శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 282 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 282 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀

🌻 282. 'సహస్రశీర్షవదనా' - 1 🌻

వెయ్యి శిరస్సులతో కూడిన వదనము కలది శ్రీమాత అని అర్థము. “సహస్ర” శబ్దము అనేకానేక అర్థములు కలిగియున్నది. సహస్రమనగా వేయి. సహస్రమనగా అనేకము. వేయి అనినపుడు ఒకటి తరువాత మూడు సున్నాలు వుండును. మూడు సున్నాలు మూడు లోకములకు సంకేతము కాగా, వాటికి పూర్వము నందున్నది ఒకటియే. ఒకటియే మూడు లోకములు వ్యాపించి యున్నదని అర్థము. సృష్టి మొత్తము ప్రజ్ఞ, శక్తి, పదార్థములతో చేయబడినది.

ఈ మూడింటికిని ఆధారమైనది ఒకటియే. కావుననే సహస్ర పదమును పరతత్త్వమును తెలుపుటకు వాడుదురు. ఒకటి మూడుగనై నాలుగు అగును. (1 + 3 - 4) తత్కారణముగ వాక్కు, వేదము, కాలము, స్వభావములు, ప్రధానముగ నాలుగు విభజనలు పొందును. ఒకటి నుండి పుట్టిన మూడు, నాలుగు నుండి ప్రతిబింబించుటచే ఏడగును. (1 + 3 + 3 7) ఇట్లు ఏడు లోకము లేర్పడును. ప్రధానముగ మూడే లోకము లైననూ ప్రతిబింబ ప్రభావమున ఏడుగ గోచరించును. సత్యలోకము, తపోలోకము, జనోలోకము ప్రధానముగ మూడు లోకములు.

ఈ మూడు లోకములు మహత్తు అను నాలుగవ లోకమునుండి సువర్లోకము, భువర్లోకము, భూలోకముగ ప్రతిబింబించును. ముందు మూడు లోకములు సూక్ష్మములు. తరువాత మూడు లోకములు = స్థూలములు. సూక్ష్మము స్థూలములోనికి వచ్చుటకు మహత్తు నడుచు చున్నది. అదృశ్యము దృశ్యమగుట, దృశ్యము అదృశ్యమగుట ఈ మహత్తు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |
sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀

🌻 Sahasra-śīrṣa-vadanā सहस्र-शीर्ष-वदना (282) -1 🌻

Sahasra in this context means infinite and literally means thousand. She has countless heads and faces. The next two nāma-s also have the same meaning. Unable to describe Her supremacy by words, Vāc Devi-s have used an envisioned form here that encompasses summate supremacy. In fact, it can be considered as true in literal sense. Since the Brahman has so many acts to do in different places at the same time, the Brahman needed countless numbers of heads.

The countless number of heads for the Brahman is described in Veda-s and Upaniṣads. Bhagavad Gīta (XIII.13) says “He dwells in the world, enveloping all – everywhere, His hands and feet; present on all sides, His eyes and ears, His mouth and heads”.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jun 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 34

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 34 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀.ఆనందమున్నది ఎప్పుడో ఎక్కడో భవిష్యత్తులో జరిగేది కాదు. మనకు దాంతో సంబంధం ఇంకా ఏర్పడలేదు. అంతే. 🍀

ఆనందమున్నది ఎప్పుడో ఎక్కడో భవిష్యత్తులో జరిగేది కాదు. అది అప్పటికే వున్న యదార్థం. మనకు దాంతో సంబంధం ఏర్పడలేదు. అంతే. అది అప్పటికే అంతస్రోతస్వినిలాగా వుంది. దాంతో ఎట్లా సంబంధం ఏర్పరచుకోవాలో నువ్వు మరచిపోయావు. నీకు దాంతో సంబంధం కుదర్లేదు.

