శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 275 / Sri Lalitha Chaitanya Vijnanam - 275
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 275 / Sri Lalitha Chaitanya Vijnanam - 275 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀
🌻 275. 'భానుమండల మధ్యస్థా' 🌻
సవితృ మండల మధ్యమున స్థిరముగొన్నది శ్రీమాత అని అర్థము.
సూర్యున కాధారము సవిత. పండ్రెండు సూర్యమండలములకిది. కేంద్రము. సూర్యుడు ఒక సౌర మండలమునకు కేంద్రము కాగా, అట్టి సూర్యులు పండ్రెండు మందికి కేంద్రముగ సవిత అను దేవత యున్నది. అట్టి సవితృ మండలమునకు కేంద్రముగ భర్గోదేవుడున్నాడు. భర్గోదేవు డనగా ప్రచండమై, సృష్టి కాధారమై, పరము నుండి పుట్టిన వెలుగు. ఈ వెలుగే శ్రీమాత.
భాను అను పదమునకు మూలార్థము వెలుగుగ ప్రకటింప బడినది అని అర్థము. చీకటినుండి ప్రప్రథమముగ వెలువడిన వెలుగే శ్రీమాత. ఆ వెలుగు ఆధారముగనే భర్గోదేవ మండలము, సవితృ మండలము, సూర్యమండలము ఒక దాని నుండి ఒకటి ఏర్పడు చున్నవి. నాలుగు స్థితులలో వెలుగు అవతరించు చున్నది. ఈ వెలుగును దర్శించుటకే గాయత్రి ఉపాసనము. శ్రీదేవి సృష్టి కేంద్రము. ఆమె ఆధారముగనే భర్గోదేవుడు జన్మించును. ఆదిత్య మండల మేర్పడును.
ఆదిత్య మండలము నుండి సవితృ మండలము, సవితృ మండలము నుండి సూర్యమండలములు గుంపులు గుంపులుగ పుట్టుకొని వచ్చును. ఇట్లవరోహణ క్రమమున అంతయూ ఏర్పడుచుండగ అన్నిటియందు కేంద్రముగ శ్రీదేవి అవతరించు చుండును. ఇది ఆమె సదాశివ తత్త్వమని, వాసుదేవ తత్త్వమని తెలుపబడినది. అన్నిటియందు అంతర్యామిగ ఈ తత్త్వమే యుండును. అణువు నందు అణుకేంద్రముగను, బ్రహ్మాండము నందు బిందువుగను తానుండి సృష్టి స్థితి లయములను కలిగించుచుండును.
ఆదిత్య హృదయము అనగా కూడా నిదియే. అగస్త్య మహర్షి శ్రీరాముని కందించిన అంతర్యామి ఉపదేశమిది. నారదుడు ధృవునకు, వ్యాసునకు, ప్రహ్లాదునకు బోధించిన వాసుదేవ తత్వమిదియే. రాముని సర్వాంతర్యామిగ వాల్మీకి కూడా నిదియే బోధించినాడు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునునికి "వాసుదేవ మితి సర్వం” అని బోధించినాడు. ఇట్లు ప్రకాశించు ప్రతి అణువు మధ్యమున, బ్రహ్మాండ మధ్యమున స్థితిగొన్నది శ్రీమాత.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 275 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀
🌻 Bhānu-maṇḍala-madhyastā भानु-मण्डल-मध्यस्ता (275) 🌻
She is in the middle of solar orbit. Chāndogya Upaniṣad (I.vi.6) says, “There is deity within the orbit of the sun, who is seen by yogis. His whole body glitters like gold.” ‘Obeisance to that form in the sun’s orbit the one, who is the embodiment of all the Veda-s, who showers his brilliance all over the different worlds (These worlds are the seven vyāhṛti-s of pūrṇa Gāyatrī mantra. Worlds refer to seven worlds above and seven worlds beneath totalling to fourteen. These imaginary worlds are the modifications of one’s consciousness. The worlds could also refer to three types of mundane consciousness, awake, dream and deep sleep).
Anāhat cakra is also called bhānu-maṇḍala and kuṇḍalinī also glitters like gold. Possibly, this nāma could mean Her kuṇḍalinī form.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jun 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 29
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి సాక్షీభూతంగా మారకుంటే తను ఆత్మ నన్న సత్యాన్ని గుర్తించలేడు. 🍀
నువ్వు శరీరానివి కావు, మనసు కావు, నువ్వు అన్నిటికీ సాక్షవి. వ్యక్తి మరింత మరింతగా సాక్షీభూతంగా మారకుంటే తను ఆత్మ నన్న సత్యాన్ని గుర్తించలేడు. నువ్వు చూస్తున్నపుడు మాత్రమే నీ కళ్ళ పట్ల స్పృహతో వుంటావు. నువ్వు కళ్ళు మూసుకుంటే వాటి గురించి మరిచిపోతావు. పసివాణ్ణి కిందకు దించి నడవడానికి అవకాశం కలిగించకుంటే అతను కాళ్ళ గురించి మరచిపోతాడు. మనం స్పృహతో తెలుసుకోవాల్సిన యధార్థమిది.
