✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 11 🌴
11. తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమ: |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||
🌷. తాత్పర్యం :
నేను వారి యెడ ప్రత్యేకకరుణను చూపుట కొరకు వారి హృదయము నందు వసించుచు, తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింప జేయుదును.
🌷. భాష్యము :
భక్తియోగము నందు శ్రద్దాళువైనచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని అంతర్యము నుండి సహాయమును కూర్చగలడు. అనగా శ్రద్ధతో కృష్ణభక్తిభావన యందు నిలిచిన భక్తుడు ఎన్నడును జ్ఞానరహితుడు కాబోడు. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో సేవ నొనర్చుట ఒక్కటే దానికి కావలసిన యోగ్యత. ఆత్మానాత్మ విచక్షణ లేకుండా ఎవ్వరును శుద్ధజ్ఞానమును పొందలేరని ఆధునిక తత్త్వవేత్తలు భావింతురు. అట్టివారికి శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున చక్కని సమాధానమొసగినాడు.
అనగా శుద్ధభక్తియోగమున నియుక్తులైనవారు తగినంత విద్య లేనప్పటికి మరియు వేదనియమములను గూర్చిన తగిన జ్ఞానమును కలిగియుండనప్పటికిని ఈ శ్లోకమున తెలుపబడినట్లు తప్పక భగవానునిచే సహాయమును పొందగలరు. పరతత్త్వమైన తనను కేవలము మానసికకల్పనల ద్వారా అవగాహన చేసికొనుట సాధ్యముకాని విషయమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బోధించెను. పరతత్త్వమైన భగవానుడు అత్యంత ఘనుడైనవాడగుచో మనోకల్పనల ద్వారా అతనిని అవగాహనము చేసికొనుట లేదా పొందగలుగుట సాధ్యము కాదు. కనుకనే గీతాధ్యయనము ద్వారా మనుజుడు శ్రీకృష్ణభగవానునకు సంపూర్ణశరణాగతుడై అతని శుద్ధభక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. పిదప భగవానుడే రక్షణభారమును స్వీకరించినపుడు అతడు సర్వవిధములైన భౌతికయత్నముల నుండి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 383 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 11 🌴
11. teṣām evānukampārtham aham ajñāna-jaṁ tamaḥ
nāśayāmy ātma-bhāva-stho jñāna-dīpena bhāsvatā
🌷 Translation :
To show them special mercy, I, dwelling in their hearts, destroy with the shining lamp of knowledge the darkness born of ignorance.
🌹 Purport :
The sincere devotee engaged in Kṛṣṇa consciousness cannot be without knowledge. The only qualification is that one carry out devotional service in full Kṛṣṇa consciousness. The Māyāvādī philosophers think that without discriminating one cannot have pure knowledge. For them this answer is given by the Supreme Lord: those who are engaged in pure devotional service, even though they be without sufficient education and even without sufficient knowledge of the Vedic principles, are still helped by the Supreme God, as stated in this verse. The Lord tells Arjuna that basically there is no possibility of understanding the Supreme Truth, the Absolute Truth, the Supreme Personality of Godhead, simply by speculating, for the Supreme Truth is so great that it is not possible to understand Him or to achieve Him simply by making a mental effort.
The pure devotee does not have to worry about the material necessities of life; he need not be anxious, because when he removes the darkness from his heart, everything is provided automatically by the Supreme Lord, who is pleased by the loving devotional service of the devotee. This is the essence of the teachings of Bhagavad-gītā. By studying Bhagavad-gītā, one can become a soul completely surrendered to the Supreme Lord and engage himself in pure devotional service. As the Lord takes charge, one becomes completely free from all kinds of materialistic endeavors.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment