వివేక చూడామణి - 86 / Viveka Chudamani - 86


🌹. వివేక చూడామణి - 86 / Viveka Chudamani - 86 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 21. అహంభావము - 2 🍀


296. అందువలన నీ గుర్తింపు ఈ స్థూల శరీరముతో, రక్తమాంసములతో, అహంకారముతో కూడిన ఈ సూక్ష్మ శరీరముతో కాక, ఇవన్నీ బుద్ది యొక్క ఊహలు మాత్రమే అని గ్రహించి, నిజమైన నీ యొక్క ఆత్మను, భూత, భవిష్యత్తు, వర్తమానములో కూడా సత్యమైనది, ఎవరు కాదనలేని సత్యమైనదని గ్రహించి శాంతిని పొందుము.

297. నీ గుర్తింపు నీ కుటుంబముతో, వంశము, పేరు, ఆకాశము, జీవన విధానము, ఈ చెడిపోయే శరీరముతో కాదని గ్రహింపుము. అలానే ఈ భావనలన్నియూ ఈ సూక్ష్మ శరీరానికే అని తెలుసుకొని, నీ యొక్క అసలు స్థితి అయిన ఉన్నతమైన ఆనందకరమైన ఆత్మతోనని గుర్తించుము.

298. ఇతరములైన అడ్డంకులను గుర్తించి, వ్యక్తి ఆత్మవైపుకు మార్పు చెందవలెను. అడ్డంకులకు మూల కారణము నీ యొక్క అహంకారముతో కూడిన భౌతిక భావన మాత్రమే అని తెలుసుకొని దానిని మార్పు చేయాలి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 86 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 21. Ego Feeling - 2 🌻



296. Therefore give up the identification with this lump of flesh, the gross body, as well as with the ego or the subtle body, which are both imagined by the Buddhi. Realising thy own Self, which is Knowledge Absolute and not to be denied in the past, present or future, attain to Peace.

297. Cease to identify thyself with the family, lineage, name, form and the order of life, which pertain to the body that is like a rotten corpse (to a man of realisation). Similarly, giving up ideas of agency and so forth, which are attributes of the subtle body, be the Essence of Bliss Absolute.

298. Other obstacles are also observed to exist for men, which lead to transmigration. The root of them, for the above reasons, is the first modification of Nescience called egoism.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



11 Jun 2021

No comments:

Post a Comment