మనం చూడడం ద్వారా మనకు కళ్లున్నాయని తెలుసుకుంటాం. వినడం ద్వారా చెవులున్నాయనని గ్రహిస్తాం. వాసన ద్వారా ముక్కుందని తెలుసుకుంటాం. అదే విధంగా మనం సాక్షీభూతంగా వుండడం ద్వారా మనకు ఆత్మస్పృహ కలుగుతుంది. మనలకు ఆత్మ వున్నట్లు తెలుస్తుంది. సాక్షిగా వుండటమన్న ఆత్మ చేసే పని. ప్రాచ్యంలోని పరిశోధన అది అన్నిటికీ సాక్షిగా ఎట్లా వుండాలి.
కేవలం పరిశీలకుడిగా, స్వచ్చమైన పరిశీలకుడిగా, ఎట్లాంటి గుర్తింపు లేకుండా పరిశీలకుడిగా ఎలా వుండాలి అన్నది ప్రాచ్యదేశాల అన్వేషణ. నువ్వు నీ శరీరం, మనసు అవి చేసే పనుల్ని, కార్యకలాపాల్ని, కదలికల్ని చూస్తున్నావు కానీ రోడ్డు పక్కన నిలబడిన అపరిచితుడిలాగా పరిశీలిస్తున్నావు - ట్రాఫిక్ సాగుతూనే వుంది. నువ్వు కదిలే కారు కావు, ట్రక్కు కావు, బస్సు కావు, జనం కావు, గేదె కావు, ఆవు కావు, ఎవరూ కావు, కేవలం రోడ్డు పక్కన నిల్చుని అన్నిట్నీ చూస్తున్న పరిశీలకుడివి. ధ్యానమంటే అదే.
వాటితో మమైకం కాకుండా మనసు, శరీరాల సంక్లిష్టతల్ని పరిశీలించడం. వాటి వల్ల ఒక సంపూర్ణ నవ్యమయిన సంగతి అనుభవానికి వస్తుంది. ఆత్మకు సంబంధించిన నవ్యమయిన సంగతి అనుభవానికి వస్తుంది. ఆత్మకు సంబంధించిన ఉనికి స్పృహకు వస్తుంది. నేనిక్కడ చేస్తున్న పని అదే. మిమ్మల్ని స్పృహలోకి తేవడం. మీరే దేవతలు, దేవుళ్ళు అన్న స్పృహలోకి తీసుకు రావడం, మీ శాశ్వతమయిన అస్తిత్వాన్ని గుర్తు చెయ్యడం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jun 2021
వివేక చూడామణి - 86 / Viveka Chudamani - 86
🌹. వివేక చూడామణి - 86 / Viveka Chudamani - 86 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 21. అహంభావము - 2 🍀
296. అందువలన నీ గుర్తింపు ఈ స్థూల శరీరముతో, రక్తమాంసములతో, అహంకారముతో కూడిన ఈ సూక్ష్మ శరీరముతో కాక, ఇవన్నీ బుద్ది యొక్క ఊహలు మాత్రమే అని గ్రహించి, నిజమైన నీ యొక్క ఆత్మను, భూత, భవిష్యత్తు, వర్తమానములో కూడా సత్యమైనది, ఎవరు కాదనలేని సత్యమైనదని గ్రహించి శాంతిని పొందుము.
297. నీ గుర్తింపు నీ కుటుంబముతో, వంశము, పేరు, ఆకాశము, జీవన విధానము, ఈ చెడిపోయే శరీరముతో కాదని గ్రహింపుము. అలానే ఈ భావనలన్నియూ ఈ సూక్ష్మ శరీరానికే అని తెలుసుకొని, నీ యొక్క అసలు స్థితి అయిన ఉన్నతమైన ఆనందకరమైన ఆత్మతోనని గుర్తించుము.
298. ఇతరములైన అడ్డంకులను గుర్తించి, వ్యక్తి ఆత్మవైపుకు మార్పు చెందవలెను. అడ్డంకులకు మూల కారణము నీ యొక్క అహంకారముతో కూడిన భౌతిక భావన మాత్రమే అని తెలుసుకొని దానిని మార్పు చేయాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 86 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 21. Ego Feeling - 2 🌻
296. Therefore give up the identification with this lump of flesh, the gross body, as well as with the ego or the subtle body, which are both imagined by the Buddhi. Realising thy own Self, which is Knowledge Absolute and not to be denied in the past, present or future, attain to Peace.
297. Cease to identify thyself with the family, lineage, name, form and the order of life, which pertain to the body that is like a rotten corpse (to a man of realisation). Similarly, giving up ideas of agency and so forth, which are attributes of the subtle body, be the Essence of Bliss Absolute.
