శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 179 / Sri Lalitha Chaitanya Vijnanam - 179


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 179 / Sri Lalitha Chaitanya Vijnanam - 179 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖


🌻 179. 'భేదనాశినీ ' 🌻

స్వపర బేధములను నాశనము చేయునది శ్రీమాత అని అర్థము.

సర్వభేదములకు మూలము “నేను, ఇతరులు” అను భావన. ఈ భావము చేతనే భేదము పుట్టును. ఈ భావము లేనివారు తత్త్వ జ్ఞానులే. తత్త్వ మొక్కటియే. దానినే సత్య మందురు. “ఉన్నది సత్యము” అనునది సూక్తి. ఉండుట అను స్థితి అందరికినీ ఒకటియే. వ్యక్తముగ ఉన్ననూ, అవ్యక్తముగ ఉన్ననూ ఉండుట అనునది ఎప్పుడునూ ఉండును. అది శాశ్వతము.

బండరాయి, వృక్షము, జంతువు, మనిషి, దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు అందరికినీ ఉండుట ఉన్నది. ఉండుట యందు భేదము లేదు. అది అందరియందొక్కటియే. ఇట్టే అన్నింటి యందూ చైతన్య మున్నది. సత్యము, చైతన్యము ఆధారముగ సమస్త సృష్టి, జీవులు, వస్తుజాలము ఏర్పడుచున్నవి.

అన్నింటి యందును, సత్యమును, చైతన్యమును చూడవచ్చును. సత్యము, చైతన్యము త్రిగుణముల కతీతమైనవి. ఆ తరువాత త్రిగుణములు వానినుండి పుట్టవచ్చును. అపుడు భేదస్థితు లేర్పడును. భేదస్థితి “సత్ చిత్”లకు లేదు. దర్శించువారు ఆనందమయులై యుందురు. భేద జ్ఞానము లేకపోవుటవలన వారు "సచ్చిదానంద స్థితి యందున్నారు.

గుణములకు లోబడినవారు సత్ చిత్, తత్త్వము తెలియక భేదమున పడుదురు. ఈ భేదబుద్ధి చేతనే తమను తాము బంధించు కొనుచుందురు. తాముగ బంధించుకొనువారిని ఉద్ధరించువారెవరు? శ్రీమాతయే. ఆమె ఆరాధనమున భేదబుద్ధి తొలగి, బంధముల నుండి బాధల నుండి జీవులు తరింతురు.

ఆరాధనకు ఫలితమిదియని తెలిసి ఆరాధించుట ఉత్తమము. స్వప్రయోజనమునకై ఆరాధించుట మధ్యమము. ఇతరులను దమించుటకు, హింసించుటకు చేయు ఆరాధనము అధమము.

అన్ని ఆరాధనములనుండి శ్రీమాత ఒకే ప్రయోజనము నిర్వర్తించును, అది జీవధారలుపు, ఎటైనను జీపులను ఉద్ధరించుటకు ఆమె చతుర్విధ ఉపాయములను వినియోగించును. అవసరమగుచో దండించును కూడ. దండన కూడ భేదనాశనమునకే. భేదబుద్ధి నశించువరకును తల్లివలె కృషి సలుపుచునే యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 179 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Bhedanāśinī भेदनाशिनी (179) 🌻

She is the destroyer of differences, in the minds of Her devotees. Difference means duality.

When difference is destroyed, there is no second. The difference can be destroyed by acquiring knowledge and She provides this knowledge to Her devotees.

The phala śrutī (the concluding verses, conveying the benefits of reciting this Sahasranāma) of this Sahasranāma says that there is no difference between Her and Her devotees.

Authors of this Sahasranāma or any other important verses like this Sahasranāma always add a few verses after the conclusion of the main body of Sahasranāma and these verses are called phala śrutī or the concluding part.

The verses in the concluding part normally prescribes how this Sahasranāma is to be recited, on which days to be recited and also indicates the benefits accruing out of such recitations. An abridged version of phala śrutī is provided at the end of this book.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2021

No comments:

Post a Comment