శ్రీ విష్ణు సహస్ర నామములు -37 / Sri Vishnu Sahasra Namavali - 37

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు -37 / Sri Vishnu Sahasra Namavali - 37 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

సింహ రాశి- మఖ నక్షత్ర 1వ పాద శ్లోకం

🌻 37. అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః।
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః॥ 🌻

అర్ధము :

🍀. అశోకః -
శోకము లేనివాడు, నిత్యానంద స్వరూపుడు.

🍀. తారణః -
దాటించువాడు, సంసారమనే సాగరాన్ని సునాయాసంగా దాటించువాడు.

🍀. తారః -
తరింపజేయువాడు, సంసార బంధములనుండి విముక్తిని ప్రసాదించువాడు.

🍀. శూరః -
పరాక్రమశాలి, మనస్సు, బుద్ధి, అహంకారములను జయించినవాడు.

🍀. శౌరిః -
సౌర్యముతో రజో, తమో గుణములను అణచివేయువాడు,

🍀. జనేశ్వరః -
జనులకు ప్రభువు, జీవులను రక్షించువాడు.

🍀. అనుకూలః - 
అనుకూలమైనవాడు, జ్ఞాన సముపార్జనకు సహకరించువాడు.

🍀. శతావర్తః -
జీవరూపంలో నిరాటకంగా ఆవిర్భవించువాడు.

🍀. పద్మీ -
పద్మమును (ఆనందమును, జ్ఞానమును) ధరించినవాడు,

🍀. పద్మనిభేక్షణః -
పద్మము వంటి కన్నులుగలవాడు, కృపాకటాక్షవీక్షణలు కురిపించువాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Vishnu Sahasra Namavali - 37   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Simha Rasi, Makha 1st Padam

🌻 37. aśōkastāraṇastāraḥ śūraḥ śaurirjaneśvaraḥ |
anukūlaḥ śatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ || 37 ||

🌻 Aśokaḥ:
One without the six defects - sorrow, infatuation, hunger, thirst, birth and death.

🌻 Tāraṇaḥ:
One who uplifts beings from the ocean of samsara.

🌻 Tāraḥ:
One who liberates beings from the fear of residence in the womb, birth, old age, death etc.

🌻 Śūraḥ:
One of great prowess, that is, who fulfils the four supreme satisfactions of life – Dharma, Artha, Kama and Moksha.

🌻 Śauriḥ:
One who as Krishna as the son of Sura, that is Vasudeva.

🌻 Janeśvaraḥ:
The Lord of all beings.

🌻 Anukūlaḥ:
One who, being the Atman of all beings, is favorable to all, for no one will act against oneself.

🌻 Śatāvartaḥ:
One who has had several Avataras or incarnations.

🌻 Padmī:
One having Padma or lotus in his hands.

🌻 Padma-nibhekṣaṇaḥ:
One with eyes resembling lotus.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

13 Oct 2020

అద్భుత సృష్టి - 54

🌹. అద్భుత సృష్టి - 54 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 4 🌻

🌟. 7వ లెవెల్:-

హృదయ చక్రం తెరవబడి భావోద్వేగాల విషయంలో దృష్టిని సాధించడం జరుగుతుంది. పాత భావాలు భావోద్వేగాలను మరింతగా రిలీజ్ చేస్తూ ఉంటాం.(ఇది మరింతగా భావోద్వేగాల మార్పు సమయం అని చెప్పవచ్చు.)ప్రతి పని కూడా పిల్లల్లాగా స్వచ్ఛమైన మనస్సుతో చేయడం జరుగుతుంది. వాస్తవంలో జీవించడం జరుగుతుంది.

✨. మనం ప్రతి చిన్న ఫీలింగ్ ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం. ప్రతి క్షణంలో మరింత అనుభూతిని చెందుతూ ఉంటాం. పాత సంబంధాలు దూరమౌతూ ఉంటాయి.

✨. చాతి నొప్పి మరింత సహజంగా అనిపిస్తుంది.

దీనికి కారణం గుండె శక్తిక్షేత్రాలు(హృదయ చక్రం) మరింతగా తెరవబడి విశ్వమూలశక్తితో అనుసంధానం అవుతుంటాయి.(ఇక్కడ చక్రా మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది)

✨. హృదయంలో నిక్షిప్తమై ఉన్న భయాలు తొలగించబడతాయి. శరీరాలు, శక్తిక్షేత్రాలు సమలేఖనంలోనికి తీసుకునిరాబడతాయి.

✨. పీనియల్ మరి పిట్యూటరీ గ్రంథులు మరింతగా తెరవబడతాయి. వీటిలో ఉన్న శక్తులు జాగృతి అవుతూ వృద్ధాప్యాన్నీ, మరణాన్నీ శరీరానికి దూరం చేస్తూ ఉంటాయి. నుదురుచక్రం, తల వెనుక చక్రంలో అధిక ఒత్తిడి కలిగి తలనొప్పి విపరీతంగా అనిపిస్తుంది.

✨. పీనియల్ గ్రంథి మరింతగా ఓపెన్ అయ్యి అది మల్టీడైమెన్షనల్ గా ఎదుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ద్వంద్వత్వం మరింతగా బయటకు కనిపిస్తూ ఉంటుంది.

✨. ఈ సమయంలో కొన్ని రోజులు "ఆనందంతో ఉన్నాం" అనిపిస్తుంది. మరి కొన్ని రోజులు భయంతో గడుపుతూ ఉంటాం.

✨. ఆత్మతో అనుసంధానం పెరుగుతుంది. దీనివలన మనం మరింతగా అధిరోహణ పొందుతూ ఉంటాం. ఈ తరుణంలో భూమిని విడిచి హైయ్యర్ సెల్ఫ్ తో కలిసిపోవాలనిపిస్తూ ఉంటుంది.

✨. ఆనందాన్ని నేర్చుకుంటూ అనుభవిస్తూ ఉంటాం. ఈ స్థితిని గ్రహంపై ఉన్న అందరికీ అనుభవంలోకి తీసుకొని రావాలి అని అనిపిస్తూ ఉంటుంది. దాని కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాం.

✨. ఈ పురోగమన దశ వల్ల మనం తీసుకునే ఆహారంలో మరింత మార్పులు సంభవిస్తాయి. శరీరం సాత్విక ఆహారాన్నే కోరుకుంటుంది.

మాంసం, మద్యం, చక్కెర కెమికల్ ఫుడ్ శరీరానికి హాని కలిగిస్తూ శరీరాన్ని అసెన్షన్ వైపుకు వెళ్ళకుండా చేస్తుంది.

✨. 8వ లెవెల్:-

ఈ స్థితిలో అందరిలో మనం మాస్టరీని చూస్తాం. మరింతగా గ్రహానికి సేవ చేయాలని ఉన్నతంగా కోరుకుంటూ ఉంటాం. ప్రాపంచకంగా శ్రమపడి సంపాదించాలి అనే తత్వాన్ని వదిలివేస్తాం.

✨. పీనియల్ పిట్యుటరీ గ్రంథులు ఇంకా మరింతగా మారుతూ ఉంటాయి. దీని కారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. మనతో ఉన్న లైట్ బీయింగ్స్ ని తలలో ఉన్న ఎండార్ఫిన్ విడుదల చేసి మనకు మరింత రిలీఫ్ ని కలిగించమని అడుగుదాం!

✨. మెదడు సంక్రియం చేయబడుతూ ఉంటుంది. ముఖ్యంగా సరెబ్రమ్( దీనిని స్లీపింగ్ జాయింట్ అంటారు) విస్తరణ జరుగుతుంది. నుదురులో త్రిభుజాకార సీడ్ స్పటికాలు మరి మెదడు యొక్క కుడివైపున ఉన్న రికార్డర్ స్పటికాలు మరి 8,9,10 చక్రాలు ఆక్టివేట్ చేయబడతాయి.

✨. మనలో జరిగే మార్పులను గురించి చెప్పటానికి మాటలను వెతుక్కోవలసి ఉంటుంది. మరింత గందరగోళంగా ఉంటుంది. మనలో జరుగుతున్న మార్పులను డీ-కోడ్ చేయమని మన చక్రా మాస్టర్స్ ని అడుగుదాం!

✨. ఈ స్థితిలో చాలా గ్రేడింగ్ అవసరమవుతుంది. స్వచ్ఛమైన గాలి, ఆహారం, అధిక ప్రాణశక్తిని గ్రహిస్తూ మరింతగా మెరుగుపడుతూ ఉంటాం. ధ్యానం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది.

✨. ఈథర్ నుండి సంపూర్ణ ఆరోగ్యం పొందుతూ ఉంటాం.

పీనియల్ గ్రంథి సైజు పెరగడం వలన రెండు కనుబొమ్మల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. దివ్య నేత్రం యాక్టివేషన్ లోకి వస్తుంది. పిట్యూటరీ గ్రంధి సైజు పెరగడం వలన తల వెనుక భాగంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. వీటి ద్వారా మనం ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్నీ ఆత్మ యొక్క నిర్ణయాలు అందుకోవడం ప్రారంభిస్తాం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

13 Oct 2020

గీతోపనిషత్తు - 52

🌹. గీతోపనిషత్తు - 52 🌹

🍀   12. పెద్దలు - ప్రమాణములు - తమను అనుకరించు వారు ఎవరికైతే యుందురో వారికి కర్మ నిర్వహణము నందు ఒక అదనపు బాధ్యత ఏర్పడును. అదికారణముగ గుర్తింపు పొందిన పెద్దవారి కర్మనిర్వహణ విధానము ప్రమాణముగ నుండవలెను   🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚.   కర్మయోగము - 21, 22, 23, 24   📚

21. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 21 ||

22. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 22 ||

23. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 23 ||

24. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః || 24 ||

యద్యదాచరతి శ్రేష్ఠ :

లోకమున పెద్దలు ఏమి చేయుచున్నారో గమనించి ఇతరులు కూడ వారి ననుకరింతురు. అందువలన పెద్దవారుగా గమనింపబడువారికి కర్మ నిర్వహణమున ఎక్కువ బాధ్యత గలదు.

తమను అనుకరించు వారు ఎవరికైతే యుందురో వారికి కర్మ నిర్వహణము నందు ఒక అదనపు బాధ్యత ఏర్పడును. తల్లిదండ్రులను పిల్లలు అనుకరింతురు. ఉపాధ్యాయులను విద్యార్థులనుకరింతురు. గురువులను శిష్యులనుకరింతురు. వివిధ రంగములలో ఉత్తమ శ్రేణికి చెందినవారిని ఆయా రంగములలో పనిచేయువా రనుకరింతురు.

అందువలన అనుకరింపబడు వారికి అనుకరించు వారి యెడల బాధ్యత యున్నది. అదికారణముగ గుర్తింపు పొందిన పెద్ద వారు వారి కర్మనిర్వహణ విధానము ప్రమాణముగ నుండవలెను.

అనుకరించువారు అనునిత్యము తాము ప్రమాణముగ నేర్పరచుకున్న పెద్దవారిని అనుసరింతురు. వారు పొగత్రాగినచో వీరును త్రాగుదురు. వారికి అపరిశుభ్రపు అలవాట్లు ఉన్నచో వీరును అట్లే యుందురు. వారసత్యము లాడినచో వీరును ఆడుదురు. వారు బాధ్యతా రహితముగ ప్రవర్తించినచో, వీరును అట్లే చేయుదురు. వారేమి చేసిన వీరును అట్లే చేయుటకు ప్రయత్నింతురు. అందువలన ప్రత్యేకముగ వారి కవసరము లేకపోయినప్పటికిని, చిన్నవారి మేలుకోరి పెద్దవారు కొన్ని కొన్ని విషయములలో మార్గదర్శకులై ప్రవర్తించవలసి యుండును.

నిజమునకు శ్రీకృష్ణునకు సాందీపని యొద్ద చేరి విద్య నభ్యసించు అవసరము లేదు. అయినను ఇతరుల శ్రేయస్సు కోరి అట్లాచరించెను. వివాహముతో పనిలేదు. అయినను సంఘ మర్యాదలు పాటించి వివాహమాడి సంతతిని కనెను. యుద్ధము చేయవలసిన పని అసలేలేదు. అయినను క్షత్రియ జన్మ మెత్తుట వలన యుద్ధమునందు పాల్గొనెను. శ్రీరాముని జీవితము గూడ చాల విషయములలో అట్లే నిర్వర్తింపబడినది.

శ్రీరాముని ఆదర్శముగ గొనిన భారతీయులు సర్వసామాన్యముగ ఏకపత్నీ వ్రతమును ఆచరించుదురు. భారతీయ సంప్రదాయమున నేటికిని ఈ భావము అధికముగ అనుసరింపబడు చున్నది. ఒక స్త్రీ కి ఒక పురుషుడు. ఒక పురుషునకు ఒక స్త్రీ. ఈ సంప్రదాయము కేవలము భరతభూమియందే ఇంకను నిలచియున్నది. భరత సంప్రదాయమునకు వెన్నెముకగ నిలచిన ఋషులందరును ముక్తసంగులే. వారికీ ప్రపంచమున ఏమియును అవసరము లేదు. పంచభూతములు వారి వశమై యుండును.

అయినప్పటికిన్ని ఇతర జీవులకు ప్రామాణికముగ నుండవలెనను బాధ్యతాయుత భావముతో వారు వివాహ మాడిరి. గృహస్థు జీవితమును నిర్వర్తించి చూపిరి. సంఘమున ఉద్యోగ వృత్తి వ్యాపారములను కూడ నిర్వర్తించిరి. అట్లు కానిచో సంఘధర్మము దెబ్బతినును. ఈ యంశము ననుసరించియే ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలగు మహాత్ములను గూడ భరతధర్మము పరిపూర్ణ మానవునిగ పరిగణించలేదు.

ఈ మహాత్ములను అనుకరించువారు కూడ వారివలె వివాహమాడక, కోరికలను అణగదొక్కుకొని సతమత మగుచున్నారు. పశ్చిమ దేశములలో మతాధికారులు లైంగిక చర్యలకు పాటుపడుచు నేరగ్రస్తులగుట ఆధునిక కాలమున గమనించబడుచునే యున్నది. గదా! సాధారణ మానవులను మనస్సులో నుంచుకొని వారికి అనుకరణీయముగ నుండు శ్రేష్ఠమగు మార్గమును పెద్దలు నిర్వర్తించుట శ్రీకృష్ణుని కర్మ సిద్ధాంతమున మరియొక ముఖ్య లక్షణము.