298. Other obstacles are also observed to exist for men, which lead to transmigration. The root of them, for the above reasons, is the first modification of Nescience called egoism.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
11 Jun 2021
దేవాపి మహర్షి బోధనలు - 97
🌹. దేవాపి మహర్షి బోధనలు - 97 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 78. మధుర మార్గము -1 🌻
కన్నులకు కనపడనివి చూచుటకు, చెవులకు వినపడనివి వినుటకు ప్రయత్నము చేయుడు. దివ్యలోకమందలి మూర్తులను చూచుచున్నట్లు, వారి భాషణము వినుచున్నట్లు భావన చేయుడు. ఇది యొక ప్రయోగము. ఇట్లు చేసినచో పరిసరములందలి రూపములు, భాషణములు, మీకిక వినపడవు. చప్పుడులు మీకంతరాయమును కలిగించవు. క్రమముగ మీ యందు దూరదృష్టి, దూర శ్రవణము ఏర్పడును. మీ సద్గురువును కూడ మీరిట్లే నిజముగ దర్శించవచ్చు. ఇది నిజమైన “పరధ్యానము.”
ఇహమును మరచు స్థితి. కాల కృత్యములు, కర్తవ్యములు, నిత్య నైమిత్తిక కర్మలు యొనర్చిన పిమ్మట ఈ పరధ్యానమున నిమగ్నమగుడు. దీని వలన మీరు పొందు అనుభూతి కారణముగ మీ శరీర ధాతువులలో కోరదగిన మార్పు వచ్చును. ఇహలోక విషయము లంతగ బాధింపక పట్టు సడలును.
మీరాబాయి కృష్ణునిట్లే ఆరాధించినది. భక్తులందరు ఊహాజనిత మార్గముననే తీర్చిదిద్దబడినారు. ఇది యొక మధురమైన మార్గము. దీనిలో తన్మయత్వముండును. మధురాష్టకము దీనినే సూచించు చున్నది. గాయకులు, కవులు ఈ మార్గమున తరించినారు. అపురూప మగు దివ్య దర్శనములు అందిన ఫలముగ ఈ మార్గ మొసంగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jun 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 418, 419 / Vishnu Sahasranama Contemplation - 418, 419
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 418 / Vishnu Sahasranama Contemplation - 418🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 418. కాలః, कालः, Kālaḥ 🌻
ఓం కాలాయ నమః | ॐ कालाय नमः | OM Kālāya namaḥ
సర్వం కలయతీత్యేష కాలః కలయతామహమ్ ।
ఇతి స్మృతేన భగవాన్ కాల ఇత్యుచ్యతే బుధైః ॥
ప్రతియొకదానిని గణన చేయును. గణనకు పాత్రమగునట్లు చేయును.
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేన్ద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ॥ 30 ॥
నేను అసురులలో ప్రహ్లాదుడను. లెక్కపెట్టువారిలో కాలమును. మృగములలో మృగరాజగు సింహమును. పక్షులలో గరుత్మంతుడను అయియున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 418🌹
📚. Prasad Bharadwaj
🌻418. Kālaḥ🌻
OM Kālāya namaḥ
Sarvaṃ kalayatītyeṣa kālaḥ kalayatāmaham,
Iti smr̥tena bhagavān kāla ityucyate budhaiḥ.
सर्वं कलयतीत्येष कालः कलयतामहम् ।
इति स्मृतेन भगवान् काल इत्युच्यते बुधैः ॥
He counts everything (to determine their duration of life). Makes everything subject to counting.
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Prahlādaścāsmi daityānāṃ kālaḥ kalayatāmaham,
Mr̥gāṇāṃ ca mr̥gendro’haṃ vainateyaśca pakṣiṇām. 30.
:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥ ३० ॥
Among the demons, I am Prahlāda. I am Time among reckoners of time. Among animals I am the Lion and among birds I am Garuḍa.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 419 / Vishnu Sahasranama Contemplation - 419🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 419. పరమేష్ఠీ, परमेष्ठी, Parameṣṭhī 🌻
ఓం పరమేష్ఠినే నమః | ॐ परमेष्ठिने नमः | OM Parameṣṭhine namaḥ
పరమే స్వే మహిమ్నేవ ప్రకృష్టే హృదయాంబరే ।
స్థాతుం హి శీలమస్యేతి పరమేష్ఠ్యేష ఉచ్యతే ।
పరమేష్ఠీ విభ్రాజిత ఇతి వైదిక వాక్యతః ॥
ప్రకృష్టము అనగా పరమము లేదా చాలా గొప్పదియగు తన మహిమమునందు, మహాశక్తియందు హృదయాకాశమున నిలుచుట ఈతని శీలము. కావున 'పరమేష్ఠిన్' అనబడును. పరమేష్ఠీ విభ్రాజతే పరమేష్ఠిగా ఆ రూపమున శ్రేష్ఠముగా ప్రకాశించుచున్నాడు అను ఆపస్తంభ ధర్మ సూత్రము (1.23.2) ఇట ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 419🌹
📚. Prasad Bharadwaj
🌻419. Parameṣṭhī🌻
OM Parameṣṭhine namaḥ
Parame sve mahimneva prakr̥ṣṭe hr̥dayāṃbare,
Sthātuṃ hi śīlamasyeti parameṣṭhyeṣa ucyate,
Parameṣṭhī vibhrājita iti vaidika vākyataḥ.
