విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 5 (Sloka 4 to 12)

 🌹. విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 5 🌹

🎤. స్వామి చిన్మయానంద మిషన్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకములు 4 నుండి 12 - సామూహిక సాధన 🌻
🌹 🌹 🌹 🌹 🌹

Audio file: Download / Listen (VS-Lesson-05 Sloka 4 to 12.mpeg)

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ‖ 4 ‖

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ‖ 5 ‖

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ‖ 6 ‖

అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ‖ 7 ‖

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ‖ 8 ‖

ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్‖ 9 ‖

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ‖ 10 ‖

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ‖ 11 ‖

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః |
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ‖ 12 ‖ 

Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam

21 Sep 2020

34. గీతోపనిషత్తు - చిత్త శుద్ధి - కామ ప్రేరితుడు గాక కర్తవ్య ప్రేరితుడై జీవించుట ఉపాయము

🌹 34. గీతోపనిషత్తు - చిత్త శుద్ధి - కామ ప్రేరితుడు గాక కర్తవ్య ప్రేరితుడై జీవించుట ఉపాయము. అట్లు జీవించు వానిని ద్వందములంటవు. మనస్సు నిర్మలమగును. అట్టి మనస్సు బుద్ధి యందు స్థిరపడు అర్హతను పొందును. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 66  📚

ప్రజ్ఞ బుద్ధియందు స్థిరపడుటయే బుద్ధియోగము. అట్లు బుద్ధియందు నిలబడవలెనన్నచో మనస్సు నిర్మలము కావలయును. మనస్సు నిర్మలము కావలెనన్నచో ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు తగులుకొని యుండరాదు.

నాస్తి బుద్ధి రయుక్తస్య న చాయుక్తస్య భావనా |

న చాభావయతః శాంతి రశాంతస్య కుతః సుఖమ్ || 66

తగులు కొనక యుండుటకు సాధకుడు ద్వంద్వ భావముల నుండి బయల్పడు వలెను. సృష్టి యందలి ద్వంద్వములు జీవుని బంధించునని తెలుసుకొని ద్వంద్వముల యందు ఉదాసీనుడుగా నుండుట, కర్తవ్యము నందు ఉన్ముఖుడై యుండుట నిరంతరము సాధన సాగవలెను. ఇది యొక్కటియే ఇంద్రియముల యందు చిత్తము తగులు కొనక శుద్ధిగ ఉండుటకు ఉపాయము. మరియొక మార్గము లేదు.

ద్వంద్వములు మనసున ఉన్నంతకాలము అవి రాగద్వేషములుగ పని చేయుచునే యుండును. అది కారణముగ మనస్సు నందలి ప్రజ్ఞ బుద్ధి లోనికి ఊర్థ్వగతి చెందకపోగా జీవించు వానిని ద్వంద్వము ఇంద్రియములలోనికి అధోగతి చెందగలదు. కావుననే కర్మకు కర్తవ్యమే ప్రధానముగాని కామము కాదు.

కామ ప్రేరితుడుగాక కర్తవ్య ప్రేరితుడై జీవించుట భగవంతుడందించు చున్న ఉపాయము. అట్లు జీవించు వానిని ద్వందములంటవు. మనస్సు నిర్మలమగును. అట్టి మనస్సు బుద్ధి యందు స్థిరపడు అర్హతను పొందును.

ఇట్లు రాగద్వేష విముక్తుడు కాని వానికి సుఖశాంతులు ఉండజాలవు. కామము ప్రధానము కాగా ఇంద్రియ ద్వారమున మనస్సు పరిపరి విధముల పరిగెత్తుచు అలసిపోవుటయే గాని సుఖశాంతులెట్లు దొరుక గలవు?

నిజమునకు సుఖశాంతులను కోరుట కూడ కామమే. కోరినంత మాత్రమున సుఖశాంతులు జీవునకు కలుగవు. వాటికై యత్నించుట కూడ నిష్ప్రయోజనము. వానిని పొందుటకు కోరికను తీవ్రము, తీవ్రతరము చేయుట ఉపాయము కాదు.

వానిని పొందవలెనన్నచో జీవుడు నిరంతరము తనను కర్తన్య నిర్వహణ నుందు నియమించుకొను చుండవలెను. కర్తవ్య నిర్వహణము చేయువానికి పుట్టలు పుట్టలుగ భావములు జనింపవు. కామ ప్రవృత్తి కర్తవ్య ప్రవృత్తిగ మారును.

అట్టి కర్తవ్యోన్మోఖునకు కామము లేకుండుట వలన కర్మఫలములపై కూడ ఆసక్తి యుండదు. దీర్ఘ కాలము కర్తవ్యమునే ఆచరించు చుండుటవలన చిత్తశుద్ధి ఏర్పడి సుఖశాంతులు ఆవరించగలవు. మరియొక మార్గము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

21 Sep 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 58

🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 58  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 22 🌻

ఈ మనుష్యులు ఆత్మతత్వమును, ఆచార్యుని ఉపదేశమును శ్రద్ధగా విని, శ్రవణ, మనన, నిధి, ధ్యాసల ద్వారా ఈ ఆత్మతత్వమును, ఆత్మనిష్ఠగా ఆత్మవిచారణను ఆత్మనిష్ఠగా, ఆత్మానుభూతిగా మరల్చుకోవాలి అంటే, ఒక ఉపాయమున్నది.

ఏమిటంటే, సదా ఆచార్యుడు చెప్పినటువంటి ఉపదేశమును శ్రవణ, మనన, నిధి, ధ్యాసలు అనేటటువంటి నాలుగు సాధనలని ఆశ్రయించి, నిరంతరాయముగా, అవస్థాత్రయములో నేను ఆత్మస్వరూపుడను, అనే నిశ్చయమును, నిర్ణయమును కలిగివుండి, నీ శరీరయానమును పూర్తిచేయాలి. శరీరయానము ఇది ఒక ప్రయాణం లాంటిది.

మనం ఒక వాహనంలో ఎక్కామే అనుకోండి? ఆ వాహనాన్ని మనం నడుపుతున్నాం అనుకోండి, ఒక చోటునుంచీ మరొక చోటుకి ప్రయాణం చేస్తున్నామనుకోండి, అయినంత మాత్రమున... ఆ వాహనము నీవు కాదు కదా! రధము నీవు కాదు. రధికుడవు.

కాబట్టి అట్లా ఆత్మతత్వమును అతిసూక్ష్మముగా వున్నటువంటి దానిని, ఈ శరీరాదికము నుంచీ వేరు పరిచి, నేను రధమును కాదు, నేను రధికుడను, నేను దేహమును కాదు, నేను దేహిని. నేను శరీరమును కాదు, నేను శరీరిని. నేను క్షేత్రమును కాదు, నేను క్షేత్రజ్ఞుడను.

నేను క్షర పురుషుడను కాదు, అక్షరపురుషుడను. అనేటటువంటి పద్ధతిగా... వేరుపరుచుకోగలగడం రావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అలా వేరుపరుచుకోగలిగే సమర్థతను సంపాదించడమే ‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ అంటే!

‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ అంటే ఆకాశం నుంచీ ఏమీ మెరుపులు, పిడుగులు పడవు. నీ నెత్తి మీద అంతకంటే అమృతవృష్ఠి ఏమీ కురవదు. నీవేమీ పైనుంచీ కిందకేమీ పడిపోవు. లేదు కిందనుంచీ పైకి ఉత్థాన పతనాన్ని చెందవు. భౌతికమైన మార్పులేమీ రావు. నీలో ఒక విజ్ఞానపరమైనటువంటి పరిణామం చేత లభిస్తుంది. అదేమిటంటే ‘సర్వసాక్షిత్వము’.

అటువంటి సర్వ సాక్షిత్వ స్థితికి నువ్వు ఎదుగుతావు. అట్లా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వారు శరీరాదికము నుంచీ వేరుపడినటువంటి వారు.

అంటే ఎలా అంటే, ఎంత కష్టపడినప్పటికీ, పాము తన శరీరము నుంచీ వేరుపడేటటువంటి కుబుసమును ఎట్లా వదిలి పెడుతున్నది? ఆ ముళ్ళ చెట్లలోకి, ఆ ముళ్ళ తీగల్లోకి వెళ్ళి శరీరమంతా రక్తధారలు ప్రవహిస్తున్నప్పటికీ, కుబుసము నుంచీ వేరు చేసుకుంటుంది.

అట్లా, పాము కుబుసము వదిలినట్లుగా నీవు నీ శరీర తాదాత్మ్యత భావమును విడువవలెను. అట్లా ఎవరైతే విడుస్తారో, అట్లా ఆత్మను పొందినవారు ఎవరైతే వుంటారో, సర్వదుఃఖముల నుండి విముక్తుడై, బ్రహ్మానందమును అనుభవించును.

ఏమిటండీ దీని వల్ల ఉపయోగం అనంటే, ‘బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం’ - అనేటటువంటి ప్రార్థన శ్లోకం ఏదైతే చెప్పుకుంటున్నామో, అది యథాతథముగా అనుభూతమై వుంటుంది. అట్లాంటి అనుభవస్థితిలో వుండి, ప్రయాణం చేస్తూ వుంటారు. శరీరం ఎప్పుడు పడిపోయినా సిద్ధముగా వుంటారు.

అటువంటి సిద్ధత్వాన్ని, బుద్ధత్వాన్ని పొందుతారు. కాబట్టి ఇలాంటిదానికి అధికారిత్వాన్ని పొందినటువంటి నచికేతుడుకి మోక్షద్వారము తెరువబడి వుండడంలో విశేషమేముంది? కాబట్టి, నచికేతుడికి మోక్షము సులభముగా లభిస్తుందనేటటువంటి సత్యాన్ని యమధర్మరాజు చెప్తున్నాడు. ఎందువల్ల అంటే అతడు అధికారి కాబట్టి.

యమధర్మరాజు ఇంతవరకూ చెప్పిన విషయములు విని నచికేతుడు తనలోతాను ఇట్లు అనుకొనెను. అశాశ్వతమైన సాధన ద్వారా శాశ్వత పదవిని పొందజాలమని చెప్పుచునే నాచికేతాగ్ని చయనము చేత తాను ఈ నిత్య పదవిని పొందితినని చెప్పుచున్నాడు.

మరల ఈ ఆత్మ అతి సూక్ష్మమైనదని, సులభముగా పొందదగినది కాదని, ఇంద్రియ నిగ్రహము ద్వారా యోగము అభ్యసించిన వారు తెలిసికొన గలరని చెప్పుచున్నాడు. నీ వంటి వారే దీనికి అర్హులని మధ్యలో నన్ను ప్రశంసించుచున్నాడు. అసలు విషయము చెప్పకుండా దాటవేయునేమోయని సంశయించి నచికేతుడు యమధర్మరాజు నిట్లడుగుచున్నాడు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

21 Sep 2020

అద్భుత సృష్టి - 35

🌹.   అద్భుత సృష్టి - 35  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 12. DNA సంక్రియ 🌻

DNA ని సంక్రియం చేయటం వలన వచ్చే ఫలితాలు:

💫. మన శరీరంలో 100 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. ప్రతి క్షణంలో DNA ప్రోగులు ఉంటాయి. DNA లో 30,000 చురుకుగా పనిచేసే జీన్స్ ఉన్నాయి. ప్రతి జన్యువుకు నిర్దిష్ట చర్య ఉంటుంది. చర్మం, కన్ను, జుట్టు, ఎత్తు, రంగు, వేలిముద్రలు మొదలైనవి ఎన్నో విభాగాలలో ఈ జన్యువుల పాత్ర ఉంటుంది.

DNAలో... కోడాన్, లైట్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఈ "లైట్ కోడ్స్" ని యాక్టివేట్ చేయడం వలన మన శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శరీరాలలో ఎన్నో మార్పులు చెందించి, ఆకాశిక్ రికార్డ్ సరిచేయబడి నూతన దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.

🌟 1.DNA యాక్టివేషన్ తో శరీరానికి వచ్చే లాభాలు/ ప్రయోజనాలు:-

✨. మెరుగైన జీవక్రియను పెంచి, శక్తిని అభివృద్ధి పరిచి, మెటబాలిక్ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

✨ మనం తీసుకున్న ఆహారంలో సహజమైన కొవ్వు ఎంత అవసరమో దానినే గ్రహిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది; శారీరక సమతుల్యతను ఏర్పరుస్తుంది.