ప్రస్తుత కాలమున దేశనాయకులు, మతాధికారులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, వైద్యులు, అగ్రశ్రేణి వ్యాపారస్తులు, అధికారులు పనిచేయు విధానము బాధ్యతారహితముగ యున్నది. అదికారణముగనే జనబాహుళ్యము గూడ బాధ్యత తప్పినది. క్రమ శిక్షణ తరిగినది. శ్రద్ధ లోపించినది. బాధ్యతలయందు పోటీ పడుటగా కాక హక్కులయందు పోటీపడు మ్లేచ్చ ధర్మము భరత భూమిని కూడ కబళించినది. ఇట్టి స్థితికి పెద్దలే కర్తలు. పెద్దలే బాధ్యులు. వీరు జనులను చెడగొట్టిన వారగుచున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

13 Oct 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 135

🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 135   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 9 🌻

69. అప్పుడు బ్రహ్మ కొంచెం కోపాడ్డాడు,”నేను నిన్ను సృష్టించాను. నీకు ఆజ్ఞ ఇస్తే నన్ను కాదంటావా? వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు. నిన్ను శిక్షించగలను జాగ్రత్త!” అన్నాడు. “తండ్రీ! సారహీనమైన, ఘోరమైన దుఃఖం పాలుజేసే సంసారంలో నన్ను పడేస్తానన్నావు కదా! నీ ఆజ్ఞాపాలన అంటే అదే కదా! అలాచేయకపోతే శిక్షిస్తావు.

70. అంతకన్నా శిక్ష ఇంకా ఏముంటుంది? కబట్టినువ్వు ఇంతకంటే ఇంక ఏం శిక్షించగలవో చూస్స్తాను నేను!” అన్నాడు నారదుడు. “కాబట్టి శాపగ్రస్తుణ్ణి చేసినా, నువ్వు ఏం చేసినా సంతోషమే, చెయ్యి!” అన్నాడు. బ్రహ్మకు కోపం వచ్చింది. “నువ్వు విధేయుడివిగా ఉన్నావు. నేను ఒప్పుకోను.

71. పోనీ నిన్ను సనకసనందాదులవలే వదిలేస్తే, నా కార్యమెలా నెరవేరుతుంది? ఇప్పుడు నీలో ఉండేటటువంటి వైరాగ్యప్రవృత్తిని నేను హరిస్తాను. నీలో అవిద్యను ప్రవేశపెడతాను. అది నా చేతిలో ఉంది” అని అతడిలో అవిద్యను ప్రవేశపెట్టి, “సంగీతం ఒకటి తీసుకున్నావుకదా! ఈ సంగీతవిద్యను గంధర్వులుకూడా భవిష్యత్తులో వాళ్ళవృత్తిగా తీసుకుంటారు. సంగీతము, నాట్యము మొదలైన గంధర్వ విద్యలు.

72. గంధర్వ లోకంలో వాళ్ళకు అదే వృత్తి, ప్రవృత్తి. వాటినే ఆశ్రయించుకుని ఈశ్వరారాధన చేస్తారు. సుఖంగా ఉంటారు. ఈశ్వరారాధన చేసినా వాళ్ళకు భక్తి, జ్ఞానము, అంతర్ముఖత్వము ఉండదు. సంగీతం ద్వారానే ఈశ్వరుడిని ఆరాధిస్తారు. వారివలనే నీ తత్త్వజ్ఞానాన్ని విస్మరించి నువ్వుకూడా గంధర్వుడివై, స్త్రీలోలుడివై అప్పుడు నా సంకల్పం నెరవేరుస్తావు” అన్నాడు.

73. అప్పుడు నారదుడు ఆయనతో, “నువ్వు విష్ణువు జగత్పూజ్యుడని ఇంతకుముందే చెప్పావు తండ్రీ! ఆయన పరమ జ్ఞానస్వరూపుడని, ఆయనను ఆశ్రయిస్తే జ్ఞానం కలుగుతుందని చెప్పావు. ఆ కారణం చేత ఆయన పూజ్యుడన్నావు. నువ్వు అడిగినది నేను వద్దంటే, నాకు అజ్ఞానాన్నిచ్చి నన్ను శాపగ్రస్తుడిని చేసావు. జ్ఞానాన్నిచ్చే విష్ణువు పూజ్యుడయితే, నీవు జగత్పూజ్యుడివి కాదన్నమాటే కాదన్నమాటే కదా!

74. నీకు భూలోకం లో గాని, మరెక్కడా గాని పూజ ఉండదు. కాబట్టే నేనిలా అంటున్నాను నిన్ను. ఇప్పుడు నీ ముఖతః ఇవ్వబడింది కనుక, అష్టాక్షరీ మహామంత్రోపదేశం అప్రతిహతమైన శక్తి కలిగినది. నేను ఏ గంధర్వ జన్మ ఎత్తినా, స్త్రీ జన్మ ఎత్తినా, పశుజన్మ ఎత్తినా ఆ హరిభక్తి, అష్టాక్షరీ నన్ను విడవకుండుగాక!” అని శాసనం చేసుకున్నాడు. తండ్రి సమక్షంలో శాసనాన్ని చేసుకున్నాడు.

75. అట్టి మహత్తర శక్తి సంపన్నుడు నారదుడు. అతడి సంకల్పం అవక్రంగా ఉంది. సంసారం ఒక విషవృక్షం అని చెపుతూ, అందులో రెండు స్వాధుఫాలాలు అని చెపుతారు పెద్దలు. ఈ విషవృక్షానికి మధురఫలాలు ఎలా కాస్తాయి అంటే, ఆ మధురఫలాలు లేకపోతే ఆ విషవృక్షాన్ని అందరూ ఛేదించి వెళ్ళిపోతారు. దాంట్లో కూడా ఒకటో రెండో రుచికరమైన ఫలాలు దొరుకుతాయి కాబ్ట్టే దాన్ని ఆశ్రయించి, అది ఎంత విషవృక్షమైనా దానిని వదలరు. ఆ స్వాధుఫలాలు రెండూ అనుకూలమైన దాంపత్యం (అనుకూలమైన భార్య), పుత్రసర్శనం అనేవి. వాటికోసం ఆశిస్తారు. సంసారంలో ప్రవేశిస్తారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

13 Oct 2020

శ్రీ శివ మహా పురాణము - 247

🌹 .   శ్రీ శివ మహా పురాణము - 247   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

56. అధ్యాయము - 11

🌻. దుర్గాస్తుతి - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవీ! మహేశ్వరీ! నాపై దయఉంచి వినుము. నీవు సర్వము నెరుంగుదువు. అయిననూ నీ ఆజ్ఞచే నా మనస్సులోని కోర్కెను చెప్పెదను (20). హే దేవేశీ! నీ భర్త పూర్వము నా నుదుటి నుండి ప్రకటమయ్యెను గదా ! ఆ శివ యోగి రుద్రనామముతో కైలాసముపై నున్నాడు (21).

కూటస్థుడు (పరివర్తన లేని వాడు) అగు ఆ భూతనాథుడు అచట తపస్సును చేయు చున్నాడు. భార్యా సహాయము లేనివాడు, వికారహీనుడు అగు ఆ ప్రభువు భార్యా సహాయమును కోరుట లేదు (22).

ఓ పతివ్రతా! ఆతడు వివాహమాడుట కొరకై నీవాయనను మోహింపజేయుము. నీవు తక్క ఆయన మనస్సును ఆకర్షించగలవారు మరియొకరు లేరు (23).

కావున నీవే దక్షునకు కుమార్తెగా జన్మించుము. హే శివే! నీవు నీ రూపముతో రుద్రుని మోహింప జేసి ఆయనకు భార్యవు అగుము (24).

నీవు లక్ష్మీరూపముతో శరీరమును ధరించి కేశవుని అలరించినావు. లోక కళ్యాణము కొరకు రుద్రుని కూడ అటులనే చేయుము (25).

ఓ దేవీ! నేను కాంతను అభిలషించినంత మాత్రాన నన్ను నిందించిన ఆ వృషభధ్వజుడు తన ఇచ్ఛచే భార్యను స్వీకరించుట ఎట్లు సంభవమగును ? (26).

ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతములకు కారణభూతుడైన ఆ హరుడు విరాగియై భార్యను స్వీకరించని స్థితిలో ఈ సృష్టి మంగళకరము ఎట్లు కాగల్గును ?(27).

ఈ చింత నన్ను పీడించుచున్నది. నీవు తప్ప మరియొకరు నాకు శరణు లేరు. నేనీ కష్టములో నున్నాను. కాన, లోకహితమును గోరి నా కోరికను దీర్చుము (28). ఆయనను విష్ణువు గాని, లక్ష్మిగాని, మన్మథుడు గాని, నేను గాని మోహపెట్టలేము. ఓ జగన్మాతా! నీవు తప్ప మరియొకరి వలన ఈ పని కాదు (29).

కావున, నీవు దక్షుని కుమార్తెగా జన్మించి, దివ్యరూపము గల దానవై, యోగియగు ఈశ్వరుని మోహింపజేసి ఆయనకు భార్యవు కమ్ము. మహేశ్వరీ! నా భక్తిని ఈ విధముగా సఫలము చేయుము (30). ఓ దేవ దేవీ! దక్షుడు క్షీర సముద్ర ఉత్తర తీరమునందు దృఢమగు వ్రతము గలవాడై మనస్సును నీయందు లగ్నము చేసి నిన్ను ఉద్దేశించి తపస్సును చేయు చున్నాడు (31).

ఈ మాటను విని, ఆపుడా ఉమాదేవి ఆలోచించ మొదలిడెను. ఆ జగన్మాత విస్మయమును పొంది తన మనస్సులో ఇట్లు అనుకొనెను (32).

దేవి ఇట్లు పలికెను -

అహో! ఇది చాల పెద్ద ఆశ్చర్యము! వేద ప్రవర్తకుడు, సృష్టికర్త, మహాజ్ఞాని యగు ఈ బ్రహ్మ ఏమి మాటలాడు చున్నాడు? (33).

బ్రహ్మ యొక్క మనస్సులో దుఃఖదాయకమగు మహా మోహము పుట్టినది. అందువలననే వికార రహితుడగు శివప్రభువును మోహింప జేయ గోరు చున్నాడు (34).

హరుని మోహింపజేయవలెననే వరమును ఈ బ్రహ్మ నానుండి పొంద గోరుచున్నాడు దాని వలన ఈతనికి కలిగే లాభమేమి? ఆ విభుడు కూటస్థుడు (పరివర్తన లేని వాడు) గనుక, ఆయనను మోహింపజేయుట సంభవము కాదు (35).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

Facebook, WhatsApp, Telegram groups:

13 Oct 2020

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 5 / Sri Devi Mahatyam - Durga Saptasati - 5

🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 5 / Sri Devi Mahatyam - Durga Saptasati - 5 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 1

🌻. మధు కైటభుల వధ వర్ణనము - 5 🌻

“నీ చేతనే ఈ విశ్వం భరింపబడుతోంది. ఈ జగత్తు నీ చేతనే సృజింపబడుతోంది. దేవీ! నీ చేతనే అది పరిపాలింపబడుతోంది.

దానిని ఎల్లప్పుడూ నీవే చివరకు మ్రింగివేస్తావు. (ఎల్లప్పుడూ సర్వ) జగద్రూపవై ఉండే నీవు జగత్సృష్టి కాలంలో సృజనశక్తిగా, స్థితికాలంలో

పరిపాలనశక్తిగా, లయకాలంలో సంహరణశక్తిగా ఉంటావు.

మహాజ్ఞానానివి, మహా అజ్ఞానానివి కూడా నీవే. నీవే మహాబుద్ధివి, మహాస్మరణశక్తివి, మహాభ్రాంతివి. నీవు మహాదేవివి, మహా అసురివి నీవే. “నీవు సర్వానికి మూలకారణమైన ప్రకృతివి. త్రిగుణాలను - ప్రవర్తింప చేసే తల్లివి. కల్పాంత ప్రళయకాలపు కాళరాత్రివి నీవే. అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి నీవే. భయంకరమైన మోహరాత్రివి కూడా నీవే. (75–78)

నీవు లక్ష్మివి, ఈశ్వరివి, వినమ్రతవు, ప్రబోధాన్ని కల్పించే జ్ఞానచిహ్నమైన బుద్ధివి నీవే, లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, ఓరిమిగల తల్లివి. ఖడ్గం, శూలం, గద, చక్రం, శంఖం, ధనుర్బాణాలు, భుశుండి, ఇనుపకట్లగుది అనే ఆయుధాలు దాల్చిన భయంకరివి. కాని

నీవు క్షేమంకరివైన శుభమూర్తివి అవుతావు. శుభవస్తువులంన్నిటి కన్నా అధికమైన శుభమూర్తివి నీవు. అత్యంత సౌందర్యవతివి నీవు. పరాపరాలకు అతీతమైన పరమేశ్వరివి నీవే.

“ఎక్కడ ఏ వస్తువు - సద్రూపమైనది గాని, అసద్రూపమైనది గాని- ఉంటే, ఆ వస్తువుకు గల శక్తి అంతా నీవే. అఖిలాత్మికవైన నిన్ను నేను స్తుతింప సమర్థుడనా? జగత్తును అంతా సృజించి, నిర్వహించి, లయింపజేయువాడు కూడా నీచేత నిద్రావశుడవుతున్నాడు. నిన్ను స్తుతించే శక్తిగల వారు ఇక్కడ ఎవరు ఉన్నారు? (79-83)

మమ్మలినందరిని (విష్ణువును, నన్ను, ఈశ్వరుణ్ణి) శరీరాలు ధరించేటట్లు చేసిన నిన్ను స్తుతించు శక్తిగల వారు ఎవరు ఉన్నారు? దేవీ! ఇలా స్తుతింపబడిన తల్లివై అప్రతిహతులైన ఈ మధుకైటభాసురులను నీ ఉదార ప్రభావముచేత సమ్మోహితులను చేయి.

జగత్స్వామియైన అచ్యుతుడు త్వరితంగా మేలుకొల్పబడి, ఈ మహాసురులను వధించుటేట్లు ప్రభోదనం పొందుగాక!” (అంటే 'మేలుకొల్పి ప్రభోధించు' అని అర్థం). 82-87

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 5 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

Chapter 1
🌻 Description of Killing of Madhu and Kaidabha - 5
🌻

75-77. 'By you this universe is borne, by you this world is created. By you it is protected, O Devi and you always consume it at the end.

O you who are (always) of the form of the whole world, at the time of creation you are of the form of the creative force, at the time of sustentation you are of the form of the protective power, and at the time of the dissolution of the world, you are of the form of the destructive power.

You are the supreme knowledge as well as the great nescience, the great intellect and contemplation, as also the great delusion, the great devi as also the great asuri.

78-81. ' You are the primordial cause of everything, bringing into force the three qualities. You are the dark night of periodic dissolution.

You are the great night of final dissolution, and the terrible night of delusion. You are the goddess of good fortune, the ruler, modesty, intelligence characterized by knowledge, bashfulness, nourishment, contentment, tranquillity and forbearance.

Armed with sword, spear, club, discus, conch , bow, arrows, slings and iron mace, you are terrible( and at the same time) you are pleasing, yea more pleasing than all the pleasing things and exceedingly beautiful. You are indeed the supreme Isvari, beyond the high and low.

82-87. 'And whatever of wherever a thing exists, conscient (real) or non-conscient (unreal), whatever power all that possesses is yourself.

O you who are the soul of everything, how can I extol you (more than this)? By you, even he who creates, sustains and devours the world, is put to sleep.

Who is here capable of extolling you? Who is capable of praising you, who have made all of us- Vishnu, myself and Shiva- take our embodied forms? O Devi, being lauded thus, bewitch these two unassailable asuras Madhu and Kaitabha with your superior powers.

Let Vishnu, the Master of the world, be quickly awakened from sleep and rouse up his nature to slay these two great asuras.' The Rishi said:

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవీమహత్యము #DeviMahatyam

13 Oct 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 35, 36 / Sri Lalitha Chaitanya Vijnanam - 35, 36

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 21 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 35, 36 / Sri Lalitha Chaitanya Vijnanam - 35, 36 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

15. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ

స్తనభార దలన్మధ్య పట్టబంధవళిత్రయా

🌻 35. 'లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ' 🌻

కంటిచే చూడదగిన నూగారు తీగకు ఆధార మగుటచే ఊహింపదగిన నడుము కలది. అనగా నడుము వున్నదా? లేదా? అను సందేహము కలిగి, అచట పుట్టిన నూగారుచే నడుము కలదని ఊహింపబడు చున్నది.

శ్రీదేవి నడుము మిక్కిలి సూక్ష్మమైనదని, చర్మచక్షువులకు గోచరము కానిదని, మాయాతీతమైనదని తెలియవలెను. కనపడుచున్న సృష్టికి, కనపడని సూక్ష్మసృష్టి ఆధారము. ఆకాశము నుండి పంచభూతముల సృష్టి దృగ్గోచరము. దానికి వెనుక గల సూక్ష్మ లోకములో అగుపడనివి. అగుపడనిది, అగుపడు సృష్టి కాధారము.

శ్రీదేవి నడుము పై భాగమంతయు అదృశ్యము, దివ్యము, అమృతమయమగు లోకములుగ తెలియదగును.

నడుము క్రిందిభాగము నుండి దృగ్గోచర లోకములు కలవని తెలియవలెను. సూక్ష్మబుద్ధికే ఈ లోకములు తెలియబడ గలవని తెలుపుటకు సూక్ష్మమైన (నూనూగు) రోమముల పంక్తికి ఆధారముగ నడుము కలదని చెప్పుట.

తెలిసిన దానినుండి తెలియని దానికి ప్రయత్నించుట. పరిమితమైన మనస్సుతో అపరిమితమైన దైవమును తెలియగోరుట ఆరోహణ క్రమము.

ఈ సూక్ష్మమునకు సంబంధించిన ఆరోహణ క్రమమునకు నూగారు లత లేక తీగ ఉదహరింప బడినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 35 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 35. Lakṣya-roma- latādhāratā- samunneya- madhyamā लक्ष्य-रोम-लताधारता-समुन्नेय-मध्यमा (35) 🌻

Her waist is to be known only from creeper like hair as described in the previous nāma.

The secretive meaning is that ātma is subtle and can be known only by keen observation (through meditation).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 36 / Sri Lalitha Chaitanya Vijnanam - 36 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

15. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ

స్తనభార దలన్మధ్య పట్టబంధవళిత్రయా

🌻 36. 'స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా' 🌻

స్తనముల బరువుచే వీగుచున్న నడుమునకు దృఢము కలిగించుటకు మూడు వరుసల బంగారు పట్టికచే చుట్టబడిన సన్నని నడుము కలది శ్రీదేవి అని భావము. నడుమును గూర్చి ముందు నామములో తెలియజేయబడినది. నడుము చుట్టును ఏర్పడిన మూడు భౌతిక లోకములు, మూడు కాలములను ఈ నామము సూచించును.

ఇక్కడ చెప్పబడిన మూడు లోకములు మణిపూరకము, స్వాధిష్ఠానము, మూలాధారమునకు సంబంధించినవి. ఇవియే త్రిగుణములు. వీటియందే సమస్త జీవులను శ్రీదేవి తన మాయచే బంధించి వుంచును.

మనస్సు, ఇంద్రియములు, భౌతిక శరీరము- ఈ త్రివళుల కారణముగ ఏర్పడి జీవునకు ఉపాధి ఏర్పడును. అజ్ఞానము కారణముగ అవి బంధహేతువు లగును. జ్ఞానము సిద్ధించినచో ఈ ఉపాధులు వైభవ కారకములగును.

శ్రీదేవి నడుముచుట్టును వున్న ఈ మూడు వరుసల బంగారుపని చక్కగ ధ్యానము చేసినవారికి అమ్మయే బంధములను సడలించును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 36 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 36. Stanabhāra- dalanmadhya- paṭṭabandha-valitrayā स्तनभार-दलन्मध्य-पट्टबन्ध-वलित्रया (36) 🌻

The golden belt that She wears supports Her waist as it bends under the heaviness of Her bosoms, resulting in three folds in Her stomach area.

Saundarya Laharī (verse 80) says “Your bosoms rubbing at the upper arms, abounding the bodice and the God of love, in order to protect Your hip from breaking has bound Your hip with three fold strands.”

The possible interpretation could be that Her compassion to the universe is vast which is referred to as heaviness here.

The three lines in Her hip indicate Her three activities – creation, sustenance and dissolution. Her time for compassion is more than Her other activities. After all She is the Supreme Mother.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/

13 Oct 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 73

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 73 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 23 🌻

308. ఎంత గొప్ప దార్శనికుడైనను , ఎంత గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త అయినను వీరిద్దరు భౌతిక గోళము లోపలనే యున్నారు .

309. బహు సున్నిత పథార్ధములైన ఈథర్ , అణువు , కంపనము ,వెలుతురు ,రోదసి ఇవియన్నియు , సున్నిత ద్రవ్యము లైనప్పటికీ , అవి భౌతిక పదార్థములే .

310. పంచ గోళములు (త్రిభువనములు) -

(1) భౌతిక గోళము

(9) సూక్మ గోళము

(3) మానసిక గోళము

(1) సంయు క గోళము

(5) సత్యగోళము

అన్నమయ భువనము -

పరస్పర సంబంధ గోళములు

311. భౌతికగోళం యొక్క ఉనికి సూక్ష్మ గోళముపై ఆధారపడియున్నును అనేక తరహాలలో సూక్ష్మ గోళము నకు భిన్నమైనది.

312.భౌతికగోళము సూక్ష్మగోళముయొక్క ఫలితమైనప్పటికీ, సూక్ష్మగోళముపూర్తిగా స్వతంత్రమై నది ఇది సూక్ష్మగోళం పై ఆధారపడియున్నది.

313. భౌతికగోళము అసంఖ్యాకప్రపంచములు, సూర్యులు, చంద్రులు, నక్షత్రములు యింతెందుకు చాలమోటైన జడపదార్ధమునుండి బహుసున్నితమైన భౌతిక పదార్థము వరకు, వీటన్నిటితో కూడియున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 80 / Sri Gajanan Maharaj Life History - 80

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 80 / Sri Gajanan Maharaj Life History - 80 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 16వ అధ్యాయము - 2 🌻

రాత్రి రెండవ భాగంలో అతను కలలో శ్రీగజానన్ మహారాజు వంటి వ్యక్తిని చూస్తాడు. పుండలీకా చూస్తూఉంటే నువ్వు గురువుని పొందడంకోసం భగాబాయితో అంజనగాం వెళ్ళేందుకు నిశ్చయించుకున్నట్టు ఉన్నావు. ఇష్టమయితే నువ్వు వెళ్ళు. అతని పేరు కాశీనాధ్. అక్కడికి వెళ్ళిన పిదప నువ్వు పూర్తిగా నిరాశచెందుతావని నేను చెపుతున్నాను, అని ఆయన అన్నారు. చెవిలో గుసగుసలాడడం వలన ఎవరయినా గురువు అవుతారా ? చాలామంది ఒకళ్ళ చెవిలో ఒకళ్ళు గుసగుసలాడుతూ ఉంటారు. దీని అర్ధం వాళ్ళు ఒకరికొకరు గురువనా ?

పుండలీకా ఇటువంటి దొంగ సన్యాసులమాట వినకు. రా నామాటవిను. నీచెవిలో నేను ఒక మంత్రం చెపుతాను, అని అంటూ గణ గణ అని నిశ్శబ్దం అయ్యారు. తదుపరి ఆయన పుండలీకునితో ఏదయినా కోరుకో అది జరుగుతుంది అన్నారు. ఈమాటలకి పుండలీకుడు చాలా సంతోషించాడు. కలలోని ఆవ్యక్తిని నిశితంగా పరీక్షించి, షేగాం శ్రీగజానన్ మహారాజును చూసినందుకు అతను చాలా ఆనందించాడు.

తదనంతరం పుండలీకుడు వేరే ఏమికాకుండా పూజించేందుకు ఆయన పాదుకలు కోరాడు. ఈ పాదుకలు తీసుకో రేపు మధ్యాహ్నంనుండి పూజించు అని శ్రీమహారాజు అన్నారు. ఆ పాదుకలు తీసుకుందుకు పుండలీకుడు లేచేటప్పటికి అతను నిద్రనుండిలేచాడు. అతను చుట్టూచూసాడు కానీ ఎవరూ అక్కడ లేరు, పాదుకలుకూడా లేవు. అతను సందిగ్ధంలో పడ్డాడు, కానీ శ్రీమహారాజు మాటలు ఎప్పటికీ వ్యర్ధంకావన్న విషయం అతనికి తెలుసు. శ్రీమహారాజు భగాబాయి గురించి చెప్పిన విషయాలు మరియు మరుసటిరోజు మధ్యాహ్నం పాదుకలు పూజించమని చెప్పిన సూచనలు అతనికి గుర్తు ఉన్నాయి.

శ్రీమహారాజు సూచనలు పాటించాలంటే, పూజించడానికి పాదుకలు అవసరం. కానీ తన దగ్గర అవిలేవు. అతను పూజించడం కోసం కొత్తపాదుకలు తయారు చేయించుదాము అనుకున్నాడు, కానీ శ్రీమహారాజు తన పాదుకలు కలలో తనకు ఇవ్వడం మరల గుర్తువచ్చింది. మరి క్రొత్తవి తయారు చెయ్యడం ఎందుకు ? ఇలా పుండలీకుడు ఆలోచిస్తూ ఉండగా అంజనగాం వెళ్ళేందుకు భగాబాయి పిలవడం విన్నాడు.

శ్రీరాజనన్ మహారాజును తప్ప వేరెవరినీ గురువుగా స్వీకరించను అని అంటూ భగాబాయితో వెళ్ళడానికి నిరాకరించాడు. కావున భగాబాయి ఒక్కరే అంజనగాం వెళ్ళింది. ఇక షేగాంలో ఏమిజరిగిందో వినండి. ఈ సంఘటన జరగడానికి రెండురోజులు ముందు, జాంసింగ్ రాజపుత్ శ్రీమహారాజు దర్శనంకోసం షేగాం వెళ్ళాడు. అతను ముండగాం తిరిగి వెళ్ళడానికి తయారవుతున్నప్పుడు, శ్రీమహారాజు బాలాబవను పిలిచి, తన పాదుకలను జాంసింగ్ చేత పుండలీకునికి అందచెయ్యడం కోసం పంపమన్నారు.

బాలాబవ్ అలానే చేసాడు. జాంసింగ్ పాదుకలు తీసుకుని వెళ్ళాడు. ముండరాం ఊరిసివార్లలో జాంసింగ్ పుండలీకుని కలిసాడు. పుండలీకుడు జాంసింగును శ్రీమహారాజు తనగురించి ఏదయినా ప్రసాదం పంపించారా అని అడిగాడు. జాంసింగ్ ఆశ్చర్యపోయాడు. అతనిని తన ఇంటికి తీసుకువెళ్ళి ఆవిధంగా విచారించడానికి కారణం అడిగాడు. పుండలీకుడు తన కలగురించి నిజం చెపుతాడు.

దానితో జాంసింగ్ మనసులోని సందేహాలు అన్నీతీరాయి. వెంటనే అతను పాదుకలను పుండలీకునికి అందించాడు, అవి ఇప్పటికీ అతని దగ్గర ముండగాంలో ఉన్నాయి. పుండలీకుడు భక్తితో ఆబహూకరింబడిన పాదుకలను మధ్యాహ్నం పూజించాడు. యోగులు తమ భక్తులను తప్పుదారిన వెళ్ళనివ్వరని ఈకధను బట్టి తెలుస్తోంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 80 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 16 - part 2 🌻

In the latter half of the night, he saw a person like Shri Gajanan Maharaj in his dream who said, “Pundalik, you seem to have decided to go to Anjangaon with that Bhagabai for getting a Guru.

You may go if you like. His name is Kashinath, and I tell you that you will be completely disappointed on going there. Can a person become Guru by whispering something in someone’s ear? Many people whisper in one another's ears, does that mean that they became Guru of each other? Pundalik, don't go after hypocrites. Come, listen to me. I will chant a Mantra in your ear.” Saying so, He whispered , “Gan Gan” and kept quiet.

He further told Pundalik to ask for anything and it would be done. At these words, Pundalik felt very happy. He minutely observed the person in the dream and was glad to confirm that He was Shri Gajanan Maharaj of Shegaon.

