🌹 12, JUNE 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 12, JUNE 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 12, JUNE 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 191 / Kapila Gita - 191🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 01 / 5. Form of Bhakti - Glory of Time - 01 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 783 / Vishnu Sahasranama Contemplation - 783 🌹 
🌻783. లోకసారఙ్గః, लोकसारङ्गः, Lokasāraṅgaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 744 / Sri Siva Maha Purana - 744 🌹
🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 3 / Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 3 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 363 / Osho Daily Meditations - 363 🌹 
🍀 363. పిచ్చివాళ్ల ఇల్లు / 363. MAD HOUSE 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 1 🌹 
🌻 460. 'సుభ్రూ' - 1 / 460. 'Subhru' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 12, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 35 🍀*

*71. బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః | సయజ్ఞారిః సకామారిర్మహాదంష్ట్రో మహాయుధః*
*72. బహుధానిందితః శర్వః శంకరః శంకరోఽధనః | అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : హృదయం ద్రవించాలి - హృదయాన్ని భావశూన్యంగా ఎండగట్టడం పూర్ణయోగ పద్ధతి కానేరదు. భావావేశములతో హృదయం ద్రవీభూతం కావలసినదే. కానీ, ఆ భావవేశాలు ఈశ్వరాభి ముఖములు కావడం అవసరం. పైనుండి వచ్చెడి దివ్యప్రవాహాని కెదురు చూస్తూ హృదయం ఒకొక్కప్పుడు ఏ భావావేశాలూ లేని ప్రశాంత స్థితిలో నుండవచ్చును. హృదయం భావశూన్యమై ఎండువారినదని దానిని బట్టి భావింపరాదు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: కృష్ణ నవమి 10:36:24 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 13:51:25
వరకు తదుపరి రేవతి
యోగం: ఆయుష్మాన్ 07:52:14 వరకు
తదుపరి సౌభాగ్య 
కరణం: గార 10:37:25 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 12:42:10 - 13:34:47
మరియు 15:20:01 - 16:12:39
రాహు కాలం: 07:19:51 - 08:58:31
గుళిక కాలం: 13:54:31 - 15:33:11
యమ గండం: 10:37:11 - 12:15:51
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41
అమృత కాలం: 09:10:24 - 10:43:36
సూర్యోదయం: 05:41:11
సూర్యాస్తమయం: 18:50:30
చంద్రోదయం: 01:15:38
చంద్రాస్తమయం: 13:39:36
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: గద యోగం - కార్య హాని ,
చెడు 13:51:25 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 191 / Kapila Gita - 191 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 01 🌴*

*దేవహూతిరువాచ*
*01. లక్షణం మహదాదీనం ప్రకృతే పురుషస్య చ|*
*స్వరూపం లక్ష్యతేఽమీషాం యేన తత్పరమార్థికమ్॥*

*తాత్పర్యము : దేవహూతి పలికెను*- ప్రభూ! సాంఖ్యశాస్త్రమునందు వర్ణింపబడిన ప్రకృతిని, పురుషుని, మహత్తత్ప్వాదులను గూర్చి నీవు విశదపఱచితివి. వాటి వాస్తవిక స్వరూపమును, పారమార్థిక స్వరూపమును గూడ వివరించితివి.*

*వ్యాఖ్య : ప్రపంచాన్ని సంగరముగా వివరించారు. మోక్షం లభించడానికి కావలసిన జ్ఞ్యాన భక్తి యోగ కర్మ సాధనాలు వివరించారు. అన్నింటి కన్నా ముఖ్యమైంది భక్తీ అని చెప్పారు. ఇలాంటి భక్తి యోగం ఎన్ని రకములు, విస్తరముగా వివరించారు. ఏ సాధనముతో పరమాత్మ జ్ఞ్యానం కలుగుతుందో అది కూడా చెప్పారు. ప్రకృతి పురుషుడు మహత్తు అవ్యక్తమూ అహంకారమూ, వాటి లక్షణాలు, దేవ దానవ తిర్యక్ మనుష్య స్వరూపాలు వివరించారు.

