  incarnation as  Lord  Rama.   

And as  Lord Krishna, he  had to work very, very  hard. As  Guru to  all  the  worlds, he  wandered as  a  cowherd in Gokulam, displaying  miracles  and  causing  amazement  to everyone  including the  Gods. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. శివగీత  - 76 / The Siva-Gita - 76 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

దశమాధ్యాయము
*🌻. జీవ స్వరూప నిరూపణము  - 2 🌻*

నిత్యో నిశుద్ధ స్సర్వాత్మా - నిర్లేపో హం నిరంజనః
సర్వధర్మ విహీనశ్చ - న గ్రాహ్యొ మనసా పిచ          6

నాహం సర్వేంద్రి య గ్రాహ్యః సర్వేషాం గ్రాహాకో హ్యహమ్
జ్ఞాతామం సర్వలోకస్య - మను జ్ఞాతాన విద్య తే        7

దూర స్సర్వ వికారాణాం - పరిణామాది కస్య చ
యతో నాచో నివర్తం తే - అప్రా ప్య మనసా సహా       8

ఆనందం బ్రహ్మ మాం జ్ఞాత్వా - న బిభే తి కుత శ్చన,
యస్తు సర్వాణి భూతాని - మయ్యే వేతి ప్రపశ్య తి           9

మాం చ సర్వేషు భూతేషు - తతో న విజుగుప్సతే
యస్య సర్వాణి భూతాని - హ్య త్త్యే వాభూద్వి  జానతః    10

నేను శాశ్వతుడను, నిర్మలుండును, అందరి యంతరంగమున నున్నవాడిని, సమస్త స్వరూపుడను.  వృద్ధి బొందువాడిని, క్రియా శూన్యుడను,  సర్వధర్మ రహితుడను మనస్సున కగోచరుడను.

 సమస్తేంద్రియములతో నగ్రాహ్యుడను, సర్వమును గ్రహించువాడిని,  సర్వలోకములకు తెలిసికొన్న వాడిని,  నన్నెవరును తెలియని (గుర్తించని) వాడిని, పరిణామాది వికార రహితుడను,  నన్ను వివరించుటలో నే వేదములైతే మనస్సుతో కూడా గుర్తించ  లేక మౌనమును వహించునో అటువంటి యానందమయుడ  నగు  పరబ్రహ్మనైన నన్ను తెలిసికొనిన వాడెక్కడను భీతిల్లడు. 

సమస్త ప్రాణులు నాయందే యున్నవని మదాత్మగాదలచునో   నన్నన్ని ప్రాణులయందు వానినిగా నేవ్వడైతే తెలిసికొనునో అట్టివాడు  సమస్త ప్రాణులనుండి తనను రక్షించు కొనదలచినవాడు కాడు.  సమస్త ప్రాణులు నా పరమాత్మయేనని తెలిసికొనునట్టి ఐక్యమునే  చూచునట్టి వాడికి మొహశోకము లెట్లు కలుగును?

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 76 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️  Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 10 
*🌻 Jeeva Swaroopa Niroopanam -2 🌻*

I'm eternal, pure, am the indweller of all, all forms are my forms, I grow, I do not do any work, I am above all religions, I'm beyond the comprehension of mind, I'm beyond all senses, I comprehend everything, I know all the universes but no one knows me, I'm devoid of any results. 

Incapable of describing me completely, the vedas themselves become silent; such a Parabrahman i am and the one who knows me in this way, he wouldn't fear of anything. 

All creatures reside in me, hence a wise man who sees me in all creatures, such a one wouldn't fear of any creature. 

One who understands the fact that all creatures are not different from me, how can such a wise one ever get immersed in attachment or sorrow?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 65 /  Sri Gajanan Maharaj Life History - 65 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 13వ అధ్యాయము - 2 🌻*

కావున ఈపుణ్యం అనేఔషధం మీశరీరంలో ఉన్న ప్రాపంచిక సుఖాలను, పాపం అనే జబ్బుని రక్షించేందుకు అవసరం. ఈపుణ్యం అనే ఔషధం ఆపాపం అనే రోగాన్ని నాశనం చేస్తుంది. కావున ఈ మీ వెర్రి ఆలోచనలు ఆపడానికి పుణ్యాన్ని పెంచండి. మంచిపనులు అనేవిత్తనాలు నాటి, సుఖాలు అనే పంటను పొందండి. 

రాళ్ళమీద నాటిన విత్తనాలు ఎప్పటికి మొలకెత్తవు. చెడుకోరికలు, కార్యాలు ఇటువంటి రాళ్ళవంటివి, వాటిమీద విసిరిన విత్తనాలు పక్షులు, క్రిమికీటకాలు భక్షిస్తాయి. యోగులకు సేవ చెయ్యడంకంటే మించిన పుణ్యం వేరొకటిలేదు. ప్రస్తుతం శ్రీగజానన్ మహారాజు, యోగులలో మాణిక్యం వంటివారు. ఒక్కగింజ నాటితే అనేకములయిన గింజలు వస్తాయి. 

అలానే యోగులకొరకు ఏదయినా ఇస్తే అది మీపుణ్యాన్ని లెఖ్కలేనన్నిసార్లు పెంచుతుంది. ఒకగింజ వెనక్కి ఎలా అయితే అనేకమయిన గింజలు ఇస్తుందో అలానే పుణ్యం విషయంలో కూడా అని అన్నాడు. ఇదివిన్న ఆ ఆకతాయి మనుషులు నిశ్శబ్ధంగా ఉండిపోయరు. నిజం అన్ని వాగ్వివాదాలను ఒకకొలిక్కి తెస్తుంది. 

సంఘంలో గౌరవంవున్న వ్యక్తులనుండి మాత్రమే విరాళాలు సేకరించవచ్చు. సాధారణ వ్యక్తులు ఆకార్యానికి ఏమీ ఉపయోగం ఉండదు. అప్పడు శ్రీమహారాజు కొరకు సంపాదించిన స్థలంచుట్టూ గోడకట్టడం ప్రజలు ప్రారంభించారు. 

షేగాంలో ప్రతీవాళ్ళు దీనికి చేయూతనిచ్చారు. రాళ్ళు, సున్నం, ఇసుక వంటి పనికి కావలసిన వస్తువులు ఎడ్లబండి మీద మోసుకు వెళ్ళబడ్డాయి. ఆసమయంలో శ్రీమహారాజు తమ పాతమఠంలో కూర్చుండేవారు. తను స్వయంగా వెళ్ళి ఆక్రొత్త స్థలంలో కూర్చుంటేతప్ప కట్టడం పని త్వరగా కాదని ఆయన అనుకున్నారు. 

అలా ఆలోచించి మఠానికి ఇసుక మోసుకు వెళుతున్న ఒక ఎడ్లబండిమీద ఎక్కి కూర్చున్నారు. ఆబండి తోలేవాడు ఒక మహార్ కులానికి చెందినవాడు అవడంతో వెంటనే ఆబండికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆవిధంగా అతను ప్రవర్తించడానికి శ్రీమహారాజు కారణం అడుగుతూ, తను పరమహంసననీ, అచ్చుతులను ముట్టుకోవడం వల్ల తనకు ఏమీ పరిణామం ఉండదని అన్నారు.

అది నిజమేకానీ బండిమీద మీప్రక్కన కూర్చోడం నాకు సమంజసంకాదు, మారుతి శ్రీరామునితో ఒకడయ్యాడు కానీ ఎప్పడూ ఆయన ప్రక్కన కూర్చోలేదు. ఎప్పుడూ అతను ఆయనముందు చేతులు కట్టుకు నిలబడ్డాడు అని ఆ మహర్ అన్నాడు. 

శ్రీమహారాజు దానికి సమ్మతించి, ఆఎద్దులను ఆబండి తోలేవాడిని అనుసరించ వలసిందిగా అన్నారు. అవి నిజంగా చాలాబాగా ప్రవర్తించి బండి తోలేవాడు లేకపోయినా కోరుకున్న స్థలానికి బండిని తెచ్చాయి. శ్రీమహారాజు దిగి ప్రస్తుతం మందిరం నిలబడ్డ స్థలంలో మధ్యలో కూర్చున్నారు. ఈస్థలం రెండు సర్వేనంబర్లలో ఉంది 43/45. శ్రీమహారాజు కూర్చున్న చోటుని మందిరనిర్మాణానికి కేంద్రంగా పరిగణించాలి. 

అలా చెయ్యాలంటే వాళ్ళు రెండు సర్వేనంబర్లనుండి స్థలం ఉపయోగించాలి. వాళ్ళకి ఒక ఎకరం మాత్రమే ఇవ్వబడింది కానీ ఈవిధంగా కేంద్రంనిర్ణయించడం వల్ల, 11 గజాలస్థలం వేరే స్థలంనుండి మఠం నిర్మాణానికి ఆక్రమించబడింది. కలక్టరు నిర్మాణంగతి చూసినతరువాత ఇంకా ఎక్కువ స్థలం ఇస్తానని హామీ ఇచ్చినకారణంగా వీళ్ళు ఈసాహసం చేసారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 

 *🌹 Sri Gajanan Maharaj Life History - 65  🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 13 - part 2 🌻*

Thus this medicine of Punya (good deeds) is required to protect your material pleasures, which are in your body, and sin is its disease. 

This medicine of Punya will destroy the sin. Therefore, increase, your Punya and stop all this perverse thinking sow the wealth of good deeds to reap the crop of happiness. Grains sown on rocks get wasted and they never germinate. Bad desires and acts are like rocks and grains thrown on them will be consumed by birds and insects only. 

There is no better Punya than rendering service to saints. At present, Shri Gajanan Maharaj is a gem amongst saints. A single grain sown gives out a bunch of grains; likewise  anything given for cause of a saint adds to your Punya countless times. 

One grain gives back multiple of grains  same is the case with Punya.” Hearing this, the slanderers kept quiet, as truth puts an end to all arguments. Donations can be collected only with the help of men having prestige in this society. Ordinary persons are of no use for such work. 

People, then, started the work of constructing a compound wall around the plot acquired for Shri Gajanan Maharaj . Everybody in Shegaon extended help for this work. The material like stone, lime and sand for the work was carried in bullock carts. At that time Shri Gajanan Maharaj was sitting in the old Matth. 

He thought that unless He, Himself, went and sat in the new place, the work of the construction would not be expedited. Thinking so, he climbed a bullock cart carrying sand to the new place of Matth. The cartman, being a Mahar by caste, immediately moved away from the cart. 

Shri Gajanan Maharaj asked him the reason for his behavior and added that He being a sainta Paramhansa was not affected by the contact of untouchables. There upon the Mahar said, It is true, but even then that is not proper for me to sit beside You on the cart. 

Maroti became one with Shri Ram, but never sat by His side. He always stood before Him with folded hands. Shri Gajanan Maharaj agreed and asked the bullocks to follow the cartman. They really behaved well, and brought the cart, without the cartman, to the desired place. 

Shri Gajanan Maharaj got down and sat in the center of the plot where the temple stands at present. This place is in two survey numbers: 43/45. The spot where Shri Gajanan Maharaj sat was treated as the centre for construction and for doing so they had to take land from both the survey numbers.

In fact they were sanctioned only one acre of land, but due to the centre already being fixed as above, an encroachment of eleven gunthas of land was done for the construction ol the Matth. They dared do this because the Collector had promised to allot more land after looking to the progress of construction. However, some mischeuous elements reported the matter to the Government. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 58 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని  ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము)  - 8  🌻*

235. పరమాత్మకు భౌతిక ప్రపంచము నీడవంటిది . కాబట్టి లోకానుభవము లన్నియు ,అయదార్ధమైనవి .