నా ప్రయత్నమంతా ఆనందాన్ని, పరవశాన్ని, శాంతిని, ప్రేమను సామరస్యాన్ని నువ్వు అందుకునేలా, వాటితో సంబంధ మేర్పరచుకునేలా చేయ్యాడానికే. ధ్యానమొక్కటే వాటితో నీకు సంబంధమేర్పరచేది. నీ అసలు తత్వాన్ని ఎట్లా అందుకోవాలో నీకు ధ్యానమొక్కటే తెలుపుతుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jun 2021

దేవాపి మహర్షి బోధనలు - 102

🌹. దేవాపి మహర్షి బోధనలు - 102 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 83. శ్రమ -ఫలితము 🌻

“శ్రమించుటకు వెనకాడకుము. మంచిని పెంచుము. సత్పురుషులను గౌరవించుము.” ఇది మా శాసనము. పుట్టిన ప్రతి పసిపాప అరచేతియందును ఈ శాసనము లిఖించవచ్చును.

దీని ననుసరించినవాడు దివ్య మార్గమును చేరగలడు. ఇదియే దీక్షగ సాగినవాడు పవిత్ర హృదయుడై దివ్యత్వమును చేరగలడు. పై శాసనమును మీరందరును గంట గంటకు మననము చేసుకొనుట మంచిది. ప్రపంచపు ఆటుపోటులలో మరపు సహజము.

ప్రక్కదారులు పట్ట కుండుటకై నిరంతర మననము ముఖ్యము. మననము, ఆచరణము పట్టుపడి నచో తుఫానుయందు కూడ నీవు స్థిరముగ యుందువు. చాల శ్రమ పడితిని, ఇంక ఎంత శ్రమపడ వలెను? అను వారికి మా సమాధానము 'యిక చాలు'. ఈ సమాధానము కోరువారు పురోగతిని వాయిదా వేసినట్లే.

మరియొక శ్రమ పడువాడు “ఈ శ్రమకు ఫలితమేమి?" అని భావించినచో మా సమాధానము 'ఇదిగో నీ ఫలము!' అని ఫలమందించి ఊర కుందుము. ఫలితము పునః ప్రారంభమే. ప్రశ్నలు లేక శ్రమించువారికి ఫలము దివ్యశరీర నిర్మాణము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jun 2021

వివేక చూడామణి - 91 / Viveka Chudamani - 91

🌹. వివేక చూడామణి - 91 / Viveka Chudamani - 91🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 22. కోరికలు, కర్మలు - 1 🍀

311. ఎవడైతే శరీరముతో దురాశతో ఏకమవుతాడో అతడు జ్ఞానేంద్రియాల సుఖాలకు లోనవుతాడు. అతడు శరీర భావనను ఎలా తొలగించు కొనగలడు, దురాశలో ఉన్నట్లే. అందువలన జ్ఞానేంద్రియ భావన అనేది ముఖ్య కారణముగా అతడు మరల ద్వంద్వ స్థితిలోకి చేరుకొన్నట్లు భావించాలి.

312. ఎపుడైతే స్వార్థ భావముతో కూడిన చర్యలు మొదలవుతాయో అపుడు జ్ఞానేంద్రియ సంబంధ వస్తువులపై భావనలు పెంపొంది, అవి మొలకెత్తగా అట్టి కోరికలను గుర్తించి వాటిని నాశనం చేసినచో ఆ విత్తనం కూడా నాశనం అవుతుంది. అందువలన ప్రతి వ్యక్తి అట్టి స్వార్థ భావనలను వెంటనే అణచి వేయాలి.

313. కోరికలు పెరుగుట ద్వారా, స్వార్థ పరత్వం పెరిగి కోరికలు కూడా పెరుగుతాయి. అపుడు మనిషిలో మార్పును మనం గమనించము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 91 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 22. Desires and Karma - 1 🌻

311. He alone who has identified himself with the body is greedy after sense-pleasures. How can one, devoid of the body-idea, be greedy (like him) ? Hence the tendency to think on the sense-objects is verily the cause of the bondage of transmigration, giving rise to an idea of distinction or duality.

312. When the effects are developed, the seed also is observed to be such, and when the effects are destroyed, the seed also is seen to be destroyed. Therefore one must subdue the effects.

313. Through the increase of desires selfish work increases, and when there is an increase of selfish work, there is an increase of desire also. And man’s transmigration is never at an end.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

22 Jun 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 428, 429 / Vishnu Sahasranama Contemplation - 428, 429

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 428, 429 / Vishnu Sahasranama Contemplation - 428, 429 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam🌻

ఓం ప్రమాణాయ నమః | ॐ प्रमाणाय नमः | OM Pramāṇāya namaḥ

సంవిదాత్మనా ప్రమాణమితి బ్రహ్మైవ బోధ్యతే అనుభవమున గోచరుడుగా చేసికొనబడును. పరమాత్ముడు కేవలానుభవాత్మక జ్ఞాన రూపుడుగావున 'ప్రమాణం' అని చెప్పదగియున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 428🌹

📚. Prasad Bharadwaj

🌻428. Pramāṇam🌻

OM Pramāṇāya namaḥ

Saṃvidātmanā pramāṇamiti brahmaiva bodhyate / संविदात्मना प्रमाणमिति ब्रह्मैव बोध्यते He is of the nature of knowledge or pure consciousness acquired by proof. So, He is Pramāṇaṃ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम् ।अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥

విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥

Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam ।Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 429 / Vishnu Sahasranama Contemplation - 429🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻429. బీజమవ్యయమ్, बीजमव्ययम्, Bījamavyayam🌻

ఓం బీజమవ్యయాయ నమః | ॐ बीजमव्ययाय नमः | OM Bījamavyayāya namaḥ

తదేవ చాన్యథాభావ వ్యతిరేకేణ కారణమ్ ।
బీజమవ్యయమిత్యుక్తం నామైకం సవిశేషణమ్ ॥

న వ్యేతి అను వ్యుత్పత్తిచే ఏ మార్పును లేనిది 'అవ్యయమ్‍' అనబడును. కారణభూతముగానుండు తత్త్వము 'బీజం' అనబడును. అన్యథాభావవ్యతిరేకము అనగా ఒక విధముగా మొదటనున్నది మరియొక విధముగా అగు స్థితి లేకపోవుటతో పాటుగా సర్వకారణకారణము అగువాడు అని అర్థము. 'బీజమ్‍' విశేష్యముకాగా 'అవ్యయం' విశేషణము కాగా ఈ రెండు శబ్దములును కలిసి 'సవిశేషణము అగు ఏకనామము.'

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::

గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 429🌹

📚. Prasad Bharadwaj

🌻429. Bījamavyayam🌻

OM Bījamavyayāya namaḥ

Tadeva cānyathābhāva vyatirekeṇa kāraṇam,
Bījamavyayamityuktaṃ nāmaikaṃ saviśeṣaṇam.

तदेव चान्यथाभाव व्यतिरेकेण कारणम् ।
बीजमव्ययमित्युक्तं नामैकं सविशेषणम् ॥

Bījam is cause. Avyayam is not changing or immutable. Both the names combined mean the One who is the seed or cause of the Saṃsāra without Himself undergoing any change. This is a name with an adjective.

Śrīmad Bhagavad Gīta - Chapter 9

Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. 18.

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::

गतिर्भर्ता प्रभुस्साक्षी निवासश्शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥ १८ ॥

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम् ।अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥

విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥

Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam ।Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

22 Jun 2021

22-JUNE-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-53 / Bhagavad-Gita - 1-53 - 2 - 6🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 621 / Bhagavad-Gita - 621 - 18-32🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 428 429 / Vishnu Sahasranama Contemplation - 428, 429🌹
4) 🌹 Daily Wisdom - 129🌹
5) 🌹. వివేక చూడామణి - 91🌹
6) 🌹Viveka Chudamani - 91🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 91🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 34 🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 282-1 / Sri Lalita Chaitanya Vijnanam - 282-1🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 53 / Bhagavad-gita - 53 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 6 🌴*

6. న చైతద్ విద్మ: కతరన్నో గరీయో యద్ వా జయేమ యది వా నో జయేయు:
యానేవ హత్వాన జిజీవిషామః తే వస్థితా: ప్రముఖే ధార్తరాష్ట్రా: ||

తాత్పర్యం :
వారిని జయించుట ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేమిక జీవించియుండుట వ్యర్థము. అయినప్పటికిని వారిపుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు.

భాష్యము :
యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మమైనను అనవసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలెనా లేక యుద్దమును త్యజించి భిక్షపై జీవించవలెనా అర్జునుడు తెలియలేకపోయెను. శత్రువును జయింపని యెడ భిక్షాటనయే అతనికి జీవనాధారము కాగలదు. అలాగని విజయము నిశ్చయముగా లభించునని కుడా లేదు. 