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 191 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 01 🌴*

*01. devahūtir uvāca*
*lakṣaṇaṁ mahad-ādīnāṁ prakṛteḥ puruṣasya ca*
*svarūpaṁ lakṣyate 'mīṣāṁ yena tat-pāramārthikam*

*MEANING : Devahūti inquired: My dear Lord, You have already very scientifically described the symptoms of the total material nature and the characteristics of the spirit according to the Sāṅkhya system of philosophy.*

*PURPORT : In this Twenty-ninth Chapter, the glories of devotional service are elaborately explained, and the influence of time on the conditioned soul is also described. The purpose of elaborately describing the influence of time is to detach the conditioned soul from his material activities, which are considered to be simply a waste of time. In the previous chapter, material nature, the spirit and the Supreme Lord, or Supersoul, are analytically studied, and in this chapter the principles of bhakti-yoga, or devotional service—the execution of activities in the eternal relationship between the living entities and the Personality of Godhead—are explained.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 783 / Vishnu Sahasranama Contemplation - 783🌹*

*🌻783. లోకసారఙ్గః, लोकसारङ्गः, Lokasāraṅgaḥ🌻*

*ఓం లోకసారఙ్గాయ నమః | ॐ लोकसारङ्गाय नमः | OM Lokasāraṅgāya namaḥ*

సారఙ్గవల్లోకసారం యో గృహ్ణాతి స భృఙ్గవత్ ।
లోకసారఙ్గ ఇతి స ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
విష్ణుః ప్రజాపతిర్లోకానభ్యతపదితిశ్రుతేః ।
లోకసారః ప్రణవో వా తేన చక్రగదాధరః ॥
ప్రతిపత్తవ్య ఇతి వా లోకసారఙ్గ ఉచ్యతే ।
సాధుః వృషోదరాదిత్వాచ్ఛబ్దోఽయం ప్రోచ్యతే బుధైః ॥

*ప్రథమ ప్రజాపతి రూపుడుగానున్న పరమాత్ముడు లోకముల సారమును సారంగమువలె అనగా తుమ్మెద పుష్పములయందలి మకరందరూపమగు సారమువలె గ్రహించును కావుననే ఆ పరమాత్ముడు 'లోకసారంగః' అనబడును.*

*'ప్రజాపతిర్లోకా నభ్యతపత' (ఛాందోగ్యోపనిషత్ 2.23.3) - 'ప్రజాపతి లోక సారమును గ్రహించు తలంపుతో వానిని ఉద్దేశించి తపమాచరించెను.'*

*లోకసారః అనగా ప్రణవము. లోక సారమగు ప్రణవముచే తెలియబడువాడు అని కూడ చెప్పవచ్చును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 783🌹*

*🌻783. Lokasāraṅgaḥ🌻*

*OM Lokasāraṅgāya namaḥ*

सारङ्गवल्लोकसारं यो गृह्णाति स भृङ्गवत् ।
लोकसारङ्ग इति स प्रोच्यते विबुधोत्तमैः ॥
विष्णुः प्रजापतिर्लोकानभ्यतपदितिश्रुतेः ।
लोकसारः प्रणवो वा तेन चक्रगदाधरः ॥
प्रतिपत्तव्य इति वा लोकसारङ्ग उच्यते ।
साधुः वृषोदरादित्वाच्छब्दोऽयं प्रोच्यते बुधैः ॥

Sāraṅgavallokasāraṃ yo gr‌hṇāti sa bhr‌ṅgavat,
Lokasāraṅga iti sa procyate vibudhottamaiḥ.
Viṣṇuḥ prajāpatirlokānabhyatapaditiśruteḥ,
Lokasāraḥ praṇavo vā tena cakragadādharaḥ.
Pratipattavya iti vā lokasāraṅga ucyate,
Sādhuḥ vr‌ṣodarāditvācchabdo’yaṃ procyate budhaiḥ.

*The Supreme Lord, who is the first form of Prajapati, perceives the essence of the worlds like Saranga, i.e. like the essence of fireflies and all others, so that Supreme Soul is called 'Lokasaranga'.*

*Like the sāraṅga i.e, the honeybee, He acquires the essence of the worlds so Lokasāraṅgaḥ vide the śruti 'Prajāpatirlokā nabhyatapat' (Chāndogyopaniṣat 2.23.3) 'Prajāpati reflected on mankind'.*

*The essence of universe i.e, lokasāra is Oṅkāra (ॐ). He is to be attained by it.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥
శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥
Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,Indrakarmā mahākarmā kr‌takarmā kr‌tāgamaḥ ॥ 84 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 744 / Sri Siva Maha Purana - 744 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 13 🌴*
*🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 3 🌻*

మంత్రముచే నిరోధింపబడిన సర్పము వలె బాహువు స్తంభించుటచే కలిగిన కోపముతో శచీపతియగు ఇంద్రుడు తనలో తాను తపింప చేయబడెను (19). ఆ పురుషుడు స్వీయతేజస్సుతో ప్రకాశించుటను గాంచిన బృహస్పతి వెంటనే తన బుద్ధిచే ఆయనను గుర్తు పట్టి, ఆ శివప్రభువునకు ప్రణమిల్లెను (20). ప్రజ్ఞాశాలియగు బృహస్పతి అపుడు చేతులు జోడించి నేలపై బడి సాష్టాంగ ప్రణామము నాచరించి ఆ ప్రభువును స్తుతించుట మొదలిడెను (21).