236. పూర్వజన్మ సంస్కారముల వలననే ప్రస్తుత జన్మ తయారగును . ఈ ప్రస్తుత రూపము ద్వారా పూర్వ జన్మ సంస్కారములు అనుభవింపబడి ఖర్చు అగుచుండును .

237. ఆత్మ యొక్క చైతన్యము సంస్కారములలో కేంద్రీకరించి యున్నంతకాలము , ఆ సంస్కారానుభవమును పొందవలసినదే .

238. పునర్జన్మ ప్రక్రియలో, పూర్ణ చైతన్యముగల మానవాత్మ విధిగా అసంఖ్యాకమైన వివిధములైన ద్వంద్వ సంస్కారములు అనుభవమును సంపాదించ వలెను కనుక యీ మానవాత్మ, అసంఖ్యాకమైన సార్లు స్త్రీగను పురుషునిగాను,  వేర్వేరు కులములలో,  వేర్వేరు జాతులలో, వేర్వేరు తెగలలో , వేర్వేరు రంగులలో, వేర్వేరు ప్రదేశములలో, 

ఒకప్పుడు ధనికుడగను, మరియొకప్పుడు దరిద్రునిగను, ఒకప్పుడు ఆరోగ్యవంతునిగాను, మరియొకప్పుడు అనారోగ్యవంతునిగాను, ఒకప్పుడు సుందరుడుగను, మరియొకప్పుడు కురూపిగను , ఒకప్పుడు పొడగరిగను
మరియొకప్పుడు పొట్టిగాను , 

ఇట్లు అసంఖ్యాక సంస్కారములను అనుభవించుచు వ్యతిరేక సంస్కారములను సృష్టించుకొనుచు ఏకకాల మందే వాటిని రద్దుగావించు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


 *🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 12  / Sri Lalitha Chaitanya Vijnanam  - 12 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల

*🌻 11. 'పంచతన్మాత్రసాయకా'  - 2 🌻*

పై తెలిపిన నాలుగు మకరములు పరతత్త్వము నాలుగు స్థితుల లోనికి దిగివచ్చుటకు దేవి ఏర్పరచు వాహనములు. స్వామిత్వము కలవాడు ఈ వాహనముల నధిష్టించి విహరించు చుండును. 

అది లేనివాడు వాహనములకు పట్టుబడును. “అత్యంత కాంతివంతమైన తెల్లని మొసలిపై వరుణదేవత ఆకాశమున త్రిశూలధారియై విహరించుచున్నాడని” వేదము తెలుపుచున్నది. అనగా అశ్విని దేవతయైన వరుణుడు మిత్రునితో కలసి సమస్త సృష్టిని అధిష్ఠించి విహరించు చున్నాడని తెలియవలెను. ఈ నాలుగు మకరములకు నాలుగు వర్ణములు కలవని కూడ తెలియవలెను. 

అందు మొదటిది తెల్లని మకరము లేక దీనిని నీలముగ కూడ తెలుపుదురు. రెండవది ఎరుపు వర్ణము కలది, మూడవది పసుపు వర్ణము కలది, నాలుగవది గోధుమ వర్ణము గలది. ఈ నాలుగు మకరములు జీవ చైతన్యము నధిష్ఠించి లేక దానికి లోబడి యుండు నాలుగు స్థితులు. వీటినే “ధ్యాన్” అను హీబ్రూ గ్రంథమున నాలుగు గుఱ్ఱములని కూడ పేర్కొనిరి. 

ఈ మకరములను అంతర్యామి సాధనముననే అధిష్ఠించుట వీలగును. ఇతర మార్గముల వీలుపడదు.
జ్యోతిశ్చక్రమున గల మకర రాశి ఈ సందర్భమున ప్రాముఖ్యము వహించును. మకరముల నుండి మోక్షణము పొందుటకు మకరరాశి తత్త్వము ఎంతయు ఉపయోగకరము. 

ఇది కారణముగ కూడ మకర మాసమును పుణ్యకాల మందురు. ప్రతి సంవత్సరము మకర మాసమున
సూర్యోదయమున భూమిని, భూమి జీవులను ఊర్ధ్వముఖులుగ ప్రచోదన మొనరించుటకు సూర్యకిరణముల నుండి ఉద్ధారకమైన తత్త్వము
ప్రసరింపబడుచుండును. ఉత్తరాయణ పుణ్యకాల మనగా జీవులను మకర బంధముల నుండి ఉద్ధరించు పుణ్యకాలముగ భావించవలెను.

అటులనే జ్యోతిశ్చక్రమున ఐదవ రాశియైన సింహరాశి, అపసవ్య మార్గమున ఐదవ రాశియైన ధనుస్సు రాశి కూడ మకరముల నుండి ఉద్ధరింపబడుటకు సహకరించగలవు. జీవుని జాతక  చక్రమున ఐదు, పది రాశులలో గల గ్రహముల నుండి తాననుసరించ వలసిన ప్రవర్తనము సూచింపబడుచున్నదని కూడ గ్రహింపవలెను.

ఇట్లు మకరవిద్య అతి విస్తారముగ ఋషులచే వివరింపబడినది. ఇది ఒక ప్రత్యేక విద్యగ సాధన చేయు బృందములు గలవు. ఈ సందర్భమున భాగవత మందలి ఒక పద్యమును ఇచ్చట ప్రస్తుతి చేయుచున్నాము.

మకర మొకటి రవిఁ జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్
మకరాలయమునఁ దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మఱువన కరిగెన్.

పై పద్యమును ధ్యానము చేసి మకర రహస్యముల నెరుగవలెను.

అట్లే సంఖ్యా శాస్త్రమున ఐదు (5) అంకెకు అత్యంత ప్రాముఖ్యము కలదు. ఈ ప్రాముఖ్యత ముందు నామములలో వివరింపబడును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 🌹. శ్రీమద్భగవద్గీత - 418   / Bhagavad-Gita - 418  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 26, 27  🌴

26. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా:
సర్వే సహైవావనిపాలసఙ్ఘై: |
భీష్మో ద్రోణ: సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యై: ||

27. వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సందృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గై: ||

🌷. తాత్పర్యం : 


🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 418 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 26 , 27 🌴

26. amī ca tvāṁ dhṛtarāṣṭrasya putrāḥ
sarve sahaivāvani-pāla-saṅghaiḥ
bhīṣmo droṇaḥ sūta-putras tathāsau
sahāsmadīyair api yodha-mukhyaiḥ

27. vaktrāṇi te tvaramāṇā viśanti
daṁṣṭrā-karālāni bhayānakāni
kecid vilagnā daśanāntareṣu
sandṛśyante cūrṇitair uttamāṅgaiḥ

🌷 Translation : 
All the sons of Dhṛtarāṣṭra, along with their allied kings, and Bhīṣma, Droṇa, Karṇa – and our chief soldiers also – are rushing into Your fearful mouths. And some I see trapped with heads smashed between Your teeth.

🌹 Purport :
In a previous verse the Lord promised to show Arjuna things he would be very interested in seeing. Now Arjuna sees that the leaders of the opposite party (Bhīṣma, Droṇa, Karṇa and all the sons of Dhṛtarāṣṭra) and their soldiers and Arjuna’s own soldiers are all being annihilated. This is an indication that after the death of nearly all the persons assembled at Kurukṣetra, Arjuna will emerge victorious. It is also mentioned here that Bhīṣma, who is supposed to be unconquerable, will also be smashed. So also Karṇa. Not only will the great warriors of the other party like Bhīṣma be smashed, but some of the great warriors of Arjuna’s side also.
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

 *🌹. మంత్రపుష్పం తత్వ విచారణ....  విజ్ఞానం 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు కదా.. ఆ పరమాత్మ సర్వత్రా వున్నాడని చెప్పటమే ఆ మంత్రపుష్పం ఉద్దేశ్యం. మన లోపల, బయట కూడా వ్యాపించి వున్న ఆ దేవదేవుడు మన శరీరంలో ఏ రూపంలో వున్నాడో చెబుతుంది మంత్రపుష్పం.

‘‘మన శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడని వర్ణించబడింది’’

చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత, ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందిట.

మనలోనే వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి నేను, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని ఈసారి విన్నప్పుడు కళ్ళు మూసుకుని మీలోని ఆ పరమాత్మని దర్శనం చేసుకోండి.

*🌻. మంత్రపుష్ప విజ్ఞానం 🌻*

మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకూ కొన్ని మంత్రాలున్నాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మబలుకుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్రమైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీరామానుజులు వెల్లడించారు.

మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగుతాయని అధర్వ వేదం చెబుతోంది. ‘మన్‌’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం అని వేదవిజ్ఞానం వివరిస్తోంది. విస్తృత అర్థంలో, మంత్రం అనేది మానసిక సాధనం. మంత్రాలన్నీ వేదాల్లోని భాగాలు. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారమే మంత్రపుష్పం!

యజుర్వేదానికి చెందిన తైత్తరీయ ఆరణ్యకంలో మంత్రపుష్పం వివరాలున్నాయి. సర్వసామాన్యంగా యజ్ఞయాగాల సమయంలో మంత్రపుష్పాన్ని చదువుతారు.

 జీవజాలానికి జలం ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైందో మంత్రం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలకమని మంత్రంలో ఉంది. జలం భగవంతుడితో సమానం. అది జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుందంటోంది మంత్రపుష్పం!

నీరు ఇహానికి, పరానికి సంబంధించింది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు, భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది మంత్రపుష్ప సారాంశం.

పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడట. మోక్షమార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. 

అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. 

చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే! అందుకే ‘దైవం పరంజ్యోతి’ అంటారు. ఆయనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.

సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటానుకోట్లు ఉన్నాయని, వాటన్నింటి సమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని మంత్రపుష్పం తెలియజేస్తుంది. మనిషి తానే శక్తిమంతుడినని భావిస్తాడు. అతడి కంటే భూమి గొప్పది. భూమి కంటే సూర్యకుటుంబం మరెంతో పెద్దది. అలాంటి కుటుంబాలే కోట్లలో ఉన్నాయంటే... బ్రహ్మాండంలో మనిషి స్థానమెంత? పరమాత్మ ముందు మన స్థాయి ఏపాటిదో మంత్రపుష్పం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకొంటే, మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ శ్రీమన్నారాయణుడు భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.

మంత్రపుష్పం ప్రకారం- జఠరాగ్ని మధ్య సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగసి ఉంటుంది. దాని నీలి జ్వాల మధ్య, ఉరుములోని వెలుగురేఖలా అణువుతో సమానంగా మెరుపు ఉంటుంది. అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని, ప్రాణవాయువుల కలయికే జలమని విజ్ఞానశాస్త్రమూ వెల్లడిస్తోంది.

 మానవాళికి సంతోషాన్ని కలగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. ఆయన సముద్ర మథనం సందర్భంలో ఉద్భవించాడు. అందుకే జలం చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తున్నాయి.