✨. శరీరానికి నీటి నిల్వ అయిన 70% వాటర్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

✨ ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. కానీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

✨. శరీరంలో సరికాని విషాలను తొలగించి శరీరాన్ని మెరిసేలా చేస్తుంది.

✨. డైజెస్టివ్ సిస్టమ్ (జీర్ణక్రియ)ను మెరుగు పరుస్తుంది.

✨. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

✨. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది.

✨. కణాలు త్వరగా హిల్ చేయబడతాయి. కణానికీ, కణానికీ మధ్య కమ్యూనికేషన్ ఏర్పడి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

🌟. 2. భావోద్వేగ మానసిక ప్రయోజనాలు:-

✨. మానసిక స్పష్టత, ప్రశాంతత ఏర్పడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. (పూర్వజ్ఞానం కూడా జ్ఞాపకం వస్తుంది)

✨. స్వీయ ప్రేమ లభిస్తుంది. మనలో కరుణ, ప్రేమ, కృతజ్ఞత, సహకారం, ప్రశంసలు అనే గొప్ప లక్షణాలు మేల్కొంటాయి.

✨. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.

✨. విజన్స్ ద్వారా, అంతర్ దృష్టి ద్వారా మార్గదర్శకత్వం దొరుకుతుంది.

✨. జీవితంపై స్పష్టత వస్తుంది.

✨. పాత సెల్యూలర్ మెమొరీ తుడిచి పెట్టబడుతుంది.

✨. హైయ్యర్ సెల్ఫ్ నుండి ప్రేమానుభూతి, శ్రేయస్సు యొక్క భావన, ప్రయోజనం, భద్రత, ఏకత్వం లభిస్తాయి.

✨. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెరుగు పరచబడుతుంది.

🌟 3. ఆధ్యాత్మిక ప్రయోజనాలు:-

✨. ఉన్నత చైతన్యం నుండి కనెక్షన్ ఏర్పడుతుంది. చైతన్యం యొక్క ప్రేమ, జ్ఞానం, శక్తి, యూనివర్సల్ ట్రూత్ ని తెలుసుకుంటూ మనం కూడా ఉన్నత చైతన్య స్థాయికి ఎదుగుతాం.

✨. పదార్థం నుండి పరమార్థం వరకు ఎదుగుతాం. ఆధ్యాత్మిక పరిపూర్ణ జీవితాన్ని జీవిస్తాం.

✨. లా ఆఫ్ అండర్ స్టాండింగ్ ద్వారా ఆత్మ సామర్థ్యమైన చైతన్యాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటాం.

✨. మన యొక్క ఆత్మ బహుమతులు మేల్కొంటాయి. దివ్యనేత్రం, దివ్యశ్రవణం, దివ్యభాషణం, దివ్యస్పర్శ, సూక్ష్మశరీరయానం, ఛానెలింగ్, మీడియమ్ షిప్, లెవిటేషన్, బైలొకేషన్ మొదలైన ఎన్నో దివ్యశక్తులు మేల్కొంటాయి.

✨. గెలాక్సీ/ మల్టీగెలాక్సీ/ యూనివర్స్/ మల్టీ యూనివర్స్ స్థాయిలోకి ఎదుగుతాం. హైయ్యర్ సెల్ఫ్ గా భూమి మీదే మన శక్తిని ప్రకటిస్తాం.

✨. అన్ని లోకాలలో కో- క్రియేటర్ గా మనకు గుర్తింపు లభిస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

అద్భుత సృష్టి ప్రింటెడ్ పుస్తకం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:
9396267139, 9652938737, 7730012579

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

21 Sep 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 17 / Sri Vishnu Sahasra Namavali - 17

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 17 / Sri Vishnu Sahasra Namavali - 17 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

వృషభరాశి- మృగశిర నక్షత్ర 1వ పాద శ్లోకం

17. ఉపెన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|
అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః||

151) ఉపేంద్రః -
ఇంద్రునకు అధిపతి, ఇంద్రియములకు లొంగనివాడు.

152) వామనః -
ఎంతో చక్కని, చిన్నని రూపమున అవతరించినవాడు.

153) ప్రాంశుః -
ఎంతో విస్తారమైన దేహంతో త్రివిక్రముడై ముల్లోకములను ఆక్రమించినవాడు.

154) అమోఘః -
ఆశ్చర్యపరిచే, కారణయుక్తమైన పనులు చేసెడివాడు.

155) శుచిః -
ఎటువంటి మాలిన్యములు అంటనివాడు, జీవులను పవిత్రులుగా చేయువాడు.

156) ఊర్జితః -
అత్యంత శక్తి సంపన్నుడు.

157) అతీంద్రః -
ఇంద్రియముల కంటే అధికుడు, మనసు కంటే శ్రేష్ఠుడు.

158) సంగ్రహః -
సర్యమును తన అధీనములో నుంచుకొన్నవాడు.

159) సర్గః -
తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృష్టించుకొనువాడు.

160) ధృతాత్మా -
అన్ని ఆత్మలకు (జీవులకు) ఆధారమైనవాడు.

161) నియమః -
నియమాలను ఏర్పరచి, వాటిని నియంత్రించి, సకలమును నడుపువాడు.

162) యమః -
సమస్తమును వశము చేసుకొన్నవాడు, జీవుల హృదయమందు వశించువాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 17 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Vrushabha Rasi, Mrugasira 1st Padam

17. upendrō vāmanaḥ prāṁśuramōghaḥ śucirūrjitaḥ |
atīndraḥ saṅgrahaḥ sargō dhṛtātmā niyamō yama || 17 ||

151) Upendraḥ:
One born as the younger brother of Indra.

152) Vāmanaḥ:
One who, in the form of Vamana (dwarf), went begging to Bali.

153) Prāṁśuḥ:
One of great height.

154) Amoghaḥ:
One whose acts do not go in vain.

155) Śuchiḥ:
One who purifies those who adore and praise Him.

156) Ūrjitaḥ:
One of infinite strength.

157) Atīndraḥ:
One who is superior to Indra by His inherent attributes like omnipotence, omniscience etc.

158) Saṅgrahaḥ:
One who is of the subtle form of the universe to be created.

159) Sargaḥ:
The creator of Himself

160) Dhṛtātmā:
One who is ever in His inherent form or nature, without the transformation involved in birth and death.

161) Niyamaḥ:
One who appoints His creatures in particular stations.

162) Yamaḥ:
One who regulates all, remaining within them.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

21 Sep 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 115

🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 115   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మతంగ మహర్షి - 3 🌻

18. “నువ్వు కేవలం సామాన్య బ్రాహ్మణుడివిగానే ఉన్నావు. కేవలం ఆదిలోనే ఉన్నావు ప్రస్తుతం. అంతంలో లభించేఫలం కావాలని కోరుకుంటున్నావు. నీలో ఉన్న బ్రాహ్మణత్వంవలన ఏమీ ప్రయోజనంలేదు. బ్రాహ్మణుడిగా పుట్టి జాతిలో ఉండే ధర్మాన్ని నిలబెట్టుకోవటము చాలాకష్టము.

19. అనేక జన్మలకొక పర్యాయం బ్రాహ్మణజన్మ పొందినా; ధనవాంఛ, విషయలోలత్వం, అహంకారము నూటికి తొంభైతొమ్మిదికిపైగా ఉంది. సదాచారము వదలి బ్రాహ్మణత్వమును మంటగలిపి వంశానికి అపఖ్యాతి తెచ్చినవాళ్ళు చాలామందిఉన్నారు. కాబట్టి నీ ఆశలు అడిఆశలేకాని అన్యములుకావు. ఇకనైనా నీ తపస్సు మానుకుని ఏదయినా వరం కోరుకో!” అన్నాడు ఇంద్రుడు.

20. కులస్వభావం అంటే గుణమే. ఎవరైనా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు, శూద్రౌడు, చండాలుడు, లేఛ్ఛుడు అంటే అది గుణాన్ని గురించే. శరీరానికి కులం ఉంటుందా? లేదు. ఆత్మకూ కులంలేదు. మరి దేనికి కులం అంటే, గుణానికి.

21. రూఢీగా మహాత్ములు, జ్ఞానులు అందరూ వేలసార్లు మరీమరీ ఈ సత్యాన్ని పురాణాలలో, ఇతిహాసాలలో, బ్రాహమణాలలో, వేదవాఙ్మయంలో చెపుతూవచ్చారు.

22. బ్రహమపురాణంలో:

కర్మభిః శుచిభిః దేవి శుద్ధాత్మా విజితేంద్రియః|
శూద్రోపి ద్విజవత్ సేవ్యః ఇతి బ్రహ్మా బ్రవీత్ స్వయమ్||

23. అంటే, ఉత్తముడైన శూద్రుడు బ్రాహ్మణునివలెనే సేవించదగినవాడు. గుణమంటే ప్రవృత్తి అనే అర్థం. నీవు బ్రాహ్మణుడివేకాని నీ ప్రవృత్తి రాక్షసవృత్తి, రాక్షసుడివై పుట్టు అని శపిస్తూఉంటారు పురాణాలలో మన ఋషులు. మదించి ఉన్నావు, ఏనుగైపుట్టు; బుద్ధిలేకుండా గడ్డితింటున్నావు, గడ్డితినే పశువువైపుట్టు అని శపించడం మనం చూస్తూ ఉంటాం.

24. అంటే మనిషే గడ్డితినే పశువై పుడితే, బాగా స్వేఛ్ఛగా తినవచ్చు కదా! అంటే, వాడి గుణానికి తగిన శరీరాన్ని ప్రసాదించి, ఆ ప్రవృత్తిని క్షయంచేయడం అన్నమాట. కొంచెం ఆలోచిస్తే అది అవసరమే అవుతుంది. అంటే యథోచితమైన జన్మను తీసుకోమని చెప్పటం. ‘నీ గుణానికి తగిన జన్మ నీకిస్తాను’ అని చెప్పటమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

21 Sep 2020

శ్రీ శివ మహా పురాణము - 228

🌹 .  శ్రీ శివ మహా పురాణము - 228  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

50. అధ్యాయము - 5

🌻. సంధ్య యొక్క చరిత్ర - 4 🌻

బ్రహ్మో వాచ |

వసిష్ఠ పుత్ర గచ్ఛ త్వం సంధ్యాం జాతాం మనస్వినీమ్‌ |తపసే ధృతకామాం చ దీక్షసై#్వనాం యథా విధి || 36
మందాక్షమభవత్తస్యాః పురా దృష్ట్వై వ కాముకాన్‌ | యుష్మాన్మాం చ తథాత్మానం సకామాం మునిసత్తమ || 37
అభూత పూర్వం తత్కర్మ పూర్వం మృత్యుం విమృశ్యసా | యుష్మాకమాత్మనశ్చాపి ప్రాణాన్‌ సంత్యక్తుమిచ్ఛతి || 38
సమర్యాదేషు మర్యాదాం తపసా స్థాపయిష్యతి | తపః కర్తుం గతా సాధ్వీ చంద్ర భాగాఖ్య భూధరే || 39
న భావం తపసస్తాత సానుజానాతి కంచన | తస్మాద్య థోపదేశాత్సా ప్రాప్నోత్విష్టం తథా కురు || 40

బ్రహ్మ ఇట్లు పలికెను -

పుత్రా! వసిష్టా! అభిమానవతియగు నాకుమార్తె సంధ్య వద్దకు నీవు వెళ్లుము. ఆమె తపస్సును చేయగోరు చున్నది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇమ్ము (36).

ఓ మహర్షీ! నన్ను, మిమ్ములను కామ వికారముతో కూడి యుండగా పూర్వము ఆమె చూచి, తాను కూడ కామ వికారమును పొందుటను గాంచి, చాల సిగ్గుపడెను (37).

నా యొక్క, మీ యొక్క ఈ ముందెన్నడూ జరుగని, పాప భావనతో చూచుట అనే కర్మను ఆమె తలపోసి, ప్రాణములను వీడ నిశ్చయించుకున్నది (38).

ఆమె తపస్సుచే లోకములయందు మర్యాదను నెలగొల్ప గలదు. తపస్సును చేయుటకై ఆ సాధ్వి చంద్ర భాగ పర్వతమునకు వెళ్లినది (39).

