Showing posts with label యోగ సాధన. Show all posts
Showing posts with label యోగ సాధన. Show all posts

రక్షా బంధన్ Story of Raksha Bandhan


రక్షా బంధన్

రాఖీ పౌర్ణమి వాస్తవానికి భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. కానీ, పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతారు.

మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైనవారు కంగారుపడి గాయానికి మందుపూయడానికి తలో దిక్కున వెళ్లి వెదుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు.

రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు



Raksha Bandhan

Rakhi Poornami There is no concrete evidence as to when and how Rakhi Poornami or Rakshabandhan actually started in India. But, in Puranas, there are different kinds of stories about it. Indra was defeated while fighting Vritasura. Then Indra's wife Sachi Devi prayed for the success of her husband and tied a sacred thread to his right hand wrist. It is said that he defeated the demons and won and that is how Rakhi was born.

In the Mahabharata, Draupadi and Lord Krishna's sister-sister connection is great. In the course of punishing Shisupala, Krishna used his Sudarshana Chakra and his index finger was injured and blood oozed out. While Satyabhama, Rukmini etc. who were there were worried and went to look for medicine for the wound, Draupadi tore off her sari and bandaged her finger. In gratitude for this, God assured her that he would always be there for her. That is why when Dusshasana tried to disrob Draupadi in the Kuru Sabha, Parandhama helped her.

Lord Vishnu leaves Vaikuntha and comes to earth in the form of Vamana to save the humans from the demons when the demon king Bali invades the earth. Then Goddess Lakshmi approaches the demon king Bali Chakravarti in the form of a Brahmin maiden. On the full moon day of Shravan, Bali ties the sacred thread to the emperor and tells who he is. She wants to send her husband back to Vaikuntha somehow. Then Bali leaves his kingdom for her and liberates the human beings. So he asks Vishnumurthy to go to Vaikuntha


11 Aug 2022


హయగ్రీవ జయంతి మరియు రక్షా బంధన్ శుభాకాంక్షలు - Good Wishes on Hayagriva Jayanthi and Raksha Bhandhan


🌹. హయగ్రీవ జయంతి మరియు రక్షా బంధన్ శుభాకాంక్షలు మిత్రులందరికి🌹

🌹Good Wishes on Hayagriva Jayanthi and Raksha Bhandhan to you All 🌹


ప్రసాద్ భరద్వాజ


🍀. హయగ్రీవ స్తోత్రము 🍀

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥
విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం
దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ॥


🍀. రక్షా బంధనము ధరింప జేయునపుడు పఠించ వలసిన మంత్రము 🍀

యేనుబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః

తేనత్వామభి బధ్నామి రక్షే మాచల మాచల

“దేవతలందరి అభ్యర్థన మేరకు, విష్ణువు తన బలంతో బలమైన మరియు శక్తివంతమైన రాక్షస రాజు బాలిని కట్టివేసాడు. నేను రక్ష రూపంలో ఉన్న విష్ణుశక్తి శక్తిని నీ చేతికి కట్టివేస్తున్నాను. ఈ పవిత్రమైన దారం యొక్క శక్తి మరియు శక్తితో, దేవతలందరూ మీకు అండగా నిలుస్తారు మరియు మిమ్మల్ని ఎప్పటికీ ఆరోగ్యంగా మరియు ధనవంతులుగా ఉంచుతారు.


🍀 Rakshabandhan mantra 🍀

“Yenabaddho Baleeraja Daanavendro Mahabalaha
Thethathwa mabhi badhnami Rakshamachala maachala”


Meaning of Rakshabandhan Stotram –

“On the request of all the Gods, Vishnu tied up the strong and powerful Demon King Bali with his strength. I am tying the power of the Vishnu Shakti, in the form of Raksha, on to you hand. With the force and energy of this sacred thread, all the Gods will stand at your side and keep you healthy and wealthy forever.”

🌹 🌹 🌹 🌹 🌹




ఆదిశక్తి శరణాగతి In surrenderence to Adi-Shakti

 


శ్రావణమాసం-లక్ష్మీ కటాక్షం Shravanamasam-Lakshmi Kataksham श्रावण मासम - लक्ष्मी कटक्षम


🙏. శ్రావణమాసం-లక్ష్మీ కటాక్షం🙏

🌿. ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చిందే కాలం శ్రావణమాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు.

🌸. పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు- శ్రావణ మంగళవారాల నోములు, దివ్యమైన శుభకరమైన పండుగలతో, పర్వదినాలలో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం.

🌿. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో అయిదవ దివ్యమైన మాసం శ్రావణం. వర్షఋతువు ప్రారంభమయ్యేమాసం. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణమాసమనే పేరొచ్చింది.

🌸. ‘శ్రవణం’ విష్ణుమూర్తి జన్మనక్షత్రం. శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడంవల్ల విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణమాసం.

🌿. శ్రావణమాసంలో మంగళవారాలు శ్రీ గౌరీదేవి పూజకు, శుక్రవారాలు శ్రీ లక్ష్మీదేవి పూజకు, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైనవి. శ్రావణమాసంలో సోమవారంనాడు పరమశివుడిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది.

🌸. సోమవారంనాడు శివాలయంలోగానీ, ఇంటిలోగానీ అభిషేకం చేయడంతోపాటు బిళ్వదళములతో అర్చన చేయవచ్చు.

🌿. భగవాన్ శ్రీకృష్ణుని జననం శ్రావణమాసంలోనే జరిగింది. హయగ్రీవుడు, అరవిందయోగి వంటి పుణ్యపురుషులు జన్మించింది ఈనెలలోనే. వర్షఋతువు, ఓషధులు, పంటలు, ధనధాన్యాలకు శుభకరమైనది ఈ మాసం.

🌸. ఈ కాలంలో దాడిచేసే రోగాలను దూరంగా పెట్టడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసాలకూ ప్రాధాన్యత ఇస్తారు.

🌿. అంతేగాక దక్షిణాయనంలో దేవతల అనుహ్రం భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది. ఈమాసంలో మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలతోపాటు అందరిమదిలో మెదిలేది శ్రావణపూర్ణిమ.

🌸. శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మరియు శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు భువిపై అవతరించిన పుణ్యదినమే శ్రావణ బహుళ అష్టమి.

🌿. శ్రావణంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించడంవల్ల సకల శుభాలు కలుగుతాయని మత్స్యపురాణం చెబుతున్నది.

🌸. శ్రావణ శుద్ధ చవితిని నాగుల చవితి అని, పంచమిని నాగపంచమి అంటారు. నాగచతుర్థినాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజించాలి.

🌿. నాగపంచమినే గరుడ పంచమని కూడా అంటారు. నాగులకు పాలు, పాయసం, నువ్వుల పిండి, చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సర్పదోషం తొలగుతుంది.

🌸. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు తమ అయిదోతనం కలకాలం నిలవాలంటే ఈమాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు.

🌿పళ్లయిన సంవత్సరంనుంచి వరుసగా అయిదు సంవత్సరాలపాటు నోము నోచి చివరి సంవత్సరం ఉద్యాపన చేస్తారు.

🌸. శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము స్ర్తిలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కల్గి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం.


🌿. ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు.
శ్రావణ పూర్ణిమను భారతావని మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తారు.

🌸. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు గల విశిష్టత ఇంతింతని చెప్పనలవికాదు. ఈ రోజున చేసే హయగ్రీవ ఆరాధన ఉన్నత విద్యను ప్రసాదిస్తుంది.

🌸. చదువుల తల్లి సరస్వతికి గురువు హయగ్రీవుడని దేవీభాగవతం చెబుతోంది.

🌿. శ్రావణపూర్ణిమనే ‘రాఖీపూర్ణిమ’.శ్రావణ బహుళ విదియ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన తిథిగా చెప్పబడింది.

🌸. ఈ తిథి రోజు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రులు సశరీరంగా సజీవంగా బృందావన ప్రవేశాన్ని పొందారు.

🌿. లోకానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమే బహుళ అష్టమి.

🌸. బహుళ ఏకాదశి కామ్య ఏకాదశి, శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు.

🌿. ఈ విధంగా ప్రతిరోజూ విశేషదాయకమైన శ్రావణమాసాన్ని మనం పాటిద్దాం- మోక్షాన్ని పొందుదాం.

..స్వస్తి..🚩🌞🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

29 Jul 2022

శ్రావణ మాసం విశిష్టత 🌹. శ్రావణ శుద్ధ పౌర్ణమి - Significance of Shravan Month 🌹 Shravan month's Auspicious Pournami - श्रावण मास की विशिष्टता । 🌹 श्रावण शुद्ध पूर्णिमा


🙏🌹. శ్రావణ మాసం విశిష్టత 🌹🙏

🌸. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం.

🌿. ఈ నెలలో వచ్చే..._ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్ర మైనవి.

🌸. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు.
శ్రావణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మనక్షత్రం కూడా...

🌷. ‘శ్రవం నయ తీతి శ్రేణ నీయత ఇతివా శ్రవణం’ వేద వాఙ్మయం🌷

🌿. హయ గ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హయగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షించాడు. హయగ్రీవుడు అవత రించింది శ్రావణ మాసం.