ఏలయన యుద్ధమునందు ఇరుపక్షములలో ఎవరైనను జయమును సాధింపవచ్చును. ఒకవేళ విజయము వారి కొరకై వేచియున్నను (మరియు వారి యుద్ధకారణము న్యాయసమ్మతమైనను) యుద్ధమందు ధృతరాష్ట్రుని తనయులు మరణించినచో వారి అభావమున జీవించుట కష్టతరము కాగలదు. అట్టి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయము కాగలదు. 

అర్జునిని ఈ భావములన్నియును అతడు గొప్ప భగవద్భక్తుడు అనియే గాక, అత్యున్నత జ్ఞానపూర్ణుదనియు మరియు మనో ఇంద్రియములపై పూర్ణ నిగ్రహము కలవాదనియు స్పష్టముగా నిరూపించుచున్నవి. రాజవంశములో జన్మించినను భిక్షమెత్తి జీవించుట యనెడి కోరిక అతని వైరాగ్యమునకు మరొక చిహ్నమై యున్నది. ఈ గుణములు మరియు శ్రీకృష్ణుని(ఆధ్యాత్మికగురువు) ఉపదేశాములపై అతని శ్రద్ధ యనునవి అతడు నిక్కముగా ధర్మాత్ముడని సూచించుచున్నవి. 

కనుకనే అతడు ముక్తికి అర్హుడై యున్నాడని నిర్దారింపబడినది. ఇంద్రియములు నిగ్రహింపబడనిదే జ్ఞానస్థాయికి ఉద్దరింపబడు అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తికి అవకాశము లేదు. లౌకిక సంబంధములో అపరిమిత గుణములతో పాటుగా అర్జునుడు ఈ గుణములందును యోగ్యుడైయున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 53 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 6 🌴*

6. na caitad vidmaḥ kataran no garīyo yad vā jayema yadi vā no jayeyuḥ yān eva hatvā na jijīviṣāmas te ’vasthitāḥ pramukhe dhārtarāṣṭrāḥ

Translation : Nor do we know which is better – conquering them or being conquered by them. If we killed the sons of Dhṛtarāṣṭra, we should not care to live. Yet they are now standing before us on the battlefield.

Purport :
Arjuna did not know whether he should fight and risk unnecessary violence, although fighting is the duty of the kṣatriyas, or whether he should refrain and live by begging. If he did not conquer the enemy, begging would be his only means of subsistence. Nor was there certainty of victory, because either side might emerge victorious. Even if victory awaited them (and their cause was justified), still, if the sons of Dhṛtarāṣṭra died in battle, it would be very difficult to live in their absence. Under the circumstances, that would be another kind of defeat for them. 

All these considerations by Arjuna definitely proved that not only was he a great devotee of the Lord but he was also highly enlightened and had complete control over his mind and senses. His desire to live by begging, although he was born in the royal household, is another sign of detachment. He was truly virtuous, as these qualities, combined with his faith in the words of instruction of Śrī Kṛṣṇa (his spiritual master), indicate. It is concluded that Arjuna was quite fit for liberation. 

Unless the senses are controlled, there is no chance of elevation to the platform of knowledge, and without knowledge and devotion there is no chance of liberation. Arjuna was competent in all these attributes, over and above his enormous attributes in his material relationships.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 621 / Bhagavad-Gita - 621 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 32 🌴*

32. అధర్మం ధర్మమతి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి: సా పార్థ తామసీ ||

🌷. తాత్పర్యం : 
ఓ పార్థా! అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగ అధర్మమును ధర్మముగాను మరియు ధర్మమును అధర్మముగాను భావించుచు, ఎల్లప్పుడును తప్పుద్రోవను పోవునట్టి బుద్ధి తామసగుణమును కూడినట్టిది.

🌷. భాష్యము :
తమోమయమైన బుద్ధి సదా వర్తించవలసిన విధమునకు విరుద్ధముగ వర్తించుచుండును. ధర్మము కానటువంటి దానిని ధర్మముగా స్వీకరించు అట్టి బుద్ధి నిజమైన ధర్మమును నిరసించుచుండును. 

అట్టి తామసబుద్ధి కలిగినవారు మహాత్ముడైనవానిని సాధారణ మానవునిగా, సాధారణమానవునిగా మహాత్మునిగా భావింతురు. సత్యమును అసత్యముగా భావించుచు. 