పడవకు నీటికి ఉన్నట్లే, దైవానికి-మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు, అన్ని జ్ఞానాలకు దేవదేవుడే అధిపతి. ఆకాశం నుంచి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా, భక్తులు ఏ దైవానికి నమస్కరించినా, అది కేశవుడికే చెందుతుందని మంత్రం చెబుతోంది. పరబ్రహ్మమే గొప్పవాడని, జగదానంద కారకుడైన ఆ దైవాన్ని స్మరిస్తే అన్ని బంధాల నుంచీ విముక్తి లభిస్తుందని వివరిస్తుంది మంత్రపుష్పం.
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. మంత్ర పుష్పం  - భావగానం - 9 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻. మంత్రం పుష్పం - 20  to 23 🌻*

*🌻. మంత్ర పుష్పం 20.*

*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*పర్జన్యో వా అపామాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యః పర్జన్యస్యాయతనం* *ఆయతనవాన్ భవతి*
*అపోవై పర్జన్య స్యాయతనంవేద* *ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*

*🍀. భావ గానం:*

ఎవరు నీటి నివాసమెరిగెదరో
వారు ఆ నివాసం పొందెదరు. 
మబ్బులు నీటి నివాసమని తెలిసెదరో
వారు ఆ నివాసం పొందెదరు. 
మబ్బు , నీరుల నివాస మెరిగెదరో
వారు ఆ నివాసం పొందెదరు

*🌻. మంత్ర పుష్పం 21*

*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*సంవత్సరో వా అపామాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యస్సంవత్సరస్యాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి
అపోవై* *సంవత్సరస్యాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*

 *🍀. భావ గానం:*

ఎవరు నీటి నివాసమెరిగెదరో
వారు ఆ నివాసం పొందెదరు
నీరు సంవత్సర నివాసని తెలిసెదరో
వారు ఆ నివాసం పొందెదరు
సంవత్సరము నీరు నివాసని తెలిసెదరో
వారు ఆ నివాసం పొందెదరు
నీరు ,సంవత్సరాల నివాస మెరిగెదరో
వారు ఆ నివాసం పొందెదరు

*🌻. మంత్ర పుష్పం 23*

*కిం తద్విష్ణోర్బల మాహుః*
*కా దీప్తిః కిం పరాయణం*
*ఏకొ యధ్ధారాయ ద్దేవః*
*రేజతీ రోదసీ ఉభౌ*

*🍀. భావగానం:*

భూమి ఆకాశాలు రెండూనోయి
విష్ణువే భరించు దైవమోయి
అంత బలమెలా పొందెనోయి
అందుకు కారణమే మోయి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹 . శ్రీ శివ మహా పురాణము - 234 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴* 
51. అధ్యాయము - 6

*🌻. సంధ్య తపస్సును చేయుట - 4 🌻*

బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా మహేశస్య ప్రసన్న మనసస్తదా | సంధ్యో వా చ సుప్రసన్నా ప్రణమ్య చ ముహుర్ముహుః || 31

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు ప్రసన్నమగు మనస్సు గల మహేశ్వరుని ఈ మాటను విని, సంధ్య మిక్కిలి ఆనందించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి ఇట్లు పలికెను (31).

సంధ్యోవాచ |

యది దేయో వరః ప్రీత్యా వరయోగ్యాస్మ్యహం యది | యది శుద్ధాస్మ్యహం జాతా తస్మాత్పాపాన్మహేశ్వర || 32

యది దేవ ప్రసన్నోsసి తపసా మమ సాంప్రతమ్‌ | వృతస్తదాయం ప్రథమో వరో మమ విధీయతా మ్‌ || 33

ఉత్పన్న మాత్రా దేవేశ ప్రాణినోస్మిన్న భస్థ్సలే | న భవంతు సమే నైవ సకామ స్సంభవంతు వై || 34

యద్ధి వృత్తా హి లోకేషు త్రిష్వసి ప్రథితా యథా | భవిష్యామి తథా నాన్యా వర ఏకో వృతో మయా || 35

సంధ్య ఇట్లు పలికెను -

ఓ మహేశ్వరా! ప్రీతితో వరము నిచ్చే పక్షములో, నేను వరమునకు యోగ్యురాలను అయినచో, నేను ఆ పాపమునుండి శుద్ధురాలను అయినచో (32), 

హే దేవా! నా ఈ తపస్సునకు నీవు ప్రసన్నుడవైనచో, నాకు దీనిని మొదటి వరముగా నీయవలెను (33). 

హే దేవదేవా! ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుక తోడనే కామము గలవి గా పుట్టకుండుగాక! (34). 

జరిగిన వత్తాంతము ముల్లోకములలో ప్రసిద్ధి చెంది నేను అపకీర్తిని పొందకుండునట్లు అనుగ్రహించుడు. ఇది నేను కోరు వరములలో ఒకటి (35).

సకామా మమ దృష్టిస్తు కుత్ర చిన్న పతిష్యతి | యో మే పతిర్భవేన్నాథ సోsపి మేsతిసుహృచ్చ వై || 36

యో ద్రక్ష్యతి సకామో మాం పురుషస్తస్య పౌరుషమ్‌ | నాశం గమిష్యతి తదా స చ క్లీబో భవిష్యతి || 37

ఏ వ్యక్తిపైననూ కామముతో గూడిన నా చూపు పడకుండుగాక! హేనాథా! నాకు భర్తయగు వ్యక్తి నాకు మంచి మిత్రుడై ఉండవలెను (36).

నన్ను కామముతో చూచు వ్యక్తి యొక్క పురుషత్వము నశించి, వాడు నపుంసకుడు కావలెను (37).

బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్యా శ్శంకరో భక్తవత్సలః | ఉవాచ సుప్రసన్నాత్మా నిష్పాపాయాస్తయేరితే || 38

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు శంకరుడు సర్వపాపవినిర్ముక్తురాలగు ఆమె పలుకులు విని మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (38).

మహేశ్వర ఉవాచ |

శృణు దేవి చ సంధ్యే త్వం త్వత్పాపం భస్మతాం గతమ్‌ | త్వయి త్యక్తో మయా క్రోధః శుద్ధా జాతా తపః కరాత్‌ || 39

యద్యద్వృతం త్వయా భ##ద్రే దత్తం తదఖిలం మయా | సుప్రసన్నేన తపసా తవ సంధ్యే వరేణ హి || 40

ప్రథమం శైశవో భావః కౌమారాఖ్యో ద్వితీయకః | తృతీయో ¸°వనో భావశ్చతుర్థో వార్ధకస్తథా || 41

తృతీయే త్వథ సంప్రాప్తే వయో భాగే శరీరిణః | సకామాస్స్యుర్ద్వితీయాంతే భవిష్యతి క్వచిత్‌ క్వచిత్‌ || 42

మహేశ్వరుడిట్లు పలికెను -

ఓ సంధ్యాదేవీ!వినుము. నీ పాపము నశించినది. నీవు తపస్సును చేసి శుద్ధురాలవైతివి. నీపై గల కోపమును నేను వీడితిని (39). 

ఓ మంగళస్వరూపులారా! సంధ్యా! నీ తపస్సు చేత, మరియు వరముల చేత నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని నీవు కోరిన వరములనన్నిటినీ నేను ఇచ్చితిని (40).

 మానవులు ముందుగా శైశవము , తరువాతరెండవదియగు కౌమారము, మూడవదియగు ¸°వనము, నాల్గవదియగు వార్ధకము అను దశలను క్రమముగా పొందెదరు (41). 

ప్రాణులు మూడవది యగు ¸°వనమును పొందినప్పుడు కామ భావనను కలిగియుందురు. కొన్ని సందర్భములలో రెండవది యగు కౌమారావస్థ అంతములో కూడా వారు సకాములు కావచ్చును (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 122 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నరనారాయణ మహర్షులు  - 3 🌻*

14. ధారణంగా మనుష్యులు చేసే పని ఏమంటే, మనధ్యేయం ఒకటి. ఆ ధ్యేయాన్ని అడగం. దానికి మార్గం అడుగుతాం. నాకు తృప్తిని ఇవ్వమని అడిగితే, ఐశ్వర్యం ఇవ్వమని అడగక్కరలేదు. అయితే తృప్తిని అడగకుండా ఐశ్వర్యాన్ని అడుగుతాం! 

15. చిన్న విషయాలలో కూడా క్షేమమూ, లాభము, సుఖము, ఉంటాయనుకొని; ఇవి ఇచ్చే వస్తువులు ఏమైనా ఉంటేవాటిని అడుగుతాంకానీ, ఆ వస్తువుతో నిమిత్తంలేకుండానే క్షేమము, శాంతి, లాభము ఇక్కడ ఉన్నచోటే ఇవ్వమని అడగము! 

16. ఆ వస్తువు తనకు లభిస్తే శాంతి, సుఖము, లాభము అన్నీ కలుగుతాయి అని అనుకుంటారు మనుష్యులు. ఆ నిర్ణయంలోనే దోషం ఉంది. ఏది శాంతి నిస్తుందో దన్ని అడగకుండా, ఏదో వస్తువును అడుగుతాడు. ఆ వస్తువును దేవతలు ఇచ్చిపోతారు.

17. లోకంలో సమస్త విజ్ఞానమూ కోరేవారు మత్స్యావతారంలో ఉన్న రూపాన్ని ఆరాధిస్తారు. కులవృద్ధి, వంశవృద్ధి, సంతానం పెరగాలంటే ఇతడిని కూర్మావతారంలో ఆరాధిస్తారు. ముక్తికోరేవాళ్ళు ఈయనను వరాహావతారరూపంలో ఆరాధిస్తారు. 

18. చేసిన పాపం హరించాలి అనుకునేవాళ్ళు నృసింహస్వామి రూపాన్ని ఆరాధిస్తారు. లోకంలోని పరిజ్ఞానాన్ని, చాలా విషయాలను తెలుసుకోవలనుకునేవాళ్ళు వామనావతారాన్ని ఆరాధిస్తారు. ధనంకోరేవాళ్ళు బలరామావతారాన్ని, శత్రుజయం కోరే వాళ్ళు రామావతారాన్ని, మంచి సంతానం – ఒక్కడే కొడుకైనా పరవాలేదు బుద్ధిమంతుడు కావాలి అనుకునేవాళ్ళు – బలరామకృష్ణులను ఆరాధిస్తారు. 

19. అపూర్వమైన గొప్ప సౌందర్యం కావాలనుకునేవాళ్ళూ బుద్ధుడిని ఆరాధిస్తారు.(ఇందులో నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. సందేహం ఏమీ లేదు) ఇతరులమీద ఆధిపత్యం కావాలనుకునేవాళ్ళు కల్కిఅవతారంగా ఆయనను ఆరాధిస్తారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 🌹. 40. గీతోపనిషత్తు - బ్రహ్మ నిర్వాణము - అంతటిలో నిండిన  తత్త్వమును బ్రహ్మము అందురు. ఈ తత్త్వమును దర్శించిన వాని స్థితి బ్రాహ్మీ స్థితి. ఇది పొందినవానికి తాను కానిది ఏమియు కనపడదు.  🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 72  📚*

ఇది సాంఖ్యయోగమను అధ్యాయమునకు చిట్టచివరి శ్లోకము. ఈ శ్లోకమున భగవంతుడు అంతకుముందు శ్లోకములలో వివరించిన సోపాన క్రమమునకు గమ్యమును నిర్వర్తించు చున్నాడు.

ఏషా బ్రాహ్మీస్థితి: పార్థ ! నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాం స్యా మంతకాలే పి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి || 72

 అర్జునుడు ప్రజ్ఞయందు స్థితి గొన్నవాని లక్షణములను గూర్చి నాలుగు ప్రశ్నలు శ్రద్ధాభక్తులతో శ్రీకృష్ణుని అడిగెను. 