వత్సా! ఆమెకు తపస్సు ను గురించి ఏమియూ తెలియదు కావున, నీవు ఆమెకు ఉపదేశించి, ఆమెకు హితము కలుగునట్లు ప్రయత్నించుము (40).

ఇదం రూపం పరిత్యజ్య నిజం రూపాంతరం మునే . పరిగృహ్యాంతికే తస్యాస్తపశ్చర్యాం నిదర్శయన్‌ || 41
ఇదం స్వరూపం భవతో దృష్ట్వా పూర్వం యథాత్ర వామ్‌ | నాప్నుయాత్సాథ కించిద్వై తతో రూపాంతరం కురు || 42
నారదేత్థం వసిష్టో మే సమాజ్ఞప్తో దయావతా |తథాస్త్వితి చ మాం ప్రోచ్య య¸° సంధ్యాంతికం మునిః || 43
తత్ర దేవ సరః పూర్ణం గుణౖర్మానస సంమితమ్‌ | దదర్శ స వసిష్ఠోsథ సంధ్యాం తత్తీరగామపి || 44

ఓ మహర్షీ! ఈ నీ నిజరూపమును వీడి, మరియొక రూపమును స్వీకరించి, ఆమె వద్దకు వెళ్లి, ఆమె చేయు తపస్సును పరిశీలించుము (41).

ఆమె నిన్ను ఇచట పూర్వము చూచినది. ఇదే రూపములో నిన్ను చూచినచో, ఆమె ఏదేని వికారమును పొందవచ్చును. కావున రూపమును మార్చుము (42).

ఓ నారదా! నేను ఈ తీరున వసిష్ఠుని దయా బుద్ధితో ఆజ్ఞాపించితిని . ఆయన ' అటులనే యగుగాక' అని నాతో పలికి సంధ్య వద్దకు వెళ్లెను (43).

ఆ వసిష్ఠ మహర్షి అచట గుణములలో అన్ని విధములా మానససరోవరమును పోలియున్న దేవరస్సును, దాని తీరమునందున్న సంధ్యను చూచెను (44).

తీరస్థయా తయా రేజే తత్సరః కమలోజ్జ్వలమ్‌ | ఉద్యదిందు సునక్షత్రం ప్రదోషే గగనం యథా || 45
మునిర్దృష్ట్వాథ తత్ర సుసంభావం స కౌతుకీ | వీక్షాంచక్రే సరస్తత్ర బృహల్లోహిత సంజ్ఞకమ్‌ || 46
చంద్రభాగా నదీ తస్మా త్ర్పాకారాద్దక్షిణాంబుధిమ్‌ | యాంతీ సా చైవ దదృశే తేన సాను గిరేర్మహత్‌ || 47
నిర్భిద్య పశ్చిమం సా తు చంద్ర భాగస్య సా నదీ | యథా హిమవతో గంగా తథా గచ్ఛతి సాగరమ్‌ || 48

ప్రదోషకాలమునందు ఉదయించే చంద్రునితో నక్షత్రములతో ఆకాశము నిండియున్నట్లు, ఆ సరస్సు తీరమునందున్న ఆమెతో మరియు కమలములతో నిండి ఉజ్జ్వలముగా ప్రకాశించెను (45).

వసిష్ఠ మహర్షి ఉత్కంఠ గలవాడై గొప్ప నిర్ణయము గల ఆమెనచట దర్శించెను. మరియు అచట బృహల్లోహితమను పేరు గల ఆ సరస్సును చూచెను (46).

ప్రాకారము వలెనున్న ఆ పర్వతమునుండి దక్షిణ సముద్రము వరకు వ్రవహించుచున్న చంద్రభాగా నదిని ఆయన దర్శించెను. ఆనది ఆ పర్వతము యొక్క గొప్ప సానువును (47)

భేదించుకొని, పశ్చిమము వైపునకు ప్రవహించెను. హిమవత్పర్వతము నుండి సముద్రము వైపునకు పయనించే గంగవలె ఆనది శోభిల్లెను (48).

తస్మిన్‌ గిరౌ చంద్రభాగే బృహల్లోహితతీరగామ్‌ | సంధ్యాం దృష్ట్వాథ పప్రచ్ఛ వసిష్ఠస్సాదరం తదా || 49

అపుడు ఆ చంద్ర భాగ పర్వతమునందు బృహల్లోహితమనే సరస్సు యొక్క తీరము నందున్న సంధ్యను చూచి, వసిష్ఠుడు ఆ దరముతో నిట్లు ప్రశ్నించెను (49).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

21 Sep 2020

మంత్ర పుష్పం - భావగానం - 2

🌹.   మంత్ర పుష్పం - భావగానం - 2    🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మంత్ర పుష్పం 3.

విశ్వతః పరమాన్నిత్యమ్
విశ్వం నారాయణగ్o హరిమ్
విశ్వమే వేదం పురుషస్త
ద్విశ్వ ముపజీవతి

విశ్వము కన్నా ఉన్నతుడోయి
అందరిలోనుండు ఆత్మోయి
శాశ్వత పోషకుడు హరోయి
సర్వాత్మడు పరమాత్ముడోయి
ఈ విశ్వ లోకాల కారకుడోయి
ఆ దైవమే విశ్వానికి తోడోయి

🌻. మంత్రపుష్పం 4.

పతిం విశ్వస్యాత్యే శ్వరగ్o
శాశ్వతగ్oశివమచ్యుతమ్
నారాయణం మహాజ్ఞ్యేయమ్
విశ్వాత్మానం పరాయణం

భావగానం:

పతిలా పోషించువాడు
లోకాలకు ఈశ్వరుడు
శాశ్వితుడు శుభకరుడు
సకల లోక ఉన్నతుడు
సకల జీవ నాయకుడు
అతడు నారాయణుడు
అతడు మహా దేవుడు
లోకమంత ఆత్మ వాడు
పూజింప తగు దేవుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుష్పం

21 Sep 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 51

🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 51  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 1 🌻

198. మానవుడు తన సంస్కార భారమును, వాటికి భిన్నమైన సంస్కారముల ద్వారా తగ్గించుకొనుటకు శ్రమ పడును. ఈ శ్రమయే పునర్జన్మ క్రమము.

199. మానవ రూపము వరకు ప్రోగుపడిన సంస్కారములు పునరావృత్తి క్రమమందును, ఆధ్యాత్మిక అనుభూతి క్రమమందును భిన్న సంస్కారములచే రద్దగును.

200. సంస్కారములు రద్దగుటకే,పునర్జన్మ క్రమము ఆధ్యాత్మిక మార్గము (అంతర్ముఖ క్రమము) ఒకదాని వెంబడి మరి యొకటిగా, అనుసరించబడుచున్నవి.

201. తొలి మానవరూపము ద్వారా, జంతుశ్రేణి చివరి జంతువు యొక్క సంస్కారములన్నిటిని ఖర్చుపెట్టిన తరువాత, ఆత్మ యొక్క చైతన్యము తొలి మానవ రూపమును విడిచిపెట్టుట సహజము.

202. చైతన్యము తొలిమానవ రూపము నుండి వియోగం మొందినప్పటికీ, తెలియకనే సాహచర్యమును పొందుచూ సూక్ష్మ- కారణ దేహముల నుండి ఎన్నడూ వియోగమొందుట లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

21 Sep 2020

శివగీత - 69 / The Siva-Gita - 69

🌹. శివగీత - 69 / The Siva-Gita - 69 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

నవమాధ్యాయము

🌻. శరీర నిరూపణము - 3 🌻

హృన్నాభీ యేవ మాద్యాస్స్యు - ర్భానా మాత్రు భవా మాతా
శ్మశ్రురో మక చ స్నాయు - శిరాధ మనయో న ఖాః 12

దశనా స్శుక్ర మిత్యాది స్థిరాః - పితృ సముద్భవాః
శరీరో పచితి ర్వర్ణో వృద్ధి - స్త్రప్తి ర్భలం స్థితి: 13

ఆలోలు పత్వ ముత్సాహా - ఇత్యాదీ న్ ర స జాన్విదు:
ఇచ్చా ద్వేష స్సుఖం దుఃఖం - ధర్మాధ ర్మౌ చ భావనాః 14

ప్రయత్నో జ్ఞాన మాయుశ్చే - ఇంద్రియాణీ యేవ మాత్మజాః
జ్ఞానేంద్రియాణి శ్రవణం - స్సర్శనం దర్శనం తథా 15

రసనం ఘ్రాణ మిత్యాహు - పంచ తేషాం చ గోచరాః
శబ్దం స్పర్వ స్తథా రూపం - ర సో గంధ ఇతి క్రమాత్ 16

వాక్క రాంఘ్రి గుదో పస్థా - న్యాహు: కర్మేంద్రి యాణి హి
వచనాదాన గమన - విసర్గ దతయః క్రమాత్ 17

మీసములు మొదలగు ముఖ వెంట్రుకలు, శరీరమందలి వెంట్రుకలు, తలవెంట్రుకలు, వసారూపముగల ధాతు విశేషములు, నాడులు, పెద్ద నాడులు, గోళ్ళు, ఇంద్రియములు, ముఖస్థిరమైనది తండ్రి నుండి కలుగును.

శరీరోత్పత్తి లోని స్థూలత్వము, శ్యామలాది వర్ణము, క్రమాభివృద్ధి, తృప్తి, బలము, యధారీతిగా నుండుట, ఆసక్తి లేకుండుట, ఉత్సాహహు మొదలగునవి రసజములని తెలియవలెను.

అభిలాష - ద్వేషము, సుఖ దుఃఖములు, విధి నిషేదములు, స్మృతికి కారణమగు వస్తువు (భావన) యత్నము, జ్ఞానము, ఆయుస్సమయము, ఇంద్రియములు, ఇవి జీవికర్మానుసార జాతములగుటవలన ఆత్మజములన బడును. శ్రవణాదులు జ్ఞానేంద్రియము లైదు,

శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు, తన్మాత్రలు, వాక్పాణి పాద పాయోవస్థలు, కరేంద్రియములు, వచనోదానగమన మలత్యాగేంద్రియ సుఖములనునవి తన్మాత్రలు, ఉభాయాత్మకము మసస్సు - మనోబుద్ధి యహంకారములు చిత్తమును అంతఃకరణ చతుష్టయము అని చెప్పబడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 69 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 09 :
🌻 Deha Svarupa Nirnayam - 3
🌻

Moustaches etc. facial hair, body hair hair on head, metal elements, nerves, nails, sense organs are obtained from the father.

In the body formation, obesity, dark complexion, progressive growth, satisfaction, strength, detachment, enthusiasm etc are Rasajam. lovehatred, happinesssorrow, prohibited acts, mind, knowledge, motor organs etc. are called Atmajam because these are formed based on the karma of the jiva.

Ears, five sense organs, sabdha, sparsha, rupa, rasa, gandha, five tanmaatras, vakpanipadapayovastha, karmendriyas, excretary organs, organs of speech, mind, mindegointellect, chitta, antahkarana, are all called as Chatushtyam; among them, smruti (memory), bheeti (fear), vikalpam (idea), happiness and sorrow, acts done by the mind, buddhi, ego, the feeling of mine such qualities which are not known by indriyas are experienced by the help of chittam.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

21 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 101

🌹. నారద భక్తి సూత్రాలు - 101 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 72

🌻 72. నాస్తి తేషు జాతి విద్యారూప కుల ధన క్రియాది ఖెదః ॥ 🌻

భగవత్రసన్నత్వం కలిగినప్పుడు జాతి వగైరా భెదాలు ఉండవు. జ్ఞాన అజ్ఞానాలు, కుల భేదం, ధనిక, పెద ఖేదం వృత్తి భేదం క్రియా భిదం వంటివి ఉందవ.

ముఖ్యభక్తి కలిగాక ఎటువంటి ద్వంద్వాలు తోచవు. భగవదనుగ్రహం భక్తి న్ధాయిని బట్టి ఉంటుంది గాని, జాతి, కులం వంటి భేదాన్ని బట్ట ఉందదు.

నందనారు, రవిదాసు, కన్నపు మొదలగు నిమ్న జాతివారు భగవ దనుగ్రహం పొందారు.