అసత్యమును సత్యముగా వారు స్వీకరింతురు. అన్ని కర్మల యందును వారు కేవలము తప్పుద్రోవనే పట్టి పోవుదురు. కనుకనే వారి బుద్ధి తమోగుణమయమైనట్టిది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 621 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 32 🌴*

32. adharmaṁ dharmam iti yā
manyate tamasāvṛtā
sarvārthān viparītāṁś ca
buddhiḥ sā pārtha tāmasī

🌷 Translation : 
That understanding which considers irreligion to be religion and religion to be irreligion, under the spell of illusion and darkness, and strives always in the wrong direction, O Pārtha, is in the mode of ignorance.

🌹 Purport :
Intelligence in the mode of ignorance is always working the opposite of the way it should. It accepts religions which are not actually religions and rejects actual religion. Men in ignorance understand a great soul to be a common man and accept a common man as a great soul. 

They think truth to be untruth and accept untruth as truth. In all activities they simply take the wrong path; therefore their intelligence is in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 428, 429 / Vishnu Sahasranama Contemplation - 428, 429 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam🌻*

*ఓం ప్రమాణాయ నమః | ॐ प्रमाणाय नमः | OM Pramāṇāya namaḥ*

సంవిదాత్మనా ప్రమాణమితి బ్రహ్మైవ బోధ్యతే అనుభవమున గోచరుడుగా చేసికొనబడును. పరమాత్ముడు కేవలానుభవాత్మక జ్ఞాన రూపుడుగావున 'ప్రమాణం' అని చెప్పదగియున్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 428🌹*
📚. Prasad Bharadwaj

*🌻428. Pramāṇam🌻*

*OM Pramāṇāya namaḥ*

Saṃvidātmanā pramāṇamiti brahmaiva bodhyate / संविदात्मना प्रमाणमिति ब्रह्मैव बोध्यते He is of the nature of knowledge or pure consciousness acquired by proof. So, He is Pramāṇaṃ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम् ।अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥

విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥

Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam ।Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 429 / Vishnu Sahasranama Contemplation - 429🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻429. బీజమవ్యయమ్, बीजमव्ययम्, Bījamavyayam🌻*

*ఓం బీజమవ్యయాయ నమః | ॐ बीजमव्ययाय नमः | OM Bījamavyayāya namaḥ*

తదేవ చాన్యథాభావ వ్యతిరేకేణ కారణమ్ ।
బీజమవ్యయమిత్యుక్తం నామైకం సవిశేషణమ్ ॥

న వ్యేతి అను వ్యుత్పత్తిచే ఏ మార్పును లేనిది 'అవ్యయమ్‍' అనబడును. కారణభూతముగానుండు తత్త్వము 'బీజం' అనబడును. అన్యథాభావవ్యతిరేకము అనగా ఒక విధముగా మొదటనున్నది మరియొక విధముగా అగు స్థితి లేకపోవుటతో పాటుగా సర్వకారణకారణము అగువాడు అని అర్థము. 'బీజమ్‍' విశేష్యముకాగా 'అవ్యయం' విశేషణము కాగా ఈ రెండు శబ్దములును కలిసి 'సవిశేషణము అగు ఏకనామము.'

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 429🌹*
📚. Prasad Bharadwaj

*🌻429. Bījamavyayam🌻*

*OM Bījamavyayāya namaḥ*

Tadeva cānyathābhāva vyatirekeṇa kāraṇam,
Bījamavyayamityuktaṃ nāmaikaṃ saviśeṣaṇam.

तदेव चान्यथाभाव व्यतिरेकेण कारणम् ।
बीजमव्ययमित्युक्तं नामैकं सविशेषणम् ॥

Bījam is cause. Avyayam is not changing or immutable. Both the names combined mean the One who is the seed or cause of the Saṃsāra without Himself undergoing any change. This is a name with an adjective.

Śrīmad Bhagavad Gīta - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. 18.

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::
गतिर्भर्ता प्रभुस्साक्षी निवासश्शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥ १८ ॥ 

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम् ।अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥

విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥

Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam ।Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 128 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. The Reality that is Established in Philosophy 🌻*

The Reality that is established in philosophy is to be experienced in the state of deep meditation. Here consciousness and being become one. There is no way of entering into communion with it except by being it. There is no such thing as subject-object relationship in regard to the consciousness of what is universal. 