Thereupon Pundalik asked for His ‘Padukas’ to worship and nothing else. Shri Gajanan Maharaj , thereupon, said, “Take these Padukas and worship them tomorrow afternoon.” As Pundalik got up to take the Padukas, he woke up. He looked around and realized that there was nobody and no Padukas.

He felt confused, but at the same time knew than the words of Shri Gajanan Maharaj can never go waste. He remembered all that Shri Gajanan Maharaj had said about Bhagabai, and also the instructions to worship the Padukas the next day’s afternoon.

If he has to follow the instructions of Shri Gajanan Maharaj , the Padukas were necessary for worship, but he did not have them. He also thought of getting new Padukas prepared for worship, but again remembered that Shri Gajanan Maharaj had given him, His own Padukas in the dream.

Then why to prepare new ones? While Pundalik was thinking like that, he heard Bhagabai calling him for going to Anjangaon. He refused to go with her saying that he would not accept anybody other than Shri Gajanan Maharaj as his Guru. So Bhagabai went to Anjangaon alone. Now listen to what happened at Shegaon.

Just two days prior to this incident, Zyam Singh Rajput had gone to Shegaon for the Darshan of Shri Gajanan Maharaj . When he was about to leave for Mundgaon, Shri Gajanan Maharaj called Balabhau and told him to send His (of Shri Gajanan Maharaj ) Padukas with Zyam Singh for handing over the same to Pundalik at Mundgaon. Balabhau did so. Zyam Singh took the Padukas and went. At Mundgaon, Zyam Singh met Pundalik at the entrance of the village.

He asked Zyam Singh if Shri Gajanan Maharaj sent any Prasad for him. Zyam Singh was surprised. He took him home and asked the reason for his enquiring like that.

Pundalik frankly told about his dream, which cleared all the doubts in the mind of Zyam Singh. He immediately handed over the Padukas to Pundalik, and the same are still there with him, at Mundgaon.

Pundalik, with great devotion, worshipped those gifted Padukas in the afternoon. From this story it was seen that saints will never allow their devotees to go the wrong way. Now listen to a story which shows as to how Shri Gajanan Maharaj fulfills the desires of His devotees.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

13-October-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 517 / Bhagavad-Gita - 517 🌹 
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 52, 53 / Vishnu Sahasranama Contemplation - 52, 53🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 306🌹
4) 🌹. శివగీత - 90 / The Shiva-Gita - 91 🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 75🌹 
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 94 🌹 
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 80 / Gajanan Maharaj Life History - 80 🌹 
8) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 73 🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 35, 36 / Sri Lalita Chaitanya Vijnanam - 35, 36 🌹 
10) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 21🌹*
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 433 / Bhagavad-Gita - 433 🌹

12) *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 5 / Sri Devi Mahatyam - Durga Saptasati - 5🌹*
13) 🌹. శివ మహా పురాణము - 247 🌹
14) 🌹 Light On The Path - 5🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 135 🌹
16) 🌹 Seeds Of Consciousness - 199 🌹 
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 53 📚
18) 🌹. అద్భుత సృష్టి - 54🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 37 / Sri Vishnu Sahasranama - 37 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 517 / Bhagavad-Gita - 517 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 02 🌴*

02. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్దా విషయప్రవాలా: |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబన్ధీని మనుష్యలోకే ||

🌷. తాత్పర్యం : 
ఈ వృక్షశాఖలు ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్థ్వ, అధోముఖములుగా వ్యాపించియున్నవి. దీని చిగుళ్ళే ఇంద్రియార్థములు, అధోముఖముగను ఉన్నత ఈ వృక్షపు వ్రేళ్ళు మనుష్యలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై యున్నవి.

🌷. భాష్యము :
ఈ శ్లోకమునందు అశ్వత్థవృక్ష వర్ణనము మరికొంత ఒసగబడినది. సర్వదిక్కుల యందు వ్యాపించియున్న దాని శాఖల అధోభాగమున మానవులు మరియు అశ్వములు, గోవులు, శునకములు మొదలగు జంతువులు స్థితిని కలిగియున్నవి. 

జీవులు ఈ విధముగా అధోభాగమున నిలిచియుండగా, వృక్షపు ఊర్థ్వభాగమున దేవతలు, గంధర్వులవంటి ఉన్నతజీవులు స్థితిని కలిగియున్నారు. వృక్షము నీటిచే పోషింపబడునట్లు, ఈ సంసారవృక్షము త్రిగుణములచే పోషింపబడును. 

తగినంత నీరు లేనందున కొంత భూభాగము బీడుపడుటయు, వేరొక భూభాగము పచ్చగా నుండుటయు మనకు గోచరమగునట్లు, ప్రకృతిగుణముల పరిమాణము మరియు ప్రాబల్యము ననుసరించి వివిధములైన జీవజాతులు వ్యక్తమగుచుండును.

సంసారవృక్షపు చిగుళ్ళే ఇంద్రియార్థములుగా పరిగణింపబడినవి. వివిధగుణముల వృద్ది వలన వివిధ ఇంద్రియములు కలుగుచుండ, ఆ ఇంద్రియముల ద్వారా మనము వివిధ ఇంద్రియార్థముల ననుభవింతురు. ఈ విధముగా ఇంద్రియార్థములను కూడియుండెడి కర్ణములు, నాసిక, నయనాది ఇంద్రియములే సంసారవృక్షశాఖాగ్రములు. 

శబ్ద, రూప, స్పర్శాది ఇంద్రియార్థములే చిగుళ్ళు. వృక్షపు ఉపమూలములే వివిధ దుఃఖములు, ఇంద్రియభోగముల ఫలములైన ఆసక్తి, అనాసక్తులు. సర్వదిక్కులా వ్యాపించియుండు ఈ ఉపమూలముల నుండియే ధర్మాధర్మములకు సంబంధించిన ప్రవృత్తులు కలుగుచున్నవి. ఈ వృక్షపు యథార్థమూలము బ్రహ్మలోకము నందుండగా, ఇతర ఉపమూలములు మర్త్యలోకము నందున్నవి. 

ఊర్థ్వలోకములందు పుణ్యకర్మల ఫలముల ననుభవించిన పిదప జీవుడు ఈ మర్త్యలోకమున కరుదెంచి, తిరిగి ఊర్థ్వలోకములకు ఉద్ధరింపబడుటకు తన కర్మల నారంభించును. కనుకనే ఈ మర్త్యలోకము కర్మక్షేత్రముగ పరిగణింపబడుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 517 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 02 🌴*

02. adhaś cordhvaṁ prasṛtās tasya śākhā
guṇa-pravṛddhā viṣaya-pravālāḥ
adhaś ca mūlāny anusantatāni
karmānubandhīni manuṣya-loke

🌷 Translation : 
The branches of this tree extend downward and upward, nourished by the three modes of material nature. The twigs are the objects of the senses. This tree also has roots going down, and these are bound to the fruitive actions of human society.

🌹 Purport :
The description of the banyan tree is further explained here. Its branches spread in all directions. In the lower parts, there are variegated manifestations of living entities – human beings, animals, horses, cows, dogs, cats, etc. 

These are situated on the lower parts of the branches, whereas on the upper parts are higher forms of living entities: the demigods, Gandharvas and many other higher species of life. As a tree is nourished by water, so this tree is nourished by the three modes of material nature.

 Sometimes we find that a tract of land is barren for want of sufficient water, and sometimes a tract is very green; similarly, where particular modes of material nature are proportionately greater in quantity, the different species of life are manifested accordingly.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 *🌹 Sripada Srivallabha Charithamrutham - 306 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 42
*🌻 Sripada gives His divine darshan always to His parents, Bapanarya, Narasimha Varma and Venkatappaiah Shresti - 2 🌻*

These things were told to the sanyasi in Kukkuteswara temple. Sanyasi was perturbed.  

He thought ‘Sripada has indicated clearly that he is Datta Prabhu, and has disappeared. He has said He is Dattatreya, his upasya daivam and not any other God or Goddesses.  

Has really Datta Prabhu taken avathar as Sripada Srivallabha? If His avathar is true, it will also be true that I will be having troubles in the future. Datta Prabhu has a strange nature. He will put me into troubles, see the fun and uplift only after surrendering totally.  

I thought that it was due to the grace of Datta Prabhu that so many Brahmins elevated me and so much of money was gathered. I wonder if there is any punishment embedded in it meant for me in this grace.  

Datta Prabhu knows that I am craving for name, fame and money. The Brahmins who have come to me are also greedy people.  

There is no spiritual power in me or in these Brahmins’. Datta deekshas are only a tool for attracting money. People who take part in the deeksha will think that it is the deficiency of their deeksha if their desires are not fulfilled.  

If the desires are fulfilled, they believe that it is the effect of deeksha. Sripada may put me into troubles in some strange method.’ Thus the sanyasi was shivering with fear. Meanwhile, an old Brahmin from Maratha desam came to Kukkuteswara temple.  

He said, his name was Narasimha Khan, he belonged to Kasyapa gothra, came specially for darshan of Kukkuteswara Maha Prabhu and hearing that one Paramahamsa Parivraajakacharaya was giving Datta deekshas, came for his darshan.  

He was hiding many varahas in his loin cloth. He gave all the varahas as dakshina. Sanyasi became extremely happy. At the time of giving deeksha, he asked the old Brahmin to stretch his hand to pour water from his kamandalam.  

The Brahmin stretched his hand. Along with water, one scorpion also fell on his hand. Then the Brahmin’s voice became a little harsh. He said, ‘you poured water in my hand. You are asking me to drink the water. 

 What a wonder! You have offered the fruit of tapas acquired in many years to me. I am giving it to Peethikapuram.’ Sanyasi was stunned. The Brahmin disappeared in a moment. Meanwhile, one Brahmin shouted loudly that he was bitten by a scorpion.  

That Brahmin was one of the people who took deeksha. A mantra was used to remove the effect of scorpion bite. It did not work. Different types of mantras were chanted. But there was no effect. Abhishekam was done to Kukkuteswara. 

Haarathi was given in a big quantity to Swayambhu Datta. That Brahmin fell unconscious. Froth started coming from his mouth. They decided that a snake bit him and not a scorpion. 

Some people had seen scorpion falling from kamandalam on the old Brahmins hand along with water. So, they said that the same scorpion bit this Brahmin. Only God knows, when rumors will start in Peethikapuram and spread and who will fall into troubles and in what way because of these rumors.  

The pain of scorpion bite had not abated even after doing abhishekam to Kukkuteswara and after giving a big ‘aarathi’ to Swayambhu Datta.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 52, 53 / Vishnu Sahasranama Contemplation - 52, 53 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 52. త్వష్టా, त्वष्टा, Tvaṣṭā 🌻*

*ఓం త్వష్ట్రే నమః | ॐ त्वष्ट्रे नमः | OM Tvaṣṭre namaḥ*

త్వక్షతి ఇతి త్వష్టా క్షీణింపజేయును; సంహార సమయమున రుద్ర రూపమున ప్రాణులను క్షీణింపజేయువాడును విష్ణువే.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 52 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 52. Tvaṣṭā 🌻*

*OM Tvaṣṭre namaḥ*

Tvakṣati iti tvaṣṭā He who reduces the size of all beings at the time of saṃhāra during praḷaya (cosmic dissolution) to their subtle form as Rudra.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 53/ Vishnu Sahasranama Contemplation - 53🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 53. స్థవిష్ఠః, स्थविष्ठः, Sthaviṣṭhaḥ 🌻*

*ఓం స్థవిష్ఠాయ నమః | ॐ स्थविष्ठाय नमः | OM Sthaviṣṭhāya namaḥ*

అతిశయేన స్థూలః మిగుల బృహత్తైన, లావుదైన శరీరం కలవాడు.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కందము ::

వ. వినుము భగవంతుడైన హరి విరాడ్విగ్రహంబునందు భూతభవిష్యద్వర్తమానం బైన విశ్వంబు విలోక్యమానం బగు, ధరణీసలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్త్వంబులని యెడి సప్తావరణంబులచేత నావృతంబగు మహాండకోశంబైన శరీరంబునందు ధారణాశ్రయం బయిన వైరాజపురుషుండు దేజరిల్లు...

విను. భగవంతుడైన విష్ణుని విరాట్ స్వరూపంలో జరిగిన, జరగనున్న, జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహతత్త్వము అనే ఆవరణాలు ఏడు మహాండకోశమైన విరాట్పురుషుని శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్పురుషుడు ప్రకాశిస్తున్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 53 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 53. Sthaviṣṭhaḥ 🌻*

*OM Sthaviṣṭhāya namaḥ*

Atiśayena sthūlaḥ He whose body is bulky or substantial.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 1
Viśeṣas tasya deho'yaṃ sthaviṣṭhaśca sthavīyasām,
Yatredaṃ vyajyate viśvaṃ bhūtaṃ bhavyaṃ bhavac ca sat. (24)

In His extraordinary body which is spread as the grossly material matter of this universe - all of this phenomenon is experienced as the past, future and present.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 75 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -05 🌻*

ఈ సన్యాసనామం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా సన్యాసమంటేనే ఈ ‘ఆంతరిక యజ్ఞం’. ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేస్తారో, వారు అత్యాశ్రమి. వారు నాలుగు ఆశ్రమధర్మాలను దాటినటువంటి వారౌతారు. 

ఈ నాలుగు ఆశ్రమధర్మాలను దాటినటువంటి అత్యాశ్రమి ఈ ఆంతరిక యజ్ఞంలో సమర్థుడై, ఆత్మానుభూతిని పొంది, ఆనందస్థితుడవ్వగానే, శోకరహితుడవ్వగానే అతనికి ఆ పేరు ఇవ్వబడుతుంది. అప్పటి వరకూ చైతన్య అనే పేరుతో వుంటాడు. అంటే ఉద్ధవ చైతన్య, ఉద్ధవ చైతన్యానంద, సర్వేశానంద గా మారిపోయాడు ఆయన. అట్లాగే సుందర రాజన్‌, సుందర చైతన్య, సుందర చైతన్యానంద అయ్యాడు. 