परमे स्वे महिम्नेव प्रकृष्टे हृदयांबरे ।
स्थातुं हि शीलमस्येति परमेष्ठ्येष उच्यते ।
परमेष्ठी विभ्राजित इति वैदिक वाक्यतः ॥
He resides in His own eminence in the hr̥dayākāśa or the supreme ether (depths) of the heart; so Parameṣṭhī vide the mantra Parameṣṭhī vibhrājate / परमेष्ठी विभ्राजते from Āpastaṃbha dharma sūtra (1.23.2).
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
11 Jun 2021
11-JUNE-2021 MESSAGES
1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-48 / Bhagavad-Gita - 1-48 - 2 - 1 🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 616 / Bhagavad-Gita - 616 - 18-27🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 418 419 / Vishnu Sahasranama Contemplation - 418, 419🌹
4) 🌹 Daily Wisdom - 123🌹
5) 🌹. వివేక చూడామణి - 86🌹
6) 🌹Viveka Chudamani - 86🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 86🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 29🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 275 / Sri Lalita Chaitanya Vijnanam - 275 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 48 / Bhagavad-Gita - 48 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 01 🌴*
1. సంజయ ఉవాచ
తం తతా కృపయా విష్ణు
మశ్రుపూర్ణా కులేక్షణమ్ |
విషీదన్తమిదం వాక్య
మువాచ మధుసూదన: ||
🌷. తాత్పర్యం :
సంజయుడు పలికెను. చింతాక్రాంతుడై కనుల యందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జునిని గాంచిన మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) ఈ క్రింది వాక్యములను పలికెను.
🌷. భాష్యము :
విషయపూర్ణమైన జాలి, చింత, కన్నీరు అనునవి ఆత్మజ్ఞానరాహిత్యమునకు చిహ్నములై యున్నవి. నిత్యమైన ఆత్మ కొరకు చూపెడి జాలియే వాస్తవమునకు అత్మానుభవము. ఈ శ్లోకము “మధుసూదన” అను పదమునకు విశేష ప్రాధాన్యము కలదు.
మధువను దానవుని సంహరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో అవరోధము కలిగించిన తన అపార్థమును దానవుని సంహరించవలెనని అర్జునుడు కోరెను. జాలి నెచ్చెట చూపవలెనో ఎవ్వరును ఎరుగరు. నీటిలో మునుగువాని దుస్తులపై జాలిచూపుట మూర్ఖత్వమే కాగలదు.
బాహ్యవస్త్రమును వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు(అతడు నిష్కారణముగా చింతించువాడు) అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున అట్టి నైజము అతనికి తగియుండలేదు. అయినను అజ్ఞానియైనవాని దు:ఖమును శ్రీకృష్ణభగవానుడు శమింపజేయగలడు. ఆ ప్రయోజనార్థమే గీత అతనిచే గానము చేయబడినది.
భౌతికదేహము మరియు ఆత్మల విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మానుభవమును ఈ అధ్యాయము మనకు ఉపదేశించుచున్నది. పరమప్రామాణికుడైన శ్రీకృష్ణుడే దీనిని వివరించెను. ఫలితముల యెడ సంగత్వము లేకుండా కర్మనొనరించు ఆత్మతత్త్వమునందు స్థిరముగా నిలిచియున్నవానికే ఈ అనుభవము సాధ్యము కాగలదు.
*🌹 Bhagavad-Gita as It is - 48 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
*🌴 Chapter 2 - Sankhya Yoga - 01 🌴*
1. sañjaya uvāca
taṁ tathā kṛpayāviṣṭam aśru-pūrṇākulekṣaṇam
viṣīdantam idaṁ vākyam uvāca madhusūdanaḥ
🌷 Translation :
Sañjaya said: Seeing Arjuna full of compassion, his mind depressed, his eyes full of tears, Madhusūdana, Kṛṣṇa, spoke the following words.
🌷 Purport :
Material compassion, lamentation and tears are all signs of ignorance of the real self. Compassion for the eternal soul is self-realization. The word “Madhusūdana” is significant in this verse. Lord Kṛṣṇa killed the demon Madhu, and now Arjuna wanted Kṛṣṇa to kill the demon of misunderstanding that had overtaken him in the discharge of his duty. No one knows where compassion should be applied. Compassion for the dress of a drowning man is senseless.
A man fallen in the ocean of nescience cannot be saved simply by rescuing his outward dress – the gross material body. One who does not know this and laments for the outward dress is called a śūdra, or one who laments unnecessarily.
