శ్రీ మదగ్ని మహాపురాణము - 230 / Agni Maha Purana - 230


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 230 / Agni Maha Purana - 230 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 68

🌻. ఉత్సవ విధి కథనము -2 🌻


పిమ్మట విద్వాంసులై వైష్ణవులతో కలిసి మూలమంత్రముతో ప్రతిమ అవయవములకు నెయ్యి పూసి, రాత్రి అంతయు నేతిధారతో అభిషేకము చేయవలెను. దేవతకు అద్దము చూపించి, ఆరతి, గీతము, వాద్యములు మొదలగు వాటితో మంగళకృత్యములు నెరపి, వ్యజనము విసిరి, పూజించవలెను. పిదప దీప-గంధ-పుష్పాదులతో పూజించవలెను. పసుపు, కర్పూరము, కేసరములు, శ్వేతచందన చూర్ణము దేవతా ప్రతిమపైనను, భక్తుల శిరస్సులపైనను చల్లినచో సమస్త తీర్థముల ఫలము లభించును. ఆచార్యుడు యాత్రకొరకై ఏర్పరచిన దేవతామూర్తిని రథముపై ఉంచి, పూజించి, ఛత్ర-చారమ- శంఖనాదాదులతో రాష్ట్రమును పాలించునది తటమునకు తీసికొని వెళ్ళవలెను.

నదిలో స్నానము చేయించుటకు ముందు అచట వేదికను నిర్మించి, ఆ మూర్తిని వాహనమునండి దింపి, దానిని ఆ వేదికపై ఉంచవలెను. అచట చరువు వండి దానిని హోమము చేసిన పిదప పాయసహోమము చేయవలెను. వరుణ దేవతా మంత్రముతో సమస్తతీర్థముల అవాహనము చేసి ''అపోహిష్ఠామ'' ఇత్యాదిమంత్రములతో వాటికి అర్ఘ్యప్రదానము చేసి పూజించవలెను. దేవతామూర్తిని తీసికొని వెళ్ళి ఉదకమునందు ఆఘమర్షణ చేసి బ్రాహ్మణ - మహాజనులకు స్నానము చేయవలెను. స్నానానంతరము మూర్తిని తీసికొని వచ్చి వేదికపై ఉంచవలెను. ఆ దివసమునందు అచట దేవతాపూజ చేసి, దేవాలయామునకు తీసికొని వెళ్ళవలెను., ఆచార్యుడు అగ్నిలో నున్న దేవతకు పూజలు చేయవలెను. ఈ ఉత్సవము భోగ - మోక్షప్రదము.

అగ్ని మహాపురాణమునందు ఉత్సవవధి కధనమను ఆరువది ఎనిమిదవఅధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 230 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 68

🌻Mode of taking out a procession and celebration of festivals -2🌻


12. Having shown the mirror, there should be the waving of light, auspicious singing and instrumental music, fanning, worship, and present of light. The deity should be worshipped with incense and flowers.

13. Turmeric, green-gram, saffron and white powders should be put on the head of image. But when ghee (is placed over the head) it gets the merit of all sacred places for the devotees.

14. Having bathed and worshipped the image that is placed in the car for being taken around, the officers of the king should take it to the river-side accompanied by music, umbrella and. other things.

15. A platform should be got ready at a distance of a yojana (eight or nine miles) before the river. The image should be brought down from the car and placed on the platform.

16. Gruel should be prepared and sweet gruel should be offered as oblation. The sacred waters (of the sacred spots) should be invoked for their presence with (the recitation of) vedic mantras symbolising the waters.

17. The image should again be worshipped with the principal oblations uttering the mantra āpo hi ṣṭhā[1]. The image should again be carried to the waters and the aghamarṣaṇa[2] hymn repeated.

18. (The priest) should bathe with the assembly of brahmins and then the image should be lifted and placed on the platform. Having worshipped it there that day it should then be taken to the temple. The priest should worship it as in the fire which gets him enjoyment and liberation.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment