నేటి నుండి 14/01/2021, ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం. (From today 14/01/2021, The beginning of the Uttarayana holy period.)


నేటి నుండి 14/01/2021
ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం.


ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి మారడాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే మార్పు. మనకి రాశులు 12. ( మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల,వృశ్చిక, , ధనుస్సు, మకర, కుంభ, మీన) సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. అల సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. రవి ధను రాశి నుండి మకర రాశి లోకి మారిన సమయమే మకర సంక్రాంతి. దీనితో ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. భూమధ్య రేఖకి ఉత్తరదిక్కుగా సూర్యుడు ప్రయాణం చేయడాన్ని ఉత్తరాయణం అంటారు. సూర్యుడు ఒక్కో రాసిలో ప్రవేశించినపుడు ఆ రాశి యొక్క పేరుతో సంక్రమణం అంటారు. కానీ అన్నిటి కన్నా మకర రాశి లో ప్రవేశించిన మకర సంక్రమణం మనకు ఎంతో ముఖ్యమైనది.

ఈ కాలం లో ప్రకృతి సంపద అయిన పంటలు, ముఖ్యంగా ఆహార పంటలు చేతికి అంది వస్తాయి. చేమంతి, బంతి వంటి పూవుల పంటతో తోటలు కళకళ లాడతాయి. హేమంత గాలులతో, ఎటు చూసినా ప్రక్రుతి వింత శోభతో అలరారుతుంది. ఏడాది పొడవునా కష్టపడి పెంచిన పంట, ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి రైతులు కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు. ఈ మాసంలో పొలం పనులు ఏవి ఉండవు కాబట్టిఇంటి దగ్గర అందరు తీరికగా ఉంటారు. ఇంతకు ముందు మాసాలైన ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం మాసాలలో పెళ్లి ముహుర్తాలు ఉంటాయి, కాబట్టి కొత్తగా పెళ్లి అయిన కూతుర్లు, అల్లుళ్ళు, ఇంటికి వస్తారు కాబట్టి ఇల్లంతా సందడిగా ఉంటుంది. పండుగ జరుపుకోవటానికి ఇంత కన్నా మంచి సమయం ఏమి ఉంటుంది?

ఈ మకర రాశిలో విష్ణు నక్షత్రం అయిన శ్రవణం ఉంది. శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభ స్వామిగా సాక్షాత్కరించినది ఈ నక్షత్రం తోనే. అందుకే మకర రాశిని విష్ణు రాశి అంటారు. వామనావతారంలో స్వామి బ్రహ్మండమంతా రెండు అడుగులతో కొలిచి, మూడవ పాదంతో బలిని పాతాళానికి పంపినది ఉత్తరాయణ పుణ్యకాలం లోనే. దేవతలకు ముఖ్యమైన ఈ రోజులలో చేసే పుణ్య కార్యాలు, దాన ధర్మాలు, పూజలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అంటారు.

ఉత్తరాయణం లో చేయవలసినవి ముఖ్యంగా, నదీస్నానం, సూర్య నమస్కారం, వేదాధ్యయనం, నూతన గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం, వంటి పుణ్య కార్యాలు. ఉత్తరాయణం ఉండే ఆరు నెలలలో పవిత్ర నదులైనటువంటి గంగ, గోదావరి వంటి నది స్నానం చేసి, నువ్వులు, బియ్యం, వస్త్రాలు, దుంపలు, ఫలాలు, చెరకు, విసనకర్ర, బంగారం, గోవులు వంటివి దానం చేస్తే ఉత్తమ గతులు పొందుతారు అని శాస్త్రం. గుమ్మడి కాయను దానం చేస్తే సాక్షాత్తు బ్రహ్మాండాన్నే దానం చేసిన ఫలం పొందుతారుట

సంక్రాంతి పర్వదినాన సూర్యుడు మకర రాశి అధిపతి, తన కుమారుడు అయిన శనీశ్చరుని ఇంట ప్రవేశిస్తాడు. పురాణ కథనానుసారం, ఇరువురూ బద్ధ విరోధులే అయినా మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు విధిగా తన కుమారుడు శనితో సమావేశమవుతాడు. ఒక నెల రోజులు కొడుకు ఇంటనే గడుపుతాడు. ఈ విధంగా ఈ పర్వదినం తండ్రీ కొడుకుల అనుబంధానికి కూడా ఒక సంకేతం అని చెప్పవచ్చు.

ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగా - దక్షిణాయనం రాత్రిగా భావించడంతో దేవతలు పగలులో సంక్రమించే మకర సంక్రాంతిని ఒక మహాపర్వదినంగా భావస్తారు. ఉత్తరాఁణ పుణ్యకాలాన్ని దేవమానంగా, దక్షిణాయనాన్ని పితృయానంగా భావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఇక సంక్రాంతి పర్వదినంలోనే శ్రీహరి రాక్షసుల్ని సంహ రించి వారి తలలు నరికి మందర పర్వతం కింద పాతిపెట్టి, దేవతలకు సుఖశాంతు లు ప్రసాదించాడనీ అందుకే ఈ పండుగని అశుభాల్లోంచి శుభాల్లోకి ప్రవేశించే సింహద్వా రంగా భావించి పవిత్రంగా ఈ పండుగని జరుపుకుంటారు.

కపిల మహాముని ఆశ్రమ ప్రాంగణంలో భస్మమైన 60000 మంది సాగర మహారాజు కుమారులకు సద్గతులు కల్పించడానికి భగరధ మహారాజు కఠోర తపస్సు చేసి గంగానదిని భూమికి అవతరింపచేసాడు. కపిల ముని ఆశ్రమమే నేటి గంగాసాగర్‌ అని భక్తుల విశ్వాసం. సంక్రాంతి పర్వదినం నాడే భగీరధుడు ఆ 60 వేల మందికీ పరమ పవిత్ర గంగాజలంతో తర్పణలు అర్పించి వాళ్ళని శాపవిముక్తుల్ని చేసాడని ప్రతీతి. భగీరథుని కోరిక ప్రకారం పూర్వజుల శాప విముక్తికి గంగా భవాని పాలాళ లోకంలో ప్రవేశించి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వరినాన గంగానది పాతాళలోకంలో ప్రవేశించి చివరికి బంగాళా ఖాతంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వదినాన గంగానది బంగాళా ఖాతంలో కలసిన పవిత్ర సమయంలో లక్షలాది భక్తులు గంగా నదిలో తమ పితృదేవతలకి తర్పణలిస్తారు.

మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణ శక్తిని కలిగిన భీష్మాచార్యుడు యుద్ధరంగంలో నేలకొరిగి తన భౌతిక శరీరం త్యజించడానికి సంకల్పించి అంపశయ్య మీద పవళిచి, చివరికి మకర సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేహత్యాగం చేసాడు. అందుచే మకర సంక్రాంతి మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రగాఢ విశ్వాసం.
🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 179 / Sri Lalitha Chaitanya Vijnanam - 179


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 179 / Sri Lalitha Chaitanya Vijnanam - 179 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖


🌻 179. 'భేదనాశినీ ' 🌻

స్వపర బేధములను నాశనము చేయునది శ్రీమాత అని అర్థము.

సర్వభేదములకు మూలము “నేను, ఇతరులు” అను భావన. ఈ భావము చేతనే భేదము పుట్టును. ఈ భావము లేనివారు తత్త్వ జ్ఞానులే. తత్త్వ మొక్కటియే. దానినే సత్య మందురు. “ఉన్నది సత్యము” అనునది సూక్తి. ఉండుట అను స్థితి అందరికినీ ఒకటియే. వ్యక్తముగ ఉన్ననూ, అవ్యక్తముగ ఉన్ననూ ఉండుట అనునది ఎప్పుడునూ ఉండును. అది శాశ్వతము.