ఈ రకంగా ఈ ఆనంద నామము సన్యాసనామము ఎప్పుడు జోడించబడుతుంది అంటే, ఎప్పుడైతే ఈ ఆంతరిక యజ్ఞం ద్వారా ఫలాపేక్ష రహితంగా, ఫలత్యాగ పద్ధతిగా, నిష్కామకర్మగా, ఈ హృదయాకాశము నందు, బుద్ధి గుహ యందు ఉన్నటువంటి ఆత్మానుభూతిని, తాను తెలుసుకొన్నటువంటివాడై, నామరూపాత్మకమైనటువంటి నేనును పోగొట్టుకున్నటువంటి ఆత్మనిష్ఠుడై, ఆనంద స్థితుడై, శోక రహితుడై ఉన్నాడో, అప్పడు ఈ ఆనంద నామం స్థిరమైపోతుంది.

        అటువంటి స్థితిని మానవుడు తప్పక పొందాలి. ఈ ఆనందము పేరు ఆత్మానందము. ఆత్మానందమును అనుభవించును. వీడికి ఇంకే పని ఉండదు. వీడి జన్మ మొత్తం మీద వీడికేమైనా పనులున్నాయా అంటే ఇక ఒక్కటే ఒక కర్తవ్యం మిగులుతుంది. ఏమిటంటే, సదా ఆత్మానందుడై వుండుట. ఉండుట. చేయుట లేదు 

ఇక వీడికి. కర్మ యొక్క ప్రభావం లేదు. కాబట్టి చేయడం అనే ప్రసక్తే లేదు. కాబట్టి ఏమిటి అంటే ఆత్మానందము నందు వుండుట అనేది ప్రారంభమైనది. ఇక నుంచి వీడు చేసే అన్ని కర్మలు, సర్వ కర్మలు కూడా ఈ ఆంతరిక యజ్ఞంలో దగ్ధం అయిపోతాయి. 

‘మాం ఏకం శరణం వ్రజా’- పరమాత్మకు సర్వస్య శరణాగతి అయిపోయాడు కాబట్టి, ఇంక వేరే అన్యము లేదు కాబట్టి, అంతటా తానే ఉన్నాడు కాబట్టి, అన్యమును తెలుసుకొనగోరు ఇచ్ఛ లేదు కాబట్టి, అన్యము లేదు కాబట్టి, అనేకత్వము లేదు కాబట్టి, సహస్రదా సర్వదా సర్వకాలము నందు ఉన్న ఏక తత్వమైనటువంటి ఆత్మ తత్వమునందే రమించుచున్నాడు కాబట్టి. ఈ రకంగా ఆత్మానందమును అనుభవించుచున్నాడు. ఇట్టి స్థితిని మానవుడు తప్పక సాధించాలి.

        ఆత్మ సర్వవ్యాపకమగుటచేత ఆత్మలేని తావులేదు. పరిచ్ఛిన్నత్వమున్న వాటికే గదా కదలుటకవకాశమున్నది. అపరిచ్చిన్నుడు, అచలుడు అయిన ఆత్మ దూరము పోవునట్లగపడుచున్నాడు. 

ఆనందము మరియు ఆనంద రహితమునై యున్న ఈ ఆత్మను నాకంటే వేరైనవాడెవడు తెలిసికొనగలడు. అంతర్ముఖులు, ఇంద్రియ నిగ్రహపరులైన జ్ఞానులు దప్ప విషయాదులతో కూడి యుండు సామాన్యులు ఆత్మను తెలియలేదు.

  ఇక్కడేమి చెపుతున్నారు? ఆ ఆత్మానందం యొక్క విశేషాన్ని తెలియచెప్పి నీ ఆత్మ యొక్క మరిన్ని లక్షణాలను తెలియజేస్తున్నారు. ఆత్మ లేని తావు లేదు. మైక్రోమిల్లీ మీటర్‌లో ఉన్నటువంటి, ఆర్‌ ఎన్‌ ఏ [R.N.A], డీ ఎన్ ఏ [D.N.A] దగ్గర నుంచి మొదలుపెడితే పరమాణవైనటువంటి ఎలిమెంట్స్‌ [elements], బేసిక్‌ ఎలిమెంట్స్‌ [Basic elements] ఏవైతే ఉన్నాయో, ఈ సృష్టియందు హీలియం అనుకో, ఉదజని అనుకో, ఆక్సిజన్‌ అనుకో, హైడ్రోజన్‌ అనుకో ఏ పేర్లైనా పెట్టుకో, 

అత్యంత చిన్నదైనటువంటి పరమాణువు, ఆటమ్‌ [atom] దగ్గర నుంచీ మొదలుపెడితే, అనంతముగా వ్యాపించి వున్నటువంటి విశ్వము వరకూ, బ్రహ్మము వరకూ సర్వత్రా ఉన్నది ఏదైతే ఉన్నదో, ఉండుట మాత్రమే లక్షణముగా కలది ఏదైతే ఉన్నదో, అది ఆత్మ. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 91 / The Siva-Gita - 91 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

ఏకాదశాధ్యాయము 
*🌻. జీవ గత్యాది నిరూపణము - ఉపాసనా మాహాత్మ్యము - 5 🌻*

సప్రోక్తో మానుషా నంద - స్తస్మాచ్ఛతగుణో మతః ,
మనుష్యస్త పాసాయుక్తో - గంధర్వో జాయతే స్యతు 36
తస్మాచ్చతగుణో దేవ - గంధ ర్వాణాం - నసశయ,
ఏవం శత గుణానంద - ఉత్త రోత్త ర తోభవేత్. 37
పితృణాం చిరలోకానా - మాజా శర సంపదామ్,
దేవాతానా మథేంద్రస్య - గురోస్త ద్వత్ర్స జాపతే : 38
బ్రహ్మణ శ్చైవమానంద :- పురస్తాదుత్త రోత్తర :.
జ్ఞానాధక్యాత్సు ఖాధ్ క్యం - నాన్య దస్తి సురాలయే . 39
శ్రోత్రియోవృజినో కామ - హతోయశ్చ ద్విజో భవేత్ ,
తస్యాప్యేవం సమా ఖ్యాతా- ఆనందా శ్చోత్తరోత్తరమ్. 40

మానవుడు తపం చేసిన చో గంధర్వుడగును. అతనికి మానవున కంటెను నూరురెట్లు ఆనందము కలుగును, ఇట్లు క్రమక్రమము గా క్రింది వారి కంటెను మున్ముందు వారికి నూరేసిరెట్లు ఆనందము మెక్కువ కలుగును. అదెట్లనగా దేవ గంధర్వుల కంటె చిర లోక వాసులగు పితృదేవతలకు సహజముగా దేవత్వమును పొంది యున్నారు. 

 వారి కంటె నూరు రెట్లు ఇంద్రునకు, ఇంద్రుని కంటెను నూరురెట్లు బృహస్పతికి, ఆతని కంటెను నూరురెట్లు బ్రహ్మకు ఈవిధముగా తెలిసికొనవలెను. నిష్కామ కర్మ మొనర్చి బ్రహ్మ క్షత్రియ, వైశ్యులలో కామమునకు లోబడని నిష్పాపుడైన ఆత్మ జ్ఞానము కలవానికి కూడ క్రమ క్రమముగానా నందము లభించును. స్వర్గమున జ్నానాధిక్యము చేత సౌఖ్యమధిక మగును, కనుక ఆత్మ జ్ఞానమున కంటెను మరొకటి లేదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 91 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 11 
*🌻 Jiva Gatyaadi Niroopanam - Upasana Mahatya - 5 🌻*

To this Gandharvahappiness 100 times greater is Devagandharva
happiness when attained a post of Devagandharva. In this fashion, every higher post has 100 times greater happiness than the current level. Above the Devagandharvas Pitrudevatas exist hence their happiness gets 100 times increased than the preceding ones.

 Above them 100 times higher remain Aajaanadevatas, above then 100 times higher remain karma devatas, above them 100 times more happy remain the gods of heaven, above them 100 times more happy remains Indra, above Indra 100 times more happier remains the post of Brihaspati, above Brihaspati 100 times superior is the happiness of the post of Brahma.

This is the sequence of attaining higher posts based on penances and the merits gained. One who doesn't expect any fruits of his Karma, be he from any Varna, such a blemish less pious person also gains bliss. Due to high merits possessed by knowledge of Atma comforts in Swarga becomes manifold. 

Therefore there is nothing greater than Atmajnana to attain gati.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 94 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
87

Realizing that the Paramatman, Lord Narayana alone was his savior, Gajendra surrendered his intellect to the Lord and cried out to Him. Lord Narayana, who was moved by the prayer, immediately came to the rescue of Gajendra.  

Then, Gajendra praised the Lord who is “Anatha-rakshaka” (one who protects those who have no one else) and “Aapadbandhava” (one who comes to the rescue of those in distress) saying “Universal Guru! Salutations to You. You are the Guru to this universe, Universal Guru!”.  

Lord Narayana was pleased; He immediately released Gajendra from the clutches of the alligator and blessed him with liberation. 

Just like the Universal Guru Narayana, the Guru too inspires and enables his disciples who are immersed in samsara to do many good deeds. He enables them do charitable deeds, he enables them to do Yajnas and other rituals. 

He ensures that the the disciple earns good karma and merit and that he is amply blessed by God and is able to rise from the ocean of samsara. The society thus benefits greatly due to the Sadguru.   

Sloka: 
Gurur brahma gurur visnuh gururdevo maheswarah | Gurureva param brahma tasmai sri gurave namah || 

Guru is Brahma. Guru is Vishnu, Guru is Shiva and the only Absolute. Obeisance to such a Guru. This has been stated earlier.  

Still, since you will keep forgetting, I am repeating. Since I am repeating it over and over and over and over, you should realize how important this is. The next 3 slokas are like the heart of Guru Gita. Listen carefully. 

Sloka: 
Akhanda mandalakaram vyaptam yena caracaram | Tatpadam darsitam yena tasmai sri gurave namah || 

Tat + Tvam + Asi means You are That.   

Tat = that, which is the indivisible cosmic form, pervading the animate and the inanimate as the Parabrahman.  

Obeisance to the Sadguru who has enabled me to perceive that. To better understand the meaning of this sloka, let’s learn about the story where Lord Brahma realized that Sri Krishna was Parabrahman Himself.  

After Lord Krishna killed demon Aghasura, he rested by a lake along with the cows and the cowherds.  

The cows moved far away while grazing. The cowherds ate the leftover rice they brought with them and set out in search of the cows. Jaya Guru Datta.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 80 / Sri Gajanan Maharaj Life History - 80 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 16వ అధ్యాయము - 2 🌻*

రాత్రి రెండవ భాగంలో అతను కలలో శ్రీగజానన్ మహారాజు వంటి వ్యక్తిని చూస్తాడు. పుండలీకా చూస్తూఉంటే నువ్వు గురువుని పొందడంకోసం భగాబాయితో అంజనగాం వెళ్ళేందుకు నిశ్చయించుకున్నట్టు ఉన్నావు. ఇష్టమయితే నువ్వు వెళ్ళు. అతని పేరు కాశీనాధ్. అక్కడికి వెళ్ళిన పిదప నువ్వు పూర్తిగా నిరాశచెందుతావని నేను చెపుతున్నాను, అని ఆయన అన్నారు. చెవిలో గుసగుసలాడడం వలన ఎవరయినా గురువు అవుతారా ? చాలామంది ఒకళ్ళ చెవిలో ఒకళ్ళు గుసగుసలాడుతూ ఉంటారు. దీని అర్ధం వాళ్ళు ఒకరికొకరు గురువనా ? 

పుండలీకా ఇటువంటి దొంగ సన్యాసులమాట వినకు. రా నామాటవిను. నీచెవిలో నేను ఒక మంత్రం చెపుతాను, అని అంటూ గణ గణ అని నిశ్శబ్దం అయ్యారు. తదుపరి ఆయన పుండలీకునితో ఏదయినా కోరుకో అది జరుగుతుంది అన్నారు. ఈమాటలకి పుండలీకుడు చాలా సంతోషించాడు. కలలోని ఆవ్యక్తిని నిశితంగా పరీక్షించి, షేగాం శ్రీగజానన్ మహారాజును చూసినందుకు అతను చాలా ఆనందించాడు. 

తదనంతరం పుండలీకుడు వేరే ఏమికాకుండా పూజించేందుకు ఆయన పాదుకలు కోరాడు. ఈ పాదుకలు తీసుకో రేపు మధ్యాహ్నంనుండి పూజించు అని శ్రీమహారాజు అన్నారు. ఆ పాదుకలు తీసుకుందుకు పుండలీకుడు లేచేటప్పటికి అతను నిద్రనుండిలేచాడు. అతను చుట్టూచూసాడు కానీ ఎవరూ అక్కడ లేరు, పాదుకలుకూడా లేవు. అతను సందిగ్ధంలో పడ్డాడు, కానీ శ్రీమహారాజు మాటలు ఎప్పటికీ వ్యర్ధంకావన్న విషయం అతనికి తెలుసు. శ్రీమహారాజు భగాబాయి గురించి చెప్పిన విషయాలు మరియు మరుసటిరోజు మధ్యాహ్నం పాదుకలు పూజించమని చెప్పిన సూచనలు అతనికి గుర్తు ఉన్నాయి. 

శ్రీమహారాజు సూచనలు పాటించాలంటే, పూజించడానికి పాదుకలు అవసరం. కానీ తన దగ్గర అవిలేవు. అతను పూజించడం కోసం కొత్తపాదుకలు తయారు చేయించుదాము అనుకున్నాడు, కానీ శ్రీమహారాజు తన పాదుకలు కలలో తనకు ఇవ్వడం మరల గుర్తువచ్చింది. మరి క్రొత్తవి తయారు చెయ్యడం ఎందుకు ? ఇలా పుండలీకుడు ఆలోచిస్తూ ఉండగా అంజనగాం వెళ్ళేందుకు భగాబాయి పిలవడం విన్నాడు. 

శ్రీరాజనన్ మహారాజును తప్ప వేరెవరినీ గురువుగా స్వీకరించను అని అంటూ భగాబాయితో వెళ్ళడానికి నిరాకరించాడు. కావున భగాబాయి ఒక్కరే అంజనగాం వెళ్ళింది. ఇక షేగాంలో ఏమిజరిగిందో వినండి. ఈ సంఘటన జరగడానికి రెండురోజులు ముందు, జాంసింగ్ రాజపుత్ శ్రీమహారాజు దర్శనంకోసం షేగాం వెళ్ళాడు. అతను ముండగాం తిరిగి వెళ్ళడానికి తయారవుతున్నప్పుడు, శ్రీమహారాజు బాలాబవను పిలిచి, తన పాదుకలను జాంసింగ్ చేత పుండలీకునికి అందచెయ్యడం కోసం పంపమన్నారు. 

బాలాబవ్ అలానే చేసాడు. జాంసింగ్ పాదుకలు తీసుకుని వెళ్ళాడు. ముండరాం ఊరిసివార్లలో జాంసింగ్ పుండలీకుని కలిసాడు. పుండలీకుడు జాంసింగును శ్రీమహారాజు తనగురించి ఏదయినా ప్రసాదం పంపించారా అని అడిగాడు. జాంసింగ్ ఆశ్చర్యపోయాడు. అతనిని తన ఇంటికి తీసుకువెళ్ళి ఆవిధంగా విచారించడానికి కారణం అడిగాడు. పుండలీకుడు తన కలగురించి నిజం చెపుతాడు. 

దానితో జాంసింగ్ మనసులోని సందేహాలు అన్నీతీరాయి. వెంటనే అతను పాదుకలను పుండలీకునికి అందించాడు, అవి ఇప్పటికీ అతని దగ్గర ముండగాంలో ఉన్నాయి. పుండలీకుడు భక్తితో ఆబహూకరింబడిన పాదుకలను మధ్యాహ్నం పూజించాడు. యోగులు తమ భక్తులను తప్పుదారిన వెళ్ళనివ్వరని ఈకధను బట్టి తెలుస్తోంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 80 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 16 - part 2 🌻*

In the latter half of the night, he saw a person like Shri Gajanan Maharaj in his dream who said, “Pundalik, you seem to have decided to go to Anjangaon with that Bhagabai for getting a Guru. 

You may go if you like. His name is Kashinath, and I tell you that you will be completely disappointed on going there. Can a person become Guru by whispering something in someone’s ear? Many people whisper in one another's ears, does that mean that they became Guru of each other? Pundalik, don't go after hypocrites. Come, listen to me. I will chant a Mantra in your ear.” Saying so, He whispered , “Gan Gan” and kept quiet. 

He further told Pundalik to ask for anything and it would be done. At these words, Pundalik felt very happy. He minutely observed the person in the dream and was glad to confirm that He was Shri Gajanan Maharaj of Shegaon. 

Thereupon Pundalik asked for His ‘Padukas’ to worship and nothing else. Shri Gajanan Maharaj , thereupon, said, “Take these Padukas and worship them tomorrow afternoon.” As Pundalik got up to take the Padukas, he woke up. He looked around and realized that there was nobody and no Padukas. 

He felt confused, but at the same time knew than the words of Shri Gajanan Maharaj can never go waste. He remembered all that Shri Gajanan Maharaj had said about Bhagabai, and also the instructions to worship the Padukas the next day’s afternoon. 

If he has to follow the instructions of Shri Gajanan Maharaj , the Padukas were necessary for worship, but he did not have them. He also thought of getting new Padukas prepared for worship, but again remembered that Shri Gajanan Maharaj had given him, His own Padukas in the dream. 

Then why to prepare new ones? While Pundalik was thinking like that, he heard Bhagabai calling him for going to Anjangaon. He refused to go with her saying that he would not accept anybody other than Shri Gajanan Maharaj as his Guru. So Bhagabai went to Anjangaon alone. Now listen to what happened at Shegaon.

Just two days prior to this incident, Zyam Singh Rajput had gone to Shegaon for the Darshan of Shri Gajanan Maharaj . When he was about to leave for Mundgaon, Shri Gajanan Maharaj called Balabhau and told him to send His (of Shri Gajanan Maharaj ) Padukas with Zyam Singh for handing over the same to Pundalik at Mundgaon. Balabhau did so. Zyam Singh took the Padukas and went. At Mundgaon, Zyam Singh met Pundalik at the entrance of the village. 

He asked Zyam Singh if Shri Gajanan Maharaj sent any Prasad for him. Zyam Singh was surprised. He took him home and asked the reason for his enquiring like that. 

Pundalik frankly told about his dream, which cleared all the doubts in the mind of Zyam Singh. He immediately handed over the Padukas to Pundalik, and the same are still there with him, at Mundgaon. 

Pundalik, with great devotion, worshipped those gifted Padukas in the afternoon. From this story it was seen that saints will never allow their devotees to go the wrong way. Now listen to a story which shows as to how Shri Gajanan Maharaj fulfills the desires of His devotees. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 73 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 23 🌻*

308. ఎంత గొప్ప దార్శనికుడైనను , ఎంత గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త అయినను వీరిద్దరు భౌతిక గోళము లోపలనే యున్నారు .

309. బహు సున్నిత పథార్ధములైన ఈథర్ , అణువు , కంపనము ,వెలుతురు ,రోదసి ఇవియన్నియు , సున్నిత ద్రవ్యము లైనప్పటికీ , అవి భౌతిక పదార్థములే .

310. పంచ గోళములు (త్రిభువనములు) -
(1) భౌతిక గోళము
(9) సూక్మ గోళము
(3) మానసిక గోళము
(1) సంయు క గోళము
(5) సత్యగోళము

అన్నమయ భువనము -
పరస్పర సంబంధ గోళములు

311. భౌతికగోళం యొక్క ఉనికి సూక్ష్మ గోళముపై ఆధారపడియున్నును అనేక తరహాలలో సూక్ష్మ గోళము నకు భిన్నమైనది.

312.భౌతికగోళము సూక్ష్మగోళముయొక్క ఫలితమైనప్పటికీ, సూక్ష్మగోళముపూర్తిగా స్వతంత్రమై నది ఇది సూక్ష్మగోళం పై ఆధారపడియున్నది.

313. భౌతికగోళము అసంఖ్యాకప్రపంచములు, సూర్యులు, చంద్రులు, నక్షత్రములు యింతెందుకు చాలమోటైన జడపదార్ధమునుండి బహుసున్నితమైన భౌతిక పదార్థము వరకు, వీటన్నిటితో కూడియున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 35, 36 / Sri Lalitha Chaitanya Vijnanam - 35, 36 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :* 
*15. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ*
*స్తనభార దలన్మధ్య  పట్టబంధవళిత్రయా*

*🌻 35. 'లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ' 🌻*

కంటిచే చూడదగిన నూగారు తీగకు ఆధార మగుటచే ఊహింపదగిన నడుము కలది. అనగా నడుము వున్నదా? లేదా? అను సందేహము కలిగి, అచట పుట్టిన నూగారుచే నడుము కలదని ఊహింపబడు చున్నది.

 శ్రీదేవి నడుము మిక్కిలి సూక్ష్మమైనదని, చర్మచక్షువులకు గోచరము కానిదని, మాయాతీతమైనదని తెలియవలెను. కనపడుచున్న సృష్టికి, కనపడని సూక్ష్మసృష్టి ఆధారము. ఆకాశము నుండి పంచభూతముల సృష్టి దృగ్గోచరము. దానికి వెనుక గల సూక్ష్మ లోకములో అగుపడనివి. అగుపడనిది, అగుపడు సృష్టి కాధారము. 

శ్రీదేవి నడుము పై భాగమంతయు అదృశ్యము, దివ్యము, అమృతమయమగు లోకములుగ తెలియదగును. 

నడుము క్రిందిభాగము నుండి దృగ్గోచర లోకములు కలవని తెలియవలెను. సూక్ష్మబుద్ధికే ఈ లోకములు తెలియబడ గలవని తెలుపుటకు సూక్ష్మమైన (నూనూగు) రోమముల పంక్తికి ఆధారముగ నడుము కలదని చెప్పుట. 

తెలిసిన దానినుండి తెలియని దానికి ప్రయత్నించుట. పరిమితమైన మనస్సుతో అపరిమితమైన దైవమును తెలియగోరుట ఆరోహణ క్రమము. 

ఈ సూక్ష్మమునకు సంబంధించిన ఆరోహణ క్రమమునకు నూగారు లత లేక తీగ ఉదహరింప బడినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 35 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 35. Lakṣya-roma- latādhāratā- samunneya- madhyamā* *लक्ष्य-रोम-लताधारता-समुन्नेय-मध्यमा (35) 🌻*

Her waist is to be known only from creeper like hair as described in the previous nāma.  

The secretive meaning is that ātma is subtle and can be known only by keen observation (through meditation).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 36 / Sri Lalitha Chaitanya Vijnanam - 36 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :* 
*15. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ*
*స్తనభార దలన్మధ్య పట్టబంధవళిత్రయా*

*🌻 36. 'స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా' 🌻*
 
స్తనముల బరువుచే వీగుచున్న నడుమునకు దృఢము కలిగించుటకు మూడు వరుసల బంగారు పట్టికచే చుట్టబడిన సన్నని నడుము కలది శ్రీదేవి అని భావము. నడుమును గూర్చి ముందు నామములో తెలియజేయబడినది. నడుము చుట్టును ఏర్పడిన మూడు భౌతిక లోకములు, మూడు కాలములను ఈ నామము సూచించును. 

ఇక్కడ చెప్పబడిన మూడు లోకములు మణిపూరకము, స్వాధిష్ఠానము, మూలాధారమునకు సంబంధించినవి. ఇవియే త్రిగుణములు. వీటియందే సమస్త జీవులను శ్రీదేవి తన మాయచే బంధించి వుంచును. 

మనస్సు, ఇంద్రియములు, భౌతిక శరీరము- ఈ త్రివళుల కారణముగ ఏర్పడి జీవునకు ఉపాధి ఏర్పడును. అజ్ఞానము కారణముగ అవి బంధహేతువు లగును. జ్ఞానము సిద్ధించినచో ఈ ఉపాధులు వైభవ కారకములగును.

శ్రీదేవి నడుముచుట్టును వున్న ఈ మూడు వరుసల బంగారుపని చక్కగ ధ్యానము చేసినవారికి అమ్మయే బంధములను సడలించును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 36 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 36. Stanabhāra- dalanmadhya- paṭṭabandha-valitrayā* *स्तनभार-दलन्मध्य-पट्टबन्ध-वलित्रया (36) 🌻*

The golden belt that She wears supports Her waist as it bends under the heaviness of Her bosoms, resulting in three folds in Her stomach area. 

Saundarya Laharī (verse 80) says “Your bosoms rubbing at the upper arms, abounding the bodice and the God of love, in order to protect Your hip from breaking has bound Your hip with three fold strands.”   

The possible interpretation could be that Her compassion to the universe is vast which is referred to as heaviness here.  

The three lines in Her hip indicate Her three activities – creation, sustenance and dissolution. Her time for compassion is more than Her other activities. After all She is the Supreme Mother.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 433 / Bhagavad-Gita - 433 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 43 🌴*

43. పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమో(స్త్యభ్యదిక: కుతో(న్యో
లోకత్రయే(ప్యప్రతిమప్రభావ ||

🌷. తాత్పర్యం : 
స్థావర, జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్యపూజనీయుడగు పరమ ఆధ్యాత్మికగురుడవు నీవే. నీతో సమానమైనవాడు గాని, ఏకమైనవాడుగాని మరొకడుండడు. ఓ అపరిమితశక్తి సంపన్నుడా! అట్టి యెడ నీ కన్నను అధికుడు ముల్లోకములలో ఎవడుండును?

🌷. భాష్యము : 
న తస్య కార్యం కరణం చ విద్యతే |
న తత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే ||

సాధారణ మనుజుని వలెనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సైతము ఇంద్రియములను మరియు దేహమును కలిగియున్నాను, ఆ భగవానుని విషయమున అతని ఇంద్రియములు, దేహము, మనస్సు, ఆత్మ నడుమ ఎట్టి భేదము లేదు. 

కాని అతనిని పూర్ణముగా నెరుగని మూఢులే అతని ఇంద్రియములు, మనస్సు, దేహాదులు అతని కన్నను అన్యమని పలుకుదురు. కాని వాస్తవమునకు శ్రీకృష్ణుడు దివ్య పరతత్త్వము. కనుకనే అతని కర్మలు, శక్తులు దివ్యములై యున్నవి. 

మనకున్నటువంటి ఇంద్రియములు లేకున్నను, ఇంద్రియ కార్యము లన్నింటిని అతడు చేయగలిగినంతనే అతని ఇంద్రియములు పరిమితములు లేక అసమగ్రములు కావని తెలుపబడినది. అతని కన్నను ఘనుడైనవాడు లేడు. అలాగుననే అతనికి సముడును లేదు. సర్వులును ఆ శ్రీకృష్ణభగవానుని కన్నను తక్కువైనవారే. 
దేవదేవుని జ్ఞానము, శక్తి, కర్మలు అన్నియును దివ్యములు. ఈ విషయమే భగవద్గీత యందు ఇట్లు తెలుపబడినది (4.9).

జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వత: |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మా మేతి సో(ర్జున ||

శ్రీకృష్ణుని దివ్యమైన జన్మను, కర్మలను, పూర్ణత్వమును సంపూర్ణముగా నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట ఆ కృష్ణునే చేరి ఈ దుఃఖపూర్ణ జగమునకు తిరిగిరాకుండును. 

కనుక శ్రీకృష్ణుని కర్మలు ఇతరుల కర్మల కన్నను భిన్నమైనవని ప్రతియొక్కరు ఎరుగవలెను. అందులకు శ్రీకృష్ణుడు తెలిపిన నియమములను పాటించుట అత్యుత్తమ పధ్ధతి. అది ఎల్లరును పూర్ణులను చేయగలదు. ఆ భగవానునకు ఎవ్వరును యజమానులు కారనియు, ప్రతియొక్కరు అతని భృత్యులనియు తెలుపబడినది. 

“కృష్ణుడొక్కడే భగవానుడు. ఇతరులందరును అతని సేవకులు” అని చైతన్యచరితామృతము (ఆదిలీల 5.14) ఈ విషయమునే నిర్ధారించుచున్నది (ఏకలే ఈశ్వర కృష్ణ, ఆర సబ భృత్య). అనగా ప్రతియొక్కరు అతని ఆజ్ఞానుసారమే వర్తింపవలసి యున్నది. ఎవ్వరును అతని ఆజ్ఞను త్రోసిపుచ్చజాలరు. 