🌹. శ్రావణ శుద్ధ పౌర్ణమి 🌹

🌸. జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి , నాగ పంచమి పుత్రదా ఏకాదశి , దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి.

🌿. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనః కారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము... ఈ...మాసం...

🌸. ఈ మాస మందు రవి సంచ రించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును.

🌿. చంద్రుని చార నుంచి జరగ బోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమ మైనది.

🌸. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పు కొని మానసిక శాంతి పొంద డానికి,

🌿. ప్రకృతి వలన కలిగే అస్త వ్యస్త అనారోగ్యముల నుండి తప్పించు కొనుటకు,మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం...

🌸. శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశ మైనది.

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

29 Jul 2022

నడు చుక్కల అమావాస్య Chukkala Amavasya


🌹నడు చుక్కల అమావాస్య🌹_

ఈ రోజు ఏం చేయాలి


ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...

హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య.

ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !

ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం . కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.

ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారట. ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా !

ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి , చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి , బద్ధకానికీ , అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని , వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. మనం అంతగా పట్టించుకోని చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని తతంగాలు ఉన్నాయన్నమాట.

🌹 🌹 🌹 🌹 🌹


28 Jul 2022

భీమన అమావాస్య Bheemana Amavasya

🌹.భీమన అమావాస్య 🌹

భీమన అమావాస్య దక్షిణ భారతదేశంలో జరుపుకునే పండుగ , ఎక్కువగా కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో.

నూతన వధూవరులు అమావాస్య రోజున జ్యోతిర్భేమేశ్వర వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని భర్త సంజీవిని వ్రతం అని కూడా అంటారు. భీముడి అమావాస్య శివుడిని పూజించే రోజు , తన భర్త దీర్ఘాయువు కోసం కరుణ కోరుతూ ఈ వ్రతం చేస్తారు.

భీముడి అమావాస్యను వివాహిత మహిళలు మాత్రమే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరుపుకోవచ్చు. పెళ్లికాని ఆడవారు మంచి భర్తను ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తారు మరియు వివాహిత స్త్రీ తన భర్త ఆయుష్షు పెరుగుటకు ఈ వ్రతం చేస్తారు.


ఆరాధన విధానం

గృహిణులు తమ చేతులకు కంకణాలు ధరించి జ్యోతిర్భీమేశ్వరుడిని ధ్యానించాలి. ఉదయం లేదా సాయంత్రం ఏదైనా శుభ సమయంలో వ్రతాన్ని ఆచరించవచ్చు. అన్నం ఒక ప్లేట్ మీద పెట్టి , దానిపై రెండు దీపాలు వేసి , నూనె వెలిగించండి. పూజలతో కూడిన 9 గంటల గౌరీ దారాన్ని పూజించాలి. ముందుగా గణపతిని పూజించి , తర్వాత భీమేశ్వరుని పూజించారు. 9 రకాల నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత భర్తకు పాదపూజ చేయాలి.

జరుపుకునే వివిధ మార్గాలు:

ప్రయోజనం ఒకటే అయినప్పటికీ , ఆచరణలో కొత్తదనం కనుగొనవచ్చు. దక్షిణ కన్నడలో దీనిని అమావాస్య అంటారు. ఈ రోజు , ఈ ప్రాంత సంస్కృతి , ఆచారాలు మరియు ఆలోచనలను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తర కన్నడలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని కోడె అమావాస్య అంటారు.

ఈ పండుగ యొక్క మరోక ప్రత్యేకత భండారా:

నల్లని మైదా పిండి నుండి రిపోజిటరీని తయారు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మీరు అందులో నాణెం ఉంచాలి. దీనిని గుమ్మంలో పెట్టి పూజించాలి.

పురాణ నేపథ్యం

పురాణాల ప్రకారం , అమావాస్య రోజున శివుడు పార్వతిని తన భార్యగా స్వీకరించారు.

పార్వతి శ్రేయస్సు , సంతానం , పవిత్రత , శక్తికి సంకేతం. ఈ విధంగా , ఈ రోజున ఉపవాసం ఉండి , స్త్రీలు శివుడిని మరియు పార్వతిని ఆరాధిస్తే , వారికి మంచి భర్త లభిస్తాడు. అదేవిధంగా , వివాహిత మహిళలు భర్త దీర్ఘాయువు , విజయం , సంతోషం కోసం శివుడిని పార్వతి దేవిని ఆరాధిస్తారు.

🌹 🌹 🌹 🌹 🌹


28 Jul 2022

ఓం భాస్కరాయ నమో నమః Om Bhaskaraya Namo Namaha

 

🌹 🌞. సర్వవ్యాధి వినాశాయ శిప్రమ్ ఓం భాస్కరాయ నమో నమః 🌞🌹

🍀 🌞. SarvaVyadhi vinashaya shipram om bhaskaraya namo namaha 🌞 🍀



Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam

https://t.me/Spiritual_Wisdom

www.facebook.com/groups/chaitanyavijnanam/

https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T

https://dailybhakthimessages.blogspot.com

https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


కనుమ శుభాకాంక్షలు Kanuma Subhakankshalu: కనుమ పండగ విశిష్టత Significane of Kanuma : If you feed them, your anomalies will be removed


🌹. కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹

🔥.ఈ కనుమ మన జీవితాలలో సిరి సంపదలను, ఐశ్వర్యమును, సత్స్‌ సంభందములను నెలకొల్పి, అంతః వెలుగు వైపు మన ప్రయాణాన్ని సుగమము చేయుగాక. మనలో దివ్యత్వమును నింపుగాక. 🔥

ప్రసాద్‌ భరధ్వాజ

🌹. Good Wishes and Subhakankshalu on Kanuma Festival to all. 🌹

🔥. Let This Kanuma fill our Lives with all Resources, Good Relations, and Help us in our Journey towards Inner Light and fill with Divinity. 🔥

Prasad Bharadwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. కనుమ పండగ విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


సంక్రాంతి పండగలో భాగంగా చివరగా జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఏడాదంతా వివిధ రకాల వ్యవసాయ పనుల్లో తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ ప్రసిద్ధి. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు.

కనుమ రోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు.

సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు మొక్కులు సమర్పించుకుంటారు. కనుమ రోజు ఇంట్లో పసందైన వంటకాలు వండుతారు. కుటుంబ సభ్యులు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు.

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



🌹. కనుమ రోజు వీటికి ఇవి ఆహారంగా ఇస్తే మీ దోషాలు అన్ని తొలగిపోతాయి ! 🌹

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపుకుంటారు. అయితే , ఈ రోజున గోమాతలకు , ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు.

దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. అలాగే , కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం గల జంతువైన శునకముకు కూడా కనుమ రోజు కొన్ని పదార్థాలను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఆ కొన్ని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

కనుమ పండుగ రోజు ఉదయం గాని సాయంత్రం గాని... గోధుమపిండి , బెల్లం , ఓ చెంచా పాలతో 5 గాని , 7 గాని , 11 గానీ రొట్టెలను నెయ్యితో కాల్చి తయారుచేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే , ఈ రొట్టెలను మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆడవారు అయితే రొట్టెలను కాల్చేటప్పుడు ఎడమచేతిని ఎక్కువగా వాడాలి.. మగవారు అయితే కుడిచేతిని ఎక్కువగా వాడాలి. రొట్టెలను తయారు చేసిన తర్వాత...

గోమాత చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ తర్వాత గోమాత యొక్క కుడికాలు వద్ద ఉన్న దూలిని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోవాలి. తరువాత తయారు చేసినటువంటి రొట్టెలను గోమాతకు తినిపించాలి. ఇలా గోమాతకు సేవలు చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇకపోతే కాలభైరవుడైన శునకముకు ఎలా తినిపించాలంటే..

మీరు 7 , 11 లేదా 19 రొట్టెలను తయారు చేసుకోవాలి. అయితే వీటిని గోధుమపిండి , కొద్దీగా బెల్లం , కొన్ని తేనె చుక్కలు , కొంచెం పాలు లతో తయారు చేయాలి. ఈ రొట్టెలను కాల్చేటప్పుడు మీరు ఆవాల నూనె ను వాడటం మంచిది. కాలసర్ప దోషం , పంచమ రాహు , అష్టమ రాహు , రాహు కేతువుల పీడలు తొలగించుకోవడానికి ఆవాల నూనె ను వాడటం మంచిది.

అయితే ఈ తయారు చేసినటువంటి రొట్టెలను శునకాలకి ఎలా సమర్పించాలి అంటే.. మొదటిగా మీ వీధి లో ఉన్నటువంటి శునకాల వద్దకు వెళ్ళాలి. ఒకవేళ మీరు శునకాన్ని పెంచినా.. వాటికి మాత్రం మీరు ఈ రొట్టెలను తినిపించ కూడదు.

కేవలం వీధిలో ఉంటున్న శునకాలకి మాత్రమే రొట్టాలను తినిపించాలి. రొట్టెల తినిపించేటప్పుడు మొదటిగా.. మీ కుడి చేతితో రొట్టె ముక్కలు చేసి ఎడమచేత్తో శునకాల కి అందించాలి. శునకాలు రొట్టెలను తిన్న తర్వాత... మీ ఇంటికి వెళ్లి మట్టి కుందిలలో దీపారాధన చేసి మీ మనసులోని కోరికను కోరుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోవాలని దీపారాధన ముందు మీరు కోరుకునవలేను.

