భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 51


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 51  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 1 🌻

198. మానవుడు తన సంస్కార భారమును, వాటికి భిన్నమైన సంస్కారముల ద్వారా తగ్గించుకొనుటకు శ్రమ పడును. ఈ శ్రమయే పునర్జన్మ క్రమము.

199. మానవ రూపము వరకు ప్రోగుపడిన సంస్కారములు పునరావృత్తి క్రమమందును, ఆధ్యాత్మిక అనుభూతి క్రమమందును భిన్న సంస్కారములచే రద్దగును.

200. సంస్కారములు రద్దగుటకే,పునర్జన్మ క్రమము ఆధ్యాత్మిక మార్గము (అంతర్ముఖ క్రమము) ఒకదాని వెంబడి మరి యొకటిగా, అనుసరించబడుచున్నవి.

201. తొలి మానవరూపము ద్వారా, జంతుశ్రేణి చివరి జంతువు యొక్క సంస్కారములన్నిటిని ఖర్చుపెట్టిన తరువాత, ఆత్మ యొక్క చైతన్యము తొలి మానవ రూపమును విడిచిపెట్టుట సహజము.

202. చైతన్యము తొలిమానవ రూపము నుండి వియోగం మొందినప్పటికీ, తెలియకనే సాహచర్యమును పొందుచూ సూక్ష్మ- కారణ దేహముల నుండి ఎన్నడూ వియోగమొందుట లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

21 Sep 2020

No comments:

Post a Comment