Either one knows it fully in non-dualistic communion or does not know it at all. The senses, the understanding and the reason are powerless instruments in one’s attempt at perfectly comprehending its nature or realising it in experience. In the realisation of the Supreme Being the mind of the individual is completely transcended, together with all its dualistic categories. 

The mind does not partake of the characteristics of Reality. It is not conscious and also not universal in nature. The mind is a feeble objective insentient evolute acting as the individual’s instrument in the perception of the external world, which is physical in nature.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 91 / Viveka Chudamani - 91🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 22. కోరికలు, కర్మలు - 1 🍀*

311. ఎవడైతే శరీరముతో దురాశతో ఏకమవుతాడో అతడు జ్ఞానేంద్రియాల సుఖాలకు లోనవుతాడు. అతడు శరీర భావనను ఎలా తొలగించు కొనగలడు, దురాశలో ఉన్నట్లే. అందువలన జ్ఞానేంద్రియ భావన అనేది ముఖ్య కారణముగా అతడు మరల ద్వంద్వ స్థితిలోకి చేరుకొన్నట్లు భావించాలి. 

312. ఎపుడైతే స్వార్థ భావముతో కూడిన చర్యలు మొదలవుతాయో అపుడు జ్ఞానేంద్రియ సంబంధ వస్తువులపై భావనలు పెంపొంది, అవి మొలకెత్తగా అట్టి కోరికలను గుర్తించి వాటిని నాశనం చేసినచో ఆ విత్తనం కూడా నాశనం అవుతుంది. అందువలన ప్రతి వ్యక్తి అట్టి స్వార్థ భావనలను వెంటనే అణచి వేయాలి. 

313. కోరికలు పెరుగుట ద్వారా, స్వార్థ పరత్వం పెరిగి కోరికలు కూడా పెరుగుతాయి. అపుడు మనిషిలో మార్పును మనం గమనించము. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 91 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 22. Desires and Karma - 1 🌻*

311. He alone who has identified himself with the body is greedy after sense-pleasures. How can one, devoid of the body-idea, be greedy (like him) ? Hence the tendency to think on the sense-objects is verily the cause of the bondage of transmigration, giving rise to an idea of distinction or duality.

312. When the effects are developed, the seed also is observed to be such, and when the effects are destroyed, the seed also is seen to be destroyed. Therefore one must subdue the effects.

313. Through the increase of desires selfish work increases, and when there is an increase of selfish work, there is an increase of desire also. And man’s transmigration is never at an end.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 102 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 83. శ్రమ -ఫలితము 🌻*

“శ్రమించుటకు వెనకాడకుము. మంచిని పెంచుము. సత్పురుషులను గౌరవించుము.” ఇది మా శాసనము. పుట్టిన ప్రతి పసిపాప అరచేతియందును ఈ శాసనము లిఖించవచ్చును. 

దీని ననుసరించినవాడు దివ్య మార్గమును చేరగలడు. ఇదియే దీక్షగ సాగినవాడు పవిత్ర హృదయుడై దివ్యత్వమును చేరగలడు. పై శాసనమును మీరందరును గంట గంటకు మననము చేసుకొనుట మంచిది. ప్రపంచపు ఆటుపోటులలో మరపు సహజము. 

ప్రక్కదారులు పట్ట కుండుటకై నిరంతర మననము ముఖ్యము. మననము, ఆచరణము పట్టుపడి నచో తుఫానుయందు కూడ నీవు స్థిరముగ యుందువు. చాల శ్రమ పడితిని, ఇంక ఎంత శ్రమపడ వలెను? అను వారికి మా సమాధానము 'యిక చాలు'. ఈ సమాధానము కోరువారు పురోగతిని వాయిదా వేసినట్లే. 