స్థితప్రజ్ఞుని లక్షణము లేవి? అతడేమి పలుకును? ఏ రీతిగ నుండును? ఎట్లు సంచరించును? అనునవి ఆ ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికిని సమాధానములు వివరించుచు శ్రీకృష్ణుడు క్రమశః 71వ శ్లోకము చేరునప్పటికి నిరహంకార స్థితిని ఆవిష్కరించెను. 

నిరహంకార స్థితి చేరినవారికి సమస్తము వ్యాపించియున్న తత్వమే తానుగా నున్నదనియు, మరియు సమస్త జగత్తు అదియే నిండియున్నదనియు తెలియును. 

అంతటిలో నిండియున్నది, అన్నిటియందు నిండినది, తనయందు కూడ నిండియుండుటచే తాను, ఇతరము అను భేదము నశించును. 

అంతటిలో నిండిన  తత్త్వమును బ్రహ్మము అందురు. ఈ తత్త్వమును దర్శించిన వాని స్థితి బ్రాహ్మీ స్థితి. ఇది పొందినవానికి తాను కానిది ఏమియు కనపడదు. 

తానే సమస్తమై యుండుటచే మరియు సమస్తమే తానుగ నుండుటచే మరియొకటి లేని స్థితి ప్రాప్తించుటచే మోహము, అంత్య కాలము అనునవి కూడ లేకుండును. 

మరియొకటి లేని స్థితిని గూర్చి భగవానుడు భాషణము చేయుచున్నాడు. ఇదియొక అద్భుతమైన స్థితి. అనిర్వచనీయమైన స్థితి. అంతకుముందున్నవి అపుడుండవు. అంతకుముందు గోచరించిన సత్యములు కూడ నుండవు. 

స్వప్నమున అనేకానేక రూపములను, సన్నివేశములను, భావములను అనుభూతి చెందుచున్న జీవుడు మేల్కాంచినపుడు స్వప్నము లోని విశేషములన్నియు, మేల్కాంచినపుడు ఎట్లు లేవో, అట్లే బ్రహ్మమునందు మేల్కాంచినవానికి ఈ సమస్త సృష్టియు, అందలి జీవులు, లోకములు స్వప్నమని తెలిసి నవ్వు కొనగలడు. అతని ఆనందమునకు అవధులు లేవు. అదియే బ్రహ్మానందము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹 Seeds Of Consciousness - 186 🌹*
✍️  Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 34.  With the arrival of  the primary concept ‘I am’, time  began, with its departure time would end; you the Absolute are not the primary concept ‘I am’. 🌻*

The  ‘I am’ is the starter, the initiator, the very beginning  of  everything  including time.  

In  fact  all measurement  begins with  the  ‘I  am’  and  all measurement including  time  ends  with  its departure.  It is the  primary concept  on  which is built the entire  mansion  of  other concepts. 

The knowledge  ‘I  am’  and  space  have  appeared simultaneously and spontaneously on  you,  the Absolute,  who stands apart.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 64 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 28 🌻*

బుద్ధి సూక్ష్మతని ఈ విచారణా క్రమములో మానవులందరూ తప్పక సంపాదించాలి. కారణం ఏమిటంటే అత్యంత సూక్ష్మమై, సూక్ష్మతరమై, సూక్ష్మతమమైనటువంటి పరబ్రహ్మమును గోచరింపచేసుకొనుట - అంటే కళ్ళకు కనబడేట్టుగా చేసుకొనడమనేది చాలా కష్ట తరమైనటువంటి పని. అది సాధ్యమయ్యేపని కాదు. 

ఎందుకంటే అది నిరాకార నిర్గుణ నిరంజన నిరుపమాన స్వరూపం అది. మరి అన్ని నకార శబ్దములతో కూడుకున్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి పరబ్రహ్మమును సరాసరిగా చూడగలగడం అనేది సాధ్యం కావడం లేదు. కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకొనగోరేవారందరికీ కూడా ఒక మార్గముండాలి కదా. ఆ మార్గము పేరే ఓంకారము.

 ఓంకారమనే శబ్దమును ఆశ్రయించి ఉపాసన చేసేటటువారందరూ ఈ ఓంకారమును వాచికముగా గ్రహించి పరబ్రహ్మను వాచ్యముగా గ్రహించగలుగుతారు. ‘నీవెరుగగోరిన తత్వము ఇదియే’ అని నిశ్చయముగా తెలియజేస్తున్నారు.

         నాయనా! నీవు మరణానంతరం ఏముంది అన్న ప్రశ్నను అడిగావు గానీ, అసలు నువ్వు తెలుసుకోదలచుకున్నది ఏమిటయ్యా అంటే సర్వకాల సర్వావస్థలయందును మార్పుచెందక వుండేటటువంటి పరబ్రహ్మ తత్వమేదైతే వుందో అటువంటి పరబ్రహ్మ తత్వమును తెలుసుకొనగోరుతున్నావు కాబట్టి దాని గురించి నీకు తెలియజేస్తున్నాను. 

అది నాశము లేనిది అనేటటువంటి మొదటి లక్షణం చెప్పాడు. నశించేటటువంటివన్నీ జగత్తులోనివే. నశించేవన్నీ సృష్టిలోనివే. ఆద్యంతములు కలిగినటువంటివన్నీ పిపీలికాది బ్రహ్మపర్యంతము వుండేటటువంటివే అనేటటువంటి నిర్ణయాన్ని చెబుతూ ఇంకా రెండు ఉపమానాలని అందిస్తున్నాడు. అత్యంత సూక్ష్మమైనది. 

సూక్ష్మము అంటే ఎంత సూక్ష్మమండి. అణువుకంటే అణువు. మహత్తు కంటే మహత్తు. “అణోరణీయాన్ మహతో మహీయాన్” అనేటటువంటి సూత్రాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారనమాట. అయితే సూక్ష్మాతి సూక్ష్మం ఎంతండీ అంటే ఒక కణాన్ని బేధించుకుంటూ బేధించుకుంటూ బేధించుకుంటూ చిట్టచివరికి వెళ్ళిపోయాం. మైనస్ మైనస్ మైనస్ మైనస్ మిల్లీ మైక్రానులదాకా కూడా వెళ్ళిపోయాం. 

అప్పుడు ఏదైతే వున్నదో అది గానీ, లేదా పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాం, విశ్వ వ్యాపకంగా పెంచుకుంటూ వెళ్ళాం. కాస్మోసిస్ ఎంత వుందో అంత మేరకు పెంచుకుంటూ వెళ్ళాం. పెంచుకుంటూ వెళితే ఎంతయితే వున్నదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాపించి వున్నది ఏదైతే వున్నదో అదంతా కూడా బ్రహ్మము. దానవతల పరబ్రహ్మము.

         కాబట్టి ముందు దేనిని తెలుసుకోవాలటా? ఈ అణోరణీయాన్ మహతో మహీయాన్ గా వున్నటువంటి బ్రహ్మమును ఎరిగి, దానవతల అనేటటువంటి నిర్ణయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు. 

ఇంకేమిటటా నీకు ప్రయోజనం అంటే ఈ అణువు నుండి మహత్తు వరకూ వున్నటువంటి సమస్తమును ఎరిగినటువంటి వారికి కామ్య సిద్ధి కలుగుతుందట. 

ఇదేమిటండీ అసలు కోరికలు త్యజిస్తేనే ఆత్మ విచారణకి పనికొస్తావని అంతకుముందు చెప్పి ఇప్పుడు మరలా కోరికలన్నీ సిద్ధిస్తాయి అంటారేమిటీ అంటే ఎవరైతే బ్రహ్మమును ఎరుగగోరుచున్నారో వారియొక్క లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగోరడం. అది ఆ ఒక్క కామ్యమే మిగిలివున్నది. ఇంకే కామ్యములు వారియందు మిగిలి లేవు. మోక్ష కాంక్ష. ముక్తి కాంక్ష. ఒక్క కోరిక మాత్రమే మిగిలి వుంది. 

ఈ జన్మమునందే నేను ముక్తిని పొందాలి. ఈ జన్మమునందే జనన మరణ రాహిత్యాన్ని పొందాలి అనేటటువంటి బలీయమైన ఆకాంక్ష ఒక్కటే తీవ్ర మోక్షేచ్చ ఒక్కటే మిగిలివున్నది కాబట్టి తప్పక దానిని పొందగలుగుతారు అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని ఇక్కడ  “కోరికలన్నియూ తీరును“ అనేటటువంటి రూపంలో తెలియజేస్తున్నారు. 

ఈ రకంగా నచికేతునికి ఓంకార తత్వముయొక్క విశేషం “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ” అనేటటువంటి సూత్రమును ఆశ్రయించి బోధించడం ప్రారంభించారు.     - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. అద్భుత సృష్టి  - 41 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
❇️ *7. టవర్ ఆఫ్ బాబిల్ సీల్ :-*

క్రీస్తు పూర్వము 3470 వ సంవత్సరంలో చీకటి శక్తుల కారణంగా *"బిబ్లికల్ టవర్ ఆఫ్ బాబిల్ స్టోరీ"* అనేది జరిగింది. చీకటి శక్తులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మార్పు చేశారు. దీని ప్రభావం వలన మన డిఎన్ఏ టెంప్లేట్స్ లో చాలా మార్పులు సంభవించాయి. సహజమైన కుండలినీ జాగృతి అనే దానిని బ్లాక్ చేశారు. పీనియల్, పిట్యూటరీ, హైపొథాలమస్ మరి థైరాయిడ్ అనే ఉన్నత శక్తి క్షేత్రాలు సరిగ్గా పనిచేయటం మాని వేశాయి. దీని కారణంగా మన జీవన ప్రమాణం తగ్గిపోయింది. 

హైయ్యర్ సెన్నరీ ఫర్ సెప్షన్ ( అతీంద్రియ శక్తులు) తగ్గి మెమొరీ లాస్ (మతిమరుపు) వస్తుంది. DNAలో ఉన్న ఒరిజినల్ లాంగ్వేజ్ ప్యాట్రన్స్ ఇటు అటు అయ్యాయి. 12 అక్షరాలు ఉన్న భాషాస్థితి నుండి 5 అక్షరాల క్రిందికి నిర్మాణం చేయడం జరిగింది.

💫. ఈ లెటర్స్ (అక్షరాలు) సోలార్ ఎనర్జీతో తయారుచేయబడిన ఒక కోడింగ్ లెటర్స్ మన జన్మాంతర, గ్రహాంతర జ్ఞానం అంతా ఈ అక్షరాల లోనే నిక్షిప్తంగా ఉంటుంది. వీటిని *"సోలార్ లెటర్స్"* అంటారు.

 ఎప్పుడైతే డిఎన్ఏ లో ఉన్న సోలార్ అక్షరాలను తొలగించారో ఆనందం, ఆరోగ్యం అనే కోడింగ్ అందక మన జాతి వ్యాధిగ్రస్తులుగా యవ్వనంలోనే మరణించేవారుగా తయారయింది.
మనం ఈ టవర్ ఆఫ్ బాబిల్ సీల్స్ ని తొలగించుకుంటే మన కుండలినీ జాగృతి పరిపూర్ణంగా జరుగుతుంది. ఉన్నత శక్తులు మనలో మేల్కొంటాయి. ఈ J సీల్స్ కారణంగా మనం మన ఒరిజినల్ డిజైన్ టెంప్లేట్స్ ని DNAలో తొలగించుకోవడం జరిగింది. 