మీరాబాయి, ఆందాళ్‌, అవ్వయ్యారు వంటి స్రీలు భగవనుగ్రహం పొందారు. ప్రథమంలో దురాచారులై, పిమ్మట భక్తులైన వారు కూడా భగవంతుని కృపకు వాత్రులయ్యారు. అజామీళుడు, రత్నాకరుడు (వాల్నీకి), బిళ్వమంగళుడు వీరంతా మొదట దురాచారపరులు. అయినా వారికి భగవంతుని ప్రసన్నత లభించింది. చదువుకోని కబీరు, గురునానక్‌, తుకారాం ప్రభృతులు భక్తి వలన ముక్తులైనారు. రాక్షసులలో ప్రహ్లాద, బలి చక్రవర్తులు మోక్షం పొందారు.

ఎవరైనా సరే భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం, భక్తి ప్రపత్తులు ఉన్నవారు జాతి, మత, లింగ భిదం లేకుండా భగవంతునిచే అనుగ్రహింప బడతారు. భక్తి చేయడానికి గాని, తరించడానికి గాని అందరూ అర్హులే. కాని భక్తి తీవ్రతను బట్టి మాత్రమె భగవంతుని అనుగ్రహం ఉంటుందని గ్రహించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

21 Sep 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 5

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 5 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 😘

ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత

🌻 5. 'దేవకార్య సముద్యతా' 🌻

ఈ నామము కూడ అష్టాక్షరియే. దేవతల కార్యమును నిర్వర్తించుటకై వ్యక్తమైనదని అర్ధము. సమస్త దేవతలు వచైతన్యాగ్ని నుండియె వెలువడి, సృష్టి సిర్మాణము చేయుచున్నారు. (బ్రహ్మాది దేవతలందరు కూడ ఈ చైతన్యమనెడి అగ్నికుండము నుండి పుట్టిన వారే.

చైతన్యాగ్నిగ యజ్ఞకుండమున ఆవిర్భవించగనె దేవతా కార్యము నకు దేవి ఉద్యుక్తురాలగును గాని, విశ్రాంతి గొనుట యుండదు. మానవుడు కూడ మెల్కాంచగనే కార్యములందు ఉద్యుక్తు డగుచున్నాడు కదా! ఈ ఉద్యుక్తత మానవులయందు గల దేవీ లక్షణమే. మెల్మాంచి బద్ధకముగ నుండుట, మరల పండుకొనుట తమోగుణ లక్షణము.

దేవి భక్తు డట్లుండడు, మేల్కాంచగనె ఈశ్వరార్చనముగ చేయవలసిన పనులయందు తనను తాను నియమించుకొనును. ఇది చైతన్యవంతుని లక్షణము. దేవి చైతన్యాగ్నిగ వ్యక్తమవగనె దేవకార్యము సిద్దించుటకై తనను తాను నియమించుకొనునని, ఆ విధముగ అత్యంత అప్రమత్తురా లని తెలియవలెను. పిలిచిన వెంటనె ఆలస్యము చెయక ప్రతిస్పందించు ప్రేమ స్వరూపిణియని గమనించవలెను.

సృష్టి అరంభమున వ్యక్తమై త్రిగుణాత్మకముగ తనను తాను విభజించుకొన్నప్పటికీ దేవతల ప్రార్ధనకు ప్రతిస్పందించి తానావిర్భవించి మహిషాసుర, భండాసురాదులను వధించినది.

దేవి ఒక్కరే అయినను ముగ్గురుగ కూడ గోచరించుచుండును. ఆమె నిత్యురాలు. దేవ సృష్టికి, దేవ రక్షణకు, ఏర్పడుట ఆమె 'సి రూప స్థితి. ఆమె అరూప అని కూడ తెలియవలెను. అరూపయె సరూప అగుచుండును. అట్లగుట అవసరమునుబట్ట జరుగును.

సృష్టి అంతయు దేవి నుండి దిగివచ్చిన దేవతలయొక్క యజ్ఞార్ధ కర్మగా జరుగుచూ ఉండును.

అట్లు జరుగు దేవతా యజ్ఞమున అసురులు కూడ ఉద్భవించు చుందురు. సురలనగా వెలుగు ప్రజ్ఞలు. వారి వలననే సృష్టియజ్ఞము జరుగుచుండును. అసురులనగా ఆ వెలుగులను ఆవరించి కమ్ముకొను చీకటి లేక తమస్సు. అట్లు జరిగినప్పుడెల్ల దెవి ఆవిర్భవించుటయు, ఆమె ఆవిర్భావ కారణముగ కమ్మిన చీకట్లు (తమస్సు) హరింబడుటయు జరుగుచుండును.

ఇదియే దేవి యొక్క దేవతారక్షణ స్వభావము. అంతమాత్రము చెత దేవి సుర పక్షవాతి యని అనతగదు. సృష్టి నిర్మాణమున, సృష్టి స్థితి కాలమున ఇట్లు రక్షించినను, తిరోధాన సమయమున తమోగుణమును లెక అసురమును అనుమతించును కదా! అందుచె సృష్టికార్యము జరుగు నపుడు దేవతలను రక్షించుచుండును. ప్రళయ కాలమున తమమును అనుమతించును.

అట్లనుమతించినచో మెల్కాంచిన జీవునకు నిదుర యుండదు. ఈ విధముగ దేవి జీవులను, లోకములను అనురక్షణము చేయుచుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 5 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 5. Devakārya-samudyatā देवकार्य-समुद्यता 🌻

She has manifested Herself to help deva-s (gods and goddesses). What is the help She can do for devās? It goes back to a story where deva-s were engaged in a war with the demons who are called as asura-s. She helps deva-s to win the battle with the demons. Deva-s do not perform evil deeds, therefore She always helps deva-s. When She is said to be a part of the Brahman, why She should manifest afresh to destroy the demons? When She is said to be the part of the Brahman, it refers to Her prakāśa form.

Prakāśa (the principle Self-revelation; consciousness; the principle by which ever other thing is known.) form represents Śiva and vimarśa (Self-consciousness as opposed to Self-revelation of Śiva ; the awareness of Śiva , full of knowledge and actions that bring about the world process) form represents Śaktī.

Since She is a part of the Supreme Śiva who Has created Her as His vimarśa form, the prakāśa form of Lalitāmbikā is subtly highlighted here without explicitly saying so. This nāma discusses Her prakāśa form.

There is an important saying in Yogavasiśtā, “I have two forms, ordinary and supreme. The ordinary form of mine is with hands and legs.

This form of mine is worshiped by ignorant men. The other one is my supreme form, the formless form without a beginning and an end. This form of mine has no qualities or attributes and is called the Brahman, Ātman, Paramātman, etc.”

In this nāma demons or asura-s means avidyā or ignorance. Deva-s means knowledge or vidyā. She helps those who seek knowledge about the Brahman.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

21 Sep 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 15 / Vishnu Sahasranama Contemplation - 15

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 15 / Vishnu Sahasranama Contemplation - 15 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 15. సాక్షీ, साक्षी, Sākṣī 🌻

ఓం సాక్షిణే నమః | ॐ साक्षिणे नमः | OM Sākṣiṇe namaḥ

సాక్షాత్‌గా తనస్వరూపమేయగు జ్ఞానముతో ప్రతియొక దానిని చూచును. పరమాత్ముని స్వస్వరూపమే జ్ఞానము. అతడు చిత్ (జ్ఞాన) స్వరూపుడు కావున దృశ్యజగత్తునందలి ప్రతియొక తత్త్వమును పరమార్థ తత్త్వమగు తన స్వరూపమును కూడ దేనితోను వ్యవధానముకాని దేని తోడ్పాటు గాని లేక చూచువాడు అతడే.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::

గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 15 🌹
📚. Prasad Bharadwaj

🌻 15. Sākṣī 🌻

OM Sākṣiṇe namaḥ

One who witnesses everything, without any aid or instruments, by virtue of His inherent nature alone.

Bhagavad Gita - Chapter 9

Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. (18)

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।

अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।

అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।

Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

21 Sep 2020

21-September-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 494 / Bhagavad-Gita - 495🌹
2 ) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 15 / Vishnu Sahasranama Contemplation - 15🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 284🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 5 / Sri Lalita Chaitanya Vijnanam - 5🌹
5) 🌹. నారద భక్తి సూత్రాలు - 101🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 72🌹
7) 🌹. శివగీత - 69 / The Shiva-Gita - 69🌹
8) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 57 / Gajanan Maharaj Life History - 57 🌹 
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 51🌹
10. 🌹. మంత్రపుష్పం - భావగానం - 2🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 408 / Bhagavad-Gita - 411🌹

12) 🌹. శివ మహా పురాణము - 228 🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 104🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 115🌹
15) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 58🌹
16) 🌹 Seeds Of Consciousness - 180🌹 
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 34 📚
18) 🌹. అద్భుత సృష్టి - 35 🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 16 / Sri Vishnu Sahasranama - 17🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 495 / Bhagavad-Gita - 495 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 5 🌴*

05. సత్త్వం రజస్తమ ఇతి గుణా: ప్రకృతిసమ్భవా : |
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ మహాబాహుడవైన అర్జునా! భౌతికప్రకృతి సత్త్వరజస్తమోగుణములనెడి మూడు గుణములను కలిగియుండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును

🌷. భాష్యము :
జీవుడు దివ్యుడైనందున వాస్తవమునకు ప్రకృతితో ఎట్టి సంబంధము లేనివాడు. అయినను భౌతికజగత్తు నందు అతడు బంధితుడగుట వలన భౌతికప్రకృతి త్రిగుణముల ననుసరించి వర్తించుచుండును. జీవులు ప్రకృతిత్రిగుణముల ననుసరించి వివిధదేహములను కలిగియుండుట వలన ఆ గుణముల ననుసరించియే వర్తించవలసివచ్చును. ఇట్టి వర్తనమే వివిధములైన సుఖదుఃఖములకు కారణమగుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 495 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 05 🌴*

05. sattvaṁ rajas tama iti
guṇāḥ prakṛti-sambhavāḥ
nibadhnanti mahā-bāho
dehe dehinam avyayam

🌷 Translation : 
Material nature consists of three modes – goodness, passion and ignorance. When the eternal living entity comes in contact with nature, O mighty-armed Arjuna, he becomes conditioned by these modes.

🌹 Purport :
The living entity, because he is transcendental, has nothing to do with this material nature. Still, because he has become conditioned by the material world, he is acting under the spell of the three modes of material nature.

 Because living entities have different kinds of bodies, in terms of the different aspects of nature, they are induced to act according to that nature. This is the cause of the varieties of happiness and distress.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 15 / Vishnu Sahasranama Contemplation - 15 🌹* 
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 15. సాక్షీ, साक्षी, Sākṣī 🌻*

*ఓం సాక్షిణే నమః | ॐ साक्षिणे नमः | OM Sākṣiṇe namaḥ*

సాక్షాత్‌గా తనస్వరూపమేయగు జ్ఞానముతో ప్రతియొక దానిని చూచును. పరమాత్ముని స్వస్వరూపమే జ్ఞానము. అతడు చిత్ (జ్ఞాన) స్వరూపుడు కావున దృశ్యజగత్తునందలి ప్రతియొక తత్త్వమును పరమార్థ తత్త్వమగు తన స్వరూపమును కూడ దేనితోను వ్యవధానముకాని దేని తోడ్పాటు గాని లేక చూచువాడు అతడే.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 15 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 15. Sākṣī 🌻*

*OM Sākṣiṇe namaḥ*

One who witnesses everything, without any aid or instruments, by virtue of His inherent nature alone.

Bhagavad Gita - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. (18)

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka 
पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥
Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 284 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 36
*🌻 Sripada’s wonderful talk in Brahmana Parishad - 3 🌻*

The entire parishad was stunned. While everyone was looking, one light form came  and entered me. Again Sripada said, ‘In front of your eyes, Bangaraiah’s atma jyothi merged in Vedantha Sharma. You now decide whether he is a Brahmin or Chandaala. You tried to expel us from caste and be in the good looks of Shankaracharya. What will Shankaracharya do to me? I was born in front of your eyes, grew up and without learning anything from my father or grandfather, I am able to chant the Ruks in the Vedas. 