మరియొక శ్రమ పడువాడు “ఈ శ్రమకు ఫలితమేమి?" అని భావించినచో మా సమాధానము 'ఇదిగో నీ ఫలము!' అని ఫలమందించి ఊర కుందుము. ఫలితము పునః ప్రారంభమే. ప్రశ్నలు లేక శ్రమించువారికి ఫలము దివ్యశరీర నిర్మాణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 34 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀.ఆనందమున్నది ఎప్పుడో ఎక్కడో భవిష్యత్తులో జరిగేది కాదు. మనకు దాంతో సంబంధం ఇంకా ఏర్పడలేదు. అంతే. 🍀*

ఆనందమున్నది ఎప్పుడో ఎక్కడో భవిష్యత్తులో జరిగేది కాదు. అది అప్పటికే వున్న యదార్థం. మనకు దాంతో సంబంధం ఏర్పడలేదు. అంతే. అది అప్పటికే అంతస్రోతస్వినిలాగా వుంది. దాంతో ఎట్లా సంబంధం ఏర్పరచుకోవాలో నువ్వు మరచిపోయావు. నీకు దాంతో సంబంధం కుదర్లేదు. 

నా ప్రయత్నమంతా ఆనందాన్ని, పరవశాన్ని, శాంతిని, ప్రేమను సామరస్యాన్ని నువ్వు అందుకునేలా, వాటితో సంబంధ మేర్పరచుకునేలా చేయ్యాడానికే. ధ్యానమొక్కటే వాటితో నీకు సంబంధమేర్పరచేది. నీ అసలు తత్వాన్ని ఎట్లా అందుకోవాలో నీకు ధ్యానమొక్కటే తెలుపుతుంది.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 282 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 1 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।*
*సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀*

*🌻 282. 'సహస్రశీర్షవదనా' - 1 🌻* 

వెయ్యి శిరస్సులతో కూడిన వదనము కలది శ్రీమాత అని అర్థము. “సహస్ర” శబ్దము అనేకానేక అర్థములు కలిగియున్నది. సహస్రమనగా వేయి. సహస్రమనగా అనేకము. వేయి అనినపుడు ఒకటి తరువాత మూడు సున్నాలు వుండును. మూడు సున్నాలు మూడు లోకములకు సంకేతము కాగా, వాటికి పూర్వము నందున్నది ఒకటియే. ఒకటియే మూడు లోకములు వ్యాపించి యున్నదని అర్థము. సృష్టి మొత్తము ప్రజ్ఞ, శక్తి, పదార్థములతో చేయబడినది. 

ఈ మూడింటికిని ఆధారమైనది ఒకటియే. కావుననే సహస్ర పదమును పరతత్త్వమును తెలుపుటకు వాడుదురు. ఒకటి మూడుగనై నాలుగు అగును. (1 + 3 - 4) తత్కారణముగ వాక్కు, వేదము, కాలము, స్వభావములు, ప్రధానముగ నాలుగు విభజనలు పొందును. ఒకటి నుండి పుట్టిన మూడు, నాలుగు నుండి ప్రతిబింబించుటచే ఏడగును. (1 + 3 + 3 7) ఇట్లు ఏడు లోకము లేర్పడును. ప్రధానముగ మూడే లోకము లైననూ ప్రతిబింబ ప్రభావమున ఏడుగ గోచరించును. సత్యలోకము, తపోలోకము, జనోలోకము ప్రధానముగ మూడు లోకములు. 

ఈ మూడు లోకములు మహత్తు అను నాలుగవ లోకమునుండి సువర్లోకము, భువర్లోకము, భూలోకముగ ప్రతిబింబించును. ముందు మూడు లోకములు సూక్ష్మములు. తరువాత మూడు లోకములు = స్థూలములు. సూక్ష్మము స్థూలములోనికి వచ్చుటకు మహత్తు నడుచు చున్నది. అదృశ్యము దృశ్యమగుట, దృశ్యము అదృశ్యమగుట ఈ మహత్తు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 282 - 1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |*
*sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀*

*🌻 Sahasra-śīrṣa-vadanā सहस्र-शीर्ष-वदना (282) -1 🌻*

Sahasra in this context means infinite and literally means thousand. She has countless heads and faces. The next two nāma-s also have the same meaning. Unable to describe Her supremacy by words, Vāc Devi-s have used an envisioned form here that encompasses summate supremacy. In fact, it can be considered as true in literal sense. Since the Brahman has so many acts to do in different places at the same time, the Brahman needed countless numbers of heads.

The countless number of heads for the Brahman is described in Veda-s and Upaniṣads. Bhagavad Gīta (XIII.13) says “He dwells in the world, enveloping all – everywhere, His hands and feet; present on all sides, His eyes and ears, His mouth and heads”.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