బృహస్పతి ఇట్లు పలికెను -

దేవతలకు అధిదేవుడు, ఆత్మరూపుడు, మహేశ్వరుడు, ప్రభువు, ముక్కంటి, జటాజూట ధారి యగు మహాదేవుని కొరకు నమస్కారము (22). దీనులకు ప్రభువు, సర్వవ్యాపకుడు, అంధకాసురుని సంమరించిన వాడు, త్రిపురములను నాశము చేసినవాడు, పరంబ్రహ్మ, పరమేష్టి అగు శర్వునకు నమస్కారము (23). బేసి కన్నులవాడు, అనేకరూపములలో ప్రకటమై మంగళములను చేయువాడు, రుద్రుడు, వికృతరూపుడు, పెద్ద రూపము గలవాడు, రూపములకు అతీతుడు అగు నీకు నమస్కారము (24). దక్షయజ్ఞమును నాశనము చేసినవాడు, యజ్ఞముల ఫలమును ఇచ్చు వాడు, యజ్ఞ స్వరూపుడు, శ్రేష్ఠకర్మలను చేయించు వాడు అగు నీకు నమస్కారము (25). మృత్యువునకు మృత్యువు, కాల స్వరూపుడు, కాలసర్పములను ధరించువాడు, పరమేశ్వరుడు, సర్వవ్యాపకుడు అగు నీకు నమస్కారము (26). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 744🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 13 🌴*

*🌻 Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 3 🌻*

19. Then Indra burnt within himself by the benumbing of his arm like a serpent whose exploits had been curbed by pronouncing magical formulas.[1]

20. On seeing him resplendent, Bṛhaspati realised immediately that he was lord Śiva himself and bowed to him.

21. Then the noble-minded Bṛhaspati joined his palms in reverence. He prostrated before him on the ground and began to eulogise the lord.

Bṛhaspati said:—
22. Obeisance to Śiva, the chief lord of the gods, the supreme soul, the three-eyed, possessed of matted hair.

23. Obeisance to the succouring lord of the distressed, the destroyer of Andhaka[2] and the Tripuras, and identical with Brahmā, the Parameṣṭhin.

24. Obeisance to Śiva of odd eyes, of diverse, deformed and surpassing features, going beyond all forms.

25. Obeisance to the destroyer of sacrifice of Dakṣa, to the bestower of fruits of sacrifice, identical with sacrifice and the initiator of the greatest rites.

26. Obeisance to Śiva the annihilator of Time, of the form of Time, the wearer of black serpents, the great lord and the omnipresent.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 363 / Osho Daily Meditations  - 363 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 363. పిచ్చివాళ్ల ఇల్లు 🍀*

*🕉. ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి: మీరు ఎలా ఉన్నారో, అందరిలాగా, మీరు ఇప్పటికే పిచ్చివారు. మానవత్వం పిచ్చిలో ఉంది; ఈ భూమి ఒక పిచ్చివాళ్ల చోటు. కాబట్టి మీరు తెలివి తెచ్చుకోగలరు, పిచ్చి కాదు. 🕉*

*మీరు తెలివిగా మారడానికి భయపడితే, అది ఒక విషయం, కానీ పిచ్చివారిగా మారడానికి భయపడకండి, ఎందుకంటే ఇంక ఇంతకంటే ఏమి జరుగగలదు? దారుణం ఇప్పటికే జరిగిపోయింది! అత్యంత దారుణమైన నరకంలో జీవిస్తున్నాం మనం. కాబట్టి మీరు పడిపోతే మీరు స్వర్గంలో పడతారు. మరెక్కడా పడలేరు. కానీ ప్రజలు భయపడుతున్నారు, ఎందుకంటే వారు ఏది జీవిస్తున్నారో అది సాధారణ విషయం అని వారు భావిస్తున్నారు. ఎవరూ మామూలుగా లేరు. యేసు లేదా బుద్ధుడు వంటి సాధారణ మనిషి ఉండటం చాలా అరుదు: మిగతా వారందరూ అసాధారుణులు. కానీ అసాధారణమైనవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, కాబట్టి వారు తమను తాము సాధారుణులని తలుస్తారు; యేసు అసాధారణంగా కనిపిస్తాడు.*