Arjuna was a kṣatriya, and this conduct was not expected from him. Lord Kṛṣṇa, however, can dissipate the lamentation of the ignorant man, and for this purpose the Bhagavad-gītā was sung by Him. This chapter instructs us in self-realization by an analytical study of the material body and the spirit soul, as explained by the supreme authority, Lord Śrī Kṛṣṇa.
This realization is possible when one works without attachment to fruitive results and is situated in the fixed conception of the real self.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 616 / Bhagavad-Gita - 616 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 27 🌴*
27. రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోశుచి: |
హర్షశోకాన్విత: కర్తా రాజస: పరికీర్తిత: ||
🌷. తాత్పర్యం :
కర్మఫలములను అనుభవింపగోరుచు కర్మ మరియు కర్మఫలముల యెడ ఆసక్తుడై యుండువాడును, లోభియును, అసూయపరుడును, శుచిరహితుడును, సుఖదుఃఖములచే చలించువాడును అగు కర్త రజోగుణకర్త యనబడును.
🌷. భాష్యము :
భౌతికత్వము లేదా గృహపుత్రకళత్రాదుల యందు గల విపరీత ఆసక్తికారణముగా మనుజుద్ ఏదేని ఒక కర్మ లేదా కర్మఫలముల యెడ మిక్కిలి ఆసక్తుడగును. అట్టివాడు జీవితోద్దారమునకు సంబంధించిన కోరికను ఏ మాత్రము కలిగియుండడు. ఈ జగమున వీలయినంత సంబంధించిన కోరికను ఏ మాత్రము కలిగియుండడు.
ఈ జగమును వీలయినంత భౌతికముగా సుఖవంత మొనర్చుకొనుటయే అతని లక్ష్యము. సాధారణముగా లోభియై యుండు అతడు తనకు లభించినది శాశ్వతమనియు, ఎన్నడును నశింపదనియు భావించును. ఇతరుల యెడ అసూయను కలిగియుండు అట్టివాడు తన ప్రీత్యర్థమై ఎట్టి తప్పుకార్యము చేయుటకైనను సిద్ధపడియుండును.
తత్కారణముగా అతడు అశుచియై, తాను సంపాదించునది పవిత్రమా లేక అపవిత్రమా అనెడి విషయమును సైతము లెక్కచేయకుండును. తన పని విజయవంతమైనచో అత్యంత ఆనందమును పొందు నాతడు కర్మ విఫలమైనపుడు మిగుల చింతాక్రాంతుడగును. రజోగుణకర్త ఆ రీతిగనే ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 616 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 27 🌴*
27. rāgī karma-phala-prepsur lubdho hiṁsātmako ’śuciḥ
harṣa-śokānvitaḥ kartā rājasaḥ parikīrtitaḥ
🌷 Translation :
The worker who is attached to work and the fruits of work, desiring to enjoy those fruits, and who is greedy, always envious, impure, and moved by joy and sorrow, is said to be in the mode of passion.
🌹 Purport :
A person is too much attached to a certain kind of work or to the result because he has too much attachment for materialism or hearth and home, wife and children. Such a person has no desire for higher elevation in life.
He is simply concerned with making this world as materially comfortable as possible. He is generally very greedy, and he thinks that anything attained by him is permanent and never to be lost.
Such a person is envious of others and prepared to do anything wrong for sense gratification. Therefore such a person is unclean, and he does not care whether his earning is pure or impure. He is very happy if his work is successful and very much distressed when his work is not successful. Such is the worker in the mode of passion.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 418, 419 / Vishnu Sahasranama Contemplation - 418, 419 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 418. కాలః, कालः, Kālaḥ 🌻*
*ఓం కాలాయ నమః | ॐ कालाय नमः | OM Kālāya namaḥ*
సర్వం కలయతీత్యేష కాలః కలయతామహమ్ ।
ఇతి స్మృతేన భగవాన్ కాల ఇత్యుచ్యతే బుధైః ॥
ప్రతియొకదానిని గణన చేయును. గణనకు పాత్రమగునట్లు చేయును.
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేన్ద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ॥ 30 ॥
నేను అసురులలో ప్రహ్లాదుడను. లెక్కపెట్టువారిలో కాలమును. మృగములలో మృగరాజగు సింహమును. పక్షులలో గరుత్మంతుడను అయియున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 418🌹*
📚. Prasad Bharadwaj
*🌻418. Kālaḥ🌻*
*OM Kālāya namaḥ*
Sarvaṃ kalayatītyeṣa kālaḥ kalayatāmaham,
Iti smr̥tena bhagavān kāla ityucyate budhaiḥ.
सर्वं कलयतीत्येष कालः कलयतामहम् ।
इति स्मृतेन भगवान् काल इत्युच्यते बुधैः ॥
He counts everything (to determine their duration of life). Makes everything subject to counting.
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Prahlādaścāsmi daityānāṃ kālaḥ kalayatāmaham,
Mr̥gāṇāṃ ca mr̥gendro’haṃ vainateyaśca pakṣiṇām. 30.
:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥ ३० ॥
Among the demons, I am Prahlāda. I am Time among reckoners of time. Among animals I am the Lion and among birds I am Garuḍa.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 419 / Vishnu Sahasranama Contemplation - 419🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 419. పరమేష్ఠీ, परमेष्ठी, Parameṣṭhī 🌻*
*ఓం పరమేష్ఠినే నమః | ॐ परमेष्ठिने नमः | OM Parameṣṭhine namaḥ*
పరమే స్వే మహిమ్నేవ ప్రకృష్టే హృదయాంబరే ।
స్థాతుం హి శీలమస్యేతి పరమేష్ఠ్యేష ఉచ్యతే ।
పరమేష్ఠీ విభ్రాజిత ఇతి వైదిక వాక్యతః ॥
ప్రకృష్టము అనగా పరమము లేదా చాలా గొప్పదియగు తన మహిమమునందు, మహాశక్తియందు హృదయాకాశమున నిలుచుట ఈతని శీలము. కావున 'పరమేష్ఠిన్' అనబడును. పరమేష్ఠీ విభ్రాజతే పరమేష్ఠిగా ఆ రూపమున శ్రేష్ఠముగా ప్రకాశించుచున్నాడు అను ఆపస్తంభ ధర్మ సూత్రము (1.23.2) ఇట ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 419🌹*
📚. Prasad Bharadwaj
*🌻419. Parameṣṭhī🌻*
*OM Parameṣṭhine namaḥ*
Parame sve mahimneva prakr̥ṣṭe hr̥dayāṃbare,
Sthātuṃ hi śīlamasyeti parameṣṭhyeṣa ucyate,
Parameṣṭhī vibhrājita iti vaidika vākyataḥ.
परमे स्वे महिम्नेव प्रकृष्टे हृदयांबरे ।
स्थातुं हि शीलमस्येति परमेष्ठ्येष उच्यते ।
परमेष्ठी विभ्राजित इति वैदिक वाक्यतः ॥
He resides in His own eminence in the hr̥dayākāśa or the supreme ether (depths) of the heart; so Parameṣṭhī vide the mantra Parameṣṭhī vibhrājate / परमेष्ठी विभ्राजते from Āpastaṃbha dharma sūtra (1.23.2).
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 123 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 2. Universality of Vision 🌻*
A philosophy of life has naturally to be inseparable from universality of vision. It has therefore to start from a study of the most basic fact of human perception, viz. nature in all its externality. The astronomical universe, with its mathematical laws, may be regarded as the extreme content of the extroverted consciousness.
Things hang loosely in this scheme with apparently no connection with one another, except perhaps the pull of gravitation and a distant influence characteristic of physical bodies. It is physics which goes deeper into the structure and content of this diversified universe and discovers electromagnetic fields determining the nature and function of bodies and a closer relation among them than crass perception would permit.
The physical laws working behind the universe seem to be uniform and the substance of things is seen ultimately to consist not of scattered particulars but a single force or energy permeating and constituting everything. The ‘locality’ of bodies fades and they coalesce and fuse into one another in an underlying universal continuum.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 86 / Viveka Chudamani - 86🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 21. అహంభావము - 2 🍀*
296. అందువలన నీ గుర్తింపు ఈ స్థూల శరీరముతో, రక్తమాంసములతో, అహంకారముతో కూడిన ఈ సూక్ష్మ శరీరముతో కాక, ఇవన్నీ బుద్ది యొక్క ఊహలు మాత్రమే అని గ్రహించి, నిజమైన నీ యొక్క ఆత్మను, భూత, భవిష్యత్తు, వర్తమానములో కూడా సత్యమైనది, ఎవరు కాదనలేని సత్యమైనదని గ్రహించి శాంతిని పొందుము.
297. నీ గుర్తింపు నీ కుటుంబముతో, వంశము, పేరు, ఆకాశము, జీవన విధానము, ఈ చెడిపోయే శరీరముతో కాదని గ్రహింపుము. అలానే ఈ భావనలన్నియూ ఈ సూక్ష్మ శరీరానికే అని తెలుసుకొని, నీ యొక్క అసలు స్థితి అయిన ఉన్నతమైన ఆనందకరమైన ఆత్మతోనని గుర్తించుము.
298. ఇతరములైన అడ్డంకులను గుర్తించి, వ్యక్తి ఆత్మవైపుకు మార్పు చెందవలెను. అడ్డంకులకు మూల కారణము నీ యొక్క అహంకారముతో కూడిన భౌతిక భావన మాత్రమే అని తెలుసుకొని దానిని మార్పు చేయాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 86 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 21. Ego Feeling - 2 🌻*
296. Therefore give up the identification with this lump of flesh, the gross body, as well as with the ego or the subtle body, which are both imagined by the Buddhi. Realising thy own Self, which is Knowledge Absolute and not to be denied in the past, present or future, attain to Peace.
