రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 4 🌻
బ్రహ్మో వాచ |
వసిష్ఠ పుత్ర గచ్ఛ త్వం సంధ్యాం జాతాం మనస్వినీమ్ |తపసే ధృతకామాం చ దీక్షసై#్వనాం యథా విధి || 36
మందాక్షమభవత్తస్యాః పురా దృష్ట్వై వ కాముకాన్ | యుష్మాన్మాం చ తథాత్మానం సకామాం మునిసత్తమ || 37
అభూత పూర్వం తత్కర్మ పూర్వం మృత్యుం విమృశ్యసా | యుష్మాకమాత్మనశ్చాపి ప్రాణాన్ సంత్యక్తుమిచ్ఛతి || 38
సమర్యాదేషు మర్యాదాం తపసా స్థాపయిష్యతి | తపః కర్తుం గతా సాధ్వీ చంద్ర భాగాఖ్య భూధరే || 39
న భావం తపసస్తాత సానుజానాతి కంచన | తస్మాద్య థోపదేశాత్సా ప్రాప్నోత్విష్టం తథా కురు || 40
బ్రహ్మ ఇట్లు పలికెను -
పుత్రా! వసిష్టా! అభిమానవతియగు నాకుమార్తె సంధ్య వద్దకు నీవు వెళ్లుము. ఆమె తపస్సును చేయగోరు చున్నది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇమ్ము (36).
ఓ మహర్షీ! నన్ను, మిమ్ములను కామ వికారముతో కూడి యుండగా పూర్వము ఆమె చూచి, తాను కూడ కామ వికారమును పొందుటను గాంచి, చాల సిగ్గుపడెను (37).
నా యొక్క, మీ యొక్క ఈ ముందెన్నడూ జరుగని, పాప భావనతో చూచుట అనే కర్మను ఆమె తలపోసి, ప్రాణములను వీడ నిశ్చయించుకున్నది (38).
ఆమె తపస్సుచే లోకములయందు మర్యాదను నెలగొల్ప గలదు. తపస్సును చేయుటకై ఆ సాధ్వి చంద్ర భాగ పర్వతమునకు వెళ్లినది (39).
వత్సా! ఆమెకు తపస్సు ను గురించి ఏమియూ తెలియదు కావున, నీవు ఆమెకు ఉపదేశించి, ఆమెకు హితము కలుగునట్లు ప్రయత్నించుము (40).
ఇదం రూపం పరిత్యజ్య నిజం రూపాంతరం మునే . పరిగృహ్యాంతికే తస్యాస్తపశ్చర్యాం నిదర్శయన్ || 41
ఇదం స్వరూపం భవతో దృష్ట్వా పూర్వం యథాత్ర వామ్ | నాప్నుయాత్సాథ కించిద్వై తతో రూపాంతరం కురు || 42
నారదేత్థం వసిష్టో మే సమాజ్ఞప్తో దయావతా |తథాస్త్వితి చ మాం ప్రోచ్య య¸° సంధ్యాంతికం మునిః || 43
తత్ర దేవ సరః పూర్ణం గుణౖర్మానస సంమితమ్ | దదర్శ స వసిష్ఠోsథ సంధ్యాం తత్తీరగామపి || 44
ఓ మహర్షీ! ఈ నీ నిజరూపమును వీడి, మరియొక రూపమును స్వీకరించి, ఆమె వద్దకు వెళ్లి, ఆమె చేయు తపస్సును పరిశీలించుము (41).
ఆమె నిన్ను ఇచట పూర్వము చూచినది. ఇదే రూపములో నిన్ను చూచినచో, ఆమె ఏదేని వికారమును పొందవచ్చును. కావున రూపమును మార్చుము (42).
ఓ నారదా! నేను ఈ తీరున వసిష్ఠుని దయా బుద్ధితో ఆజ్ఞాపించితిని . ఆయన ' అటులనే యగుగాక' అని నాతో పలికి సంధ్య వద్దకు వెళ్లెను (43).
ఆ వసిష్ఠ మహర్షి అచట గుణములలో అన్ని విధములా మానససరోవరమును పోలియున్న దేవరస్సును, దాని తీరమునందున్న సంధ్యను చూచెను (44).
తీరస్థయా తయా రేజే తత్సరః కమలోజ్జ్వలమ్ | ఉద్యదిందు సునక్షత్రం ప్రదోషే గగనం యథా || 45
మునిర్దృష్ట్వాథ తత్ర సుసంభావం స కౌతుకీ | వీక్షాంచక్రే సరస్తత్ర బృహల్లోహిత సంజ్ఞకమ్ || 46
చంద్రభాగా నదీ తస్మా త్ర్పాకారాద్దక్షిణాంబుధిమ్ | యాంతీ సా చైవ దదృశే తేన సాను గిరేర్మహత్ || 47
నిర్భిద్య పశ్చిమం సా తు చంద్ర భాగస్య సా నదీ | యథా హిమవతో గంగా తథా గచ్ఛతి సాగరమ్ || 48
ప్రదోషకాలమునందు ఉదయించే చంద్రునితో నక్షత్రములతో ఆకాశము నిండియున్నట్లు, ఆ సరస్సు తీరమునందున్న ఆమెతో మరియు కమలములతో నిండి ఉజ్జ్వలముగా ప్రకాశించెను (45).
వసిష్ఠ మహర్షి ఉత్కంఠ గలవాడై గొప్ప నిర్ణయము గల ఆమెనచట దర్శించెను. మరియు అచట బృహల్లోహితమను పేరు గల ఆ సరస్సును చూచెను (46).
ప్రాకారము వలెనున్న ఆ పర్వతమునుండి దక్షిణ సముద్రము వరకు వ్రవహించుచున్న చంద్రభాగా నదిని ఆయన దర్శించెను. ఆనది ఆ పర్వతము యొక్క గొప్ప సానువును (47)
భేదించుకొని, పశ్చిమము వైపునకు ప్రవహించెను. హిమవత్పర్వతము నుండి సముద్రము వైపునకు పయనించే గంగవలె ఆనది శోభిల్లెను (48).
తస్మిన్ గిరౌ చంద్రభాగే బృహల్లోహితతీరగామ్ | సంధ్యాం దృష్ట్వాథ పప్రచ్ఛ వసిష్ఠస్సాదరం తదా || 49
అపుడు ఆ చంద్ర భాగ పర్వతమునందు బృహల్లోహితమనే సరస్సు యొక్క తీరము నందున్న సంధ్యను చూచి, వసిష్ఠుడు ఆ దరముతో నిట్లు ప్రశ్నించెను (49).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
21 Sep 2020
No comments:
Post a Comment