దీని కారణంగా మనం ఎవరో, ఈ భూమి మీదకు ఎందుకు వచ్చామో మన లైఫ్ పర్పస్ ఏమిటో మనకి తెలియకుండా పోయింది. లక్ష్యసిద్ధి లేకుండా పునరపి జననం- పునరపి మరణంలో పడిపొతున్నాము. 

మనం వీటిని తొలగించుకుంటే మన ఒరిజినల్ టెంప్లేట్స్ అయిన ఇండిగో DNA,ఏంజెలిక్ DNA యాక్టివేషన్ లోకి వస్తాయి. ఇక్కడ మరణమనేది ఉండదు. భౌతిక దేహం కాంతి దేహం గా మారి భౌతిక అసెన్షన్ పొందుతాం.
 
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


 *🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasra Namavali - 24 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 4వ పాద శ్లోకం*

*🌻 24 . అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః*
*సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ‖ 24 ‖ 🌻*

అగ్రణీః --- 
ముందుండి గమ్యస్థానమునకు దారిచూపువాడు, భక్తులకు ఉత్తమగతికి మార్గము చూపువాడు, మార్గదర్శి. 

గ్రామణిః ---
 సకల సముదాయములకు (సామాన్యజీవులకు, దేవతలకు, ముముక్షువులకు) నాయకుడు; అందరికిని మోక్షమార్గము చూపు పెద్దదిక్కు; సత్యసూరులకు నాధుడు. 

శ్రీమాన్ --- 
 శ్రీ అనగా కాంతి, తేజస్సు, వైభవము, సంపద; సకల సంపదలు మూర్తీభవించిన మూర్తి, సిరిగలవాడు; సమస్త వైభవము గలవాడు, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తి గలవాడు; ప్రకాశించువాడు, తేజోమూర్తి; శ్రీమహాలక్ష్మీపతి; వక్షస్థలమున శ్రీదేవిని నిలుపుకొన్నవాడు; సకల శక్తిమంతుడు. 'శ్రీ' అనగా లక్ష్మీదేవి. సదా లక్ష్మీదేవితో కూడి యుండువాడు - విష్ణుమూర్తి. ఆదిదేవుని వక్షస్థలమున లక్ష్మీదేవి సదా వసించుచుండెను. లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరియించిన ఆదిదేవుడు. 'వక్షస్థలము' హృదయమును సూచించుటచే హృదయములో కల్యాణ సంపద కలిగియున్నవాడని భావము. 

న్యాయః --- 
భక్తులకు తగురీతిలో (మోక్ష) ఫలము ప్రసాదించువాడు; పరబ్రహ్మజ్ఞానమునకు దారిచూపు  తర్ము, యుక్తి; విశ్వమందు అంతటిని సక్రమముగా నియమముగా నడుపు శక్తి. 

నేతా --- 
భక్తుల కోరికలను తీర్చువాడు; విశ్వమునందన్ని వ్యవహారములను నిర్వహించు అధికారి; భక్తులను తన నేతృత్వములో సన్మార్గ మోక్షమార్గములకు చేర్చువాడు. 

సమీరణః --- 
అద్భుతమైన, మనోహరమైన కార్యములను నిర్వర్తించువాడు; ప్రాణమునకు కావలసిన వాయువు తానే అయి ఉన్నవాడు; సకల జీవుల శ్వాసను, తదితర చైతన్యమును నడపువాడు. 

సహస్రమూర్ధా ---
వేయి (లెక్క పెట్టలేనన్ని) శిరసులు గలవాడు;అంతటను ఉండువాడు. 

విశ్వాత్మా --- 
విశ్వమునకే ఆత్మ; సకల భూతములకును అంతస్థితుడైన ఆద్యుడు. 

సహస్రాక్షః --- 
వేయి (లెక్క పెట్టలేనన్ని) కన్నులు గలవాడు; అంతటిని చూచుచుండువాడు. 

సహస్రపాత్ --- 
వేయి (లెక్క పెట్టలేనన్ని) పాదములు గలవాడు; అన్ని చోట్ల చరించువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 24 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Midhuna Rasi, Arudra 4th Padam*

agraṇīrgrāmaṇīḥ śrīmān nyāyō netā samīraṇaḥ |
sahasramūrdhā viśvātmā sahasrākṣaḥ sahasrapāt || 24 ||

Agraṇīḥ: 
One who leads all liberation-seekers to the highest status.
    
Grāmaṇīḥ:
 One who has the command over Bhutagrama or the collectivity of all beings.
    
Śrīmān: 
One more resplendent than everything.
    
Nyāyaḥ:
 The consistency which runs through all ways of knowing and which leads one to the truth of Non-duality.
    
Netā: 
One who moves this world of becoming.
    
Samīraṇaḥ: 
One who in the form of breath keeps all living beings functioning.
    
Sahasramūrdhā: 
One with a thousand, i.e. innumerable, heads.
    
Viśvātmā: 
The soul of the universe.
    
Sahasrākṣaḥ: 
One with a thousand or innumerable eyes.
    
Sahasrapāt: 
One with a thousand, i.e. innumerable legs.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 

 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 

 

29-September-2020 Messages

 1) 🌹 శ్రీమద్భగవద్గీత - 503 / Bhagavad-Gita - 503 🌹

2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 24 , 25 / Vishnu Sahasranama Contemplation - 24, 25 🌹

3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 291 🌹

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 12 / Sri Lalita Chaitanya Vijnanam - 12 🌹

5) 🌹. నారద భక్తి సూత్రాలు - 109 🌹

6) 🌹 Guru Geeta - Datta Vaakya - 80🌹

7) 🌹. శివగీత - 77 / The Shiva-Gita - 77 🌹

8) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 65 / Gajanan Maharaj Life History - 65 🌹 

9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 59 🌹

10) 🌹. శ్రీమద్భగవద్గీత - 419 / Bhagavad-Gita - 419 🌹


11) 🌹. మంత్రపుష్పం తత్వ విచారణ.... విజ్ఞానం 🌹*

12) 🌹. మంత్రపుష్పం - భావగానం - 10 🌹 

13) 🌹. శివ మహా పురాణము - 234 🌹

14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 122 🌹

15) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 64 🌹

16) 🌹 Seeds Of Consciousness - 187 🌹 

17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 42 📚

18) 🌹. అద్భుత సృష్టి - 41 🌹

19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasranama - 24 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


 *🌹. శ్రీమద్భగవద్గీత - 503  / Bhagavad-Gita - 503 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్

*🌴. 14వ అధ్యాయము -  గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు  - 13 🌴*

13.  అప్రకాశో(ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయన్తే వివృద్దే కురునందన ||

🌷. తాత్పర్యం :
ఓ కురునందనా! తమోగుణము వృద్ధినొందినప్పుడు అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వ్యక్తములగును.

🌷. భాష్యము  :
ప్రకాశములేనప్పుడు జ్ఞానము శూన్యమైనందున, తమోగుణము నందున్నవాడు నియమబద్ధముగా కాక తోచినరీతిగా ప్రయోజశూన్యముగా కర్మనొనరించును. తాను కార్యసామర్థ్యమును కలిగియున్నను అతడెట్టి యత్నములను గావింపడు. ఇదియే భ్రాంతి యనబడును.

అనగా చైతన్యమున్నను అట్టివాడు క్రియారహితుడై యుండును. తమోగుణము నందున్నవానికి ఇవియన్నియు చిహ్నములు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 503 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga  - Nature, 3 Gunas  - 13 🌴*

13. aprakāśo ’pravṛttiś ca
pramādo moha eva ca
tamasy etāni jāyante
vivṛddhe kuru-nandana

🌷 Translation :
When there is an increase in the mode of ignorance, O son of Kuru, darkness, inertia, madness and illusion are manifested.

🌹 Purport :
When there is no illumination, knowledge is absent. One in the mode of ignorance does not work by a regulative principle; he wants to act whimsically, for no purpose. Even though he has the capacity to work, he makes no endeavor.

This is called illusion. Although consciousness is going on, life is inactive. These are the symptoms of one in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 Sripada Srivallabha Charithamrutham - 292 🌹*

✍️ Satya prasad

📚. Prasad Bharadwaj

Chapter 38

*🌻 The story of purana pundit - 1 🌻*

Meanwhile, one pundit came to that village who gives ‘pravachanas’ (lectures) on puraanas. Arrangements were made for ‘pravachanam’ outside the temple in the large empty place.  

The Brahmins said that ‘pravachanas’ were meant for ‘sudras’ and not for them and that there was no purana which they did not know. Sri Bapanarya, Shresti and Varma said that they would give some money from their side to the pundit. It was agreed that all sudras would come to hear purana.  

It was announced that they could give some ‘sambhavana’ to the pundit. Some of the Brahmins suggested that half of the money that came as ‘sambhavana’ should be given to the parishad and the other half can be taken by the pundit.  

Sri Bapanarya said, “This is called Mushti in Mushti – Veera Mushti. You do not want to hear the puranas. Moreover, you are trying to snatch the hard earned money of that pundit.  

If you do not change your behavior or the way of thinking, you will have to face serious punishments in future by ‘kaala purusha’.” Thus he admonished them. Arrangement was made for the purana pundit for food at Bapanarya’s house.  

Before the ‘pravachanam’, Laxmi would give hot milk to him. He would drink that milk and start the purana pravachanam. Sripada, being the inner being in all, knew everything. 

 That purana pundit was a great jnani, a great yogi. With his yogic powers, he could find the ‘other forms’ taken by his ‘atma’. He attracted their chaitanyam into him. 

He found his atma in a 4 month old boy in the house of a Brahmin jameendar. When Laxmi gave milk to him, he looked at her with yogic vision and found that his atma would be her husband in her next birth. That meant that small boy would be her husband in her next birth. 

All the ‘purusha’ (male) forms of his atma already merged in the ‘root tatwam’ present in him. When he looked with yogic vision if there were any woman form left, he understood that the ‘root tatwam’ for his ‘woman’ forms was Laxmi.  

Moreover, all his women forms had already merged in her. Laxmi liked her husband very much. She understood that her husband’s chaitanyam did not leave his ‘bhutha sareeram’.  

Many times she saw that her husband’s form standing near him. To cross the ‘Viraja’ River, people do cow donation. She learnt that gomatha also took her husband across the Viraja River, and again took birth as another cow on earth.  

The reason was she had darshan of gomatha also. The chaitanyam of Laxmi’s husband already merged in the root tatwam of purana pundit. This was known to Sripada who was omniscient.

But that pundit came to Peethikapuram for a purpose. He wanted to destroy the debt relations in Peethikapuram and also destroy the ‘karmas’ of other forms, which his atma took, by his yogic powers.  

Continues....

🌹 🌹 🌹 🌹 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 24 / Vishnu Sahasranama Contemplation - 24🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 24. పురుషోత్తమః, पुरुषोत्तमः, Puruṣottamaḥ 🌻*

*ఓం పురుషోత్తమాయ నమః | ॐ पुरुषोत्तमाय नमः | OM Puruṣottamāya namaḥ*

పురుషః అను 14వ దివ్యనామముయొక్క వివరణలో మహాభారత శాంతి పర్వమునందలి ప్రమాణమును పరిగణించితిమి. 'అంతటను అన్నియును తానై నిండి యుండుటచే లేదా అన్నిటిని తన శక్తితో నింపుటచే అన్నిట చేరియుండుటచే ఆ హేతువు వలన ఈ పరమాత్ముడు 'పురుషుడు' అని చెప్పబడుచున్నాడు'.

పురుషాణాం ఉత్తమః పురుషులలో - చేతన తత్త్వములన్నిటిలో ఉత్తముడు లేదా పురుషేభ్యః ఉత్తమః చేతనులందరికంటే ఉత్తముడు.

:: భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
యస్మాత్‌క్షర మతీతోఽహ మక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథీతః పురుషోత్తమః ॥ 18 ॥

నేను క్షరస్వరూపునికంటె మించినవాడను, అక్షరస్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయినందువలన ప్రపంచమునందును, వేదమునందును 'పురుషోత్తము'డని ప్రసిద్ధికెక్కియున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Vishnu Sahasranama Contemplation - 24 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 24. Puruṣottamaḥ 🌻*

*Puruṣottamāya namaḥ*

For the 14th divine name Puruṣāḥ, a reference from Śānti Parva of Mahābhārata was considered. 'The great being resides in and pervades the mansion of the body, having all the features described before and provided with nine gateways; because of this He is called Puruṣa.'

Puruṣāṇāṃ uttamaḥ The greatest among all Puruṣās - spirits. Or Puruṣebhyaḥ uttamaḥ One greater than all individual spirits.

Bhagavad Gīta - Chapter 15
Yasmātˈkṣara matīto’ha makṣarādapi cottamaḥ,
ato’smi lokē vede ca prathītaḥ puruṣottamaḥ. (18)

Since I am transcendental to the mutable and above even the immutable, hence I am well known in the world and in the Vedās as the supreme Person - 'Puruṣottama'.

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 25 / Vishnu Sahasranama Contemplation - 25 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 25. సర్వః, सर्वः, Sarvaḥ 🌻*

*ఓం సర్వస్మై నమః | ॐ सर्वस्मै नमः | OM Sarvasmai namaḥ*

జడమూ, సూక్ష్మములైన సర్వము యొక్క మూలమూ మరియూ సర్వమునూ ఎఱుగునట్టి సర్వజ్ఞుడు - సర్వుడు. సర్వముతానైనవాడు. 'సర్వం సమాప్నోషి తతోసి సర్వః' సచ్చిదానంద సర్వవ్యాపక చైతన్యము సర్వము తానై విశ్వమంతయు వ్యాపించినవాడు.

:: మహాభారతము - ఉద్యోగ పర్వము ::
అసతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభావాఽప్యయాత్ ।
సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వం మేనం ప్రచక్షతే ॥ 70-11 ॥

రూపము లేని, రూపము గల సర్వమునకును ఉత్పత్తీ, లయహేతువు తానే యగుట వలనను సర్వకాలములందును సర్వమును ఎఱుగువాడగుటచేతను ఈతనిని 'సర్వః' లేదా 'సర్వుడు' అందురు.

:: భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ ।
అనన్తవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ॥ 40 ॥

అర్జునుడు చెప్పెను. సర్వరూపులగు ఓ కృష్ణా! ఎదుటను, వెనుకను మీకు నమస్కారము మఱియు అన్ని వైపులను మీకు నమస్కారమగుగాక! అపరిమిత్సామర్థ్యము, పరాక్రమము గలవారగుమీరు సమస్తమును లెస్సగ వ్యాపించియున్నారు. కనుకనే సర్వస్వరూపులై యున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Vishnu Sahasranama Contemplation - 25 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 25.Sarvaḥ 🌻*

*OM Sarvasmai namaḥ*

The omniscient source of all existence.

Mahābhāratā - Udyoga parva
Asataśca sataścaiva sarvasya prabhāvā’pyayāt,
Sarvasya sarvadā jñānāt sarvaṃ menaṃ pracakṣate. (70-11)

As He is the source of all things gross and subtle and as He knows all things all times - He is called Sarva.

Bhagavad Gita - Chapter 11
Namaḥ purastādatha pr̥ṣṭhataste namo’stu te sarvata eva sarva,
Anantavīryāmitavikramastvaṃ sarvaṃ samāpnoṣi tato’si sarvaḥ. (40)

Arjuna said, salutation to You in the East and behind. Salutation be to You on all sides indeed, O All! You are possessed of infinite strength and infinite heroism. You pervade everything; hence You are all!

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. శివగీత  - 77 / The Siva-Gita - 77 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము
*🌻. జీవ స్వరూప నిరూపణము  - 3 🌻*

కో మొహస్తత్ర కస్శోక - ఏకత్వ మను పశ్యతః
ఏష సర్వేషు భూతేషు - గూడో త్మా న ప్రకాశతే       11

దృశ్యతే త్వగ్ర్య యా బుద్ధ్యా - సూక్ష్మయా సూక్ష్మ దర్శిభి:
అనాద్య విద్యయా యుక్త - స్తథాప్యేకో హ మన్యయః            12

అవ్యాకృత   బ్రహ్మరూపో - జగత్కర్తా మహాస్త్రశ్వరః
జ్ఞానమాత్రే యథా దృశ్య - మిదం స్వప్నే జగత్త్రయమ్           13

తద్వన్మయి జగత్సర్వం - దృశ్యతే స్తి విలీయతే   
నానావిద్యా సమాయుక్తో - జీవత్వేన వసామ్యహమ్            14

పంచ కర్మేంద్రి యాణ్యే వ - పంచ జ్ఞానేంద్రి యాణి చ,
మనో బుద్ధి రహంకార - శ్చిత్తం చేత చతుష్టయమ్               15

ఇట్టి పరమాత్ముడు సమస్త ప్రాణులలోను బ్రహ్మము నేరిమ్గిన  సూక్ష్మదర్శులకు మాత్రమే చూడబడును.
 సజాతీయ విజాతీయ స్వగతభేద శూన్యుడనగు నేను మాత్రమే అనాదియగు  జ్ఞానము చేత నన్నాక్రమించియున్నవాడ నైనా మరూపానభి  వ్యక్తమగు బ్రహ్మరూపుడగు సృష్టికర్త నగుచున్నాను.

 స్వప్నములో నీ మూడు లోకములు అజ్ఞానము చేత  ప్రత్యక్ష జ్ఞానమున కల్పింపబడుచున్నట్లుగా ఈ లోకమంతయు  నాలోనే అగుపడుచున్నది, ఉన్నది, లయమగుచున్నది.

రాముడు ప్రశ్నించుచున్నాడు: పైన నేను ప్రశ్నించిన  వాటిలోని జీవుని సంగతి రానేలేదే, అని ప్రశ్నించగా,  జీవుని గురించి వివరిస్తూ అజ్ఞానముతో కూడి నేనే జీవుడను  వ్యవహారముతో జీవుని లక్షణములను వివరించి  దానికి జన్మలేదని చెప్పి అజ్ఞాన కర్మ బంధమునుండి విడుదలై  ఒక జీవునికి ముక్తి యైన యెడల యనేక ప్రాణులకు ముక్తి శూన్యమని  చెప్పి అజ్ఞానము నశించుటే అసలైన ముక్తి యని వివరించి  సుమారుగా ప్రశ్నలకు సమాధానమిచ్చి లోకాంతర  గమనాగమనముల గురించిన ప్రశ్నలతో లింగ దేహము  వుడుదలయ్యేవరకు ప్రానికయ్యద సాధ్యపడదని యానతిచ్చి  లింగ దేహము సందర్భమురాగా అట్టి లింగదేహము గురించి  యాదేశించుచున్నాడు.

ఈ లింగ శరీరము పాప పుణ్యముల ననుభవించుటకై దేహమునందు  చిన్నదిగా నిడిమి యుండును.  ఇది యేయే వస్తువులతో నిర్మింపబడినదనగా పంచ జ్ఞానేంద్రియములు,  పంచ కర్మేంద్రి యములు, మనోబుద్ధి అహంకార చిత్తములు,  పంచ మహావాయువులును, ఇట్లు ఈ పందొమ్మిది వద్తువులు  కల్సి లింగ శరీరమగును .        

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 77 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️  Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 10
*🌻 Jeeva Swaroopa Niroopanam -3 🌻*

Such a Paramatma (I) resides in all creatures in secrecy and stays invisible. A yogi who sees with a micro vision of yoga to such a brahmagyani only this paramatma would be visible.

Devoid of caste and creeds, devoid of mine & yours feelings, I am the ancient one but covering myself through ignorance in the form of Brahma I am becoming the creator.

In the dream the three  worlds due to ajnana (ignorance) appears as being created in reality, all these worlds appear inside me, stay in me and vanish in me. All this creation is just my projection. Under the blanket of ignorance (Ajnanam) I only remain as Jiva. The Jiva is unborn.

True liberation is nothing but destruction of ignorance (Ajnanam). [There is no liberation in literal sense as such. Atma is ever liberated, only Jiva has to realize that, and this is possible only after the destruction of Ajnanam (ignorance)].

There exists a subtle body called as Sookshma Shareeram or Linga Deham inside the Sthoola (gross) body. In order to enjoy the fruits of virtues and vices, this linga deham remains in the gross body in a very minute form.

This linga deham is composed of five motor organs, five sense organs, mind, intellect, ego, chittam, and five major winds. In this way with these nineteen elements put together, form the linga deham.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹 Guru Geeta - Datta Vaakya - 80 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
73

*🌻 By  performing  countless  divine  deeds  to benefit  the  worlds,  Lord  Krishna became  known in all  the  worlds  as  a  Guru.  That  is  why  he’s  called Jagadguru (Guru to all  the worlds) 🌻*

We discussed that  Krishna  wandered in Gokulam  as  a  cowherd and displayed many  miracles that left even the  Gods  amazed.

After  each wondrous  act  of  Lord Krishna,  all  Gods, all  kinds of  Gods  came  down to earth and sang  and danced in joy.  Lord Krishna’s  miracles  were myriad  –  he  lifted Govardhana  mountain with his  little  finger, he  removed  Indra’s  arrogance, he received  Abhishekam  from  Kamadhenu  (the cow  that  gives  whatever  one desires)  and became  “Govinda”.

 That  is  why,  Lord  Krishna  very  much loves  milk. You  also heard the story  of  Lord Venkataramana. He  drank the  milk offered to him  while  sitting  in an  anthill.

That  is  why  milk is  considered the  nectar  of  Kaliyuga.   When the  creator, Brahma, had the  cattle  in Gokulam  disappear,  Lord Krishna  displayed a bigger  miracle  and took the  form  of  all  the  cows  and calves  in Gokulam.

 Brahma  himself came  down  and praised  Krishna  as  the  Guru to all  the  worlds. Krishna  cured the  residents  of Gokulam  of  all  their  illusions. Good doctors  first  help surface  the  hidden  ailments. We  may wonder, “We  came  to this  doctor  trusting  Ayurveda, but  there  are  additional  ailments  I  am now  suffering  from”.  

But, after  all  the  hidden ailments  are  surfaced, the  doctor  gives  you the medicines  to  clean  up  your  system.  Similarly,  what Krishna  did  was  to  first create  illusion  in the  minds  of  everybody  in Gokulam.

Then, he  removed all  their  illusion, so that  there  was nothing  else  left  inside. He  did not  stop at  that. He  taught  them  lessons  in self-realization. From  Gokulam, he  came  to Mathura  and vanquished and killed Kamsa, who was  a manifestation  of  ignorance.  

He blessed  lifelong  devotees  and  parents  Devaki  and Vasudeva. It’s  impossible  to single  out  one  miracle. There  are  countless. Bhagavatam  is  full  of  Krishna’s miracles.  We can  talk  about  Bhagavatam  endlessly.  