297. Cease to identify thyself with the family, lineage, name, form and the order of life, which pertain to the body that is like a rotten corpse (to a man of realisation). Similarly, giving up ideas of agency and so forth, which are attributes of the subtle body, be the Essence of Bliss Absolute.
298. Other obstacles are also observed to exist for men, which lead to transmigration. The root of them, for the above reasons, is the first modification of Nescience called
egoism.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 97 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 78. మధుర మార్గము -1 🌻*
కన్నులకు కనపడనివి చూచుటకు, చెవులకు వినపడనివి వినుటకు ప్రయత్నము చేయుడు. దివ్యలోకమందలి మూర్తులను చూచుచున్నట్లు, వారి భాషణము వినుచున్నట్లు భావన చేయుడు. ఇది యొక ప్రయోగము. ఇట్లు చేసినచో పరిసరములందలి రూపములు, భాషణములు, మీకిక వినపడవు. చప్పుడులు మీకంతరాయమును కలిగించవు. క్రమముగ మీ యందు దూరదృష్టి, దూర శ్రవణము ఏర్పడును. మీ సద్గురువును కూడ మీరిట్లే నిజముగ దర్శించవచ్చు. ఇది నిజమైన “పరధ్యానము.”
ఇహమును మరచు స్థితి. కాల కృత్యములు, కర్తవ్యములు, నిత్య నైమిత్తిక కర్మలు యొనర్చిన పిమ్మట ఈ పరధ్యానమున నిమగ్నమగుడు. దీని వలన మీరు పొందు అనుభూతి కారణముగ మీ శరీర ధాతువులలో కోరదగిన మార్పు వచ్చును. ఇహలోక విషయము లంతగ బాధింపక పట్టు సడలును.
మీరాబాయి కృష్ణునిట్లే ఆరాధించినది. భక్తులందరు ఊహాజనిత మార్గముననే తీర్చిదిద్దబడినారు. ఇది యొక మధురమైన మార్గము. దీనిలో తన్మయత్వముండును. మధురాష్టకము దీనినే సూచించు చున్నది. గాయకులు, కవులు ఈ మార్గమున తరించినారు. అపురూప మగు దివ్య దర్శనములు అందిన ఫలముగ ఈ మార్గ మొసంగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 29 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. వ్యక్తి సాక్షీభూతంగా మారకుంటే తను ఆత్మ నన్న సత్యాన్ని గుర్తించలేడు. 🍀*
నువ్వు శరీరానివి కావు, మనసు కావు, నువ్వు అన్నిటికీ సాక్షవి. వ్యక్తి మరింత మరింతగా సాక్షీభూతంగా మారకుంటే తను ఆత్మ నన్న సత్యాన్ని గుర్తించలేడు. నువ్వు చూస్తున్నపుడు మాత్రమే నీ కళ్ళ పట్ల స్పృహతో వుంటావు. నువ్వు కళ్ళు మూసుకుంటే వాటి గురించి మరిచిపోతావు. పసివాణ్ణి కిందకు దించి నడవడానికి అవకాశం కలిగించకుంటే అతను కాళ్ళ గురించి మరచిపోతాడు. మనం స్పృహతో తెలుసుకోవాల్సిన యధార్థమిది.
మనం చూడడం ద్వారా మనకు కళ్లున్నాయని తెలుసుకుంటాం. వినడం ద్వారా చెవులున్నాయనని గ్రహిస్తాం. వాసన ద్వారా ముక్కుందని తెలుసుకుంటాం. అదే విధంగా మనం సాక్షీభూతంగా వుండడం ద్వారా మనకు ఆత్మస్పృహ కలుగుతుంది. మనలకు ఆత్మ వున్నట్లు తెలుస్తుంది. సాక్షిగా వుండటమన్న ఆత్మ చేసే పని. ప్రాచ్యంలోని పరిశోధన అది అన్నిటికీ సాక్షిగా ఎట్లా వుండాలి.
కేవలం పరిశీలకుడిగా, స్వచ్చమైన పరిశీలకుడిగా, ఎట్లాంటి గుర్తింపు లేకుండా పరిశీలకుడిగా ఎలా వుండాలి అన్నది ప్రాచ్యదేశాల అన్వేషణ. నువ్వు నీ శరీరం, మనసు అవి చేసే పనుల్ని, కార్యకలాపాల్ని, కదలికల్ని చూస్తున్నావు కానీ రోడ్డు పక్కన నిలబడిన అపరిచితుడిలాగా పరిశీలిస్తున్నావు - ట్రాఫిక్ సాగుతూనే వుంది. నువ్వు కదిలే కారు కావు, ట్రక్కు కావు, బస్సు కావు, జనం కావు, గేదె కావు, ఆవు కావు, ఎవరూ కావు, కేవలం రోడ్డు పక్కన నిల్చుని అన్నిట్నీ చూస్తున్న పరిశీలకుడివి. ధ్యానమంటే అదే.