🌹 🌹 🌹 🌹 🌹


16 Jan 2022

కనుమ ప్రాధాన్యత - పశువుల పండుగ Kanuma Significance - Cattle Festival


🌹. కనుమ ప్రాధాన్యత - పశువుల పండుగ 🌹

పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఈ పండగలో మూడవ రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుండి తమ ఇంటికొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్పనైన సంస్కృతి ఆచరిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు.

పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

తమకి సుఖసంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తోన్న పాత్రను రైతులు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు 'కనుమ' రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు.

ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు. ఈ పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి కార్యక్రమము చేస్తుంటారు.

🌹 🌹 🌹 🌹 🌹


15 Jan 2022

మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికి Subhakankshalu on Sankranthi Festival to all


🌹. మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹

🔥.ఈ సంక్రాంతి పండుగ మనందరి జీవితాలలో ప్రకాశంతో కూడిన వైభవములని నింపుగాక. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మన ఆధ్యాత్మిక ప్రగతికి ఉత్తమమైన సోపానంగా మారుగాక.🔥

ప్రసాద్‌ భరధ్వాజ 🙏


🌹. Subhakankshalu on Sankranthi Festival to all. 🌹

🔥. Let This Sankranthi fill Brightness in our Lives and Bring all Glory. Let this Uttarayana Punya Kala support and help us in our Spiritual upliftment. 🔥

Prasad Bharadwaj 🙏



Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam

https://t.me/Spiritual_Wisdom

www.facebook.com/groups/chaitanyavijnanam/

https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T

https://dailybhakthimessages.blogspot.com

https://incarnation14.wordpress.com/


15 Jan 2022

భోగి పండుగ విశిష్టత - శుభాకాంక్షలతో Significance of Bhogi Festival - Best Wishes


🌹. భోగి పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹

🔥.ఈ భోగి మంటలు మన జీవితాలలో వున్న చెడును తొలగించి, వెలుగును, దివ్యత్వమును నింపుగాక. 🔥

ప్రసాద్‌ భరద్వాజ, జ్యోతిర్మయి.

🌹. Subhakankshalu on Bhogi Festival to all. 🌹

🔥. Let Bhogi Fires Clear All negativeness from our Life and Bring Light and Divinity. 🔥

Prasad Bharadwaj, Jyothirmayi.




🌹. భోగి పండుగ విశిష్టత - శుభాకాంక్షలతో 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ


తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి 'తొలినాడు' అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం.తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి ‘తొలినాడు’ అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం.

🍀. భోగి పళ్లు ఎందుకు పోస్తారు?

భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. ఈ పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి? భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగుతుందంటారు. మనకు కనిపించదు కానీ తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందటారు. ఈ భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారటారు.

🍀. భోగి అని ఎందుకు పిలుస్తారు?

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది.

🍀. బోగి మంటలు ఎందుకు వేస్తారు?

సాధారణంగా అందరు చెప్పేది… ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు… ఆరోగ్యం కోసం కూడా. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మక్రిములు నశిస్తాయి.

భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు… మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

🌹 🌹 🌹 🌹 🌹


14 Jan 2022

ముక్కోటి వైకుంఠ ఏకాదశి విశిష్టత Significance of Mukkoti Vaikuntha Ekadashi


🌹. ముక్కోటి వైకుంఠ ఏకాదశి విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🔅. శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా కొలిచే పండుగ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని ఎప్పుడు చేస్తారూ అంటే చాలా మందికి తెలియని విషయం. సూర్య మానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కువగా ఇది పుష్య శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున అన్నీ వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు.

🔅. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కూడి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు. మూడు కోట్ల దేవతలతో కూడి దర్శనం ఇస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం. వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశి, పుత్ర ఏకాదశి అనికూడా పిలుస్తారు.

🔅. ముక్కోటి ఏకాదశి రోజునే క్షీర సాగర మధనంలో హాలాహలం పుట్టింది. సమస్త జీవకోటి హాలాహల ప్రభావంతో సతమతం అవుతుంటే, పరమ శివుడు విషాన్ని తన గొంతులో ధరించి జీవకోటికి ఉపశమనం కలిగిస్తాడు. తర్వాత అమృతం పుట్టింది.