ఆ రీతిగా ప్రతియొక్కరు అతని పర్యవేక్షణలో అతని నిర్దేశము ననుసరించియే వర్తించుచున్నారు. బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు ఆ దేవదేవుడే సర్వకారణములకు కారణుడై యున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 433 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 43 🌴*

43. pitāsi lokasya carācarasya
tvam asya pūjyaś ca gurur garīyān
na tvat-samo ’sty abhyadhikaḥ kuto ’nyo
loka-traye ’py apratima-prabhāva

🌷 Translation : 
You are the father of this complete cosmic manifestation, of the moving and the nonmoving. You are its worshipable chief, the supreme spiritual master. No one is greater than You, nor can anyone be one with You. How then could there be anyone greater than You within the three worlds, O Lord of immeasurable power?

🌹 Purport :
The Supreme Personality of Godhead, Kṛṣṇa, is worshipable as a father is worshipable for his son. He is the spiritual master because He originally gave the Vedic instructions to Brahmā and presently He is also instructing Bhagavad-gītā to Arjuna; therefore He is the original spiritual master, and any bona fide spiritual master at the present moment must be a descendant in the line of disciplic succession stemming from Kṛṣṇa. Without being a representative of Kṛṣṇa, one cannot become a teacher or spiritual master of transcendental subject matter.

The Lord is being paid obeisances in all respects. He is of immeasurable greatness. No one can be greater than the Supreme Personality of Godhead, Kṛṣṇa, because no one is equal to or higher than Kṛṣṇa within any manifestation, spiritual or material. Everyone is below Him. No one can excel Him. This is stated in the Śvetāśvatara Upaniṣad (6.8):

na tasya kāryaṁ karaṇaṁ ca vidyate
na tat-samaś cābhyadhikaś ca dṛśyate

The Supreme Lord, Kṛṣṇa, has senses and a body like the ordinary man, but for Him there is no difference between His senses, His body, His mind and Himself. 

Foolish persons who do not perfectly know Him say that Kṛṣṇa is different from His soul, mind, heart and everything else. Kṛṣṇa is absolute; therefore His activities and potencies are supreme. It is also stated that although He does not have senses like ours, He can perform all sensory activities; therefore His senses are neither imperfect nor limited. No one can be greater than Him, no one can be equal to Him, and everyone is lower than Him.

The knowledge, strength and activities of the Supreme Personality are all transcendental. As stated in Bhagavad-gītā (4.9):

janma karma ca me divyam
evaṁ yo vetti tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti mām eti so ’rjuna

Whoever knows Kṛṣṇa’s transcendental body, activities and perfection, after quitting his body, returns to Him and doesn’t come back again to this miserable world. 

Therefore one should know that Kṛṣṇa’s activities are different from others. The best policy is to follow the principles of Kṛṣṇa; that will make one perfect. It is also stated that there is no one who is master of Kṛṣṇa; everyone is His servant. 

The Caitanya-caritāmṛta (Ādi 5.142) confirms, ekale īśvara kṛṣṇa, āra saba bhṛtya: only Kṛṣṇa is God, and everyone else is His servant. Everyone is complying with His order. 

There is no one who can deny His order. Everyone is acting according to His direction, being under His superintendence. As stated in the Brahma-saṁhitā, He is the cause of all causes.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Join and Share My Groups 🌹*
Prasad Bharadwaj 

*చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel*
https://t.me/Spiritual_Wisdom

*చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group*
https://t.me/ChaitanyaVijnanam

*JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.*
https://t.me/vishnusahasra

*Join and Share శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam* 
https://t.me/srilalithadevi

*Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam*
https://www.facebook.com/groups/465726374213849/ 

*Like and Share FB Page*
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/

*Follow and Share FB Page*
https://www.facebook.com/శ్రీ-లలితా-దేవి-చైతన్యము-Sri-Lalitha-Devi-Chatanyam-103080154909766/
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 5 / Sri Devi Mahatyam - Durga Saptasati - 5 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 1
*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 5 🌻*

“నీ చేతనే ఈ విశ్వం భరింపబడుతోంది. ఈ జగత్తు నీ చేతనే సృజింపబడుతోంది. దేవీ! నీ చేతనే అది పరిపాలింపబడుతోంది.
దానిని ఎల్లప్పుడూ నీవే చివరకు మ్రింగివేస్తావు. (ఎల్లప్పుడూ సర్వ) జగద్రూపవై ఉండే నీవు జగత్సృష్టి కాలంలో సృజనశక్తిగా, స్థితికాలంలో
పరిపాలనశక్తిగా, లయకాలంలో సంహరణశక్తిగా ఉంటావు. 

మహాజ్ఞానానివి, మహా అజ్ఞానానివి కూడా నీవే. నీవే మహాబుద్ధివి, మహాస్మరణశక్తివి, మహాభ్రాంతివి. నీవు మహాదేవివి, మహా అసురివి* నీవే. “నీవు సర్వానికి మూలకారణమైన ప్రకృతివి. త్రిగుణాలను - ప్రవర్తింప చేసే తల్లివి. కల్పాంత ప్రళయకాలపు కాళరాత్రివి నీవే. అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి నీవే. భయంకరమైన మోహరాత్రివి కూడా నీవే. (75–78)

నీవు లక్ష్మివి, ఈశ్వరివి, వినమ్రతవు, ప్రబోధాన్ని కల్పించే జ్ఞానచిహ్నమైన బుద్ధివి నీవే, లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, ఓరిమిగల తల్లివి. ఖడ్గం, శూలం, గద, చక్రం, శంఖం, ధనుర్బాణాలు, భుశుండి, ఇనుపకట్లగుది అనే ఆయుధాలు దాల్చిన భయంకరివి. కాని
నీవు క్షేమంకరివైన శుభమూర్తివి అవుతావు. శుభవస్తువులంన్నిటి కన్నా అధికమైన శుభమూర్తివి నీవు. అత్యంత సౌందర్యవతివి నీవు. పరాపరాలకు అతీతమైన పరమేశ్వరివి నీవే. 

“ఎక్కడ ఏ వస్తువు - సద్రూపమైనది గాని, అసద్రూపమైనది గాని- ఉంటే, ఆ వస్తువుకు గల శక్తి అంతా నీవే. అఖిలాత్మికవైన నిన్ను నేను స్తుతింప సమర్థుడనా? జగత్తును అంతా సృజించి, నిర్వహించి, లయింపజేయువాడు కూడా నీచేత నిద్రావశుడవుతున్నాడు. నిన్ను స్తుతించే శక్తిగల వారు ఇక్కడ ఎవరు ఉన్నారు? (79-83)

మమ్మలినందరిని (విష్ణువును, నన్ను, ఈశ్వరుణ్ణి) శరీరాలు ధరించేటట్లు చేసిన నిన్ను స్తుతించు శక్తిగల వారు ఎవరు ఉన్నారు? దేవీ! ఇలా స్తుతింపబడిన తల్లివై అప్రతిహతులైన ఈ మధుకైటభాసురులను నీ ఉదార ప్రభావముచేత సమ్మోహితులను చేయి.

జగత్స్వామియైన అచ్యుతుడు త్వరితంగా మేలుకొల్పబడి, ఈ మహాసురులను వధించుటేట్లు ప్రభోదనం పొందుగాక!” (అంటే 'మేలుకొల్పి ప్రభోధించు' అని అర్థం). 82-87

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 5 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

Chapter 1
*🌻 Description of Killing of Madhu and Kaidabha - 5 🌻*

  75-77. 'By you this universe is borne, by you this world is created. By you it is protected, O Devi and you always consume it at the end. 

O you who are (always) of the form of the whole world, at the time of creation you are of the form of the creative force, at the time of sustentation you are of the form of the protective power, and at the time of the dissolution of the world, you are of the form of the destructive power. 

You are the supreme knowledge as well as the great nescience, the great intellect and contemplation, as also the great delusion, the great devi as also the great asuri.

78-81. ' You are the primordial cause of everything, bringing into force the three qualities. You are the dark night of periodic dissolution. 

You are the great night of final dissolution, and the terrible night of delusion. You are the goddess of good fortune, the ruler, modesty, intelligence characterized by knowledge, bashfulness, nourishment, contentment, tranquillity and forbearance. 

Armed with sword, spear, club, discus, conch , bow, arrows, slings and iron mace, you are terrible( and at the same time) you are pleasing, yea more pleasing than all the pleasing things and exceedingly beautiful. You are indeed the supreme Isvari, beyond the high and low.

82-87. 'And whatever of wherever a thing exists, conscient (real) or non-conscient (unreal), whatever power all that possesses is yourself. 

O you who are the soul of everything, how can I extol you (more than this)? By you, even he who creates, sustains and devours the world, is put to sleep. 

Who is here capable of extolling you? Who is capable of praising you, who have made all of us- Vishnu, myself and Shiva- take our embodied forms? O Devi, being lauded thus, bewitch these two unassailable asuras Madhu and Kaitabha with your superior powers. 

Let Vishnu, the Master of the world, be quickly awakened from sleep and rouse up his nature to slay these two great asuras.' The Rishi said: 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 135 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 9 🌻*

69. అప్పుడు బ్రహ్మ కొంచెం కోపాడ్డాడు,”నేను నిన్ను సృష్టించాను. నీకు ఆజ్ఞ ఇస్తే నన్ను కాదంటావా? వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు. నిన్ను శిక్షించగలను జాగ్రత్త!” అన్నాడు. “తండ్రీ! సారహీనమైన, ఘోరమైన దుఃఖం పాలుజేసే సంసారంలో నన్ను పడేస్తానన్నావు కదా! నీ ఆజ్ఞాపాలన అంటే అదే కదా! అలాచేయకపోతే శిక్షిస్తావు. 

70. అంతకన్నా శిక్ష ఇంకా ఏముంటుంది? కబట్టినువ్వు ఇంతకంటే ఇంక ఏం శిక్షించగలవో చూస్స్తాను నేను!” అన్నాడు నారదుడు. “కాబట్టి శాపగ్రస్తుణ్ణి చేసినా, నువ్వు ఏం చేసినా సంతోషమే, చెయ్యి!” అన్నాడు. బ్రహ్మకు కోపం వచ్చింది. “నువ్వు విధేయుడివిగా ఉన్నావు. నేను ఒప్పుకోను. 

71. పోనీ నిన్ను సనకసనందాదులవలే వదిలేస్తే, నా కార్యమెలా నెరవేరుతుంది? ఇప్పుడు నీలో ఉండేటటువంటి వైరాగ్యప్రవృత్తిని నేను హరిస్తాను. నీలో అవిద్యను ప్రవేశపెడతాను. అది నా చేతిలో ఉంది” అని అతడిలో అవిద్యను ప్రవేశపెట్టి, “సంగీతం ఒకటి తీసుకున్నావుకదా! ఈ సంగీతవిద్యను గంధర్వులుకూడా భవిష్యత్తులో వాళ్ళవృత్తిగా తీసుకుంటారు. సంగీతము, నాట్యము మొదలైన గంధర్వ విద్యలు.

72. గంధర్వ లోకంలో వాళ్ళకు అదే వృత్తి, ప్రవృత్తి. వాటినే ఆశ్రయించుకుని ఈశ్వరారాధన చేస్తారు. సుఖంగా ఉంటారు. ఈశ్వరారాధన చేసినా వాళ్ళకు భక్తి, జ్ఞానము, అంతర్ముఖత్వము ఉండదు. సంగీతం ద్వారానే ఈశ్వరుడిని ఆరాధిస్తారు. వారివలనే నీ తత్త్వజ్ఞానాన్ని విస్మరించి నువ్వుకూడా గంధర్వుడివై, స్త్రీలోలుడివై అప్పుడు నా సంకల్పం నెరవేరుస్తావు” అన్నాడు.

73. అప్పుడు నారదుడు ఆయనతో, “నువ్వు విష్ణువు జగత్పూజ్యుడని ఇంతకుముందే చెప్పావు తండ్రీ! ఆయన పరమ జ్ఞానస్వరూపుడని, ఆయనను ఆశ్రయిస్తే జ్ఞానం కలుగుతుందని చెప్పావు. ఆ కారణం చేత ఆయన పూజ్యుడన్నావు. నువ్వు అడిగినది నేను వద్దంటే, నాకు అజ్ఞానాన్నిచ్చి నన్ను శాపగ్రస్తుడిని చేసావు. జ్ఞానాన్నిచ్చే విష్ణువు పూజ్యుడయితే, నీవు జగత్పూజ్యుడివి కాదన్నమాటే కాదన్నమాటే కదా!

74. నీకు భూలోకం లో గాని, మరెక్కడా గాని పూజ ఉండదు. కాబట్టే నేనిలా అంటున్నాను నిన్ను. ఇప్పుడు నీ ముఖతః ఇవ్వబడింది కనుక, అష్టాక్షరీ మహామంత్రోపదేశం అప్రతిహతమైన శక్తి కలిగినది. నేను ఏ గంధర్వ జన్మ ఎత్తినా, స్త్రీ జన్మ ఎత్తినా, పశుజన్మ ఎత్తినా ఆ హరిభక్తి, అష్టాక్షరీ నన్ను విడవకుండుగాక!” అని శాసనం చేసుకున్నాడు. తండ్రి సమక్షంలో శాసనాన్ని చేసుకున్నాడు. 

75. అట్టి మహత్తర శక్తి సంపన్నుడు నారదుడు. అతడి సంకల్పం అవక్రంగా ఉంది. సంసారం ఒక విషవృక్షం అని చెపుతూ, అందులో రెండు స్వాధుఫాలాలు అని చెపుతారు పెద్దలు. ఈ విషవృక్షానికి మధురఫలాలు ఎలా కాస్తాయి అంటే, ఆ మధురఫలాలు లేకపోతే ఆ విషవృక్షాన్ని అందరూ ఛేదించి వెళ్ళిపోతారు. దాంట్లో కూడా ఒకటో రెండో రుచికరమైన ఫలాలు దొరుకుతాయి కాబ్ట్టే దాన్ని ఆశ్రయించి, అది ఎంత విషవృక్షమైనా దానిని వదలరు. ఆ స్వాధుఫలాలు రెండూ అనుకూలమైన దాంపత్యం (అనుకూలమైన భార్య), పుత్రసర్శనం అనేవి. వాటికోసం ఆశిస్తారు. సంసారంలో ప్రవేశిస్తారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 52 🌹*
*🍀 12. పెద్దలు - ప్రమాణములు - తమను అనుకరించు వారు ఎవరికైతే యుందురో వారికి కర్మ నిర్వహణము నందు ఒక అదనపు బాధ్యత ఏర్పడును. అదికారణముగ గుర్తింపు పొందిన పెద్దవారి కర్మనిర్వహణ విధానము ప్రమాణముగ నుండవలెను 🍀*  
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. కర్మయోగము - 21, 22, 23, 24 📚*

21. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 21 ||
22. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 22 ||
23. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 23 ||
24. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః || 24 ||

యద్యదాచరతి శ్రేష్ఠ :
లోకమున పెద్దలు ఏమి చేయుచున్నారో గమనించి ఇతరులు కూడ వారి ననుకరింతురు. అందువలన పెద్దవారుగా గమనింపబడువారికి కర్మ నిర్వహణమున ఎక్కువ బాధ్యత గలదు. 

