గణపతి అధర్వశీర్షం - నమస్తే గణపతియే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కర్తాసి Ganapathi Adharvasirsha



https://youtube.com/shorts/3IH7UhUnplQ


🌹 గణపతి అధర్వశీర్షం - నమస్తే గణపతియే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కర్తాసి Ganapathi Adharvasirsha 🌹

Ganapathi Atharvasirsha - Salutations to Ganapati, You are indeed the visible reality, You are the creator.


అంగారక సంకష్ట హర చతుర్థి శుభాకాంక్షలు

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share

తప్పకుండా వీక్షించండి

🌹🌹🌹🌹🌹




22వ పాశురం - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 22nd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita



https://www.youtube.com/shorts/dEYea0QO8QM


🌹 22వ పాశురం - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 22nd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 22వ పాశురం - అహంకార త్యాగం – కటాక్ష యాచన గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 22వ పాశురంలో, తామరస నయనా కృష్ణా! మా అహాన్ని విడిచిపెట్టాము. దేహాభిమానాన్ని విడిచాము. నీ అనుగ్రహం కోరి వచ్చామంటున్నారు గోపికలు. 🍀

Like, Subscribe and Share

తప్పకుండా వీక్షించండి

🌹🌹🌹🌹🌹

అంగారక సంకష్ట హర చతుర్థి శుభాకాంక్షలు / Happy Angarika Sankashti Hara Chaturthi


🌹 అంగారక సంకష్ట హర చతుర్థి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Happy Angarika Sankashti Chaturthi to everyone 🌹
Prasad Bharadwaj


🌹 జనవరి 6, అంగారక సంకష్ట చతుర్థి ... గణేశ - శుబ్రహమణ్య సోదరులను పూజించండి.. కష్టాలు పరార్.. సంపద పెరుగుతుంది..! 🌹

🌹 January 6th, Angaraka Sankashti Chaturthi... Worship Lord Ganesha and Lord Subrahmanya... Troubles will vanish... Wealth will increase! 🌹



సర్వ విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు. ఆయనను ఆరాధిస్తే.. విఘ్నాలన్నీ తొలగిపోయి.. మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. సంకటహర చతుర్థి నాడు ... వినాయకుడిని పూజించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజు అత్యంత అరుదైన రోజని పండితులు చెబుతున్నారు. అంతేకాక ఈ రోజు ఆశ్లేష నక్షత్రం కూడా వచ్చింది. శుబ్రమణ్యేశ్వరునికి అత్యంత ఇష్టమైన రోజు.. అలాగే ఆ రోజు ( జనవరి 6) సంకష్ట హర చతుర్ధి వచ్చింది. పురాణాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే కష్టాలు తొలగి.. సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం సంకష్ట హర చతుర్థి రోజున సర్వ విఘ్నాలను తొలగించే వాడు అయిన వినాయకుడిని . ఆరాధిస్తే.. విఘ్నాలన్నీ తొలగిపోయి.. మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. అప్పుల సమస్య, ఇంటి నిర్మాణం చేసుకోవాలని ఎన్నాళ్ల నుంచో అనుకోవడం.. కుదరక పోవడం. కుజదోషం కారణంగా.. అనేక ఇబ్బందులు కలగడం, ఎంత కష్ట పడినా ఆదాయం మాత్రం పెరగకపోవడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు.. ఈ సంకటహర చతుర్థి రోజు.. వినాయకుడిని పూజించాలి. గరికను సమర్పించి.. బెల్లం నివేదించి .. ఈ రోజు ( 2026 జనవరి 6) సంకటహర గణేశ స్తోత్రం 11 సార్లు చదువుకోవాలి.

అంతేకాకుండా క్యాలండర్​ ప్రకారం జనవరి 6 వ తేది మంగళవారం.. ఆశ్లేష నక్షత్రం .. మంగళవారానికి శుబ్రమణ్యేశ్వరుడు అధిపతి.. ఆయన జన్మనక్షత్రం ఆశ్లేష .. ఆదిశేషుడు.. .. రెండు తలల నాగేంద్ర స్వామికి ఈ రోజు అభిషేకం చేస్తే కోరిన కోరికలు శీఘ్రగతిన నెరవేరుతాయని చెబుతారు.

సంకష్టహర చతుర్ధి.. మంగళవారం ఒకే రోజు వస్తే ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. జీవితంలో అడ్డంకులు, ఆటంకాలు, అప్పుల బాధ ఎదురవుతుంటే.. వినాయకుడికి బెల్లం, గరిక, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి సంకటహర గణేశ స్తోత్రం చదవడం, గణేశ పంచరత్నం చదవడం వంటివి చేయడం ద్వారా అన్నీ రకాల అడ్డంకులు తొలగిపోతాయట. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధ, అడ్డంకులు తొలగిపోతాయట. ఉన్నత స్థితికి వెళుతారట.

🌻 సంకట హర చతుర్థి సమయం ఎప్పుడు..? 🌻

జనవరి 6వ తేదీ పగలు తదియ తిథి ఉదయం 11.36 గంటల వరకు ఉంటుంది. అనంతరం చవితి తిథి ప్రారంభమవుతుంది. అంటే మంగళవారం ఉదయం 11.37 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 10.46 గంటల వరకు ఈ చవితి తిథి ఉంటుంది. చవితి తిథి.. చంద్రోదయం సమయం ఏరోజు ఉంటుందో ఆ రోజే సంకట హరచతుర్థి జరుపుకుంటారు. జనవరి 6వ తేదీ సంకట హరచతుర్థి వస్తుంది. మంగళవారం ఆశ్లేష నక్షత్రం కూడి వచ్చిన ఈ రోజును అంగారక సంకష్ట హర చతుర్థిగా పేర్కొంటారు. ఇక చంద్రోదయ సమయం వచ్చి.. మంగళవారం రోజు రాత్రి 9.50 నిమిషాలకు ఉంటుంది.

🌀 ఆలయంలో ప్రదక్షిణలు.. 🌀

ఈ సంకట హర చతుర్థి రోజు.. గణపతి ఆలయంలో 3, 11, 21 ప్రదక్షిణలు చేయాలి. గణపతికి గరిక సమర్పించాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించాలి. అది కూడా ఆవు నెయ్యితో.. ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. పాలు, పళ్లు తీసుకోవచ్చు. చంద్రోదయం తర్వాత చంద్రుడు లేదా నక్షత్ర దర్శనం చేసుకోవాలి. అనంతరం దూప దీప నైవేద్యాలను సమర్పించి.. సాత్విక ఆహారం తీసుకోవాలి.

🌏 కేతు గ్రహ ప్రభావం.. 🌏

జ్యోతిష్యం ప్రకారం.. కేతు గ్రహ ప్రభావం బలంగా ఉన్నప్పుడు. తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారు.. ఈ సంకట హర చతుర్థి వేళ.. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించాలి. గణపతి దేవుని పటం ముందు స్వామి వారికి నమస్కరించి.. దీపారాధన చేసి.. స్వామి వారికి పాయసం సమయర్పించాలి. ఇక జనవరి 6 వతేది మంగళవారం .. ఆశ్లేష నక్షత్రం కావడంతో శుబ్రమణ్యేశ్వరునికి పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి.. సాయంత్రం గణపతిని .. శుబ్రమణ్యేశ్వరుడిని పూజించి భోజనం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

🌹🌹🌹🌹🌹