I am giving darshan at different places at a  time. Why do I fear when Shankaracharya comes. I will grace him by giving darshan as Sri Sharada Chandra Mouleeswara, whom he worships. He will have to accept me as God. Then his decision will be much  more painful to you. Kshatriya Parishad and Vysya Parishad will not accept your decision. If they stop calling you for ‘Pourahityam’, ‘Karma Kandas’, and ‘Sambhavanas’, you will have to starve along with your children. If you quarrel with me, you will be ruined in all ways. I am telling that the dharmas of all ‘ashramas’ should be performed. People of all 18 varnas should live happily. You perform the ‘dharma karmas’ competently and take part in establishing dharma. Otherwise you will face troubles and losses. 

 I will be peaceful. But you will fall into troublesome situations. When transformation is going on in prakruthi, there are only two methods. One is ‘setting  it right’. Second one is ‘let someone set it right’. Plenty of time will be given for setting things right. If you are not accepting to set yourself, it is like inviting ‘ruin’. I will establish dharma even by ruining.’  

Thus he talked curtly. Having no other option, I took Bangaramma, travelled, many villages and reached this place. We installed Mathangi Devi in this ashramam and are living.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 5 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
 *ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ  శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత* 

*🌻 5. 'దేవకార్య సముద్యతా' 🌻*

ఈ నామము కూడ అష్టాక్షరియే. దేవతల కార్యమును నిర్వర్తించుటకై వ్యక్తమైనదని అర్ధము. సమస్త దేవతలు వచైతన్యాగ్ని నుండియె వెలువడి, సృష్టి సిర్మాణము చేయుచున్నారు. (బ్రహ్మాది దేవతలందరు కూడ ఈ చైతన్యమనెడి అగ్నికుండము నుండి పుట్టిన వారే. 

చైతన్యాగ్నిగ యజ్ఞకుండమున ఆవిర్భవించగనె దేవతా కార్యము నకు దేవి ఉద్యుక్తురాలగును గాని, విశ్రాంతి గొనుట యుండదు. మానవుడు కూడ మెల్కాంచగనే కార్యములందు ఉద్యుక్తు డగుచున్నాడు కదా! ఈ ఉద్యుక్తత మానవులయందు గల దేవీ లక్షణమే. మెల్మాంచి బద్ధకముగ నుండుట, మరల పండుకొనుట తమోగుణ లక్షణము. 

దేవి భక్తు డట్లుండడు, మేల్కాంచగనె ఈశ్వరార్చనముగ చేయవలసిన పనులయందు తనను తాను నియమించుకొనును. ఇది చైతన్యవంతుని లక్షణము. దేవి చైతన్యాగ్నిగ వ్యక్తమవగనె దేవకార్యము సిద్దించుటకై తనను తాను నియమించుకొనునని, ఆ విధముగ అత్యంత అప్రమత్తురా లని తెలియవలెను. పిలిచిన వెంటనె ఆలస్యము చెయక ప్రతిస్పందించు ప్రేమ స్వరూపిణియని గమనించవలెను.

సృష్టి అరంభమున వ్యక్తమై త్రిగుణాత్మకముగ తనను తాను విభజించుకొన్నప్పటికీ దేవతల ప్రార్ధనకు ప్రతిస్పందించి తానావిర్భవించి మహిషాసుర, భండాసురాదులను వధించినది. 

దేవి ఒక్కరే అయినను ముగ్గురుగ కూడ గోచరించుచుండును. ఆమె నిత్యురాలు. దేవ సృష్టికి, దేవ రక్షణకు, ఏర్పడుట ఆమె 'సి రూప స్థితి. ఆమె అరూప అని కూడ తెలియవలెను. అరూపయె సరూప అగుచుండును. అట్లగుట అవసరమునుబట్ట జరుగును.

సృష్టి అంతయు దేవి నుండి దిగివచ్చిన దేవతలయొక్క యజ్ఞార్ధ కర్మగా జరుగుచూ ఉండును. 

అట్లు జరుగు దేవతా యజ్ఞమున అసురులు కూడ ఉద్భవించు చుందురు. సురలనగా వెలుగు ప్రజ్ఞలు. వారి వలననే సృష్టియజ్ఞము జరుగుచుండును. అసురులనగా ఆ వెలుగులను ఆవరించి కమ్ముకొను చీకటి లేక తమస్సు. అట్లు జరిగినప్పుడెల్ల దెవి ఆవిర్భవించుటయు, ఆమె ఆవిర్భావ కారణముగ కమ్మిన చీకట్లు (తమస్సు) హరింబడుటయు జరుగుచుండును. 

ఇదియే దేవి యొక్క దేవతారక్షణ స్వభావము. అంతమాత్రము చెత దేవి సుర పక్షవాతి యని అనతగదు. సృష్టి నిర్మాణమున, సృష్టి స్థితి కాలమున ఇట్లు రక్షించినను, తిరోధాన సమయమున తమోగుణమును లెక అసురమును అనుమతించును కదా! అందుచె సృష్టికార్యము జరుగు నపుడు దేవతలను రక్షించుచుండును. ప్రళయ కాలమున తమమును అనుమతించును.

 అట్లనుమతించినచో మెల్కాంచిన జీవునకు నిదుర యుండదు. ఈ విధముగ దేవి జీవులను, లోకములను అనురక్షణము చేయుచుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 5 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 5. Devakārya-samudyatā देवकार्य-समुद्यता 🌻*

She has manifested Herself to help deva-s (gods and goddesses). What is the help She can do for devās? It goes back to a story where deva-s were engaged in a war with the demons who are called as asura-s. She helps deva-s to win the battle with the demons. Deva-s do not perform evil deeds, therefore She always helps deva-s. When She is said to be a part of the Brahman, why She should manifest afresh to destroy the demons? When She is said to be the part of the Brahman, it refers to Her prakāśa form.  

Prakāśa (the principle Self-revelation; consciousness; the principle by which ever other thing is known.) form represents Śiva and vimarśa (Self-consciousness as opposed to Self-revelation of Śiva ; the awareness of Śiva , full of knowledge and actions that bring about the world process) form represents Śaktī.  

Since She is a part of the Supreme Śiva who Has created Her as His vimarśa form, the prakāśa form of Lalitāmbikā is subtly highlighted here without explicitly saying so. This nāma discusses Her prakāśa form.

There is an important saying in Yogavasiśtā, “I have two forms, ordinary and supreme. The ordinary form of mine is with hands and legs.  

This form of mine is worshiped by ignorant men. The other one is my supreme form, the formless form without a beginning and an end. This form of mine has no qualities or attributes and is called the Brahman, Ātman, Paramātman, etc.”

In this nāma demons or asura-s means avidyā or ignorance. Deva-s means knowledge or vidyā. She helps those who seek knowledge about the Brahman.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 101 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 72

*🌻 72. నాస్తి తేషు జాతి విద్యారూప కుల ధన క్రియాది ఖెదః ॥ 🌻* 

భగవత్రసన్నత్వం కలిగినప్పుడు జాతి వగైరా భెదాలు ఉండవు. జ్ఞాన అజ్ఞానాలు, కుల భేదం, ధనిక, పెద ఖేదం వృత్తి భేదం క్రియా భిదం వంటివి ఉందవ.

ముఖ్యభక్తి కలిగాక ఎటువంటి ద్వంద్వాలు తోచవు. భగవదనుగ్రహం భక్తి న్ధాయిని బట్టి ఉంటుంది గాని, జాతి, కులం వంటి భేదాన్ని బట్ట ఉందదు. 

నందనారు, రవిదాసు, కన్నపు మొదలగు నిమ్న జాతివారు భగవ దనుగ్రహం పొందారు. 

మీరాబాయి, ఆందాళ్‌, అవ్వయ్యారు వంటి స్రీలు భగవనుగ్రహం పొందారు. ప్రథమంలో దురాచారులై, పిమ్మట భక్తులైన వారు కూడా భగవంతుని కృపకు వాత్రులయ్యారు. అజామీళుడు, రత్నాకరుడు (వాల్నీకి), బిళ్వమంగళుడు వీరంతా మొదట దురాచారపరులు. అయినా వారికి భగవంతుని ప్రసన్నత లభించింది. చదువుకోని కబీరు, గురునానక్‌, తుకారాం ప్రభృతులు భక్తి వలన ముక్తులైనారు. రాక్షసులలో ప్రహ్లాద, బలి చక్రవర్తులు మోక్షం పొందారు.

ఎవరైనా సరే భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం, భక్తి ప్రపత్తులు ఉన్నవారు జాతి, మత, లింగ భిదం లేకుండా భగవంతునిచే అనుగ్రహింప బడతారు. భక్తి చేయడానికి గాని, తరించడానికి గాని అందరూ అర్హులే. కాని భక్తి తీవ్రతను బట్టి మాత్రమె భగవంతుని అనుగ్రహం ఉంటుందని గ్రహించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 69 / The Siva-Gita - 69 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

నవమాధ్యాయము
*🌻. శరీర నిరూపణము - 3 🌻*

హృన్నాభీ యేవ మాద్యాస్స్యు - ర్భానా మాత్రు భవా మాతా          
శ్మశ్రురో మక చ స్నాయు - శిరాధ మనయో న ఖాః 12

దశనా స్శుక్ర మిత్యాది స్థిరాః - పితృ సముద్భవాః
శరీరో పచితి ర్వర్ణో వృద్ధి - స్త్రప్తి ర్భలం స్థితి: 13

ఆలోలు పత్వ ముత్సాహా - ఇత్యాదీ న్ ర స జాన్విదు:
ఇచ్చా ద్వేష స్సుఖం దుఃఖం - ధర్మాధ ర్మౌ చ భావనాః     14

ప్రయత్నో జ్ఞాన మాయుశ్చే - ఇంద్రియాణీ యేవ మాత్మజాః
జ్ఞానేంద్రియాణి శ్రవణం - స్సర్శనం దర్శనం తథా 15

రసనం ఘ్రాణ మిత్యాహు - పంచ తేషాం చ గోచరాః
శబ్దం స్పర్వ స్తథా రూపం - ర సో గంధ ఇతి క్రమాత్ 16

వాక్క రాంఘ్రి గుదో పస్థా - న్యాహు: కర్మేంద్రి యాణి హి
వచనాదాన గమన - విసర్గ దతయః క్రమాత్ 17

మీసములు మొదలగు ముఖ వెంట్రుకలు, శరీరమందలి వెంట్రుకలు, తలవెంట్రుకలు, వసారూపముగల ధాతు విశేషములు, నాడులు, పెద్ద నాడులు, గోళ్ళు, ఇంద్రియములు, ముఖస్థిరమైనది తండ్రి నుండి కలుగును. 

శరీరోత్పత్తి లోని స్థూలత్వము, శ్యామలాది వర్ణము, క్రమాభివృద్ధి, తృప్తి, బలము, యధారీతిగా నుండుట, ఆసక్తి లేకుండుట, ఉత్సాహహు మొదలగునవి రసజములని తెలియవలెను.  

అభిలాష - ద్వేషము, సుఖ దుఃఖములు, విధి నిషేదములు, స్మృతికి కారణమగు వస్తువు (భావన) యత్నము, జ్ఞానము, ఆయుస్సమయము, ఇంద్రియములు, ఇవి జీవికర్మానుసార జాతములగుటవలన ఆత్మజములన బడును. శ్రవణాదులు జ్ఞానేంద్రియము లైదు,  

శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు, తన్మాత్రలు, వాక్పాణి పాద పాయోవస్థలు, కరేంద్రియములు, వచనోదానగమన మలత్యాగేంద్రియ సుఖములనునవి తన్మాత్రలు, ఉభాయాత్మకము మసస్సు - మనోబుద్ధి యహంకారములు చిత్తమును అంతఃకరణ చతుష్టయము అని చెప్పబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 69 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 09 :
*🌻 Deha Svarupa Nirnayam - 3 🌻*

Moustaches etc. facial hair, body hair hair on head, metal elements, nerves, nails, sense organs are obtained from the father. 

In the body formation, obesity, dark complexion, progressive growth, satisfaction, strength, detachment, enthusiasm etc are Rasajam. lovehatred, happinesssorrow, prohibited acts, mind, knowledge, motor organs etc. are called Atmajam because these are formed based on the karma of the jiva. 