* సహజంగా సంఖ్యాకత ఉన్నవారు నిర్ణయించవచ్చు; ఎవరు సాధారణమో ఎవరు కాదో నిర్ణయించే ఓట్లు వారికి ఉన్నాయి. ఇది ఒక వింత ప్రపంచం: ఇక్కడ సాధారణ వ్యక్తులు అసాధారణంగా కనిపిస్తారు మరియు అసాధారణ వ్యక్తులు సాధారుణులుగా భావించబడతారు. ప్రజలను చూడండి, మీ స్వంత మనస్సును గమనించండి: ఇది ఒక కోతి, పిచ్చి కోతి. ముప్పై నిముషాల పాటు మీ మనసులో ఏది వచ్చినా వ్రాసి, ఆపై ఎవరికైనా చూపించండి. ఎవరైనా మీకు పిచ్చి అని సర్టిఫై చేస్తారు! భయపడకండి. మీకు వచ్చిన అనుభూతితో వెళ్ళండి, ఆ పిలుపుతో వెళ్ళండి, ఆ సూచనను అనుసరించండి. ఇక మీరు అదృశ్యమైతే అవ్వండి! పోయేదేముంది?*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 363 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 363. MAD HOUSE 🍀*

*🕉. Always remember one thing: that as you are, as everybody is, you are already mad. Humanity is mad; this earth is a madhouse. So you can only go sane, you cannot go mad .  🕉*

*If you are afraid of becoming sane, that is one thing, but don't be afraid of going mad, because what else can happen? The worst has happened already! We are living in the worst kind of hell. So if you fall you may fall into heaven. You cannot fall anywhere else. But people are afraid, because whatever they have been living, they think that is the normal thing. Nobody is normal. It is only very rarely that there is a normal man like Jesus or Buddha: All others are abnormal. But the abnormal are in the majority, so they call themselves normal; Jesus looks abnormal.*

*And naturally the majority can decide; they have the votes to decide who is normal and who is not. It is a strange world: Here normal people appear abnormal, and the abnormal are thought to be normal. Watch people, watch your own mind: It is a monkey, a mad monkey. For thirty minutes just write down whatever comes into your mind, and then show it to someone. Anybody will certify you as mad! Don't be afraid. Go with the feeling that comes to you, go with that call, follow that hint. And if you disappear, disappear! What have you got to lose?* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 460 -1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 460  - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻 460. 'సుభ్రూ' - 1 🌻* 

*మంగళకరమైన కన్నులు కలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత కనుబొమలు మంగళతోరణములై గోచరించును. తోరణముల నడుమ 'శ్రీ' బిందువుగ నుండును. కుడి ఎడమ తోరణములు సరిసమానముగ ఏర్పడి యున్నప్పుడు భ్రూమధ్యము వికసించ బోవు పద్మము మొగ్గవలె యుండును. కుడి, ఎడమ తోరణములు ఇడ, పింగళ నాడులను సంకేతించును. కనుబొమల ఉత్తర భాగము నందు ఫాలమున ఇడ, పింగళ కేంద్రము లున్నవి. ఇవి ప్రజ్ఞ పదార్థములకు ఉత్పత్తి కేంద్రములు, ఈ రెండునూ సమప్రభతో నున్నప్పుడు భ్రూమధ్యము వెలుగు మొగ్గయై గోచరించును. ఆ వెలుగు చీకటులను పారద్రోలును, అజ్ఞానమును దరి చేరనీయదు. అత్యంత శక్తివంతముగను, ఆకర్షణీయముగను వుండును. మంగళప్రదమై యుండును. సర్వ శుభములకు కారణమై యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 460 - 1  🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻 460. 'Subhru' - 1 🌻*

*It means Srimata with auspicious eyes. Srimata's eyebrows appear as auspicious garlands. Between the arches in the centre is 'Sri'. When the right and left arches are formed equally, the center of the garland looks like a blooming lotus bud. The right and left arches represent the ida and pingala nadis. In the upper part of the eyebrows in the forehead are the ida and the pingala centers. These are the centers of production of prajna and when both of these are in harmony, the centre of the brow becomes illuminated. That light dispels darkness and ignorance. It's Very powerful and attractive. It will be auspicious. It is the cause of all auspices.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