The  Lord  who  was  patiently  biding  time in Gokulam, came  to Mathura  and spread divine  knowledge  among  his  devotees  to benefit  all the  worlds. Why  are  we  repeating  this  over  and over?  So  that  we  can remember  it.   

Krishna  generously  blessed Kuchela, who is  also  known as  Sri  Dhama. He  blessed Sri  Dhama with several  boons.  By  performing  countless  divine  deeds  to benefit  the  worlds,  Lord  Krishna became  known in all  the  worlds  as  a  Guru.  

That  is  why  he’s  called Jagadguru (Guru to all  the worlds).  He helped  the righteous  Pandavas.  He became Geetacharya  (the teacher  of  Bhagavad Gita)  by  blessing  Arjuna,  the  third of  the  five  Pandavas  with Bhagavad  Gita.

Today,  Gita  is known the  world over. People  that  have  recited or  heard the  Gita  have  undergone  very positive  transformations  in their  lives. Many  of  them  have  become  Yogis.

So many  have become  rulers  of  their  countries. So many  of  these  rulers  cite  the  Bhagavad  Gita. This  is  an extraordinarily  sacred  scripture we are blessed  with.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. నారద భక్తి సూత్రాలు - 109 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 79

*🌻. 79. సర్వదా సర్వభావేన నిశ్చింతై: (చితైః) భగవానేవ భజనీయః || 🌻*

సమస్త వ్యాకులతలను వదలి జీవించి ఉన్నంతకాలం నిరంతరం భగవంతుని భజిస్తూనే ఉండాలి. ముఖ్యంగా వ్యాకులపాటు ఉన్న సమయంలో ఎక్కువగా భజించాలి.

మెహెర్ బాబా సందేశం ఏమంటే "DON'T WORRY, BE HAPPY" ఇది సాధన వాక్యంగా తీసుకుంటే వ్యాకులపాటు వచ్చినప్పుడే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.

సత్య వాక్యంగా తీసుకుంటే “నీవూ భగవంతు డవే. భగవంతుడు ఆనంద స్వరూపుడు గనుక, నీవు కూడా ఎప్పుడూ, ఆనందంగా ఉండు, వ్యాకులపడకు” అని, దైవేచ్ఛ ప్రకారం జీవిస్తున్నామనే భావనలో ఏది జరిగినా భగవంతుని ఇచ్ఛ అనుకోవాలి. బాధలున్నప్పుడు దైవం నాకు పరీక్ష పెట్టి, పిదప అనుగ్రహిస్తాడు అనుకోవాలి.

ఏ పరిస్థితిలో ఉన్నా, దైవం నన్నీ పరిస్థితిలో ఉంచాడు, అది నా మేలుకేనని అనుకోవాలి.  భజన నిరంతరం చేస్తూ చేస్తూ, జీవించి ఉండగానే ముఖ్యభక్తుడవాలి.

లేకపోతే భగవంతుని ధ్యానిస్తూ ధ్యానిస్తూ, మరణించాలి. వ్యాకులపాటు లేని భజన వలన భక్తి పుష్పించి, భావ సమాధికి చేరుస్తుంది. అప్పుడు సాధకుడు వెనుదిరగడు. ముఖ్యభక్తిలో స్థిరమవుతాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 66 /  Sri Gajanan Maharaj Life History - 66 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 13వ అధ్యాయము - 3 🌻*

కానీ కొంతమంది తుంటరులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు. ఈ వార్తకి శ్రీమహారాజు భక్తులు కలతచెంది, జోషీ అనే ఆఫీసరు ఈ ఆక్రమణ విషయంలో విచారణకోసం వస్తున్నట్టు చెపుతారు. శ్రీమహారాజు నవ్వి, ఈఆక్రమణ కొరకు విధించిన జరిమానా రద్దు చేయబడుతుందని అన్నారు. అది నిజమయింది. జోషీ విచారణ పత్రాలు చూసిన పిదప శ్రీగజానన మహారాజు ట్రస్టుమీద వేసిన జరిమానా రద్దుచేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసారు.

ఈ ఉత్తర్వుల పత్రాలు అందినప్పుడు హరిపాటిల్ కు తనని మహార్ ను కొట్టినప్పటి కధనం గుర్తువచ్చింది. అప్పుడు కూడా శ్రీమహారాజు తనని రక్షిస్తానని వాగ్దానంచేసి, హరిపాటిల్ను నిర్భంధం కాకుండా కాపాడారు. ఇలా శ్రీమహరాజు అన్నదల్లా నిజమని నిరూపించబడింది. ఇప్పుడు శ్రీమహారాజు కొత్తమఠానికి వచ్చిన తరువాత చేసిన చమత్కారాలను నేను వర్నిస్తాను:

గంగాభారతి అనే అతను మెహకర్ దగ్గర సావదాద్ అనే గ్రామంనుండి షేగాం వచ్చాడు. ఇతను కుష్ఠురోగంతో బాధపడుతున్నాడు. ఇతని శరీరంకుళ్ళి, రెండు కాళ్ళుకూడా చాలాపగిలి ఉన్నాయి. ఈరోగం అతని వేళ్ళచివర్లను పూర్తిగా తినేసింది. మరియు మొత్తం శరీరం అంతా ఎర్రగా మారి, అతనికి శరీరం అంతా దురదగా ఉంది.

గంగాభారతి ఈబాధకు విసుగుచెంది, శ్రీమహారాజు గూర్చి విన్నతరువాత, షేగాం వచ్చాడు. ఈవ్యాధి అంటువ్యాధి కాబట్టి అతన్ని శ్రీమహారాజు దగ్గరకు భక్తులు వెళ్ళనివ్వటలేదు. దూరంనుండి శ్రీమహారాజు దర్శనం చేసుకోవలసిందని వాళ్ళు అతనికి సలహా ఇచ్చారు. ఈవిధయిన సలహా తరువాతకూడా, ఒకరోజు గంగాభారతి అవకాసం తీసుకొని, త్వరగా వెళ్ళి శ్రీమహారాజుకు నమస్కరించి, ఆయన పాదాలమీద తలఉంచి దర్శనం చేసుకున్నాడు.

శ్రీమహారాజు అతని తలమీద పెద్దదెబ్బ కొట్టారు, దీనికి అతను తలఎత్తి చూసేసరికి మరల రెండుచెంపల మీద కొట్టారు. ఆతరువాత అతనిని కాళ్ళతో తన్ని, అతనిమీద ఉమ్ముతారు. శరీరంమీద పడిన ఆఉమ్మును గంగాభారతి ప్రసాదంగా భావించి, దాన్ని లేపనంగా శరీరం అంతా ఆమ్మును రాసుకున్నాడు. అది చూస్తున్న ఒక వ్యక్తి ఆవిధంగా ఉమ్మును అప్పటికేకుళ్ళిన ఆశరీరం మీద రాసుకున్నందుకు హేళన చేస్తాడు. సబ్బుతో ఆణిమ్మును కడుగుకొని, అటువంటి మూఢనమ్మకాల నుండి దూరంగా ఉండమని అతను సలహా ఇస్తాడు.

అతను ఇంకా ఎంతవరకు వెళ్ళాడంటే, గంగాభారతి శ్రీగజానన మహారాజు వంటి పిచ్చివాని దగ్గరకు రావడంకంటే, మంచి ఔషదం తీసుకోడం మంచిది అని అంటాడు. నీవు అన్నది తప్పు అని గంగాభారతి నవ్వుతూ అన్నాడు. యోగులలో అశుభ్రమయినది ఏదీ ఉండదు. కస్తూరి ఎప్పుడూ చెడ్డవాసన ఇవ్వదు. నీకు ఉమ్ములాకనిపించినది నిజంగా కస్తూరివాసన ఇచ్చే ఒక ఔషదీయ లేపనం. నువ్వు అనుమానిస్తూఉంటే నాశరీరం ఒకసారి తాకి వాసన చూడు, నీకు ఏవిధమయిన ఉమ్ముతునక కూడా కనిపించదు. అది మొత్తం ఔషదమే.

ఈ ఉమ్మును ఔషదంగా భావించడానికి నేను ఏమీ వెర్రివాడనుకాను. శ్రీమహారాజు గొప్పతనం నీకు తెలియదు. నామాట నిరూపించాలంటే మనం ఇద్దరం శ్రీమహారాజు స్నానంచేసే ఏచోటునుండి నేను మట్టితీసి నాశరీరానికి రాసుకుంటానో ఆస్థలానికి ఇద్దరం వెళదాం అని వాళ్ళు ఇద్దరూ ఆయన స్నానంచేసే స్థలానికి వెళ్ళారు.

 గంగాభారతి అక్కడ మట్టి తీసుకున్నాడు అది అతనిచేతిలో లేపనంగా మారింది. ఆ వెటకారి అదేపని చేసాడు కానీ అతని చేతిలో అది మట్టిగానే మిగిలింది. ఇది అతనని అసలు విషయంగ్రహించేలా చేసింది, దానితో అతను శ్రీమహారాజుకు లొంగిపోయాడు. ఎవరుకూడా గంగాభారతిని శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళనిచ్చేవారు కాదు.

అందుకే అతను ఆయన దగ్గరనుండి దూరంగా కూర్చుని భజనలు పాడుతుండేవాడు. అతనికి మధురమైన స్వరంఉంది. మంచి గాయకుడుకూడా. ఇలా ఒక 15 రోజులు జరిగిన తరువాత ఒక అద్భుతం జరిగింది. అతని శరీరంమీద ఎర్రదనం మాయంఅయింది, చెవులకొసలు మామూలు రూపానికి వచ్చాయి, కాళ్ళమీద పగుళ్ళు పోయి శరీరంనుండి దుర్గంధం రావడం మాయం అయింది. గంగాభారతి తీయని ధ్వనితో భజనలు పాడడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇది అందరినీ సంతోషపరిచింది.

గంగాభారతి భార్య అనసూయ తన తనయుడు సంతోషభారతితో తన భర్తను ఇంటికి వెనక్కి తీసుకు వెళ్ళడానికి షేగాం వచ్చింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 *🌹 Sri Gajanan Maharaj Life History - 66  🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 13 - part 3 🌻*

The devotees were disturbed at the news and informed Shri Gajanan Maharaj that an Officer by name Joshi was coming to enquire the matter of encroachment. Shri Gajanan Maharaj laughed and said that the fine imposed on the encroachment would be exempted. It proved true.

Shri Joshi on going through the enquiry passed orders exempting the fine imposed on Shri Gajanan Maharaj Trust. When this order was received, Hari Patil remembered the episode when he had beaten a Mahar. At that time also Shri Gajanan Maharaj had promised him protection and had ultimately saved Hari Patil from prosecution.

Thus whatever Shri Gajanan Maharaj had said proved true. Now I will narrate the miracles performed by Shri Gajanan Maharaj after coming to the new Matth. A man named Gangabharti came to Shegaon from a village Savadad near Mehkar.

He was suffering from leprosy and his whole body had become rotten with cracks on his both legs. The disease had eaten away his finger tips, reddened all skin and had produced an itching sensation all over his body. Gangabharati was tired of the suffering and so when he heard of Shri Gajanan Maharaj, came to Shegaon. The devotees there did not allow him to go near Shri Gajanan Maharaj as the disease was contageous.

They advised him to get the Darshan of Shri Gajanan Maharaj from a distance. Despite this advise one day Gangabharati took an opportunity, rushed and took direct Darshan of Shri Gajanan Maharaj by prostrating and putting his head on Maharaj’s feet.