బండరాయి, వృక్షము, జంతువు, మనిషి, దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు అందరికినీ ఉండుట ఉన్నది. ఉండుట యందు భేదము లేదు. అది అందరియందొక్కటియే. ఇట్టే అన్నింటి యందూ చైతన్య మున్నది. సత్యము, చైతన్యము ఆధారముగ సమస్త సృష్టి, జీవులు, వస్తుజాలము ఏర్పడుచున్నవి.

అన్నింటి యందును, సత్యమును, చైతన్యమును చూడవచ్చును. సత్యము, చైతన్యము త్రిగుణముల కతీతమైనవి. ఆ తరువాత త్రిగుణములు వానినుండి పుట్టవచ్చును. అపుడు భేదస్థితు లేర్పడును. భేదస్థితి “సత్ చిత్”లకు లేదు. దర్శించువారు ఆనందమయులై యుందురు. భేద జ్ఞానము లేకపోవుటవలన వారు "సచ్చిదానంద స్థితి యందున్నారు.

గుణములకు లోబడినవారు సత్ చిత్, తత్త్వము తెలియక భేదమున పడుదురు. ఈ భేదబుద్ధి చేతనే తమను తాము బంధించు కొనుచుందురు. తాముగ బంధించుకొనువారిని ఉద్ధరించువారెవరు? శ్రీమాతయే. ఆమె ఆరాధనమున భేదబుద్ధి తొలగి, బంధముల నుండి బాధల నుండి జీవులు తరింతురు.

ఆరాధనకు ఫలితమిదియని తెలిసి ఆరాధించుట ఉత్తమము. స్వప్రయోజనమునకై ఆరాధించుట మధ్యమము. ఇతరులను దమించుటకు, హింసించుటకు చేయు ఆరాధనము అధమము.

అన్ని ఆరాధనములనుండి శ్రీమాత ఒకే ప్రయోజనము నిర్వర్తించును, అది జీవధారలుపు, ఎటైనను జీపులను ఉద్ధరించుటకు ఆమె చతుర్విధ ఉపాయములను వినియోగించును. అవసరమగుచో దండించును కూడ. దండన కూడ భేదనాశనమునకే. భేదబుద్ధి నశించువరకును తల్లివలె కృషి సలుపుచునే యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 179 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Bhedanāśinī भेदनाशिनी (179) 🌻

She is the destroyer of differences, in the minds of Her devotees. Difference means duality.

When difference is destroyed, there is no second. The difference can be destroyed by acquiring knowledge and She provides this knowledge to Her devotees.

The phala śrutī (the concluding verses, conveying the benefits of reciting this Sahasranāma) of this Sahasranāma says that there is no difference between Her and Her devotees.

Authors of this Sahasranāma or any other important verses like this Sahasranāma always add a few verses after the conclusion of the main body of Sahasranāma and these verses are called phala śrutī or the concluding part.

The verses in the concluding part normally prescribes how this Sahasranāma is to be recited, on which days to be recited and also indicates the benefits accruing out of such recitations. An abridged version of phala śrutī is provided at the end of this book.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021

అంతరాత్మకు జవాబు చెప్తున్నారా ?


🌹. అంతరాత్మకు జవాబు చెప్తున్నారా ? 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ 🍀

📚. ప్రసాద్‌ భరద్వాజ.


ఈ ప్రపంచంలో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండడం చాలా ధైర్యంతో కూడుకున్న పని అని నేనంటాను.

స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండాలనుకునే వ్యక్తికి ఏమాత్రం భయంలేని ‘‘నిర్భయత్వం’’ పునాదిగా ఉండాలి. ఈ విషయంలో ప్రపంచమంతా నన్ను వ్యతిరేకించినా నాకు ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే, నా అనుభవమే నాకు అత్యంత విలువైనది. అందుకే అది నాకు చాలా ముఖ్యం.

అంకెల లెక్కలను నేను ఏమాత్రం లెక్కచెయ్యను. ఎంతమంది నాతో ఉన్నారనేది నాకు ముఖ్యంకాదు. నా అనుభవానికి ఉన్న విలువనే నేను ఎప్పుడూ గమనిస్తాను. చిలక పలుకుల్లా నేను ఇతరులు చెప్పిన మాటలనే చెప్తున్నానా లేక నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్న దానిని చెప్తున్నానా అనేది నాకు చాలా ముఖ్యమైన విషయం.

నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్న దానిని చెప్తున్న పక్షంలో అది నా రక్తంలో, ఎముకల మూలుగులలో భాగమైనట్లే.

అప్పుడు ఈ ప్రపంచమంతా ఏకమై నన్ను వ్యతిరేకించినా నేను ‘‘ప్రపంచానిదే తప్పని, నేను చెప్పినదే- అది ఏమైనా కావచ్చు- వాస్తవమని’’ అంటాను. అందుకు నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. ఇతరుల అభిప్రాయాలను స్వీకరించేవారికే ఇతరుల మద్దతు అవసరమవుతుంది.

కానీ, ఇంతవరకు మానవ సమాజం అదే తీరులో పనిచేస్తూ మిమ్మల్ని తన అధీనంలో ఉంచుకుంది. దానికి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వాటిని మీరుకూడా అనుభవించక తప్పదు. అదెలా ఉంటే మీరు కూడా అలాగే ఉండాలి.

అంతేకానీ, మీలో ఏమాత్రం తేడారాకూడదు. ఎందుకంటే, మీలో ఏమాత్రం తేడావచ్చినా మీరు ఏదో ప్రత్యేకతతో కూడిన స్వతంత్రులైనట్లే. అలాంటి వ్యక్తులంటే సమాజానికి చాలా భయం. ఎందుకంటే, మీరు దేనికీ తలవంచరు. అప్పుడు దాని దేవుళ్ళు, దేవాలయాలు, పూజారులు, పవిత్రగ్రంథాలు దిక్కులేకుండాపోతాయి.

ఎందుకంటే, హాయిగా ఆడుతూ, పాడుతూ జీవించేందుకు, మరణించేందుకు మీదారి మీరు చూసుకున్నారు. అంటే మీరు మీ ఇంటికి చేరుకున్నట్లే. కాబట్టి, గుంపులో ఉన్నంతవరకు మీరు మీ ఇంటికి ఎప్పుడూ చేరుకోలేరు. కేవలం ఒంటరిగా మాత్రమే మీరు మీ ఇంటికి చేరుకోగలరు.

మీ అంతర్వాణిని వినండి:

ఎందుకురా ఎప్పుడూ బుర్రగోక్కుంటున్నావు? అన్నాడు తండ్రి కొడుకుతో.

‘‘నా దురద ఎక్కడుందో నాకే తెలుస్తుంది నాన్నా’’అన్నాడు కొడుకు.

అదే మీ అంతర్వాణి.

అది మీకు మాత్రమే తెలుస్తుంది తప్ప, ఇతరులకు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే, అది బయటకు కనిపించే వస్తువుకాదు. మీకు తలనొప్పి వచ్చినా, సంతోషమొచ్చినా అది మీకుమాత్రమే తెలుస్తుంది. దానిని మీరు ఒక వస్తువులా ఇతరులకు చూపించలేరు.

మీ అంతర్వాణి మీ లోలోపల ఎంత లోతుల్లో ఉంటుందంటే, అది నిజంగా మీలో ఉన్నట్లు మీరు ఏమాత్రం నిరూపించలేరు. అందుకే విజ్ఞానశాస్త్రం దానిని చాలా అమానుషంగా ఖండిస్తుంది.

అయినా అది మీలోఉన్నట్లే. దాని విలువ దానికి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే, ఒక వస్తువుగా ఇతరులకు చూపించలేని ‘ప్రేమభావన’ తనలో ఉన్నట్లు శాస్తవ్రేత్తకు కూడా తెలుసు. కానీ, శాస్ర్తియపరమైన శిక్షణ పట్ల అందరూ తమ అంతర్వాణిపై నమ్మకాన్ని కోల్పోయారు. అందుకేవారు ఇతరులపై ఆధారపడతారు. ఎవరైనా మీతో ‘‘మీరు చాలా అందంగా ఉంటారండి’’ అనగానే మీరు చాలా సంతోషపడతారు.