🔅. విష్ణు పురాణంలో వైకుంఠ ఏకాదశి గురించి ఒక కథ ఉంది. పూర్వం ముర అనే రాక్షసుడు ప్రజలను, ఋషులను, దేవతలను హింసిస్తుండేవాడు. ముర పెట్టే బాధలకు తాళలేక, రాక్షసుని బారి నుంచి రక్షించమని దేవతలు విష్ణువును శరణు వేడుకొంటారు. మురను సంహరించాలంటే ప్రత్యేక మైన అస్త్రం కావాలని, అందుకు కొంతకాలం వేచియుండమని చెప్పి దేవతలను పంపి, బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి విశ్రమిస్తాడు. గుహలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును సంహరించడానికి వచ్చిన మురను, విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి సంహరిస్తుంది. అలా ఉద్భవించిన శక్తీకి శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేస్తాడు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం, జాగారం, దాన ధర్మాలు చేసినట్లయితే వారి పాపములను హరిస్తానని ఏకాదశికి వరమిస్తాడు. అన్నీ ఏకాదశి పర్వదినాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పర్వదినాలు.

🔅. ముక్కోటి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి అనే ప్రశ్న ఉదయించక మానదు. ఏకాదశి ముందు రోజు రాత్రి అంటే ద్వాదశి నాడు రాత్రి బియ్యంతో చేసిన అన్నం/ఆహారం కాకుండా అల్పాహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున తెల్లవారు జామున వీలయినంత త్వరగా నిద్ర లేచి శిర స్నానం చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయటం మంచిది. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువతో పాటుగా మూడు కోట్ల దేవతలు కూడా కొలువై ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం వల్ల తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు పోతాయి. మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసమంటే పూర్తిగా ఆహారం లేకుండా ఉండటం కాదు. బియ్యంతో వండిన ఆహారం కాకుండా, పాలు, పళ్ళూ లాంటి వాటిని మితంగా తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ముర రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడు కనుక బియ్యంతో వండిన ఆహార పదార్థములు భుజించరాదని చెపుతారు. ఏకాదశి రోజున పగలు మరియు రాత్రి నిద్ర పోకుండా జాగారం ఉండాలి. జాగారం అంటే వినోద కార్యక్రమాలతో మేలుకొని ఉండటం కాదు, మేలుకొని దైవ ధ్యానంలో గడపాలి. తెల్లవారిన తరువాత శుచిగా స్నానమాచరించి, పూజా మందిరం శుభ్రం చేసి విష్ణువును పూజించాలి. తరువాత శక్తి కొలది దానం చేయాలి. తరువాత ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయవచ్చు. ద్వాదశి రోజున పగలు నిద్ర పోరాదు. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సర్వ పాపములు నశించి, యమ భయం ఉండదు. వైకుంఠ ఏకాదశినాడు మరణించిన వారు నేరుగా వైకుంఠం చేరుతారని పురాణాలు చెబుతున్నాయి.

🔅. తమిళనాడులోని శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు వైభవంగా జరుగుతాయి. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.

🔅. మన రాష్ట్రంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం, తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.

🔅. తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో నిండి ఉంటాయి.


🙏. ఓమ్ నమోనారాయణాయ🌼ఓం నమో వెంకటేశయా 🙏

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2022

పుష్య మాసం విశిష్టత Pusya (पौश Paush) Month Highlights

🌹. పుష్య మాసం విశిష్టత 🌹

03-01- 2022 నుండి పుష్యమాసం
📚. ప్రసాద్ భరద్వాజ

చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.

ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది.

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి.

ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు , బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.

శని ధర్మదర్శి న్యాయం , సత్యం , ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను , పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి , నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.

అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.

పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.

అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి ) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.

ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.

పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ , ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.

ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ , నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి.

సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి, షట్తిలైకాదశి , కల్యాణైకాదశి అని పిలుస్తారు.

సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం , నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం , మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం , తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు.

ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి , పితృ తర్పణాలు , ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.

పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము.

మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము , ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.

🌹 🌹 🌹 🌹 🌹


03 Jan 2022

శ్రీ రమణ మహర్షి జయంతి శుభాకాంక్షలు Sri Ramana Maharishi Jayanti



🌹. శ్రీ రమణ మహర్షి జయంతి శుభాకాంక్షలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు.

భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు.

జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు.

గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు.

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2021

మార్గశిర పౌర్ణమి - కోరల పౌర్ణమి విశిష్టత


🌹. మార్గశిర పౌర్ణమి - కోరల పౌర్ణమి విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి 'కోరల' పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు.

మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు , అందువల్ల అనేక రకాల వ్యాధులు , అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు.

ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది.

చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికీ నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభం అయింది.

కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగి పోతాయి.