Ears, five sense organs, sabdha, sparsha, rupa, rasa, gandha, five tanmaatras, vakpanipadapayovastha, karmendriyas, excretary organs, organs of speech, mind, mindegointellect, chitta, antahkarana, are all called as Chatushtyam; among them, smruti (memory), bheeti (fear), vikalpam (idea), happiness and sorrow, acts done by the mind, buddhi, ego, the feeling of mine such qualities which are not known by indriyas are experienced by the help of chittam.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Guru Geeta - Datta Vaakya - 72 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
*Part 66*

Sloka: 
Guruvaktra sthita vidya prapyate tatprasadatah | Tasmattam desikam dhyayet yathatyosit priyam swakam ||

 We gain the knowledge that’s on the Guru’s tongue only by the grace of the Guru. Hence, just as a woman is fixated on her lover, the disciple should always think of the Guru regardless of the task he is engaged in.   

“Vidya” is knowledge. This has to be obtained only through the Guru. Such knowledge is never gained by reading books or listening to discourses or breaking our heads. We should pray to the Guru for His grace. How?  

Just the way a woman is immersed in thoughts of her lover. A new bride may be doing all the chores at home and attending  to relatives dutifully, but her mind is always immersed in thoughts of her husband. 

Her thoughts are not interrupted due to the  tasks she is engaged in. Similarly, one should learn to merge his mind with the Guru, regardless of the tasks he is engaged in. Next, the method to surrender oneself completely to the Guru is described. 

Sloka: 
Swasramam ca swajatim ca swakirtim pustivardhanam | Etat sarvam parityajya gurumeva samasrayet || 

That means, one should leave one’s caste, position, abode, fame, power, strength, wealth etc and seek the Guru’s grace. 

Without the Guru, these things cannot give  any knowledge of the Absolute. Here, in “pustivardhanam”, “pusti” doesn’t just mean strength, it also means wealth. “Vardhanam” is progress.  

“Jati” indicates caste such as Brahman, Kshatriya etc. “Asrama” indicates Brahmacharyam (student life), Grihastasramam (household life) etc. What does giving up all of these mean?  

It means to turn the affection he has for all  these qualifications and possessions towards the Guru. People are always engaged in thoughts of these things…whether they are awake or asleep. If the object of affection is money, then the thoughts are always about money…

“How much has been gained and how much more is left to be gained, which banks should the money be invested in, which pockets should it be placed in, whom to entrust it to for hiding away” and so on. He’s so attached to the money that he won’t even reveal the accounts to his wife and children. He’s worried that they may take away the money. 

Along with attachment, he also has fear that he may get nothing when he gets old if he tells them about his money. He jealously guards the money and keeps procrastinating telling his family, finally forgetting to tell them about it. 

One should let go of all such affections without worrying about consequences. You need to turn all such affection that you placed on your wealth and money towards your Guru. 

That means you should inculcate adherence to Guru and develop the concept that all these wealth and possessions are one dimension, but the Guru is another dimension.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 51 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 1 🌻*

198. మానవుడు తన సంస్కార భారమును, వాటికి భిన్నమైన సంస్కారముల ద్వారా తగ్గించుకొనుటకు శ్రమ పడును. ఈ శ్రమయే పునర్జన్మ క్రమము.

199. మానవ రూపము వరకు ప్రోగుపడిన సంస్కారములు పునరావృత్తి క్రమమందును, ఆధ్యాత్మిక అనుభూతి క్రమమందును భిన్న సంస్కారములచే రద్దగును.

200. సంస్కారములు రద్దగుటకే,పునర్జన్మ క్రమము ఆధ్యాత్మిక మార్గము (అంతర్ముఖ క్రమము) ఒకదాని వెంబడి మరి యొకటిగా, అనుసరించబడుచున్నవి. 

201. తొలి మానవరూపము ద్వారా, జంతుశ్రేణి చివరి జంతువు యొక్క సంస్కారములన్నిటిని ఖర్చుపెట్టిన తరువాత, ఆత్మ యొక్క చైతన్యము తొలి మానవ రూపమును విడిచిపెట్టుట సహజము.

202. చైతన్యము తొలిమానవ రూపము నుండి వియోగం మొందినప్పటికీ, తెలియకనే సాహచర్యమును పొందుచూ సూక్ష్మ- కారణ దేహముల నుండి ఎన్నడూ వియోగమొందుట లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మంత్ర పుష్పం - భావగానం - 2 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మంత్ర పుష్పం 3.*

*విశ్వతః పరమాన్నిత్యమ్*
*విశ్వం నారాయణగ్o హరిమ్*
*విశ్వమే వేదం పురుషస్త*
 *ద్విశ్వ ముపజీవతి*

విశ్వము కన్నా ఉన్నతుడోయి
 అందరిలోనుండు ఆత్మోయి
శాశ్వత పోషకుడు హరోయి
సర్వాత్మడు పరమాత్ముడోయి
ఈ విశ్వ లోకాల కారకుడోయి
ఆ దైవమే విశ్వానికి తోడోయి

*🌻. మంత్రపుష్పం 4.*

*పతిం విశ్వస్యాత్యే శ్వరగ్o*
 *శాశ్వతగ్oశివమచ్యుతమ్*
*నారాయణం మహాజ్ఞ్యేయమ్*
*విశ్వాత్మానం పరాయణం*

*భావగానం:*
పతిలా పోషించువాడు
లోకాలకు ఈశ్వరుడు
శాశ్వితుడు శుభకరుడు
సకల లోక ఉన్నతుడు
సకల జీవ నాయకుడు
అతడు నారాయణుడు
అతడు మహా దేవుడు
లోకమంత ఆత్మ వాడు
పూజింప తగు దేవుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 411 / Bhagavad-Gita - 411 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 19 🌴

19. అనాదిమధ్యాన్తమనన్తవీర్యమ్
అనన్తబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రమ్
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ||

🌷. తాత్పర్యం : 
నీవు ఆదిమధ్యాంత రహితుడవై యున్నావు. నీ వైభవము అపరిమితమై యున్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగియున్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణభగవానుని షడ్గుణైశ్వర్యములకు పరిమితి లేదు. ఈ సందర్భమున మరియు పెక్కు ఇతరచోట్ల పునరుక్తి జరిగియున్నది. కాని శాస్త్రరీత్యా శ్రీకృష్ణుని వైభములను పునరుక్తి సారస్వతలోపము కాదు. సంభ్రమము, ఆశ్చర్యము లేదా పారవశ్యము కలిగినపుడు పదముల పునరుక్తి కలుగుచుండుననియు, అది దోషమేమియును కాదనియు తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 411 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 19 🌴

19. anādi-madhyāntam ananta-vīryam
ananta-bāhuṁ śaśi-sūrya-netram
paśyāmi tvāṁ dīpta-hutāśa-vaktraṁ
sva-tejasā viśvam idaṁ tapantam

🌷 Translation : 
You are without origin, middle or end. Your glory is unlimited. You have numberless arms, and the sun and moon are Your eyes. I see You with blazing fire coming forth from Your mouth, burning this entire universe by Your own radiance.

🌹 Purport :
.There is no limit to the extent of the six opulences of the Supreme Personality of Godhead. Here and in many other places there is repetition, but according to the scriptures, repetition of the glories of Kṛṣṇa is not a literary weakness. It is said that at a time of bewilderment or wonder or of great ecstasy, statements are repeated over and over. That is not a flaw.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 228 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
50. అధ్యాయము - 5

*🌻. సంధ్య యొక్క చరిత్ర - 4 🌻*

బ్రహ్మో వాచ |

వసిష్ఠ పుత్ర గచ్ఛ త్వం సంధ్యాం జాతాం మనస్వినీమ్‌ |తపసే ధృతకామాం చ దీక్షసై#్వనాం యథా విధి || 36

మందాక్షమభవత్తస్యాః పురా దృష్ట్వై వ కాముకాన్‌ | యుష్మాన్మాం చ తథాత్మానం సకామాం మునిసత్తమ || 37

అభూత పూర్వం తత్కర్మ పూర్వం మృత్యుం విమృశ్యసా | యుష్మాకమాత్మనశ్చాపి ప్రాణాన్‌ సంత్యక్తుమిచ్ఛతి || 38

సమర్యాదేషు మర్యాదాం తపసా స్థాపయిష్యతి | తపః కర్తుం గతా సాధ్వీ చంద్ర భాగాఖ్య భూధరే || 39

న భావం తపసస్తాత సానుజానాతి కంచన | తస్మాద్య థోపదేశాత్సా ప్రాప్నోత్విష్టం తథా కురు || 40

బ్రహ్మ ఇట్లు పలికెను -

పుత్రా! వసిష్టా! అభిమానవతియగు నాకుమార్తె సంధ్య వద్దకు నీవు వెళ్లుము. ఆమె తపస్సును చేయగోరు చున్నది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇమ్ము (36). 

ఓ మహర్షీ! నన్ను, మిమ్ములను కామ వికారముతో కూడి యుండగా పూర్వము ఆమె చూచి, తాను కూడ కామ వికారమును పొందుటను గాంచి, చాల సిగ్గుపడెను (37). 

నా యొక్క, మీ యొక్క ఈ ముందెన్నడూ జరుగని, పాప భావనతో చూచుట అనే కర్మను ఆమె తలపోసి, ప్రాణములను వీడ నిశ్చయించుకున్నది (38). 

ఆమె తపస్సుచే లోకములయందు మర్యాదను నెలగొల్ప గలదు. తపస్సును చేయుటకై ఆ సాధ్వి చంద్ర భాగ పర్వతమునకు వెళ్లినది (39).

 వత్సా! ఆమెకు తపస్సు ను గురించి ఏమియూ తెలియదు కావున, నీవు ఆమెకు ఉపదేశించి, ఆమెకు హితము కలుగునట్లు ప్రయత్నించుము (40).

ఇదం రూపం పరిత్యజ్య నిజం రూపాంతరం మునే . పరిగృహ్యాంతికే తస్యాస్తపశ్చర్యాం నిదర్శయన్‌ || 41

ఇదం స్వరూపం భవతో దృష్ట్వా పూర్వం యథాత్ర వామ్‌ | నాప్నుయాత్సాథ కించిద్వై తతో రూపాంతరం కురు || 42

నారదేత్థం వసిష్టో మే సమాజ్ఞప్తో దయావతా |తథాస్త్వితి చ మాం ప్రోచ్య య¸° సంధ్యాంతికం మునిః || 43

తత్ర దేవ సరః పూర్ణం గుణౖర్మానస సంమితమ్‌ | దదర్శ స వసిష్ఠోsథ సంధ్యాం తత్తీరగామపి || 44

ఓ మహర్షీ! ఈ నీ నిజరూపమును వీడి, మరియొక రూపమును స్వీకరించి, ఆమె వద్దకు వెళ్లి, ఆమె చేయు తపస్సును పరిశీలించుము (41). 

ఆమె నిన్ను ఇచట పూర్వము చూచినది. ఇదే రూపములో నిన్ను చూచినచో, ఆమె ఏదేని వికారమును పొందవచ్చును. కావున రూపమును మార్చుము (42). 

ఓ నారదా! నేను ఈ తీరున వసిష్ఠుని దయా బుద్ధితో ఆజ్ఞాపించితిని . ఆయన ' అటులనే యగుగాక' అని నాతో పలికి సంధ్య వద్దకు వెళ్లెను (43). 

ఆ వసిష్ఠ మహర్షి అచట గుణములలో అన్ని విధములా మానససరోవరమును పోలియున్న దేవరస్సును, దాని తీరమునందున్న సంధ్యను చూచెను (44).

తీరస్థయా తయా రేజే తత్సరః కమలోజ్జ్వలమ్‌ | ఉద్యదిందు సునక్షత్రం ప్రదోషే గగనం యథా || 45

మునిర్దృష్ట్వాథ తత్ర సుసంభావం స కౌతుకీ | వీక్షాంచక్రే సరస్తత్ర బృహల్లోహిత సంజ్ఞకమ్‌ || 46

చంద్రభాగా నదీ తస్మా త్ర్పాకారాద్దక్షిణాంబుధిమ్‌ | యాంతీ సా చైవ దదృశే తేన సాను గిరేర్మహత్‌ || 47

నిర్భిద్య పశ్చిమం సా తు చంద్ర భాగస్య సా నదీ | యథా హిమవతో గంగా తథా గచ్ఛతి సాగరమ్‌ || 48

ప్రదోషకాలమునందు ఉదయించే చంద్రునితో నక్షత్రములతో ఆకాశము నిండియున్నట్లు, ఆ సరస్సు తీరమునందున్న ఆమెతో మరియు కమలములతో నిండి ఉజ్జ్వలముగా ప్రకాశించెను (45). 