At this, Shri Gajanan Maharaj gave him a big slap on his head; as he got up to look at Shri Gajanan Maharaj , he again got slaps on both his cheeks. Thereafter Shri Gajanan Maharaj kicked him by His feet and spat on him.

The spittle that fell on Gangabharti’s body was treated by him as a gift (Prasad) and, like an ointment, massaged all his body by that spittle. Looking to that a person, standing nearby, criticised him fo applying the spittle to his already rotten body. He advised to wash it away by soap and to keep away from such actions of blind faith.

He even went to the extent of saying that Gangabharati should better take some medicine instead of coming to such mad men like Shri Gajanan Maharaj. Gangabharati smiled and said, “You are wrong. There is nothing unclean with saints. Kasturi (Musk) will never emit bad smell.

What appeared like spittle to you was infact a medicinal ointment and it smells like musk. If you doubt it, just touch my body and smell; you will find that there is no trace of spittle in it. It is all medicine. I am not a fool to treat this spittle as an ointment.

Since it was not meant for you, it looked like a spittle to you. You do not know the greatness Shri Gajanan Maharaj ! To prove my statement, let us go to the place where Shri Gajanan Maharaj takes his daily bath and wherefrom I will take the mud and apply it to my body.”

Both of them went to that bathing place; Gangabharati took the mud from tha place and it turned in to ointment in his hand. The critic did the same thing but it remained only mud in his hand.This made him realize the real thing and made him surrendered to Shri Gajanan Maharaj.

Nobody allowed Gangabharati to go near Shri Gajanan Maharaj , so he used to sing bhajans sitting away from Him. He had a melodious voice and was a good singer too. This continued for a fortnight and then there was a miracle. The redness on his body disappared, the earlaps regained normal luster and shape, cracks on the feet closed and the stinking from body vanished.

Gangabharati continued singing bhajans in his sweet voice, It pleased everybody. Anasuya, Gangabharati’s wife, alongwith her son, Santosh Bharati, came to Shegaon to take her husband back home.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 *🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 59 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని  ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము)  - 9  🌻*

*🍀. సంస్కారములు ప్రభావము : 🍀*

239. కర్మలవలన సంస్కారము లుదయించి మనసుపై ముద్రింప బడుచున్నవి.సంస్కారములే కర్మలను చేయించును ఇట్లు సంస్కారములపై కర్మలు, కర్మలపై సంస్కారములు పరస్పరము ఆధారపడియున్నవి.

సి ని మా :____
240 . కర్మలు ........జాగ్రదవస్థలో
దైనందిన వ్యావహారిక జీవితము
సంస్కారములు ......ఫొటోలు
మనస్సు ......ఫిలిం
చైతన్యము .....వెలుగు ఫోకస్
సూక్ష్మ శరీరము ......ప్రొజెక్టరు
కర్మలు .....తెర పై ప్రదర్శనము .

241. ఎందుచేతననగా ..... సంస్కారములు కర్మలచే రద్దుగుచున్నవి . సంస్కారములు కర్మలు చేయించుచున్నవి .

242. సంస్కారములు పూర్తిగా రద్దు అగువరకు , అవి మానవ జీవితములో ప్రధాన పాత్ర వహించుచున్నవి .

243. మానవుని మనస్సు పై సంస్కారములు నిల్చియుండి ,మానవ చైతన్యమును ముద్ర వేసినంత కాలము , మానవుని ప్రాణశ క్తి చే పుట్టించబడి పనిచేయబడుచున్న యీ సంస్కారములు అతని మనస్సు పై నిరంతరాయముగా ముద్రింపబడుచూ , అతని అర్ధ జాగృతిలో నిల్వ చేయబడు చుండును .

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


 *

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 12  / Sri Lalitha Chaitanya Vijnanam  - 12 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల*

*🌻 12. 'నిజారుణ ప్రభాపూర మజ్జద్ర్బహ్మాండ మండలా' 🌻*

తన ఎఱ్ఱని కాంతి ప్రవాహము నందు మునిగిన బ్రహ్మాండ మండలములు గలది అని భావము. సృష్టి ఉదయము, సూర్యుని ఉదయమునకు ముందు ఉద్భవించు కాంతి, ఎఱ్ఱని కాంతి. ఈ కాంతి నుండియే సమస్త బ్రహ్మాండ మండలము ఉద్భవించు చుండును.

ఈ ఎఱ్ఱని కాంతి యందే బ్రహ్మాండము మునిగి యుండును. ఈ ఎఱ్ఱని కాంతి సౌభాగ్య ప్రదము. దివ్య సంకల్ప అవతరణమునకు సంకేతము. భ్రూమధ్యమున భారతీయులు ఈ ఎఱ్ఱని కాంతి ప్రచోదనమునకే తిలకమును దిద్దుకొనుచుందురు.

భగవంతుని ఇచ్ఛాశక్తిగ శ్రీదేవి ఎల్లని కాంతి ప్రవాహముగ మేల్కొనును. సత్సాధకులు ఈ కాంతి ప్రచోదనము కొఱుకే తిలకమును ధరించవలెను. ఇట్లు ధరించుట యాంత్రికముగ కాక ఒక క్రతువుగ నిర్వర్తించవలెను. అట్లు నిర్వర్తించినచో మానవుని యందలి అంతర్యామి ప్రజ్ఞనుండి సంకల్ప ముద్భవించి మానవ మేధస్సుపై ప్రతిబింబిత మగును.

 సత్సంకల్పము ననుసరించి జీవించు టయే సౌభాగ్యము. అదియే సంపద.  ఎఱ్ఱని కాంతి ప్రవాహముగ దేవిని ఆరాధించుట, ఎఱ్ఱని రూపముగ ధ్యానించుట ఈ నామమందించు సందేశము. అమ్మ అగ్ని వర్ణమని, ఆదిత్య వర్ణమని శ్రుతులు పేర్కొనుచున్నవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 12 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

*🌻Nijāruṇa- prabhā-pūra- majjad-brahmāṇḍa-manḍalā* *निजारुण-प्रभा-पूर-मज्जद्-ब्रह्माण्ड-मन्डला (12)🌻*

Her red-rose like complexion radiates the universe with red colour.  

From this nāma onwards, the gross description of Lalitāmbikā begins.  When physical description of a God is made, it is from foot to head and for Goddesses it is from head to foot.  For Lalitāmbikā, the description begins from Her head.   

For Śiva the descriptions are both from His head as well as His feet as He represents both Śiva and Śaktī (ardhanārīśvara form, Śiva and Śaktī combined in a single form, half male and half female, conjoined vertically).  In Pañcadaśī mantra there are three parts or kūṭa-s (divisions).  

Out of the three kūṭa-s, Vāgbhava kūṭa is meditated upon Her head, which is in line with the tradition of describing Her from head to foot.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 12 / Sri Lalitha Chaitanya Vijnanam - 12

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 7 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 12 / Sri Lalitha Chaitanya Vijnanam - 12 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల

🌻 12. 'నిజారుణ ప్రభాపూర మజ్జద్ర్బహ్మాండ మండలా' 🌻

తన ఎఱ్ఱని కాంతి ప్రవాహము నందు మునిగిన బ్రహ్మాండ మండలములు గలది అని భావము. సృష్టి ఉదయము, సూర్యుని ఉదయమునకు ముందు ఉద్భవించు కాంతి, ఎఱ్ఱని కాంతి. ఈ కాంతి నుండియే సమస్త బ్రహ్మాండ మండలము ఉద్భవించు చుండును.

ఈ ఎఱ్ఱని కాంతి యందే బ్రహ్మాండము మునిగి యుండును. ఈ ఎఱ్ఱని కాంతి సౌభాగ్య ప్రదము. దివ్య సంకల్ప అవతరణమునకు సంకేతము. భ్రూమధ్యమున భారతీయులు ఈ ఎఱ్ఱని కాంతి ప్రచోదనమునకే తిలకమును దిద్దుకొనుచుందురు.

భగవంతుని ఇచ్ఛాశక్తిగ శ్రీదేవి ఎల్లని కాంతి ప్రవాహముగ మేల్కొనును. సత్సాధకులు ఈ కాంతి ప్రచోదనము కొఱుకే తిలకమును ధరించవలెను. ఇట్లు ధరించుట యాంత్రికముగ కాక ఒక క్రతువుగ నిర్వర్తించవలెను. అట్లు నిర్వర్తించినచో మానవుని యందలి అంతర్యామి ప్రజ్ఞనుండి సంకల్ప ముద్భవించి మానవ మేధస్సుపై ప్రతిబింబిత మగును.

సత్సంకల్పము ననుసరించి జీవించు టయే సౌభాగ్యము. అదియే సంపద. ఎఱ్ఱని కాంతి ప్రవాహముగ దేవిని ఆరాధించుట, ఎఱ్ఱని రూపముగ ధ్యానించుట ఈ నామమందించు సందేశము. అమ్మ అగ్ని వర్ణమని, ఆదిత్య వర్ణమని శ్రుతులు పేర్కొనుచున్నవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 12   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Nijāruṇa- prabhā-pūra- majjad-brahmāṇḍa-manḍalā निजारुण-प्रभा-पूर-मज्जद्-ब्रह्माण्ड-मन्डला (12)🌻

Her red-rose like complexion radiates the universe with red colour.

From this nāma onwards, the gross description of Lalitāmbikā begins. When physical description of a God is made, it is from foot to head and for Goddesses it is from head to foot. For Lalitāmbikā, the description begins from Her head.

For Śiva the descriptions are both from His head as well as His feet as He represents both Śiva and Śaktī (ardhanārīśvara form, Śiva and Śaktī combined in a single form, half male and half female, conjoined vertically). In Pañcadaśī mantra there are three parts or kūṭa-s (divisions).

Out of the three kūṭa-s, Vāgbhava kūṭa is meditated upon Her head, which is in line with the tradition of describing Her from head to foot.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/srilalithadevi


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


29 Sep 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 59



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 59   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 9 🌻

🍀. సంస్కారములు ప్రభావము : 🍀

239. కర్మలవలన సంస్కారము లుదయించి మనసుపై ముద్రింప బడుచున్నవి.సంస్కారములే కర్మలను చేయించును ఇట్లు సంస్కారములపై కర్మలు, కర్మలపై సంస్కారములు పరస్పరము ఆధారపడియున్నవి.

సి ని మా :____

240 . కర్మలు ........జాగ్రదవస్థలో

దైనందిన వ్యావహారిక జీవితము

సంస్కారములు ......ఫొటోలు

మనస్సు ......ఫిలిం

చైతన్యము .....వెలుగు ఫోకస్

సూక్ష్మ శరీరము ......ప్రొజెక్టరు

కర్మలు .....తెర పై ప్రదర్శనము .

241. ఎందుచేతననగా ..... సంస్కారములు కర్మలచే రద్దుగుచున్నవి . సంస్కారములు కర్మలు చేయించుచున్నవి .

242. సంస్కారములు పూర్తిగా రద్దు అగువరకు , అవి మానవ జీవితములో ప్రధాన పాత్ర వహించుచున్నవి .

243. మానవుని మనస్సు పై సంస్కారములు నిల్చియుండి ,మానవ చైతన్యమును ముద్ర వేసినంత కాలము , మానవుని ప్రాణశ క్తి చే పుట్టించబడి పనిచేయబడుచున్న యీ సంస్కారములు అతని మనస్సు పై నిరంతరాయముగా ముద్రింపబడుచూ , అతని అర్ధ జాగృతిలో నిల్వ చేయబడు చుండును .

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group


29 Sep 2020