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021

అన్నపూర్ణ జయంతి , ప్రాముఖ్యత , వ్రత కథ Annapurna Jayanti, Importance, Vrat Katha

🌹. అన్నపూర్ణ జయంతి , ప్రాముఖ్యత , వ్రత కథ 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

అన్నపూర్ణ వ్రతం హిందువుల ముఖ్యమైన పండుగ. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఆహారం అవసరం. ఆ ఆహారానికి ప్రతీకగా హిందూ దేవత అయిన అన్నపూర్ణ దేవికి అంకితం చేయబడింది.

హిందీలో 'అన్నా' అనే పదానికి 'ఆహారం' అని అర్ధం , 'పూర్ణ' 'మొత్తాన్ని' ఊహించబడినది.

అన్నపూర్ణ జయంతి ఒక శుభమైన మరియు పురాతనకాలం నుండి జరుపుకుంటున్న హిందూ పండగ.

ఈ పండుగను ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణేశ్వరికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ రోజు అన్నపూర్ణ జయంతి సందర్భంగా పండగ జరుపుకోవడమే కాదు , ఆ దేవతను ప్రశంసిపబడుతారు.

ఈ రోజు జీవనాధారమైన అన్నపూర్ణ దేవత పుట్టింది. పార్వతి దేవికి మరో రూపం అన్నపూర్ణ అంటారు. మీరు ఈ పవిత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని మరియు అన్నపూర్ణ దేవత ఆశీర్వాదం పొందాలనుకుంటే , అన్నపూర్ణ వ్రతం చేయాలి.

అన్నపూర్ణ జయంతిని ఆచార హిందూ షెడ్యూల్‌లో 'మార్గశీర్ష' నెల 'పూర్ణిమ' (పౌర్ణమి రోజు) లో జరుపుకుంటారు. ఈ గుర్తింపు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్లో వస్తుంది. ఈ రోజున హిందువులు అన్నపూర్ణ దేవిని పూర్తి నిబద్ధతతో , భక్తితో పూజిస్తారు. మహిళలు తప్పనిసరిగా ఈ వ్రతం రోజున పూజలు ఆచారాలను పాటిస్తారు.

పశ్చిమ బెంగాల్ భూభాగంతో సహా భారతదేశంలోని తూర్పు ప్రాంతాలలో సాంప్రదాయకంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటారు , అన్నపూర్ణ జయంతి హిందూ నెల 'చైత్ర'లో కనిపిస్తుంది. దక్షిణ భారత అభయారణ్యాలలో అధికభాగంలో , అన్నపూర్ణ దేవిని శుభ దుర్గా నవరాత్రి వేడుకల 'చతుర్థి' (నాల్గవ రోజు) లో పూజిస్తారు. ప్రత్యేక పూజలు మరియు ఆచారాలతో , అన్నపూర్ణ వ్రతాన్ని స్త్రీలు జరుపుకుంటారు. వారణాసి , కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ లో అనేక అన్నపూర్ణ దేవత ఆలయాలు ఉన్నాయి.


🍀. అన్నపూర్ణ వ్రత కథ

హిందూ ఇతిహాసాలు సూచించినట్లుగా , భూమి నుండి ఆహారం క్షీణించడం ప్రారంభించినప్పుడు , బ్రహ్మ మరియు విష్ణువులతో పాటు అందరు దేవుళ్ళు పరమ శివుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో పార్వతి దేవి మార్గాశిర్షా నెలలోని 'పూర్ణిమ' లో అన్నపూర్ణ దేవతగా అవతరించింది మరియు భూమిపై ఆహారాన్ని ఆశీర్వదించింది.

ఆ సమయం నుండి, ఈ రోజు అన్నపూర్ణ జయంతి అని ప్రశంసించబడింది.

అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి. 'అన్నపూర్ణే , సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే' అంటూ కొలిచే ఈ అమ్మ మన అందరికీ ఇంటిలో కొదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. లోకాలకు క్షుదార్తి తీర్చే మాతృస్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి. శివుడంతటివాడికే అమ్మయై భిక్ష వేసింది.

ఆమె సంతానంలాటి మనందరం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్నితాన్నిస్తుంది. ఆహారానికి శక్తి ఉంటుంది. శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది. మన మనస్సు కూడా ఆహారంయొక్క స్వరూపమే.

ఆహారాలు 3 రకాలుగా ఉంటాయి. సాత్విక , రాజస , తామసాలు.

శక్తిలేని ఆహారాన్ని మనం స్వీకరించం. అన్నపూర్ణగా కొలిచే అమ్మవారిలో అన్ని ధాన్యాలలోను అలాగే తినే ఆహార పదార్థాలలో ఉండేటటువంటి అంతఃశక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రులలో గుర్తుచేసుకోవడం. ఉపనిషత్తులు…. అన్నమే బ్రహ్మగా వర్ణించాయి.

(అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌) అన్నం వలన సకల భూతాలు ఉద్భవిస్తున్నాయని చెప్పాయి. అటువంటి అన్నాన్ని నిందించడం , పరీక్షించడం , వదిలిపెట్టడం వంటి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెపుతున్నాయి. శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయుల సంప్రదాయం. అందువల్ల పూర్ణ శక్తివంతమైన ఆహారాన్ని (అన్నాన్ని) స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది.

సాత్వికమైన హిత , మిత ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికి తోడ్పడతాయని అందరు ఆధ్యాత్మిక వేత్తలు చెపుతున్నమాటే.

ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అవతార విశేషం. అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమిత శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం.

అమ్మవారు లేత గోధుమరంగు (హాఫ్‌ వైట్) చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం కొబ్బరి అన్నం. ఇది వాతాన్ని హరిస్తుంది. శ్రమను పోగొడుతుంది. గుండె నీరసాన్ని తగ్గిస్తుంది. కఫ , పైత్యములను తగ్గిస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది. శరీర కాంతిని పెంచుతుంది. కడుపులో తాపాన్ని పోగొడుతుంది. కిడ్ని వ్యాధుల్ని కూడా నివారిస్తుంది.


🌻. అన్నపూర్ణ వ్రత ఆచారాలు:

ఈ రోజున చేసే ఆచారాలన్నీ దశల వారీగా ప్రస్తావించబడ్డాయి.

హిందూ భక్తులు తమ ఇంటిలో పూజా వేడుకలు చేస్తారు. ఒక చిన్న మండపం తయారు చేసి , మరియు అన్నపూర్ణ దేవత యొక్క చిహ్నం పూజ స్థలంలో ఉంచబడుతుంది.

అన్నపూర్ణ జయంతి నాడు దేవతను 'షోడశోపాచార్' తో పూజిస్తారు. భక్తులు అన్నపూర్ణ దేవికి 'అన్నాభిషేకం' అర్పించినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ దేవిని సంతృప్తి పరచడానికి మరియు ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి స్త్రీలు అన్నపూర్ణ జయంతి జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. రోజు గడుస్తున్న కొద్దీ వారు ఏమీ తినరు , త్రాగరు. అన్నపూర్ణ దేవతను పూజించిన తరువాత , రాత్రి సమయంలో ఉపవాసం తీర్చుకుంటారు.

అన్నపూర్ణ దేవి అష్టకం పఠనం ఈ రోజున చాలా ఆశీర్వాదంగా భావించబడుతుందని నమ్ముతారు.

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🙏లకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021

శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత


🌹. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌿🌼🙏శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.🙏🌼🌿

🌿🌼🙏దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.🙏🌼🌿

🌿🌼🙏ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.🙏🌼🌿

🌿🌼🙏సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్షపూర్ణిమనాడు దత్తాత్రేయ జయంతి జరుపు కుంటున్నారు. దత్తాత్రేయుడు మార్గశీర శుక్ల చతుర్దశిని అవతరించినా దత్తజయంతిని మహారాష్ట్రులు మార్గశీర పూర్ణిమనాడే జరుపుతారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు.🙏🌼🌿

🌿🌼🙏మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!🙏🌼🌿

🙏🌼🌿ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం🙏🌼🌿ప్రతిరోజూ ఘోర కష్టోద్ధరణ స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం🙏🌼🌿శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహముతో ఎంతటి కష్టాలైనా భస్మమైపోతాయి🙏🌼🌿

🌿🌼🙏ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿

🌿🌼🙏1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|,
భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿


🌿🌼🙏2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿

🌿🌼🙏3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్|
త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿

🌿🌼🙏4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా|
కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టాదుద్ధారాస్మాన్


నమస్తే ||.🙏🌼🌿


🌿🌼🙏5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తిమ్ చ ముక్తిం |
భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿

🌿🌼🙏శ్లోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ ||🙏🌼🌿

🌿🌼🙏ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿

🌿🌼🙏ఇతి శ్రీ పరమహంస పరి వ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర కష్ట ఉద్దారక శ్లోకం సంపూర్ణం.🙏🌼🌿

🌿🌼🙏దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా🙏

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2021

దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ Dattatreya Jayanti wishes to all friends



🌹🍀. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🍀🌹

ప్రసాద్‌ భరధ్వాజ

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

దత్తాత్రేయ జయంతి పర్వదిన సందర్భముగా
దత్తప్రభు దివ్య ఆశీస్సులు సదా మనందరి మీదా ఉండాలని ఆకాంక్షిస్తూ....

🙏. ప్రసాద్‌ భరధ్వాజ

On the auspicious ocassion of Dattatreya Jayatni I wish Divine Blessings of Datta Prabhu are showered on all of us always....

🙏. Prasad Bharadwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


18 Dec 2021