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021

దేవాపి మహర్షి బోధనలు - 2


🌹. దేవాపి మహర్షి బోధనలు - 2 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 1. కర్తవ్యము - 2 🌻


ఒకనాడొక శిష్యుడు దేవాది మహర్షిని సమీపించి తాను చాలా సాధన చేయుచుంటిననియు అనగా ప్రతిదినము ఉదయము, సాయంత్రము ధ్యానము చేయుచుంటిననియు, ఒక గంట సమయము సేవకు వినియోగించు చుంటిననియు, అయినప్పటికి తనయందు వికాసము తగురీతిన కలుగుట లేదనియు వాపోయెను.

దేవాది మహర్షి మందస్మితము చేసి, ఇట్లు పలికిరి : 'రెండు గంటలు నీ వొనర్చు సాధనను ఇరువది రెండుగంటలలో తుడిచి వేయుచున్నావు కదా! వికాసము ఎట్లు కలుగ గలదు? జీవితమున ఏ సన్నివేశము నందైనను, దివ్య సాన్నిధ్యము లభించుచునే యుండును.

దానిని నిరంతరము గుర్తించుచుండుట నిజమైన సాధన. నీవు దైవమును గుర్తించు కాలముకన్న గుర్తింపని కాలము మిక్కుటముగ నున్నది.

గుర్తించు కాలము గుర్తింపని కాలము కన్న మిన్నగా నున్న సందర్భమున నీవు కోరిన వికాసమునకు అవకాశము కలుగును. నీవు నీ అనారోగ్యమను భావము నందు ఎక్కువగ జీవించు చున్నావు.

శరీరమున నున్న అనారోగ్యమున కన్న భావన యందు దానిని గూర్చిన విచికిత్స ఎక్కువగ నున్నది. ఆరోగ్యము కొరకు చేయవలసిన కర్తవ్యము నందు సోమరితన మెక్కువై అనారోగ్యమును గూర్చిన చింతన పెంచుకొనుచున్నావు.

ఈ విధమైన భావనా మార్గమున నీ అనారోగ్యమునకు పరిష్కారము లేదు. సోమరితనమును వదులుము. చేయవలసినది చేయుము. ఊహలను వదిలి కర్తవ్యము నందు నిలుపుము” అని నిర్దేశించిరి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 162


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 162 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 92 🌻


మరి ఇప్పుడు ఈ రకమైన జీవితాన్ని ఏమని చెపుతాము. దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గమున్నది. ప్రయత్నించి శుద్ధ బుద్ధిని సంపాదించుట. నన్ను ఏం చేయమంటారండీ? నాయన! శుద్ధ బుద్ధిని సంపాదించు. నన్ను ఉద్యోగం చేయమంటారా? మానేయ మంటారా? ఎవ్వరూ చెప్పరూ.

వేదాంత విద్యా విశారదులు ఈ ప్రపంచంలో ఎవరికీ వ్యవహార శైలియందు ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పడానికి ఒక ఆధారం ఉండదు. ఎందుకని అంటే, నువ్వు ఏ వివేకంతో వ్యవహరించావు అన్నదానికే ప్రాధాన్యత. అట్టి వివేకశీలి అయినటువంటి వాడు, సామాన్యమైనటువంటి కర్తృత్వ కర్మాచరణ యందు అసంగముగా ఉన్నాడా లేదా? అనేటటువంటి దానిని గుర్తించాలి.

అట్టి అసంగత్వ లక్షణం నువ్వు కనుక నిలబెట్టుకోపోయినట్లయితే, అట్టి సాక్షిత్వ లక్షణాన్ని నువ్వు నిలబెట్టుకోక పోయినట్లయితే, సదా పుస్తకాల పురుగువలె చదివినప్పటికిని, సదా శాస్త్రములను అభ్యసించినప్పటికి, సదా నీవు వ్యాపార సహితుడవి అగుతున్నావు కానీ, నిర్వృత మానసాన్ని పొందినవాడివి అవ్వడం లేదు.

అట్టి నిర్వృత మానసం లేకుండా, ‘వినివృత్త కామాః’ అని అంటోంది భగవద్గీత. వినివృత్త కామా - వృత్తి, కామములయందు నిః - నివృత్తత. విరమించుట. అనేటటువంటిది విశేషముగా జరగాలి. వాసనలతో సహా లేకుండా పోవాలి. వాటి రసం ఇంకి.. ఇంగువ యొక్క రసం ఇంకి బట్ట ఎలా అయితే ఇంగువ పోయినప్పటికి అదే వాసన వస్తుంది.

చేతితో ఉల్లిపాయపట్టుకుంటే, ఉల్లిపాయ వదిలేసినప్పటికి చేతికి ఉల్లిపాయ వాసన ఎట్లా అంటుతుందో, ఈ రకంగా అనేక పదార్థముల యొక్క రసము మనలో శోషించి, అవే పదార్థముల యొక్క స్ఫురణ కలుగుతూ నానాత్వ భ్రాంతి కలిగిస్తూ, అట్టి నానాత్వ బుద్ధి చేత, మరల జనన మరణములందే తిరుగుతూ ఉంటారు.

కాబట్టి, తప్పక సాధకులందరూ నిరంతరాయంగా సాధన అనగా, ధనము అనగా మార్పు చెందనటువంటిది. ఆ సాధనని ఆ మార్పు చెందనటువంటి స్థితిని సాధించుట కొరకు, పొందుట కొరకు, ఆ లక్షణంతో ఉండుట కొరకు, అట్టి లక్షణమునే నిలబెట్టుకొనుట కొరకు, స్థిరత్వము అంటే, అర్థం అది. జీవితంలో ఎప్పటికి స్థిరపడుతావు నాయనా? అనే ప్రశ్నకి అర్థము, లక్షణము ఏమిటంటే, స్థిరమైనటువంటి స్థితిని నువ్వు ఎప్పుడు గుర్తిస్తే, అప్పుడు స్థిరపడి పోయినట్లే. ఈ రకంగా ఆత్మవస్తువును గుర్తిస్తూ, అనాత్మను నిరసిస్తూ, ఈ ఆత్మానాత్మ వివేకమును సంపాదించాలి.

ఎంతకాలమైతే ఆనాత్మ వస్తూప లబ్దియందు నీ ప్రేరణ, బుద్ధి, ఆకర్షణ కలిగి ఉంటావో, చాలా మంది ఈ రకమైనటువంటి అంశాలను మానవజీవితంలో కలిగిఉన్నారు. ఏదో పుట్టావు, ఏదో పెరిగావు, ఏదో ఒకటి చేయాలి, చేశాను.

చేస్తే ఏదో ఒక ఫలితం రావాలి, వచ్చింది. వచ్చినదానిని ఏదొ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నాము. నిలబెట్టుకున్న తరువాత దానిని ఏం చేయాలి? నిలబెట్టుకున్న దానిని పది మందిలో ప్రదర్శించాలి. ప్రదర్శించాము. ప్రదర్శించిన తరువాత ఏమైంది? పరువా? ప్రతిష్ఠ వచ్చినాయి. ఆ పరువు ప్రతిష్ఠ పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి.

మరలా ప్రయత్నించాలి. ఇలా నిరంతరాయంగా అనాత్మ భ్రాంతితో కూడుకున్నటువంటి, అంశాలయందే చిత్తం లగ్నంమై ఉండడం చేత, జగత్‌ వ్యాపార సహితమైన వాటియందే, చిత్తం లగ్నమై యుండుట చేత, ఎంత మంది నన్ను ఇవాళ పొగిడారు, ఎంతమంది నన్ను ఇవాళ విమర్శించారు అని లెక్కపెట్టుకునే వారు కూడా ఉన్నారు.

ఎంత మంది ఇవాళ నమస్కారం చెప్పారు, ఎంతమంది నమస్కారం చెప్పలేదు? అనేటటుంవంటి అధికార మదాంధత్వమును పొందినటువంటి వారు కూడ ఉన్నారు. మరి ఇవన్నీ ఎటు దారితీస్తున్నాయి అంటే, అజ్ఞానాంధత వైపు దారి తీస్తున్నాయి. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 228, 229 / Vishnu Sahasranama Contemplation - 228, 229


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 228, 229 / Vishnu Sahasranama Contemplation - 228, 229 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻228. ఆవర్తనః, आवर्तनः, Āvartanaḥ🌻

ఓం ఆవర్తనాయ నమః | ॐ आवर्तनाय नमः | OM Āvartanāya namaḥ

ఆవర్తనః, आवर्तनः, Āvartanaḥ

ఆవర్తయితుం సంసారచక్రం శీలం అస్య సంసార చక్రమును త్రిప్పుచుండుట ఈతని శీలము అనగా అలవాటు.

:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::

సీ. భూపాలకోత్తమ! భూతహితుండు సుజ్ఞానస్వరూపకుఁడైన యట్టి

ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న మహి నొప్పు నీశ్వరమాయ లేక

కలుగదు, నిద్రలోఁ గలలోనఁ దోఁచిన దేహసంబంధంబుల తేఱఁగువలెను

హరియోగ మాయామహత్త్వంబునం బాంచ భౌతిక దేహసంబంధుఁ డగుచు

తే. నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి, బాల్య కౌమార యౌవనభావములను

నర సుపర్వాది మూర్తులఁ బొరసి "యేను", "నాయ దిది" యను సంసారమాయఁ దగిలి. (223)

"జీవుడు భూతాలకు మేలు చేకూర్చేవాడు, జ్ఞానమే స్వరూపంగా కలవాడు. అలాంటి వానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది!" అంటావా? జగతీతల మంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలుగదు. నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుంది కదా! అలాగే నారాయణుని యోగమాయా ప్రభావం వల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయాగుణాలవల్లనే క్రమంగా బాల్యం, కౌమారం యౌవనం అనే దశలు పొందుతాడు. మనుష్య, దేవతాది ఆకారాలను గూడా స్వీకరిస్తాడు. 'నేను' అనే అహంకారాన్నీ, 'నాది' అనే మమకారాన్నీ పెంచుకొంటాడు. సంసారమాయలో బద్ధుడవుతాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 228🌹

📚. Prasad Bharadwaj


🌻228. Āvartanaḥ🌻

OM Āvartanāya namaḥ

Āvartayituṃ saṃsāracakraṃ śīlaṃ asya / आवर्तयितुं संसारचक्रं शीलं अस्य He is possessed of the nature or capacity to turn the wheel of saṃsāra or material existence.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 5

Kālaṃ karma svabhāvaṃ ca māyeṣo māyayā svayā,
Ātmanyadr̥cchayā prāptaṃ vibubhūṣurupādade. (21)

:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे पञ्चमोऽध्यायः ::

कालं कर्म स्वभावं च मायेषो मायया स्वया ।
आत्मन्यदृच्छया प्राप्तं विबुभूषुरुपाददे ॥ २१ ॥

The Lord, who is the controller of all energies, thus creates, by His own potency, eternal time, the fate of all living entities, and their particular nature, for which they were created, and He again merges them independently.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 229 / Vishnu Sahasranama Contemplation - 229🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻229. నివృత్తాత్మ, निवृत्तात्म, Nivr̥ttātma🌻

ఓం నివృతాత్మనే నమః | ॐ निवृतात्मने नमः | OM Nivr̥tātmane namaḥ

సంసారబంధాత్ నివృత్తః ఆత్మా అస్య సంసారబంధమునుండి నివృత్తమైన అనగా మరలిన ఆత్మ స్వస్వరూపము ఇతనిది

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 229🌹

📚. Prasad Bharadwaj


🌻229. Nivr̥ttātma🌻

OM Nivr̥tātmane namaḥ

Saṃsārabaṃdhāt nivr̥ttaḥ ātmā asya / संसारबंधात् निवृत्तः आत्मा अस्य He whose nature is free or turned back from the bonds of saṃsāra or material existence.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥


Continues....
🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021