Siva Sutras - 097 - 2-06. guru rupāyah - 4 / శివ సూత్రములు - 097 - 2-06. గురు రూపాయః - 4


🌹. శివ సూత్రములు - 097 / Siva Sutras - 097 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-06. గురు రూపాయః - 4 🌻

🌴. మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను అధిగమించడానికి, మాతృకలలో నివసించే మంత్ర శక్తులను మేల్కొల్పడానికి మరియు స్వయం యొక్క స్వచ్ఛమైన ఎరుకను పొందడానికి గురువు సాధనం. 🌴

శక్తి, శివుని యొక్క స్వతంత్ర శక్తి, అది ఒక గురువు రూపంలో వ్యక్తమైనప్పుడు, ఆ గురువుకు దైవీకృప ఉందని సూచించ బడుతుంది. మరొక దృక్కోణంలో, ఆ శక్తి ద్వారా మాత్రమే, శివుడిని గ్రహించగలడు మరియు ఆమె శివుని సాక్షాత్కారానికి అవసరమైన జ్ఞాన స్వరూపిణి. ఈ సూత్రం నిజమైన ఆధ్యాత్మిక పురోగతికి సరైన గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎటువంటి తార్కికం లేకుండానే ఆనంద స్థాయి, ఆనందం స్థాయిని బట్టి ఆధ్యాత్మిక పురోగతిని స్వయంగా నిర్ధారించు కోవచ్చు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 097 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-06. guru rupāyah - 4 🌻

🌴. The guru is the means to overcome the impurities of the mind and body, awaken the mantra shaktis who reside in the matrkas and attain the pure consciousness of the self. 🌴


When Śaktī, the independent energy of Śiva, manifests in the form of a guru, it is implied that the said guru has divine grace. From another perspective, it is only through Śaktī, Śiva can be realised and She is the embodiment of all the necessary wisdom to realise Śiva. This aphorism highlights the importance of a right guru for true spiritual progression. Spiritual progression can be self ascertained by the level of bliss, the level of happiness without any reasoning.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 360


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 360 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అస్తిత్వం నిన్ను ప్రేమిస్తుంది. అది నీ పట్ల జాగ్రత్త తీసుకుంటుంది. అది నీకు శాపంలా కనిపించవచ్చు. కానీ అదెప్పుడూ వరమే. మన సంకుచితత్వం వల్ల అలా అనిపించవచ్చు. మరణం ఒక విశ్రాంతి. అంతం కాదు. గొప్ప జీవితానికి ఆరంభం.🍀


చాడీలు చెప్నే మనసు ఎప్పటికీ మత సంబంధమయిన మనసు కాలేదు. అసాధ్యం. కారణం అది ప్రాథమికమయిన యథార్థం పట్ల స్పృహతో వుండదు. అస్తిత్వం నిన్ను ప్రేమిస్తుంది. అది నీ పట్ల జాగ్రత్త తీసుకుంటుంది. అందువల్ల సూర్యచంద్రులు, గాలి, వర్షం నీతో స్నేహంగా వుంటాయి. ఏది ఏమైనా అది నీ పట్ల జాగ్రత తీసుకుంటుంది. అది నీకు శాపంలా కనిపించవచ్చు. అదెప్పుడూ వరమే. మన సంకుచితత్వం వల్ల అలా అనిపించవచ్చు. దాని వల్ల మనం సమగ్రంగా చూడలేం. దాని చర్యల్ని గుర్తించలేం. అట్లా చూడగలిగిన పక్షంలో మనం కృతజ్ఞతతో వుంటాం.

మరణించే సందర్భంలోనయినా అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కృతజ్ఞతతో వుంటాడు. కారణం మరణం ఒక విశ్రాంతి. అంతం కాదు. గొప్ప జీవితానికి ఆరంభం. నిజమైన జీవితానికి మన జీవితం రీహార్సల్ లాంటిది. నిజమైన నాటకం మరణానంతరం మొదలవుతుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. అర్థం చేసుకోని వాళ్ళు రీహార్సలే. నిజమైన నాటకమనుకుంటారు. ఆ రీహార్సల్ ముగిశాక వాళ్ళు అరుస్తారు. ఏడుస్తారు. దాన్ని పట్టుకు వేళ్ళాడుతారు. వదిలిపెట్టడానికి యిష్టపడరు. ప్రతి ఈ ఆశీర్వాదమే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 95 - 4.The Law of Life is Cooperation / నిత్య ప్రజ్ఞా సందేశములు - 95 - 4. సహకారమే జీవితం యొక్క చట్టం




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 95 / DAILY WISDOM - 95 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 4. సహకారమే జీవితం యొక్క చట్టం 🌻


చాలా మంది తమను తాము వ్యక్తిగతంగా ‘ధృవీకరించుకోడం ' ద్వారా విజయం సాధించవచ్చనే తప్పుడు భావన వల్ల దుఃఖానికి గురవుతారు. నిజం అందుకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి తప్పుడు భావన ఎందుకు వస్తుందంటే మనలాగే వ్యక్తిగతంగా ధృవీకరంచుకోగల, ఇతరుల వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించే అనేక మంది మన చుట్టూనే ఉన్నారనే విషయాన్ని మరచిపోవడం వల్ల. ప్రపంచంలోని తాను కాక 'ఇతరులను' తన అహంతో ఎదిరించిన ఎవరూ జీవితంలో విజయం సాధించలేదు. ప్రతి అహంభావం బయటి నుండి సమానమైన బలమైన అహంభావంతో ఢీ కొంటుంది.

ఒక చర్యలో, వాదనలో లేదా భావనలో ఎల్లప్పుడూ ఒకరిదైన స్వంత దృక్కోణాన్ని తీసుకోవడం వల్ల 'ప్రతిపక్షాన్ని' ఆకర్షిస్తాము. కానీ జీవితానికి కావల్సింది పరస్పర సహకారం కానీ అహంకారం కాదు. అందుకని అహంభావం చివరికి ప్రకృతిలో తప్పక ఓడిపోతుంది. ఎందుకంటే అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. మనస్సులో, మాటలో లేదా శరీరంలో అన్ని అహంకార చర్యలు ప్రపంచంలోని ఇతర శక్తి కేంద్రాల నుండి అదే విధమైన చర్యను ప్రేరేపిస్తాయి. అలాంటి స్థితిలో జీవించడాన్నే సంసారం అని పిలుస్తారు. నిరంతరం పరస్పరం పోరాడుతున్న అంశాలు ఒకదానికొకటి ప్రతిస్పందించే అనుభవాన్ని కలిగి ఉండి, నిరంతరం బాధని, చాంచలత్వాన్ని తీసుకొస్తాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 95 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 4.The Law of Life is Cooperation 🌻

Most people come to grief due to the wrong notion that they can succeed by ‘asserting’ themselves. The truth is just the opposite. The false idea that self-assertion can bring success is based on the ignorance of the fact that there are also others in this world who can equally assert themselves and stand against the assertion from any particular individual or centre of action. No one has ever succeeded in life, who confronted the ‘others’ in the world with his ego. All egoism is met with an equally strong egoism from outside.

To take always one’s own standpoint, whether in an action, an argument or even in feeling, is to court ‘opposition’, while the law of life is ‘cooperation’. Self-assertion, thus, is contrary to nature’s laws and shall stand defeated in the end. All egoistic action, whether in mind, speech or body, evokes a similar action from other centres of force in the world and to live in such a condition is fitly called samsara, and experience in which perpetually warring elements react against one another and bring about restlessness and pain.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 230 / Agni Maha Purana - 230


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 230 / Agni Maha Purana - 230 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 68

🌻. ఉత్సవ విధి కథనము -2 🌻


పిమ్మట విద్వాంసులై వైష్ణవులతో కలిసి మూలమంత్రముతో ప్రతిమ అవయవములకు నెయ్యి పూసి, రాత్రి అంతయు నేతిధారతో అభిషేకము చేయవలెను. దేవతకు అద్దము చూపించి, ఆరతి, గీతము, వాద్యములు మొదలగు వాటితో మంగళకృత్యములు నెరపి, వ్యజనము విసిరి, పూజించవలెను. పిదప దీప-గంధ-పుష్పాదులతో పూజించవలెను. పసుపు, కర్పూరము, కేసరములు, శ్వేతచందన చూర్ణము దేవతా ప్రతిమపైనను, భక్తుల శిరస్సులపైనను చల్లినచో సమస్త తీర్థముల ఫలము లభించును. ఆచార్యుడు యాత్రకొరకై ఏర్పరచిన దేవతామూర్తిని రథముపై ఉంచి, పూజించి, ఛత్ర-చారమ- శంఖనాదాదులతో రాష్ట్రమును పాలించునది తటమునకు తీసికొని వెళ్ళవలెను.

నదిలో స్నానము చేయించుటకు ముందు అచట వేదికను నిర్మించి, ఆ మూర్తిని వాహనమునండి దింపి, దానిని ఆ వేదికపై ఉంచవలెను. అచట చరువు వండి దానిని హోమము చేసిన పిదప పాయసహోమము చేయవలెను. వరుణ దేవతా మంత్రముతో సమస్తతీర్థముల అవాహనము చేసి ''అపోహిష్ఠామ'' ఇత్యాదిమంత్రములతో వాటికి అర్ఘ్యప్రదానము చేసి పూజించవలెను. దేవతామూర్తిని తీసికొని వెళ్ళి ఉదకమునందు ఆఘమర్షణ చేసి బ్రాహ్మణ - మహాజనులకు స్నానము చేయవలెను. స్నానానంతరము మూర్తిని తీసికొని వచ్చి వేదికపై ఉంచవలెను. ఆ దివసమునందు అచట దేవతాపూజ చేసి, దేవాలయామునకు తీసికొని వెళ్ళవలెను., ఆచార్యుడు అగ్నిలో నున్న దేవతకు పూజలు చేయవలెను. ఈ ఉత్సవము భోగ - మోక్షప్రదము.

అగ్ని మహాపురాణమునందు ఉత్సవవధి కధనమను ఆరువది ఎనిమిదవఅధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 230 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 68

🌻Mode of taking out a procession and celebration of festivals -2🌻


12. Having shown the mirror, there should be the waving of light, auspicious singing and instrumental music, fanning, worship, and present of light. The deity should be worshipped with incense and flowers.

13. Turmeric, green-gram, saffron and white powders should be put on the head of image. But when ghee (is placed over the head) it gets the merit of all sacred places for the devotees.

14. Having bathed and worshipped the image that is placed in the car for being taken around, the officers of the king should take it to the river-side accompanied by music, umbrella and. other things.

15. A platform should be got ready at a distance of a yojana (eight or nine miles) before the river. The image should be brought down from the car and placed on the platform.

16. Gruel should be prepared and sweet gruel should be offered as oblation. The sacred waters (of the sacred spots) should be invoked for their presence with (the recitation of) vedic mantras symbolising the waters.

17. The image should again be worshipped with the principal oblations uttering the mantra āpo hi ṣṭhā[1]. The image should again be carried to the waters and the aghamarṣaṇa[2] hymn repeated.

18. (The priest) should bathe with the assembly of brahmins and then the image should be lifted and placed on the platform. Having worshipped it there that day it should then be taken to the temple. The priest should worship it as in the fire which gets him enjoyment and liberation.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 383: 10వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 383: Chap. 10, Ver. 11

 

🌹. శ్రీమద్భగవద్గీత - 383 / Bhagavad-Gita - 383 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 11 🌴

11. తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమ: |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||


🌷. తాత్పర్యం :

నేను వారి యెడ ప్రత్యేకకరుణను చూపుట కొరకు వారి హృదయము నందు వసించుచు, తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింప జేయుదును.

🌷. భాష్యము :

భక్తియోగము నందు శ్రద్దాళువైనచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని అంతర్యము నుండి సహాయమును కూర్చగలడు. అనగా శ్రద్ధతో కృష్ణభక్తిభావన యందు నిలిచిన భక్తుడు ఎన్నడును జ్ఞానరహితుడు కాబోడు. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో సేవ నొనర్చుట ఒక్కటే దానికి కావలసిన యోగ్యత. ఆత్మానాత్మ విచక్షణ లేకుండా ఎవ్వరును శుద్ధజ్ఞానమును పొందలేరని ఆధునిక తత్త్వవేత్తలు భావింతురు. అట్టివారికి శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున చక్కని సమాధానమొసగినాడు.

అనగా శుద్ధభక్తియోగమున నియుక్తులైనవారు తగినంత విద్య లేనప్పటికి మరియు వేదనియమములను గూర్చిన తగిన జ్ఞానమును కలిగియుండనప్పటికిని ఈ శ్లోకమున తెలుపబడినట్లు తప్పక భగవానునిచే సహాయమును పొందగలరు. పరతత్త్వమైన తనను కేవలము మానసికకల్పనల ద్వారా అవగాహన చేసికొనుట సాధ్యముకాని విషయమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బోధించెను. పరతత్త్వమైన భగవానుడు అత్యంత ఘనుడైనవాడగుచో మనోకల్పనల ద్వారా అతనిని అవగాహనము చేసికొనుట లేదా పొందగలుగుట సాధ్యము కాదు. కనుకనే గీతాధ్యయనము ద్వారా మనుజుడు శ్రీకృష్ణభగవానునకు సంపూర్ణశరణాగతుడై అతని శుద్ధభక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. పిదప భగవానుడే రక్షణభారమును స్వీకరించినపుడు అతడు సర్వవిధములైన భౌతికయత్నముల నుండి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 383 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 11 🌴

11. teṣām evānukampārtham aham ajñāna-jaṁ tamaḥ
nāśayāmy ātma-bhāva-stho jñāna-dīpena bhāsvatā


🌷 Translation :

To show them special mercy, I, dwelling in their hearts, destroy with the shining lamp of knowledge the darkness born of ignorance.

🌹 Purport :

The sincere devotee engaged in Kṛṣṇa consciousness cannot be without knowledge. The only qualification is that one carry out devotional service in full Kṛṣṇa consciousness. The Māyāvādī philosophers think that without discriminating one cannot have pure knowledge. For them this answer is given by the Supreme Lord: those who are engaged in pure devotional service, even though they be without sufficient education and even without sufficient knowledge of the Vedic principles, are still helped by the Supreme God, as stated in this verse. The Lord tells Arjuna that basically there is no possibility of understanding the Supreme Truth, the Absolute Truth, the Supreme Personality of Godhead, simply by speculating, for the Supreme Truth is so great that it is not possible to understand Him or to achieve Him simply by making a mental effort.

The pure devotee does not have to worry about the material necessities of life; he need not be anxious, because when he removes the darkness from his heart, everything is provided automatically by the Supreme Lord, who is pleased by the loving devotional service of the devotee. This is the essence of the teachings of Bhagavad-gītā. By studying Bhagavad-gītā, one can become a soul completely surrendered to the Supreme Lord and engage himself in pure devotional service. As the Lord takes charge, one becomes completely free from all kinds of materialistic endeavors.

🌹 🌹 🌹 🌹 🌹


11 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 11, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : 🌻

🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 10 🍀

19. ఖగః ప్రతర్దనో ధన్యో హయగో వాగ్విశారదః |
శ్రీమానశిశిరో వాగ్మీ శ్రీపతిః శ్రీనికేతనః

20. శ్రీకంఠః శ్రీధరః శ్రీమాన్ శ్రీనివాసో వసుప్రదః |
కామచారీ మహామాయో మహోగ్రోఽవిదితామయః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : విశుద్ధ భక్తి వైశిష్ట్యం - విశుద్ధ భావావేశంతో కూడిన భక్తి తీవ్రతరం అయిన కొలదీ సంసిద్ధికి కావలసిన శక్తి సంపద నీలో పెరుగుతుంది. విశుద్ధభక్తి భావావేశం ద్వారానే నీలోని అంతరాత్మ మేల్కొనడం, దివ్య భూమికలలోనికి ప్రవేశమిచ్చే అంతః కవాటములు నీలో తెరుచుకోడం జరుగుతాయి. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: కృష్ణ అష్టమి 12:07:08 వరకు

తదుపరి కృష్ణ నవమి

నక్షత్రం: పూర్వాభద్రపద 14:33:57

వరకు తదుపరి ఉత్తరాభద్రపద

యోగం: ప్రీతి 10:10:18 వరకు

తదుపరి ఆయుష్మాన్

కరణం: కౌలవ 12:09:08 వరకు

వర్జ్యం: 23:51:12 - 25:24:24

దుర్ముహూర్తం: 17:05:00 - 17:57:36

రాహు కాలం: 17:11:34 - 18:50:13

గుళిక కాలం: 15:32:56 - 17:11:34

యమ గండం: 12:15:39 - 13:54:17

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41

అమృత కాలం: 06:54:40 - 08:26:08

సూర్యోదయం: 05:41:06

సూర్యాస్తమయం: 18:50:13

చంద్రోదయం: 00:37:16

చంద్రాస్తమయం: 12:44:39

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: చర యోగం - దుర్వార్త శ్రవణం

14:33:57 వరకు తదుపరి స్థిర యోగం -

శుభాశుభ మిశ్రమ ఫలం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