✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి సాక్షీభూతంగా మారకుంటే తను ఆత్మ నన్న సత్యాన్ని గుర్తించలేడు. 🍀
నువ్వు శరీరానివి కావు, మనసు కావు, నువ్వు అన్నిటికీ సాక్షవి. వ్యక్తి మరింత మరింతగా సాక్షీభూతంగా మారకుంటే తను ఆత్మ నన్న సత్యాన్ని గుర్తించలేడు. నువ్వు చూస్తున్నపుడు మాత్రమే నీ కళ్ళ పట్ల స్పృహతో వుంటావు. నువ్వు కళ్ళు మూసుకుంటే వాటి గురించి మరిచిపోతావు. పసివాణ్ణి కిందకు దించి నడవడానికి అవకాశం కలిగించకుంటే అతను కాళ్ళ గురించి మరచిపోతాడు. మనం స్పృహతో తెలుసుకోవాల్సిన యధార్థమిది.
మనం చూడడం ద్వారా మనకు కళ్లున్నాయని తెలుసుకుంటాం. వినడం ద్వారా చెవులున్నాయనని గ్రహిస్తాం. వాసన ద్వారా ముక్కుందని తెలుసుకుంటాం. అదే విధంగా మనం సాక్షీభూతంగా వుండడం ద్వారా మనకు ఆత్మస్పృహ కలుగుతుంది. మనలకు ఆత్మ వున్నట్లు తెలుస్తుంది. సాక్షిగా వుండటమన్న ఆత్మ చేసే పని. ప్రాచ్యంలోని పరిశోధన అది అన్నిటికీ సాక్షిగా ఎట్లా వుండాలి.
కేవలం పరిశీలకుడిగా, స్వచ్చమైన పరిశీలకుడిగా, ఎట్లాంటి గుర్తింపు లేకుండా పరిశీలకుడిగా ఎలా వుండాలి అన్నది ప్రాచ్యదేశాల అన్వేషణ. నువ్వు నీ శరీరం, మనసు అవి చేసే పనుల్ని, కార్యకలాపాల్ని, కదలికల్ని చూస్తున్నావు కానీ రోడ్డు పక్కన నిలబడిన అపరిచితుడిలాగా పరిశీలిస్తున్నావు - ట్రాఫిక్ సాగుతూనే వుంది. నువ్వు కదిలే కారు కావు, ట్రక్కు కావు, బస్సు కావు, జనం కావు, గేదె కావు, ఆవు కావు, ఎవరూ కావు, కేవలం రోడ్డు పక్కన నిల్చుని అన్నిట్నీ చూస్తున్న పరిశీలకుడివి. ధ్యానమంటే అదే.
వాటితో మమైకం కాకుండా మనసు, శరీరాల సంక్లిష్టతల్ని పరిశీలించడం. వాటి వల్ల ఒక సంపూర్ణ నవ్యమయిన సంగతి అనుభవానికి వస్తుంది. ఆత్మకు సంబంధించిన నవ్యమయిన సంగతి అనుభవానికి వస్తుంది. ఆత్మకు సంబంధించిన ఉనికి స్పృహకు వస్తుంది. నేనిక్కడ చేస్తున్న పని అదే. మిమ్మల్ని స్పృహలోకి తేవడం. మీరే దేవతలు, దేవుళ్ళు అన్న స్పృహలోకి తీసుకు రావడం, మీ శాశ్వతమయిన అస్తిత్వాన్ని గుర్తు చెయ్యడం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jun 2021
No comments:
Post a Comment