🌹 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹
🍀🪔 కార్తీక పౌర్ణమి విశిష్టత - ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే 🪔🍀
ప్రసాద్ భరద్వాజ
🌹 Happy Kartika Purnima to everyone 🌹
🍀🪔 Significance of Kartika Purnima - On this day, performing lamp worship 365 times is equivalent to worshiping three crore (30 million) deities 🪔🍀
Prasad Bharadwaj
కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తారు. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజు చేసే పూజలు, దీపారాధనలు అనంతకోటి పుణ్యఫలాన్ని ఇస్తాయి.
కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేసి శివకేశవుల అనుగ్రహం పొందుతారు.
🪔 365 వత్తులు వెలిగించడానికి కారణం ఏమిటి? 🪔
సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించడం హిందూ సంప్రదాయంలో భాగం. అయితే, ప్రస్తుత కలియుగ జీవనశైలిలో ప్రతి ఒక్కరూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడదు. ఒకరోజు దీపం పెట్టి, మరోరోజు పెట్టకపోవడం వల్ల దోషాలు ఏర్పడతాయి.
నిత్య దీపారాధన ఫలితం: సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే, ఆ ఒక్కరోజు దీపం వెలిగించినా ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది.
🪔 దేవతల ఆహ్వానం: పురాణాల ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు దీపాలను వెలిగిస్తే భూమి పైకి వస్తారు. 365 వత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి, పూజలు చేయడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయి.
🪔 ఏం దోషాలు పరిహారమవుతాయి? 🪔
కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన, ముఖ్యంగా 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల ఈ కింది దోషాలు, లోపాలు పరిహారం అవుతాయి:
🪔 నిత్య దీపారాధన లోపం: సంవత్సరం మొత్తం ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు వెలిగించడంలో వచ్చిన లోపాలు, కుదరకపోయిన రోజులు ఉంటే, ఆ లోపం మొత్తం 365 వత్తుల దీపంతో పరిహారం అవుతుంది.
🪔 పాప క్షయం: కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. ఈ రోజున దీపారాధన చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.
🪔 లక్ష్మీ కటాక్షం: దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. 365 వత్తులతో దీపం వెలిగించి, దానధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి, భక్తులకు అష్ట ఐశ్వర్యాలు, సంపద కలుగుతాయి.
🪔 ముక్తి ప్రాప్తి: ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం ముక్కోటి దేవతలను పూజించినట్లే. ఈ దీపాలను చూసినవారి పాపాలు పటాపంచలై, జీవితానంతరం వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
🪔 ఎక్కడ, ఎలా వెలిగించాలని? 🪔
365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి, కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం శ్రేష్ఠం. ఈ దీపాన్ని
తులసి కోట వద్ద.
ఉసిరి చెట్టు కింద.
శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
🪔 కార్తీక పౌర్ణమి దీపారాధన విధానం: 🪔
365 వత్తులు తయారుచేయడం: దారంతో లేదా దూదితో 365 చిన్న వత్తులను సిద్ధం చేసుకోవాలి.
దీపాన్ని సిద్ధం చేయడం: సాధారణంగా ఈ విశేష దీపారాధన కోసం ఉసిరికాయపై లేదా బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శ్రేష్ఠం.
దీపం వెలిగించడం: దీపంలో ఆవు నెయ్యి (శ్రేష్ఠం) లేదా నువ్వుల నూనె పోసి.. 365 వత్తులను ఒకే దీపంలో లేదా అనేక దీపాలలో ఉంచి భక్తిశ్రద్ధలతో వెలిగించాలి.
మంత్ర పఠనం:
365 వత్తులు అగరబత్తితో మాత్రమే వెలిగించాలి. ఇంటి యజమాని స్వయంగా వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు… మంత్రం: వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు చల్లుతూ "దామోదరం ఆవాహయామి" లేదా "త్రయంబకం ఆవాహయామి" అని ఉచ్చరించాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమిని ఆచరిస్తే శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొంది సర్వసౌఖ్యాలు కలుగుతాయి.
ఇతర విశేషాలు
కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపారాధనతో పాటు.. ఈ కింద తెలిపిన ఆచారాలను పాటించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
జ్వాలాతోరణ దర్శనం: సాయంత్రం దేవాలయంలో వెలిగించే జ్వాలాతోరణాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు హరించి.. పుణ్యం లభిస్తుందని నమ్మకం.
సత్యనారాయణ స్వామి వ్రతం: కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తేజజ మామూలు రోజుల కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది.
నదీ స్నానం, దానం: ఈ రోజు పవిత్ర నదులలో స్నానం చేసి, పేదవారికి వస్త్ర దానం, ఆహార దానం లేదా బెల్లం దానం (లక్ష్మీ దేవికి సమర్పించడం) శుభప్రదం.
నదీ స్నానం, పూజా ముహూర్తాలు -
నదీ స్నానం: నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి 5:44 వరకు (బ్రహ్మ ముహూర్తం)
పూజా ముహూర్తం: ఉదయం 7:58 నుంచి 9:00 వరకు
సాయంత్ర దీపారాధన: సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు.
🌹🌹🌹🌹🌹