తమను అనుకరించు వారు ఎవరికైతే యుందురో వారికి కర్మ నిర్వహణము నందు ఒక అదనపు బాధ్యత ఏర్పడును. తల్లిదండ్రులను పిల్లలు అనుకరింతురు. ఉపాధ్యాయులను విద్యార్థులనుకరింతురు. గురువులను శిష్యులనుకరింతురు. వివిధ రంగములలో ఉత్తమ శ్రేణికి చెందినవారిని ఆయా రంగములలో పనిచేయువా రనుకరింతురు. 

అందువలన అనుకరింపబడు వారికి అనుకరించు వారి యెడల బాధ్యత యున్నది. అదికారణముగ గుర్తింపు పొందిన పెద్ద వారు వారి కర్మనిర్వహణ విధానము ప్రమాణముగ నుండవలెను.

అనుకరించువారు అనునిత్యము తాము ప్రమాణముగ నేర్పరచుకున్న పెద్దవారిని అనుసరింతురు. వారు పొగత్రాగినచో వీరును త్రాగుదురు. వారికి అపరిశుభ్రపు అలవాట్లు ఉన్నచో వీరును అట్లే యుందురు. వారసత్యము లాడినచో వీరును ఆడుదురు. వారు బాధ్యతా రహితముగ ప్రవర్తించినచో, వీరును అట్లే చేయుదురు. వారేమి చేసిన వీరును అట్లే చేయుటకు ప్రయత్నింతురు. అందువలన ప్రత్యేకముగ వారి కవసరము లేకపోయినప్పటికిని, చిన్నవారి మేలుకోరి పెద్దవారు కొన్ని కొన్ని విషయములలో మార్గదర్శకులై ప్రవర్తించవలసి యుండును.

నిజమునకు శ్రీకృష్ణునకు సాందీపని యొద్ద చేరి విద్య నభ్యసించు అవసరము లేదు. అయినను ఇతరుల శ్రేయస్సు కోరి అట్లాచరించెను. వివాహముతో పనిలేదు. అయినను సంఘ మర్యాదలు పాటించి వివాహమాడి సంతతిని కనెను. యుద్ధము చేయవలసిన పని అసలేలేదు. అయినను క్షత్రియ జన్మ మెత్తుట వలన యుద్ధమునందు పాల్గొనెను. శ్రీరాముని జీవితము గూడ చాల విషయములలో అట్లే నిర్వర్తింపబడినది. 

శ్రీరాముని ఆదర్శముగ గొనిన భారతీయులు సర్వసామాన్యముగ ఏకపత్నీ వ్రతమును ఆచరించుదురు. భారతీయ సంప్రదాయమున నేటికిని ఈ భావము అధికముగ అనుసరింపబడు చున్నది. ఒక స్త్రీ కి ఒక పురుషుడు. ఒక పురుషునకు ఒక స్త్రీ. ఈ సంప్రదాయము కేవలము భరతభూమియందే ఇంకను నిలచియున్నది. భరత సంప్రదాయమునకు వెన్నెముకగ నిలచిన ఋషులందరును ముక్తసంగులే. వారికీ ప్రపంచమున ఏమియును అవసరము లేదు. పంచభూతములు వారి వశమై యుండును. 

అయినప్పటికిన్ని ఇతర జీవులకు ప్రామాణికముగ నుండవలెనను బాధ్యతాయుత భావముతో వారు వివాహ మాడిరి. గృహస్థు జీవితమును నిర్వర్తించి చూపిరి. సంఘమున ఉద్యోగ వృత్తి వ్యాపారములను కూడ నిర్వర్తించిరి. అట్లు కానిచో సంఘధర్మము దెబ్బతినును. ఈ యంశము ననుసరించియే ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలగు మహాత్ములను గూడ భరతధర్మము పరిపూర్ణ మానవునిగ పరిగణించలేదు. 

ఈ మహాత్ములను అనుకరించువారు కూడ వారివలె వివాహమాడక, కోరికలను అణగదొక్కుకొని సతమత మగుచున్నారు. పశ్చిమ దేశములలో మతాధికారులు లైంగిక చర్యలకు పాటుపడుచు నేరగ్రస్తులగుట ఆధునిక కాలమున గమనించబడుచునే యున్నది. గదా! సాధారణ మానవులను మనస్సులో నుంచుకొని వారికి అనుకరణీయముగ నుండు శ్రేష్ఠమగు మార్గమును పెద్దలు నిర్వర్తించుట శ్రీకృష్ణుని కర్మ సిద్ధాంతమున మరియొక ముఖ్య లక్షణము. 

ప్రస్తుత కాలమున దేశనాయకులు, మతాధికారులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, వైద్యులు, అగ్రశ్రేణి వ్యాపారస్తులు, అధికారులు పనిచేయు విధానము బాధ్యతారహితముగ యున్నది. అదికారణముగనే జనబాహుళ్యము గూడ బాధ్యత తప్పినది. క్రమ శిక్షణ తరిగినది. శ్రద్ధ లోపించినది. బాధ్యతలయందు పోటీ పడుటగా కాక హక్కులయందు పోటీపడు మ్లేచ్చ ధర్మము భరత భూమిని కూడ కబళించినది. ఇట్టి స్థితికి పెద్దలే కర్తలు. పెద్దలే బాధ్యులు. వీరు జనులను చెడగొట్టిన వారగుచున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 198 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 47. Try to stabilize in the primary concept ‘I am’ in order to lose that and be free from all other concepts, in understating the unreality of the ‘I am’ you are totally free. 🌻* 

You are in turmoil, you are in despair, you are afraid, you are troubled with all this mess that you see around yourself, you seek freedom from all this. 

You meet the Guru, in whatever form, human or his words recorded in books and he explains to you all about the ‘I am’ and its implications. 

Once he has done that, it is now up to you to do as he says. Come down to the primary concept ‘I am’, abide in it and understand its unreality and be totally free. 

Always bear in mind that whatever the Guru says is from his own experience and not hearsay.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 54 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 4 🌻*
          
🌟. *7వ లెవెల్:-*

హృదయ చక్రం తెరవబడి భావోద్వేగాల విషయంలో దృష్టిని సాధించడం జరుగుతుంది. పాత భావాలు భావోద్వేగాలను మరింతగా రిలీజ్ చేస్తూ ఉంటాం.(ఇది మరింతగా భావోద్వేగాల మార్పు సమయం అని చెప్పవచ్చు.)ప్రతి పని కూడా పిల్లల్లాగా స్వచ్ఛమైన మనస్సుతో చేయడం జరుగుతుంది. వాస్తవంలో జీవించడం జరుగుతుంది.

✨. మనం ప్రతి చిన్న ఫీలింగ్ ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం. ప్రతి క్షణంలో మరింత అనుభూతిని చెందుతూ ఉంటాం. పాత సంబంధాలు దూరమౌతూ ఉంటాయి.

✨. చాతి నొప్పి మరింత సహజంగా అనిపిస్తుంది.
 దీనికి కారణం గుండె శక్తిక్షేత్రాలు(హృదయ చక్రం) మరింతగా తెరవబడి విశ్వమూలశక్తితో అనుసంధానం అవుతుంటాయి.(ఇక్కడ చక్రా మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది)

✨. హృదయంలో నిక్షిప్తమై ఉన్న భయాలు తొలగించబడతాయి. శరీరాలు, శక్తిక్షేత్రాలు సమలేఖనంలోనికి తీసుకునిరాబడతాయి.

✨. పీనియల్ మరి పిట్యూటరీ గ్రంథులు మరింతగా తెరవబడతాయి. వీటిలో ఉన్న శక్తులు జాగృతి అవుతూ వృద్ధాప్యాన్నీ, మరణాన్నీ శరీరానికి దూరం చేస్తూ ఉంటాయి. నుదురుచక్రం, తల వెనుక చక్రంలో అధిక ఒత్తిడి కలిగి తలనొప్పి విపరీతంగా అనిపిస్తుంది.

✨. పీనియల్ గ్రంథి మరింతగా ఓపెన్ అయ్యి అది మల్టీడైమెన్షనల్ గా ఎదుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ద్వంద్వత్వం మరింతగా బయటకు కనిపిస్తూ ఉంటుంది.

✨. ఈ సమయంలో కొన్ని రోజులు *"ఆనందంతో ఉన్నాం"* అనిపిస్తుంది. మరి కొన్ని రోజులు భయంతో గడుపుతూ ఉంటాం. 

✨. ఆత్మతో అనుసంధానం పెరుగుతుంది. దీనివలన మనం మరింతగా అధిరోహణ పొందుతూ ఉంటాం. ఈ తరుణంలో భూమిని విడిచి హైయ్యర్ సెల్ఫ్ తో కలిసిపోవాలనిపిస్తూ ఉంటుంది.

✨. ఆనందాన్ని నేర్చుకుంటూ అనుభవిస్తూ ఉంటాం. ఈ స్థితిని గ్రహంపై ఉన్న అందరికీ అనుభవంలోకి తీసుకొని రావాలి అని అనిపిస్తూ ఉంటుంది. దాని కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాం.

✨. ఈ పురోగమన దశ వల్ల మనం తీసుకునే ఆహారంలో మరింత మార్పులు సంభవిస్తాయి. శరీరం సాత్విక ఆహారాన్నే కోరుకుంటుంది.
మాంసం, మద్యం, చక్కెర కెమికల్ ఫుడ్ శరీరానికి హాని కలిగిస్తూ శరీరాన్ని అసెన్షన్ వైపుకు వెళ్ళకుండా చేస్తుంది.

✨. *8వ లెవెల్:-*

ఈ స్థితిలో అందరిలో మనం మాస్టరీని చూస్తాం. మరింతగా గ్రహానికి సేవ చేయాలని ఉన్నతంగా కోరుకుంటూ ఉంటాం. ప్రాపంచకంగా శ్రమపడి సంపాదించాలి అనే తత్వాన్ని వదిలివేస్తాం.

✨. పీనియల్ పిట్యుటరీ గ్రంథులు ఇంకా మరింతగా మారుతూ ఉంటాయి. దీని కారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. మనతో ఉన్న లైట్ బీయింగ్స్ ని తలలో ఉన్న ఎండార్ఫిన్ విడుదల చేసి మనకు మరింత రిలీఫ్ ని కలిగించమని అడుగుదాం!

✨. మెదడు సంక్రియం చేయబడుతూ ఉంటుంది. ముఖ్యంగా సరెబ్రమ్( దీనిని స్లీపింగ్ జాయింట్ అంటారు) విస్తరణ జరుగుతుంది. నుదురులో త్రిభుజాకార సీడ్ స్పటికాలు మరి మెదడు యొక్క కుడివైపున ఉన్న రికార్డర్ స్పటికాలు మరి 8,9,10 చక్రాలు ఆక్టివేట్ చేయబడతాయి.

✨. మనలో జరిగే మార్పులను గురించి చెప్పటానికి మాటలను వెతుక్కోవలసి ఉంటుంది. మరింత గందరగోళంగా ఉంటుంది. మనలో జరుగుతున్న మార్పులను డీ-కోడ్ చేయమని మన చక్రా మాస్టర్స్ ని అడుగుదాం!

✨. ఈ స్థితిలో చాలా గ్రేడింగ్ అవసరమవుతుంది. స్వచ్ఛమైన గాలి, ఆహారం, అధిక ప్రాణశక్తిని గ్రహిస్తూ మరింతగా మెరుగుపడుతూ ఉంటాం. ధ్యానం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది.

✨. ఈథర్ నుండి సంపూర్ణ ఆరోగ్యం పొందుతూ ఉంటాం.
 పీనియల్ గ్రంథి సైజు పెరగడం వలన రెండు కనుబొమ్మల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. దివ్య నేత్రం యాక్టివేషన్ లోకి వస్తుంది. పిట్యూటరీ గ్రంధి సైజు పెరగడం వలన తల వెనుక భాగంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. వీటి ద్వారా మనం ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్నీ ఆత్మ యొక్క నిర్ణయాలు అందుకోవడం ప్రారంభిస్తాం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు -37 / Sri Vishnu Sahasra Namavali - 37 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*సింహ రాశి- మఖ నక్షత్ర 1వ పాద శ్లోకం*

*🌻 37. అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః।*
*అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః॥ 🌻*

అర్ధము :

🍀. అశోకః - 
శోకము లేనివాడు, నిత్యానంద స్వరూపుడు.

🍀. తారణః - 
దాటించువాడు, సంసారమనే సాగరాన్ని సునాయాసంగా దాటించువాడు.

🍀. తారః - 
తరింపజేయువాడు, సంసార బంధములనుండి విముక్తిని ప్రసాదించువాడు. 

🍀. శూరః - 
పరాక్రమశాలి, మనస్సు, బుద్ధి, అహంకారములను జయించినవాడు. 

🍀. శౌరిః - 
సౌర్యముతో రజో, తమో గుణములను అణచివేయువాడు, 

🍀. జనేశ్వరః - 
జనులకు ప్రభువు, జీవులను రక్షించువాడు. 

🍀. అనుకూలః - అనుకూలమైనవాడు, జ్ఞాన సముపార్జనకు సహకరించువాడు. 

🍀. శతావర్తః - 
జీవరూపంలో నిరాటకంగా ఆవిర్భవించువాడు. 

🍀. పద్మీ - 
పద్మమును (ఆనందమును, జ్ఞానమును) ధరించినవాడు, 

🍀. పద్మనిభేక్షణః - 
పద్మము వంటి కన్నులుగలవాడు, కృపాకటాక్షవీక్షణలు కురిపించువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 37 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Simha Rasi, Makha 1st Padam*

*🌻 37. aśōkastāraṇastāraḥ śūraḥ śaurirjaneśvaraḥ |*
*anukūlaḥ śatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ || 37 ||*