వాటితో మమైకం కాకుండా మనసు, శరీరాల సంక్లిష్టతల్ని పరిశీలించడం. వాటి వల్ల ఒక సంపూర్ణ నవ్యమయిన సంగతి అనుభవానికి వస్తుంది. ఆత్మకు సంబంధించిన నవ్యమయిన సంగతి అనుభవానికి వస్తుంది. ఆత్మకు సంబంధించిన ఉనికి స్పృహకు వస్తుంది. నేనిక్కడ చేస్తున్న పని అదే. మిమ్మల్ని స్పృహలోకి తేవడం. మీరే దేవతలు, దేవుళ్ళు అన్న స్పృహలోకి తీసుకు రావడం, మీ శాశ్వతమయిన అస్తిత్వాన్ని గుర్తు చెయ్యడం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 275 / Sri Lalitha Chaitanya Vijnanam - 275 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।*
*పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀*
*🌻 275. 'భానుమండల మధ్యస్థా' 🌻*
సవితృ మండల మధ్యమున స్థిరముగొన్నది శ్రీమాత అని అర్థము.
సూర్యున కాధారము సవిత. పండ్రెండు సూర్యమండలములకిది. కేంద్రము. సూర్యుడు ఒక సౌర మండలమునకు కేంద్రము కాగా, అట్టి సూర్యులు పండ్రెండు మందికి కేంద్రముగ సవిత అను దేవత యున్నది. అట్టి సవితృ మండలమునకు కేంద్రముగ భర్గోదేవుడున్నాడు. భర్గోదేవు డనగా ప్రచండమై, సృష్టి కాధారమై, పరము నుండి పుట్టిన వెలుగు. ఈ వెలుగే శ్రీమాత.
భాను అను పదమునకు మూలార్థము వెలుగుగ ప్రకటింప బడినది అని అర్థము. చీకటినుండి ప్రప్రథమముగ వెలువడిన వెలుగే శ్రీమాత. ఆ వెలుగు ఆధారముగనే భర్గోదేవ మండలము, సవితృ మండలము, సూర్యమండలము ఒక దాని నుండి ఒకటి ఏర్పడు చున్నవి. నాలుగు స్థితులలో వెలుగు అవతరించు చున్నది. ఈ వెలుగును దర్శించుటకే గాయత్రి ఉపాసనము. శ్రీదేవి సృష్టి కేంద్రము. ఆమె ఆధారముగనే భర్గోదేవుడు జన్మించును. ఆదిత్య మండల మేర్పడును.
ఆదిత్య మండలము నుండి సవితృ మండలము, సవితృ మండలము నుండి సూర్యమండలములు గుంపులు గుంపులుగ పుట్టుకొని వచ్చును. ఇట్లవరోహణ క్రమమున అంతయూ ఏర్పడుచుండగ అన్నిటియందు కేంద్రముగ శ్రీదేవి అవతరించు చుండును. ఇది ఆమె సదాశివ తత్త్వమని, వాసుదేవ తత్త్వమని తెలుపబడినది. అన్నిటియందు అంతర్యామిగ ఈ తత్త్వమే యుండును. అణువు నందు అణుకేంద్రముగను, బ్రహ్మాండము నందు బిందువుగను తానుండి సృష్టి స్థితి లయములను కలిగించుచుండును.
ఆదిత్య హృదయము అనగా కూడా నిదియే. అగస్త్య మహర్షి శ్రీరాముని కందించిన అంతర్యామి ఉపదేశమిది. నారదుడు ధృవునకు, వ్యాసునకు, ప్రహ్లాదునకు బోధించిన వాసుదేవ తత్వమిదియే. రాముని సర్వాంతర్యామిగ వాల్మీకి కూడా నిదియే బోధించినాడు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునునికి "వాసుదేవ మితి సర్వం” అని బోధించినాడు. ఇట్లు ప్రకాశించు ప్రతి అణువు మధ్యమున, బ్రహ్మాండ మధ్యమున స్థితిగొన్నది శ్రీమాత.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 275 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀*
*🌻 Bhānu-maṇḍala-madhyastā भानु-मण्डल-मध्यस्ता (275) 🌻*
She is in the middle of solar orbit. Chāndogya Upaniṣad (I.vi.6) says, “There is deity within the orbit of the sun, who is seen by yogis. His whole body glitters like gold.” ‘Obeisance to that form in the sun’s orbit the one, who is the embodiment of all the Veda-s, who showers his brilliance all over the different worlds (These worlds are the seven vyāhṛti-s of pūrṇa Gāyatrī mantra. Worlds refer to seven worlds above and seven worlds beneath totalling to fourteen. These imaginary worlds are the modifications of one’s consciousness. The worlds could also refer to three types of mundane consciousness, awake, dream and deep sleep).
Anāhat cakra is also called bhānu-maṇḍala and kuṇḍalinī also glitters like gold. Possibly, this nāma could mean Her kuṇḍalinī form.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)