వసిష్ఠ మహర్షి ఉత్కంఠ గలవాడై గొప్ప నిర్ణయము గల ఆమెనచట దర్శించెను. మరియు అచట బృహల్లోహితమను పేరు గల ఆ సరస్సును చూచెను (46). 

ప్రాకారము వలెనున్న ఆ పర్వతమునుండి దక్షిణ సముద్రము వరకు వ్రవహించుచున్న చంద్రభాగా నదిని ఆయన దర్శించెను. ఆనది ఆ పర్వతము యొక్క గొప్ప సానువును (47)

భేదించుకొని, పశ్చిమము వైపునకు ప్రవహించెను. హిమవత్పర్వతము నుండి సముద్రము వైపునకు పయనించే గంగవలె ఆనది శోభిల్లెను (48).

తస్మిన్‌ గిరౌ చంద్రభాగే బృహల్లోహితతీరగామ్‌ | సంధ్యాం దృష్ట్వాథ పప్రచ్ఛ వసిష్ఠస్సాదరం తదా || 49

అపుడు ఆ చంద్ర భాగ పర్వతమునందు బృహల్లోహితమనే సరస్సు యొక్క తీరము నందున్న సంధ్యను చూచి, వసిష్ఠుడు ఆ దరముతో నిట్లు ప్రశ్నించెను (49).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 104 🌹*
Chapter 36
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Highest became a Sweeper 🌻*

When God takes human form on earth as the Avatar, he acts as the Highest of the High among people. 

But he, the Highest of the High, finds that the world is almost unsuitable to live in. It is full of dirt and filth. People are so afflicted with this unnaturalness that they unnaturally become accustomed to the filth surrounding them; they do nothing to rid themselves or the world of all this filth.  

Humanity is found in an unnatural condition, and the Avatar does not want humanity to remain dirty and the world full of filth. Humanity has become unnatural since it has become one with dirt and filth, and thus it is difficult for the Avatar to clean the human mind and cleanse the world.  

The world is full of dirt, and every human mind is like a room in the world, and so every room is full of dirt. The dirt has settled to become a part of the room, and so each person is unconscious of his own dirt. 

However, if the room is swept with a broom and particles of the dirt rise to form a cloud of dust, one becomes immediately conscious of the dirt that was in the room, and feels suffocated by it.  

When the Avatar came, he found that people had become unconsciously one with  
their own filth. 

He set out to clean each mind by sweeping the dirt of each room. Particles of the dirt rise in the air as dust, the dark cloud over the world, and people feel as if they are suffocating. Humanity thus becomes intensely conscious of its own filth, and all the dirt in the world.  

This suffocation is the present chaos in the world, and the present confusion in the minds of men everywhere. But this suffocation, the chaos and confusion is the result of his work to clean the world. This dirt, now stirred up, starts action and reactions in the world, and they are humanity's reaction to the suffocating cloud.  

When one sweeps a room most of the dirt is thrown out, and only that portion which rises in the air remains. Though the room is comparatively clean, one still finds it difficult to breathe until those particles of dirt settle. 

The Avatar has swept the dirt out of the world, but those particles of dust, which are in the air, have started actions and reactions in each individual, because particles of everyone's dirt have formed a black cloud that everyone feels suffocated by.  

When these particles of dirt have settled and the black cloud gradually disappears, it is the result of the Avatar's having cleaned each individual mind—with the very actions and reactions within everyone's individual mind. 

Humanity will experience peace, and will ask, "Who cleaned the filth out of the world?" The Avatar will reply, "I have cleansed the world by becoming a sweeper. 1 have cleaned every room."  

This cleansing of the human mind of its unnaturalness will be a phase of Meher Baba's worldwide manifestation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 115 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మతంగ మహర్షి - 3 🌻*

18. “నువ్వు కేవలం సామాన్య బ్రాహ్మణుడివిగానే ఉన్నావు. కేవలం ఆదిలోనే ఉన్నావు ప్రస్తుతం. అంతంలో లభించేఫలం కావాలని కోరుకుంటున్నావు. నీలో ఉన్న బ్రాహ్మణత్వంవలన ఏమీ ప్రయోజనంలేదు. బ్రాహ్మణుడిగా పుట్టి జాతిలో ఉండే ధర్మాన్ని నిలబెట్టుకోవటము చాలాకష్టము. 

19. అనేక జన్మలకొక పర్యాయం బ్రాహ్మణజన్మ పొందినా; ధనవాంఛ, విషయలోలత్వం, అహంకారము నూటికి తొంభైతొమ్మిదికిపైగా ఉంది. సదాచారము వదలి బ్రాహ్మణత్వమును మంటగలిపి వంశానికి అపఖ్యాతి తెచ్చినవాళ్ళు చాలామందిఉన్నారు. కాబట్టి నీ ఆశలు అడిఆశలేకాని అన్యములుకావు. ఇకనైనా నీ తపస్సు మానుకుని ఏదయినా వరం కోరుకో!” అన్నాడు ఇంద్రుడు.

20. కులస్వభావం అంటే గుణమే. ఎవరైనా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు, శూద్రౌడు, చండాలుడు, లేఛ్ఛుడు అంటే అది గుణాన్ని గురించే. శరీరానికి కులం ఉంటుందా? లేదు. ఆత్మకూ కులంలేదు. మరి దేనికి కులం అంటే, గుణానికి. 

21. రూఢీగా మహాత్ములు, జ్ఞానులు అందరూ వేలసార్లు మరీమరీ ఈ సత్యాన్ని పురాణాలలో, ఇతిహాసాలలో, బ్రాహమణాలలో, వేదవాఙ్మయంలో చెపుతూవచ్చారు. 

22. బ్రహమపురాణంలో:
కర్మభిః శుచిభిః దేవి శుద్ధాత్మా విజితేంద్రియః|
శూద్రోపి ద్విజవత్ సేవ్యః ఇతి బ్రహ్మా బ్రవీత్ స్వయమ్||

23. అంటే, ఉత్తముడైన శూద్రుడు బ్రాహ్మణునివలెనే సేవించదగినవాడు. గుణమంటే ప్రవృత్తి అనే అర్థం. నీవు బ్రాహ్మణుడివేకాని నీ ప్రవృత్తి రాక్షసవృత్తి, రాక్షసుడివై పుట్టు అని శపిస్తూఉంటారు పురాణాలలో మన ఋషులు. మదించి ఉన్నావు, ఏనుగైపుట్టు; బుద్ధిలేకుండా గడ్డితింటున్నావు, గడ్డితినే పశువువైపుట్టు అని శపించడం మనం చూస్తూ ఉంటాం. 

24. అంటే మనిషే గడ్డితినే పశువై పుడితే, బాగా స్వేఛ్ఛగా తినవచ్చు కదా! అంటే, వాడి గుణానికి తగిన శరీరాన్ని ప్రసాదించి, ఆ ప్రవృత్తిని క్షయంచేయడం అన్నమాట. కొంచెం ఆలోచిస్తే అది అవసరమే అవుతుంది. అంటే యథోచితమైన జన్మను తీసుకోమని చెప్పటం. ‘నీ గుణానికి తగిన జన్మ నీకిస్తాను’ అని చెప్పటమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 34. గీతోపనిషత్తు - చిత్త శుద్ధి - కామ ప్రేరితుడు గాక కర్తవ్య ప్రేరితుడై జీవించుట ఉపాయము. అట్లు జీవించు వానిని ద్వందములంటవు. మనస్సు నిర్మలమగును. అట్టి మనస్సు బుద్ధి యందు స్థిరపడు అర్హతను పొందును. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 66 📚* 

*ప్రజ్ఞ బుద్ధియందు స్థిరపడుటయే బుద్ధియోగము. అట్లు బుద్ధియందు నిలబడవలెనన్నచో మనస్సు నిర్మలము కావలయును. మనస్సు నిర్మలము కావలెనన్నచో ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు తగులుకొని యుండరాదు.* 

నాస్తి బుద్ధి రయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాంతి రశాంతస్య కుతః సుఖమ్ || 66

తగులు కొనక యుండుటకు సాధకుడు ద్వంద్వ భావముల నుండి బయల్పడు వలెను. సృష్టి యందలి ద్వంద్వములు జీవుని బంధించునని తెలుసుకొని ద్వంద్వముల యందు ఉదాసీనుడుగా నుండుట, కర్తవ్యము నందు ఉన్ముఖుడై యుండుట నిరంతరము సాధన సాగవలెను. ఇది యొక్కటియే ఇంద్రియముల యందు చిత్తము తగులు కొనక శుద్ధిగ ఉండుటకు ఉపాయము. మరియొక మార్గము లేదు. 

ద్వంద్వములు మనసున ఉన్నంతకాలము అవి రాగద్వేషములుగ పని చేయుచునే యుండును. అది కారణముగ మనస్సు నందలి ప్రజ్ఞ బుద్ధి లోనికి ఊర్థ్వగతి చెందకపోగా జీవించు వానిని ద్వంద్వము ఇంద్రియములలోనికి అధోగతి చెందగలదు. కావుననే కర్మకు కర్తవ్యమే ప్రధానముగాని కామము కాదు. 

కామ ప్రేరితుడుగాక కర్తవ్య ప్రేరితుడై జీవించుట భగవంతుడందించు చున్న ఉపాయము. అట్లు జీవించు వానిని ద్వందములంటవు. మనస్సు నిర్మలమగును. అట్టి మనస్సు బుద్ధి యందు స్థిరపడు అర్హతను పొందును. 

ఇట్లు రాగద్వేష విముక్తుడు కాని వానికి సుఖశాంతులు ఉండజాలవు. కామము ప్రధానము కాగా ఇంద్రియ ద్వారమున మనస్సు పరిపరి విధముల పరిగెత్తుచు అలసిపోవుటయే గాని సుఖశాంతులెట్లు దొరుక గలవు? 

నిజమునకు సుఖశాంతులను కోరుట కూడ కామమే. కోరినంత మాత్రమున సుఖశాంతులు జీవునకు కలుగవు. వాటికై యత్నించుట కూడ నిష్ప్రయోజనము. వానిని పొందుటకు కోరికను తీవ్రము, తీవ్రతరము చేయుట ఉపాయము కాదు.

 వానిని పొందవలెనన్నచో జీవుడు నిరంతరము తనను కర్తన్య నిర్వహణ నుందు నియమించుకొను చుండవలెను. కర్తవ్య నిర్వహణము చేయువానికి పుట్టలు పుట్టలుగ భావములు జనింపవు. కామ ప్రవృత్తి కర్తవ్య ప్రవృత్తిగ మారును. 

అట్టి కర్తవ్యోన్మోఖునకు కామము లేకుండుట వలన కర్మఫలములపై కూడ ఆసక్తి యుండదు. దీర్ఘ కాలము కర్తవ్యమునే ఆచరించు చుండుటవలన చిత్తశుద్ధి ఏర్పడి సుఖశాంతులు ఆవరించగలవు. మరియొక మార్గము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 180 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 27. All knowledge including the ‘I am’ is formless, throw out the ‘I am’ and stay put in quietude. 🌻*

The root of all knowledge is the ‘I am’, it’s the starting point and it is formless hence all knowledge is formless. 

By repeated efforts revert back to this knowledge ‘I am’, catch hold of it and throw it out. 

The ‘I am’ is slippery and would evade your efforts but persist and stabilize in the silence and stillness that prevails on its departure.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 58 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 22 🌻*

ఈ మనుష్యులు ఆత్మతత్వమును, ఆచార్యుని ఉపదేశమును శ్రద్ధగా విని, శ్రవణ, మనన, నిధి, ధ్యాసల ద్వారా ఈ ఆత్మతత్వమును, ఆత్మనిష్ఠగా ఆత్మవిచారణను ఆత్మనిష్ఠగా, ఆత్మానుభూతిగా మరల్చుకోవాలి అంటే, ఒక ఉపాయమున్నది.

 ఏమిటంటే, సదా ఆచార్యుడు చెప్పినటువంటి ఉపదేశమును శ్రవణ, మనన, నిధి, ధ్యాసలు అనేటటువంటి నాలుగు సాధనలని ఆశ్రయించి, నిరంతరాయముగా, అవస్థాత్రయములో నేను ఆత్మస్వరూపుడను, అనే నిశ్చయమును, నిర్ణయమును కలిగివుండి, నీ శరీరయానమును పూర్తిచేయాలి. శరీరయానము ఇది ఒక ప్రయాణం లాంటిది.

మనం ఒక వాహనంలో ఎక్కామే అనుకోండి? ఆ వాహనాన్ని మనం నడుపుతున్నాం అనుకోండి, ఒక చోటునుంచీ మరొక చోటుకి ప్రయాణం చేస్తున్నామనుకోండి, అయినంత మాత్రమున... ఆ వాహనము నీవు కాదు కదా! రధము నీవు కాదు. రధికుడవు. 

కాబట్టి అట్లా ఆత్మతత్వమును అతిసూక్ష్మముగా వున్నటువంటి దానిని, ఈ శరీరాదికము నుంచీ వేరు పరిచి, నేను రధమును కాదు, నేను రధికుడను, నేను దేహమును కాదు, నేను దేహిని. నేను శరీరమును కాదు, నేను శరీరిని. నేను క్షేత్రమును కాదు, నేను క్షేత్రజ్ఞుడను. 

నేను క్షర పురుషుడను కాదు, అక్షరపురుషుడను. అనేటటువంటి పద్ధతిగా... వేరుపరుచుకోగలగడం రావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అలా వేరుపరుచుకోగలిగే సమర్థతను సంపాదించడమే ‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ అంటే!

     ‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ అంటే ఆకాశం నుంచీ ఏమీ మెరుపులు, పిడుగులు పడవు. నీ నెత్తి మీద అంతకంటే అమృతవృష్ఠి ఏమీ కురవదు. నీవేమీ పైనుంచీ కిందకేమీ పడిపోవు. లేదు కిందనుంచీ పైకి ఉత్థాన పతనాన్ని చెందవు. భౌతికమైన మార్పులేమీ రావు. నీలో ఒక విజ్ఞానపరమైనటువంటి పరిణామం చేత లభిస్తుంది. అదేమిటంటే ‘సర్వసాక్షిత్వము’.

    అటువంటి సర్వ సాక్షిత్వ స్థితికి నువ్వు ఎదుగుతావు. అట్లా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వారు శరీరాదికము నుంచీ వేరుపడినటువంటి వారు.

 అంటే ఎలా అంటే, ఎంత కష్టపడినప్పటికీ, పాము తన శరీరము నుంచీ వేరుపడేటటువంటి కుబుసమును ఎట్లా వదిలి పెడుతున్నది? ఆ ముళ్ళ చెట్లలోకి, ఆ ముళ్ళ తీగల్లోకి వెళ్ళి శరీరమంతా రక్తధారలు ప్రవహిస్తున్నప్పటికీ, కుబుసము నుంచీ వేరు చేసుకుంటుంది. 

అట్లా, పాము కుబుసము వదిలినట్లుగా నీవు నీ శరీర తాదాత్మ్యత భావమును విడువవలెను. అట్లా ఎవరైతే విడుస్తారో, అట్లా ఆత్మను పొందినవారు ఎవరైతే వుంటారో, సర్వదుఃఖముల నుండి విముక్తుడై, బ్రహ్మానందమును అనుభవించును. 

ఏమిటండీ దీని వల్ల ఉపయోగం అనంటే, ‘బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం’ - అనేటటువంటి ప్రార్థన శ్లోకం ఏదైతే చెప్పుకుంటున్నామో, అది యథాతథముగా అనుభూతమై వుంటుంది. అట్లాంటి అనుభవస్థితిలో వుండి, ప్రయాణం చేస్తూ వుంటారు. శరీరం ఎప్పుడు పడిపోయినా సిద్ధముగా వుంటారు. 

అటువంటి సిద్ధత్వాన్ని, బుద్ధత్వాన్ని పొందుతారు. కాబట్టి ఇలాంటిదానికి అధికారిత్వాన్ని పొందినటువంటి నచికేతుడుకి మోక్షద్వారము తెరువబడి వుండడంలో విశేషమేముంది? కాబట్టి, నచికేతుడికి మోక్షము సులభముగా లభిస్తుందనేటటువంటి సత్యాన్ని యమధర్మరాజు చెప్తున్నాడు. ఎందువల్ల అంటే అతడు అధికారి కాబట్టి.

    యమధర్మరాజు ఇంతవరకూ చెప్పిన విషయములు విని నచికేతుడు తనలోతాను ఇట్లు అనుకొనెను. అశాశ్వతమైన సాధన ద్వారా శాశ్వత పదవిని పొందజాలమని చెప్పుచునే నాచికేతాగ్ని చయనము చేత తాను ఈ నిత్య పదవిని పొందితినని చెప్పుచున్నాడు. 

మరల ఈ ఆత్మ అతి సూక్ష్మమైనదని, సులభముగా పొందదగినది కాదని, ఇంద్రియ నిగ్రహము ద్వారా యోగము అభ్యసించిన వారు తెలిసికొన గలరని చెప్పుచున్నాడు. నీ వంటి వారే దీనికి అర్హులని మధ్యలో నన్ను ప్రశంసించుచున్నాడు. అసలు విషయము చెప్పకుండా దాటవేయునేమోయని సంశయించి నచికేతుడు యమధర్మరాజు నిట్లడుగుచున్నాడు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 35🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
*🌻 12. DNA సంక్రియ 🌻*
*DNA ని సంక్రియం చేయటం వలన వచ్చే ఫలితాలు:*

💫. మన శరీరంలో 100 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. ప్రతి క్షణంలో DNA ప్రోగులు ఉంటాయి. DNA లో 30,000 చురుకుగా పనిచేసే జీన్స్ ఉన్నాయి. ప్రతి జన్యువుకు నిర్దిష్ట చర్య ఉంటుంది. చర్మం, కన్ను, జుట్టు, ఎత్తు, రంగు, వేలిముద్రలు మొదలైనవి ఎన్నో విభాగాలలో ఈ జన్యువుల పాత్ర ఉంటుంది.

DNAలో... కోడాన్, లైట్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఈ *"లైట్ కోడ్స్"* ని యాక్టివేట్ చేయడం వలన మన శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శరీరాలలో ఎన్నో మార్పులు చెందించి, ఆకాశిక్ రికార్డ్ సరిచేయబడి నూతన దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.

🌟 *1.DNA యాక్టివేషన్ తో శరీరానికి వచ్చే లాభాలు/ ప్రయోజనాలు:-*

✨. మెరుగైన జీవక్రియను పెంచి, శక్తిని అభివృద్ధి పరిచి, మెటబాలిక్ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

✨ మనం తీసుకున్న ఆహారంలో సహజమైన కొవ్వు ఎంత అవసరమో దానినే గ్రహిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది; శారీరక సమతుల్యతను ఏర్పరుస్తుంది.

✨. శరీరానికి నీటి నిల్వ అయిన 70% వాటర్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

✨ ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. కానీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

✨. శరీరంలో సరికాని విషాలను తొలగించి శరీరాన్ని మెరిసేలా చేస్తుంది.

✨. డైజెస్టివ్ సిస్టమ్ (జీర్ణక్రియ)ను మెరుగు పరుస్తుంది.

✨. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

✨. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది.

✨. కణాలు త్వరగా హిల్ చేయబడతాయి. కణానికీ, కణానికీ మధ్య కమ్యూనికేషన్ ఏర్పడి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

🌟. *2. భావోద్వేగ మానసిక ప్రయోజనాలు:-*

✨. మానసిక స్పష్టత, ప్రశాంతత ఏర్పడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. (పూర్వజ్ఞానం కూడా జ్ఞాపకం వస్తుంది)

✨. స్వీయ ప్రేమ లభిస్తుంది. మనలో కరుణ, ప్రేమ, కృతజ్ఞత, సహకారం, ప్రశంసలు అనే గొప్ప లక్షణాలు మేల్కొంటాయి.

✨. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.

✨. విజన్స్ ద్వారా, అంతర్ దృష్టి ద్వారా మార్గదర్శకత్వం దొరుకుతుంది.

✨. జీవితంపై స్పష్టత వస్తుంది.

✨. పాత సెల్యూలర్ మెమొరీ తుడిచి పెట్టబడుతుంది.

✨. హైయ్యర్ సెల్ఫ్ నుండి ప్రేమానుభూతి, శ్రేయస్సు యొక్క భావన, ప్రయోజనం, భద్రత, ఏకత్వం లభిస్తాయి.

✨. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెరుగు పరచబడుతుంది.

🌟 *3. ఆధ్యాత్మిక ప్రయోజనాలు:-*

✨. ఉన్నత చైతన్యం నుండి కనెక్షన్ ఏర్పడుతుంది. చైతన్యం యొక్క ప్రేమ, జ్ఞానం, శక్తి, యూనివర్సల్ ట్రూత్ ని తెలుసుకుంటూ మనం కూడా ఉన్నత చైతన్య స్థాయికి ఎదుగుతాం.

✨. పదార్థం నుండి పరమార్థం వరకు ఎదుగుతాం. ఆధ్యాత్మిక పరిపూర్ణ జీవితాన్ని జీవిస్తాం.

✨. లా ఆఫ్ అండర్ స్టాండింగ్ ద్వారా ఆత్మ సామర్థ్యమైన చైతన్యాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటాం.

✨. మన యొక్క ఆత్మ బహుమతులు మేల్కొంటాయి. దివ్యనేత్రం, దివ్యశ్రవణం, దివ్యభాషణం, దివ్యస్పర్శ, సూక్ష్మశరీరయానం, ఛానెలింగ్, మీడియమ్ షిప్, లెవిటేషన్, బైలొకేషన్ మొదలైన ఎన్నో దివ్యశక్తులు మేల్కొంటాయి.

✨. గెలాక్సీ/ మల్టీగెలాక్సీ/ యూనివర్స్/ మల్టీ యూనివర్స్ స్థాయిలోకి ఎదుగుతాం. హైయ్యర్ సెల్ఫ్ గా భూమి మీదే మన శక్తిని ప్రకటిస్తాం.

✨. అన్ని లోకాలలో కో- క్రియేటర్ గా మనకు గుర్తింపు లభిస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*అద్భుత సృష్టి ప్రింటెడ్ పుస్తకం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:*
9396267139, 9652938737, 7730012579

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 17 / Sri Vishnu Sahasra Namavali - 17 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*వృషభరాశి- మృగశిర నక్షత్ర 1వ పాద శ్లోకం*

*17. ఉపెన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|*
*అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః||*

151) ఉపేంద్రః - 
ఇంద్రునకు అధిపతి, ఇంద్రియములకు లొంగనివాడు. 

152) వామనః - 
ఎంతో చక్కని, చిన్నని రూపమున అవతరించినవాడు.

153) ప్రాంశుః - 
ఎంతో విస్తారమైన దేహంతో త్రివిక్రముడై ముల్లోకములను ఆక్రమించినవాడు.

154) అమోఘః - 
ఆశ్చర్యపరిచే, కారణయుక్తమైన పనులు చేసెడివాడు.

155) శుచిః - 
ఎటువంటి మాలిన్యములు అంటనివాడు, జీవులను పవిత్రులుగా చేయువాడు.

156) ఊర్జితః - 
అత్యంత శక్తి సంపన్నుడు. 

157) అతీంద్రః - 
ఇంద్రియముల కంటే అధికుడు, మనసు కంటే శ్రేష్ఠుడు.

158) సంగ్రహః - 
సర్యమును తన అధీనములో నుంచుకొన్నవాడు. 

159) సర్గః - 
తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృష్టించుకొనువాడు.

160) ధృతాత్మా - 
అన్ని ఆత్మలకు (జీవులకు) ఆధారమైనవాడు. 

161) నియమః - 
నియమాలను ఏర్పరచి, వాటిని నియంత్రించి, సకలమును నడుపువాడు. 

162) యమః - 
సమస్తమును వశము చేసుకొన్నవాడు, జీవుల హృదయమందు వశించువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 17 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Vrushabha Rasi, Mrugasira 1st Padam*

*17. upendrō vāmanaḥ prāṁśuramōghaḥ śucirūrjitaḥ |*
*atīndraḥ saṅgrahaḥ sargō dhṛtātmā niyamō yama || 17 ||*